breaking news
Vijay Hazare Trophy 2025-26
-
‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. చాంపియన్ విదర్భ
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన విదర్భ జట్టు తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్ ఆసాంతం రాణించిన విదర్భ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ విజేతగా నిలిచింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ సౌరాష్ట్రపై గెలుపొందింది. ‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. గతేడాది తుదిమెట్టుపై బోల్తా పడ్డ విదర్భ... ఈసారి పట్టు వదలకుండా ప్రయత్నించి విజయవంతమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ అథర్వ తైడే (118 బంతుల్లో 128; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... యశ్ రాథోడ్ (61 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. అమన్ మోఖడే (33), రవికుమార్ సమర్థ్ (25) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో 213/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించిన విదర్భ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్ష్ దూబే (17), మొహమ్మద్ ఫైజ్ (19) ఎక్కువసేపు నిలవలేకపోయారు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వర్ 4 వికెట్లు పడగొట్టగా... చేతన్ సకారియా, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. 279 పరుగులకు ఆలౌట్అనంతరం ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (92 బంతుల్లో 88; 10 ఫోర్లు), చిరాగ్ జానీ (63 బంతుల్లో 64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. కెపె్టన్ హార్విక్ దేశాయ్ (20), విశ్వరాజ్ జడేజా (9), పర్స్వరాజ్ రాణా (7) విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... నచికేత్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. విదర్భ ప్లేయర్లు అథర్వ తైడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అమన్ మోఖడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్ర మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ విదర్భ జట్టుకు విన్నర్స్ ట్రోఫీ అందించారు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్.. -
భారీ సెంచరీతో కదం తొక్కిన జడేజా
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర ఫైనల్స్‌కు చేరింది. నిన్న (జనవరి 16) జరిగిన రెండో సెమీఫైనల్లో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జనవరి 18న జరిగే ఫైనల్లో విదర్భతో అమీతుమీకి సిద్దమైంది.ఓపెనర్ విశ్వరాజ్ జడేజా అజేయ శతకంతో చెలరేగి సౌరాష్ట్రను ఒంటిచేత్తో గెలిపించాడు. 127 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. జడేజాకు గత మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 50 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (87) పవర్‌ప్లేలోనే విధ్వంసం (9 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించాడు. అనంతరం అన్మోల్ప్రీత్ సింగ్ (105 బంతుల్లో 100) అద్భుతమైన శతకం సాధించాడు. అయితే మధ్యలో నమన్ ధీర్, నేహల్ వాధేరా వరుసగా ఔట్ కావడంతో పంజాబ్ రన్‌రేట్ దెబ్బతింది. చివర్లో రమన్‌దీప్ సింగ్‌తో కలిసి అన్మోల్ప్రీత్ కొన్ని బౌండరీలు సాధించినా, చేతన్ సకారియా (4/60) ధాటికి దిగువ వరుస కూలిపోయింది. అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్లు జడేజా, హర్విక్ దేశాయ్ (64) శుభారంభాన్ని అందించారు. పవర్‌ప్లేలోనే వీరు 92 పరుగులు సాధించి పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 151/0కి చేరింది. అప్పటికే మ్యాచ్ దాదాపు సౌరాష్ట్ర వైపు మళ్లింది. దేశాయ్ ఔటైన తర్వాత కూడా జడేజా తన దూకుడు కొనసాగించాడు. కేవలం 74 బంతుల్లో శతకం పూర్తి చేసి, తర్వాత మరింత వేగంగా ఆడాడు. హార్విక్ ఔటయ్యాక వచ్చిన ప్రేరక్ మాంకడ్ (52*) కూడా జడేజాకు తోడుగా బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా సౌరాష్ట్ర 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు తీరాలు చేరింది. -
స్టార్లతో నిండిన కర్ణాటకకు షాక్.. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ
నిన్న (జనవరి 15) జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో స్టార్లతో నిండిన కర్ణాటకకు విదర్భ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. అమన్ మోఖడే (138) అద్భుతమైన సెంచరీతో ఆ జట్టును గెలిపించాడు. తద్వారా గత ఎడిషన్ ఫైనల్లో కర్ణాటక చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (జనవరి 16) జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో విదర్భ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.పడిక్కల్ విఫలం.. రాణించిన కరుణ్ నాయర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. విదర్భ పేసర్ దర్శన్ నల్కండే (10-0-48-5) దెబ్బకు 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (76), కృషణ్ శ్రీజిత్ (54) అర్ద సెంచరీలతో రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ ఎడిషన్‌లో దేవదత్ పడిక్కల్ (4) తొలిసారి విఫలమయ్యాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (9) కూడా డు ఆర్ డై మ్యాచ్‌లో హ్యాండిచ్చాడు. ధృవ్ ప్రభాకర్ (28), శ్రేయస్ గోపాల్ (36), అభినవ్ మనోహర్ (26), విజయ్ కుమార్ వైశాక్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. విదర్భ బౌలర్లలో నల్కండే 5, యశ్ ఠాకూర్ 2, నచికేత్, యశ్ కదమ్ తలో వికెట్ తీశారు.అమన్ అద్భుత శతకం281 పరుగుల ఛేదనలో విదర్భ ఆదిలోనే అథర్వ తైడే (6) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అమన్ మోఖడే (138) అద్బుత శతకంతో కదం తొక్కడంతో 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమన్‌కు జతగా రవికుమార్ సమర్థ్ (76 నాటౌట్) రాణించాడు. ధృవ్ షోరే (47) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్ షెట్టి (10-0-48-3) కాస్త ప్రభావం చూపినప్పటికీ, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. -
సెమీస్‌లో అడుగుపెట్టిన పంజాబ్, విదర్భ.. షెడ్యూల్ ఇదే
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది దశకు చేరుకుంది. మంగళవారంతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ముగిశాయి. బెంగళూరు వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ 183 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ జట్టు తమ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్ 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అన్మోల్ప్రీత్ సింగ్(70),నేహల్ వధేరా(56 ), హర్నూర్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఎంపీ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, త్రిపురేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో పాటిదార్(38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సంవీర్ సింగ్ మూడు, గుర్నూర్ బ్రార్, రమణ్‌దీప్ సింగ్,కృష్ భగత్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.ఢిల్లీ చిత్తు..మరోవైపు నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీని 76 పరుగుల తేడాతో విదర్భ చిత్తు చేసింది. దీంతో విదర్భ వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ చతికల పడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. నచికేత్ భూటే 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ఇక తొలి రెండు క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక, సౌరాష్ట్ర విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక, సౌరాష్ట్ర, విదర్భ, పంజాబ్ జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.సెమీఫైనల్ షెడ్యూల్తొలి సెమీఫైనల్- కర్ణాటక vs విదర్భ- జనవరి 15రెండో సెమీఫైనల్-సౌరాష్ట్ర vs పంజాబ్- జనవరి 16చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్ -
రింకూ విఫలం.. సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్న జట్లు ఇవే
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఖరారు చేసుకుంది. రింకూ విఫలంబెంగళూరు వేదికగా ముందుగా ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అభిషేక్ గోస్వామి (82 బంతుల్లో 88; 12 ఫోర్లు), సమీర్ రిజ్వీ (77 బంతుల్లో 88 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. కెప్టెన్ రింకూ సింగ్ (20 బంతుల్లో 13)మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.హార్విక్ దేశాయ్ సెంచరీతోసౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు... అంకుర్ పన్వర్, ప్రేరక్ మన్కడ్ 2 వికెట్లు తీశారు. 311 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ (116 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు.ప్రేరక్ మన్కడ్ (66 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. చిరాగ్ జానీ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. సౌరాష్ట్ర స్కోరు 238/3 వద్ద భారీ వర్షం రావడం, ఆ తర్వాత తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. ఆట నిలిచిపోయే సమయానికి సౌరాష్ట్ర విజయసమీకరణం కంటే 17 పరుగులు ముందంజలో ఉండటంతో ఆ జట్టుకు విజయం దక్కింది.పడిక్కల్ జోరు.. కర్ణాటక నాలుగోసారిడిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు వరుసగా నాలుగోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో ముంబై జట్టుతో సోమవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 54 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు సాధించింది. షమ్స్ ములానీ (91 బంతుల్లో 86; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (58 బంతుల్లో 38; 4 ఫోర్లు), సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ (3/42), అభిలాశ్ శెట్టి (2/59), విద్వత్ కావేరప్ప (2/43) రాణించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 33 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది.కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (12) తక్కువ స్కోరుకే అవుటవ్వగా... దేవ్‌దత్ పడిక్కల్ (95 బంతుల్లో 81 నాటౌట్; 11 ఫోర్లు), కరుణ్ నాయర్ (80 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) రెండో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. కర్ణాటక విజయం దిశగా సాగుతున్న దశలో భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 33 ఓవర్లకు కర్ణాటక విజయసమీకరణం 132 పరుగులు. కర్ణాటక 55 పరుగులు ముందుండటంతో ఆ జట్టును గెలుపు వరించింది.చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! -
చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్‌గా..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముంబైతో క్వార్టర్ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపాడు. సెంచరీ మిస్ చేసుకున్నా సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించాడు.బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక- ముంబై (Karnataka vs Mumbai) జట్లు సోమవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.షామ్స్ ములాని అర్ధ శతకంఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (27), ఇషాన్ ముల్చందాని (20) ఓ మోస్తరుగా ఆడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్ ఖాన్ (9) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సిద్దేశ్ లాడ్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ హార్దిక్ తామోర్ (1) నిరాశపరిచాడు.ఇలాంటి దశలో ఆల్‌రౌండర్ షామ్స్ ములాని అద్భుత అర్ధ శతకం (86)తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్) రాణించడంతో ముంబై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ మూడు వికెట్లు తీయగా.. విధ్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి చెరో రెండు.. విజయ్‌కుమార్ వైశాఖ్ ఒక వికెట్ పడగొట్టారు.రాణించిన పడిక్కల్.. కరుణ్ నాయర్ఇక లక్ష్య ఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12)ను మోహిత్ అవస్థి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 81 పరుగులతో రాణించగా.. కరుణ్ నాయర్ 74 పరుగులతో అతడితో కలిసి అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన కారణంగా VJD (వి.జయదేవన్) మెథడ్‌లో.. 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన కర్ణాటక.. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో సెమీస్‌కు దూసుకువెళ్లింది.చరిత్ర సృష్టించిన పడిక్కల్ఈ సీజన్లో పడిక్కల్ ఇప్పటికే 721 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ దేశీ వన్డే టోర్నీలో అత్యధికసార్లు 700 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2021-22 సీజన్లో దేవదత్ పడిక్కల్ ఏడు ఇన్నింగ్స్ ఆడి 737 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నారాయణ్ జగదీశన్ (2022-23లో 8 ఇన్నింగ్స్‌లో 830 పరుగులు) కొనసాగుతున్నాడు. ముంబై తరఫున 2021-22 సీజన్లో పృథ్వీ షా 827 పరుగులు చేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
అరివీర భయంకరమైన ఫామ్‌లో ధృవ్ జురెల్
విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2025-26లో ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ ధృవ్ జురెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 558 పరుగులు చేసి తన జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా, ఓవరాల్‌గా నాలుగో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇదే టోర్నీలో తన తొలి లిస్ట్-ఏ శతకాన్ని (బరోడాపై 160 నాటౌట్) నమోదు చేసిన జురెల్.. తాజాగా బెంగాల్‌పై మరో సెంచరీ సాధించాడు. 270 పరుగుల లక్ష్య ఛేదనలో 96 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ టోర్నీ ఆరంభం నుంచి అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న జురెల్.. తొలి మ్యాచ్‌లో 61 బంతుల్లో 80, రెండో మ్యాచ్‌లో 57 బంతుల్లో 67, మూడో మ్యాచ్‌లో 101 బంతుల్లో 160 నాటౌట్, నాలుగో మ్యాచ్‌లో 16 బంతుల్లో 17, ఐదో మ్యాచ్‌లో 62 బంతుల్లో 55, ఆరో మ్యాచ్‌లో 61 బంతుల్లో 56, తాజాగా ఏడో మ్యాచ్‌లో 96 బంతుల్లో 123 పరుగులు చేశాడు.మరో తలనొప్పిఈ పరుగుల ప్రవాహంతో జురెల్ టీమిండియా సెలెక్టర్లకు మరో తలనొప్పిగా మారాడు. ఇటీవలికాలంలో రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి చాలామంది ప్లేయర్లు ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ సెలెక్టర్లకు సవాళ్లు విసురుతున్నారు. వీరి సరసన జురెల్ కూడా చేరాడు. దీంతో ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలీక సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.ఇప్పటికే టీమిండియా బెర్త్‌ల కోసం (అన్ని ఫార్మాట్లలో) విపరీతమైన పోటీ ఉంది. కొన్ని ఫార్మాట్లలో సీనియర్లనే పక్కకు పెట్టాల్సి వస్తుంది. కొత్తగా వీరు తయారయ్యారు. దీంతో సెలెక్టర్లకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఉండేదేమో పరిమిత బెర్త్‌లు, పోటీ చూస్తే పదుల సంఖ్యలో ఉంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు రెండు జట్లు ఉంటే బాగుండనిపిస్తుంది.ఆ స్థానానికి విపరీతమైన పోటీటీమిండియాలో వికెట్‌కీపింగ్ బ్యాటర్ స్థానానికి ప్రత్యేకించి చాలా పోటీ ఉంది. అందుకే ఫార్మాట్‌కు ఒకరిని చొప్పున ఎంపిక చేస్తూ ఉన్నారు. వన్డేల్లో కేఎల్ రాహుల్, టెస్ట్‌ల్లో పంత్, టీ20ల్లో సంజూ శాంసన్ ప్రస్తుతం టీమిండియా వికెట్‌కీపింగ్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. వీరంతా తమతమ స్థానాలకు న్యాయం చేస్తూ ఉన్నారు.ఇదే తరుణంలో ధృవ్ జురెల్, జితేశ్ శర్మ లాంటి కొత్త వారు తాము కూడా అర్హులమంటూ సెలెక్టర్లకు సవాళ్లు విసురుతున్నారు. వికెట్‌కీపింగ్ నైపుణ్యమున్న సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ వీరికి అదనం. ఈ పరిస్థితుల్లో సెలెక్టర్ల వద్ద రొటేషన్ పద్దతి తప్ప వేరే ఆస్కారం లేకుండా పోయింది.మ్యాచ్ విషయానికొస్తే.. జురెల్ సెంచరీతో కదంతొక్కడంతో యూపీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదిప్ ఘరామి (94) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 269 పరుగులు చేసింది. అనంతరం యూపీ జురెల్ శతక్కొట్టడంతో 42.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. యూపీ గెలుపుకు రింకూ సింగ్ (37 నాటౌట్), అర్యన్ జుయల్ (56) కూడా సహకరించారు. -
చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
భారత ఫాస్ట్ బౌలింగ్ సంచలనం, జమ్మూ అండ్ కశ్మీర్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీ దార్ విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న (జనవరి 8) హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన దార్.. సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ అండ్ కశ్మీర్ 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.ఈ దశ బరిలోకి దిగిన దార్ సుడిగాలి శతకం బాది తన జట్టును గెలిపించాడు. 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఎండ్ నుంచి విన్ష్రాజ్ శర్మ (69 నాటౌట్) అద్భుతంగా సహకరించాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 182 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో దార్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. అమన్ రావ్ (60), రాహుల్ సింగ్ (56), నితేశ్ రెడ్డి (54 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో దార్ 3, ఆబిద్ ముస్తాక్ 2, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, వన్ష్‌రాజ్ శర్మ, సాహిల్ లోత్రా తలో వికెట్ తీశారు. అనంతరం 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ కశ్మీర్ ఓటమి దిశగా సాగినప్పటికీ.. దార్ సూపర్ సెంచరీ కారణంగా అనూహ్యంగా పుంజుకొని చిరస్మరణీయ విజయం సాధించింది. -
సీఎస్కే బౌలర్ సంచలన ప్రదర్శన
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు, సీఎస్కే బౌలర్ రామకృష్ణ ఘోష సంచలన ప్రదర్శనలతో చెలరేగిపోతున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజృంభించిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్.. తాజాగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఊహకందని గణాంకాలు నమోదు చేశాడు.ప్రత్యర్ది గెలుపుకు చివరి 3 ఓవర్లలో 11 అవసరమైన దశలో 48వ ఓవర్, 50వ ఓవర్‌ను మెయిడిన్ చేసి, తన జట్టును అపురూప విజయాన్ని అందించాడు. ఘోష్ నమోదు చేసిన ఈ గణాంకలు చూసి సీఎస్కే అభిమానులు ఔరా అంటున్నారు. తమ ఫ్రాంచైజీకి మరో మ్యాచ్ విన్నర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.ఘోష్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల ఘోష్ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.అయినా సీఎస్కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకానికి ఘోష్ న్యాయం చేస్తున్నాడు. ఘోష్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు.ఆదుకున్న రుతురాజ్మహారాష్ట్ర-గోవా మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతనికి విక్కీ ఓస్త్వాల్ (53), రాజవర్దన్ హంగార్గేకర్ (32 నాటౌట్) సహకరించారు. ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.ఛేదనలో విజయం దిశగా సాగిన గోవా.. రామకృష్ణ ఘోష్ ధాటికి చివర్లో చిత్తైపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఘోష్ సహా ప్రశాంత్ సోలంకి (10-1-56-4) సత్తా చాటి గోవాను ఇరుకున పెట్టాడు. -
సరికొత్త తలనొప్పిగా సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా సెలెక్టర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే టీ20 జట్టులో ఖాళీలు లేక కొట్టుకుంటుంటే, కొత్తగా మరో ఆటగాడు నా స్థానం ఏదీ అంటూ సవాల్ విసురుతున్నాడు. వరుస విధ్వంసాలతో సెలెక్టర్లను ఇరకాటంలో పడేస్తున్నాడు. ఇంకా ఏం కావాలంటూ ఒత్తిడి పెంచుతున్నాడు. నాకు అర్హమైన స్థానాన్ని ఇవ్వకపోతే ఇంకా చెలరేగిపోతానంటున్నాడు.ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..? ముంబైకి చెందిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్. ఈ ఆల్ ఫార్మాట్ స్టయిలిష్ బ్యాటర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ, టీ20 బెర్త్ కోసం భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ గాయపడిన నేపథ్యంలో సర్ఫరాజ్ తన ఆటలో మరింత వేగాన్ని పెంచి, ఆ స్థానం నాదే అంటూ బ్యాట్‌తో రాయభారం పంపుతున్నాడు.ఇటీవలి అతని ప్రదర్శనలే ఇందుకు నిరద్శనం. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గతేడాది చివరి రోజు గోవాతో జరిగిన మ్యాచ్‌లో అతడు మహోగ్రరూపం దాల్చాడు. 75 బంతుల్లో 157 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ఒక్క ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు అంటే సర్ఫరాజ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగి ఉంటుందో ఇట్టే అర్దమవుతుంది. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన విధ్వంసం డోసును మరింత పెంచాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి నన్ను ఎవడ్రా అపేది అంటూ చెలరేగిపోయాడు. పంజాబ్ కెప్టెన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ వేసిన ఓ ఓవర్లో వరుసగా 6,4,6,4,6,4 బాది తాండవం చేశాడు.దీనికి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ సర్ఫరాజ్ విధ్వంసాల పరంపర ఇలాగే కొనసాగింది. ఆ టోర్నీలో రాజస్థాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. దీనికి ముందు మ్యాచ్‌లో హర్యానాపై కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.ఇంత చేసినా సర్ఫరాజ్‌కు టీమిండియాలో ఏ ఫార్మాట్లోనూ అవకాశం దక్కడం లేదు. ఇందుకు కారణమేంటో సెలెక్టర్లే పరిశీలించుకోవాలి. ముందుగా సర్ఫరాజ్‌ను సెలెక్టర్లు టెస్ట్ ప్లేయర్లగా పరిగణించారు. 6 మ్యాచ్‌ల్లో సెంచరీ, 3 అర్ద సెంచరీలు చేసి రాణించినా పక్కకు పెట్టారు.టెస్ట్ బెర్త్ కోసం చాలాకాలం ఎదురుచూసిన సర్ఫరాజ్, ఇంక లాభం లేదంటూ మిగతా రెండు ఫార్మాట్లపై దృష్టి పెట్టాడు. దేశవాలీ వన్డే, టీ20 టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఇక్కడైనా అవకాశం ఇవ్వండంటూ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. టీమిండియా ఏ ఫార్మాట్‌కు సిద్దమవుతున్నా, దానికి ముందు అదే ఫార్మాట్లో సత్తా చాటుతూ సెలెక్టర్ల సవాల్ చేశాడు.న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు కూడా అదే పని చేశాడు. అయినా సెలక్టర్లను కనికరించలేదు. తాజాగా టీ20 జట్టు సభ్యుడు తిలక్ వర్మ గాయపడటంతో, ఈ అవకాశాన్నైనా తనకు ఇవ్వాలంటూ వరుస మెరుపు ఇన్నింగ్స్‌లో సెలెక్టర్లకు సందేశం పంపుతున్నాడు. మరి, సర్ఫరాజ్ సత్తాకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు తిలక్ ప్రత్యామ్నాయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోపు సర్ఫరాజ్ మరిన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడితే సెలెక్టర్లు కరుణించవచ్చు. తిలక్ స్థానానికి సర్ఫరాజ్‌కు పోటీగా మరికొంత మంది కూడా ఉన్నారు. రుతురాజ్, పడిక్కల్, శ్రేయస్ అయ్యర్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది. సెలెక్టర్లు ఏం చేస్తారో చూడాలి. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఎట్టుకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 208 పరుగుల లక్ష్య చేధనలో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.తొలుత ఆచితూచి ఆడిన వెంకటేష్.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు యశ్ దూబే(40), త్రిపురేష్(36) రాణించారు. ఫలితంగా లక్ష్యాన్ని ఎంపీ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 23.2 ఓవర్లలో చేధించింది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన కర్ణాటక 47.4 ఓవర్లలో కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్ పేసర్ శివాంగ్ కుమార్ 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక పతనాన్ని శాసించాడు. కర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్ మయాక్ అగర్వాల్(49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆర్సీబీకి గుడ్ న్యూస్..ఐపీఎల్-2026లో వెంకటేశ్ అయ్యర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ. 7 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత అతడు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుస మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు అయ్యర్ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్-2025లో సీజన్లో వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ తరపున దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని కేకేఆర్ వేలంలోకి విడిచిపెట్టింది.చదవండి: VHT 2025-26: చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు -
చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ముంబైకర్ తన సంచలన బ్యాటింగ్‌తో టీ20 మ్యాచ్‌ను తలపించాడు. ప్రత్యర్ది బౌలర్లను ఉతికారేశాడు.ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మకు సర్ఫరాజ్‌చుక్కలు చూపించాడు. అభిషేక్ వేసిన 16 ఓవర్లో సర్ఫరాజ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన భారత ప్లేయర్‌గా సర్ఫరాజ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబిజిత్ కాలే, అటిత్ షేత్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. తాజా మ్యాచ్‌లో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధ శతకం బాది ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్, కోహ్లి, రోహిత్ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ .. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో టాపర్డర్ రాణించినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.సర్ఫరాజ్ రీ ఎంట్రీ ఇస్తాడా?దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్. ఇంగ్లండ్‌పై తన అరంగేట్రంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. తర్వాత మ్యాచ్‌లలో నిలకడ లేకపోవడంతో అతడిని టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు సర్ఫరాజ్ తన అద్భుత ప్రదర్శనలతో కేవలం టెస్టులకే కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు తన సిద్దమేనని సవాల్ విసురుతున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ దుమ్ములేపాడు.చదవండి: ENG vs NZ: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన..! ఇంగ్లండ్ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్ -
నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో..
ముంబైకి ఊహించని షాకిచ్చింది పంజాబ్. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఖరికి అభిషేక్ శర్మ సేన పైచేయి సాధించడంతో.. శ్రేయస్ అయ్యర్ బృందానికి నిరాశ తప్పలేదు.పంజాబ్ టాపార్డర్ కుదేలుదేశీ వన్డే టోర్నీ తాజా ఎడిషన్ ఎలైట్ గ్రూపులో భాగంగా గురువారం ముంబై- పంజాబ్ జట్లు తలపడ్డాయి. జైపూర్ వేదికగా టాస్ ఓడిన పంజాబ్.. ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్ల దెబ్బకు పంజాబ్ టాపార్డర్ కుదేలైంది.ఆదుకున్న అన్మోల్, రమణ్దీప్టీమిండియా విధ్వంసకర ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ (8), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), హర్నూర్ సింగ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట దశలో అన్మోల్ప్రీత్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ (75 బంతుల్లో 57) ఆడగా.. నమన్ ధిర్ (22) ఫర్వాలేదనిపించాడు.216 పరుగులుఆరో స్థానంలో వచ్చిన రమణ్‌దీప్ సింగ్ అర్ధ శతకం (74 బంతుల్లో 72) సాధించగా.. బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్ (15), సుఖ్దీప్ బజ్వా (17) తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా 45.1 ఓవర్లలో పంజాబ్ 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే, శివం దూబే తలా రెండు వికెట్లు తీశారు. సాయిరాజ్ పాటిల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకంనామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువన్షి (23), ముషీర్ ఖాన్ (21) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం (20 బంతుల్లో 62) సాధించాడు.శ్రేయస్ అయ్యర్ ధనాధన్ ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధనాధన్ దంచికొట్టగా (34 బంతుల్లో 45).. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (15) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్ అవుటైన తర్వాత ముంంబై వేగంగా వికెట్లు కోల్పోయింది. శివం దూబే (12), హార్దిక్ తామోర్ (15) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (2), శశాంక్ (0), ఓంకార్ (0) కనీస పోరాటపటిమ కనబరచలేకపోయారు. షామ్స్ ములానీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.ఒకే ఒక్క పరుగు తేడాతోఅయితే, పంజాబ్ బౌలర్ల దెబ్బకు 26.2 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ముంబై చాపచుట్టేసింది. దీంతో పంజాబ్ ఒకే ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, పేసర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గుర్నూర్ బ్రార్ చెరో నాలుగు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. మిగతా వారిలో హర్‌ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా! -
అభిషేక్ శర్మ ఓవర్లో సర్ఫరాజ్ విశ్వరూపం.. 15 బంతుల్లోనే..
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పంజాబ్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మకు చుక్కలు చూపించాడు.15 బంతుల్లోనేఅభిషేక్ శర్మ (Abhishek Sharma) వేసిన ఓవర్లో సర్ఫరాజ్ వరుసగా 6,4,6,4,6,4 బాదాడు. వన్‌డౌన్‌లో వచ్చి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒకే ఓవర్లో ఏకంగా ముప్పై పరుగులు పిండుకున్నాడు. వన్డే మ్యాచ్‌లో టీ20 తరహాలో విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం.. 15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.మార్కండే బౌలింగ్లోపంజాబ్తో మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan).. 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే, మయాంక్ మార్కండే బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగడంతో సర్ఫరాజ్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.అభిషేక్ ఫెయిల్దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూపులో భాగంగా.. జైపూర్ వేదికగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ అభిషేక్ శర్మ (8) సహా మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11).. వన్‌డౌన్ బ్యాటర్ హర్నూర్ సింగ్ డకౌట్ కావడంతో ఆదిలోనే పంజాబ్‌కు షాక్ తగిలింది.అన్మోల్, రమణ్ అర్ధ శతకాలుఈ క్రమంలో అన్మోల్ప్రీత్ సింగ్ అర్ధ శతకం (57)తో రాణించగా.. నమన్ ధిర్ (22) అతడికి సహకరించాడు. ఇక రమణ్‌దీప్ సింగ్ సైతం హాఫ్ సెంచరీ (72)తో ఆకట్టుకున్నాడు. అయితే, మిగతా వారంతా తేలిపోవడంతో 45.1 ఓవర్లలో కేవలం 216 పరుగులు చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.ముంబై బౌలర్లలో సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. శివం దూబే, శశాంక్ అట్రాడే, ఓంకార్ తుకారాం టర్మాలే తలా రెండు వికెట్లు కూల్చారు. సాయిరాజ్ పాటిల్‌కు ఒక వికెట్ దక్కింది. నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ధనాధన్ బ్యాటింగ్‌తో విజయం దిశగా పయనించిన ముంబై.. అనూహ్య రీతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా! -
మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి శతక్కొట్టాడు. గోవాతో మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రుతు.. మొత్తంగా 131 బంతులు ఎదుర్కొని 134 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.రుతురాజ్ (Ruturaj Gaikwad) శతక ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 279 పరుగులు సాధించాడు. తాజాగా గోవాతో గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మహారాష్ట్ర కెప్టెన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.గోవా బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలుజైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. గోవా పేసర్ వాసుకి కౌశిక్ అర్షిన్ కులకర్ణిని డకౌట్ చేయగా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (1)ను అర్జున్ టెండుల్కర్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన కౌశిక్.. వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ బావ్నే(0), సిద్ధార్థ్ మాత్రే (27 బంతుల్లో 3)లను కూడా వెనక్కి పంపాడు.🚨 Ruturaj Gaikwad Show in Vijay Hazare TrophyRuns - 134Balls - 1314/6 - 8/6Maharastra was 5 down on Just 25 runs and then he scored valuable century.He deserved the part of Indian ODI squad but he got dropped due to politics of Gautam Gambhir 💔pic.twitter.com/Ts0ubxdo1b— Tejash (@Tejashyyyyy) January 8, 2026ఆదుకున్న రుతురాజ్ఈ క్రమంలో సింగిల్ డిజిట్ స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన మహారాష్ట్రను రుతురాజ్ అజేయ శతకం (134)తో ఆదుకున్నాడు. అతడికి తోడుగా లోయర్ ఆర్డర్లో విక్కీ ఓస్త్వాల్ హాఫ్ సెంచరీ (53)తో మెరవగా.. రాజ్వర్ధన్ హంగర్గేకర్ (19 బంతుల్లో 32 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగలిగింది.శతకాలు బాదుతున్నా.. సెలక్టర్లు పట్టించుకోరుగా!ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్ శతకం సాధించాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌పై, తాజాగా గోవాపై శతక్కొట్టాడు. అయితే, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డేలు ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.గత సిరీస్‌లో సెంచరీతో అలరించినా సెలక్టర్లు రుతురాజ్‌కు మొండిచేయి చూపారు. గాయం నుంచి కోలుకుని మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో అతడిపై వేటు పడింది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు వన్డేల్లో మెరుగైన రికార్డు లేకపోయినా మరోసారి అతడికి జట్టులో చోటు దక్కింది.వికెట్ కీపర్‌గానూ సత్తా చాటితేనేఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్‌గానూ రుతురాజ్ సత్తా చాటితేనే తిరిగి అతడు టీమిండియాలో అడుగుపెట్టగలడని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. రుతుకు టీమిండియా తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోందని మరో మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ అన్నాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 వన్డేలు ఆడిన రుతు.. 28.5 సగటుతో 228 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, రుతు బ్యాటింగ్ సగటు తక్కువగా ఉండటం వల్ల బ్యాకప్ ఓపెనర్‌గా అయినా అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోయిందని చెప్పవచ్చు.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
హార్దిక్ పాండ్యా మహోగ్రరూపం
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్‌లోనే (విదర్భపై 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు) విధ్వంసకర శతకం బాదిన అతను.. ఇవాళ (జనవరి 8) తన రెండో మ్యాచ్‌లో ఛత్తీస్ఘడ్పై మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు.మొత్తంగా ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో 125 బంతులు ఎదుర్కొన్న హార్దిక్.. 21 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 208 పరుగులు చేసి మహోగ్రరూపంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సిరీస్‌లో హార్దిక్ ఇదే జోరును కొనసాగిస్తే పర్యాటక జట్టుకు తిప్పలు తప్పవు. జనవరి 21 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్ కీలక సభ్యుడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగుతుంది. హార్దిక్ ఇదే ఫామ్‌లో ఉంటే ప్రపంచకప్‌లో టీమిండియాకు తిరుగుండదు. గత వరల్డ్‌కప్‌లోనూ హార్దిక్ టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న బరోడా 36.5 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు నితిన్ పాండ్యా (2), అమిత్ పాసి (5) నిరాశపర్చినా.. ప్రయాన్షు మోలియా (79 నాటౌట్), విష్ణు సోలంకి (54), హార్దిక్ పాండ్యా (75), జితేశ్ శర్మ (64 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మోలియా, జితేశ్ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్ అన్న కృనాల్ పాండ్యా (20) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. -
IND vs NZ: టీమిండియాకు శుభవార్త
న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనానికి మార్గం సుగమమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి శ్రేయస్ అయ్యర్‌కు క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించింది.అంతా సజావుగా సాగితే.. శ్రేయస్ (Shreyas Iyer) న్యూజిలాండ్‌తో మూడు వన్డేలకు అందుబాటులో ఉంటాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 25న సిడ్నీలో ఆసీస్ (Ind vs Aus)తో మూడో వన్డే సందర్భంగా క్యాచ్ పట్టబోయి అదుపు తప్పి కిందపడిపోయిన శ్రేయస్ పక్కటెములకు తీవ్ర గాయమైంది.అంతర్గత రక్తస్రావందీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో చాన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉన్న శ్రేయస్.. క్రమంగా కోలుకున్నాడు. అయితే, ఆటకు మాత్రం దాదాపు రెండు నెలలు దూరంగా ఉన్నాడు.రీఎంట్రీ ధనాధన్‌ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడు అందుబాటులో ఉండే విషయం తేలుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌తో ముంబై కెప్టెన్‌గా శ్రేయస్.. కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.వచ్చీరాగానే ధనాధన్ దంచికొట్టి 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. అంతేకాదు కెప్టెన్‌గానూ రాణించి.. ముంబై క్వార్టర్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సీఓఈ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది స్వదేశంలో కివీస్‌తో వన్డే (జనవరి 11, 14, 18)లకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు -
విష్ణు వినోద్ విధ్వంసకర సెంచరీ.. 14 సిక్స్‌లతో వీర విహారం! వీడియో
విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో వినోద్ విధ్వంసం సృష్టించాడు. 248 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దు చెలరేగాడు. ఈ క్రమంలో అతడు కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.32 ఏళ్ల విష్ణు వినోద్ సెంచరీ సాధించాక మరింత చెలరేగిపోయాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్‌గా 84 బంతులు ఎదుర్కొన్న వినోద్.. 13 ఫోర్లు, 14 సిక్స్‌లతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు బాబా అపరాజిత్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా లక్ష్యాన్ని కేరళ రెండు వికెట్లు కోల్పోయి కేవలం 29 ఓవర్లలోనే చేధించింది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 47.4 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. అజయ్ రోహరా(53), జశ్వంత్(57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగితా ప్లేయర్లంతా విఫలమయ్యారు. కేరళ బౌలర్లలో నిదేష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఈడెన్ యాపిల్ టామ్, అనికేత్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు.గైక్వాడ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వినోద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన రెండో ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో వినోద్ ఇప్పటివరకు 106 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు రుతురాజ్ గైక్వాడ్(105) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గైక్వాడ్‌ను వినోద్ అధిగమించాడు. ఈ జాబితాలో కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే(108) అగ్రస్ధానంలో ఉన్నాడు. విష్ణు వినోద్ ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్లు వీరే..1 - మనీష్ పాండే: 99 ఇన్నింగ్స్‌లలో 108 సిక్సులు2 - విష్ణు వినోద్: 53 ఇన్నింగ్స్‌లలో 106 సిక్సులు3 - రుతురాజ్ గైక్వాడ్: 55 ఇన్నింగ్స్‌లలో 105 సిక్సులు4 - యూసుఫ్ పఠాన్: 56 ఇన్నింగ్స్‌లలో 91 సిక్సులు5 - ఇషాన్ కిషన్: 50 ఇన్నింగ్స్‌లలో 85 సిక్సులుచదవండి: బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!💯 up in style as well 👌Vishnu Vinod brings up his century in just 63 balls 👏A brilliant attacking knock from the Kerala batter 🔥Scorecard ▶️ https://t.co/szHbOWqpZK#VijayHazareTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/r18j0PEvMC— BCCI Domestic (@BCCIdomestic) January 6, 2026 -
నిప్పులు చెరిగిన సిరాజ్.. భయపడిన బ్యాటర్లు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయ భేరి మ్రోగించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.యువ ఓపెనర్ అమన్ రావు అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు గహ్లాట్ రాహుల్ సింగ్(65), కెప్టెన్ తిలక్ వర్మ (34) రాణించారు. బెంగాల్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు.నిప్పులు చెరిగిన సిరాజ్..అనంతరం 353 పరుగుల భారీ లక్ష్య చేధనలో బెంగాల్ జట్టు 44.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్ ఒంటరి పోరాటం చేశాడు. షాబాజ్113 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ ఆడుతున్న హైదరాబాదీ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు.సిరాజ్ మియా తన 10 ఓవర్ల కోటాలో 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు నితేష్ రెడ్డి రెండు, సీవీ మిలంద్, రక్షణ్, నితిన్ తలా వికెట్ సాధించారు. కాగా హైదరాబాద్ ప్రస్తుతం గ్రూపు-బి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉంది. హైదరాబాద్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారీ విజయాన్ని అందుకోవాలి. అంతేకాకుండా మిగితా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.చదవండి: ఐపీఎల్ నుంచి ఔట్.. ముస్తాఫిజుర్‌కు పరిహారం అందుతుందా? -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి..
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పునరాగమనంలో శుభారంభం అందుకున్నాడు. గాయం నుంచి కోలుకుని ముంబై కెప్టెన్‌గా తిరిగి మైదానంలో అడుగుపెట్టిన అయ్యర్.. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటాడు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే అయ్యర్ అర్ధ శతకం బాదాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 53 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 82 పరుగులు చేశాడు. జైస్వాల్, సూర్య ఫెయిల్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ (15) విఫలం కాగా.. ముషీర్ ఖాన్ (73) మాత్రం అదరగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (21).. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24) నిరాశపరిచారు.శివం దూబే (20), హార్దిక్ తామోర్ (19 నాటౌట్), సాయిరాజ్ పాటిల్ (9 బంతుల్లో 25), షామ్స్ ములాని (5 బంతుల్లో 11) ఓ మోస్తరుగా ఆడగా.. తుషార్ దేశ్‌పాండే డకౌట్ కాగా.. శశాంక్ అటార్డే (1) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 33 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 299 పరుగులు సాధించింది.అయితే, లక్ష్య ఛేదనకు దిగిన హిమాచల్ ప్రదేశ్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కుశాల్ పాల్, ఇన్నేశ్ మహాజన్ డకౌట్ అయ్యారు. ఇలాంటి తరుణంలో పఖ్రాజ్ మాన్ (41 బంతుల్లో 64), అంకుశ్ బ్రెయిన్స్ (39 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకాలతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ధనాధన్ దంచికొట్టినా..కెప్టెన్ మృదుల్ సరోచ్ (13) నిరాశపరిచినా.. మయాంక్ డాగర్ (47 బంతుల్లో 64), అమన్‌ప్రీత్ సింగ్ (21 బంతుల్లో 42) ధనాధన్ దంచికొట్టి గెలుపు ఆశలు రేపారు. ఆఖర్లో అమిత్ కుమార్ యాదవ్ (28) రాణించగా.. చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. శివం దూబే రెండు వికెట్లు తీయడంతో హిమాచల్ ప్రదేశ్ ఆలౌట్ అయింది. 32.4 ఓవర్లలో 292 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా ముంబై ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి..ముంబై బౌలర్లలో టీమిండియా స్టార్ శివం దూబే నాలుగు వికెట్లతో చెలరేగగా.. సాయిరాజ్ పాటిల్ రెండు, షామ్స్ ములాని, ముషీర్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే తలా ఒక వికెట్ పడగొట్టారు. ముంబై గెలుపు కారణంగా.. రీఎంట్రీలో శ్రేయస్ అయ్యర్‌కు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అదిరిపోయే ఆరంభం లభించింది. చదవండి: ‘రీఎంట్రీ’లో శుబ్‌మన్ గిల్ అట్టర్‌ఫ్లాప్ -
విజయ్ హజారే ట్రోఫీ 'విజేత' బీహార్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూప్ విజేతగా బీహార్ నిలిచింది. మంగళవారం రాంచీ వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో మణిపూర్‌ను చిత్తు చేసిన బీహార్.. ఈ దేశవాళీ వన్డే టోర్నీ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 47.5 ఓవర్లలో కేవలం 169 పరుగులకే కుప్పకూలింది.బీహార్ స్పిన్నర్ షబీర్ ఖాన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి మణిపూర్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు హిమాన్షు తివారీ 3 వికెట్లు సాధించాడు. మణిపూర్ బ్యాటర్లలో ఉలెనయ్ ఖ్వేరాక్పమ్(61), ఫిరాయిజామ్ జోటిన్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని బీహార్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 31.2 ఓవర్లలో చేధించింది.బీహార్ బ్యాటర్లలో ఆయుష్ లోహరుక 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మంగల్ మహరౌర్(32), ఆకాష్ రాజ్(20) రాణించారు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ షబీర్ ఖాన్‌కు దక్కగా.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా ఫిరాయిజామ్ జోటిన్ నిలిచాడు. కాగా ఈ సీజన్లో బీహార్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా ఈ టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్‌పై బీహార్ 574 పరుగుల భారీ స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అదేవిధంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ తరపున కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే జాతీయ విధుల కారణంగా టోర్నీ మధ్యలోనే వైభవ్ వైదొలిగాడు.చదవండి: ‘రీఎంట్రీ’లో శుబ్‌మన్ గిల్ అట్టర్‌ఫ్లాప్ -
‘రీఎంట్రీ’లో శుబ్‌మన్ గిల్ అట్టర్‌ఫ్లాప్
గతేడాది అక్టోబరులో ఆస్ట్రేలియాతో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు శుబ్‌మన్ గిల్. టీమిండియా వన్డే సారథి హోదాలో తొలిసారి ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కుడిచేతి వాటం.. కెప్టెన్సీ అరంగేట్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పెర్త్‌లో 10, అడిలైడ్‌లో 9 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచిన గిల్.. సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో 24 పరుగులు చేయగలిగాడు.అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన వన్డేలకు మాత్రం గిల్ దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా సఫారీలతో మూడు వన్డేలకు అందుబాటులో లేకుండా పోయాడు. అనంతరం ప్రొటిస్ జట్టుతో మూడు టీ20లు ఆడినా.. స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026లో ఆడే భారత జట్టులో స్థానం కోల్పోయాడు.‘రీఎంట్రీ’లో అట్టర్ఫ్లాప్ఈ క్రమంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సందర్భంగా మంగళవారం నాటి మ్యాచ్‌తో ‘వన్డే’లలో రీఎంట్రీ ఇచ్చాడు గిల్. గోవాతో మ్యాచ్‌లో సొంత జట్టు పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ గిల్ విఫలమయ్యాడు.11 పరుగులే చేసిమొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ టీమిండియా కెప్టెన్.. రెండు ఫోర్లు బాది కేవలం 11 పరుగులే చేసి నిష్క్రమించాడు. గోవా పేసర్ వాసుకి కౌశిక్ బౌలింగ్‌లో ప్రభుదేశాయికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్, పంజాబ్ సారథి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) కూడా విఫలమయ్యాడు. కౌశిక్ బౌలింగ్‌లో అతడు బౌల్డ్ అయ్యాడు.టార్గెట్ 212ఇలాంటి పరిస్థితిలో వన్‌డౌన్ బ్యాటర్ హర్నూర్ సింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా నమన్ ధిర్ కూడా మెరుగ్గా ఆడుతుండటంతో పంజాబ్ లక్ష్య ఛేదనగా పయనిస్తోంది. రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన గోవా తొలుత బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి తాళలేక 33.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.గోవా బ్యాటర్లలో సూయశ్ ప్రభుదేశాయి (66), లలిత్ యాదవ్ (54) అర్ధ శతకాలతో రాణించారు.పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, సుఖ్దీప్ బజ్వా, క్రిష్ భగత్ తలా రెండు వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే మూడు వికెట్లతో చెలరేగాడు. నమన్ ధిర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Update: నమన్ ధిర్ 68 పరుగులతో రాణించగా.. హర్నూర్ సింగ్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా రమణ్‌దీప్ సింగ్ (8 బంతుల్లో 15 నాటౌట్) నిలవగా.. 35 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయిన పంజాబ్.. 212 పరుగులు చేసింది. తద్వారా గోవాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు.. కరీంనగర్ కుర్రాడి డబుల్ సెంచరీ -
రీఎంట్రీలో రఫ్ఫాడించిన శ్రేయస్ అయ్యర్
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ముంబై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పోటీ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే రఫ్ఫాడించాడు. తీవ్ర గాయం కారణంగా రెండు నెలలు ఆటకు పూర్తిగా దూరమైన శ్రేయస్.. ఇవాళ (జనవరి 6) హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. వచ్చీ రాగానే మెరుపు అర్ద శతకంతో అదరగొట్టాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.శ్రేయస్‌తో పాటు ముషీర్ ఖాన్ (73) కూడా రాణించడంతో హిమాచల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై 29 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఈ మ్యాచ్‌ను 33 ఓవర్లకే కుదించారు. ముంబై ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 15, సర్ఫరాజ్ ఖాన్ 21, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేయగా.. శివమ్ దూబే 20, హార్దిక్ తామోర్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.కాగా, గతేడాది అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని కూడా అన్నారు. అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు.అనంరతం నెల రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉండి, తాజాగా పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాడు. శ్రేయస్ త్వరలో ప్రారంభం కాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు సన్నాహకంగా శ్రేయస్ విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు.ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ తర్వాత జనవరి 8న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో శ్రేయసే ముంబై జట్టును ముందుండి నడిపిస్తాడు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)శ్రేయస్‌కు అప్పగించింది. -
VHT: ‘వన్డే’లో ‘కరీంనగర్’ కుర్రాడి డబుల్ సెంచరీ
బెంగాల్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావు పేరాల ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నమెంట్లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. మొహమ్మద్ షమీ (Mohammed Shami) వంటి టీమిండియా సీనియర్ బౌలర్‌తో కూడిన పటిష్ట బెంగాల్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ.. అజేయ ద్విశతకంతో దుమ్ములేపాడు.చరిత్ర సృష్టించిన అమన్ రావుతద్వారా హైదరాబాద్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా.. ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్‌గా అమన్ రావు చరిత్ర సృష్టించాడు. దేశీ వన్డే టోర్నీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా గ్రూప్-బి నుంచి బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతోఓపెనర్లు అమన్ రావు పేరాల, గహ్లోత్ రాహుల్ సింగ్ ఆది నుంచే బెంగాల్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 154 బంతులు ఎదుర్కొన్న అమన్ రావు 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 200 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరోవైపు.. రాహుల్ సింగ్ సైతం అర్థ శతకం (54 బంతుల్లో 65)తో మెరిశాడు.తిలక్ వర్మ విఫలమైనాఅయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (45 బంతుల్లో 34) మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మిగతా వారిలో అభిరథ్ రెడ్డి (5), ప్రణవ్ వర్మ (7) విఫలం కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (22) ఓ మోస్తరుగా రాణించాడు.ఓవైపు వికెట్లు పడుతున్నా అమన్ రావు మాత్రం నిలకడగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోరు అందించడంలో సఫలమయ్యాడు. అతడికి తోడుగా చామా మిలింద్ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు సాధించింది.షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడుబెంగాల్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. షాబాజ్ అహ్మద్, రోహిత్ దాస్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా షమీ బౌలింగ్‌లో అమన్ రావు ఫోర్లు, వరుస సిక్సర్లతో చెలరేగడం విశేషం. అంతేకాదు ఆఖరి బంతికి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో సిక్స్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం మరో విశేషం.కరీంనగర్ కుర్రాడుకాగా 21 ఏళ్ల అమన్ రావు స్వస్థంల కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో గల వెన్నంపల్లి గ్రామం. ఇటీవల ఐపీఎల్ మినీ వేలం-2026లో రాజస్తాన్ రాయల్స్ రూ. 30 లక్షల కనీస ధరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను కొనుగోలు చేసింది.చదవండి: మూడోసారి తండ్రి అయిన అంబటి రాయుడు -
మరో సెంచరీ తృటిలో మిస్.. అయినా, చరిత్ర సృష్టించిన పడిక్కల్
లిస్ట్-ఏ క్రికెట్లో కర్ణాటక ఆటగాడు, టీమిండియా తాజా సంచలనం దేవ్‌దత్ పడిక్కల్ తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికే 5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు చేసిన పడిక్కల్.. తాజాగా మరో సెంచరీని తృటిలో మిస్ అయ్యాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 6) జరుగుతున్న మ్యాచ్‌లో 82 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి 9 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీని కోల్పోయాడు.తాజా ప్రదర్శనతో పడిక్కల్ మరోసారి భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఇప్పటికే ఏం చేయాలో తెలియక జట్టు పీక్కుంటున్న సెలెక్టర్లను పడిక్కల్ మరింత ఇరకాటంలో పడేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఇదివరకే ప్రకటించడంతో పడిక్కల్ టీమిండియా తలుపులు తట్టేందుకు ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. 38 ఇన్నింగ్స్‌ల స్వల్ప లిస్ట్-ఏ కెరీర్లో పడిక్కల్ 13 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేసి తిరుగులేని రికార్డు కలిగి ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్ సెంచరీ మిస్ అయినా మరో ఓపెనర్ కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (100) సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక భారీ స్కోర్ (324/7) చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కర్ణాటక తరఫున బరిలోకి దిగాడు. 28 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ 14 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుక్కా అజయ్ సింగ్, మానవ్ సుతార్ చెరో 2, ఖలీల్ అహ్మద్, అమన్ సింగ్, అశోక్ శర్మ తలో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన పడిక్కల్తాజా ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఎడిషన్‌లో పడిక్కల్ పరుగుల సంఖ్య 600 మార్కును దాటింది. పడిక్కల్ గతంలోనూ రెండు ఎడిషన్లలో 600 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. తద్వారా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో మూడు వేర్వేరు ఎడిషన్లలో 600 పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.పడిక్కల్ తొలిసారి 2019-2020 ఎడిషన్‌లో 600 పరుగుల మార్కును (11 ఇన్నింగ్స్‌ల్లో 609 పరుగులు) తాకాడు. ఆతర్వాతి ఎడిషన్‌లో (2020-21) మరోసారి 600 మార్కును దాటాడు. ఈసారి 8 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 737 పరుగులు సాధించాడు. ఆ ఎడిషన్‌లో అతను వరుసగా నాలుగు సెంచరీలు చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రస్తుత ఎడిషన్‌లో (2025-26) పడిక్కల్ మూడోసారి 600 పరుగుల మార్కును దాటాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను.. నాలుగు సెంచరీలు, ఓ భారీ హాఫ్ సెంచరీ సాయంతో 605 పరుగులు చేశాడు. -
మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, అతడి సోదురుడు మహ్మద్ కైఫ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఓటరు జాబితాల సవరణలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ జరుగుతోంది.అయితే షమీ, కైఫ్ సమర్పించిన ఎన్యుమరేషన్ ఫారమ్‌లలో కొన్ని వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడికి నోటీసులు ఇచ్చారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన షమీ, తన క్రికెట్ కెరీర్ కారణంగా చాలాకాలంగా కోల్‌కతాలోనే నివసిస్తున్నాడు.షమీతో పాటు అతడు సోదరుడు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) లోని వార్డు నంబర్ 93 (రాష్‌బెహారీ అసెంబ్లీ నియోజకవర్గం) లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. వాస్తవానికి వారిద్దరూ సోమవారం(జనవరి 5) అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాల్సి ఉంది. కానీ షమీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నందున విచారణకు హజరుకాలేకపోయాడు. "దేశవాళీ క్రికెట్ టోర్నీలో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, నిర్దేశించిన సమయానికి హాజరు కాలేకపోతున్నాను" అని షమీ ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీంతో షమీ అభ్యర్థన ఎన్నికల కమిషన్ విచారణను వాయిదా వేసింది. బెంగాల్ జట్టు లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, జనవరి 9 నుంచి 11 మధ్య హాజరుకావాలని సూచించింది.చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే -
విరాట్ కోహ్లి అనూహ్య నిర్ణయం!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు ఈ రన్‌మెషీన్ మరోసారి బరిలోకి దిగుతాడనుకుంటే.. ఊహించని రీతిలో తన నిర్ణయం మార్చుకున్నాడు. ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో మూడో మ్యాచ్ ఆడేందుకు కోహ్లి నిరాకరించినట్లు తెలుస్తోంది.బీసీసీఐ ఆదేశాల మేరకుఅంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఢిల్లీ లెజెండ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే బరిలో దిగాడు.రెండు మ్యాచ్‌లు కంప్లీట్కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఆడాలన్న నిబంధనల మేరకు.. తాజా ఎడిషన్‌లో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో వరుస శతకాలతో జోరు మీదున్న కోహ్లి.. దేశీ క్రికెట్లోనూ ఫామ్‌ను కొనసాగించాడు. ఆంధ్రపై 131, గుజరాత్‌పై 77 పరుగులు సాధించాడు.మూడోదీ ఆడతానని చెప్పి..ఇక న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. విజయ్ హజారే టోర్నీలో మూడో మ్యాచ్‌కు కూడా కోహ్లి అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇటీవలే ధ్రువీకరించాడు.అందుబాటులో లేడుఅయితే, తాజాగా ఢిల్లీ కోచ్ సరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘లేదు. కోహ్లి అందుబాటులో ఉండటం లేదు’’ అని స్పష్టం చేశాడు. కాగా ఢిల్లీ తదుపరి మంగళవారం (జనవరి 6) నాటి మ్యాచ్‌లో రైల్వేస్ జట్టుతో ఆడనుంది. కర్ణాటకలోని ఆలూర్‌లో గల కేఎస్‌సీఏ క్రికెట్ గ్రౌండ్-2 ఇందుకు వేదిక. రిషభ్ పంత్ సారథ్యంలోని ఈ జట్టులో కోహ్లి లేడు.చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు మూడు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. శ్రేయస్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అయ్యర్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని ఎంసీఎ సెక్రటరీ డాక్టర్ ఉన్మేష్ ఖాన్విల్కార్ ధ్రువీకరించారు. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో, జనవరి 8న పంజాబ్‌తో జరిగే కీలక మ్యాచ్‌ల్లో ముంబై జట్టును అయ్యర్ నడిపించనున్నాడు.కాగా ఈ టోర్నీలో ఆడి అయ్యర్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లో శ్రేయస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగితే అతడికి పూర్తిస్థాయి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లభిస్తుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో అయ్యర్ కూడా భాగంగా ఉన్నాడు.కానీ ఈ సిరీస్‌కు ముందు శ్రేయస్ ఫిట్నెస్ టెస్టుల్లో ఉత్తర్ణీత సాధించాల్సి ఉంటుంది అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం డిసెంబర్ 25న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో చేరిన శ్రేయస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE)లో హై-ఇంటెన్సిటీ టెస్టులను విజయవంతంగా అతడు పూర్తి చేసుకున్నాడు. అయ్యర్ దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లే. చదవండి: IPL 2026: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన -
చరిత్ర సృష్టించిన రుతురాజ్
టీమిండియా అప్ కమింగ్ స్టార్, మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓ అద్భుతమైన రికార్డు సాధించాడు. దేశవాలీ వన్టే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. రుతు కేవలం 55 ఇన్నింగ్స్‌ల్లోనే సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు కర్ణాటక ఆటగాడు మనీశ్ పాండే పేరిట ఉండేది. మనీశ్‌కు ఈ మైలురాయిని తాకేందుకు 99 ఇన్నింగ్స్‌లు పట్టింది.వీహెచ్‌టీ చరిత్రలో మనీశ్ తర్వాత 100 సిక్సర్ల మార్కును తాకిన రెండో ఆటగాడు కూడా రుతురాజే. రుతురాజ్ సాధించిన ఈ సిక్సర్ల రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత వీహెచ్‌టీ ఎడిషన్‌లో రుతు 100 సిక్సర్ల రికార్డును సాధించాడు. ఈ ఎడిషన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రుతు.. ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు.ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న రుతు.. తాజాగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున అద్భుత శతకం బాదాడు. అయినా అతనికి త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌లో అవకాశం రాలేదు. చాలాకాలం క్రితమే రుతు భారత టీ20 ఫార్మాట్ నుంచి ఔటయ్యాడు.ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో విపరీతమైన పోటీ ఉన్న కారణంగా రుతు అద్భుతంగా రాణిస్తున్నా అవకాశాలు రావడం లేదు. త్వరలో రుతు ఐపీఎల్-2026లో సీఎస్కేకు నాయకత్వం వహించనున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు రుతు సీఎస్కే కెప్టెన్సీ కూడా ఊడుతుందని ప్రచారం జరిగింది. అయితే మేనేజ్మెంట్ ఇతనిపై భరోసా ఉంచింది. -
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ.. 312 టార్గెట్ హాంఫట్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో కేరళ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కుమార్ కుశాగ్ర (137 బంతుల్లో 143 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకం సాధించాడు. అనుకూల్ రాయ్ (72 బంతుల్లో 72; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. నిధీశ్ 4, బాబా అపరాజిత్ 2 వికెట్లు తీశారు.రోహన్, సంజూ సెంచరీలుఅనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని కేరళ కేవలం రెండే వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రోహన్ కున్నుమ్మాళ్ (78 బంతుల్లో 124; 8 ఫోర్లు, 11 సిక్స్‌లు), సంజూ సామ్సన్ (95 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)ల మెరుపు శతకాలు సాధించారు. సంజూ కాస్త ఆచితూచి ఆడినప్పటికి.. రోహన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అహ్మదాబాద్ మైదానంలో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరితో పాటు బాబా అపరాజిత్ (41 నాటౌట్; 1 ఫోర్), విష్ణు వినోద్ (40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఇక సంజూ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్ సన్నాహకాలగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకుంటున్నాడు. టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో శాంసన్ ఓపెనర్‌గా మరోసారి బరిలోకి దిగనున్నాడు. శాంసన్‌కు ఇది నాలుగో లిస్ట్-ఎ సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను? -
అయ్యో తిలక్.. సెంచరీ బాదినా చోటు దక్కలేదే?
విజయ్‌హజారే వన్డే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం రాజ్‌కోట్ వేదికగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో భారీ విజయాన్ని హైదరాబాద్ అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్లు అమన్ రావు (13), తన్మయ్ అగర్వాల్ (16) విఫలం కాగా, అరంభంలోనే నిష్క్రమించగా.. అభిరత్ రెడ్డి (64 బంతుల్లో 71; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్లు విఫలమైనా...పట్టుదలగా ఆడిన తిలక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఓవరాల్‌గా తిలక్ 118 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన చండీగఢ్ 37.4 ఓవర్లలో 150 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ సంయమ్ సైనీ (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.తిలక్‌కు నో ఛాన్స్..తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భార జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ తిరిగి రావడంతో తిలక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌పై సెలెక్టర్లు వేటు వేశారు.వీరిద్దరూ సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత తరపున ఆడారు. వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో తిలక్ ఆడినప్పటికి.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తిలక్ టీ20లతో పాటు లిస్ట్-ఎ క్రికెట్లో కూడా దుమ్ములేపుతున్నాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.కివీస్‌తో వన్డేలకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్‌దీప్ -
అర్షిన్, పృథ్వీ షా మెరుపులు.. ముంబై జోరుకు బ్రేక్
జైపూర్: విజయ్ హజారే వన్డే టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబైని మహారాష్ట్ర నిలువరించింది. గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన పోరులో మహారాష్ట్ర 128 పరుగుల భారీ తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 366 పరుగుల భారీ స్కోరు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్షిన్ కులకర్ణి (114 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, పృథ్వీ షా (75 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు 140 పరుగులు జోడించారు. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (52 బంతుల్లో 66; 7 ఫోర్లు)కూడా ఫిఫ్టీ బాదాడు. ఆఖర్లో రామకృష్ణ ఘోష్ (27 బంతుల్లో 64; 3 ఫోర్లు; 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తుషార్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ముంబై 42 ఓవర్లలోనే 238 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ (88 బంతుల్లో 92; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిద్ధేశ్ లాడ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ 3, సత్యజీత్ 2 వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్‌లాడిన ముంబైకి ఇది తొలి పరాజయం కాగా, మహారాష్ట్రకిది మూడో విజయం. -
రిషబ్ పంత్ విధ్వంసం.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒడిశా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు తిరిగి విజయ బాటలో పడింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 42.5 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ స్పీడ్ స్టార్ హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టి సర్వీసెస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్, సైనీ తలా వికెట్ సాధించారు. సర్వీసెస్ బ్యాటర్లలో వికాస్ హత్వాలా(26) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పుల్కత్ నరాంగ్ 22 పరుగులు చేశాడు.రాణా, పంత్ మెరుపులు..అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు.ఈ ఏడాది సీజన్లో పంత్‌కు ఇది రెండో ఫిప్టీ. అంతకుముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 70 పరుగులు చేశాడు. మిగితా మ్యాచ్‌లలో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్‌లలో ఇప్పటివరకు 188 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని భారత వన్డే జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడిపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.Rishabh Pant when people start doubting him. pic.twitter.com/mnXCLPxp5p— Vaibhav (@spideynation_) January 3, 2026 -
5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఆర్సీబీ స్టార్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తమిళనాడు, కేరళపై సెంచరీల(147, 124)తో సత్తాచాటిన పడిక్కల్.. తర్వాత తమిళనాడు మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై సూపర్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకు త్రిపుర బౌలర్లు గట్టి షాకిచ్చారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(5), కరుణ్ నాయర్(0) ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో పడిక్కల్ నిలకడగా ఆడి తన 13వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.సెలక్టర్లకు హెడ్ ఎక్..అయితే పడిక్కల్ ఫామ్ జాతీయ జట్టు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పడిక్కల్‌ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో పడిక్కల్‌కు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. అయితే భారత జట్టులో ప్రస్తుతం ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేవు. రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్ భారత జట్టు ఓపెనర్లగా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే రేసులో ముందున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో గిల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన యశస్వి సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి గిల్ తిరిగి రావడంతో యశస్వి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అలా అని మిడిలార్డర్లో చూసుకున్నా ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఒకవేళ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే రుతురాజ్, తిలక్ వర్మలపై కూడా వేటు పడే అవకాశముంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఎవరిని తప్పించి పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలనేది సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది.లిస్ట్-ఎ క్రికెట్లో అదుర్స్..లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే. కేవలం 38 మ్యాచ్‌ల్లోనే 80కి పైగా సగటుతో 2585 పైగా పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉండటం విశేషం. పడిల్క్ భారత తరపున ఇప్పటివరకు టెస్టులు, టీ20లు ఆడినప్పటికి.. వన్డేల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ 514 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇకఇక కివీస్‌తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. అయితే భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేటు వేయాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.చదవండి: IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ -
IND vs NZ: సెలక్షన్ రోజే విఫలమైన ఇషాన్ కిషన్!
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.వన్డేల్లోనూ పునరాగమనం!అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్‌తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్‌లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.సెలక్షన్ రోజు విఫలంకివీస్తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్‌తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.ఏకంగా ప్రపంచకప్ జట్టులోకిజార్ఖండ్ సారథిగా.. బ్యాటర్‌గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్‌ను కాకుండా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ కీపర్, ఓపెనర్‌గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు. కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ! -
అదరగొట్టిన తిలక్ వర్మ.. సెంచరీతో సెలెక్టర్లకు వార్నింగ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు. రాజ్‌కోట్ వేదికగా చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.ఓపెనర్లు అమన్ రావ్(13), తన్మయ్ అగర్వాల్(16) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు.తొలుత ఆచి తూచి ఆడిన వర్మ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అభిరత్ రెడ్డి (71) తో కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. చండీగఢ్ బౌలర్లలో జగజీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ దండా,హర్తేజస్వి కపూర్, విశూ కశ్యప్ తలా రెండు వికెట్లు సాధించారు.కివీస్‌తో వన్డేలకు తిలక్‌కు చోటిస్తారా?కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తిలక్ భారత జట్టులో భాగమైనప్పటికి.. ఇప్పుడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రానుండడంతో అతడిపై వేటు పడే అవకాశముంది.మరోవైపు కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ కూడా సెంచరీలో మోత మోగిస్తున్నాడు. అతడు కూడా సెలక్టర్లు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ! -
శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర శతకం బాదాడు. బరోడా తరఫున కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరీ హార్దిక్ పాండ్యా ఈ మేర తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటం విశేషం.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాలకు అనుగుణంగా టీమిండియా తరఫున విధుల్లో లేని స్టార్లంతా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సైతం శనివారం బరోడా తరఫున రంగంలోకి దిగాడు. రాజ్‌కోట్ వేదికగా విదర్భతో మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.టాపార్డర్ విఫలంఅయితే, విదర్భ పేసర్ నచికేత్ భూటే ఆరంభంలోనే బరోడాకు షాకిచ్చాడు. ఓపెనర్లలో అమిత్ పాసీ (0) డకౌట్ చేసిన ఈ రైటార్మ్ బౌలర్.. నిత్యా పాండే (15)ను సైతం పెవిలియన్‌కు పంపాడు.ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాన్షు మొలియా (16).. ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన అతిత్ షేత్ (21), కెప్టెన్ కృనాల్ పాండ్యా (23) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (9) విఫలమయ్యాడు.ఎనిమిది ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతోఇలాంటి దశలో హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై దాడికి దిగాడు. మొత్తంగా 92 బంతులు ఎదుర్కొన్న ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఎనిమిది ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విష్ణు సోలంకి (17 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. రాజ్ లింబాని (10) తేలిపోయాడు.ఆఖర్లో మహేశ్ పతియా 18, కరణ్ ఉమాట్ 13 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా బరోడా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 293 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్.. అతిత్, జితేశ్, హార్దిక్, రాజ్ రూపంలో నాలుగు కీలక వికెట్లు కూల్చగా.. నచికేత్ భూటే, పార్థ్ రేఖడే చెరో రెండు, ప్రఫుల్ హింగే ఒక వికెట్ పడగొట్టారు.లిస్ట్-ఎ క్రికెట్లో తొలి సెంచరీహార్దిక్ పాండ్యాకు లిస్-ఎ క్రికెట్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. విదర్భతో మ్యాచ్‌లో అర్ధ శతకానికి 44 బంతులు తీసుకున్న ఈ ఆల్‌రౌండర్.. మరో 24 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని ఆశ్చర్యపరిచాడు.కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 94 వన్డేలు ఆడిన హార్దిక్ పాండ్యా.. వీటితో కలిపి 119 లిస్ట్-ఎ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. కాన్బెర్రాలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 2020లో 92 పరుగులతో అజేయంగా నిలిచిన హార్దిక్ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేసుకున్నాడు.మొత్తంగా ఇప్పటికి తన ఖాతాలో 2350 లిస్ట్-ఎ పరుగులు జమచేసుకున్నాడు. అతడి ఖాతాలో 110 వికెట్లు కూడా ఉండటం విశేషం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు ముందు పాండ్యా ఇలా శతక్కొట్టడం టీమిండియాకు శుభవార్త. అయితే, కివీస్‌తో ఐదు టీ20లు, టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs NZ: పంత్‌పై వేటు.. దేశీ ‘హీరో’ ఎంట్రీ!.. సిరాజ్‌కు చోటిస్తారా?6⃣,6⃣,6⃣,6⃣,6⃣,4⃣ 🔥A maiden List A 💯 brought up in some style 🔥Hardik Pandya was on 66 off 62 balls against Vidarbha...and then he went berserk in the 39th over to complete his 100, smashing five sixes and a four 💪Scorecard ▶️ https://t.co/MFFOqaBuhP#VijayHazareTrophy… pic.twitter.com/pQwvwnI7lb— BCCI Domestic (@BCCIdomestic) January 3, 2026 -
నిప్పులు చెరిగిన అర్ష్‌దీప్.. ప్రభ్‌సిమ్రన్ ధనాధన్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా సిక్కింతో మ్యాచ్‌లో టీమిండియా స్టార్, పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఐదు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. అర్ష్‌దీప్‌తో పాటు సుఖ్దీప్ బజ్వా (Sukhdeep Bajwa), మయాంక్ మార్కండే, గుర్నూర్ బ్రార్ రాణించడంతో సిక్కిం 75 పరుగులకే ఆలౌట్ అయింది.ప్రభ్‌సిమ్రన్ సారథ్యంలో..బీసీసీఐ ఆదేశాల మేరకు దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలో దిగాడు అర్ష్‌దీప్ సింగ్. సొంతజట్టు పంజాబ్ తరపున శనివారం ఈ లెఫ్టార్మ్ పేసర్ దర్శనమివ్వగా.. భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మాత్రం అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.మరో టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇలాంటి తరుణంలో సిక్కింతో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జైపూర్ వేదికగా టాస్ గెలిచిన పంజాబ్.. సిక్కింను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు దుమ్ములేపారు.నిప్పులు చెరిగిన అర్ష్దీప్సిక్కిం ఓపెనర్లలో అమిత్ రజేరా (8) వికెట్ కూల్చి సుఖ్దీప్ శుభారంభం అందించగా.. ప్రాణేశ్ ఛెత్రీ (8)ని పెవిలియన్‌కు పంపి అర్ష్‌దీప్ తన వికెట్ల వేట మొదలుపెట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆశిష్ తాపా (0)ను సుఖ్దీప్ డకౌట్ చేయగా.. క్రాంతి కుమార్ (6), పల్జోర్ తమాంగ్ (13), కెప్టెన్ లీ యోంగ్ లెప్చా (0), అంకుర్ మాలిక్ (2) వికెట్లను అర్ష్‌దీప్ కూల్చాడు.మిగిలిన వారిలో రాహుల్ కుమార్ ప్రసాద్ (6), ఎండీ సప్తుల్లా (10)లను మయాంక్ మార్కండే అవుట్ చేశాడు. ఇక గుర్నూర్ బ్రార్.. గురిందర్ సింగ్ (10) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా సిక్కిం 22.2 ఓవర్లలో కేవలం 75 పరుగులు చేసి కుప్పకూలింది. టీ20 తరహా బ్యాటింగ్స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. హర్నూర్ సింగ్ (13 బంతుల్లో 22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 53) టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగి పంజాబ్‌ను సునాయాసంగా గెలిపించారు.చదవండి: T20 WC: జింబాబ్వే అనూహ్య నిర్ణయం.. సంచలన ఎంపికలు -
టీమిండియా యంగ్ స్టార్‌కు తీవ్ర గాయం.. విరిగిన పక్కటెముక
మైదానంలో తీవ్రంగా గాయపడి, నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఉదంతం మరవకముందే మరో టీమిండియా ఆటగాడు మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఇటీవల మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా యంగ్ స్టార్ సాయి సుదర్శన్ పక్కటెముక విరిగింది. పరుగు పూర్తి చేసే క్రమంలో డైవ్ చేసిన సుదర్శన్ ప్రమాదకర రీతిలో కింద పడ్డాడు. అప్పటికి గాయం పెద్దదిగా అనిపించనప్పటికీ స్కానింగ్‌ల్లో రిబ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ గాయం కారణంగా సాయి వీహెచ్‌టీలో తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతనికి 6-8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. సాయి ఐపీఎల్ 2026 ప్రారంభ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని సమాచారం. సాయి గుజరాత్ టైటాన్స్‌లో కీలక సభ్యుడు. గత కొన్ని సీజన్లుగా అతను టైటాన్స్ తరఫున స్థిరంగా రాణిస్తున్నాడు.సాయికి ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్ట్ జట్టులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని తదుపరి టీమిండియా అవకాశాలు ఐపీఎల్ 2026 ప్రదర్శనలపై ఆధారపడి ఉంటాయి. 24 ఏళ్ల సాయి టీమిండియా తరఫున 6 టెస్ట్‌ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 302 పరుగులు.. 3 వన్డేల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 127 పరుగులు చేశాడు. ఐపీఎల్లో సాయికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అరంగేట్రం నుంచి గుజరాత్ టైటాన్స్‌కే ఆడుతున్న సాయి.. 40 మ్యాచ్‌ల్లో 145కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో, కళ్లు చెదిరే 49.8 సగటున 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 1793 పరుగులు చేశాడు. -
టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..
టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు. పంజాబ్ తరఫున ఓపెనర్‌గా గిల్ బరిలోకి దిగనున్నాడు.జైపూర్ వేదికగా సిక్కిం, గోవా జట్లతో పంజాబ్ శని (జనవరి 3), మంగళవారాల్లో (జనవరి 6) ఆడే మ్యాచ్‌లో గిల్ భాగం కానున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. కాగా సౌతాఫ్రికా (IND vs SA)తో ఇటీవల జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్‌లో గిల్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అనూహ్య రీతిలో వేటుతొలి టెస్టు సందర్భంగా గాయపడిన గిల్ (Shubman Gill).. సఫారీలతో రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చి వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో నాలుగు, ఐదో టీ20ల నుంచి యాజమాన్యం అతడిని తప్పించింది.అంతేకాదు.. అనూహ్య రీతిలో ప్రపంచకప్-2026 జట్టులోనూ గిల్‌కు చోటివ్వలేదు. వైస్ కెప్టెన్‌గా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై వేటు వేసి.. టీ20ల నుంచి పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో గిల్ సత్తా చాటి తిరిగి ఫామ్‌లోకి రావాలని గిల్ భావిస్తున్నాడు.ఇప్పటికే ఆడేశారుఇదిలా ఉంటే.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇప్పటికే ఢిల్లీ, ముంబై తరఫున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. టీమిండియా స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ సారథిగా, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర, సర్ఫరాజ్ ఖాన్ ముంబై, దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరఫున దుమ్ములేపుతున్నారు. ఇక అభిషేక్ శర్మ సైతం పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు.టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..ఈ జాబితాలో ఇప్పుడు గిల్‌తో పాటు వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరనున్నాడు. సర్వీసెస్, గుజరాత్ జట్లతో జనవరి 6,8వ తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్రకు జడ్డూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం కర్ణాటక తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.త్రిపుర, రాజస్తాన్‌లతో జనవరి 3, 6 తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఇక గిల్‌తో పాటు.. జడేజా, కేఎల్ రాహుల్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. కోహ్లి, రోహిత్‌లతో కలిసి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నారు. సొంతగడ్డపై కివీస్‌తో టీమిండియా మూడు వన్డే, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్ చేయరు? -
నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్ చేయరు?
దేశవాళీ క్రికెట్లో చాలాకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్. సొంత జట్టు తరఫున రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ, విజయ్ హజారే వన్డే ట్రోఫీ.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుకున్నాడు.తాజాగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గోవాతో బుధవారం నాటి మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. యాభై ఆరు బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 75 బంతుల్లో 157 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లతో పాటు ఏకంగా 14 సిక్సర్లు ఉండటం విశేషం.మరోవైపు.. కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్, మాజీ సారథి దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నిజంగా ఇది సిగ్గుచేటు‘‘మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలనూ సద్వినియోగం చేసుకున్నాడు. అయినప్పటికీ ఏ ఫార్మాట్‌కు కూడా సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను విస్మయానికి గురిచేస్తోంది.అంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిని తరచూ ఇలా ఎలా పక్కనపెట్టగలుగుతున్నారు. నిజంగా ఇది సిగ్గుచేటు. ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో పడిక్కల్‌తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ కీలక సమయంలో 132 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.మిమ్మల్ని మీరే నిందించుకోవాలికానీ సెలక్టర్లు ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన ఇద్దరిని పక్కనపెట్టారు. సర్ఫరాజ్ మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ అద్బుతం. మానసికంగానూ అతడు బలవంతుడు.ఏ ఫార్మాట్లోనైనా.. ఎక్కడైనా చితక్కొట్టగలడు. అలాంటి ఆటగాడిని సెలక్ట్ చేయకుండా.. పరాజయాల పాలైతే వేరే ఎవరినీ మీరు నిందించకూడదు. మిమ్మల్ని మీరే నిందించుకోవాల్సి ఉంటుంది’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్.. టీమిండియా సెలక్టర్లకు చురకలు అంటించాడు. కాగా తీవ్ర స్థాయిలో విమర్శల అనంతరం సర్ఫరాజ్ ఖాన్‌ను 2024లో అరంగేట్రం చేయించింది టీమిండియా మేనేజ్మెంట్. ఇప్పటికి ఆరు టెస్టుల్లో కలిపి అతడు 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్, నితీశ్ రెడ్డి సంగతి? -
టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’గా మారిన ప్లేయర్లు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ దేవ్‌దత్ పడిక్కల్, ముంబై సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. పడిక్కల్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో మూడుసార్లు శతక్కొట్టాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 147 పరుగులతో దుమ్ములేపిన పడిక్కల్.. కేరళపై 124 పరుగులు సాధించాడు.టీమిండియా సెలక్టర్లకు తలనొప్పిఅనంతరం పుదుచ్చేరిపై 113 పరుగులతో పడిక్కల్ ఆకట్టుకున్నాడు. మరోవైపు.. సర్ఫరాజ్ బుధవారం విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. గోవాతో మ్యాచ్‌లో 75 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు బాది 157 పరుగులు సాధించాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తూ వన్డేలకూ తాను సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాడు.వీరిద్దరితో పాటు మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సైతం దేశీ వన్డే టోర్నీలో అదరగొడుతున్నాడు. ఉత్తరాఖండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ రుతు అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 113 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 124 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 331 పరుగులు చేయడంలో రుతుది కీలక పాత్ర.మరోవైపు.. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ సైతం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బెంగాల్ తరపున బుధవారం నాటి మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసిన షమీ.. జమ్మూ కశ్మీర్‌పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వీరంతా అదరగొడుతుంటే.. టీమిండియా రెగ్యులర్ జట్టులో భాగమైన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, ఆంధ్ర సారథి నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం నిరాశపరుస్తున్నారు.ఆంధ్ర జట్టుకు మూడో పరాజయంనితీశ్ కెప్టెన్సీలోని ఆంధ్ర జట్టు (Andhra Cricket Team).. బ్యాటర్ల వైఫల్యం కారణంగా విజయ్ హజారే ట్రోఫీలో మూడో పరాజయం మూటగట్టుకుంది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో సౌరాష్ట్ర చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ హార్విక్ దేశాయ్ (81 బంతుల్లో 61; 7 ఫోర్లు), చిరాగ్ జానీ (96 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్), రుచిత్ అహిర్ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు.ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 3 వికెట్లు పడగొట్టగా... కలిదిండి రాజు 2 వికెట్లు తీశాడు. నితీశ్ కుమార్ రెడ్డి, జాగర్లపుడి రామ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు తడబడింది. బ్యాటర్లంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవడంతో... ఆంధ్ర జట్టు 47.2 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.జ్ఞానేశ్వర్ (33; 6 ఫోర్లు), హేమంత్ రెడ్డి (29; 4 ఫోర్లు), కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (30; 4 ఫోర్లు), రాజు (30; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... శ్రీకర్ భరత్ (4), రికీ భుయ్ (4), యారా సందీప్ (0) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అంకుర్ పన్వర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయం, మూడు పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం గుజరాత్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది.మరి పంత్, నితీశ్ రెడ్డి సంగతి?అంతకు ముందు.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లోనూ నితీశ్ రెడ్డి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. అయితే, రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్‌తో రాణించారు. ఐదో స్థానంలో వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓ వికెట్ కూడా పడగొట్టాడు.అనంతరం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు చేసి.. ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు.. రిషభ్ పంత్ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 121 (ఆంధ్రపై 5, గుజరాత్‌పై 70, సౌరాష్ట్రపై 22, ఒడిశాపై 24)పరుగులు చేయగలిగాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు పంత్ ఇలా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.చదవండి: 2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్ -
రిషభ్ పంత్ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్ కీపర్.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్ (Rishabh Pant)... కీలక పోరులో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా (Delhi Vs Odisha) చేతిలో ఓడింది. సమంత్రాయ్ హాఫ్ సెంచరీమొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బిప్లబ్ సమంత్రాయ్ (72; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హాఫ్ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. పంత్ సహా వారంతా విఫలంఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (2), ప్రియాన్ష్ ఆర్య (5), సార్థక్ రంజన్ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.చదవండి: IND vs NZ: టీమిండియా వికెట్ కీపర్ రేసులో ఆ ముగ్గురు.. బెస్ట్ ఆప్షన్ ఎవరంటే? -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కృనాల్ పాండ్యా
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి గ్రేట్ న్యూస్ అందుతుంది. ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పోలిస్తే బంతితో మెరుగ్గా రాణించే కృనాల్.. విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్‌తోనూ చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా బెంగాల్ (63 బంతుల్లో 57), ఉత్తర్ప్రదేశ్పై (77 బంతుల్లో 82) అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌పై మరింత రెచ్చిపోయి విధ్వంసకర శతకం బాదాడు.కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 109 పరుగులు చేశాడు. కృనాల్‌కు ఓపెనర్లు నిత్యా పాండ్యా (122), అమిత్ పాసి (127) సెంచరీలు కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కృనాల్ జట్టు బరోడా భారీ స్కోర్ (417-4) చేసింది. ఇదే బరోడా జట్టులో సభ్యుడైన టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. నిత్యా, పాసి, కృనాల్ మెరుపు శతకాలతో కదంతొక్కడంతో హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ మిలింద్ 2, త్యాగరాజన్, వరుణ్ గౌడ్ తలో వికెట్ తీశారు. -
వరుస శతకాలతో దూసుకుపోతున్న పడిక్కల్, రుతురాజ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా యువ బ్యాటర్, కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలతో శతక మోత మోగించాడు. తాజాగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసిన అతను.. జార్ఖండ్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేరళపై (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా శతకాలు బాదాడుతాజా శతకంతో లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ శతకాల సంఖ్య 12కి చేరింది. పడిక్కల్ కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లోనే 12 శతకాలు, 12 అర్ద శతకాలతో 80కిపైగా సగటుతో 2300 పైచిలుకు పరుగులు చేశాడు.పుదుచ్చేరితో మ్యాచ్‌లో పడిక్కల్‌తో పాటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో పడిక్కల్, మయాంక్ సెంచరీలకు కరుణ్ నాయర్ (34 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ కూడా తోడైంది.సూపర్ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్ఇవాళే (డిసెంబర్ 31) జరిగిన మరో మ్యాచ్‌లో మరో టీమిండియా యువ బ్యాటర్, మహారాష్ట్ర స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (113 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అద్భుత శతకంతో కదంతొక్కాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ ఈ శతకం బాదాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (50-3) రుతురాజ్ బ్యాట్ నుంచి ఈ క్లాసిక్ సెంచరీ వచ్చింది. రుతురాజ్ శతకం కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర భారీ స్కోర్ (331-7) చేసింది.ఈ సెంచరీతో రుతురాజ్ తన లిస్ట్-ఏ శతకాల సంఖ్యను 19కి పెంచుకున్నాడు. రుతురాజ్ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ ఏడాది రుతురాజ్ ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇండియా-ఏ, ఇండియా, తాజాగా విజయ్ హజారే ట్రోఫీ.. ఇలా ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ సెంచరీలు చేసి, విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా ఆశాకిరణంగా మారాడు. -
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న జైసూ.. సొంత జట్టు ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ 2025-26లో భాగంగా గోవాతో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.జైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లలో అంగ్క్రిష్ రఘువన్షి (11) త్వరగానే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్‌తో కలిసి యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.జైసూ జస్ట్ మిస్.. అయితే, అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జైసూ దర్శన్ మిసాల్ (Darshan Misal) బౌలింగ్‌లో స్నేహల్ కౌతంకర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గోవాతో మ్యాచ్‌లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్.. ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ముషీర్ ఖాన్‌కు తోడైన.. అతడి అన్న, టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దుమ్ములేపాడు.సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకంతమ్ముడు ముషీర్ (60)తో కలిసి మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించిన సర్ఫరాజ్ ఖాన్.. విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.మొత్తంగా 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్.. 157 పరుగులు చేసి దర్శన్ మిసాల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిగిలిన వారిలో హార్దిక్ తామోర్ హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 53)తో మెరవగా.. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (8 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు.ముంబై భారీ స్కోరుఇక సిద్దేశ్ లాడ్ 17, షామ్స్ ములాని 22 పరుగులు చేయగా.. ఆఖర్లో తనుశ్ కొటియాన్ (12 బంతుల్లో 23), తుషార్ దేశ్‌పాండే (3 బంతుల్లో 7) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 444 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. గోవా బౌలర్లలో దర్శన్ మిసాల్ మూడు వికెట్లు కూల్చగా.. వాసుకి కౌశిక్, లలిత్ యాదవ్ చెరో రెండు, దీప్రాజ్ గవోంకర్ ఒక వికెట్ కూల్చారు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో బెంగాల్ పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రత్యర్థి జట్టును 63 పరుగులకే ఆలౌట్ చేశారు. దేశీ వన్డే టోర్నీ గ్రూప్-బిలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.శుభారంభం అందించిన షమీకెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ నమ్మకాన్ని నిలబెడుతూ బెంగాల్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్ టాపార్డర్‌లో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (0)ను డకౌట్ చేసి.. టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ శుభారంభం అందించాడు.షమీకి తోడుగా టీమిండియా స్టార్లు ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ నిప్పులు చెరుగుతూ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వన్‌డౌన్‌లో వచ్చిన మురుగన్ అశ్విన్ (0)ను ఆకాశ్ దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఓపెనర్ శుభం ఖజూరియా (12)ను ముకేశ్ వెనక్కి పంపాడు.చెలరేగిన ముకేశ్, ఆకాశ్ఇక యావర్ హసన్ (1) రూపంలో షమీ తన రెండో వికెట్ తీయగా.. కెప్టెన్ పారస్ డోగ్రా (19) సహా అబ్దుల్ సమద్ (8), యుధ్వీర్ సింగ్ చరక్ (7) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ముకేశ్ కుమార్.. రిధమ్ శర్మ (7), అబిద్ ముస్తాక్ (2), అకిబ్ నబీ దార్ (0)లను పెవిలియన్‌కు పంపాడు.మొత్తంగా షమీ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి.. జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఫలితంగా 20.4 ఓవర్లలో కేవలం 63 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ ఆలౌట్ అయింది. కాగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ, ముకేశ్ కుమార్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరం కాగా.. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలైలో చివరగా భారత జట్టుకు ఆడాడు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.అయితే, ఈ రెండు మ్యాచ్‌లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్‌తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్‌లలో ఆడనున్నాడు.విశ్రాంతి తీసుకోమన్నా వినడే!టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్‌తో ఐదు టీ20లు సహా వరల్డ్‌కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.రో-కో ఆడేశారుకాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక శుబ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్ తదుపరి మ్యాచ్‌లలో పంజాబ్‌కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్‌లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.29 బంతుల్లోనే హాఫ్ సెంచరీఆ తర్వాత గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్లో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్‌లు ఆడతాయి.సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 632 ఇన్నింగ్స్‌లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్‌తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్‌తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
ఒక్క మ్యాచ్‌లో ‘హిట్’.. రెండింటిలో ఫ్లాప్ షో!
విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా సోమవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఒడిశా జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఆలూర్ వేదికగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. కోన శ్రీకర్ భరత్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు), షేక్ రషీద్ (35 బంతుల్లో 20; 1 ఫోర్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (11 బంతుల్లో 6; 1 ఫోర్) నిరాశపరిచాడు. 43.4 ఓవర్లలోనేఎస్డీఎన్వీ ప్రసాద్ (64 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో సౌరభ్ కుమార్ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించడంతో ఆంధ్ర స్కోరు 200 దాటింది. ఒడిశా బౌలర్లలో బిప్లాబ్ సామంత్రే, గోవింద పొద్దార్ 3 వికెట్ల చొప్పున తీశారు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా జట్టు 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ స్వస్తిక్ సామల్ (0) ఆడిన తొలి బంతికే అవుటైనా... ఓం ముండే (111 బంతుల్లో 91; 7 ఫోర్లు), గోవింద పొద్దార్ (105 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఒడిశా విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 166 పరుగులు జోడించారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో నెగ్గిన ఆంధ్ర జట్టు గ్రూప్ ‘డి’లో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 31న జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతుంది. ఒక్క మ్యాచ్‌లో ‘హిట్’.. రెండింటిలో ఫ్లాప్ షో!ఆంధ్ర కెప్టెన్, టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్ తీశాడు.ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఢిల్లీ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్‌తో అదరగొట్టాడు. ఐదో నంబర్ బ్యాటర్‌గా వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓ వికెట్ కూడా పడగొట్టాడు.ఇక తాజాగా సోమవారం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగులే చేసి నిష్క్రమించాడు. అదే విధంగా ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. ఇప్పటి వరకు ఇలా అతడి ప్రదర్శన మిశ్రమంగా ఉంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
10 ఓవర్లలో 123 పరుగులు.. సీఎస్కే బౌలర్ అత్యంత చెత్త రికార్డు
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్‌రౌండర్ అమాన్ ఖాన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావడం గమనార్హం. జార్ఖండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమాన్ 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్–ఎ క్రికెట్)లో ఒక మ్యాచ్‌లో బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇదే టోర్నీలో ఈ నెల 24న బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసూ 9 ఓవర్లల ఇచ్చిన 116 పరుగుల రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.ఐపీఎల్లో రెండు సీజన్ల పాటు కోల్‌కతా, ఢిల్లీ జట్లకు కలిపి 12 మ్యాచ్‌లలో ఆడినా ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం వచ్చిన అమాన్ ఖాన్ ఇటీవల జరిగిన 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది. పుదుచ్చేరితో మ్యాచ్‌లో 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసిన జార్ఖండ్...ఆ తర్వాత పుదుచ్చేరిని 235 పరుగులకే ఆలౌట్ చేసి 133 పరుగులతో విజయాన్నందుకుంది.చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే! -
న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్, ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరి 6న ఆలుర్‌లో రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు లీక్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. ఈ జట్టులో విరాట్ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఫార్మాట్లో విరాట్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్ సెంచరీ (గుజరాత్‌పై 77) చేశాడు. విరాట్ రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.విరాట్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్ సెంచరీ (65 నాటౌట్) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన విరాట్.. చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
7 వికెట్లతో చెలరేగిన సీఎస్కే ఫాస్ట్ బౌలర్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్ రామకృష్ణ ఘోష్ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్‌తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.తాజా మ్యాచ్‌లో ఘోష్ చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (110) సెంచరీ చేయడంతో హెచ్‌పీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హెచ్‌పీ ఇన్నింగ్స్‌లో మన్కు వైభవ్ అరోరా (40), అమన్‌ప్రీత్ సింగ్ (30), నితిన్ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బావ్వే (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్ అరోరా, ధలివాల్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 2026 వేలానికి ముందు రీటైన్ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్కే 2025 వేలంలో 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్ అయిన 28 ఏళ్ల ఘోష్ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా సీఎస్కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్ చేసుకుంది. ఘోష్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు. -
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తన ఉద్దేశాలను మరోసారి స్పష్టం చేశాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని సిక్సర్‌గా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్న అభిషేక్.. తన తాజా ప్రదర్శనతో క్రికెట్ సర్కిల్స్‌లో భయోత్పాతం సృష్టించాడు.ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్‌గా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సిక్సర్ల వీరుడు.. ఇవాళ (డిసెంబర్ 28) జైపూర్‌లోని అనంతం గ్రౌండ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఏకంగా 45 సిక్సర్లు బాది, అక్కడున్న వారిలో (ట్రిబ్యూన్ రిపోర్టర్ల కథనం) భయాందోళనలు పుట్టించాడు. ఈ విషయాన్ని ట్రిబ్యూన్ మీడియాకు చెందిన రిపోర్టర్లు నివేదించారు.వారి నివేదిక ప్రకారం.. పంజాబ్ రేపు జరుగబోయే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో (జైపూర్‌లోని అనంతం క్రికెట్ గ్రౌండ్) ఉత్తరాఖండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ శివాలెత్తిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని భారీ షాట్ ఆడి, ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఇది చూసి రిపోర్టర్లు సహా అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.ఈ స్థాయి విధ్వంసమేంటంటూ నోరెళ్లబెట్టారు. ప్రతి బంతిని బాదడమే ధ్యేయంగా పెట్టుకొన్న అభిషేక్.. స్పిన్నర్ల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దాదాపు ప్రతి బంతిని కవర్స్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అభిషేక్ వీరంగం చూసి పంజాబ్ కోచ్ సందీప్ శర్మ అవాక్కైపోయాడు. ట్రిబ్యూన్ రిపోర్టర్లు నివేదించిన ఈ కథనం చూసి ప్రపంచ బౌలర్లంతా భయాందోళనలకు గురవుతుంటారు.వాస్తవానికి అభిషేక్ సిక్సర్ల వీరంగం గతేడాది ఆరంభం నుంచే మొదలైంది. ఈ ఏడాది చివర్లో అది తారాస్థాయికి చేరినట్లుంది. 2024 ఐపీఎల్‌తో మెరుపులు ప్రారంభించిన అభిషేక్ అప్పటినుంచి తానెదుర్కొన్న ప్రతి బౌలర్‌ను షేక్ చేస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది అతని సిక్సర్ల ప్రదర్శన శృతి మించింది. ఇప్పటివరకు ఆడిన 41 టీ20ల్లో ఏకంగా 108 సిక్సర్లు బాది, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కరణ్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నారు. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ప్లేయర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో గడిపిన శ్రేయస్.. తాజాగా ఫిట్నెస్ టెస్ట్‌లన్నీ పూర్తి చేసుకొని, రీఎంట్రీకి అనుమతి పొందాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మీడియాకు వెల్లడించారు.CoE నుంచి తుది క్లియరెన్స్ ఆధారంగా శ్రేయస్ షెడ్యూల్ నిర్ణయించబడుతుందని సదరు అధికారి తెలిపారు. ప్రస్తుతం శ్రేయస్ నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.సదరు అధికారి చెప్పిన విషయాల మేరకు.. శ్రేయస్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇస్తాడు. అంతకంటే ముందే ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడతాడు. జనవరి 3న మహారాష్ట్రతో, 6న హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో శ్రేయస్ బరిలోకి దిగుతాడు. ఆతర్వాత భారత వన్డే జట్టుతో కలుస్తాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం జనవరి 3 లేదా 4 తేదీల్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 (వడోదర), 14 (రాజ్‌కోట్), 18 (ఇండోర్) తేదీల్లో జరుగనుంది.కాగా, అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకు తిరిగొచ్చిన అయ్యర్.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. -
అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
ప్రతి ఏడాది మాదిరే ఈసారీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మొదలైంది. అయితే, ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రాకతో ఈ సీజన్‌కు పండుగ కళ వచ్చింది. ఢిల్లీ తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ బుధవారం నాటి తొలి మ్యాచ్‌లలో శతక్కొట్టారు.రెండో రౌండ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా.. రోహిత్ మాత్రం ఈసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీ క్రికెట్ బరిలో దిగారు. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు.రూ. వెయ్యి కోట్లకు పైగానేఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్- కోహ్లి.. సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి నెట్‌వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, ఐపీఎల్లో ఆడటం ద్వారా కూడా రో-కో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు. మరి విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజాలకు లభించే మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?!..విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్-ఎ మ్యాచ్‌లలో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి.. తదనుగుణంగా ఫీజును చెల్లిస్తారు. ఆ వివరాలు ఇవీ..సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 60 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 30 వేల చొప్పున ఫీజుమిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 50 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 25 వేల చొప్పున ఫీజుజూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 40 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 20 వేల చొప్పున ఫీజు.రోజువారీ అలవెన్సులురవాణా, భోజనం ఖర్చులు.. వసతి ఏర్పాటుప్రదర్శన ఆధారంగా బోనస్లుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేల ప్రైజ్మనీప్రైజ్మనీనాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్‌పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ వచ్చేది ఎంత?ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లుగా రోహిత్- కోహ్లి ఒక్కో వన్డేకు రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గానూ రూ. 60 వేలతో పాటు బోనస్, అలవెన్సులు కూడా దక్కుతాయి. ఫీజులో వ్యత్యాసం ఉన్నా.. ఆట ఒక్కటే.ఈ దేశీ టోర్నీ ద్వారానే తమను తాము నిరూపించుకున్న రో- కో వంటి ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నత స్థాయికి చేరారు. ఏదేమైనా బీసీసీఐ నిబంధనల పుణ్యమా అని రోహిత్- కోహ్లిలను మరోసారి తమ సొంత దేశీ జట్ల తరఫున ఆడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. -
వరుసగా ఐదో సెంచరీ!.. మళ్లీ ఓడిన హైదరాబాద్
రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ధ్రువ్‌కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అమన్ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశ్ రాథోడ్ (68; 6 ఫోర్లు), సమర్థ్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... అభిరథ్ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్-ఎ కెరీర్లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.లిస్ట్ ఎ క్రికెట్లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే1. విరాట్ కోహ్లి (భారత్): 57.87- 16,207 పరుగులు2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు4. ఛతేశ్వర్ పుజారా (భారత్): 57.01-5759 పరుగులు5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్): 56.68- 4648 పరుగులుఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్ రిషబ్ పంత్(70) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైశ్వాల్ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌరవ్ చౌహన్(49), ఉర్విల్ పటేల్(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఓ యువ పేస్ బౌలర్ దుమ్ములేపుతున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వెటరన్ భువనేశ్వర్ కుమార్‌ను తలపించే స్వింగ్ బౌలింగ్‌తో దూసుకుపోతున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో పవర్ ప్లే స్పెషలిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే బరోడాకు చెందిన యువ పేస్ సంచలనం రాజ్ లింబానీ.బెంగాల్‌పై అదుర్స్..దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్లో లింబానీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అస్సాంతో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తాచాటిన రాజ్.. ఇప్పుడు శుక్రవారం బెంగాల్‌పై 5 వికెట్ల హాల్‌తో మెరిశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెంగాల్ జట్టు కేవలం 205 పరుగులకే కుప్పకూలింది.ఆరంభంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన లింబానీ.. ఆ తర్వాత షాబాజ్ ఆహ్మద్ వంటి కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో 65 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను లింబానీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో లింబాని(8) సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ఎవరీ రాజ్ లింబానీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ రాజ్ లింబాని?20 ఏళ్ల రాజ్ లింబాని.. గుజరాత్‌లోని కచ్‌లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్లో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాజ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తరపున ఆడి తన అద్భుతమైన 'ఇన్స్వింగర్ల'తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్‌లోనూ భారత అండర్-19 జట్టకు ప్రాతినిథ్యం వహించాడు. ఆసియా కప్‌లో నేపాల్‌పై కేవలం 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.తన స్వింగ్ బౌలింగ్‌తో జానియర్ భువీగా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం రాజ్ లింబానికి నిరాశే ఎదురైంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లింబానిని ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎవరైనా గాయపడితే అతడిని రిప్లేస్‌మెంట్‌గా తీసుకునే అవకాశముంది. ఐపీఎల్-2025లో లింబాని గుజరాత్ టైటాన్స్ నెట్‌బౌలర్‌గా తన సేవలు అందించాడు. అతడు ఇప్పటివరకు డొమాస్టిక్ క్రికెట్లో 25 మ్యాచ్‌లు 39 వికెట్లు పడగొట్టాడు.చదవండి: VHT 2025-26: సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్.. ఉతికారేశారు -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
ఐపీఎల్ 2026కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా రైల్వేస్‌తో ఇవాళ (డిసెంబర్ 26) జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఫలితంగా అతని జట్టు ఆంధ్రప్రదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. అలూర్ వేదికగా ఆంధ్ర, రైల్వేస్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు ప్రత్యర్ధిని 266 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. సత్యనారాయణ రాజు (10-1-41-3), కేఎస్ నరసింహ రాజు (10-0-68-3), హేమంత్ రెడ్డి (6-0-34-2), నితీశ్ కుమార్ రెడ్డి (10-0-34-1) అద్బుతంగా బౌలింగ్ చేసి రైల్వేస్‌కు భారీ స్కోర్ చేయనివ్వలేదు. అయినా ఆన్ష్ యాదవ్ (59), రవి సింగ్ (76) అర్ద సెంచరీలతో పోరాడటంతో రైల్వేస్ ఓ మోస్తరుకు మించిన స్కోర్ అయితే చేయగలిగింది. ఆ జట్టు తరఫున జుబైర్ అలీ (48), రాజ్ చౌదరి (22 నాటౌట్) కూడా పోరాడారు. మిగతా బ్యాటర్లలలో సూరజ్ అహూజా 7, ప్రథమ్ సింగ్ 6, ఉపేంద్ర యాదవ్ 7, అశుతోష్ శర్మ 8, కర్ణ్ శర్మ 7, రాహుల్ శర్మ 12 పరుగులు చేశారు.అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. బంతితో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి, హేమంత్ రెడ్డి బ్యాట్‌తో కూడా సత్తా చాటారు. నితీశ్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేయగా.. హేమంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 41 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరికి ముందు రికీ భుయ్ (76) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు పునాది వేశాడు. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (30), శ్రీకర్ భరత్ (25), వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (40) పర్వాలేదనిపించారు. జట్టులో ప్రతి ఒక్కరు తలో చేయి వేయడంతో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్.. ఉతికారేశారు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో గోవా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో గోవా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.గోవా బ్యాటర్లలో లలిత్ యాదవ్ (104) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ దీపరాజ్ గాంకర్(71) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. హిమాచల్ బౌలర్లలో రోహిత్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మిర్దుల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో హిమాచల్ ప్రదేశ్ 49.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది.మిడిలార్డర్ బ్యాటర్లు పి. రాజ్మన్(126) తన అద్భుతపోరాటంతో జట్టును విజయతీరాల దాకా తీసుకెళ్లినప్పటికి.. ఆఖరిలో వికెట్లు కోల్పోవడంతో హిమాచల్ ఓటమిచవిచూడాల్సి వచ్చింది. గోవా బౌలర్లలో దీపరాజ్ గాంకర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. బ్యాటింగ్ బౌలింగ్‌లో దుమ్ములేపిన దీపరాజ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.అర్జున్ అట్టర్ ప్లాప్..అయితే ఈ మ్యాచ్‌లో గోవా ఆల్‌రౌండర్, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అర్జున్.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. బ్యాటింగ్‌లో అతడికి కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. కానీ బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. 6 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్.. 9.70 ఏకానమి రేటుతో ఏకంగా 58 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు ఇవ్వడంతో అర్జున్‌తో తన పూర్తి కోటాను కెప్టెన్ పూర్తి చేయించలేదు. తొలి మ్యాచ్‌కే బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌కు హిమాచల్‌పై ఆడే అవకాశం లభించింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ జూనియర్ టెండూల్కర్ అందిపుచ్చుకోలేకపోయాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ ఫర్వాలేదన్పించాడు. కాగా ఐపీఎల్-2026లో అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి అతడిని లక్నో ట్రేడ్ చేసుకుంది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే? -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన పడిక్కల్
లిస్ట్-ఏ క్రికెట్లో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) హవా కొనసాగుతోంది. 34 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్లో 11వ శతకం (12 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి) నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఈ ఆర్సీబీ బ్యాటర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై వీరోచిత శతకం (118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు) బాదిన పడిక్కల్.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన రిపీట్ చేశాడు. తన జట్టు 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో సెంచరీ పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు (135 బంతుల్లో 123 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు). అతనికి జతగా మరో టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ క్రీజ్‌లో ఉన్నాడు. కరుణ్ (98 బంతుల్లో 93 నాటౌట్; 10 ఫోర్లు) కూడా సెంచరీకి చేరువగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక గెలవాలంటే 60 బంతుల్లో మరో 65 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. 40 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 220/1గా ఉంది. కర్ణాటక కోల్పోయిన ఒకే ఒక వికెట్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ది (1).అంతకుముందు బాబా అపరాజిత్ (71), అజారుద్దీన్ (84 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో కేరళ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహన్ కున్నుమ్మల్ 12, అభిషేక్ నాయర్ 7, అహ్మద్ ఇమ్రాన్ డకౌట్, అకిల్ స్కారియా 27, విష్ణు వినోద్ 35, అంకిత్ శర్మ 2, నిధీశ్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్ షెట్టి 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్ గోపాల్ 2, విధ్వత్ కావేరప్ప, విద్యాదర్ పాటిల్ తలో వికెట్ తీశారు.జార్ఖండ్‌పై వీరోచిత శతకంపడిక్కల్ ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 413 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో ఈ భారీ సెంచరీ చేసి తన జట్టు గెలుపుకు గట్టి పునాది వేశాడు.లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. -
కేకేఆర్ స్టార్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు!
విజయ్ హజారే ట్రోఫీ-2025లో ముంబై బ్యాటర్, కేకేఆర్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రఘువంశీ తలకు గాయమైంది. అంగ్క్రిష్ ఒక కష్టతరమైన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోయాడు.దీంతో అతడి తలకు, భుజానికి తీవ్రమైన గాయమైంది. రఘువంశీ విపరీతమైన నొప్పితో విలవిలలాడాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన ఫిజియోలు అతడిని స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తెసుకెళ్లారు. అనంతరం అతడిని జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయం తీవ్రతను అంచనా వేయడానికి వైద్యులు స్కాన్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అతడి గాయంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ పలు రిపోర్ట్‌ల ప్రకారం.. రఘువంశీ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. అతడు కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ముంబై జట్టుకే కాకుండా కేకేఆర్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బే. రఘువంశీ కేకేఆర్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో కేకేఆర్ 8వ స్థానంలో నిలిచినప్పటికీ.. రఘువంశీ మాత్రం దుమ్ములేపాడు. 11 ఇన్నింగ్స్‌లలో 300 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతడు గాయపడడం కేకేఆర్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికి.. హార్దిక్ తమోర్ (93*), ముషీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఉత్తరాఖండ్ తడబడుతోంది. 42 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అయితే రఘువంశీ మాత్రం కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. -
రింకూ సింగ్ విధ్వంసకర శతకం
టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని రింకూ సింగ్ నిజం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తున్నాడు. తాజాగా వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఫామ్‌ను కొనసాగిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం.ఈ టోర్నమెంట్లో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన రింకూ సింగ్ (Rinku Singh).. బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 48 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఇతడికి తోడు ధ్రువ్ జురెల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫలితంగా యూపీ 84 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం అందుకుంది.ఆర్యన్ జుయల్ సెంచరీగ్రూప్-బిలో భాగంగా తాజాగా చండీగఢ్‌తో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో రాజ్‌కోట్ వేదికగా టాస్ ఓడిన యూపీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ గోస్వామి (1) ఈసారి విఫలం కాగా.. ఆర్యన్ జుయల్ మాత్రం మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 118 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 134 పరుగులు సాధించాడు.రింకూ సింగ్ విధ్వంసకర శతకంఇక వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ జురెల్ (57 బంతుల్లో 67) మరోసారి హాఫ్ సెంచరీతో మెరవగా.. సమీర్ రిజ్వి (32) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ రింకూ సింగ్ విధ్వంసకర శతకంతో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కేవలం 56 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రింకూ.. మొత్తంగా 60 బంతుల్లో 106 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న ప్రశాంత్ వీర్ (14 బంతుల్లో 12).. రింకూతో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.367 పరుగులుఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో యూపీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 367 పరుగులు చేశాడు. చండీగఢ్ బౌలర్లలో తరణ్‌ప్రీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, నిషుంక్ బిర్లా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూకు చోటు దక్కిన విషయం తెలిసిందే.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
కోహ్లి, పంత్ మెరుపులు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్లు, ఢిల్లీ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించారు. గుజరాత్‌తో ఇవాళ (డిషెంబర్ 26) జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విరాట్ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 77 పరుగులు చేయగా.. పంత్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. క్లిష్టమైన పిచ్‌పై విరాట్, పంత్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. విరాట్, పంత్ ఔటయ్యాక హర్ష్ త్యాగి (40) కాస్త నిలకడగా ఆడాడు. చివర్లో సిమర్జీత్ సింగ్ (15 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్లు విశాల్ జేస్వాల్ (10-0-42-4), రవి బిష్ణోయ్ (10-0-50-2) ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అర్జన్ నగస్వల్లా, కెప్టెన్ చింతన్ గజా తలో వికెట్ తీశారు. మిగతా ఢిల్లీ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 1, అర్పిత్ రాణా 10, నితీశ్ రాణా 12, ఆయుశ్ బదోని 12, నవ్‌దీప్ సైనీ 6, ఇషాంత్ శర్మ 5 (నాటౌట్) పరుగులు చేయగా.. ప్రిన్స్ యాదవ్ డకౌటయ్యాడు.3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలులిస్ట్-ఏ ఫార్మాట్ అంటేనే పునకాలు తెప్పించే విరాట్ కోహ్లి గత కొంతకాలంలో ఈ ఫార్మాట్లో పీక్స్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతని ప్రదర్శనలు చెప్పనశక్యంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. దేశవాలీ స్థాయిలో (VHT 2025-26) సెంచరీ, హాఫ్ సెంచరీతో పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. గత 6 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌ల్లో విరాట్ స్కోర్లు..- 74*(81)- 135(120)- 102(93)- 65*(45)- 131(101)- 77(61) -
వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత పురస్కారం
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం లభించింది. పద్నాలుగేళ్లకే ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న ఈ చిచ్చరపిడుగును.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (Pradhan Mantri Rashtriya Bal Puraskar) వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు శుక్రవారం ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తొలుత దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రంజీల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడి (12)గా రికార్డు సాధించాడు.ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీఅనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం ద్వారా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట బౌలింగ్ విభాగం ఉన్న జట్టుపై కేవలం 35 బంతుల్లోనే శతకం బాది.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు.భారత అండర్-19 జట్టు తరఫున మెరుపులుప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలోనూ యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. ఇటీవల అండర్-19 ఆసియా కప్-2025లోనూ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. తాజాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో బిహార్ వైస్ కెప్టెన్‌గా బరిలో దిగిన వైభవ్.. మరోసారి దుమ్ములేపాడు.అరుణాచల్ ప్రదేశ్‌తో బుధవారం మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 150 పరుగుల మార్కు దాటిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.అత్యున్నత పురస్కారంఇలా చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీని.. పిల్లలకు అందించే అత్యున్నత పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న వైభవ్.. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతాడు. VIDEO | Delhi: Young cricketer Vaibhav Suryavanshi conferred with Pradhan Mantri Rashtriya Bal Puraskar.(Source: Third Party)#VaibhavSuryavanshi (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/JrKqy7ziTN— Press Trust of India (@PTI_News) December 26, 2025కాగా 5-18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు సాహసం, సంస్కృతి, వాతావరణం, నవకల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు తదితర విభాగాల్లో ప్రధాన్ మంత్రి బాల్ పురస్కార్ అందజేస్తారు.టోర్నీ నుంచి అవుట్భారత అండర్-19 జట్టు తదుపరి జింబాబ్వే పర్యటనతో బిజీ కానుంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జనవరి 15 నుంచి జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మిగిలిన మ్యాచ్‌లకు వైభవ్ సూర్యవంశీ దూరం కానున్నాడు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఢిల్లీ స్టార్ విరాట్ కోహ్లి శతకం చేజార్చుకున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సెంచరీకి ఇరవై మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి కోహ్లి దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. రోహిత్ తన సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కోహ్లి సైతం తన జట్టు ఢిల్లీకి ఆడుతున్నాడు.ఆంధ్రపై శతక్కొట్టిన కోహ్లి..ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రపై శతక్కొట్టిన (101 బంతుల్లో 131) కోహ్లి.. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాడు. ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా బెంగళూరు వేదికగా గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 😎1️⃣3️⃣1️⃣ runs 1️⃣0️⃣1️⃣ balls 1️⃣4️⃣ fours 3️⃣ sixes A terrific knock from Virat Kohli as he guided Delhi to a 4️⃣-wicket victory against Andhra 👏 He also completed 1️⃣6️⃣0️⃣0️⃣0️⃣ runs in Men’s List A cricket 🫡 @IDFCFIRSTBank | @imVkohli |… pic.twitter.com/kCfdl3yux1— BCCI Domestic (@BCCIdomestic) December 24, 202529 బంతుల్లోనేఅయితే, ఆదిలోనే గుజరాత్ బౌలర్లు ఢిల్లీని దెబ్బకొట్టారు. ప్రియాన్ష్ ఆర్య (7 బంతుల్లో 1)ను కెప్టెన్ చింతన్ గజా వెనక్కి పంపగా.. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే మరో ఓపెనర్ అర్పిత్ రాణా (31 బంతుల్లో 10)ను విశాల్ జైస్వాల్ అవుట్ చేయగా.. కోహ్లి బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు.మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న కోహ్లి.. తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. మొత్తంగా 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 77 పరుగులు సాధించాడు. అయితే, విశాల్ జైస్వాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో నితీశ్ రాణా (12) తేలిపోగా.. కెప్టెన్ రిషభ్ పంత్, ఆయుశ్ బదోనిలపై భారం పడింది. 27 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి ఢిల్లీ 129 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచ్‌లలో కోహ్లి మూడు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తొలి, రెండో మ్యాచ్‌లలో శతక్కొట్టిన కోహ్లి.. ఢిల్లీ తరఫు పునరాగమనంలోనూ సెంచరీతో అలరించాడు. కింగ్ ఫామ్ చూసి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో.. ‘‘సంతోషం పట్టలేకపోతున్నాం.. పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా బెంగళూరులో కోహ్లి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ చెట్లెక్కి మరీ విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. UPDATE: కోహ్లి, పంత్ మెరుపులు.. ఢిల్లీ స్కోరెంతంటే?చదవండి: మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్! -
మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్!
టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు టీమిండియా విధుల్లో లేని స్టార్లంతా దేశవాళీ క్రికెట్ బాట పట్టిన విషయం తెలిసిందే.దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తమకు తిరుగులేదని నిరూపించుకున్న ఈ ఇద్దరు.. సొంత జట్ల తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగారు. ముంబై ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు వన్‌డౌన్ బ్యాటర్‌గా కోహ్లి బుధవారం దర్శనమిచ్చారు.62 బంతుల్లోనే శతక్కొట్టి..ఇక తమ తొలి మ్యాచ్‌లో ముంబై సిక్కిం వంటి పసికూనతో తలపడగా.. రోహిత్ శర్మ కేవలం 62 బంతుల్లోనే శతక్కొట్టి.. తన లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 18 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 155 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.ఇప్పుడు గోల్డెన్ డక్!తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఉత్తరాఖండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్‌లో జగ్మోహన్ నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో జైపూర్‌లో మొన్న (బుధవారం) రోహిత్ శర్మ సెంచరీ చూసిన అభిమానులు.. ఇప్పుడు అదే వేదికపై అతడు ఇలా తేలిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లి సైతం శతక్కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్#VijayHazareTrophy Golden duck for rohit sharma pic.twitter.com/mwsH4O7aRt— vaibhav dhakad (@Pkmbk123) December 26, 2025 -
ఐపీఎల్ వద్దు పొమ్మంది.. కట్‌చేస్తే.. డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు.అలా కలలు కంటున్న వారిలో ఒడిశాకు చెందిన స్వస్తిక్ సామల్ ఒకరు. 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతీసారి అతడికి నిరాశే ఎదురు అవుతోంది. ఐపీఎల్-2026 మినీ వేలంలో కూడా అతడు తన పేరును రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు.అయితే దురదృష్టవశాత్తూ తుది వేలం జాబితాలో (369 మంది) అతడికి చోటు దక్కలేదు. కానీ అతడు కొంచెం కూడా దిగులు చెందలేదు. తన సత్తాను మైదానంలోనే చూపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టు ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు.డబుల్ సెంచరీతో వీర వీహారం..విజయ్ హాజారే ట్రోఫీ-2025లో భాగంగా అలూర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో స్వస్తిక్ సామల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అలూర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 169 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 212 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది.అయితే ఈ లక్ష్యాన్ని సౌరాష్ట్ర 5 వికెట్లు కోల్పోయి చేధించేసింది. ఒడిశా ఓడిపోయినప్పటికి స్వస్తిక్ సామల్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఒడిశా ప్లేయర్‌గా స్వస్తిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఐదవ ఆటగాడిగా ఏకంగా సంజూ శాంసన్ (212*) రికార్డును సమం చేశాడు. దీంతో సామల్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిచూపుతున్నారు.ఎవరీ సమాల్?25 ఏళ్ల స్వస్తిక్ సామల్.. ఒడిశాలోని కోరాపుట్‌లో జన్మించాడు. అయితే అతడికి చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కవ. 10 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ఆ తర్వాత స్ధానికంగా ఓ క్రికెట్ అకాడమీలో అతడు చేరాడు.అనంతరం ఒడిశా అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అతడికి 2019లో ఒడిశా సీనియర్ జట్టు తరపున ఆడే అవకాశముంది. తొలుత అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మిజోరంపై టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది లిస్ట్-ఎ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టీ20, లిస్ట్-ఎలో అద్భుతంగా రాణించడంలో అతడు రెండేళ్ల కిందట ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పుడు ఒడిశా జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్‌గా వచ్చి దూకుడగా ఆడడం అతడి స్పెషాలిటి. ముఖ్యంగా టీ20 టీ20 ఫార్మాట్లో పవర్ ప్లే ఓవర్లను అద్భుతంగా ఉపయోగించుకునే సత్తా అతడికి ఉంది. గ్రౌండ్ నలుమూలలా కూడా అతడు షాట్లు ఆడగలడు. స్వస్తిక్ సామల్ అండర్-16, అండర్-19 ,అండర్-23 స్థాయిలలో ఒడిశా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతడు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 686 పరుగులతో పాటు లిస్ట్-ఎ క్రికెట్లో 521 రన్స్ నమోదు చేశాడు. అదేవిధంగా టీ20ల్లో 13 మ్యాచ్‌లు 362 పరుగులు చేశాడు. అయితే మూడు ఫార్మాట్లలోనూ అతడి పేరిట సెంచరీ ఉంది. -
అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆడే భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్ దేశీ వన్డే టోర్నీలో శుభారంభం అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ నయా ఫినిషర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌ను విజయంతో ఆరంభించాడు.ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 84 పరుగుల తేడాతో హైదరాబాద్ (HYD vs UP)పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఉత్తరప్రదేశ్. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు సాధించింది. అదరగొట్టిన జురెల్, ఆర్యన్, రింకూధ్రువ్ జురేల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రింకూ సింగ్ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు.ఇక హైదరాబాద్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా... రక్షణ్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (53; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా... రాహుల్ బుద్ధి (47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (45; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.జీషాన్ అన్సారీకి 4 వికెట్లుఉత్తరప్రదేశ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూకశ్మీర్ 10 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై... బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై... బెంగాల్ 3 వికెట్ల తేడాతో విదర్భపై విజయాలు సాధించాయి. ఇక ఎలైట్ గ్రూప్ ‘సి’లో హిమాచల్ ప్రదేశ్ 95 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై... గోవా 6 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై... పంజాబ్ 51 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి.మరోవైపు.. గ్రూప్ ‘ఎ’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 145 పరుగుల తేడాతో త్రిపురపై... తమిళనాడు 101 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై... మధ్యప్రదేశ్ 99 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై విజయాలు సాధించాయి.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్! -
ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్‌లోని తొలి మ్యాచ్.. దాదాపు ప్రతీ బౌలర్‌కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.62 బంతుల్లోనే జైపూర్ వేదికగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్-ఎ క్రికెట్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్ స్టేడియానికి వచ్చారు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్ ఆర్పీ సింగ్ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!‘‘గంభీర్ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్ ఇన్నింగ్స్ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్ ట్రోల్ అవుతున్నాడు. శతక్కొట్టిన కోహ్లికాగా ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్ ఆర్య (74), నితీశ్ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్! -
ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డు
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 500కు పైచిలుకు పరుగులతో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్.. జట్టుకు తొలి టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టి.. ఏకంగా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించున్నాడు.టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ.. తాజాగా దేశీ వన్డే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక (Karnataka vs Jharkhand)తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్స్‌ల సాయంతో 125 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డుఈ క్రమంలో అతడు 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అదే విధంగా ఓ ప్రపంచ రికార్డును కూడా ఇషాన్ కిషన్ ఈ సందర్భంగా తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ సందున్ వీరక్కడి 39 బంతుల్లో శతక్కొట్టగా.. తాజాగా ఈ రికార్డును ఇషాన్ సవరించాడు. తద్వారా ప్రపంచంలోనే లిస్ట్-ఎ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు👉ఇషాన్ కిషన్- 33 బంతుల్లో- 2025లో జార్ఖండ్ తరఫున కర్ణాటక మీద👉సందున్ వీరక్కడి- 39 బంతుల్లో- 2019లో సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున బదురేలియా స్పోర్ట్స్ క్లబ్ మీద👉ఉర్విల్ పటేల్- 41 బంతుల్లో- 2023లో గుజరాత్ తరఫున అరుణాచల్ ప్రదేశ్ మీద👉మార్క్ బౌచర్- 44 బంతుల్లో- 2006లో సౌతాఫ్రికా తరఫున జింబాబ్వే మీద.ఇషాన్ దంచి కొట్టినాఇదిలా ఉంటే.. కర్ణాటకతో మ్యాచ్‌లో ఇషాన్ దంచి కొట్టినా ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 5 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. విరాట్ సింగ్ (68 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుమార్ కుషాగ్ర (47 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. కర్ణాటక బౌలర్లు ఏకంగా 47 ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడంతో జార్ఖండ్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. అభిలాష్ శెట్టి 4 వికెట్లు పడగొట్టాడు.పడిక్కల్ భారీ సెంచరీతోఅనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 413 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దేవదత్ పడిక్కల్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 54; 10 ఫోర్లు), అభినవ్ మనోహర్ (32 బంతుల్లో 56 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించగా... ధ్రువ్ ప్రభాకర్ (22 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), క్రిష్ణన్ శ్రీజిత్ (38), కరుణ్ నాయర్ (29), రవిచంద్రన్ స్మరణ్ (27) తలా కొన్ని పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో సౌరభ్ శేఖర్, ఉత్కర్ష్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2025-26లో తొలి రోజే అద్భుతాలు జరిగాయి. ఇవాళ ఒక్క రోజు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో టాప్-8లోని మూడు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదయ్యాయి. బిహార్ ఆటగాడు సకీబుల్ గనీ 32 బంతుల్లో శతక్కొట్టి, లిస్ట్-ఏలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా అవతరించగా.. ఝార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ 33 బంతుల్లో, వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు, ఎనిమిదో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు.వీరు మాత్రమే కాక ఇవాళే మరో ముగ్గురు స్టార్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేశారు. టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ (ముంబై), విరాట్ కోహ్లి (ఢిల్లీ).. అప్‌కమింగ్ స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ (కర్ణాటక) శతక్కొట్టుడు కొట్టారు. ఇవాళే ఓ అనామక ఆటగాడు డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఒడిషాకు చెందిన స్వస్తిక్ సమల్ సౌరాష్ట్రపై ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా విజయ్ హజారే ట్రోఫీ 2025-25 ఎడిషన్ తొలి రోజు శతకాల మోత (22) మోగింది. పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ 33 బంతుల శతకం వృధాఇదిలా ఉంటే, ఇవాళ కర్ణాటకపై ఇషాన్ కిషన్ చేసిన 33 బంతుల శతకం వృధా అయ్యింది. ఇషాన్ కిషన్ శతక్కొట్టుడు కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఝార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 412 పరుగుల అతి భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దేవదత్ పడిక్కల్ వీరోచితంగా పోరాడి కర్ణాటకకు చారిత్రక విజయాన్ని అందించాడు. భారీ లక్ష్య ఛేదనలో పడిక్కల్ 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేసి కర్ణాటకను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఆతర్వాత అభినవ్ మనోహర్ (56 నాటౌట్), ధృవ్ ప్రభాకర్ (40 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి కర్ణాటకను గెలుపు తీరాలు దాటించారు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ 10, 11, 12, 13, 14, 15 వేల పరుగులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. విరాట్ 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని కేవలం 343 మ్యాచ్‌ల్లో తాకాడు.విరాట్‌కు ముందు భారత్ తరఫున సచిన్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. సచిన్ 551 మ్యాచ్‌ల్లో 21999 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రహాం గూచ్ (22211), గ్రేమ్ హిక్ (22059) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 16000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో తొలి పరుగు పూర్తి చేయగానే విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ కూడా చేశాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్య ఛేదనలో 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ జట్టు ఢిల్లీ గెలవాలంటే ఇంకా 79 పరుగులు చేయాలి. విరాట్‌తో పాటు నితీశ్ రాణా (37) క్రీజ్‌లో ఉన్నాడు. 27.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 220/2గా ఉంది. అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశ్ కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆంధ్ర తరఫున రికీ భుయ్ (122) సెంచరీ చేశాడు. ఆ జట్టు కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23 పరుగులకు ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. -
శతక్కొట్టిన విరాట్ కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ కుడిచేతి వాటం ఆటగాడు వరుస శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన విరాట్.. మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (45 బంతుల్లో 65) సాధించాడు.ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి (Virat Kohli)... వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.298 పరుగులుఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రిక్కీ భుయ్ (122) సెంచరీ చేయగా.. షేక్ రషీద్ 31, కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23, హేమంత్ రెడ్డి 27, సింగుపురం ప్రసాద్ 28 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆంధ్ర ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.శతక్కొట్టిన విరాట్ కోహ్లిఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్పిత్ రాణా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (74) బాదగా.. అతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 131 పరుగులు చేశాడు. రాజు బౌలింగ్‌లో షేక్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.చదవండి: తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర -
రోహిత్ శర్మ మెరుపు శతకం
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రారంభమైన తొలి రోజే సెంచరీల మోత మోగుతుంది. తొలుత యువ చిచ్చరపిడుగు, ఆతర్వాత పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకాలు బాదారు.సిక్కింతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ కేవలం 61 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 91 బంతుల్లో 150 పరుగుల మార్కును కూడా దాటాడు. విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ 17 ఏళ్ల తర్వాత సాధించిన శతకం ఇది.సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ ఈ సూపర్ ప్రదర్శన చేశాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై కూడా పరుగుల వరద పారించాడు. ఆసీస్‌పై సెంచరీ, హాఫ్ సెంచరీ.. ఆతర్వాత సౌతాఫ్రికాపై రెండు హాఫ్ సెంచరీలు చేసి, 38 ఏళ్ల లేటు వయసులోనూ శభాష్ అనిపించుకున్నాడు.సిక్కింతో మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శతక్కొట్టుడుతో ముంబై విజయానికి చేరువగా ఉంది. 29.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 226 పరుగులు చేసి, లక్ష్యానికి 11 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ 93 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా ముషీర్ ఖాన్ (25) ఉన్నాడు. -
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
జార్ఖండ్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి.. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.అంతేకాదు.. జార్ఖండ్‌కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలోనూ సారథిగా జార్ఖండ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan). ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎ లో ఉన్న జార్ఖండ్ కర్ణాటకతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.మెరుపు అర్ధ శతకాలుఅహ్మదాబాద్ వేదికగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 412 పరుగులు సాధించింది. ఓపెనర్లలో శిఖర్ మోహన్ (44) ఫర్వాలేదనిపించగా.. ఉత్కర్ష్ సింగ్ (8) విఫలమయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ శుభ్ శర్మ 15 పరుగులే చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన విరాట్ సింగ్ (68 బంతుల్లో 88), కుమార్ కుశాగ్రా (47 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో దుమ్ములేపారు.ఆకాశమే హద్దుగాఇక ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్ చరిత్రకెక్కాడు.నిజానికి విజయ్ హజారే తాజా సీజన్ ఆరంభానికి ముందు లిస్ట్-ఎ క్రికెట్ ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా పంజాబీ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ (35 బంతుల్లో 115*) ఉన్నాడు. అయితే, బుధవారం నాటి మరో మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ మీద బిహార్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో శతకం బాది అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.వైభవ్ రికార్డు బద్దలుకానీ కాసేపటికే వైభవ్‌ను అధిగమించి.. ఇషాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. బిహార్ కెప్టెన్ సకీబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి.. అన్మోల్ప్రీత్ సింగ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరగా.. ఇషాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. కర్ణాటకతో మ్యాచ్‌లో ఇషాన్ మొత్తంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్స్‌లు బాది 125 పరుగులు సాధించాడు.మిగతా వారిలో అనుకూల్ రాయ్ (13), రాబిన్ మింజ్ (0) విఫలం కాగా.. సుశాంత్ మిశ్రా (1), సౌరభ్ శేఖర్ (0) అజేయంగా నిలిచారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు తీయగా.. విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు.. ధ్రువ్ ప్రభాకర్ ఒక వికెట్ పడగొట్టారు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన భారత ఆటగాళ్లు👉సకీబుల్ గని- 32 బంతుల్లో👉ఇషాన్ కిషన్- 33 బంతుల్లో👉అన్మోల్ప్రీత్ సింగ్- 35 బంతుల్లో👉వైభవ్ సూర్యవంశీ- 36 బంతుల్లో. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
‘వన్డే’ల్లో వరల్డ్ రికార్డు.. ఇది టెస్టు స్కోరు కాదు సామీ!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుతం జరిగింది. లిస్ట్-ఎ క్రికెట్లో (వన్డే) అత్యధికస్కోరు సాధించిన జట్టుగా బిహార్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 574 పరుగులు సాధించి ఈ ఫీట్ అందుకుంది.విధ్వంసకర సెంచరీలుచాలా సందర్భాల్లో టెస్టు ఇన్నింగ్స్‌లోనూ సాధ్యంకాని రీతిలో ఈ మేరు అత్యంత భారీ స్కోరు సాధించి.. బిహార్ సరికొత్త చరిత్ర లిఖించింది. కెప్టెన్ సకీబుల్ గనీ, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన విధ్వంసకర శతకాల కారణంగానే ఇది సాధ్యమైంది. రాంచి వేదికగా టాస్ గెలిచిన బిహార్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో మంగళ్ మహ్రౌర్ (33) ఫర్వాలేదనిపించగా.. వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 15 సిక్స్‌ల సాయంతో 190 పరుగులు చేసి.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్సయ్యాడు.ఆ ఇద్దరూ శతొక్కొట్టేశారు!వన్‌డౌన్‌లో వచ్చిన పీయూశ్ సింగ్ సైతం అర్ధ శతకం (77)తో మెరవగా.. నాలుగో స్థానంలో ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆయుశ్ లొహరుకా అద్భుత శతకం (56 బంతుల్లో 116) సాధించాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్‌గా వచ్చిన కెప్టెన్ సకీబుల్ గని కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టి.. వైభవ్ రికార్డును బ్రేక్ చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 40 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు బాదిన గని.. 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో బిపిన్ సౌరభ్ (1), ఆకాశ్ రాజ్ (8) విఫలం కాగా.. సూరజ్ కశ్యప్ మూడు పరుగులతో.. గనీతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో బిహార్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 574 పరుగులు స్కోరు చేసింది.ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరుకాగా లిస్ట్-ఎ క్రికెట్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతకు ముందు ఈ రికార్డు తమిళనాడు పేరిట ఉండేది. విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్లో తమిళనాడు జట్టు.. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లోనే రెండు వికెట్ల నష్టానికి 506 పరుగులు సాధించింది. తాజాగా వరల్డ్ రికార్డును బిహార్ తిరగరాసింది.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు👉బిహార్- అరుణాచల్ ప్రదేశ్ మీద 2025లో 574/6👉తమిళనాడు- అరుణాచల్ ప్రదేశ్ మీద 2022లో 506/2👉ఇంగ్లండ్- నెదర్లాండ్స్ మీద 2022లో 498/4👉సర్రే- గ్లౌసెస్టర్షైర్ మీద 2007లో 496/4 👉ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మీద 2018లో 481/6.చదవండి: IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరం -
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్-ఎ క్రికెట్లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ బుధవారం మొదలైంది.ప్లేట్ గ్రూపులో భాగంగా.. రాంచి వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బిహార్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో మంగళ్ మహ్రౌర్ 43 బంతుల్లో 33 పరుగులు చేసి నిష్క్రమించగా.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడుఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయి అందుకున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. పద్నాలుగేళ్ల 272 రోజుల వయసులో వైభవ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century)ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ కోరే ఆండర్సన్, గ్రాహమ్ రోస్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.ఇక ఈ లిస్టులో జేక్ ఫ్రేజర్ మెగర్క్ (29 బంతుల్లో 125), ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో 149), అన్మోల్ప్రీత్ సింగ్ (35 బంతుల్లో 115*) వైభవ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో.. పంజాబీ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ తర్వాత రెండో ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలుఇక సెంచరీ తర్వాత కూడా తన జోరును కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో 64 బంతుల్లోనే 150 పరుగులు చేసిన సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ బద్దలు కొట్టాడు. డబుల్ సెంచరీ మిస్డబుల్ సెంచరీ మిస్ దిశగా దూసుకువెళ్లిన వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. టెచి నెరి బౌలింగ్‌లో షాట్ ఆడే క్రమంలో టెచి డోరియాకు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మొత్తంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో84 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 16 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 190 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచాడు. ఇక 30 ఓవర్లలో బిహార్ రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 282 పరుగులు సాధించింది. -
నితీశ్ రెడ్డి వర్సెస్ రిషభ్ పంత్!.. కోహ్లి వచ్చేశాడు
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌కు బుధవారం తెరలేచింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు... స్టార్లతో నిండి ఉన్న ఢిల్లీ టీమ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.బెంగళూరు వేదికగా విరాట్ కోహ్లి (Virat Kohli), రిషభ్ పంత్ (Rishabh Pant)తో కూడిన ఢిల్లీ జట్టుపై మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నిలవనున్న నేపథ్యంలో... మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం.నితీశ్ రెడ్డి వర్సెస్ రిషభ్ పంత్టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండగా... శ్రీకర్ భరత్, రికీ భుయ్, అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. సత్యనారాయణ రాజు, వినయ్, స్టీఫెన్ బౌలింగ్ భారం మోయనున్నారు.బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా ఆంధ్ర జట్టుతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో నితీశ్ రెడ్డి సేన బ్యాటింగ్‌కు దిగనుంది.ఆంధ్ర వర్సెస్ ఢిల్లీ తుదిజట్లుఆంధ్రశ్రీకర్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్ హెబ్బార్, షేక్ రషీద్, రికీ భుయ్, నితీశ్ కుమార్ రెడ్డి(కెప్టెన్), సౌరభ్ కుమార్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, కేఎస్ నరసింహ రాజు, త్రిపురాణ విజయ్, సత్యనారాయణ రాజు, SDNV ప్రసాద్.ఢిల్లీఅర్పిత్ రాణా, ప్రియాంష్ ఆర్య, విరాట్ కోహ్లీ, నితీష్ రాణా, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుశ్ బదోని, సిమర్జీత్ సింగ్, హర్ష్ త్యాగి, ఇషాంత్ శర్మ, ప్రిన్స్ యాదవ్, నవదీప్ సైనీ.రోహిత్ కూడా వచ్చేశాడుఇక గ్రూప్-సిలో భాగంగా ముంబైతో మ్యాచ్‌లో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లి మాదిరే రోహిత్ శర్మ కూడా ఛేదనలోనే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.ముంబై తుదిజట్టురోహిత్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేష్ లాడ్, ముషీర్ ఖాన్, హార్దిక్ టామోర్ (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా.సిక్కిం తుదిజట్టులీ యోంగ్ లెప్చా (కెప్టెన్), ఆశిష్ థాపా (వికెట్ కీపర్),అమిత్ రాజేరా, రాబిన్ లింబూ, గురీందర్ సింగ్, క్రాంతి కుమార్, పల్జోర్ తమాంగ్, అంకుర్ మాలిక్, కె సాయి సాత్విక్, ఎండీ సప్తుల్లా, అభిషేక్ కేఆర్ షా.చదవండి: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. జాతీయ జట్టులో ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ టోర్నీల్లో తప్పక ఆడాల్సిందే అనే నిబంధనల నేపథ్యంలో... స్టార్ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. టి20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి పలువురు టీమిండియా ప్లేయర్లు తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘కింగ్’ కోహ్లి విజయ్ హజారే టోర్నీలో ఆడి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. కోహ్లి చివరగా ఈ టోర్నీ బరిలోకి దిగిన సమయంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలవలేదు... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు... మహేంద్ర సింగ్ ధోనీ భారత టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు... రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ భారత మిడిలార్డర్లో పరుగుల వరద పారిస్తున్నారు! తొలిసారి ఈ టోర్నీ ఆడే సమయానికి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోని కోహ్లి... ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ తిరిగి విజయ్ హజారే టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి... 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలనుకుంటున్న నేపథ్యంలో... ఫామ్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఈ టోర్నీ తొలి దశ మ్యాచ్‌లు ఆడనున్నట్లు వెల్లడించాడు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు ఒక హాఫ్‌సెంచరీతో మూడొందలకు పైగా పరుగులు చేసిన విరాట్... అదే జోరు దేశవాళీల్లోనూ కొనసాగిస్తాడా చూడాలి. ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ 2017–18లో చివరగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. » మొత్తం 32 ఎలైట్ జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఎనిమిదేసి జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో... ఒక్కో జట్టు మిగిలిన ఏడు జట్లతో తలపడుతుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. » బెంగళూరు, జైపూర్, రాజ్‌కోట్, అహ్మదాబాద్... ఈ నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నా... ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా అభిమానులు మృతిచెందడంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి లభించలేదు. » ఈ టోర్నీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లు బెంగళూరులో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడే అవకాశం ఉండటంతో పోలీసులు మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఢిల్లీ, ఆంధ్ర మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానానికి తరలించారు. » గతంలో విరాట్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగినప్పుడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం అభిమానులతో నిండిపోయింది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. » ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన రోహిత్ శర్మ... దక్షిణాఫ్రికాపై సైతం మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెరీర్‌ను పొడిగించుకోవాలనే లక్ష్యంతోనే భారీగా బరువు తగ్గిన ‘హిట్‌మ్యాన్’ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా సిక్కిం, గోవాతో ముంబై తలపడనుంది. » టీమిండియా టి20 కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్‌పై కూడా అందరి దృష్టి నిలవనుంది. ఏడాది కాలంగా విఫలమవుతున్న సూర్యకుమార్... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో సిరీస్ వరకు లయ అందుకునేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుంది. » ఈ ఏడాది టి20ల్లో సూర్యకుమార్ సగటు 12.84 కాగా... స్ట్రయిక్ రేట్ 117.87. ఇది అతడి స్థాయికి ఏమాత్రం తగినది కాదు. గత 22 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేసుకోలేదు. అయితే వచ్చే ఏడాది టి20 వరల్డ్‌కప్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కించుకున్న సూర్య... మెగా టోర్నీకి ముందు విజయ్ హజారే టోర్నీ ద్వారా ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. » కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ సారథ్యం వహించనున్నాడు. విరాట్ ఆరంభ మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... రిషభ్ టోర్నీ మొత్తం అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం కేవలం భారత టెస్టు జట్టులోనే కొనసాగుతున్న పంత్... పరిమిత ఓవర్లలో పునరాగమనం చేసేందుకు ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడనుంది. » ఇటీవల జరిగిన దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అది్వతీయ ప్రదర్శనతో జార్ఖండ్ జట్టుకు టైటిల్ అందించిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్... ఈ ఆటతీరులో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడతడు... విజయ్ హజారేలో సైతం అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. » గతేడాది ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 2024–25 సీజన్లో అతడు 8 ఇన్నింగ్స్‌ల్లో 389.5 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు సైతం ఉన్నాయి. దీంతో పాటు రంజీల్లోనూ రాణించిన అతడికి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. » ఐపీఎల్ మినీ వేలం ముగిసినప్పటికీ... ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లపై ఫ్రాంచైజీలు దృష్టి సారించడం ఖాయం. గతంలో ఈ టోర్నీ ఆటతీరు ఆధారంగా... స్మరణ్, మయాంక్ ఐపీఎల్ అవకాశాలు దక్కించుకున్నారు. » ఫలితాలపై వాతావరణం ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో మ్యాచ్‌లన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టుపై ఎలాంటి మంచు ప్రభావం పడే అవకాశం లేదు. » ఇక టి20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్‌మన్ గిల్‌పై కూడా అందరి దృష్టి నిలవనుంది. అభిషేక్ శర్మ సారథ్యంలో పంజాబ్ జట్టు తరఫున గిల్ బరిలోకి దిగనున్నాడు. » ప్రస్తుతం భారత జట్టులో పేస్ బౌలర్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పని భారం ఎక్కువవుతుండగా... ఇతర పేసర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ స్పీడ్ స్టార్ మొహమ్మద్ సిరాజ్‌ను సెలెక్టర్లు కేవలం టెస్టు ఫార్మాట్‌కే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో తదుపరి తరం పేసర్లు ఎవరనేదానికి ఈ టోర్నీ ద్వారా సమాధానం లభిస్తుందా చూడాలి. గుర్జపనీత్ సింగ్ (తమిళనాడు), గుర్నూర్ బ్రార్ (పంజాబ్), యు«ద్వీర్ సింగ్ (జమ్మూ కశ్మీర్), అనూజ్ (హరియాణా), షకీబ్ హుసేన్ (బిహార్) రూపంలో పలువురు యువ పేసర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు.హైదరాబాద్ X ఉత్తర ప్రదేశ్ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్‌లో జరగనున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో హైదరాబాద్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ సారథ్యం వహిస్తుండగా... రాహుల్ బుద్ధి వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన చేసి... సునాయాసంగా ‘సూపర్ లీగ్’కు చేరిన హైదరాబాద్... చివరి మ్యాచ్‌లో పరాజయంతో ఫైనల్ ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. కెప్టెన్ రాహుల్ సింగ్‌తో పాటు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, అమన్ రావు, అభిరథ్ రెడ్డి, కార్తికేయ, రక్షణ్ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో జట్టులో ప్రియం గార్గ్, ధ్రువ్ జురెల్, కార్తీక్ త్యాగి, సమీర్ రిజ్వీ, రింకూ సింగ్ కీలకం కానున్నారు. -
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కర్ణాటకలోని ఆలూర్‌లో జనవరి 6, 8న జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్ర జట్టుకు జడేజా ప్రాతినిథ్యం వహిస్తాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదుఈ క్రమంలో ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడ్డూను.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. దీంతో వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడా అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నాడు స్పందిస్తూ.. ‘‘మా ప్రణాళికల్లో అతడు భాగమే. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. నాడు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చాం.అయితే, ఆసీస్టూర్లో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాషీ, కుల్దీప్లతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ పరిస్థితులకు తగ్గట్లే జట్టును ఎంపిక చేశాము’’ అని జడ్డూను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.సఫారీలతో సిరీస్‌లో సత్తా చాటిన జడ్డూఅయితే, ఈ టూర్ తర్వాత స్వదేశంలో ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA) తో జరిగిన వన్డే సిరీస్‌కు జడేజాను ఆడించింది యాజమాన్యం. తొలి వన్డేలో 20 బంతుల్లోనే 32 పరుగులు చేసిన జడ్డూ.. రెండో వన్డేలో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సిరీస్‌లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.కాగా టీమిండియా తరఫున విధుల్లో లేని సమయంలో ఆటగాళ్లంతా దేశీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవలే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాయం, ఫిట్నెస్ సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా తమ జట్లు ముంబై, ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.ఇక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ జట్ల తరఫున ఆడేందుకు సిద్ధం కాగా.. తాజాగా జడ్డూ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా లిస్-ఎ క్రికెట్లో లెఫ్టాండర్ జడేజా 260 మ్యాచ్‌లు ఆడి.. 3911 పరుగులు చేయడంతో పాటు 293 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న తర్వాత.. టీమిండియా స్టార్లు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీ అవుతారు.చదవండి: Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో.. -
Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో..
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు పదిహేనేళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ వన్డే టోర్నమెంట్ బరిలో దిగనున్నాడు. ఆంధ్ర జట్టుతో బుధవారం (డిసెంబరు 24) నాటి మ్యాచ్ సందర్భంగా కోహ్లి మరోసారి ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కెప్టెన్.ఇక ఐపీఎల్లో కోహ్లి ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీకి సొంత మైదానం అయిన.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక కావడం మరో విశేషం. కాగా 2010లో కోహ్లి చివరగా విజయ్ హజారే ట్రోఫీ (VHT) టోర్నీ ఆడాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున 16 పరుగులు సాధించాడు.వరుస సెంచరీలుఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. మూడో వన్డేలో ధనాధన్ ఫిఫ్టీతో ఫామ్‌లోకి వచ్చాడు.అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగి ఆకట్టుకున్నాడు. ప్రొటిస్‌తో తొలి వన్డేల్లో ఏకంగా 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో వన్డేలోనూ 102 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 53 శతకాలతో ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రొటిస్‌తో మూడో వన్డేలోనూ కేవలం 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు కోహ్లి.చరిత్రకు ఒక్క పరుగు దూరంలోఅంతర్జాతీయ వన్డే కెరీర్లో 14557 పరుగులు చేసిన కోహ్లి.. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో ఓవరాల్‌గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రతో బుధవారం నాటి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌కు ముందు చరిత్రకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి ఆంధ్రతో మ్యాచ్‌లో ఒక్క రన్ చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్లో 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న భారత రెండో క్రికెటర్‌గా నిలుస్తున్నాడు.ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 21,999 పరుగులు సాధించాడు. కాగా వన్డేలతో పాటు విజయ్ హజారే ట్రోఫీ, భారత్-ఎ, జోనల్ జట్ల తరఫున సాధించిన పరుగులను లిస్ట్-ఎ జాబితాలో చేర్చుతారు. కాగా ఓవరాల్‌గా ఈ లిస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 22,211 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు👉సచిన్ టెండుల్కర్- 538 ఇన్నింగ్స్‌లో 21,999 రన్స్👉విరాట్ కోహ్లి- 329 ఇన్నింగ్స్‌లో 15,999 రన్స్👉సౌరవ్ గంగూలీ- 421 ఇన్నింగ్స్‌లో 15,622 రన్స్ 👉రోహిత్ శర్మ- 338 ఇన్నింగ్స్‌లో 13,758 రన్స్👉శిఖర్ ధావన్- 298 ఇన్నింగ్స్‌లో 12,074 రన్స్.చదవండి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్ ఎవరు? -
విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు భారీ షాక్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దాదాపు ఏడు నెలల తర్వాత ఓ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో తొమ్మిది లీగ్ మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఉంది. తొలుత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో డిసెంబర్ 24న ఆంధ్ర-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లి(Virat kohli), రిషబ్ పంత్ స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. అయితే చిన్నస్వామి స్టేడియంలో కోహ్లిని మళ్లీ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే విఎచ్టి మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మ్యాచ్‌లకు సుమారు 2,000 నుండి 3,000 మంది వరకు అభిమానులను అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. గతంలో జరిగిన విషాద ఘటన దృష్ట్యా సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపుల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు. అయితే ఇటీవలే చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఈ దేశవాళీ వన్డే టోర్నీలోని గ్రూపు-డి మ్యాచ్‌లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది.కానీ కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండడంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని కేసీఎ భావించింది. ఈ క్రమంలోనే గ్రూపు-డి మ్యాచ్‌ల వేదికను అలూర్ నుంచి చిన్నస్వామి స్టేడియంకు మార్చారు.చదవండి: IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26కు కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా కిషన్ ఎంపికయ్యాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్‌కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఇప్పుడు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో తన జట్టును విజయ పథంలో నడిపించేందుకు కిషన్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ టోర్నీలో కిషన్‌కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో విరాట్ సింగ్, అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ వంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. జార్ఖండ్ తమ తొలి మ్యాచ్‌లో డిసెంబర్ 24న కర్ణాటకతో తలపడనుంది.ఇక టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కారణంగా అతడిని సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ పాకెట్ డైన్మైట్ 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో కూడా సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత జాతీయ జట్టుకు అతడు ఎంపికయ్యాడు.విజయ్ హాజారే ట్రోఫీకి జార్ఖండ్ జట్టుఇషాన్ కిషన్ (కెప్టెన్), విరాట్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, కుమార్ కుషాగ్రా (వైస్ కెప్టెన్), రాబిన్ మింజ్, అనుకుల్ రాయ్, శరణదీప్ సింగ్, శిఖర్ మోహన్, పంకజ్ కుమార్, బాల కృష్ణ, మహ్మద్ కౌనైన్ ఖురైషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, అభినవ్ శరణ్, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజందీప్ సింగ్, శుభమ్ సింగ్.చదవండి: IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం! -
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది 'చివరి కిక్'
మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చివరి కిక్ అందనుంది. దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో దాదాపుగా అందరూ టీమిండియా స్టార్లు పాల్గొంటున్నారు. ఏడాది చివర్లో భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు వీరంతా సిద్దంగా ఉన్నారు.టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. రోహిత్ ముంబై జట్టులో, కోహ్లి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరే కాక ప్రస్తుత టీమిండియా కెప్టెన్లు శుభ్‌మన్ గిల్ (పంజాబ్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై) కూడా వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.ముంబై జట్టుకు రోహిత్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్ లాంటి టీమిండియా స్టార్లు ప్రాతినిథ్యం వహించనుండగా.. ఢిల్లీ జట్టులో కోహ్లితో పాటు రిషబ్ పంత్ (కెప్టెన్), హర్షిత్ రాణా, ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ లాంటి టీమిండియా ప్లేయర్లు, ప్రియాంశ్ ఆర్మ లాంటి ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ లాంటి టీమిండియా యువ కెరటాలు వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు, రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారధులుగా వ్యవహరించనున్నారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ పంజాబ్ జట్టుకు ఆడనున్నారు.వీరే కాక సంజూ శాంసన్ (కేరళ), మహ్మద్ షమీ (బెంగాల్), కేఎల్ రాహుల్ (కర్ణాటక), తిలక్ వర్మ (హైదరాబాద్) లాంటి టీమిండియా స్టార్లు కూడా విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నారు. అయితే జాతీయ విధుల దృష్ట్యా వీరు కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జనవరి 11 నుంచి టీమిండియా న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లకు ఎంపికైన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా తమతమ దేశవాలీ జట్లకు అందుబాటులో ఉంటారు.టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే అన్ని మ్యాచ్‌లు.. లేకపోతే కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్‌ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది. -
కలిసి బరిలోకి దిగనున్న టీమిండియా యువ కెరటాలు
టీమిండియా యువ కెరటాలు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ మరోసారి కలిసి బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి వారు ప్రాతినిథ్యం వహించనున్నది టీమిండియాకు కాదు. ఈ ముగ్గురు యువ తారలు విజయ్ హజారే వన్డే ట్రోఫీ (VHT) కోసం పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నారు.డిసెంబర్ 24 నుంచి ప్రారంభంకాబోయే విజయ్ హజారే ట్రోఫీ కోసం 18 మంది సభ్యుల పంజాబ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. ఈ జట్టులో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్‌తో పాటు రమన్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, నమన్ ధిర్ లాంటి ఐపీఎల్ స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.ఈ జట్టుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) కెప్టెన్‌ను ప్రకటించకపోవడం విశేషం. గత సీజన్లో అభిషేక్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఈ సీజన్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో ఉండటంతో PCA ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. బహుశా చివరి నిమిషంలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.కాగా, VHTలో భాగంగా పంజాబ్ డిసెంబర్ 24నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జైపూర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. భారత్-న్యూజిలాండ్ సిరీస్ కారణంగా గిల్, అభిషేక్ VHT మొత్తానికి అందుబాటులో ఉండరు. గిల్ వన్డే సిరీస్ సమయానికి.. అభిషేక్ టీ20 సిరీస్ సమయంలో పంజాబ్ జట్టుకు అందుబాటులో ఉండడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం పంజాబ్ జట్టు.. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), హర్నూర్ పన్ను, అన్మోల్ప్రీత్ సింగ్, ఉదయ్ సహరన్, నమన్ ధిర్, సలిల్ అరోరా (వికెట్‌కీపర్), సన్వీర్ సింగ్, రమన్‌దీప్ సింగ్, జషన్‌ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, రఘు శర్మ, కృష్ణ భగత్, గౌరవ్ చౌధరి, సుఖ్దీప్ బజ్వా. -
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.వన్డే జట్టులోకి వచ్చేందుకు..భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది' -
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి దేశవాళీ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ- 2025 వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టుకు షమీ ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కనబరిచిన ఫామ్‌ను.. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో కూడా కొనసాగించాలని షమీ భావిస్తున్నాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. డొమాస్టిక్ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుత దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టిన షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీసి బెంగాల్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.బెంగాల్ జట్టులో షమీతో పాటు భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ సైతం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు కెప్టెన్‌గా వెటనర్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. బెంగాల్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. బెంగాల్ తమ తొలి మ్యాచ్‌లో 24న రాజ్‌కోట్ వేదికగా తలపడనుంది.షమీ విషయానికి వస్తే.. చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్నెస్ సమస్యలు అంటూ అతడిని తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది.విజయ్ హజారే ట్రోఫీకి బెంగాల్ జట్టుఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ (వికెట్ కీపర్), చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా.చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్ -
రోహిత్ శర్మ యూటర్న్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు వార్తా సంస్థ PTIకి వెల్లడించాయి.కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. తొలుత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు.. అనంతరం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ తప్పించింది బీసీసీఐ.మునుపెన్నడూ లేని విధంగాఈ క్రమంలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. మునుపెన్నడూ లేని విధంగా మరింత ఫిట్‌గా మారి.. ఆసీస్ గడ్డ మీద శతకంతో చెలరేగిన హిట్‌మ్యాన్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, ప్రస్తుతం రోహిత్‌తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2027కి సిద్ధమయ్యే క్రమంలో రో-కో మ్యాచ్ ప్రాక్టీస్ గురించి చర్చలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బీసీసీఐ భారత జట్టులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలని ఆదేశించింది. రో-కోలకే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లి అయితే, ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ శుక్రవారం మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ముంబై జట్టుకు అందుబాటులో లేడని తెలిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీకి ప్రకటించిన జట్టులో తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. ఈ పరిణాల క్రమంలో శుక్రవారం రాత్రి ఎంసీఏ వర్గాలు మరోసారి రోహిత్ శర్మ విషయంపై స్పందిస్తూ.. అతడు కనీసం రెండు మ్యాచ్‌లకు అవైలబుల్గా ఉంటాడని స్పష్టం చేశాయి. కోహ్లి పేరు ప్రకటన తర్వాత రోహిత్ సైతం ఈ మేర యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముంబై జట్టుకు చెందిన టీమిండియా స్టార్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ శివం దూబే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా వారిద్దరికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ముంబై మాజీ కెప్టెన్ అజింక్య రహానే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మొదలుకానుంది.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు శుభవార్త.. కెప్టెన్‌గా రిషభ్ పంత్ -
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇక మరో టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్‌లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ, నవదీప్‌సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్ డిప్యూటీగా ఆయుశ్ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్ వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.2010లో చివరిసారిగాకాగా 2010లో చివరిసారిగా విరాట్ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగనున్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తాజాగా వెల్లడించాడు.విజయ్ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్ కీపర్), హర్ష్ త్యాగి, సిమర్జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ఆయుశ్ దొసేజా, దివిజ్ మెహ్రా, వైభవ్ కంద్పాల్, రోహన్ రాణా, అనూజ్ రావత్. చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
పాటిదార్ అవుట్.. కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్
వెంకటేశ్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్లో అతడు మధ్యప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్‌క్లాస్ క్రికెట్లో 20, లిస్ట్-ఎ క్రికెట్లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్‌లు ఆడాడు.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను 2025 వేలానికి ముందు రిలీజ్ చేసిన కేకేఆర్.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతంఅయితే, తాజా ఎడిషన్‌లో వెంకటేశ్ బ్యాట్, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్‌గా నియమించింది.పాటిదార్ అవుట్.. కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి, మధ్యప్రదేశ్‌కు గతేడాది విజయ్ హజారే ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ ఈ జట్టులో లేడు. కెప్టెన్‌గా అతడి స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేశాడు. ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్‌తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్ ఆటగాడు మంగేశ్ యాదవ్ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ నిర్వహించనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్ జట్టువెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్ యాదవ్, మాధవ్ తివారి (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని షాకిచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ స్వయంగా వెల్లడించాడు.కాగా ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు ఆడాలని.. లేదంటే తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని ఆదేశించింది.ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాల్సిందేడిసెంబరు 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సహా ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్‌ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టులో కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు.. తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) మాత్రం టీమిండియా సీనియర్లలో చాలా మంది విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ మాట దాటవేశాడు.అందుబాటులో లేరుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటపుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా!.. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తాం’’ అని సంజయ్ పాటిల్ తెలిపాడు.కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా.. మనుపటి కంటే సన్నబడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, విజయ్ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టులో ఉండటం లేదు.వారికే సడలింపుటీ20 ప్రపంచకప్-2026 నాటి వీరు పూర్తిస్థాయి ఫిట్‌గా ఉండటం.. గాయాల బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.ఇక గాయం నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ సారథి అజింక్య రహానే సైతం ఈ టోర్నీకి దూరం కానుండగా.. శ్రేయస్ అయ్యర్దీ ఇదే పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలోని ముంబై జట్టులో సర్ఫరాజ్ ఖాన్, అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ ముల్‌చందానికి తొలిసారిగా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా డిసెంబరు 24- జనవరి 8 వరకు విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ దశ జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్ -
మయాంక్ కెప్టెన్సీలో ఆడనున్న కేఎల్ రాహుల్
విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కర్ణాటక క్రికెట్ అసోసియేషిన్ ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణలు ఉన్నారు. దీంతో కర్ణాటక జట్టు మరింత పటిష్టంగా మారింది.బీసీసీఐ అదేశాలతో వీరిద్దరూ దేశవాళీ వన్డే టోర్నీ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా కరుణ్ నాయర్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా అండర్-23 టోర్నీలో కర్ణాటక తరపున అదరగొట్టిన హర్షిల్ ధర్మాని, ధ్రువ్ ప్రభాకర్లకు సీనియర్ జట్టులో చోటు లభించింది.ఈ టోర్నీలో ధర్మాని తమిళనాడుపై 142 పరుగులు, ప్రభాకర్ విదర్భపై 126 పరుగులతో రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా శ్రీష ఆచార్ చోటు దక్కించుకున్నాడు. కర్ణాటక తమ గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లో ఆడనుంది.ఈ టోర్నీలో కర్ణాటక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. కర్ణాటక టీమ్ తొలి మ్యాచ్‌లో డిసెంబర్ 24న జార్ఖండ్‌తో తలపడనుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సైతం ఈ టోర్నీలో ఆడనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ (వైస్ కెప్టెన్), స్మరణ్, శ్రీజిత్, అభినవ్ మనోహర్, శ్రేయాస్ గోపాల్,వ్యాషాక్, మన్వంత్ కుమార్ , శ్రీషా S ఆచార్, అభిలాష్ శెట్టి, శరత్ , హర్షిల్ ధర్మాని, కేఎల్ రాహుల్, ప్రభాకర్ చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు.. -
బీసీసీఐ కీలక ఆదేశాలు
ముంబై: ప్రస్తుత భారత జట్టులోని క్రికెటర్లు ఎవరైనా సరే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి దూరం కావద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. అవకాశం ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడాలని... లేదా కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదేశించింది. కాగా డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో భారత్ చివరి టీ20 జరిగే డిసెంబర్ 19, న్యూజిలాండ్‌తో తొలి వన్డే జరిగే జనవరి 11 మధ్య సమయంలో అవకాశం ఉన్న అన్ని మ్యాచ్‌లు ఆడాలని బోర్డు తేల్చి చెప్పింది. రో-కోలకు మా త్రమే కాకుండాఇక భారత్ తరఫున ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకే కాకుండా ఇతర రెగ్యులర్ క్రికెటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దక్షిణాఫ్రికాతో రెండో టి20 ముగియగానే ఆటగాళ్లకు ఈ విషయాన్ని బోర్డు వెల్లడించినట్లు సమాచారం.అదే విధంగా.. ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉన్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అన్‌ఫిట్‌గా తేలిస్తేనే వారికి సడలింపు ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఒకే రోజు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్, టీ20 వరల్డ్ కప్ జట్లను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. కుటుంబ సన్నిహితులు ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతోనే జస్ప్రీత్ బుమ్రా ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిసింది. అంతా బాగుంటేనే అతడు తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.క్రీడాసమాఖ్యల జాబితాలో బీసీసీఐ లేదు! న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల జాబితాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లేదని క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేసారు. త్వరలో అమల్లోకి రానున్న కొత్త క్రీడా చట్టానికి సంబంధించి లోక్‌సభలో జరిగిన చర్చపై జవాబిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉందా అంటూ టీఎంసీ ఎంపీ మాల రాయ్ అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానమిచ్చారు. చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్‌మెషీన్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా.. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరుఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్ ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరును చేర్చింది. దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. రిషభ్ పంత్ కూడాఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు కూడా ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.గంభీర్- అగార్కర్ ఒత్తిడి వల్లేనా?కోహ్లి వరల్డ్‌క్లాస్ బ్యాటర్. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.ముఖ్యంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్‌ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్‌కప్ ప్లాన్‌లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్ చెప్పడం ఇందుకు నిదర్శనం.అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్: ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి, రిషభ్ పంత్, దేవ్ లక్రా, యుగళ్ సైనీ, దివిజ్ మెహ్రా, సుజల్ సింగ్, రజ్నీశ్ దాదర్, అమన్ భార్తి, గోవింద్ మిట్టల్, సుమిత్ బెనీవాల్, శుభమ్ దూబే, కేశవ్ దబాస్, రాహుల్ చౌదరి, సమర్థ్ సేత్, శివమ్ త్రిపాఠి, అన్మోల్ శర్మ, శివమ్ గుప్తా, లక్షయ్ తరేజా, మనన్ భరద్వాజ్, రౌనక్ వాఘేలా, మయాంక్ గుసైన్, కేశవ్ ఆర్సింగ్,, లక్ష్మణ్, దివాన్ష్ రావత్, ప్రణవ్ రాజ్‌వన్షీ, ప్రన్షు విజయరణ్.చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు


