విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది దశకు చేరుకుంది. మంగళవారంతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ముగిశాయి. బెంగళూరు వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ 183 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ జట్టు తమ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అన్మోల్‌ప్రీత్ సింగ్(70),నేహల్ వధేరా(56 ), హర్నూర్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఎంపీ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, త్రిపురేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో పాటిదార్(38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సంవీర్ సింగ్ మూడు, గుర్నూర్ బ్రార్, రమణ్‌దీప్ సింగ్,కృష్ భగత్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఢిల్లీ చిత్తు..
మరోవైపు నాలుగో క్వార్టర్ ఫైనల్‌లో ఢిల్లీని 76 పరుగుల తేడాతో విదర్భ చిత్తు చేసింది. దీంతో విదర్భ వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ చతికల పడింది. 45.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. నచికేత్ భూటే 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ఇక తొలి రెండు క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక, సౌరాష్ట్ర విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక, సౌరాష్ట్ర, విదర్భ, పంజాబ్ జట్లు సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.
సెమీఫైనల్ షెడ్యూల్
తొలి సెమీఫైనల్- కర్ణాటక vs విదర్భ- జనవరి 15
రెండో సెమీఫైనల్-సౌరాష్ట్ర vs పంజాబ్- జనవరి 16
చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్


