నితీశ్‌ రెడ్డి వర్సెస్‌ రిషభ్‌ పంత్‌!.. కోహ్లి వచ్చేశాడు | VHT 2025-26 Andhra Vs Delhi, Toss Update Virat Kohli In Playing XI, Check Out Squad And Other Important Details | Sakshi
Sakshi News home page

నితీశ్‌ రెడ్డి వర్సెస్‌ రిషభ్‌ పంత్‌!.. కోహ్లి వచ్చేశాడు

Dec 24 2025 9:04 AM | Updated on Dec 24 2025 10:52 AM

VHT 2025 Andhra vs Delhi: Toss Update Virat Kohli In Playing XI

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌కు బుధవారం తెరలేచింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు... స్టార్‌లతో నిండి ఉన్న ఢిల్లీ టీమ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

బెంగళూరు వేదికగా విరాట్‌ కోహ్లి (Virat Kohli), రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)తో కూడిన ఢిల్లీ జట్టుపై మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నిలవనున్న నేపథ్యంలో... మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం.

నితీశ్‌ రెడ్డి వర్సెస్‌ రిషభ్‌ పంత్‌
టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy)ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండగా... శ్రీకర్‌ భరత్, రికీ భుయ్, అశ్విన్‌ హెబ్బర్, షేక్‌ రషీద్‌ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. సత్యనారాయణ రాజు, వినయ్, స్టీఫెన్‌ బౌలింగ్‌ భారం మోయనున్నారు.

బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌ వేదికగా ఆంధ్ర జట్టుతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ.. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో నితీశ్‌ రెడ్డి సేన బ్యాటింగ్‌కు దిగనుంది.

ఆంధ్ర వర్సెస్‌ ఢిల్లీ తుదిజట్లు
ఆంధ్ర
శ్రీకర్ భరత్(వికెట్‌ కీపర్‌), అశ్విన్ హెబ్బార్, షేక్ రషీద్, రికీ భుయ్, నితీశ్‌ కుమార్ రెడ్డి(కెప్టెన్‌), సౌరభ్ కుమార్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, కేఎస్‌ నరసింహ రాజు, త్రిపురాణ విజయ్, సత్యనారాయణ రాజు, SDNV ప్రసాద్.

ఢిల్లీ
అర్పిత్ రాణా, ప్రియాంష్ ఆర్య, విరాట్ కోహ్లీ, నితీష్ రాణా, రిషభ్‌ పంత్(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఆయుశ్‌ బదోని, సిమర్‌జీత్ సింగ్, హర్ష్ త్యాగి, ఇషాంత్ శర్మ, ప్రిన్స్ యాదవ్, నవదీప్ సైనీ.

రోహిత్‌ కూడా వచ్చేశాడు
ఇక గ్రూప్‌-సిలో భాగంగా ముంబైతో మ్యాచ్‌లో సిక్కిం టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో కోహ్లి మాదిరే రోహిత్‌ శర్మ కూడా ఛేదనలోనే బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది.

ముంబై తుదిజట్టు
రోహిత్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేష్ లాడ్, ముషీర్ ఖాన్, హార్దిక్ టామోర్ (వికెట్‌ కీపర్‌), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్‌), తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా.

సిక్కిం తుదిజట్టు
లీ యోంగ్ లెప్చా (కెప్టెన్‌), ఆశిష్ థాపా (వికెట్‌ కీపర్‌),అమిత్ రాజేరా, రాబిన్ లింబూ, గురీందర్ సింగ్, క్రాంతి కుమార్, పల్జోర్ తమాంగ్, అంకుర్ మాలిక్, కె సాయి సాత్విక్, ఎండీ సప్తుల్లా, అభిషేక్ కేఆర్‌ షా.

చదవండి: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement