breaking news
Andhra vs Delhi
-
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ 10, 11, 12, 13, 14, 15 వేల పరుగులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. విరాట్ 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని కేవలం 343 మ్యాచ్‌ల్లో తాకాడు.విరాట్‌కు ముందు భారత్ తరఫున సచిన్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. సచిన్ 551 మ్యాచ్‌ల్లో 21999 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రహాం గూచ్ (22211), గ్రేమ్ హిక్ (22059) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 16000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో తొలి పరుగు పూర్తి చేయగానే విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ కూడా చేశాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్య ఛేదనలో 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ జట్టు ఢిల్లీ గెలవాలంటే ఇంకా 79 పరుగులు చేయాలి. విరాట్‌తో పాటు నితీశ్ రాణా (37) క్రీజ్‌లో ఉన్నాడు. 27.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 220/2గా ఉంది. అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశ్ కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆంధ్ర తరఫున రికీ భుయ్ (122) సెంచరీ చేశాడు. ఆ జట్టు కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23 పరుగులకు ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. -
శతక్కొట్టిన విరాట్ కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ కుడిచేతి వాటం ఆటగాడు వరుస శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన విరాట్.. మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (45 బంతుల్లో 65) సాధించాడు.ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి (Virat Kohli)... వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.298 పరుగులుఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రిక్కీ భుయ్ (122) సెంచరీ చేయగా.. షేక్ రషీద్ 31, కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23, హేమంత్ రెడ్డి 27, సింగుపురం ప్రసాద్ 28 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆంధ్ర ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.శతక్కొట్టిన విరాట్ కోహ్లిఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్పిత్ రాణా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (74) బాదగా.. అతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.చదవండి: తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర -
నితీశ్ రెడ్డి వర్సెస్ రిషభ్ పంత్!.. కోహ్లి వచ్చేశాడు
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌కు బుధవారం తెరలేచింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు... స్టార్లతో నిండి ఉన్న ఢిల్లీ టీమ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.బెంగళూరు వేదికగా విరాట్ కోహ్లి (Virat Kohli), రిషభ్ పంత్ (Rishabh Pant)తో కూడిన ఢిల్లీ జట్టుపై మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నిలవనున్న నేపథ్యంలో... మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం.నితీశ్ రెడ్డి వర్సెస్ రిషభ్ పంత్టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండగా... శ్రీకర్ భరత్, రికీ భుయ్, అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. సత్యనారాయణ రాజు, వినయ్, స్టీఫెన్ బౌలింగ్ భారం మోయనున్నారు.బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా ఆంధ్ర జట్టుతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో నితీశ్ రెడ్డి సేన బ్యాటింగ్‌కు దిగనుంది.ఆంధ్ర వర్సెస్ ఢిల్లీ తుదిజట్లుఆంధ్రశ్రీకర్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్ హెబ్బార్, షేక్ రషీద్, రికీ భుయ్, నితీశ్ కుమార్ రెడ్డి(కెప్టెన్), సౌరభ్ కుమార్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, కేఎస్ నరసింహ రాజు, త్రిపురాణ విజయ్, సత్యనారాయణ రాజు, SDNV ప్రసాద్.ఢిల్లీఅర్పిత్ రాణా, ప్రియాంష్ ఆర్య, విరాట్ కోహ్లీ, నితీష్ రాణా, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుశ్ బదోని, సిమర్జీత్ సింగ్, హర్ష్ త్యాగి, ఇషాంత్ శర్మ, ప్రిన్స్ యాదవ్, నవదీప్ సైనీ.రోహిత్ కూడా వచ్చేశాడుఇక గ్రూప్-సిలో భాగంగా ముంబైతో మ్యాచ్‌లో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లి మాదిరే రోహిత్ శర్మ కూడా ఛేదనలోనే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.ముంబై తుదిజట్టురోహిత్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేష్ లాడ్, ముషీర్ ఖాన్, హార్దిక్ టామోర్ (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా.సిక్కిం తుదిజట్టులీ యోంగ్ లెప్చా (కెప్టెన్), ఆశిష్ థాపా (వికెట్ కీపర్),అమిత్ రాజేరా, రాబిన్ లింబూ, గురీందర్ సింగ్, క్రాంతి కుమార్, పల్జోర్ తమాంగ్, అంకుర్ మాలిక్, కె సాయి సాత్విక్, ఎండీ సప్తుల్లా, అభిషేక్ కేఆర్ షా.చదవండి: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం


