దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి కెప్టెన్, ఆల్‌రౌండర్ అమాన్ ఖాన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే ఇది దురదృష్టవశాత్తూ చెప్పుకోవడానికి ఇష్టపడని అవమానకరమైన రికార్డు కావడం గమనార్హం. జార్ఖండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమాన్ 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు.
దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు కలిపి (లిస్ట్–ఎ క్రికెట్)లో ఒక మ్యాచ్‌లో బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఇదే టోర్నీలో ఈ నెల 24న బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసూ 9 ఓవర్లల ఇచ్చిన 116 పరుగుల రికార్డు ఇప్పుడు తెరమరుగైంది.
ఐపీఎల్‌లో రెండు సీజన్ల పాటు కోల్‌కతా, ఢిల్లీ జట్లకు కలిపి 12 మ్యాచ్‌లలో ఆడినా ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం వచ్చిన అమాన్ ఖాన్ ఇటీవల జరిగిన 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.40 లక్షలకు సొంతం చేసుకుంది. పుదుచ్చేరితో మ్యాచ్‌లో 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసిన జార్ఖండ్...ఆ తర్వాత పుదుచ్చేరిని 235 పరుగులకే ఆలౌట్ చేసి 133 పరుగులతో విజయాన్నందుకుంది.
చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!


