జైశ్వాల్‌, జ‌డేజా కాదు.. రాజ‌స్తాన్ కెప్టెన్‌గా సూప‌ర్ స్టార్‌ | Riyan Parag set to succeed Sanju Samson as new RR captain for IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: జైశ్వాల్‌, జ‌డేజా కాదు.. రాజ‌స్తాన్ కెప్టెన్‌గా సూప‌ర్ స్టార్‌

Feb 13 2026 12:50 PM | Updated on Feb 13 2026 12:56 PM

Riyan Parag set to succeed Sanju Samson as new RR captain for IPL 2026

ఐపీఎల్-2026 సీజ‌న్‌కు ముందు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ జ‌ట్టు  నూతన సారథిగా ఆల్‌రౌండ‌ర్ రియాన్ ప‌రాగ్‌ను రాయ‌ల్స్ యాజ‌మాన్యం ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. దీనిపై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫిబ్ర‌వ‌రి 13( శుక్ర‌వారం) సాయంత్రం 4 గంట‌ల‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంది.

గ‌త సీజ‌న్ వ‌ర‌కు కెప్టెన్‌గా ప‌నిచేసిన సంజూ శాంస‌న్ స్దానాన్ని ప‌రాగ్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. తొలుత ప‌రాగ్‌తో పాటు రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు రాజ‌స్తాన్ కెప్టెన్సీ రేసులో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ రాజ‌స్తాన్ మేనెజ్‌మెంట్ మాత్రం ప‌రాగ్ వైపే మొగ్గు చూపిన‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

రియాన్ ప‌రాగ్ 2019 నుంచి రాజ‌స్తాన్ జ‌ట్టుతో కొన‌సాగుతున్నాడు. అస్సాం జ‌ట్టుతో పాటు రాజ‌స్తాన్ కెప్టెన్‌గా కూడా ప‌రాగ్‌కు ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో గాయ‌ప‌డిన సంజూ శాంసన్ స్ధానంలో 8 మ్యాచ్‌లకు పరాగ్ నాయకత్వం వహించాడు. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచ‌న మేర‌కు పరాగ్‌కు త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను రాజ‌స్తాన్ అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. 

ఇక ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు రాజ‌స్తాన్ జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంస‌న్‌ను సీఎస్‌కే ట్రేడ్ చేసిన రాజ‌స్తాన్‌.. అందుకు బదులుగా స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కుర్రాన్‌ల‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. అదేవిధంగా రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా త‌ప్పుకోవ‌డంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజ‌స్తాన్ బ‌రిలోకి దిగ‌నుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement