పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! | Varun Chakaravarthy clears the air on Abhishek Sharma's availability for IND vs PAK | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!

Feb 13 2026 11:41 AM | Updated on Feb 13 2026 12:00 PM

Varun Chakaravarthy clears the air on Abhishek Sharma's availability for IND vs PAK

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త క్రికెట్ జ‌ట్టు ర‌స‌వ‌త్త‌ర పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌.. పాక్‌తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌ తర్వాత అభిషేక్‌కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట‌. ఈ విష‌యాన్ని భార‌త స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ధ్రువీక‌రించాడు.

న‌మీబియాతో మ్యాచ్ అనంత‌రం వ‌రుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ఆడుతాడ‌ని నేను అనుకుంటున్నాను. అత‌డు ప్ర‌స్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అత‌డు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తానని నాతో చెప్పాడ‌ని వ‌రుణ్ అన్నాడు.

2 కిలోలు త‌గ్గిన అభిషేక్‌
అభిషేక్ శ‌ర్మ కూడా త‌న ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చాడు.  కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్ర‌స్తుతం  తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒక‌వేళ పాక్‌తో మ్యాచ్‌కు అభిషేక్ దూరమైతే, భార‌త ఇన్నింగ్స్‌ను సంజూ శాంస‌న్, ఇషాన్ కిష‌న్ ప్రారంభించ‌నున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement