సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌ న్యూస్‌! | Pat Cummins reveals IPL 2026 availability for SRH after World Cup exit | Sakshi
Sakshi News home page

IPL 2026: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌ న్యూస్‌!

Feb 3 2026 12:17 PM | Updated on Feb 3 2026 12:27 PM

Pat Cummins reveals IPL 2026 availability for SRH after World Cup exit

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ దూర‌మైన సంగ‌తి తెలిసిందే. తొలుత ప్ర‌క‌టించిన జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి.. ఇంకా గాయం నుంచి కోలుకోక‌పోవ‌డంతో ఆఖ‌రి నిమిషంలో క‌మ్మిన్స్ త‌ప్పుకొన్నాడు. అత‌డి స్దానంలో బెన్ దుర్హ‌నియ‌స్‌ను జట్టులోకి సెలెక్ట‌ర్లు తీసుకున్నారు.

క‌మ్మిన్స్ గ‌త జూలై నుంచి వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన యాషెస్ సిరీస్‌లో కూడా అత‌డు కేవ‌లం ఒకే టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యానికి క‌మ్మిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశించింది. కానీ అత‌డు కోలు కోవడానికి 4 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 

ఈ క్ర‌మంలోనే అత‌డు కీల‌క టోర్నీ కి దూర‌మ‌య్యాడు. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి త‌ప్పుకొన్న ప్యాట్ క‌మ్మిన్స్‌.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్యాన్స్‌కు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్‌-2026 అందుబాటులో ఉంటాన‌ని క‌మ్మిన్స్ హింట్ ఇచ్చాడు.

"వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ నుంచి వైదొల‌గ‌డం నిజంగా దురదృష్టకరం. అడిలైడ్ టెస్టు త‌ర్వాత నా గాయం తిర‌గ‌బెట్టింది. అయితే 4 వారాల్లోనే కోలుకుంటాన‌ని అనుకున్నాను. కానీ తాజా స్కాన్ త‌ర్వాత మరికొన్ని వారాల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. అందుకే ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. 

మ‌రి కొన్ని రోజుల్లో మ‌ళ్లీ స్కాన్ చేయించుకుంటాను. ఒక‌వేళ ఆ రిపోర్ట్ గ‌నుక సానుకూలంగా వస్తే, అప్పటి నుండి నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలుపెడతాను. త్వ‌ర‌లోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాను" అని క‌మ్మిన్స్‌ ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా క‌మ్మిన్స్ వ్య‌వహ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కావ్య మార‌న్ మ‌రోసారి అత‌డిపై న‌మ్మ‌కం ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement