క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్-2026కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.
ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొంది. దీంతో బంగ్లా స్ధానాన్ని స్కాట్లాండ్‌తో ఐసీసీ భర్తీ చేసింది. తాజాగా పాకిస్తాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు వాన్ షాకిచ్చాడు. తను ఎంచుకున్న టాప్-4 జట్ల జాబితాలో సౌతాఫ్రికాకు వాన్ చోటు ఇవ్వలేదు.
భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్‌కు వాన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం పాకిస్తాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.
మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా భారత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ దుమ్ములేపింది.
చదవండి: పాక్‌కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్


