ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా | Comparing BCCI Cash Bonus For 2007 VS 2026 T20 World Cup Winners | Sakshi
Sakshi News home page

ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నగదు నజరానా

Mar 10 2026 6:51 PM | Updated on Mar 10 2026 7:05 PM

Comparing BCCI Cash Bonus For 2007 VS 2026 T20 World Cup Winners

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచకప్ విజేతకు నగదు బహుమతి ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు రూ. 131 కోట్లు రివార్డుగా ప్రకటించింది. ఈ మొత్తం 2007 పొట్టి ప్రపంచకప్‌ విజేత అయిన నాటి టీమిండియాతో పోలిస్తే ఏకంగా 1091.67 శాతం ఎక్కువ.

2007 పొట్టి ప్రపంచకప్‌ గెలిచినప్పుడు ధోని నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ రూ. 12 కోట్ల నగదు నజరానాను ప్రకటించింది. ప్రత్యేక బహుమతిగా ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్‌కు రూ. 1 కోటి  అందించింది. అలాగే సపోర్ట్ స్టాఫ్‌లో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు  ఇచ్చింది.

అదే 2026 ప్రపంచకప్‌కు వచ్చేసరికి.. సూర్యకుమార్‌ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 19 ఏళ్లలో బహుమతి మొత్తం 13 రెట్లు పెరిగింది.

ఈ మధ్యలో 2024 పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన రోహిత్‌ శర్మ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2007తో పోలిస్తే ఈ మొత్తం రూ. 113 కోట్లు ఎక్కువ.

భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి..
- 2007లో రూ. 12 కోట్లు
- 2024లో రూ. 125 కోట్లు
- 2026లో రూ. 131 కోట్లు

ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన 2026 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement