పోలండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ఓడిపోవడం తనను మానసిక వేదనకు గురి చేస్తోందని, ఓటములతో కోర్టులో ఆటపై పట్టు కోల్పోతున్నట్లుగా అనిపిస్తుందని తెలిపింది. గురువారం ప్రారంభమైన మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్వియాటెక్ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 50వ ర్యాంకర్ మగ్డా లినెట్టె 6-1, 5-7, 6-3తో ప్రపంచ మూడో ర్యాంకర్ అయిన స్వియాటెక్‌ను మూడు సెట్లలో చిత్తు చేసింది. ఒక డబ్ల్యూటీఏ టూర్‌లో భాగంగా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో 73 మ్యాచ్‌ల్లో వరుస విజయాల తర్వాత తొలి రౌండ్‌లో ఓడిపోవడం స్వియాటెక్‌కు ఇదే తొలిసారి.
మ్యాచ్ ఓటమి అనంతరం స్వియాటెక్ మాట్లాడుతూ.. ‘నేను ఓడిపోయానంటే నమ్మబుద్ది కావడం లేదు. రాను రాను టెన్నిస్ ఆట కష్టంగా అనిపిస్తోంది . ఈ ఆట చాలా తేలిక అనుకున్నా. కానీ, కోర్టులో మానసికంగా మనం ఎలా ఉంటామనేది చాలా కీలకం. ఇది నాకొక చెత్త మ్యాచ్. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మళ్లీ నా పనిలో మునిగిపోతా.
ప్రాక్టీస్ చేస్తాను. పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. నా ఆటను మెరుగుపరచుకుంటా’ అని స్వియాటెక్ పేర్కొంది. కాగా స్వియాటెక్ తన టెన్నిస్ కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు గ్రాండ్‌స్లామ్‌లు సాధించగా ఇందులో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఒక్కోసారి నెగ్గడం విశేషం. ఒక దశలో స్వియాటెక్ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 125 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం విశేషం.
చదవండి: ‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
‼️UPSET ALERT IN HARD ROCK STADIUM ‼️@MagdaLinette | #MiamiOpen pic.twitter.com/lUJtcc5jbW
— wta (@WTA) March 20, 2026


