మా మాష్టారే పేషెంట్‌గా..! | Doctor Shares Emotional Reunion With Former Teacher At Her Clinic | Sakshi
Sakshi News home page

మా మాష్టారే పేషెంట్‌గా..!

Mar 20 2026 11:23 AM | Updated on Mar 20 2026 11:32 AM

Doctor Shares Emotional Reunion With Former Teacher At Her Clinic

మనల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన గురువులు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటి గౌరవప్రదమైన వ్యక్తులకు సేవ చేసే అవకాశం దొరకడం కూడా అత్యంత అరుదు. అలాంటి మహద్భాగ్యం ఈ డాక్డర్‌కి దొరికింది. అంతేగాదు ఆ క్షణాన్ని అత్యంత ప్రత్యేకం, అలాగే గర్వంగానూ ఉంది అంటూ సంబరపడిపోతాందా ఆ వైద్యురాలు.

ఆ అదృష్టవంతురాలే డాక్టర్‌ ప్రతిభ నిఖార్‌ జునేజా. అందుకు సంబంధించిన వీడియోకు క్యాప్షన్‌గా డాక్టర్‌ జునేజా ఇలా రాశారు..ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం, భావోద్వేగభరితమైన రోజు అంటూ..తన కెదురైన మధురానుభవాన్ని షేర్‌ చేసుకున్నారు. తన మాజీ గురువు డాక్టర్‌ బిడి గుప్తా తన క్లినిక్‌ని సందర్శించిన క్షణం గురించి పేర్కొంది. జామ్‌నగర్‌లోని ఎంపీ షా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ గుప్తా, డాక్టర్ జునేజాకు ఆమె మెడికల్ కాలేజీ రోజుల్లో బోధించారు. 

ఒకప్పుడూ తాను ఎవరి దగ్గర వైద్యం నేర్చుకుందో ఆ  వ్యక్తి ఈ రోజు తనని నమ్మి ఆయన ఆరోగ్యాన్ని తన చేతుల్లో పెట్టారని రాసుకొచ్చింది. డాక్టర్ అవ్వడం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది ఒక "బాధ్యత" అని ఇలాంటి క్షణాలు గుర్తు చేస్తాయని అంటోంది. మన ఉపాధ్యాయులు మనపై ఉంచే నమ్మకమే అన్నింటికన్న గొప్ప బహుమతి. అని భావోద్వేగంగా మాట్లాడింది. 

ఇన్నేళ్ల తర్వాత చికిత్స నిమిత్తం రావడం, ఆయన్ని కలవడం, ఆశీర్వాదం తీసుకోవడం వంటివి అన్ని.. నిజంగా ఈ రోజుని మర్చిపోలేను అని అన్నారామె. అంతేగాదు తన ఉపాధ్యాయుడు తనపై ఉంచిన నమ్మకం పట్ల గర్వం, వినమ్రతను కలిగి ఉన్నానని అన్నారామె. నెటిజన్లు సైతం మన గురువులు డాక్టర్‌గా నమ్మే రోజుకి మించిన అనుభూతి మరోకటి లేదు అంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: నటి జ్యోతిక మోడర్న్‌ పేరెంటింగ్‌ టిప్స్‌..!)

 

Advertisement
 
Advertisement
Advertisement