మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి.. | Nalpamaradi Tailam: 3000-Year-Old Ayurvedic Skin-Brightening Oil | Sakshi
Sakshi News home page

మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..

Mar 20 2026 5:28 PM | Updated on Mar 20 2026 6:46 PM

Nalpamaradi Tailam: 3000-Year-Old Ayurvedic Skin-Brightening Oil

చర్మసంరక్షణకు సంబంధించిన కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్‌ నూనె వంటి ఎన్నో ఆయిల్స్‌ రాసి, అంతగా ప్రయోజనం పొందక విసిగిపోయినవాళ్లెందరో ఉన్నారు. సరిగ్గా ఆ టైంలో నెట్టింట వైరల్‌గా మారింది నల్పమరాది తైలం. అసలేంటి తైలం అని అందరిలోనూ ఒకటే కుతుహలం రేకెత్తించింది. ఇంతకీ ఏంటి ఆయిల్‌..? చర్మ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతుందంటే..

ఆ ఆయిల్‌ నల్పమరాది తైలం. ఇది భారతదేశంలోని కేరళకు చెందిన ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధ తైలం. కేరళ ఆయుర్వేదం నుంచి ఉద్భవించింది. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, ఛాయను మెరుగుపర్చడానికి, ఎండవల్ల వచ్చిన టాన్‌(నలుపుదనాన్ని)ని తొలగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని తయారీలో తరుచుగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. 

ఇటీవల గత కొన్ని రోజులుగా ఈ ఆయిల్‌ గురించి నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఈ తైలం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు తాము ఈ ఆయిల్‌ని వినియోగించి చూశాం అంటూ ఇస్తున్న రివ్యూలు కూడా ఈ క్రేజ్‌కి కొంత కారణం. దాంతో ఈ ప్రొడక్ట్ ప్రధాన ఆకర్షణగా మారడమే గాక, తరతరాలుగా విశ్వసిస్తున్న ఈ ఆయిల్‌ పట్ల ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లు, చర్మ సంరక్షణ ప్రియులను నుంచి పెద్ద ఎత్తున్న సానుకూల స్పందన రావడం విశేషం. 

తయారీ..
నల్పమరాది తైలం ప్రధానంగా మర్రి, రావి, గోమేధిక, అత్తి వంటి నాలుగు రకాల చెట్ల బెరడులతో తయారు చేస్తారు. ఇది చర్మాన్ని స్వస్థపరిచి, కాంతివంతం చేస్తుంది. ఈ తైలానికి సాధారణంగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. ఇందులో పసుపు, వెటివర్‌, ఆమ్లా, వంటివి కూడా జోడిస్తారు. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఉపయోగపడతాయి.

మూడువేల ఏళ్లకు పైగా చర్రిత కలిగిన పురాతన తైలం కేరళలో ఉద్భవించిందని చాలామంది ప్రజల గట్టి నమ్మకం. నాలుగు పవిత్రమైన చెట్ల బెరడు నుంచి వచ్చిన మిశ్రమం కావడంత దీన్ని "నల్పమరం" అని పిలస్తారు. దీన్ని గాయాలు మాన్పడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి ఎక్కువుగా వినియోగించేవారట. ఇది శిశువుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుందట. 

మంత్రసానులు ఈ నూనెలోని పలుచని ద్రావణాన్ని శిశువుల మసాజ్‌ కోసం వినియోగిస్తారట. అంతేగాదు ప్రపంచ యుద్ధాల సమయంలో, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల మహిళలు సాంప్రదాయ నల్పమరాది తైలం మిశ్రమాలను పునరుద్ధరించి, వాటిని కొబ్బరి ఆకుల బుట్టలలో నిల్వ చేసేవారట. అంతటి విశిష్టత కలిగిని నూనెని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!.

 

 (చదవండి: 9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!)
 

 

Advertisement
 
Advertisement
Advertisement