ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌.. | Josh Hazlewood blow in T20 World Cup 2026 for Australia after Pat Cummins | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌..

Feb 2 2026 3:11 PM | Updated on Feb 2 2026 3:30 PM

Josh Hazlewood blow in T20 World Cup 2026 for Australia after Pat Cummins

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో మరో కీలక బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ చేరాడు. 

హాజిల్‌వుడ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతడు కీలక యాషెస్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలస్తోంది.

ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు హాజిల్‌వుడ్ దూరం కానున్నట్లు ఆసీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్‌ జట్టుతో పాటు కొలంబోకు వెళ్లకుండా సిడ్నీలోనే ఉండనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత జట్టుతో కలిసే అవకాశముంది.

ఒకవేళ హాజిల్‌వుడ్ దూరమైతే కంగారులకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.  ఆస్ట్రేలియా ప్రధాన పేసర్లు ఎవరూ లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. హాజిల్‌వుడ్ ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో సెలెక్టర్లు షాన్ అబాట్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టులోకి తీసుకున్నారు.

అయితే బిగ్‌బాష్ లీగ్‌లో గాయపడ్డ విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ మాత్రం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతడు కొలంబోలో జట్టుతో కలవనున్నాడు. ఈ మెగా ఈవెంట్ సన్నాహాల్లో భాగంగా ఆసీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది. అయితే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆసీస్ క్లీన్‌స్వీప్‌కు గురైంది. ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో తమ తొలి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడనుంది.

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు (అప్‌డేటడ్‌): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జేవియర్ బార్ట్లెట్, జోష్ హేజిల్‌వుడ్, కూపర్ కాన్లీ, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ కుహ్నెమన్, బెన్ ద్వార్షుయిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మాథ్యూ రెన్షా, నాథన్ ఎల్లిస్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. (రిజర్వ్: షాన్ అబాట్).
చదవండి: ఇదేం ప్రశ్న?.. పాక్‌ రిపోర్టర్‌కు ఇచ్చి పడేసిన ఆసీస్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement