ఇదేం ప్రశ్న?.. పాక్‌ రిపోర్టర్‌కు ఇచ్చి పడేసిన మార్ష్‌ | Marsh Shuts Down Pak Reporter Over T20 WC India Boycott Question | Sakshi
Sakshi News home page

ఇదేం ప్రశ్న?.. పాక్‌ రిపోర్టర్‌కు ఇచ్చి పడేసిన ఆసీస్‌ కెప్టెన్‌

Feb 2 2026 1:57 PM | Updated on Feb 2 2026 2:14 PM

Marsh Shuts Down Pak Reporter Over T20 WC India Boycott Question

పాకిస్తాన్‌ జర్నలిస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు. తనను వివాదంలోకి లాగాలని చూసిన సదరు విలేఖరికి సున్నితంగానే చివాట్లు పెట్టాడు. అదే సమయంలో.. తమ క్రికెట్‌ బోర్డు పట్ల తనకు అపారమైన నమ్మకం ఉందని.. కాబట్టి తాము భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన చెందబోమని గట్టిగానే ఇచ్చి పడేశాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్‌- శ్రీలంక వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడాల్సి ఉండగా.. భద్రతా కారణాలు అంటూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ అంశంపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

శ్రీలంకతో భారత్‌తో మ్యాచ్‌కు ఉన్న సోకాల్డ్‌ ముప్పు.. మిగతా జట్లతో ఆడినప్పుడు ఉండదా? అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విదేశీ ఆటగాళ్లను వివాదంలోకి లాగాలని చూడటం పాక్‌లో ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో భాగంగానే ఓ జర్నలిస్టు.. ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ను.. భారత్‌తో పాక్‌ మ్యాచ్‌ బహిష్కరిస్తోందని.. ఈ విషయంపై అభిప్రాయం చెప్పాలని కోరారు.

పాక్‌ రిపోర్టర్‌కు ఇచ్చి పడేసిన మార్ష్‌
ఈ మేరకు.. ‘‘ఫిబ్రవరి 15న జరగాల్సిన ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ గురించి ఇప్పుడే తెలిసింది. పాకిస్తాన్‌ ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయబోతోంది. ఈ విషయంపై మీ స్పందన’’ అని సదరు రిపోర్టర్‌ అడిగారు.

ఇందుకు బదులుగా.. ‘‘ఈ అంశం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు. అసలు ఆ అవసరమే లేదు. మా జట్టు గురించి మాత్రమే మాకు పట్టింపు ఉంటుంది. వరల్డ్‌కప్‌లో మా ప్రదర్శన ఎలా ఉండాలన్న దానిపై మాత్రమే మా దృష్టి ఉంది’’ అని మార్ష్‌ పేర్కొన్నాడు.

మేము సేఫ్‌.. మాకు నమ్మకం ఉంది
అయినప్పటికీ వెనక్కి తగ్గని సదరు రిపోర్టర్‌.. ‘‘ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ బంగ్లాదేశ్‌ కూడా ఈసారి భద్రతా కారణాల వల్ల ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనడం లేదు. ఓ ఆటగాడిగా ఫుల్‌ మెంబర్‌ జట్టు ఇలా తప్పుకోవడాన్ని ఎలా చూస్తారు?’’ అని ప్రశ్నించారు.

ఇందుకు మార్ష్‌ స్పందిస్తూ.. ‘‘గత ప్రశ్నకు ఇచ్చిన సమాధానమే దీనికీ వర్తిస్తుంది. వరల్డ్‌కప్‌ గెలవాలన్న లక్ష్యంతో మాత్రమే మేము వరల్డ్‌కప్‌ టోర్నీలో అడుగుపెడుతున్నాం. మా దృష్టి మొత్తం దాని మీదే కేంద్రీకృతమైంది. మమ్మల్ని భద్రంగా ఉంచుతారని మా బోర్డు పట్ల మాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఒక్కటే నేను మీకు చెప్పగలను’’ అంటూ పరోక్షంగా పాక్‌ క్రికెట్‌ బోర్డుకు కూడా చురక వేశాడు.

ఆసీస్‌కు ఘోర పరాభవం
కాగా టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆసీస్‌ జట్టు పాక్‌లో పర్యటించింది. అయితే, స్టార్‌ ఆటగాళుల​ లేకుండా ప్రయోగాలు చేసిన ఆసీస్‌.. సొంతగడ్డపై పాక్‌ను ఓడించలేకపోయింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్‌ 3-0తో క్వీన్‌స్వీప్‌ చేసింది. లాహోర్లోఓ ఆదివారం చివరి మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. కాగా టీ20ల్లో పరుగుల తేడా పరంగా ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద పరాజయం. 

చదవండి: T20 WC: మ్యాచ్‌ రద్దు చేసుకున్న పాక్‌.. స్పందించిన బీసీసీఐ!

Advertisement
 
Advertisement
Advertisement