breaking news
T20 series
-
టీమిండియాకు మరో భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్!
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలిచి జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు.. మిగిలిన రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఇంతకీ ఎవరా ఆటగాడు?స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. వన్డే సిరీస్ (IND vs SA)ను 2-1తో గెలిచింది. ఇదే జోరులో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.గెలుపుబాట పట్టిన సూర్య సేన..ఈ క్రమంలో ధర్మశాలలో ఆదివారం నాటి మూడో టీ20లో సత్తా చాటి తిరిగి గెలుపుబాట పట్టిన సూర్య సేన.. 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరం కాగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చారు.అక్షర్ పటేల్ అవుట్!అయితే, తాజా సమాచారం ప్రకారం అక్షర్ పటేల్ (Axar Patel) అనారోగ్యం బారిన పడ్డాడని.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పటికే బుమ్రా రూపంలో కీలక బౌలర్ దూరం కాగా.. అక్షర్ కూడా అందుబాటులో లేకుంటే తుదిజట్టు కూర్పు విషయంలో కాస్త గందరగోళం నెలకొనవచ్చు.కాగా కటక్‌లో 23, ముల్లన్‌పూర్‌లో 21 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. ఆయా మ్యాచ్‌లలో రెండు (2/7), ఒక వికెట్ (1/27) పడగొట్టాడు. మరోవైపు.. అక్షర్ స్థానంలో మూడో టీ20లో ఆడిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతో మెరిశాడు. ఇదిలా ఉంటే.. భారత్- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 లక్నోలో బుధవారం జరుగనుండగా.. శుక్రవారి నాటి ఆఖరి మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన ప్రాథమిక జట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా. -
ముచ్చటైన ‘మూడు’ కోసం ఇప్పటికే ఏడుగురు.. ఎవరు బెస్ట్?
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో చోటు చేసుకున్న ప్రధాన మార్పు.. దిగ్గజాలు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలేని జట్టు. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.హార్దిక్ పాండ్యాకు బదులుఇక అప్పటి నుంచి జట్టు పునర్నిర్మాణంలో భాగంగా భిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ పగ్గాలు అప్పగించింది. అతడు సారథిగా విజయాలు సాధిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం అప్పటి నుంచి విఫలమవుతూనే ఉన్నాడు.మరోవైపు.. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన మూడో స్థానంలో ఎవరిని ఆడించాలన్న విషయం ఇప్పటికీ స్పష్టత రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీ20 ఫార్మాట్లో మరో వరల్డ్‌కప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ.. టీమిండియాలో ఇంత వరకు ఈ కన్ఫ్యూజన్కు మాత్రం తెరపడటం లేదు.మూడో స్థానంలోఒకప్పుడు మూడో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చేవాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత కూడా సత్తా చాటి ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు పంత్. అయితే, ఆ తర్వాత పంత్‌తో పాటు చాలా మంది సీనియర్లకు టెస్టుల్లో ప్రాధాన్యం ఇస్తూ టీ20 జట్టును యువ ఆటగాళ్లతో నింపేసింది యాజమాన్యం.అభిషేక్ శర్మకు తోడుగా.. సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా పంపగా.. వీరు సక్సెస్ఫుల్ జోడీగా నిరూపించుకున్నారు. ఇక మూడో స్థానంలో యువ ఆటగాడు తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యతో పోటీపడ్డాడు. వన్‌డౌన్‌లో తాను సరైన వాడినేనని నిరూపించుకున్నాడు కూడా!పక్కనపెట్టేశారుఅయితే, గత కొంతకాలంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. గిల్ కోసం ఓపెనర్‌గా సంజూను తప్పించి.. మిడిలార్డర్లో ఓసారి, వన్‌డౌన్‌లో ఓసారి ఆడించారు. ఇప్పుడిక ఏకంగా వికెట్ కీపర్ కోటాలోనూ ఆడించకుండా పక్కనపెట్టేశారు. మరోవైపు.. కీపర్‌గా, ఫినిషర్‌గా జితేశ్ శర్మ రాణిస్తుండటంతో సంజూ ప్రపంచకప్ ఆశలు దాదాపు ఆవిరిఅయ్యినట్టే!ముచ్చటైన ‘మూడు’ కోసం ఇప్పటికే ఏడుగురుఇక మూడో స్థానం విషయానికొస్తే.. 2024 వరల్డ్‌కప్ తర్వాత ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శివం దూబే, అక్షర్ పటేల్.. ఇలా చాలా మంది ఆడారు. వీరిలో సూర్య 26.92 సగటుతో 157కు పైగా స్ట్రైక్‌రేటుతో 377 పరుగులు సాధించగా.. తిలక్ వర్మ 185కు పైగా స్ట్రైక్‌రేటుతో.. 161కి పైగా సగటుతో ఏకంగా 323 పరుగులు సాధించాడు.మిగిలిన వారిలో రుతురాజ్, సంజూ, అభిషేక్, శివం, అక్షర్.. ప్రయోగాత్మకంగా వచ్చి వరుసగా 84, 58, 24, 24, 21 పరుగులు చేశారు. అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తమ జట్టులో కేవలం ఓపెనింగ్ జోడీ మాత్రమే స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశాడు. మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని.. ఉంటారనీ పేర్కొన్నాడు. వారధినిజానికి టీ20 క్రికెట్లో నంబర్ 3 అనేది ఫిల్లర్ పొజిషన్ కానేకాదు. ఓపెనర్లు వేసిన పునాదిని బలపరుస్తూ.. మిడిలార్డర్‌కు సహకరించేలా వన్‌డౌన్ బ్యాటర్ వారధిని నిర్మించాల్సి ఉంటుంది. పరిస్థితిని బట్టి ఒక్కోసారి పవర్‌ప్లేలోనే రావాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది.మిగతా వారితో పోలిస్తే వన్‌డౌన్‌లో ఆడే ఆటగాడికి ఫిక్స్డ్ పొజిషన్ ఉండటం అత్యంత ముఖ్యం. అందుకు తగ్గట్టుగా అతడు నైపుణ్యాలు కనబరచగలడు. కానీ టీమిండియా నాయకత్వ బృందం దీనిని ఒక ట్రయల్ రూమ్‌గా మార్చేసి ఇష్టారీతిన ప్రయోగాలు చేస్తోంది. సమస్యను ఫిక్స్ చేసుకోవాలిఅయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మన జట్టులో ప్రతిభకు కొదవలేదు. కానీ దానిని ఉపయోగించుకునే విధానంలో స్పష్టత లోపించింది. ఏదేమైనా వరల్డ్‌కప్ నాటికి టీమిండియా నంబర్ 3 సమస్యను ఫిక్స్ చేసుకోవాలి. అనుభవజ్ఞుడైన సూర్యను లేదంటే.. మూడో స్థానంలో ఇప్పటికే నిరూపించుకున్న తిలక్ వర్మను పంపాలి. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు గెలవాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ ప్రణాళికలు, జట్టు కూర్పులో స్పష్టత అవసరం.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్‌గా.. -
గిల్, సూర్య కలిసి వరల్డ్‌కప్ గెలిపిస్తారు: అభిషేక్ శర్మ
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు కనీసం పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది.కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫెయిల్సూర్య సంగతి ఇలా ఉంటే.. వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత ఇరవైకి పైగా ఇన్నింగ్స్‌లో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) నాటికి టీమిండియా పరిస్థితి ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్‌గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్ (Suryakumar Yadav)పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా.. సంజూ శాంసన్‌ను బలి చేసి గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సూర్య, గిల్‌పై నమ్మకం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘‘మీడియా ముఖంగా మీ అందరికీ నేనొక మాట చెబుతా.. గుర్తుపెట్టుకోండి. సూర్య, గిల్‌పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్‌లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్‌లో జట్టును గెలిపిస్తారు.వీళ్లిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా.. శుబ్మన్తో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో.. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తన సమయం వచ్చినపుడు అతడు చెలరేగి ఆడతాడు.త్వరలోనే మీరు కూడా చూస్తారుసూర్య, గిల్ గురించి నాకు తెలుసు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్‌ను విమర్శిస్తున్న వారు.. త్వరలోనే అతడి నైపుణ్యాలను కళ్లారా చూస్తారు’’ అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది.వరుస వైఫల్యాలుకాగా అభిషేక్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వస్తున్న గిల్.. సౌతాఫ్రికాతో ఇప్పటి వరు జరిగిన మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు వరుసగా.. 4(2), 0(1), 28 (28). మరోవైపు.. సూర్య చేసిన పరుగులు 12(11), 5(4), 12(11). ఇక అభిషేక్ శర్మ తొలి టీ20లో (17), రెండో టీ20లో (17) తడబడ్డా.. మూడో టీ20లో 35(18) మెరుగ్గా రాణించాడు.ఇదిలా ఉంటే.. కటక్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ధర్మశాలలో జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్-2026 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్‌గా.. -
కోహ్లి ‘ప్రపంచ రికార్డు’ బ్రేక్ చేసిన తిలక్ వర్మ
టీమిండియా టీ20 స్టార్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ ఛేదనలో అత్యుత్తమ సగటుతో పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇన్నాళ్లుగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును తిలక్ బద్దలు కొట్టాడు.తొలి రెండు టీ20లలో అలాస్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు తిలక్ వర్మ (Tilak Varma). బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పుల నేపథ్యంలో కటక్ వేదికగా తొలి టీ20లో నాలుగో స్థానంలో వచ్చిన ఈ హైదరాబాదీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.ఇక ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లోనూ ఇదే స్థానంలో ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఈసారి మాత్రం దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు తిలక్. అయితే, ఈ మ్యాచ్‌లో అతడి పోరాటం వృథాగా పోయింది.అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్తాజాగా ఆదివారం నాటి మూడో టీ20లో మాత్రం తిలక్ తనదైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ధర్మశాలలో మూడో టీ20లో సౌతాఫ్రికా విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనను టీమిండియా 15.5 ఓవర్లలోనే పూర్తి చేసింది.ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 లక్ష్య ఛేదనలో.. కనీసం 500 పరుగులు సాధించిన ఆటగాళ్ల (టెస్టు హోదా కలిగిన దేశాలు) జాబితాలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో లక్ష్య ఛేదనలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్లు (కనీసం 500 పరుగులు)🏏తిలక్ వర్మ (ఇండియా)- 68.0 సగటుతో🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 67.1 సగటుతో🏏ఎంఎస్ ధోని (ఇండియా)- 47.71 సగటుతో🏏జేపీ డుమిని (సౌతాఫ్రికా)- 45.55 సగటుతో🏏సంగక్కర (శ్రీలంక)- 44.93 సగటుతో.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు! -
నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా.. కానీ: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా సఫారీలను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో.. గత మ్యాచ్ వైఫల్యాలను అధిగమించి తాజా టీ20లో గెలవడం పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘క్రీడలు మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతాయి. ఈ సిరీస్‌లో తిరిగి పుంజుకుని ఆధిక్యంలోకి రావడం అత్యంత ముఖ్యమైన విషయం. మేము ప్రస్తుతానికి ఆ పనిని పూర్తి చేశాము.మా బౌలర్లు సూపర్కటక్లో జరిగిన తొలి టీ20లో మాదిరి ప్రాథమిక స్థాయి అంశాల మీద కూడా దృష్టి పెట్టాము. అందుకు తగ్గ ఫలితాన్ని పొందాము కూడా!.. చండీగఢ్ (ముల్లన్పూర్)లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా ఈసారి మా బౌలర్లంతా సమిష్టిగా రాణించడం కలిసి వచ్చింది.నెట్స్‌లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాతి సమావేశంలో మా తప్పొప్పుల గురించి లోతుగా చర్చించుకున్నాము. కఠినంగా సాధన చేశాము. ఈ మ్యాచ్‌లో మేము ప్రయోగాలకు పోలేదు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే.. నెట్స్‌లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను.కానీ మ్యాచ్‌లో విఫలమవుతున్నాను. నా ఆధీనంలో ఉన్న ప్రతి పనిని విజయవంతంగా నిర్వహించేందుకు నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. సరైన సమయంలో సరైన విధంగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి. నేను ఫామ్‌లో లేనని అనుకోను.అయితే, వీలైనన్ని ఎక్కువ పరుగులు మాత్రం రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గెలుపును ఆస్వాదిస్తున్నాం. తదుపరి లక్నో మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా ధర్మశాల వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది.117 పరుగులే చేసి ఆలౌట్భారత బౌలర్ల విజృంభణకు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులే చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61) ఒక్కడే మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారిలో ఫెరీరా(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు కూల్చగా.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు.స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35) ధనాధన్ దంచికొట్టగా.. శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించాడు.మరోసారి సూర్య విఫలంవన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ సూర్య (12) మరోసారి విఫలమయ్యాడు. తిలక్‌తో కలిసి శివం దూబే (4 బంతుల్లో 10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.కాగా సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తర్వాత బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా పేసర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. ఈ ఏడాది 18 ఇన్నింగ్స్‌లో పేసర్ల బౌలింగ్‌లో 14సార్లు అతడు అవుట్ అయ్యాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని 8.71 సగటుతో కేవలం 122 పరుగులు చేశాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నాలుగో టీ20 జరుగుతుంది. ఇందుకు వేదిక లక్నో.చదవండి: Messi: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!#ShivamDube finishes things off in style and Team India go 2–1 up in the series.🔥#INDvSA, 4th T20I 👉 WED, DEC 17, 6 PM pic.twitter.com/OjhdlpHs7G— Star Sports (@StarSportsIndia) December 14, 2025 -
ఏదో మొక్కుబడిగా చేయను.. క్లారిటీ ఉంది: సౌతాఫ్రికా కోచ్
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టులో తరచూ ఇలా జరగడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA)తో రెండో టీ20లోనూ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో పంపడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి.ఏదో మొక్కుబడిగా చేయనుమరోవైపు.. ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మూడో టీ20కి ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా హెడ్‌కోచ్ షుక్రి కన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తామని.. అయితే, అదేదో మొక్కుబడిగా చేసే పనికాదని పేర్కొన్నాడు.స్పష్టమైన అవగాహన ఉందిటీ20 ప్రపంచకప్-2026 ప్రణాళికలకు అనుగుణంగానే తాము ముందుకు సాగుతున్నట్లు కన్రాడ్ వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ప్రతీ మ్యాచ్‌లోనూ మేము బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చబోము. తప్పక ఆర్డర్‌ను మార్చాలన్న నియమేమీ లేదు. ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.ఇందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్టు సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారికి అవకాశం రాలేదు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శనను చూస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము.ఇక్కడ ఏది వర్కౌట్ అయింది.. ఏది వర్కౌట్ కాలేదు అన్న విషయాలను విశ్లేషిస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి స్పష్టతతోనే ఉన్నాము’’ అని షుక్రి కన్రాడ్ చెప్పుకొచ్చాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.1-1తో సమంఇందులో భాగంగా తొలుత టెస్టులు జరుగగా.. 2-0తో సఫారీలు టీమిండియాను వైట్‌వాష్ చేశారు. అనంతరం.. వన్డే సిరీస్‌లో భారత్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఇక కటక్ వేదికగా తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు మార్పులలతో బరిలోకి దిగింది. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, ఓట్నీల్ బార్ట్‌మన్‌లను బరిలోకి దించింది. బార్ట్‌మన్ నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20లో ఆడిన తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.చదవండి: భారత్ X పాకిస్తాన్ -
గంభీర్, సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్పూర్ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపించింది మేనేజ్మెంట్. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (17)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్ బ్యాటింగ్ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్ కంటే ముందు అభిషేక్ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అక్షర్‌ను పంపించారనుకోవచ్చు.కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్‌తో పాటు మరో లెఫ్టాండర్ అక్షర్‌ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్‌ల తీరును స్టెయిన్ తప్పుబట్టాడు.కాగా సిరీస్ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్ జోడీ మాత్రమే ఫిక్స్‌డ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.అయితే, టీ20 ఓపెనర్‌గా గిల్‌ను పంపడం కోసం.. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు. -
ఈసారి గోల్డెన్ డకౌట్.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?
భారత టీ20 జట్టు ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్‌తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్‌గా మొండిచేయిఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్‌లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్ డక్తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్‌కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్‌లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా గిల్‌ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మెరుగ్గా ఆడుతున్న గిల్‌ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్ మ్యాచ్‌లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్‌తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపింది.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం! -
డికాక్ విధ్వంసం.. సౌతాఫ్రికా భారీ స్కోరు
టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో.. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏకంగా 213 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగగా.. ఆదిలోనే రీజా హెండ్రిక్స్ (8) అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ తొలి బంతికే అతడిని బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో డికాక్ సెంచరీ మిస్సయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో లేని పరుగుకు యత్నించి మూల్యం చెల్లించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వేగంగా స్పందించి డికాక్‌ను రనౌట్ చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.ఇక డికాక్‌కు తోడుగా కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ (26 బంతుల్లో 29) ఓ మోస్తరుగా రాణించాడు. రెండో వికెట్‌కు డికాక్‌తో కలిసి 83 పరుగులు జోడించాడు. చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ (14)విఫలం కాగా.. ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. భారత్‌కు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. డికాక్‌ను వికెట్ కీపర్ జితేశ్ శర్మ రనౌట్ చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో సౌతాఫ్రికాకు భారత్ 22 పరుగులు సమర్పించుకుంది.ఇక భారత పేసర్లలో అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చుకోగా.. పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 45 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లలో 34, శివం దూబే రెండు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. వరుణ్ పూర్తి కోటాలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు.. అక్షర్ మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. కానీ
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ముల్లన్పూర్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్‌వాష్ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్పూర్ ఆతిథ్యమిస్తోంది.పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.క్వింటన్ డికాక్ జోరుఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.12 ఇన్నింగ్స్లోనేఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్ కంటే ముందు వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్‌కు 20 ఇన్నింగ్స్.. బట్లర్‌కు 24 ఇన్నింగ్స్ అవసరం కాగా.. డికాక్ 12 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. తొందరపాటు చర్యతోకానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్ రనౌట్ అయ్యాడు. పదహారో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షాట్ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్ జితేశ్ శర్మ స్టంప్స్‌కు గిరాటేశాడు. దీంతో డికాక్ రనౌట్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీఎంట్రీలో డికాక్ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన డికాక్.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్ భారతి! -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్ (90), బౌలింగ్‌లో ఓట్నీల్ బార్ట్‌మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఓటమి అంచుల్లో టీమిండియా19వ ఓవర్లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత శివమ్ దూబే (1), ఆతర్వాత అర్షదీప్ సింగ్‌ను (4), వరుణ్ చక్రవర్తి (0) ఔటయ్యారు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా14.2వ ఓవర్- 118 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. సిపాంమ్లా బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (20) ఔటయ్యాడు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-4తిలక్ వర్మ 18 బంతులలో 32, హార్దిక్ పాండ్యా 4 పరుగులు.. విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం👉7.3: బార్ట్‌మాన్ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన అక్షర్ పటేల్ (21). స్కోరు: 67-4 (7.4)👉పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 51-3 (6)👉 3.5: మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన సూర్య (5). స్కోరు: 32-3 (4).👉1.6: మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (8 బంతుల్లో 17). స్కోరు: 19-2 (2).👉మరో ప్రయోగం.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్👉0.5: మరోసారి శుబ్‌మన్ గిల్ విఫలం.. ఎంగిడి బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్. గత మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసిన గిల్... భారత్ స్కోరు: 9-1 (1)సౌతాఫ్రికా భారీ స్కోరు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?👉డికాక్ మెరుపులు (46 బంతుల్లో 90- 5 ఫోర్లు, 7 సిక్సర్లు).. రాణించిన డొనోవాన్ (16 బంతుల్లో 30 నాటౌట్), మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్)👉భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి రెండు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్👉సౌతాఫ్రికా స్కోరు: 213-4.. టీమిండియా లక్ష్యం 214 టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్👉ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా భారీస్కోరు: 213-4👉16.1: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరిన డెవాల్డ్ బ్రెవిస్ (14)👉15.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్ రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా👉15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156-2 👉11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన మార్క్రమ్ (29) 👉10.3: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా👉పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 90-1 👉8.3: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్వింటన్ డికాక్.👉పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 53-1👉4.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) అవుట్👉ముల్లన్పూర్ స్టేడియంలో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్టాండ్ ఆవిష్కరణఎలాంటి మార్పులూ లేవుటాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. ‘‘ఈ మైదానం అద్భుతమైనది. ఇక్కడ మేము ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాము. పురుషుల క్రికెట్లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదేనని తెలిసి సంతోషంగా ఉంది.ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మేము తొలుత బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగుంది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.సంజూకు మరోసారి మొండిచేయికాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓపెనర్‌గా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (4) విఫలమైనా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గిల్ రాకతో ఓపెనింగ్ స్థానం కోల్పోయిన సంజూ శాంసన్ (Sanju Samson).. వికెట్ కీపర్‌గానూ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేకపోయాడు. అతడి స్థానంలో తొలి టీ20లో ఆడిన జితేశ్ శర్మ (Jitesh Sharma)నే మేనేజ్మెంట్ కొనసాగింది. దీంతో సంజూకు మరోసారి మొండిచేయి ఎదురైంది.మూడు మార్పులతో బరిలోకిమరోవైపు.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నట్లు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, బార్ట్‌మన్‌లను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. మరోసారి తేమ ప్రభావం చూపనుందని.. ఒకవేళ తాము టాస్ గెలిచినా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. ఆల్ ఫార్మాట్ సిరీస్లుకాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఈ ఆల్ ఫార్మాట్ సిరీస్‌లలో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌లో సఫారీలు దుమ్ములేపారు. అనూహ్య రీతిలో పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై 2-0తో వైట్‌వాష్ చేశారు. అయితే, వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి భారత్ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇక కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలుపొందిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు -
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్ తప్పు చేశాడా?
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు.175 పరుగులుకటక్ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ కుప్పకూలినా హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్)కు తోడు తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాణించిన బౌలర్లుభారత బౌలర్లలో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు.. పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్‌లో సఫారీ స్టార్, టాప్ రన్ స్కోరర్ డెవాల్డ్ బ్రెవిస్ (22)ను అవుట్ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్లో చేరాడు. అదే విధంగా.. కేశవ్ మహరాజ్ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.Boom boom, Bumrah! 🤩😎Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L— Star Sports (@StarSportsIndia) December 9, 2025అంపైర్ తప్పు చేశాడా?సఫారీ జట్టు ఇన్నింగ్స్‌లో బుమ్రా పదకొండో ఓవర్లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్ ఎదుర్కొన్నాడు. ఫుల్ స్వింగ్‌తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్ దాటేసినట్లుగా కనిపించింది. దీంతో ఫ్రంట్-ఫుట్ నోబాల్ కోసం చెక్ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్‌ను థర్డ్ అంపైర్ పెవిలియన్‌కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్‌దీప్ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరేలసిత్ మలింగ (శ్రీలంక)టిమ్ సౌతీ (న్యూజిలాండ్)షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్At least show us another angle pic.twitter.com/NjDZ2lcxQT— Werner (@Werries_) December 9, 2025 -
సంజూ శాంసన్ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!
సంజూ శాంసన్.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కినా.. వన్‌డౌన్‌లో... ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.ఫలితంగా.. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ స్థానాన్ని జితేశ్ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!వికెట్ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీటఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్‌ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్ శర్మ స్పందించాడు.నాకు పెద్దన్న లాంటివాడు‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.సంజూ భయ్యా గొప్ప ప్లేయర్. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄6⃣, 4⃣, 6⃣Hardik Pandya 🤝 Jitesh Sharma Updates ▶️ https://t.co/tiemfwcNPh#TeamIndia | #INDvSA | @hardikpandya7 | @jiteshsharma_ | @IDFCFIRSTBank pic.twitter.com/806L1KmQac— BCCI (@BCCI) December 9, 2025భారత్ ఘన విజయంకాగా కటక్ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జితేశ్ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్లో భాగమై కీపర్‌గానూ సత్తా చాటాడు.మరోవైపు.. ఓపెనర్ గిల్ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజ వేసింది. చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్Total dominance from Team India! 💥🇮🇳#SouthAfrica suffer their lowest T20I score as #India storm to a 101-run win their 3rd highest margin of victory against SA to go 1–0 up in the series! 💪#INDvSA 👉 2nd T20I 👉 11th DEC, 6 PM onwards pic.twitter.com/uwoZvWJa6Y— Star Sports (@StarSportsIndia) December 9, 2025 -
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’
టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్‌గా గిల్ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదుక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.కానీ ఇక్కడ అలా కాదుకానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్ మైండ్‌సెట్ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.కనీసం ఒక్క హాఫ్ సెంచరీఅయితే, శుబ్‌మన్ గిల్ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్‌లలో అతడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేయాలి.లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనాకాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్‌ను.. టీ20లలోనూ కెప్టెన్‌గా చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 175/6(20)👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, ఒక వికెట్).చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
అతడొక అద్భుతం.. నమ్మబుద్ధికాలేదు: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలో తడబడినా.. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరచడంతో మెరుగైన స్కోరు సాధించింది.50- 50 అనుకున్నాంఅనంతరం బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకుని సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు. ‘‘టాస్ సమయంలో గెలుపు అవకాశాలు 50- 50 అనుకున్నాం. ఏదేమైనా తొలుత బ్యాటింగ్ చేయడం సంతోషంగా అనిపించింది.48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఆ తర్వాత తేరుకుని 175 పరుగులు చేయగలిగాము. హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్, తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివర్లో జితేశ్ శర్మ (Jitesh Sharma)కూడా తన వంతు పాత్ర పోషించాడు.నమ్మశక్యం కాని విషయంతొలుత మేము 160 పరుగుల వరకు చేయగలుగుతామని అనుకున్నాం. అయితే, 175 పరుగులు సాధించడం అన్నది నమ్మశక్యం కాని విషయం. 7-8 మంది బ్యాటర్లలో ఇద్దరు- ముగ్గురు పూర్తిగా విఫలమైనా.. మిగిలిన నలుగురు రాణించి దీనిని సుసాధ్యం చేశారు.టీ20 క్రికెట్లోని మజానే ఇది. తదుపరి మ్యాచ్‌లో మా బ్యాటర్లంతా మెరుగ్గా ఆడతారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాము. టీమిండియా టీ20 ప్రయాణం గొప్పగా సాగుతోంది.అర్ష్‌దీప్, బుమ్రా పరిపూర్ణమైన బౌలర్లు. మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే వాళ్లిద్దరే బౌలింగ్ అటాక్ ఆరంభించేవారు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయి ఏమిటో మరోసారి చూపించాడు. Hard-hit Pandya is back in business! 🙌💪Two mammoth maximums in the same over and the crowd in Cuttack begins to chant his name. 🤩#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/VYKUx3OhVT— Star Sports (@StarSportsIndia) December 9, 2025అతడొక అద్భుతం.. నిజంగా అద్భుతం చేశాడు. ఏదేమైనా అతడిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అతడి బౌలింగ్ పట్ల కూడా నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.టాపార్డర్ విఫలంకాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (17), శుబ్‌మన్ గిల్ (4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.ఆదుకున్న హార్దిక్ఇలాంటి దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59)తో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే (9 బంతుల్లో 11), జితేశ్ శర్మ (5 బంతుల్లో 10 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో కేవలం 74 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రొటిస్ జట్టు బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (14 బంతుల్లో 22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్‌గా ఈ కేరళ బ్యాటర్ అదరగొట్టాడు. వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తూ.. టాపార్డర్‌లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.విఫలమైనా.. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్‌కు జోడీగా వస్తున్న గిల్ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్‌గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.మరోవైపు.. గిల్ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కినా.. బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్‌డౌన్‌లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్‌కు పంపిస్తోంది.సంజూపై వేటు వేసి.. జితేశ్‌కు చోటుఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్మెంట్ తప్పించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్ శర్మను ఆడించింది.ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.గిల్‌కే పెద్దపీట వేస్తామన్న సూర్యసౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్‌లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.నిజానికి సంజూ ఓపెనర్‌గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్ ఓపెనర్‌గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాముసంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.టాపార్డర్‌లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్ ఆర్డర్లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. వరల్డ్‌కప్ ఆశలు ఆవిరేనా?మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
ఛీ.. ఇదేం బుద్ధి?: హార్దిక్ పాండ్యా ఆగ్రహం
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్‌లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..భార్య నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్ మొదలు బీచ్ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్‌మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.తీయకూడని యాంగిల్లో ఫొటో..‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.ప్రైవేట్ మూమెంట్అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్ మూమెంట్‌ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్‌లైన్స్ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.కాస్త మానవత్వం చూపండిప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.చదవండి: చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్ -
వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
భారత్- సౌతాఫ్రికా మధ్య మంగళవారం కటక్ వేదికగా తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నారు.టెస్టు సారథి గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా సఫారీలతో రెండో టెస్టు, వన్డే సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుని పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించిన గిల్.. నేరుగా తుదిజట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.మరోవైపు.. ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)చాన్నాళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. జితేశ్ శర్మకే ప్రాధాన్యంఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాలు పంచుకున్నాడు. గిల్ రాకతో సంజూ శాంసన్‌పై వేటు తప్పదన్న పఠాన్.. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మకే తొలి ప్రాధాన్యం దక్కుతుందని పేర్కొన్నాడు.శివం దూబేకు నో ఛాన్స్‌అదే విధంగా.. హార్దిక్ వల్ల ఓ ఆల్‌రౌండర్‌కు మొండిచేయి తప్పదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ ఉంటారన్న అతడు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌తో పాటు.. వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్ తుదిజట్టులో ఉంటాడన్న ఇర్ఫాన్ పఠాన్.. శివం దూబేకు ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు.ఇర్ఫాన్ ఓటు అర్ష్కేఇక పేసర్ల కోటాలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే, గత కొంతకాలంగా యువ పేసర్ హర్షిత్ రాణా కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. అతడికి గనుక మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వాలని భావిస్తే అర్ష్పైనే వేటు పడుతుందని అంచనా వేశాడు.ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలనని హర్షిత్ ఆస్ట్రేలియా గడ్డ మీద నిరూపించుకున్నాడని.. కాబట్టి యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాను మాత్రం అర్ష్‌దీప్‌కే ఓటు వేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
ఇక ధనాధన్ షురూ...
టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్ చేతిలో టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.పైగా నిలకడ లేని టీమ్‌తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్ కప్‌కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు. కటక్: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్‌లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా వరల్డ్ కప్ బరిలోకి దిగడానికి ముందు భారత్ 10 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో కూడా ఐదు టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. గిల్, పాండ్యా సిద్ధం... ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ గెలిచిన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ గిల్, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం. అభిషేక్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ చేయనుండగా సూర్య, తిలక్ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్ కీపర్‌గా సంజూ సామ్సన్, జితేశ్ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉంటారు. అక్షర్ పటేల్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ పోటీలో ఉన్నాడు. పేస్ ఆల్‌రౌండర్ కావాలంటే హర్షిత్ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్‌లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్రెవిస్‌పై దృష్టి... దక్షిణాఫ్రికా టీమ్ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్ల చేతిలో సిరీస్‌లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటగాడు డేవిడ్ మిల్లర్, పేసర్ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్రమ్ మెరుగైన ఫామ్‌లో ఉండటం కలిసి రావచ్చు. ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్‌లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్ బ్రెవిస్‌పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్‌తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్ ఆల్‌రౌండ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్ పిచ్. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్‌కు ఇబ్బంది లేకపోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్, తిలక్, జితేశ్ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్/సుందర్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్గిడి, మహరాజ్. -
భువనేశ్వర్‌కు చేరుకున్న టీమిండియా (వీడియో)
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం సొంతం చేసుకుంది. మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కటక్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆదివారం రాత్రి భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. ప్రోటీస్, భారత్ జట్లకు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మహంతి స్వాగతం పలికారు. వైజాగ్ నుంచి అర్ష్‌దీప్, నితీశ్ కుమార్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు భువనేశ్వర్ చేరుకోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి వారు ముంబై నుంచి నేరుగా జట్టులో కలిశారు. ఇరు జట్లు సోమవారం బారాబతి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరు కానున్నారు. స్టేడియం, హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పంకజ్ లోచన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు టీ20ల్లో ఆడనుండడం ఖాయం. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఇప్పటికే ఫిట్నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును సఫారీలపై కొనసాగించాలని ఈ బరోడా ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20లకు అందుబాటులోకి వచ్చాడు.సఫారీలతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ. So Sanju Samson reached Cuttack. Today Kerala will be playing without Sanju Samson. This reminds me off 90s Indian team without Sachin. I don't think we will cross 100 without Sanju pic.twitter.com/tiuPi1TAj0— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) December 8, 2025 -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. సఫారీ జట్టుతో తొలి టీ20 నుంచే అతడు అందుబాటులోకి రానున్నాడు.ఫిట్నెస్ సాధించాడుభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వర్గాలు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించాయి. గిల్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించినట్లు తెలిపాయి. ఈ మేరకు.. ‘‘CoEలో శుబ్‌మన్ గిల్ తన పునరావాసం పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడేందుకు ఫిట్నెస్ సాధించాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 9న కటక్ వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA T20Is) మధ్య మొదలయ్యే టీ20 సిరీస్‌కు గిల్ అందుబాటులోకి రానున్నాడు. కాగా స్వదేశంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. సఫారీల చేతిలో భారత జట్టు 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.మెడనొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. తొలి టెస్టు సందర్భంగానే గిల్ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత.. అతడు రెండో టెస్టుతో పాటు.. వన్డే సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.ఈ క్రమంలో గిల్ టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ప్రొటిస్ టీమ్‌తో పొట్టి సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటిచ్చిన యాజమాన్యం ఫిట్నెస్ ఆధారంగా జట్టుతో కొనసాగేది.. లేనిది తేలుతుందని పేర్కొంది. తాజాగా గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు వెల్లడించింది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్, ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్👉మొదటి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా👉రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్👉మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్👉నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్👉ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు -
భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు
భారత్‌తో కీలక మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. పేసర్ నండ్రీ బర్గర్ (Nandre Burger), బ్యాటర్ టోనీ డీ జోర్జి (Tony de Zorzi) గాయాల కారణంగా విశాఖపట్నం మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికా క్రికెట్ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. గాయాల కారణంగా..టీమిండియాతో రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే సందర్భంగా.. ఫాస్ట్ బౌలర్ నండ్రీ బర్గర్‌కు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. మరోవైపు.. డి జోర్జి కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరనికి శుక్రవారం స్కానింగ్‌కు పంపగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.టీ20 సిరీస్ మొత్తానికి అతడు దూరంఫలితంగా బర్గర్, డి జోర్జికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ వెల్లడించింది. డి జోర్జి భారత్‌తో ఆఖరి వన్డేతో పాటు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొత్తానికి కూడా దూరమైనట్లు తెలిపింది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.క్వెనా మఫాకా సైతం..అదే విధంగా.. యువ ఫాస్ట్ బౌలర్ క్వెనా మఫాకా కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రొటిస్ బోర్డు.. అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలిపింది. కాబట్టి టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. జట్టు నుంచి అతడు నిష్క్రమించాడని.. మఫాకా స్థానంలో లూథో సిపామ్లను టీ20 జట్టులోకి చేర్చినట్లు వెల్లడించింది.టెస్టులలో పైచేయి.. వన్డేలలో 1-1తో..కాగా టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత ఆతిథ్య జట్టును టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ చేశారు సఫారీలు.ఇక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన ప్రొటిస్ జట్టు.. రెండో వన్డేలో గెలిచి 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే ఆఖరిదైన శనివారం నాటి మూడో వన్డేకు విశాఖపట్నం వేదిక. ఆ తర్వాత డిసెంబరు 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌కు తెరలేస్తుంది.చదవండి: చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్ -
పాకిస్తాన్ క్రికెటర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ముక్కోణపు టీ20 సిరీస్‌కాగా స్వదేశంలో శ్రీలంక- జింబాబ్వేలతో పాకిస్తాన్ ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్- శ్రీలంక (Pakistna vs Sri Lanka) ఫైనల్ చేరగా.. శనివారం (నవంబరు 29) రావల్పిండి వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లంక బ్యాటింగ్ చేసింది.కుప్పకూలిన లంక బ్యాటింగ్ ఆర్డర్ఓపెనర్ కామిల్ మిశారా (59) తప్ప మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. 19.1 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి లంక ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi), మొహమ్మద్ నవాజ్ చెరో మూడు వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) రెండు, సల్మాన్ మీర్జా, సయీమ్ ఆయుబ్ చెరో వికెట్ కూల్చారు.రాణించిన పాక్ టాపార్డర్అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (23), సయీబ్ ఆయుబ్ (36) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.మిగిలిన వారిలో కెప్టెన్ సల్మాన్ ఆఘా(14)తో పాటు ఫఖర్ జమాన్ (3) విఫలమయ్యారు. అయితే, పవన్ రత్ననాయకే బౌలింగ్‌లో దసున్ షనక క్యాచ్ పట్టడంతో ఫఖర్ జమాన్ అవుట్ కాగా.. అంపైర్ నిర్ణయాన్ని ఫఖర్ వ్యతిరేకించాడు. పాక్ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్లో ఈ మేరకు ఆన్‌ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా.. అతడితో వాగ్వాదానికి దిగాడు.ఫఖర్ జమాన్ ఓవరాక్షన్.. షాకిచ్చిన ఐసీసీఈ నేపథ్యంలో ఫఖర్ జమాన్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఫఖర్ జమాన్ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కాబట్టి ఓ మెరిట్ పాయింట్ మాత్రమే జత చేస్తున్నాం.అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం పట్ల ధిక్కారం చూపినందుకు గానూ అతడికి శిక్ష విధిస్తున్నాం. అతడు కూడా తన తప్పిదాన్ని అంగీకరించాడు’’ అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలంలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు చేరితే.. సదరు ప్లేయర్ తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం పడుతుంది. చదవండి: IND vs SA: మనసు మార్చుకున్న గంభీర్..! -
ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా?
భారతదేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే.. సగటు అభిమాని ఎగిరి గంతేయడం ఖాయం. అయితే, అందుకోసం టికెట్లు సంపాదించే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించడం విచారకరం. ఒడిషాలోని కటక్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది.ఆల్ ఫార్మాట్ సిరీస్‌లతో బిజీటీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత టెస్టు సిరీస్‌లో ప్రొటిస్ జట్టు చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. రాంచి వేదికగా తొలి వన్డేలో గెలిచింది. అయితే, రాయ్‌పూర్‌లో రెండో వన్డేలో ఓడటంతో సిరీస్ 1-1తో సమం కాగా.. విశాఖపట్నంలో జరిగే మూడో వన్డేతో సిరీస్ ఫలితం తేలనుంది. ఆఫ్‌లైన్ టికెట్ల కోసంఇక వన్డే సిరీస్ తర్వాత భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో డిసెంబరు 9న జరిగే టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఆరంభంలో ఆన్లైన్లో టికెట్ల అమ్మకం చేపట్టగా.. త్వరితగతిన సేల్ ముగిసిపోయింది.ఈ క్రమంలో ఆఫ్‌లైన్ టికెట్ల కోసం శుక్రవారం అభిమానులు పెద్ద ఎత్తున బారాబతి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందురోజు రాత్రి 11. 30 నిమిషాలకే కొంతమంది స్టేడియం వద్దకు చేరుకోవడం గమనార్హం.ఏకంగా రూ. 11 వేలకు కూడా..స్థానిక ఒడిశా టీవీ కథనం ప్రకారం.. భారత్- సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో బ్లాకులో టికెట్లు అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి. టికెట్ ధర రూ. 1100 ఉండగా.. దానిని సుమారుగా ఆరు వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్ల విక్రయం జరిగినట్లు సమాచారం.ఇలా ఓవైపు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంటే.. మరోవైపు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి టికెట్ల కోసం అభిమానులు ప్రాణాలకు తెగించడం గమనార్హం. టికెట్ల కోసం స్టేడియం వద్ద పరుగులు తీస్తున్న అభిమానులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఇదేం పిచ్చి?.. ప్రాణాలంటే కూడా లెక్కలేదా? మ్యాచ్ చూడటం వల్ల ఒరిగే లాభం ఏమిటి?’’ అని కొంతమంది నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.బీసీసీఐ ఏం చేస్తోంది?భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విధానం ప్రకారం.. వంద శాతం టికెట్లను ఆన్లైన్లో అమ్మడానికి వీలులేదు. కొద్దిమేర టికెట్లు కచ్చితంగా ఆఫ్‌లైన్‌లో విక్రయించాల్సిన పరిస్థితుల్లో కొన్ని క్రికెట్ అసోసియేషన్లు ఇందుకు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నాయి. దీంతో తొక్కిసలాట జరిగే దుస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలో వంద శాతం టికెట్లు ఆన్లైన్లో విక్రయించి.. టికెట్‌తో పాటు సరైన ఐడీ ప్రూఫ్ ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!Massive turnout at Barabati Stadium today as fans line up for India–South Africa T20 tickets.One hopes @dcp_cuttack, @cpbbsrctc & @Satya0168 have ensured proper crowd-control arrangements, because the visuals below tell a different story--something essential is missing to keep… pic.twitter.com/heRx96QDFT— Soumyajit Pattnaik (@soumyajit) December 5, 2025 -
BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.హార్దిక్ రీఎంట్రీ.. రింకూపై వేటుఇక వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఫిట్నెస్ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్ (Rinku Singh)పై ఈసారి వేటుపడటం గమనార్హం. ఇవి తప్ప రెగ్యులర్ టీ20 జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది.టెస్టులలో వైట్‌వాష్.. వన్డేలలో జోరుకాగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తొలి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో డిసెంబరు 6న మూడో మ్యాచ్‌తో వన్డే సిరీస్ ముగియనుండగా.. డిసెంబరు 9- 19 వరకు టీ20 సిరీస్ నిర్వహిస్తారు. ఇక ప్రొటిస్ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పితో క్రీజును వీడిన టెస్టు సారథి గిల్.. రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న గిల్.. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
అభిషేక్ శర్మ అట్టర్‌ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్
టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 ఎలైట్ రెండో రౌండ్లో ఇద్దరూ విఫలమయ్యారు. దీంతో అభిషేక్ శర్మ సారథ్యం వహిస్తున్న పంజాబ్ జట్టుకు.. సంజూ కెప్టెన్‌గా ఉన్న కేరళ జట్టుకు ఓటములు ఎదురయ్యాయి.ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా పంజాబ్- హర్యానా (Punjab Vs Haryana ) శుక్రవారం తలపడ్డాయి. జింఖానా మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు సాధించింది.సరిగ్గా 207 పరుగులే చేసి..హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51), వన్‌డౌన్ బ్యాటర్ నిషాంత్ సింధు (32 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28) వేగంగా ఆడాడు. ఫలితంగా హర్యానా ఈ మేర స్కోరు సాధించింది.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి సరిగ్గా 207 పరుగులే చేసింది. కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ (Abhishek Sharma- 5 బంతుల్లో 6) దారుణంగా విఫలమైనా.. అన్మోల్ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81), సన్వీర్ సింగ్ (16 బంతుల్లో 36 నాటౌట్) అదరగొట్టారు.ఇక స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా హర్యానా గెలుపొందింది. సన్వీర్ సింగ్ (0), రమణ్‌దీప్ సింగ్ (1) విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.కేరళకు పరాభవంమరోవైపు.. తొలి మ్యాచ్‌లో ఒడిశాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేరళ.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. లక్నోలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన కేరళకు ఆదిలోనే షాకులు తగిలాయి. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఓపెనర్లు సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ ఈసారి చేతులెత్తేశారు. సంజూ 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేయగా.. రోహన్ 14 బంతుల్లో 8 పరుగులే చేసి అవుటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అహ్మద్ ఇమ్రాన్ (12) సహా అబ్దుల్ బాసిత్ (7), సల్మాన్ నిజార్ (18), అఖిల్ స్కారియా (16), షరాఫుద్దీన్ (6) విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయిన కేరళ కేవలం 117 పరుగులే చేసింది. దీంతో రైల్వేస్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఇద్దరూ విఫలం కావడంతో..ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా పరిణమించింది. తదుపరి మ్యాచ్‌లలో ఇద్దరూ సత్తా చాటి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా డిసెంబరు 9- 19 వరకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20లు జరుగనున్న విషయం తెలిసిందే. -
IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల
భారత మహిళా క్రికెట్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్ విడుదుల చేసింది. సొంతగడ్డపై భారత జట్టు శ్రీలంకతో డిసెంబరు 21 నుంచి డిసెంబరు 30 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపింది.ఈ సిరీస్‌కు విశాఖపట్నం, తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ (BCCI) తన ప్రకటనలో పేర్కొంది. నిజానికి భారత్- బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య సిరీస్ జరగాల్సింది. ఇందుకోసం భారత జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 2026కు ఈ టూర్‌ను వాయిదా వేశారు.టీ20 ప్రపంచకప్-2026కి సన్నాహకంగాఈ క్రమంలో శ్రీలంకతో భారత్ (IND vs SL T20Is) మ్యాచ్‌లు ఆడే విధంగా తాజాగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు.. శ్రీలంకతో టీ20 సిరీస్ ద్వారా తమ తదుపరి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.ఇంగ్లండ్ వేదికగా జూన్ 12- జూలై 5 వరకు జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇరుజట్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు మహిళల ప్రీమియర్ లీగ్‌తో బిజీగా కానున్నారు.మహిళల ప్రీమియర్ లీగ్ వేదికలు ఇవేనవీ ముంబై, వడోదర వేదికలుగా జనవరి 9 - ఫిబ్రవరి 5 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15- మార్చి 6 వరకు మల్టీ ఫార్మాట్ టోర్నీ ఆడనుంది.భారత్ వర్సెస్ టీ20 సిరీస్ షెడ్యూల్👉డిసెంబరు 21- ఆదివారం- తొలి టీ20- విశాఖపట్నం👉డిసెంబరు 23- మంగళవారం- రెండో టీ20- విశాఖపట్నం👉డిసెంబరు 26- శుక్రవారం- మూడో టీ20- తిరువనంతపురం👉డిసెంబరు 28- ఆదివారం- నాలుగో టీ20- తిరువనంతపురం👉డిసెంబరు 30- మంగళవారం- ఐదో టీ20- తిరువనంతపురం.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
సంజూ, గిల్ కాదు!.. వాళ్లిద్దరే సరిజోడి
భారత టీ20 జట్టులో శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అవసరమా?.. క్రికెట్ వర్గాల్లో చాన్నాళ్లుగా ఇదే చర్చ. టెస్టు, వన్డేల్లో సత్తా చాటుతూ ఏకంగా కెప్టెన్‌గా ఎదిగిన ఈ పంజాబీ బ్యాటర్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోవడం ఇందుకు కారణం.దాదాపు ఏడాది కాలం పాటు భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్‌ను.. సెలక్టర్లు ఆసియా కప్ సందర్భంగా వైస్ కెప్టెన్‌గా తిరిగి తీసుకువచ్చారు. దీంతో అప్పటిదాకా ఓపెనింగ్ జోడీగా పాతుకుపోయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma)- సంజూ శాంసన్ (Sanju Samson) విడిపోయారు.అంతంత మాత్రమేగిల్ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇవ్వగా.. సంజూకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం అంటూ లేకుండా పోయింది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ గిల్ మరోసారి టీ20 ఫార్మాట్లో తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కేవలం 132 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో మరోసారి గిల్ విమర్శలు పాలయ్యాడు. అతడి కారణంగా సంజూ శాంసన్‌తో పాటు యశస్వి జైస్వాల్ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత టీ20 ఓపెనింగ్ జోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.అశ్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్‌కు.. టీ20లకు ఎలాంటి పోలికా ఉండదు. ప్రతి ఫార్మాట్ దేనికదే ప్రత్యేకం. ఏదేమైనా రెండు ఫార్మాట్లలో జైస్వాల్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు.పవర్ ప్లేలో సూపర్టెస్టుల్లో పరుగులు చేయడం ద్వారా అతడు టీ20 జట్టులోకి రాలేడు. కానీ ఇప్పటికే పొట్టి క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 160కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో సూపర్‌గా ఆడతాడు.అతడి సగటు కూడా బాగుంది. ప్రస్తుతం అభిషేక్ శర్మతో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగల సత్తా జైస్వాల్కే ఉంది. ఒకవేళ టీమిండియా అగ్రెసివ్ ఓపెనర్లను కోరుకుంటే వీళ్లిద్దరే సరిజోడి. అలా కాకుండా ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ కావాలనుకుంటే అభిషేక్- గిల్ జోడీవైపు మొగ్గు చూపవచ్చు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.వాళ్లిద్దరే సరి జోడీఅభిషేక్ శర్మ దూకుడుగా ఆడితే.. గిల్ మాత్రం నెమ్మదిగా ఆడతాడనే ఉద్దేశంలో అశూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇటీవల మరో మాజీ క్రికెటర్ రమేశ్ సదగోపన్ మాట్లాడుతూ.. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌లో గిల్.. టేబుల్ ఫ్యాన్‌ను తలపిస్తున్నాడంటూ విమర్శించిన విషయం తెలిసిందే. తుఫాన్ ఉన్నంత వరకు టేబుల్ ఫ్యాన్‌పై దృష్టి పడదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీమిండియా.. స్వదేశంలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. చదవండి: భారత జట్టులో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే -
అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్ తొలి స్పందన
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో గెలిచి బదులు తీర్చుకుంది. కంగారూ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో గెలిచి సత్తా చాటింది. ఇక వర్షం కారణంగా తొలి, ఐదో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)ను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున వందకు పైగా వికెట్లు తీసి హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్న అర్ష్‌ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)ను ఆడించడం విమర్శలకు దారితీసింది.అందుకే ఆడించారా?హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ప్రియ శిష్యుడైన కారణంగానే హర్షిత్‌కు తుదిజట్టులో చోటిచ్చి.. అర్ష్‌ను బలి చేస్తున్నారనే ట్రోల్స్ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు మూడో టీ20 నుంచి హర్షిత్‌ను తప్పించి.. అర్ష్‌దీప్‌ను ఆడించగా.. అతడు సత్తా చాటాడు.మూడో టీ20లో హర్షిత్‌ను బెంచ్‌కు పరిమితం చేసి అర్ష్‌దీప్‌ను తీసుకురాగా.. అతడు మూడు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా ఈ విషయాలపై స్పందించాడు.అన్నింటికంటే కష్టమైన పనిబీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కీలక ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చినపుడు మీరెలా హ్యాండిల్ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కోచ్‌గా నాకిదే అన్నింటికంటే కష్టమైన పని.నాణ్యమైన ఆటగాళ్లను బెంచ్ మీద కూర్చోబెట్టాల్సి వచ్చినపుడు వారితో ఆ విషయం చెప్పడం కఠినంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు తుదిజట్టులో ఆడేందుకు అర్హులే. కానీ కూర్పు దృష్ట్యా మేము మాకు కావాల్సిన పదకొండు మందినే ఎంచుకుంటాం.మ్యాచ్ పరిస్థితికి తగ్గట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ఓ ఆటగాడితో .. ‘నీకు ఈ మ్యాచ్‌లో అవకాశం లేదు’ అని చెప్పడం కష్టం. అయితే, కూడా అందుకు గల కారణాన్ని స్పష్టంగా వివరించడం వల్ల పెద్దగా సమస్యలు రావు.అతడిని అందుకే పక్కనపెట్టాంఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కోచ్, ప్లేయర్.. ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ ఇద్దరికీ కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి కఠినంగా ఉండక తప్పదు. అయితే, కోచ్ చెప్పే విషయంలో నిజం, నిజాయితీ, ముక్కుసూటితనం ఉందని ఆటగాడు తెలుసుకుంటే.. ఇక అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.చాలా మంది ప్లేయర్లు ఇలాంటి సమయంలో పరిణతితో వ్యవహరిస్తారు. ఏదేమైనా కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యం. బయట చాలా మంది ఇష్టారీతిన మాట్లాడుతూ.. వివాదాలు సృష్టించేందుకు థియరీలు కనిపెడుతుంటారు.అయితే, జట్టులో సమన్వయం ఉన్నపుడు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రభావం పడదు. డ్రెసింగ్‌రూమ్‌లో పారదర్శకత, నిజాయితీ అవసరం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం’’ అని గంభీర్ విమర్శలను కొట్టిపారేశాడు.చదవండి: కోచ్‌గా అలాంటి పని ఎప్పటికీ చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
నాకసలు ఇజ్జత్ ఉందా?.. ఏడుపు వచ్చింది: పాక్ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ (Moin Khan) కుమారుడిగా ప్రేక్షకులకు పరిచయమైన క్రికెటర్ ఆజం ఖాన్ (Azam Khan). పాక్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆజం.. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులే చేశాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్ ముగిసిన తర్వాత.. తిరిగి జాతీయ జట్టులో ఆజం ఖాన్ స్థానం సంపాదించుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా జట్టులో అతడికి చోటు కరువైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి కనీసం వంద పరుగులు కూడా చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.మీమ్ మెటీరియల్ అయ్యేవాడుఇందుకు తోడు ఆజం ఖాన్ భారీ కాయంపై కూడా విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కనీస ఫిట్నెస్ లేని ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్‌గానూ ఓ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయాడు. పదే పదే క్యాచ్‌లు డ్రాప్ చేస్తూ మీమ్ మెటీరియల్ అయ్యేవాడు.ఈ విషయాల గురించి ఆజం ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 2024లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా తాను అవహేళనకు గురయ్యాయని.. తన జీవితంలో అతిగా బాధపడ్డ సందర్భం అదేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.అభ్యంతరకర భాషలో దూషించారు‘‘ఆరోజు మార్క్ వుడ్.. తొలుత నాకు బౌన్సర్ సంధించాడు. నేను దానిని వదిలేశాను. పాకిస్తాన్లో కూడా గంటకు నూటా యాభై కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తారు కాబట్టి.. నాకు అదేమీ కొత్తగా అనిపించలేదు.కానీ ఆ తర్వాత కూడా మార్క్ వుడ్ మళ్లీ బౌన్సర్ వేశాడు. నేను దానినీ ఎదుర్కోలేకపోయాను. అపుడు నా జీవితం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. అసలు నాకేం అవుతుందో కూడా అర్థం కాలేదు.నా వేలికి గాయమైన తర్వాత.. నా పని అయిపోయిందని గ్రహించాను. అంతలోనే ఓవల్ స్టేడియంలోని ప్రేక్షకులు నన్ను అభ్యంతరకర భాషలో దూషించడం మొదలుపెట్టారు.నాకసలు ఇజ్జత్ ఉందా? అక్కడ ఒక పాకిస్తానీ రిపోర్టర్.. తాగి ఉన్న ఓ ఇంగ్లిష్ ప్రేక్షకుడిని.. ‘మీ అభిమాన పాకిస్తాన్ ఆటగాడు ఎవరు?’ అని అడిగారు. ఇందుకు బదులుగా అతడు.. ‘ఆజం ఖాన్.. అతడు బ్యాటింగ్ చేయలేడు. ఫీల్డింగ్ చేయలేడు’ అంటూ నాపై సెటైర్లు వేశారు.అది వినగానే నా హృదయం ముక్కలైంది. నాకసలు ఇజ్జత్ (గౌరవం) ఉందా? నా గురించి జనాలు ఇలా అనుకుంటున్నారా? అని బాధలో కూరుకుపోయా. సులువైన క్యాచ్‌లను కూడా జారవిడిచా.ఏడుపు తన్నుకొచ్చి కన్నీళ్లు కారాయి. అసలు నాకే ఇలా ఎందుకు అవుతోంది అనుకుంటూ ఏడ్చేశా’’ అని ఆజం ఖాన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా నాటి మ్యాచ్‌లో ఆజం ఖాన్ డకౌట్ కాగా.. పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డకౌట్ బ్యాటర్ ఆజం ఖాన్‌పై మరోసారి విమర్శల వర్షం కురిసింది.చదవండి: వన్డే ఆల్‌టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు -
'మా కుర్రాళ్లు అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది'
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. శనివారం బ్రిస్బేన్ వేదికగా ఆసీస్-భారత్ మధ్య ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయంపై ప్రెజెంటేషన్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. టీ20 సిరీస్‌ను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని సూర్య తెలిపాడు.మా కుర్రాళ్లు అద్భుతం.."వాస్తవానికి వాతావరణం మన నియంత్రణలోని ఆంశం. కార్బెర్రాలో పూర్తి మ్యాచ్ జరిగి ఫలితం రావాలని కోరుకున్నాము. దురదృష్టవశాత్తూ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. ఆ తర్వాత రెండో టీ20లో ఓటమి పాలైము. అనంతరం బలంగా తిరిగి పుంజుకుని వరుస విజయాలను సాధించాము. ఇందుకు క్రెడిట్ మా కుర్రాళ్లకు ఇవ్వాల్సిందే. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మేము మెరుగైన ప్రదర్శన చేశాము. బుమ్రా-అర్ష్‌దీప్ సింగ్‌లది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. అదేవిధంగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వాషింగ్టన్ సుందర్ ఏ ఫార్మాట్లో నైనా రాణించగలడు. వాషీ లాంటి ఆటగాడు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. వారు వ్యూహాలు సరిగ్గా అమలు చేసి జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. మాకు కావలసింది అదే. గుడ్ హెడెక్ ప్రతీ ఒక్కరూ అద్భుతంగా రాణిస్తుందున తుది జట్టు ఎంపిక మాకు గుడ్ హెడెక్ మారింది. ఆస్ట్రేలియాలో మేము మెరుగైన ప్రదర్శన చేశాము. స్వదేశంలో మేము దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో రెండు టీ20 సిరీస్‌లు ఆడనున్నాము. ఈ సిరీస్‌లను మేము టీ20 ప్రపంచకప్ సన్నహాకాలగా ఉపయోగించుకుంటాము. ఇటీవల భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు వారికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. సహజంగా సొంతగడ్డపై వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ అదే సమయంలో చాలా ఉత్సాహం,బాధ్యత ఉంటుంది. దేశంలో ఎక్కడ ఆడినా కూడా ప్రేక్షకుల నుంచి మద్దతు ఉంటుంది" అని సూర్య పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం -
ప్రతీకారం తీర్చుకున్న భారత్.. టీ20 సిరీస్ మనదే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకుంది. శనివారం బ్రిస్బేన్ వేదికగా ఆసీస్-భారత్ మధ్య జరుగుతోన్న ఐదో టీ20 వర్షం కారణంగా అర్ధంతరంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.తొలి టీ20 కూడా వర్షార్పణం కాగా.. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం సాధించింది. అనంతరం మూడు, నాలుగు టీ20ల్లో కంగారులను చేసిన భారత జట్టు.. సిరీస్‌లో 2-1తో ముందంజ వేసింది. ఆ తర్వాత కీలకమైన ఐదో టీ20 రద్దు కావడంతో సిరీస్ భారత్ కైవసమైంది. చివరి మ్యాచ్‌లో ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. తొలుత ఉరుములు, మెరుపులు రావడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత భారీ వర్షం కూడా తోడవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంపికయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు మ్యాచ్‌లలో 159.09 స్ట్రైక్ రేటుతో 140 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో మార్ష్ సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఆటగాడిగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో ఐదో టీ20 సందర్భంగా శనివారం నాటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేశాడు.పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటి.. గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.ఆస్ట్రేలియా పర్యటనలో..ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో ఉన్న అభిషేక్ శర్మ.. కంగారూ గడ్డపై సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగా ఆసీస్‌తో ఆడిన నాలుగు టీ20లలో వరుసగా.. 19, 68, 25, 28 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. 521 బంతుల్లో 989 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా బ్రిస్బేన్‌లో ఆఖరిదైన ఐదో టీ20లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.ఈ నేపథ్యంలో గాబా మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ ధనాధన్ దంచికొట్టడంతో 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు సాధించింది. మెరుపులు... వర్షం మొదలుకావడంతో అక్కడికి ఆటను ఆపివేశారు. ఆటగాళ్లను డ్రెసింగ్‌రూమ్‌లోకి పిలిచారు.రెండుసార్లు లైఫ్కాగా ఈ మ్యాచ్‌లో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ శర్మకు లైఫ్ లభించింది. అతడు ఇచ్చిన క్యాచ్‌ను గ్లెన్ మాక్స్వెల్ జారవిడిచాడు. అదే విధంగా.. పదమూడు పరుగుల వద్ద ఉన్న వేళ బెన్ డ్వార్షుయిస్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అభిషేక్‌కు మరో లైఫ్ వచ్చింది.ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పదకొండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ టీ20లలో ఈ లెఫ్టాండర్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం అతడు తీసుకున్న బంతులు కేవలం 528.ప్రపంచ రికార్డుతద్వారా అతి తక్కువ బంతుల్లోనే ఈ మైలురాయి చేరుకున్న క్రికెటర్‌గా అభిషేక్ శర్మ చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గానూ నిలిచాడు. కాగా ఆట నిలిచేసరికి అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23, శుబ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులతో ఉన్నారు.అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు🏏అభిషేక్ శర్మ- 528 బంతుల్లో🏏సూర్యకుమార్ యాదవ్- 573 బంతుల్లో🏏ఫిల్ సాల్ట్- 599 బంతుల్లో🏏గ్లెన్ మాక్స్వెల్- 604 బంతుల్లో🏏ఆండ్రీ రసెల్, ఫిన్ అలెన్- 609 బంతుల్లో.తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు🏏విరాట్ కోహ్లి- 27 ఇన్నింగ్స్‌లో🏏అభిషేక్ శర్మ- 28 ఇన్నింగ్స్‌లో🏏కేఎల్ రాహుల్- 29 ఇన్నింగ్స్‌లో🏏సూర్యకుమార్ యాదవ్- 31 ఇన్నింగ్స్‌లో🏏రోహిత్ శర్మ- 40 ఇన్నింగ్స్‌లో.చదవండి: భారత జట్టుకు ఘోర పరాభవం.. కువైట్, యూఏఈ చేతిలో చిత్తు Pace off from the bowler, POWER ON from #AbhishekSharma! 🧨🤩Absolutely smashed over the ropes for a flat six! 💪#AUSvIND 👉 5th T20I | LIVE NOW 👉 https://t.co/KVDenaqq4f pic.twitter.com/aGYxqj5hhP— Star Sports (@StarSportsIndia) November 8, 2025 -
IND vs AUS: సిరీస్ భారత్‌దే
Australia vs India, 5th T20I Updates: ఐదో టీ20 రద్దు..భారత్- ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. తొలుత ఉరుములు, మెరుపులు రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత భారీ వర్షం కూడా తోడవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది.ఆగిన ఆట.. భారత్ స్కోరెంతంటే?4.5 ఓవర్ల వద్ద వాతావరణ మార్పు కారణంగా భారత్ బ్యాటింగ్ నిలిచిపోయింది. మెరుపులు, వాన మొదలుకావడంతో ఆట నిలిపివేశారు. ఇక ఆట ఆగే సరికి టీమిండియా స్కోరు: 52-0. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23, గిల్ 16 బంతుల్లో 29 పరుగులతో ఉన్నారు.గిల్ ధనాధన్మూడు ఓవర్లు ముగిసే సరికి భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ ఆరు బంతుల్లో 9, గిల్ 12 బంతుల్లో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్లో గిల్ డ్వార్షుయిస్ బౌలింగ్‌లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదడం విశేషం.తిలక్ వర్మకు విశ్రాంతిఇక నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో కీలక మార్పు చేసింది. బర్త్‌డే బాయ్ తిలక్ వర్మకు విశ్రాంతినిచ్చి.. రింకూ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా నాలుగో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది.కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ రెండు గెలవగా.. ఆసీస్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఫలితంగా 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా గాబాలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదో టీ20 తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా. -
ఆసీస్‌తో ఐదో టీ20.. భారత తుదిజట్టు ఇదే!
ఆస్ట్రేలియాతో ఐదో టీ20 (IND vs AUS 5th T20I)లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం నాటి నిర్ణయాత్మక మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సూర్యకుమార్ సేన సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కీలక టీ20లో తుదిజట్టు విషయంలో టీమిండియా యాజమాన్యం మార్పులు చేస్తుందా? లేదంటే విన్నింగ్ టీమ్‌నే కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.2-1తో భారత్ ముందంజ భారత్- ఆసీస్ మధ్య కాన్బెర్రాలో జరగాల్సిన తొలి టీ20 వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెల్బోర్న్లో ఆతిథ్య కంగారూ జట్టు చేతిలో ఓడిన సూర్యకుమార్ సేన.. హోబర్ట్, క్వీన్స్లాండ్ మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించింది. తద్వారా ఆధిక్యాన్ని 2-1కు పెంచుకుంది.ఇక మూడు, నాలుగో టీ20లలో టీమిండియా ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని జట్టులో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill), అభిషేక్ శర్మను కొనసాగించిన మేనేజ్మెంట్.. తిలక్ వర్మ, శివం దూబే (Shivam Dube), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాలను ఆడించింది.వారం తిరగకముందేవిమర్శల వర్షం వెల్లువెత్తడంతో ఈ రెండు మ్యాచ్‌ల నుంచి యువ పేసర్ హర్షిత్ రాణాను తప్పించినప్పటికీ.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్‌కు చోటిచ్చి సంజూపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. ఐదో టీ20 ముగియగానే స్వదేశానికి చేరుకోనున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. వారం తిరగకముందే మళ్లీ బిజీ కానుంది.బుమ్రాకు విశ్రాంతి?ఈ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే విధంగా.. టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు రెస్ట్ ఇస్తారనుకున్నా.. ఇంత వరకు అతడు ఈ సిరీస్‌లో తనను తాను నిరూపించుకోలేకపోయాడు. కాబట్టి కీలక మ్యాచ్‌లో ఓపెనర్‌గా సత్తా చాటేందుకు గిల్ సిద్ధంగా ఉన్నందున అతడిని పక్కనపెట్టే అవకాశం లేదు.సంజూకు మరోసారి మొండిచేయిఇక మిడిల్ ఆర్డర్లో టీ20 స్పెషలిస్టులు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబేలతో పాటు.. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తమ స్థానాలు నిలబెట్టుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. వికెట్ కీపర్‌గా ఈసారి కూడా జితేశ్ శర్మకే నాయకత్వ బృందం ఓటు వేసే అవకాశం ఉంది.కాబట్టి సంజూకు మరోసారి మొండిచేయి తప్పదు. ఇక ఇప్పటి వరకు ఆసీస్‌తో తాజా సిరీస్‌లో రింకూ సింగ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. అదే విధంగా.. గాయం వల్ల సిరీస్ ఆరంభం నుంచే జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి.హర్షిత్ రాణా జట్టులోకి!సిరీస్ డిసైడర్ కావున రింకూ, ఫిట్‌గా మారిన నితీశ్ రెడ్డిలను.. మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లో ఆడించే రిస్క్ చేయకపోవచ్చు. ఇక లోయర్ ఆర్డర్లో బుమ్రాకు గనుక విశ్రాంతినిస్తే.. హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇప్పటికే మూడు, నాలుగో టీ20లలో సత్తా చాటిన అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగడం ఖాయమే!.. అన్నట్లు భారత్- ఆసీస్ మధ్య ఐదో టీ20కి స్వల్ప వర్ష సూచన ఉంది.ఆస్ట్రేలియాతో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.చదవండి: ఐసీసీ కీలక నిర్ణయం -
అభిషేక్ శర్మపై సూర్యకుమార్ సెటైర్లు.. ఓపెనర్ రియాక్షన్ ఇదే
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘సింహం గడ్డి తినడం ఎప్పుడైనా చూశారా? .. ఈరోజు సింహం మెల్లమెల్లగా గడ్డి తినడం మొదలుపెట్టింది’’ అంటూ సరదాగా సెటైర్లు వేశాడు. ఇంతకీ ఇందుకు కారణం ఏమిటంటే?..మెరుగ్గానే..ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ (IND vs AUS T20Is)లో అభిషేక్ శర్మ మెరుగ్గా రాణిస్తున్నాడు. కాన్బెర్రా వేదికగా వర్షం కారణంగా అర్థంతరంగా రద్దైపోయిన తొలి టీ20లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 14 బంతుల్లో 19 (4 ఫోర్లు, స్ట్రైక్ రేటు- 135.71) పరుగులు రాబట్టాడు. ఇక మెల్బోర్న్లో జరిగిన రెండో టీ20లో అభిషేక్ ధనాధన్ దంచికొట్టాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 37 బంతుల్లోనే 68 పరుగులతో చెలరేగాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 183.78.అదే విధంగా..హోబర్ట్‌లో జరిగిన మూడో టీ20లోనూ అభిషేక్ ఫర్వాలేదనిపించాడు. 16 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 156కు పైగా స్ట్రైక్‌రేటుతో 25 పరుగులు చేశాడు. అయితే, క్వీన్స్‌లాండ్‌లో గురువారం ముగిసిన నాలుగో టీ20లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది.. 28 రన్స్ రాబట్టాడు. స్ట్రైక్‌రేటు 133.33.2-1తో ఆధిక్యంలోఇక ఆసీస్‌తో ఇప్పటికి నాలుగు టీ20లు ముగించుకున్న టీమిండియా.. రెండో టీ20లో ఓడి.. వరుసగా మూడు, నాలుగో మ్యాచ్‌లో గెలిచింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం బ్రిస్బేన్‌లో నిర్ణయాత్మక ఐదో టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.నవ్వుతూనే సెటైర్లు.. అభిషేక్ రియాక్షన్ ఇదేఈ నేపథ్యంలో బ్రిస్బేన్‌కు పయనమవుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్ శర్మతో సరదాగా అన్న మాటలు వైరల్‌గా మారాయి. నాలుగో టీ20లో అభిషేక్ స్ట్రైక్‌రేటును ఉద్దేశించి.. ‘‘సింహం గడ్డి తింటుందా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది’’ అంటూ నవ్వుతూనే సెటైర్లు వేశాడు. ఇందుకు బిత్తరపోయిన అభిషేక్ తేరుకుని.. తనూ గట్టిగా నవ్వేశాడు.కాగా నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్.. నాలుగో స్థానంలో వచ్చి 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఈ క్రమంలో ఆఖరిదైన ఐదో టీ20లోనూ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాఇదిలా ఉంటే.. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. దీంతో వన్డే కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గిల్ ఓటమి రుచిచూశాడు. అంతకు ముందు ఇంగ్లండ్ పర్యటనతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన గిల్ 2-2తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసి ఫర్వాలేదనిపించాడు.చదవండి: ‘గిల్ కోసం బలి.. సంజూను కాదని జితేశ్ శర్మను అందుకే ఆడిస్తున్నారు’SuryaKumar Yadav on Abhishek Sharma slow inning 😅#INDvsAUS #SuryakumarYadav pic.twitter.com/aRdMXjtMWQ— Vishal kr (@vishal_kr_31) November 6, 2025 -
‘అందుకే.. సంజూను కాదని జితేశ్ శర్మను ఆడిస్తున్నారు’
ఆసియా కప్-2025 సందర్భంగా భారత టీ20 జట్టులోకి శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తిరిగి వచ్చిన నాటి నుంచి సంజూ శాంసన్ (Sanju Samson) చిక్కుల్లో పడ్డాడు. గిల్ గైర్హాజరీలో దాదాపు ఏడాది పాటు ఓపెనర్‌గా అదరగొట్టిన ఈ కేరళ బ్యాటర్‌కు ఇప్పుడు తుదిజట్టులో చోటే కరువయ్యే పరిస్థితి నెలకొంది.ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలో తెలియదుఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంపికైనా.. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలో ఆఖరి నిమిషం వరకు తనకే తెలియని దుస్థితి. ఆస్ట్రేలియా తాజా పర్యటన (IND vs AUS)లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో సంజూను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఈ స్థానంలో సంజూ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులే చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.ఈ క్రమంలో మూడో టీ20 నుంచి సంజూను తప్పించిన యాజమాన్యం అతడి స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మకు చోటు కల్పించింది. ఏడో స్థానంలో వచ్చిన జితేశ్ 13 బంతుల్లో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో టీ20లో మాత్రం కేవలం మూడే పరుగులు చేసి నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా మేనేజ్మెంట్ మరో ప్రయోగం చేసింది. ఆల్‌రౌండర్ శివం దూబేను మూడో స్థానంలో పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్.. గిల్, సంజూ, జితేశ్‌లతో పాటు యశస్వి జైస్వాల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గిల్ కోసం బలి‘‘ఒకవేళ సంజూ శాంసన్ తుదిజట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయితే, వైస్ కెప్టెన్ హోదాలో శుబ్‌మన్ గిల్ అన్ని మ్యాచ్‌లు ఆడటం ఖాయం. అందుకే సంజూను పక్కనపెట్టారు.సంజూను కాదని ..ఇక ఐదు లేదంటే ఆరో స్థానంలో ఫినిషర్‌గా.. సంజూ కంటే జితేశ్ మెరుగు అని భావించి అతడి వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. గిల్ కాబోయే కెప్టెన్ కాబట్టి సంజూకు ఇక స్థానం దక్కకపోవచ్చు.ఏదేమైనా సంజూ రికార్డు అద్భుతంగా ఉంది. 150కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టాడు. కానీ ఇప్పుడు ఏ స్థానంలో ఎవరు బెటర్ అన్న అంశం ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తున్నారు కాబట్టి సంజూకు అవకాశం దక్కడం లేదు.గిల్ టీ20లలో మరీ అంత తీసిపారేసే బ్యాటరేమీ కాదు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా మెరుగ్గా ఆడుతున్నాడు. కానీ అంతర్జాతీయ ఫార్మాట్లోనే విఫలమవుతున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్ప అతడిపై విమర్శలు ఆగవు. సంజూతో పాటు జైసూ జట్టులోకి!అప్పుడే సంజూ, యశస్వి జైస్వాల్ గురించి ఎవరూ మాట్లాడరు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో గిల్‌కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపెనింగ్ స్థానంలో సంజూ, జైసూ జట్టులోకి రావొచ్చు. వీరిద్దరు గనుక మరోసారి నిరూపించుకుంటే.. వరల్డ్‌కప్ రేసులో తప్పక ఉంటారు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.కాగా ఆసీస్‌తో నాలుగు టీ20లలో కలిపి గిల్ కేవలం 103 పరుగులు రాబట్టాడు. ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో ఉండగా.. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక శనివారం నాటి ఐదో టీ20కి గబ్బా వేదిక.చదవండి: ICC: జై షా జోక్యం.. నాకూ వరల్డ్‌కప్ మెడల్: ప్రతికా రావల్ -
ఆ తప్పిదమే మా కొంపముంచింది: ఆసీస్ కెప్టెన్
సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 20 సిరీస్‌లో ఆస్ట్రేలియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం క్వీన్స్లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో ఆసీస్ ఘోర పరాజయం పాలైంది. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 30; 4 ఫోర్లు), మాథ్యూ షార్ట్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 91/3తో సునాయసంగా గెలిపించేలా కన్పించిన కంగారులు తర్వాతి 28 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకొని అనుహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది.ఇక నాలుగో టీ20లో ఓటమిపై ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బ్యాటింగ్‌లో వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యమని మార్ష్ చెప్పుకొచ్చాడు."ఈ పిచ్‌పై 168 పరుగుల టార్గెట్‌ను సులువుగా చేధించవచ్చు అనుకున్నాను. కానీ బ్యాటింగ్‌లో మాకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఛేజింగ్‌లో మాకు లభించిన ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాము. మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాము.మిడిల్ ఓవర్లలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నాము. కచ్చితంగా క్రెడిట్ భారత బౌలర్లకు ఇవ్వాల్సిందే. వారు కండీషన్స్‌కు తగ్గట్టు బౌలింగ్ చేసి మా పతనాన్ని శాసించారు. భారత్ ఒక వరల్డ్ క్లాస్ జట్టు. ఫార్మాట్ ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా అందుకు తగ్గట్టు రాణించే సత్తా వారికి ఉంది. ప్రతీ మ్యాచ్‌లోనూ మా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని కోరుకుంటాం. కానీ యాషెస్ సిరీస్ కారణంగా కొంతమంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నాము. అంతేకాకుండా ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఆఖరి మ్యాచ్‌లో కూడా మా ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మార్ష్ పేర్కొన్నాడు.చదవండి: T20 World Cup 2026: అహ్మదాబాద్‌లో ఫైనల్.. భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడంటే? -
నాలుగో టీ20లో భారత్ ఘన విజయం..
క్వీన్స్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్(India) ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక కంగారులు చతకలపడ్డారు. లక్ష్య చేధనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(30), మాథ్యూ షార్ట్(25) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అక్షర్ మ్యాజిక్..భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. అక్షర్ దూకుడుగా ఆడుతున్న షార్ట్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్ మూడు, శివమ్ దూబే రెండు, వరుణ్ చక్రవర్తి, బుమ్రా అర్ష్‌దీప్ సింగ్ తలా వికెట్ సాధించారు.రాణించిన గిల్..అంతకుముందు బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ అతడు 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఇక గిల్‌తో పాటు అభిషేక్ శర్మ(28), అక్షర్ పటేల్(21) రాణించారు.ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లతో సత్తాచాటారు. ఇక ఇరు జట్ల మధ్య ఐదో టీ20 బ్రిస్బేన్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే 3-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే 2-2 సిరీస్ సమంగా ముగుస్తుంది.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్Same matchup, same result! 😎Varun’s googly does the trick yet again as Maxwell’s off stump takes the hit! 🎯#AUSvIND 👉 4th T20I | LIVE NOW 👉 https://t.co/HUqC93tuuG pic.twitter.com/wrFxyTxV85— Star Sports (@StarSportsIndia) November 6, 2025 -
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. రోవ్‌మన్ పావెల్ విధ్వంసం.. కానీ..
న్యూజిలాండ్- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీ తలపడ్డాయి. మరి గెలుపు ఎవరిని వరించిందంటే..?!ఐదు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు విండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆక్లాండ్‌లో బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ వెస్టిండీస్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం అదే వేదికపై రెండో టీ20 జరిగింది. ఆక్లాండ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే (16), వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (11) మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (25 బంతుల్లో 39) రాణించాడు.కేవలం 28 బంతుల్లోనేఇక నాలుగో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది ఏకంగా 78 పరుగులు సాధించాడు. చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 8 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచాడు.Starring Mark Chapman: A Bowler’s Nightmare 🎥#NZvWI pic.twitter.com/KXWomWevnN— FanCode (@FanCode) November 6, 2025ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.ఓపెనర్ బ్రాండన్ కింగ్ (0)ను జేకబ్ డఫీ డకౌట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అలిక్ అథనాజ్ (25 బంతుల్లో 33), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (26 బంతుల్లో 24) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్లో అకీమ్ ఆగస్టి (7), జేసన్ హోల్డర్ (16) నిరాశపరచగా.. ఏడో నంబర్ ఆటగాడు రోస్టన్ చేజ్ (6) కూడా విఫలమయ్యాడు.రోవ్‌మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ.. విండీస్ పవర్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్, ఆరు సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించి జట్టును విజయానికి చేరువ చేశాడు.అతడికి తోడుగా రొమారియో షెఫర్డ్ (16 బంతుల్లో 34), మాథ్యూ ఫోర్డ్ (13 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో కివీస్ విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఆఖరి ఓవర్లో విండీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది.ఆఖరి ఓవర్లో కైలీ జెమీషన్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే ఫోర్డ్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత పరుగులేమీ రాలేదు. మూడో బంతి నోబాల్ కాగా ఫోర్డ్ మరో ఫోర్‌తో చెలరేగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో పావెల్ నాలుగో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చాడు.ఆఖరి బంతి వరకు ఉత్కంఠదీంతో విండీస్ కీలక వికెట్ కోల్పోగా.. అకీల్ హొసేన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదో బంతికి అకీల్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి విండీస్ విజయానికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. అయితే, ఇక్కడే జెమీషన్ మాయ చేశాడు. అద్భుత బంతిని సంధించగా.. ఫోర్డ్ సింగిల్‌కే పరిమితమయ్యాడు. దీంతో మూడు పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించిన ఆతిథ్య కివీస్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి, సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. డఫీ, జెమీషన్ చెరో వికెట్ తీశారు. చాప్‌మన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టీ20కి సాక్స్టన్ ఓవల్ వేదిక.చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్ -
IND vs AUS: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 18.2 ఓవర్లలో కేవలం 119 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.వారెవ్వా వాషీ.. అదరగొట్టిన అక్షర్, శివంలక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా భారత బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. జోష్ ఇంగ్లిస్ (12), టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), మార్కస్ స్టొయినిస్ (17) తీవ్రంగా నిరాశపరచగా.. గ్లెన్ మాక్స్వెల్ (2), బెన్ డ్వార్షుయిస్ (5), జేవియర్ బార్ట్లెట్ (0), నాథన్ ఎల్లిస్ (2 నాటౌట్), ఆడం జంపా (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేట్, శివం దూబే చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ ఆలౌట్18.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జంపా (0).. గిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ విజయం ఖరారైంది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా17.6: బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన డ్వార్షుయిస్ (5). స్కోరు: 118-9(18). విజయానికి చేరువైన టీమిండియా.ఎనిమిదో వికెట్ డౌన్16.5: వాషీ బౌలింగ్‌లో బార్ట్లెట్ బౌల్డ్ (0). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్. స్కోరు: 116-8(16.5). ఆసీస్ విజయానికి 19 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియాకు కేవలం రెండు వికెట్లు కావాలి.ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా16.4: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో స్టొయినిస్ (17) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా14.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మాక్స్వెల్ బౌల్డ్ (4 బంతుల్లో 2). దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 8 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 103-6 (15).ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా13.1: ఫిలిప్ (10 బంతుల్లో 10) రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అతడు వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 98-5(13.1). స్టొయినిస్ ఐదు పరుగులతో ఉండగా.. మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా11.3: శివం దూబే బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (9 బంతుల్లో 14). స్కోరు: 91-4(11.3). జోష్ ఫిలిప్ 8 పరుగులతో ఉండగా.. స్టొయినిస్క్రీజులోకి వచ్చాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా9.2: శివం దూబే బౌలింగ్‌లో మార్ష్ అర్ష్‌దీప్‌నకు క్యాచ్ ఇచ్చి మార్ష్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మార్ష్ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతడి స్థానంలో జోష్ ఫిలిప్ క్రీజులోకి రాగా.. టిమ్ డేవిడ్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 70-3(9.2).రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా8.5: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లిస్. 11 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ స్కోరు: 67-2(8.5). విజయానికి 67 బంతుల్లో 101 పరుగుల దూరంలో ఆసీస్ ఉండగా.. టీమిండియాకు ఎనిమిది వికెట్లు కావాలి. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాగా.. మార్ష్ 30 పరుగులతో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా4.5: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ దీనిని నాటౌట్‌గా ప్రకటించగా.. టీమిండియా రివ్యూకు వెళ్లి విజయవంతమైంది. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లిస్ క్రీజులోకి రాగా.. మార్ష్ 12 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 39-1(5).రెండు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 11-0షార్ట్ ఆరు, మార్ష్ ఐదు పరుగులతో ఉన్నారు.ఆసీస్ టార్గెట్ ఎంతంటే?క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓ దశలో 200 పరుగుల మార్క్‌ను దాటేలా కన్పించిన మెన్ ఇన్ బ్లూ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది.భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(46) టాప్ స్కోరర్‌గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించాడు.ఏడో వికెట్ డౌన్..152 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సెందర్.. ఎల్లీస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్(8) ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్16.4: జితేశ్ శర్మను జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో జితేశ్ (4 బంతుల్లో 3) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. వాషీ ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 136-6(16.5). ఐదో వికెట్ డౌన్16.1: ఆడం జంపా బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చిన తిలక్ వర్మ (6 బంతుల్లో 5) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రావడంతోనే ఫోర్ బాదగా.. జితేశ్ 3 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 135-5(16.2) నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా15.1: బార్ట్లెట్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన సూర్య (10 బంతుల్లో 20). స్కోరు: 125-4(15.1). జితేశ్ శర్మ క్రీజులోకి రాగా.. తిలక్ రెండు పరుగులతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన భారత్14.1: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ గిల్(39 బంతుల్లో 46) బౌల్డ్. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 121-3(14.1). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. సూర్య 7 బంతులు ఎదుర్కొని 18 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్ కోల్పోయిన భారత్11.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన శివం దూబే. 18 బంతులు ఎదుర్కొన దూబే ఓ ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి ఎల్లిస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 88-2(11.3). గిల్ 34 పరుగులతో ఉన్నాడు.పది ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 75-1.శివం దూబే 11, గిల్ 33 పరుగులతో ఆడుతున్నారు.భారత్ తొలి వికెట్ డౌన్..6.4: 56 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న గిల్..4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(18), అభిషేక్ శర్మ(12) దూకుడుగా ఆడుతున్నారు.టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడుతున్నాయి. కరారా ఓవల్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక నాలుగో టీ20లో ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులు చేసింది. ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్లను తుదిజట్టుకు ఎంపిక చేసింది. ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమన్లను పక్కనపెట్టింది. మరోవైపు.. టీమిండియా మూడో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది. దీంతో సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి తప్పలేదు.1-1తో సమంగాకాగా భారత్- ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సూర్యసేన సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక నాలుగో టీ20లో గెలిచి ఆధిక్యం సంపాదించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా. -
నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా
న్యూజిలాండ్ పర్యటనను వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో ఆతిథ్య కివీస్‌పై విండీస్ ఏడు పరుగుల స్వల్ప తేడాతో విజయం (West Indies Beat New Zealand) సాధించింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం ఆక్లాండ్‌లో ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈడెన్ పార్క్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులుదీంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (3), అలిక్ అథనాజ్ (16) విఫలమైనా.. వన్‌డౌన్ బ్యాటర్ షాయీ హోప్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న హోప్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రోస్టన్ చేజ్ (28), రోవ్‌మన్ పావెల్ (23 బంతుల్లో 33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో జేకబ్ డఫీ, జకారీ ఫౌల్క్స్ రెండేసి వికెట్లు తీయగా.. కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.ఇక విండీస్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (27), డెవాన్ కాన్వే (13) ప్రభావం చూపలేకపోయారు. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (21) నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ (7), డారిల్ మిచెల్ (13), మైకేల్ బ్రాస్‌వెల్ (1), జేమ్స్ నీషమ్ (11) పూర్తిగా విఫలమయ్యారు.సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథాఇలాంటి దశలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది.. 55 పరుగులు సాధించిన సాంట్నర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, మిగిలిన వారి నుంచి సహకారం అందకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన కివీస్.. 157 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా విండీస్ చేతిలో ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ ఛేజ్ చెరో మూడు వికెట్లు కూల్చారు. మిగిలిన వారిలో మాథ్యూ ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసేన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య గురువారం (నవంబరు 6) ఇదే వేదికపై రెండో టీ20 నిర్వహణకై ముహూర్తం ఖరారైంది.చదవండి: అందుకే అర్ష్‌దీప్‌ను తప్పించాం.. అతడికి అన్నీ తెలుసు: టీమిండియా కోచ్ -
అందుకే అర్ష్‌దీప్‌ను తప్పించాం: టీమిండియా కోచ్
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)కు మొండిచేయే ఎదురైంది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వందకు పైగా వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న అర్ష్‌కు.. యాజమాన్యం తుదిజట్టులో చోటు ఇవ్వలేదు.అర్ష్‌దీప్‌ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)కు ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) హర్షిత్ కోసం అర్ష్‌ను బలిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. సత్తా చాటిన అర్ష్ఈ నేపథ్యంలో ఆసీస్ (IND vs AUS)తో జరిగిన మూడో టీ20లో ఎట్టకేలకు అర్ష్‌ను యాజమాన్యం ఆడించింది. వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితమైన ఈ లెఫ్టార్మ్ పేసర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 35 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్.. ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (11), మార్కస్ స్టొయినిస్ (64) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్‌లలో అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై ప్రశ్న ఎదురైంది.అతడు వరల్డ్‌క్లాస్ బౌలర్.. అర్థం చేసుకున్నాడుఇందుకు బదులిస్తూ.. ‘‘అర్ష్‌దీప్ అనుభవజ్ఞుడైన బౌలర్. మేము వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని అతడు అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుసుకున్నాడు.అతడు వరల్డ్‌క్లాస్ బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల నైపుణ్యం గల ఆటగాడు. అతడి విలువ మాకు తెలుసు. అయితే, ఈ పర్యటనలో మాకు వివిధ కాంబినేషన్లు అవసరం. దీని వల్ల కొంత మంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు.అయితే, సెలక్షన్ విషయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదు. ఇందుకు గల కారణాలు మాత్రం వారు అర్థం చేసుకోగలరు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము ఆటగాళ్లను మరింత శ్రమించేలా చేస్తున్నాం. ఎప్పుడు జట్టులోకి వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సంసిద్ధం చేస్తున్నాం.కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదుఒత్తిడిలోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. మా ఆటగాళ్ల నైపుణ్యాలపై మాకు ఎటువంటి సందేహాలు లేవు. అయితే, కాంబినేషన్ల కోసం ప్రయత్నిస్తున్నపుడు కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదు’’ అని 41 ఏళ్ల మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం (Babar Azam) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20 (PAK vs SA 3rd T20I)లో ఈ వన్‌డౌన్ బ్యాటర్ అదరగొట్టాడు. ధనాధన్ దంచికొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.మెరుపు హాఫ్ సెంచరీఈ క్రమంలోనే బాబర్ ఆజం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మరో ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో వైఫల్యం తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన బాబర్‌కు.. ఆ తర్వాత జట్టులోనూ స్థానం కరువైంది. అయితే, ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు పునరాగమనం చేశాడు.కానీ రీఎంట్రీలో.. అంటే ప్రొటిస్‌తో తొలి మ్యాచ్‌లో బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అయితే, రెండో టీ20లో 11 పరుగులతో అజేయంగా నిలిచి ఫర్వాలేదనిపించిన అతడు.. మూడో టీ20లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.139 పరుగులకు కట్టడిలాహోర్ వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. సౌతాఫ్రికాను 139 పరుగులకు కట్టడి చేసింది. షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు తీయగా.. ఫాహిమ్ ఆష్రఫ్ , ఉస్మాన్ తారిక్ రెండేసి వికెట్లు, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ బ్యాటర్లలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 34 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. కార్బిన్ బాష్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (19), సయీమ్ ఆయుబ్ (0) దారుణంగా విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ బాధ్యత తీసుకున్నాడు.బాబర్‌కు తోడుగా కెప్టెన్ సల్మాన్ ఆఘా (26 బంతుల్లో 33) రాణించగా.. హసన్ నవాజ్ (5), నవాజ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇక బాబర్ మొత్తంగా 47 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. ఆఖర్లో ఉస్మాన్ ఖాన్ 6, ఫాహిమ్ ఆష్రఫ్ 4 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలుఇక మూడో టీ20లో విజయంతో పాకిస్తాన్ సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తన ఫిఫ్లీ ప్లస్ స్కోర్ల సంఖ్యను నలభైకి పెంచుకున్నాడు.తద్వారా ఇప్పటిదాకా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా 11 పరుగులు చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను అధిగమించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్లు🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 40 (3 శతకాలు, 37 ఫిఫ్టీలు)🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 39 (ఒక శతకం, 39 ఫిఫ్టీలు)🏏రోహిత్ శర్మ (ఇండియా)- 37 (5 శతకాలు, 32 ఫిఫ్టీలు)🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- 31 (ఒక శతకం, 30 ఫిఫ్టీలు)🏏డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 29 (ఒక శతకం, 28 ఫిఫ్టీలు).చదవండి: IND vs SA: వన్డే తరహా బ్యాటింగ్!.. పాపం పంత్.. భారత్‌కు షాక్ -
షాహీన్ అఫ్రిది వరల్డ్ రికార్డు..
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది (Shaheen Afridi) ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షాహీన్ చరిత్ర సృష్టించాడు. ఈ స్పీడ్ స్టార్ ఇప్పటివరకు టీ20ల్లో తొలి ఓవర్లో మొత్తంగా 24 వికెట్లు పడగొట్టాడు.లహోర్ వేదికగా సౌతాఫ్రికాతో మూడో టీ20లో మొదటి ఓవర్లో డికాక్, ప్రిటోరియస్‌ను ఔట్ చేసిన అఫ్రిది.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ పేరిట ఉండేది. బిలాల్ మొదటి ఓవర్లో బంతితో రంగంలోకి దిగి ఓవరాల్‌గా 22 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బిలాల్‌ను అఫ్రిది అధిగమించాడు.కాగా ఈ సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో టాస్ గెలిచి పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అఫ్రిది మొదటి ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టి పాక్‌కు శుభారంభం అందించాడు. అతడితో పాటు స్పిన్నర్లు ఉస్మాన్ తరీఖ్, నవాజ్ తలా వికెట్ సాధించారు. దీంతో ప్రోటీస్ 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు మాత్రమే చేసింది.తుది జట్లుపాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం, సల్మాన్ అఘా(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ బ్రీట్జ్కే, డోనోవన్ ఫెరీరా(కెప్టెన్), జార్జ్ లిండే, కార్బిన్ బాష్, ఆండిల్ సిమెలన్, లిజాడ్ విలియమ్స్, ఒట్నీల్ బార్ట్‌మన్ -
అందుకే హర్షిత్ రాణాను ప్రమోట్ చేశారు: అభిషేక్ శర్మ
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌లో భారత పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడంపై విమర్శల వర్షం కురుస్తోంది. పవర్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube)ను కాదని.. ఈ బౌలర్‌ను ఏడో స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ విషయంపై టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) స్పందించాడు. ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హర్షిత్ రాణాను ముందుగా బ్యాటింగ్‌కు పంపడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు‘‘మా జట్టులో చాలా మందికి ఆస్ట్రేలియాలో ఇదే తొలి పర్యటన. ఇక్కడి పిచ్‌లపై అదనపు బౌన్స్, పేస్ గురించి మాకు తెలుసు. అయినా.. సరే ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు బౌల్ చేసిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.క్రమశిక్షణగా సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో వాళ్లు బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. అయితే, ఊహించని రీతిలో వారు చెలరేగారు.వరుసగా వికెట్లు పడుతుంటే అక్కడ బ్యాటర్‌గా ఎవరున్నారన్న విషయంతో బౌలర్లకు పనిలేదు. ఇక క్రీజులో ఎవరు ఉన్నా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే ఆడతారు. మెల్బోర్న్ వికెట్ కఠినంగా ఉంది. ఇక్కడ షాట్లు బాదడం అంత తేలికేమీ కాదు.అందుకే శివంను కాదని హర్షిత్‌ను.. హర్షిత్ బ్యాట్‌తోనూ రాణించగలడని నాకు తెలుసు. నెట్స్‌లో అతడు చాలాసార్లు సిక్స్‌లు బాదాడు. ‘నీ సాధారణ ఆట తీరుతోనే ముందుకు సాగు’ అని నాకు చెప్పాడు. మా లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ఈ మ్యాచ్‌లో బాగా వర్కౌట్ అయింది.ఈ కాంబినేషన్ కోసమే.. శివం దూబే కంటే.. హర్షిత్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపించారు’’ అని అభిషేక్ శర్మ తెలిపాడు. కాగా 24 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఆసీస్‌తో రెండో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు..@IamAbhiSharma4 leads from the front with a blazing half-century, taking the Aussies head-on in true Skyball fashion! 💥Fearless intent, clean hitting, and total command at the crease! 🚀#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/bcAUdN2kyw— Star Sports (@StarSportsIndia) October 31, 2025 మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించాడు. అయితే, నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్‌గా వెనుదిరగడంతో అతడి ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) ఒక్కడే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.Short ball? No problem! #HarshitRana clears it for a six! 🚀Brings up a solid fifty stand fearless, fiery, and full Skyball mode on! 🔥#AUSvIND 👉 2nd T20I | LIVE NOW 👉 https://t.co/mq9j8bivd0 pic.twitter.com/sOGZ6m3u5y— Star Sports (@StarSportsIndia) October 31, 2025మూకుమ్మడిగా విఫలంఓపెనర్ శుబ్‌మన్ గిల్ 5, మూడో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ 2, నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. ఐదో స్థానానికి డిమోట్ అయిన తిలక్ వర్మ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా పరుగుల ఖాతా తెరవలేదు. శివం దూబే 4 పరుగులకే వెనుదిరిగాడు.ఫలితంగా 18.4 ఓవర్లలో కేవలం 125 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు, మార్కస్ స్టొయినిస్ ఒక వికెట్ దక్కించుకున్నారు.స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. రెండో టీ20లో భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా కాన్బెర్రాలో జరగాల్సిన తొలి టీ20 వర్షం వల్ల రద్దైన విషయం తెలిసిందే.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
పిచ్చి ప్రయోగాలు ఆపండి: సూర్య, గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా (IND vs AUS 2nd T20) యాజమాన్యం అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. కాన్బెర్రాలో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శుక్రవారం నాటి రెండో టీ20లో నెగ్గిన ఆసీస్ సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. 125 పరుగులకే ఆలౌట్మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్లతో టీమిండియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma- 37 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజిల్‌వుడ్ (3/13) మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది.GOOD GRIEF JOSH INGLIS 🤩 #AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/g2Qb2CW7Pj— cricket.com.au (@cricketcomau) October 31, 2025 ఆసీస్ అలవోకగాఓపెనర్లు మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 28 బంతుల్లోనే 51 పరుగులు జోడించి ఆసీస్ గెలుపునకు పునాది వేశారు. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ ఓవెన్ (14) ఓ మోస్తరుగా రాణించగా.. మార్స్ స్టొయినిస్ (6 నాటౌట్) పని పూర్తి చేశాడు.పిచ్చి ప్రయోగాలు ఆపండిఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. ‘‘ఇప్పటికైనా బ్యాటింగ్ ఆర్డర్లో పిచ్చి ప్రయోగాలకు టీమిండియా స్వస్తి పలకాలి.ఈ మ్యాచ్‌లో 160- 170 పరుగులు స్కోరు చేసి గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. గత మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చి అదరగొట్టాడు. నాటౌట్‌గా నిలిచాడు.కానీ ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో సంజూను ఎందుకు తీసుకువచ్చారు?.. సంజూను ఓపెనింగ్ స్థానం నుంచి మిడిలార్డర్‌కు పంపారు. మళ్లీ ఇప్పుడు ఐదు నుంచి మూడో స్థానానికి మార్చారు. ఇలాంటి పనుల వల్ల ఎవరు ఎప్పుడు బ్యాటింగ్‌కు రావాలో తెలియని గందరగోళం నెలకొంటుంది.తిలక వర్మ ఆసియా కప్ ఫైనల్లో నాలుగో స్థానంలో వచ్చి గెలిపించాడు. కానీ ఇప్పుడు అతడిని ఐదో స్థానానికి మార్చారు’’ అని కెప్టెన్ సూర్య, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీరును సదగోపన్ రమేశ్ విమర్శించాడు.ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుందిఅదే విధంగా.. శివం దూబేను కాదని హర్షిత్ రాణాను ఏడో స్థానంలో ఆడించడాన్ని కూడా సదగోపన్ రమేశ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు. ‘‘ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. గొప్ప వంటకాడు గొప్ప డ్రైవర్ కాలేడు. అదే విధంగా మంచి డ్రైవర్ గొప్పగా వంట చేయలేడు.ఆటగాళ్ల బలాలపై దృష్టి పెట్టి మేనేజ్మెంట్ వారికి తగిన పాత్ర ఇవ్వాలి. వారిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. అంతేగానీ బౌలర్‌ను బ్యాటర్‌గా మారుస్తాం.. బ్యాటర్‌తో బౌలింగ్ చేయిస్తాం అంటే ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ విషయంలో యాజమాన్యం ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అంటూ సదగోపన్ రమేశ్.. టీమిండియా నాయకత్వ బృందానికి సూచించాడు.మార్పులు ఇవేకాగా మెల్బోర్న్లో ఆసీస్‌తో రెండో టీ20లో సంజూ శాంసన్ (2) మూడో స్థానంలో రాగా.. సూర్య (1) నాలుగో నంబర్ బ్యాటర్‌గా వచ్చి విఫలమయ్యాడు. ఇక తిలక్ వర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి డకౌట్ అయ్యాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే (4)ను ఎనిమిదో స్థానానికి డిమోట్ చేసి.. పేసర్ హర్షిత్ రాణా (35)ను ఏడో స్థానంలో ఆడించారు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
రోహిత్ శర్మ ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్
సౌతాఫ్రికాతో రెండో టీ20లో పాకిస్తాన్ (PAK vs SA 2nd T20) ఘన విజయం సాధించింది. లాహోర్ వేదికగా సఫారీ జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ప్రపంచ రికార్డు బద్దలుఈ మ్యాచ్ సందర్భంగా పాక్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా బాబర్ నిలిచాడు.బాబర్ డకౌట్వరుస వైఫల్యాల నేపథ్యంలో పాక్ కెప్టెన్సీ కోల్పోయిన బాబర్ ఆజం.. చాన్నాళ్ల పాటు టీ20 జట్టులోనూ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఎట్టకేలకు స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా సెలక్టర్లు అతడిని కరుణించారు. అయితే, రావల్పిండి వేదికగా సఫారీలతో తొలి టీ20లో బాబర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు.ఇందుకు తోడు ఈ మ్యాచ్‌లో పాక్ 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో బాబర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే, తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.110 పరుగులకు ఆలౌట్లాహోర్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన ప్రొటిస్ జట్టు టాపార్డర్ పాక్ బౌలర్ల ధాటికి కుదేలైంది.రీజా హెండ్రిక్స్ డకౌట్ కాగా.. క్వింటన్ డికాక్ (7), టోనీ డి జోర్జి (7) పూర్తిగా విఫలమయ్యారు. యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులతో ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో కెప్టెన్ డొనోవాన్ ఫెరీరా (15), కార్బిన్ బాష్ (11), ఒట్నీల్ బార్ట్‌మన్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.పాక్ బౌలర్లలో ఫాహీమ్ ఆష్రఫ్ నాలుగు వికెట్లు తీయగా.. సల్మాన్ మీర్జా మూడు, నసీం షా రెండు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకంఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (28) ఓ మోస్తరుగా రాణించగా.. సయీమ్ ఆయుబ్ విధ్వంసకర అర్ధ శతకం (38 బంతుల్లో 71) సాధించాడు. అతడికి తోడుగా బాబర్ ఆజం 18 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే బాబర్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా రోహిత్ శర్మను అధిగమించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల వీరులు (టాప్-5)🏏బాబర్ ఆజం (పాకిస్తాన్)- 130* మ్యాచ్‌లలో 4234 పరుగులు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్‌లలో 4231 పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 125 మ్యాచ్‌లలో 4188 పరుగులు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్‌లలో 3869 పరుగులు🏏పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 153 మ్యాచ్‌లలో 3710 పరుగులు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు బ్రేక్..
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు ఎండ్ కార్డ్ పడింది. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టులో భాగమైన ఆటగాడిగా దూబే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దూబే వరుసగా భారత్ జట్టు తరపున 37 టీ20 విజయాలను అందుకున్నాడు.అతడిని అందరూ టీమిండియా లక్కీ ఛార్మ్‌గా పరిగణిస్తారు. దూబే జట్టులో ఉంటే భారత్‌కు తిరుగుండదని అంతా భావిస్తారు. కానీ శుక్రవారం మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంతో అతడి ఆజేయ విన్నింగ్ రికార్డుకు తెరపడింది. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దూబే.. భారత తరపున 4 వన్డేలు, 43 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతడు చివరగా 2019 డిసెంబర్లో త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు.ఆ తర్వాత ఈ ముంబైకర్ వరుసగా 37 టీ20ల్లో విజయాలను అందుకున్నాడు. తాజా ఓటమితో అతడి రికార్డుకు బ్రేక్ పడింది. దూబే గత రెండేళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024, ఆసియాకప్-2025 ట్రోఫీలను భారత్ సొంతం చేసుకోవడంలో దూబేది కీలక పాత్ర. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో జస్ప్రీత్ బుమ్రా 24 వరుస టీ20 విజయాల రికార్డు కూడా ముగిసింది.అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లుశివమ్ దూబే - 37 మ్యాచ్‌లు (2019-2025)పాస్కల్ మురుంగి - 27 మ్యాచ్‌లు (2022-2024*)జస్ప్రీత్ బుమ్రా - 24 మ్యాచ్‌లు (2021-2025)మణీష్ పాండే - 20 మ్యాచ్‌లు (2018-2020*)మహ్మద్ షెహ్జాద్ - 19 మ్యాచ్‌లు (2016-2021)చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
సంజూకు ప్రమోషన్ ఇచ్చిన గంభీర్.. కట్ చేస్తే! 4 బంతులకే
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత ఇన్నింగ్స్‌ను సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రారంభించడం మొదలు పెట్టారు.అయితే అప్పుడు శుభ్‌మన్ గిల్ టీ20 జట్టుకు దూరంగా ఉండడంతో శాంసన్‌ను ఓపెనర్‌గా అవకాశముంది. కానీ గిల్ తిరిగి టీ20 సెటాప్లోకి రావడంతో ఆసియాకప్-2025 నుంచి సంజూ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయింది. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్‌లో భారత ఓపెనర్లుగా గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగగా.. శాంసన్‌ను మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు పంపారు.కొన్ని మ్యాచ్‌లలో నంబర్ 6, మరి కొన్ని మ్యాచ్‌లలో ఐదో స్ధానంలో ఈ కేరళ బ్యాటర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో టీమ్ మెనెజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంజూ లాంటి అద్భుతమైన బ్యాటర్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలేదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.సంజూకు ప్రమోషన్..ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో సంజూ శాంసన్‌కు హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రమోషన్ ఇచ్చాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ త్వరగా ఔట్ కోవడంతో శాంసన్‌ను నంబర్ 3లో బ్యాటింగ్‌కు పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకుంది.కానీ సంజూ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికపోయాడు. దీంతో సోషల్ మీడియాలో సంజూను ట్రోలు చేస్తున్నారు.టాపార్డర్‌లో అవకాశమిస్తే ఇలా ఆడుతావా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొంత మంది శాంసన్‌ను మద్దతుగా నిలుస్తున్నారు. వేర్వేరు స్ధానాల్లో అతడిని బ్యాటింగ్‌కు పంపితే ఎలా, అతడికంటూ ఒక పొజిషన్ ఫిక్స్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.చదవండి: కేకేఆర్‌లోకి రోహిత్ శర్మ ‘కన్ఫామ్’!.. స్పందించిన ముంబై ఇండియన్స్Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025 -
IND vs AUS: రెండో టీ20లో భారత్ ఓటమి
Australia vs India, 2nd T20I Melbourne Updates And Highlights: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్( 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా .. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.బుమ్ బుమ్ బుమ్రా..ఆస్ట్రేలియా ఆఖరిలో రెండు వికెట్లు కోల్పోయింది. తమ విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో బుమ్రా వరుస బంతుల్లో ఓవెన్, షార్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్8.4: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (2 బంతుల్లో 1). ఆసీస్ స్కోరు: 90-3(8.4). ఇంగ్లిస్ 5 పరుగులతో ఉన్నాడు. విజయానికి 68 బంతుల్లో 36 పరుగుల దూరంలో ఆసీస్. ఏడు వికెట్ల దూరంలో టీమిండియా.రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్ష్ (26 బంతుల్లో 46) అవుట్. ఆసీస్ స్కోరు: 87-2(8). విజయానికి 72 బంతుల్లో 39 పరుగులు అవసరం. ఇంగ్లిస్ 3 పరుగులతో ఉన్నాడు. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్4.3: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి హెడ్ (15 బంతుల్లో 28) అవుట్. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోగా.. మార్ష్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 51-1(4.3). విజయానికి 93 బంతుల్లో 75 పరుగులు అవసరం.నాలుగు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 49-0(4)ట్రావిస్ హెడ్ 27, మార్ష్ 12 పరుగులతో క్రీజులోకి ఉన్నారు.పదో వికెట్‌గా బుమ్రాఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) రాణించగా.. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) అతడికి సహకారం అందించాడు. దీంతో భారత జట్టు కాస్త పరువు నిలుపుకోగలిగింది. 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టొయినిస్‌కు ఒక వికెట్ దక్కింది. భారత బ్యాటర్లలో గిల్ (5), సంజూ శాంసన్ (1), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7), శివం దూబే (4), కుల్దీప్ యాదవ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. బుమ్రా రనౌట్ కావడంతో భారత్ పదో వికెట్ కోల్పోయింది.తొమ్మిదో వికెట్ డౌన్18.3: హాఫ్ సెంచరీ వీరుడు అభిషేక్ శర్మ (68)రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ LBW అయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 125-9(18.3) ఫోర్, సిక్సర్‌తో చెలరేగిన అభిషేక్18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 18వ ఓవర్లో అభిషేక్ ఫోర్, సిక్సర్ బాదాడు. అభిషేక్ 34 బంతుల్లో 68 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఎనిమిదో వికెట్ డౌన్కుల్దీప్ యాదవ్ (0) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో అబాట్ (సబ్‌స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోరు: 110-8(17). అభిషేక్ శర్మ 53 పరుగులతో ఉండగా.. వరుణ్ చక్రవర్తి క్రీజులోకి వచ్చాడు.శివం దూబే అవుట్బార్ట్లెట్ బౌలింగ్‌లో శివం దూబే (4)ఇచ్చిన క్యాచ్‌ను జోష్ ఇంగ్లిస్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోరు: 109-7(15.4). కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్15.2:బార్ట్లెట్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా హర్షిత్ రాణా వెనుదిరిగాడు. రాణా 33 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు రాబట్టాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 105-5హర్షిత్ రాణా 31 బంతుల్లో 35, అభిషేక్ 27 బంతుల్లో 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ..టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుస క్రమంలో వికెట్లుకోల్పోయినప్పటికి అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.టీమిండియా ఐదో వికెట్ డౌన్..అక్షర్ పటేల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి హర్షిత్ రాణా వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(37),రాణా(4) ఉన్నారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 40-4.అక్షర్ 3, అభిషేక్ శర్మ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్4.5: తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెండు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వెనుదిరగగా.. అతడి స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. టీమిండియా స్కోరు: 32-4(4.5). అభిషేక్ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ డౌన్4.3: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య వెనుదిరిగాడు. అంతకు ముందే క్యాచ్ డ్రాప్ రూపంలో తనకు వచ్చిన లైఫ్‌ను సూర్య సద్వినియోగం చేసుకోలేక ఒక్క పరుగే చేసి నిష్క్రమించాడు. సూర్య స్థానంలో తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. అభిషేక్ 24 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 32-3(4.4)రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా3.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన సంజూ శాంసన్(2). ఓపెనర్‌గా, మిడిలార్డర్లో ఆడించిన సంజూను వన్‌డౌన్‌లో పంపిస్తూ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. భారత్ స్కోరు: 23-2(3.3). అభిషేక్ 16 పరుగులతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI— cricket.com.au (@cricketcomau) October 31, 2025 తొలి వికెట్ కోల్పోయిన భారత్2.4: హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. పది బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. సంజూ శాంసన్ వన్‌డౌన్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 22-1(2.5). అభిషేక్ 15, సంజూ రెండు పరుగులతో ఉన్నారు.రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0అభిషేక్ శర్మ నాలుగు బంతుల్లో 14, శుబ్‌మన్ గిల్ 8 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్‌ను హాజిల్‌వుడ్ కట్టుదిట్టంగా వేయడంతో టీమిండియాకు ఒక్క పరుగే వచ్చింది. తొలి బంతికే గిల్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా.. రివ్యూలో అనుకూల ఫలితం వచ్చింది. దీంతో టీమిండియా రివ్యూ నిలుపుకోగలిగింది.టాస్ గెలిచిన ఆసీస్టీమిండియాతో రెండో టీ20లో ఆస్ట్రేలియా (IND vs AUS) టాస్ గెలిచింది. మెల్బోర్న్ వేదికగా తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh).. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా మార్ష్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టాస్ గెలవడం ఇది పందొమ్మిదోసారి. ప్రతిసారీ అతడు లక్ష్య ఛేదననే ఎంచుకోవడం విశేషం.ఒక మార్పుతో బరిలోకిటాస్ సందర్భంగా మార్ష్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయించుకున్నాం. వికెట్ బాగుంది. 40 ఓవర్లపాటు పిచ్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం. మా తుదిజట్టులో ఒక మార్పు చేశాము. జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టుతో భారత్ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. తొలి టీ20కి ఎంచుకున్న జట్టుతోనే తాము మెల్బోర్న్లో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో 2-1తో ఆసీస్ గెలుపొందగా.. టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భారత్ పట్టుదలగా ఉంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కాన్బెర్రాలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అయితే, వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20 తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్. -
‘కుదిరితే పదకొండో స్థానంలో కూడా ఆడిస్తారు’
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా ఓపెనర్‌గా వచ్చి అదరగొట్టాడు సంజూ శాంసన్ (Sanju Samson). పదమూడు ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 183కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు కూడా ఉండటం గమనార్హం.గిల్ రాకతో గందరగోళంఅయితే, ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజూకు కష్టాలు మొదలయ్యాయి. భవిష్య కెప్టెన్ గిల్ ఓపెనర్‌గా వచ్చేందుకు సంజూపై వేటు వేసింది యాజమాన్యం. ఇక ఆ టోర్నీలో సంజూకంటూ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రత్యేక స్థానం లేకుండా పోయింది.ఆసియా కప్ టోర్నీలో మూడుసార్లు ఐదో స్థానంలో.. ఓసారి ఆరో స్థానంలో సంజూను బ్యాటింగ్‌కు పంపారు. ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనైతే ఎనిమిదో స్థానం వరకు అతడికి పిలుపేరాలేదు. వికెట్ కీపర్‌గా మాత్రమే టోర్నీ ఆసాంతం అతడి సేవలు వాడుకున్నారు.తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టీ20లో శుబ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంజూ శాంసన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.దురదృష్టవంతుడైన ఆటగాడుయూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘జట్టులో ప్రస్తుతం అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడు సంజూ శాంసన్. ఓపెనర్‌గా సెంచరీ చేసిన ఘనత అతడిది. కానీ ఇప్పుడు 3-8 వరకు ఏ స్థానంలోనైనా మేనేజ్మెంట్ అతడిని పంపేందుకు వెనుకాడటం లేదు.కుదిరితే పదకొండో స్థానంలో కూడా ఆడిస్తారుఒకవేళ అవకాశం గనుక ఉంటే.. పదకొండో స్థానంలో కూడా సంజూను బ్యాటింగ్ చేయమంటారు. ఇలా చేయడం వల్ల ఆటగాడి మనసు గాయపడుతుంది. టాపార్డర్‌లో రాణించినా డిమోట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. అయినా.. ఇప్పుడు అతడికి ఇంతకంటే గొప్ప ఆప్షన్ మరొకటి లేదు.వికెట్ కీపర్గానైనా అవకాశంమౌనంగా అన్నీ భరిస్తూనే యాజమాన్యం చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆసియాకప్ టోర్నీలో ఐదో స్థానంలో వచ్చి అతడు మెరుగ్గా రాణించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో అతడు మొదటి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ఐదో నంబర్లో సంజూ మరింత మెరుగ్గా రాణిస్తే జట్టులో అతడి స్థానానికి ఢోకా ఉండదు. కాగా ఆసియా కప్‌లో సంజూ ఏడు మ్యాచ్‌లలో కలిపి 125 కంటే తక్కువ స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. అయితే, పాకిస్తాన్‌తో ఫైనల్లో 21 బంతుల్లో 24 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ఆసీస్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం కారణంగా రద్దై పోయింది.చదవండి: IND vs AUS: అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్ -
అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?.. గంభీర్‌పై ఫైర్
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh). ఈ లెఫ్టార్మ్ సీమర్ ఇప్పటి వరకు ఆడిన 65 మ్యాచ్‌లలో కలిపి 101 వికెట్లు తీశాడు. అంతేకాదు టీమిండియా తరఫున పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్‌గానూ నిలిచాడు.ఇంతటి ప్రతిభ గల అర్ష్‌దీప్ సింగ్‌ను ఆస్ట్రేలియాతో తొలి టీ20 (IND vs AUS T20)లో పక్కనపెట్టారు. ఆసీస్ టూర్లో తొలి రెండు వన్డేల్లో ఈ పేసర్‌ను ఆడించిన యాజమాన్యం.. మూడో వన్డే నుంచి తప్పించింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాకతో.. అర్ష్‌దీప్‌పై వేటు వేసి హర్షిత్ రాణా (Harshit Rana)కు పెద్దపీట వేసింది. అందుకు తగ్గట్లుగానే నాలుగు వికెట్లు తీసి హర్షిత్ టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టారు!అయితే, టీ20 ఫార్మాట్లో అర్ష్‌దీప్ సింగ్‌కు మంచి రికార్డు ఉన్నా.. మరోసారి హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ కోసం అర్ష్‌ను బలిచేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘అర్ష్‌దీప్ సింగ్’’ అంటూ ఒక్క మాటతో మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. మరోవైపు.. దేశీ స్టార్ ప్రియాంక్ పాంచల్ కాస్త తీవ్ర స్థాయిలోనే మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.ఎంత వరకు సమంజసం?‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. అలాంటిది విదేశీ పర్యటనలో తమ అత్యధిక వికెట్ల వీరుడిని పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం? అర్ష్‌దీప్ సింగ్ పట్ల ఇంకాస్త మంచిగా వ్యవహరించండి. అతడు అందుకు అర్హుడు’’ అని ప్రియాంక్ పాంచల్ విమర్శించాడు.అతడి కోసం అర్ష్‌దీప్‌ను బలిచేస్తారా?ఇక శ్రీవత్స్ గోస్వామి కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టులోకి తీసుకోవడాన్ని విమర్శించాడు. ఇందుకు గల కారణమేమిటో తనకైతే అంతుపట్టడం లేదన్నాడు. అలాగే రింకూ సింగ్‌ను కూడా జట్టు నుంచి అకారణంగా తప్పించడం ఏమిటోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 వర్షార్పణమైంది. చాన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ చక్కటి షాట్లతో అలరించినా... భారీ వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగలేదు. వర్షార్పణంఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్... 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగుల వద్ద నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఆసియా కప్‌లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక 9.4 ఓవర్ల వద్ద ఆటకు అంతరాయం కలిగించిన వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఆసీస్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి -
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు హోదా ఉన్న జట్ల తరఫున అత్యంత వేగంగా 150 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ముంబైకి చెందిన 35 ఏళ్ల సూర్యకుమార్ ఆలస్యంగానే టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా భారత్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటలేక చతికిల పడ్డ సూర్య.. తనకు కలిసి వచ్చిన టీ20 క్రికెట్లో మాత్రం వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు.వరుస విజయాలుఈ క్రమంలో గతేడాది ఏకంగా టీమిండియా టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన సూర్య.. వరుస విజయాలు సాధించాడు. ఇటీవలే ఆసియా టీ20 కప్-2025లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. కానీ బ్యాటర్‌గా మాత్రం విఫలం కావడం విమర్శలకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న సూర్య.. తొలి టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. కాన్బెర్రా వేదికగా టాస్ గెలిచిన ఆసీస్.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.వర్షం వల్ల మ్యాచ్ రద్దుఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నంలోనే.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో కలిసి దంచికొట్టాడు. అయితే, వర్షం వల్ల ఈ మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.అప్పటికి.. 9.4 ఓవర్ల ఆట సాగగా.. వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది టీమిండియా. గిల్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేయగా.. సూర్యకుమార్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. Fearless batting on display! 💥We’re in for a @surya_14kumar special!Match Update ➡️ Rain Delay. Revised start time awaited!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/87NwgUurcT— Star Sports (@StarSportsIndia) October 29, 2025205 సిక్సర్లతో టాప్‌లో రోహిత్ ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సూర్య అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో 150 సిక్సర్ల క్లబ్లో చేరాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ 205 సిక్సర్లతో టాప్‌లో ఉండగా.. సూర్య ఐదో స్థానంలో నిలిచాడు.అయితే, అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లోనే అంటే.. 86వ ఇన్నింగ్స్‌లోనే 150 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు సూర్య. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ల (టెస్టు హోదా) జట్ల తరఫున ఫాస్టెస్ట్ 150 సిక్సెస్ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇక అసోసియేట్ దేశమైన యూఏఈ తరఫున ముహమ్మద్ వసీం 66 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 క్రికెటర్లు🏏 రోహిత్ శర్మ (ఇండియా)- 159 మ్యాచ్‌లలో 205 సిక్సర్లు🏏ముహమ్మద్ వసీం (యూఏఈ)- 91 మ్యాచ్‌లలో 187 సిక్సర్లు🏏మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్‌లలో 173 సిక్సర్లు🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 144 మ్యాచ్‌లలో 172 సిక్సర్లు🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 91 మ్యాచ్‌లలో 150 సిక్సర్లు*.చదవండి: PKL 2025: అతడొక అద్భుతం.. తెలుగు టైటాన్స్‌కు దొరికిన ఆణిముత్యం -
శ్రేయస్ అయ్యర్ కోసం సూర్యకుమార్ తల్లి పూజలు.. వీడియో వైరల్
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. త్వరలోనే శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అమ్మ.. అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది‘‘అమ్మ.. శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థిస్తోంది’’ అంటూ దినాల్ ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. ఛట్ పూజకు వెళ్లిన సూర్య తల్లి స్వప్న యాదవ్.. ‘‘ప్రతి ఒక్కరు శ్రేయస్ అయ్యర్ కోసం ప్రార్థించండి. అతడు క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకోండి.అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుందిశ్రేయస్ ఆరోగ్యం బాగా లేదని తెలిసి నా మనసు ఆందోళనకు గురైంది. అతడు త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని దయచేసి అంతా ప్రార్థన చేయండి’’ అని స్వప్న యాదవ్ తన చుట్టూ ఉన్న వాళ్లకు విజ్ఞప్తి చేశారు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది.. శ్రేయస్ పట్ల మీ ఆప్యాయత మమ్మల్ని కదిలించింది’’ అంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు.అంతర్గత రక్తస్రావంకాగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఆఖరిదైన మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ అందుకున్న శ్రేయస్.. ఆ వెంటనే నొప్పితో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయాడు. పక్కటెముకలకు తీవ్రమైన గాయం కావడంతో హుటాహుటిన సిడ్నీ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షల్లో అంతర్గత రక్తస్రావం గుర్తించిన ఆస్ట్రేలియా డాక్టర్లు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందజేయడంతో కోలుకున్నాడు.డాక్టర్ల పర్య వేక్షణలోనేశ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చి తదుపరి చికిత్సను కొనసాగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘గాయం కచ్చితంగా ఎక్కడైందో గుర్తించి అంతర్గత రక్తస్రావాన్ని నిరోధించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ డాక్టర్ల పర్య వేక్షణలోనే ఉన్నాడు’ అని బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.పెద్ద గాయమే అయినామరోవైపు.. ఆసీస్‌తో తొలి టీ20కి ముందు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘దేవుడు అయ్యర్ పక్షాన వున్నాడు. అందుకే పెద్ద గాయమే అయినా వేగంగా కోలుకుంటున్నాడు. సిడ్నీ డాక్టర్లు, బోర్డు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. త్వరలోనే అతను పూర్తిగా కోలుకుంటాడు’ అని అన్నాడు. చదవండి: టీమిండియా ‘హెడ్‌కోచ్’తో ఆటగాళ్ల తెగదెంపులు.. వేటు వేసిన బీసీసీఐ!Suryakumar Yadav’s mother praying for Shreyas Iyer’s recovery during Chhath Puja. 🥺❤️pic.twitter.com/CkYD26lzHo— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2025 -
IND vs AUS 1st T20I: వర్షం వల్ల మ్యాచ్ రద్దు
Australia vs India, 1st T20I- Canberra: ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. కాన్బెర్రాలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఐదు ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. కాసేపటి తర్వాత తిరిగి మొదలుపెట్టారు.అయితే, 9.4 ఓవర్ల మధ్య వర్షం మళ్లీ ఆటంకం కలిగించింది. ఆ తర్వాత వాన తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 9.4 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 37), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39) అజేయంగా నిలిచారు.మళ్లీ వర్షం.. ఆగిన ఆట9.4 ఓవర్ల వద్ద వర్షం మళ్లీ ఆటకు ఆటంకం కలిగింది. స్కోరు: 97-1. సూర్య 24 బంతుల్లో 39, గిల్ 20 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.తొమ్మిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 82-1.సూర్య 20 బంతుల్లో 37, సూర్య 20 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.తిరిగి ప్రారంభమైన ఆట.. ఆట తిరిగి ప్రారంభమైంది. 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(25), సూర్యకుమార్ యాదవ్(12) ఉన్నారు.వర్షం వల్ల ఆటకు అంతరాయంఐదు ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 43-1. గిల్ 16, సూర్య 8 పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.5: నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. 14 బంతుల్లో 19 పరుగులు చేసి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఓపెనింగ్ బ్యాటర్. టీమిండియా స్కోరు: 36-1(4). గిల్ 16 పరుగులతో ఉండగా.. సూర్యకుమార్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకాన్బెర్రా వేదికగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS 1st T20I) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ (Mitchell Marsh) మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. కాన్బెర్రాలో ప్రేక్షకుల మద్దతు కూడా మాకు కలిసి వస్తుంది. టీమిండియా మాదిరే మేము కూడా దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం.ఇరుజట్లు పటిష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా వరల్డ్ నంబర్ వన్ జట్టుగా ఉంది. ఇలాంటి జట్టుతో పోటీ అంటే ఆసక్తికరమే. మా జట్టులో అవసరమైన మేర బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు’’ అని పేర్కొన్నాడు.ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనే భావించాము. వికెట్ బాగుంది. మనుకా ఓవల్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరుగలేదని మా అనలిస్టుల ద్వారా విన్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కాస్త నెమ్మదించవచ్చు.అది ఎప్పుడూ తలనొప్పిగానే ఉంటుందిఅందుకే ముందుగానే బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. మూడు- నాలుగు రోజుల ముందే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేశాము. నిన్నటి మాదిరే ఈరోజు వాతావరణం చల్లగా ఉంది.మా జట్టులో ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషిస్తాడు. బాధ్యతాయుతంగా ఆడతారు. అందుకే తుదిజట్టు ఎంపిక ఎప్పుడూ తలనొప్పిగా మారుతుంది. అయితే, ఆ విషయంలో మాకు సంతోషంగా ఉంది. ఇంతమంది మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉండటం సానుకూలాంశం. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి.నితీశ్ రెడ్డి అవుట్ఈరోజు రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ రెడ్డి మిస్సవుతున్నారు’’ అని తెలిపాడు. కాగా గాయం కారణంగా నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాతో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నితీశ్ రెడ్డి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. తుదిజట్లు:టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?SKYBALL incoming!Get ready for some fearless batting, full hitting as #TeamIndia have been put in to bat first in the 1st T20I!#AUSvIND 👉 1st T20I | LIVE NOW 👉 https://t.co/nKdrjgZhGQ pic.twitter.com/wpak5bA2lz— Star Sports (@StarSportsIndia) October 29, 2025 -
అందుకే ఓడిపోయాం: పాకిస్తాన్ కెప్టెన్
స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pak vs SA 1st T20I)కు చేదు అనుభవం ఎదురైంది. తొలి టీ20 మ్యాచ్‌లో పాక్.. పర్యాటక జట్టు చేతిలో ఏకంగా 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకుంది.సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకురాలేముఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘బ్యాటింగ్‌లో శుభారంభమే అందుకున్నాం. కానీ దానిని కొనసాగించలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది.ఈ లోపాన్ని మేము అధిగమించాలి. బ్యాటింగ్ బాగుంటేనే అంతా బాగుంటుంది. మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అసవరం ఉంది. అలా అని సింగిల్స్, డబుల్స్‌తో నెట్టుకురాలేము.ఆరంభంలో అస్సలు బాగాలేదుఇక ఈ మ్యాచ్‌లో బంతితోనూ మేము రాణించలేకపోయాం. ముఖ్యంగా పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు ఇచ్చాము. మా బౌలింగ్ ఆరంభంలో అస్సలు బాగాలేదు. అయితే, మధ్య ఓవర్లలో పొదుపుగా బౌల్ చేయడం సానుకూలాంశం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.కాగా రెండు టెస్టులు, మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా పాకిస్తాన్లో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్టు సిరీస్ ముగియగా.. ఇరుజట్లు చెరో విజయంతో 1-1తో సమం చేసుకున్నాయి. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా మంగళవారం రాత్రి టీ20 సిరీస్ ఆరంభమైంది.దంచికొట్టిన ఓపెనర్లుటాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 194 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రీజా హెండ్రిక్స్ (40 బంతుల్లో 60), క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 23) దంచికొట్టారు. వన్‌డౌన్‌లో వచ్చిన టోనీ డి జార్జ్ (16 బంతుల్లో 33), ఏడో నంబర్ బ్యాటర్ జార్జ్ లిండే (22 బంతుల్లో 36) మెరుపులు మెరిపించారు.పాక్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ మూడు వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్ రెండు, షాహిన్ ఆఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్ శుభారంభమే అందుకుంది.చెలరేగిన సఫారీ బౌలర్లుఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (19 బంతుల్లో 24), సయామ్ ఆయుబ్ (28 బంతుల్లో 37) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే, రీఎంట్రీలో బాబర్ ఆజం డకౌట్ కాగా.. కెప్టెన్ సల్మాన్ ఆఘా (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఆఖర్లో మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 36) కాసేపు మెరుపులు మెరిపించినా.. ప్రొటిస్ బౌలర్ల ధాటికి ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. పాక్‌కు ఓటమి తప్పలేదు.సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. జార్జ్ లిండే మూడు, లిజాడ్ విలియమ్స్ రెండు, లుంగీ ఎంగిడీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇరుజట్ల మధ్య శుక్రవారం (అక్టోబరు 31) జరిగే మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదిక.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
టీమిండియాతో తొలి టీ20.. ఆసీస్ తుది జట్టులో డేంజరస్ ప్లేయర్లు!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 కాన్బెర్రా బుధవారం(అక్టోబర్ 29) జరగనుంది. టీమిండియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని కంగారులు వ్యూహాలు రచిస్తున్నారు. భారత్ తమ తుది జట్టును ఖరారు చేయడానికి తర్జన భర్జన పడుతుంటే, ఆస్ట్రేలియా మాత్రం ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆసీస్ సెలక్టర్లు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను ప్రకటించారు. తొలి రెండు టీ20లకు దూరంగా ఉండనున్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.. ఆఖరి మూడు టీ20లకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా యాషెస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు ఆఖరి మూడు టీ20లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.టీమిండియా కంటే బెటర్‌గా..గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఆస్ట్రేలియా పొట్టి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వరుస సిరీస్‌ల విజయాలతో ఆసీస్ రెండో స్ధానంలో కొనసాగుతోంది. ర్యాంకింగ్స్‌లో కంగారుల కంటే భారత్ ముందుంజలో ఉన్నప్పటికి.. ఇటీవల కాలంలో ఆటగాళ్ల ప్రదర్శన పరంగా కంగారులే మెరుగ్గా కన్పిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత ఆస్ట్రేలియా ఇప్పటివరకు 19 టీ20లు ఆడి కేవలం కేవలం రెండు మాత్రమే ఓడిపోయింది. ఆసీస్ బ్యాటింగ్ రన్‌రేట్ 10.07గా ఉండగా, భారత్ 9.69తో రెండో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆప్రోచ్ పూర్తిగా మారిపోయింది. మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు ఫియర్ లెస్ బ్యాటింగ్ విధానాన్ని ఎంచుకుంది. ఓపెనర్ల నుంచి ఎనిమిదో స్ధానం బ్యాటర్ వరకు హిట్టింగ్ చేసే సత్తా ఉంది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభాలను ఇస్తుండగా.. మిడిలార్డర్లో జోష్ ఇంగ్లిష్, టిమి డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఆఖరిలో స్టోయినిష్, ఓవెన్ వంటి ఆల్‌రౌండర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో పేసర్ దుర్హనియస్ కూడా బ్యాట్‌తో సత్తాచాటుతున్నాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ ఛాన్నాళ్ల తర్వాత ఆసీస్ టీ20 జట్టులోకి వచ్చాడు. అతడు కూడా తన బ్యాట్‌కు పనిచెబితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక తొలి తొలి టీ20కు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా దూరమైనప్పటికి.. జోష్ హాజిల్‌వుడ్, ఈల్లీస్, బార్ట్లెట్ వంటి పేస్ పవర్ హౌస్ ఆసీస్ వద్ద ఉంది. భారత్‌తో తొలి టీ20కు ఆసీస్ తుది జట్టు(అంచనా)మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), జోష్ ఫిలిప్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, తన్వీర్ సంఘాచదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం.. -
ఎడమచేతి వాటం క్రికెటర్లతో లాభాలేమిటి?
టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌లకు సిద్ధమైంది. అక్టోబరు 29- నవంబరు 8 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును పరిశీలిస్తే ఇందులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం గల ఆటగాళ్లు ఉన్నారు.మరి లెఫ్టాండర్ల వల్ల జట్టుకు అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? వీరిని ఎక్కువగా తుదిజట్టులోకి తీసుకోవడం వల్లే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం!బ్రియన్ లారా మారథాన్ ఇన్నింగ్స్ నుంచి ఆడం గిల్‌క్రిస్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్, సౌరవ్ గంగూలీ మెరుపులు .. ఎడమచేతి వాటం బ్యాటర్ల అద్భుత ప్రదర్శనలకు ఇవి నిదర్శనాలు.అడ్వాంటేజ్ ఏంటి?క్రికెట్లో కుడిచేతి వాటం బ్యాటర్లే ఎక్కువ. కాబట్టి బౌలర్లు కూడా అందుకు తగ్గట్లుగానే శిక్షణలో ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాటర్లకే బౌల్ చేస్తూ ఉంటారు. కాబట్టి లెఫ్టాండర్లు బరిలో ఉన్నపుడు వారి లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ క్రీజులో లెఫ్ట్- రైట్ బ్యాటర్లు జోడీగా ఉన్నారంటే బౌలర్లకు వారిని విడదీయడం మరింత కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఇద్దరూ దంచికొడుతున్నారంటే.. బౌలర్ల రిథమ్ దెబ్బ తింటుంది. ఫీల్డింగ్‌లోనూ మార్పులు చేయడం బౌలింగ్ చేస్తున్న కెప్టెన్‌కు తలనొప్పిగా మారుతుంది. తరచూ ఫీల్డర్లను మార్చడం కూడా మైనస్‌గా మారుతుంది.డేటా ఏం చెబుతోంది?తమ రైట్ హ్యాండ్ కౌంటర్పార్ట్స్ కంటే లెఫ్టాండర్లు మూడు ఫార్మాట్లలోనూ రాణించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. టెస్టు క్రికెట్లో లెఫ్టాండర్లు విండీస్ లెజెండ్ బ్రియన్ లారా, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర వేల కొద్దీ పరుగులు రాబట్టారు. సంగక్కర టెస్టుల్లో 12,400 పరుగులు సాధిస్తే.. లారా 11,953 పరుగులు స్కోరు చేశాడు.ఇక వన్డేల్లో సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. గంగూలీ 311 వన్డేల్లో 11363 పరుగులు స్కోరు చేస్తే.. 167 వన్డేలు ఆడి 6793 రన్స్ రాబట్టాడు.అదే విధంగా టీ20 ఫార్మాట్లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించగా.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగలరు!లెఫ్టాండ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. స్పిన్నర్ల బౌలింగ్‌లో వీరికి షాట్ సెలక్షన్ సులభంగా ఉంటుంది.పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ వీరి సంప్రదాయ విరుద్ధ బ్యాటింగ్ కారణంగా ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లను మార్పు చేసే క్రమంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక సమయాల్లో వ్యూహాలు మార్చుకోవాల్సి రావడం విజయావకాశాలను దెబ్బ తీస్తుంది.సైకలాజికల్ ఎడ్జ్కుడిచేతి వాటం బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కొనేటపుడు సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రతిసారి లైన్ అండ్ లెంగ్త్ మార్చడం వారికి కఠినతరంగా మారుతుంది. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లను తరచూ మార్చాల్సి రావడం వల్ల బ్యాటర్లకు పరుగులు స్కోరు చేసే అవకాశాలు పెరుగుతాయి.లెజెండరీ లెఫ్టాండ్ బ్యాటర్లుబ్రియన్ లారా టెస్టుల్లో క్వాడ్రపుల్ (400*) సెంచరీ చేసి ఇప్పటికీ తన పేరిటే ఆ రికార్డును పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ వన్డే, టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. ఇక క్రిస్ గేల్, యువరాజ్ సింగ్‌ల గురించి త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా లెఫ్టాండ్ బ్యాటరే. ఇప్పటికే యూత్ వన్డే, యూత్ టెస్టులలో వైభవ్ ఇరగదీస్తున్నాడు.భారత ప్రస్తుత టీ20 జట్టులో ఎనిమిది మందిఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రస్తుత భారత టీ20 జట్టులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు. టాపార్డర్‌లో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో తిలక్‌వర్మ అందుబాటులో ఉన్నారు. వీరిద్దరు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబేతో పాటు నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా లెఫ్టాండరే. వీరితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఎడమచేతి వాటం గల ప్లేయర్లే. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్, పేసర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్ లెఫ్టాండర్ల జాబితాలో ఉన్నారు.చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య -
స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య
భారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి (Shreyas Iyer Health Update)పై టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కీలక అప్డేట్ అందించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. వైద్యులు నిరంతరం శ్రేయస్‌ను కనిపెట్టుకుని ఉండి.. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారని సూర్య తెలిపాడు.కాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా (Harshit Rana) బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను సంచలన రీతిలో అందుకున్న ఈ ముంబై బ్యాటర్.. వెంటనే కిందపడిపోయాడు. పొట్ట పట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి అతడిని డ్రెసింగ్‌రూమ్‌కు తీసుకువెళ్లాడు.స్పృహ తప్పి పడిపోయాడుఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వెంటనే సిడ్నీలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లగానే స్పృహ తప్పి పడిపోయాడు.ప్రాణాంతకమైన గాయమేఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఫిజియో, టీమ్ డాక్టర్ వెంటనే స్పందించి పరిస్థితి చేయి దాటకుండా చూసుకున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ప్రాణాంతకమైన గాయమే అది. శ్రేయస్ పట్టుదల గల ఆటగాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు’’ అని పేర్కొన్నాయి.ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు శ్రేయస్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘శ్రేయస్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే నేను అతడికి కాల్ చేశాను.నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నాఅయితే, అప్పుడు తన ఫోన్ తన దగ్గర లేదని తెలిసింది. వెంటనే ఫిజియో కమలేశ్ జైన్‌కు ఫోన్ చేశా. పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా. ఇక గత రెండురోజులుగా నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నా. దీనర్థం.. అతడు బాగానే ఉన్నట్లు కదా!అవును.. శ్రేయస్ పరిస్థితి మెరుగుపడుతోంది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్న రోజుల పాటు అయ్యర్ వారి పర్యవేక్షణలోనే ఉండనున్నాడు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’’ అంటూ శ్రేయస్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు సూర్య ఊరట కలిగించాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా వన్డే సిరీస్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో మార్ష్ బృందం.. గిల్ సేనను 2-1తో ఓడించి సిరీస్ గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం (అక్టోబరు 29) నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. నవంబరు 8న ఐదో టీ20తో సిరీస్ ముగుస్తుంది.చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం -
ఫెయిల్ అయితే ఏంటి?!.. నాకైతే అలాంటి భయాలు లేవు: గంభీర్
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1 (Ind Loss ODI Series To Aus)తో ఓడిపోయింది. ఫలితంగా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది.ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్‌లలో కంగారూ జట్టు కేవలం 11 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనం.బ్యాటింగ్ పరంగా విఫలంముఖాముఖి రికార్డు పరంగా భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్నా సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. మరోవైపు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. బ్యాటింగ్ పరంగా విఫలం కావడం కలవరపెట్టే అంశం.గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్య.. 20 మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండే హాఫ్ సెంచరీలు బాదాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇంకా కేవలం మూడు నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. 72 పరుగులేఇటీవల కెప్టెన్‌గా ఆసియా టీ20 కప్-2025 టైటిల్ గెలిచిన సూర్య.. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 72 పరుగులే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై విమర్శలు వస్తుండగా.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.ఎలాంటి భయాలు లేవుఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘సూర్య బ్యాటింగ్ ఫామ్ నన్ను ఏమాత్రం ఆందోళనకు గురిచేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవు. అల్ట్రా- అగ్రెసివ్‌గా ఆడాలని డ్రెసింగ్‌రూమ్‌లో నిర్ణయించుకున్నాం. దూకుడుగా ఆడటమే మాకు ఇష్టం.ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకున్నపుడు వైఫల్యాలను కూడా ఆమోదించగలగాలి. ఇలాంటి అప్రోచ్ కారణంగా ఒక్కోసారి విఫలమైనా సరే.. మేము దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని గంభీర్ తెలిపాడు.ఒక్కసారి లయ అందుకుంటేఇక టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు ఆసియా కప్ టోర్నీలో సూపర్ ఫామ్ కనబరిచాడు. ఏదేమైనా సూర్య ఒక్కసారి లయ అందుకుంటే బాధ్యత తన భుజం మీదు వేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు.టీ20 క్రికెట్లో మేము వ్యక్తిగత పరుగుల కంటే కూడా మా క్రికెట్ బ్రాండ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడతాం. దూకుడైన శైలితోనే ముందుకు సాగుతాం. బ్యాటర్లు తరచూ వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టు రాణిస్తే అది పెద్దగా లెక్కలోకి రాదు’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లోనూ తమ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా అక్టోబరు 29- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
బాబర్ ఆజంను కనికరించిన సెలక్టర్లు.. రిజ్వాన్‌కు మరో భారీ షాక్
దాదాపు ఏడాది విరామం తర్వాత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయనున్నాడు. శ్రీలంక- జింబాబ్వే- పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 ట్రై సిరీస్‌కు ముందుకు సెలక్టర్లు అతడిని కనికరించారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ (Pak vs SA T20Is) ఆడే పాక్ జట్టులో అతడికి చోటు ఇచ్చారు.ఏడాది కాలంగా దూరంకాగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బాబర్ పాకిస్తాన్ తరఫున చివరగా టీ20 ఆడాడు. ఆ సిరీస్‌లో విఫలమైన కారణంగా సెలక్టర్లు బాబర్‌పై వేటు వేశారు. దాదాపు ఏడాది కాలంగా అతడిని టీ20 జట్టుకు దూరంగా ఉంచారు.అయితే, సొంతగడ్డపై జరిగే సౌతాఫ్రికాతో జరిగే తాజా టీ20 సిరీస్‌కు బాబర్‌ను ఎంపిక చేయడం విశేషం. ఆ తర్వాత పాక్ శ్రీలంక- జింబాబ్వేలతో టీ20 ట్రై సిరీస్ ఆడనుంది. నిజానికి శ్రీలంక- అఫ్గనిస్తాన్ జట్లతో పాక్ ముక్కోణపు టీ20 సిరీస్ ఆడాల్సింది.అయితే, పాక్ వైమానిక దాడుల్లో అఫ్గన్‌కు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణం చెందడంతో అఫ్గన్ బోర్డు ఈ సిరీస్ నుంచి విరమించుకుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేను బతిమాలుకున్న పాక్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు ఆ జట్టును సిరీస్ ఆడేలా ఒప్పించింది.రిజ్వాన్‌కు మరో భారీ షాక్ఇక సౌతాఫ్రికాతో టీ20 జట్టుకు సల్మాన్ ఆఘాను టీ20 కెప్టెన్‌గా కొనసాగించిన పాక్ బోర్డు.. వన్డేల్లో ఈ సిరీస్‌తో షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌గా ప్రయాణం ఆరంభిస్తాడని తెలిపింది. అయితే, వన్డే కెప్టెన్‌గా తప్పించిన మొహమ్మద్ రిజ్వాన్‌కు మాత్రం యాజమాన్యం మరో షాకిచ్చింది. కనీసం జట్టులోనూ అతడికిస్థానం ఇవ్వలేదు. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన రిజ్వాన్‌కు.. వన్డేలలోనూ మొండిచేయే ఎదురైంది.కాగా పాక్ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. తొలి టెస్టులో వరల్డ్ చాంపియన్లను ఓడించిన షాన్ మసూద్ బృందం.. రెండో టెస్టులో మాత్రం ఓటమి పాలైంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ సమమైంది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు (అక్టోబరు 28- నవంబరు 1)సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీఖ్.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు (నవంబరు 4- 8)షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసీబుల్లా ఖాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, సయీమ్ ఆయుబ్, సల్మాన్ ఆఘా.చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా? -
ENG vs NZ: హ్యారీ బ్రూక్ విధ్వంసం... ఫిల్ సాల్ట్ ధనాధన్
న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన బ్రూక్.. 22 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (NZ vs ENG)కు వెళ్లింది. ఇందులో భాగంగా శనివారం తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో క్రైస్ట్‌చర్చ్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు.. ఇంగ్లండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఫిల్ సాల్ట్ ధనాధన్.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ క్రమంలో ఓపెనర్ జోస్ బట్లర్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం అదరగొట్టాడు. 56 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 85 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జేకబ్ బెతెల్ కాసేపు మెరుపులు (12 బంతుల్లో 24) మెరిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. ఆరు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 78 పరుగులు సాధించాడు. మిగతా వారిలో సామ్ కర్రాన్ 3 బంతుల్లో 8, టామ్ బాంటన్ 12 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 236 పరుగులు సాధించింది.కివీస్ ఎదుట భారీ లక్ష్యంతద్వారా న్యూజిలాండ్‌కు 237 పరుగుల మేర భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానంలో ఏ జట్టుకైనా టీ20లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఇక న్యూజిలాండ్ బౌలర్లలో కైలీ జెమీషన్ రెండు వికెట్లు కూల్చగా.. జేకబ్ డఫీ, మైకేల్ బ్రాస్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అరుదైన మైలురాయిని చేరుకున్న హ్యారీ బ్రూక్అంతర్జాతీయ టీ20లలో హ్యారీ బ్రూక్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున ఈ ఫార్మాట్లో 51 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ప్రస్తుతం 1012 పరుగులు ఉన్నాయి.అంతేకాదు.. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇయాన్ మోర్గాన్ (21 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నాడు. ఇక సారథిగా బ్రూక్‌కు ఇదే తొలి టీ20 ఫిఫ్టీ కాగా.. ఓవరాల్‌గా ఐదవది కావడం గమనార్హం.చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’ -
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్‌తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్‌ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!
అఫ్గనిస్తాన్ టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో తెగదెంపులు చేసుకున్నట్లు అతడు సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ వైమానిక దాడిలో అఫ్గన్ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రషీద్ ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అఫ్గనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్తాన్ శుక్రవారం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృత్యువాత పడగా.. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు ఉన్నారు. వీరిని కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్గా గుర్తించారు.మానవ హక్కుల ఉల్లంఘనపక్తికా రాజధాని షరానాలో ఫ్రెండ్లీ మ్యాచ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ స్పందిస్తూ.. పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించాడు. ‘‘అఫ్గనిస్తాన్‌లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం.దేశమే ముఖ్యంఇదొక చట్టవ్యతిరేక చర్య. మానవ హక్కుల ఉల్లంఘన. ఇందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. పాకిస్తాన్‌తో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలుగుతూ అఫ్గన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని రషీద్ ఖాన్ ఈ సందర్భంగా సమర్థించాడు. బోర్డు నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతునిస్తున్నానని.. అన్నిటికంటే దేశ సమగ్రతే ముఖ్యమని పేర్కొన్నాడు.డిలీట్ కొట్టేశాడుతాజాగా రషీద్ ఖాన్ మరో నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా బయోలో అతడు చేసిన మార్పు ద్వారా స్పష్టమవుతోంది. 27 ఏళ్ల ఈ వరల్డ్‌క్లాస్ స్పిన్నర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2021లో ఈ జట్టుతో చేరిన రషీద్.. మూడు టైటిళ్లు గెలిచాడు. గతేడాది కూడా ఇదే జట్టు ట్రోఫీ గెలుచుకుంది.అయితే, తన ఎక్స్ ఖాతా బయో నుంచి ఈ జట్టు పేరును రషీద్ తొలగించాడు. అఫ్గన్ బోర్డుతో పాటు గుజరాత్ టైటాన్స్, బిగ్‌బాష్ లీగ్ స్ట్రైకర్స్, ఇన్సిగ్నియా స్పోర్ట్స్ అనే అకౌంట్లను బయోలో కొనసాగించిన రషీద్.. లాహోర్ ఖలందర్ పేరును మాత్రం డిలీట్ చేశాడు. తద్వారా పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను బాయ్‌కాట్ చేస్తాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్ వక్రబుద్ధి తగిన విధంగా.. ఇలాగే బుద్ది చెప్పాలంటూ రషీద్ చర్యను అభినందిస్తున్నారు.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్ -
IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్
భారత క్రికెట్ జట్టు యువ రక్తంతో నిండిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ మార్పు కూడా జరిగింది. టెస్టులకు రోహిత్ శర్మ (Rohit Sharma) స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డే కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని తప్పించింది.ఇక ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ స్థానాన్ని యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భర్తీ చేశాడు. ఇప్పటికే టెస్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్‌ను 2-2తో సమం చేసిన గిల్.. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేశాడు.త్వరలోనే టీ20 పగ్గాలు కూడా అతడికేఈ క్రమంలో వన్డే సారథిగా తొలి ప్రయత్నంలోనే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గిల్‌కు కఠిన సవాలు ఎదురుకానుంది. ఇదిలా ఉంటే.. మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తున్నామని.. త్వరలోనే టీ20 పగ్గాలు గిల్‌కు అప్పగిస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం పట్ల సంతోషంగా ఉంది. తను అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను.కెప్టెన్సీ చేజారుతుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్‌తో నా రిలేషన్ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం.మనిషిగా, ఆటగాడిగా తను ఎలాంటివాడో నాకు పూర్తిగా తెలుసు. తను ఈ స్థాయికి చేరడం పట్ల సంతోషంగా ఉంది. అందరికీ అతడు స్ఫూర్తిగా నిలిచాడు కూడా!’’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అక్టోబరు 18- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.ఆసియా కప్ విజేతగాఇందుకోసం గిల్ సారథ్యంలోని వన్డే జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకోగా.. సూర్య సేన టీ20 సిరీస్‌కు ముందు అక్కడికి చేరుకుంటుంది. కాగా ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవలే చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్ -
IND vs AUS: జట్లు, షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా ఆదివారం (అక్టోబరు 19)నాటి మ్యాచ్‌తో తొలుత వన్డే సిరీస్‌కు తెరలేస్తుంది. అనంతరం ఆసీస్- భారత్ (IND vs AUS) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు ముహూర్తం ఖరారైంది.ఇందుకోసం ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్🏏తొలి వన్డే: అక్టోబరు 19 (ఆదివారం)- పెర్త్ స్టేడియం, పెర్త్🏏రెండో వన్డే: అక్టోబరు 23 (గురువారం)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్🏏మూడో వన్డే: అక్టోబరు 25 (శనివారం)- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఆసీస్- భారత్ వన్డే మ్యాచ్‌లు ఉదయం 9 గంటలకు ఆరంభంఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్బెర్రా🏏రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్🏏మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్🏏నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్🏏ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్‌లు ఆరంభం.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..👉జియో హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం👉టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్స్‌లో ప్రసారంఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.భారత్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే)మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్.. సంజూ కూడా సూపర్: వార్నర్
టీమిండియా స్టార్లు సంజూ శాంసన్ (Sanju Samson), రింకూ సింగ్ (Rinku Singh)లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు వీరిద్దరు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తోటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకుని అద్భుత ప్రదర్శనలతో రాణించారంటూ కొనియాడాడు.మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తొలుత వన్డే సిరీస్ జరుగనుండగా.. అనంతరం ఇరుజట్లు టీ20 సిరీస్‌లో పాల్గొంటాయి. ఇక ఈసారి కూడా సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌తో కలిసి.. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వన్డే టీమ్‌లోకి వచ్చాడు.సెలక్టర్ల తీరుపై విమర్శలుసంజూను కాదని మరీ జురెల్‌ను ఎంపిక చేయడం పట్ల టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. టీ20 జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది. ఇక రింకూ సింగ్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్ఈ నేపథ్యంలో ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ డేవిడ్ వార్నర్.. సంజూ, రింకూలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా టీ20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకునేందుకు వాళ్లిద్దరు ఎంతగానో కష్టపడ్డారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రింకూ ఐపీఎల్ చరిత్రలోనే ప్రస్తుతం అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పటికే భారత జట్టులో ఎంతో మంది వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. వారితో పాటు ఇప్పుడు ఫియర్లెస్ యంగ్స్టర్లు కూడా వచ్చేశారు. భారత క్రికెట్‌కు ఇది శుభ పరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.మా వాళ్లకు అగ్ని పరీక్షఆస్ట్రేలియన్లకు ఈ సిరీస్ అగ్ని పరీక్ష వంటిది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా టీమిండియా ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 గెలిచి జోరు మీదుంది.చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా? -
NZ vs ENG: ఇంగ్లండ్ తుదిజట్టు.. నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్లకు చోటు
న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ (NZ vs ENG 1st T20)కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్లకు చోటిచ్చింది. కాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చివరగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడిన విషయం తెలిసిందే.డబ్లిన్ వేదికగా ఆతిథ్య ఐరిష్ జట్టుపై ఇంగ్లండ్ 2-0తో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇక ఈ సిరీస్‌లో హ్యారీ బ్రూక్ (Harry Brook) గైర్హాజరీలో యువ ఆటగాడు జేకబ్ బెతెల్ ఇంగ్లండ్ సారథిగా వ్యవహరించాడు.బ్రూక్ రీఎంట్రీఈ క్రమంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు బ్రూక్ తిరిగి వచ్చి పగ్గాలు మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా శనివారం (అక్టోబరు 18) ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.జోస్ బట్లర్‌తో పాటు.. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానంలో జరిగే తొలి టీ20కి ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును ప్రకటించింది. బ్రూక్ సారథ్యంలోని ఈ జట్టులో జోస్ బట్లర్‌తో పాటు.. ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జోర్డాన్ కాక్స్ (Jordan Cox) రూపంలో నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్లు ఉండటం విశేషం. బట్లర్ ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా వ్యవహరించనుండగా.. ఈ ముగ్గురికీ చోటు దక్కడం గమనార్హం.ఇక ఆల్‌రౌండర్ల కోటాలో జేమీ ఓవర్టన్ను బెంచ్‌కే పరిమితం చేసిన ఇంగ్లండ్.. బ్రైడన్ కార్స్, సామ్ కర్రాన్‌లను జట్టులో చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగనుంది. ఆదిల్ రషీద్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేకబ్ బెతెల్ కూడా ఇందులో భాగం కానున్నాడు. అయితే, టీ20 స్పెషలిస్టు ల్యూక్ వుడ్ కారణంగా సోనీ బేకర్ ఈసారికి బెంచ్‌కే పరిమితమయ్యాడు.న్యూజిలాండ్‌తో తొలి టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు ఇదేఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, సామ్ కర్రాన్, జోర్డాన్ కాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టుహ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బెతెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, బెన్ డకెట్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, ల్యూక్ వుడ్.న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: అక్టోబరు 18- క్రైస్ట్చర్చ్రెండో టీ20: అక్టోబరు 20- క్రైస్ట్చర్చ్మూడో టీ20: అక్టోబరు 23- ఆక్లాండ్.భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ ఉదయం 11.45 నిమిషాలకు ఆరంభం. చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూన నమీబియా చేతిలో టీ20 వరల్డ్‌కప్-2024 రన్నరప్ సౌతాఫ్రికాకు ఘోర పరాభావం ఎదురైంది. శనివారం విండ్‌హోక్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో నమీబియా ఓడించింది.నమీబియా విజయానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమ్వగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జేన్ గ్రీన్(30 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాది నమీబియా మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్రీన్.. చివరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 135 పరుగుల లక్ష్యాన్ని నమీబియా 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఏ ఫార్మాట్లోనైనా సౌతాఫ్రికాపై నమీబియాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.నమీబియా బ్యాటర్లలో గ్రీన్‌తో పాటు గెర్హార్డ్ ఎరాస్మస్(21), కుర్గర్(18),ట్రంపెల్మాన్(11) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్, సీమ్లైన్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఫోర్టిన్, కోయిట్జీ చెరో వికెట్ సాధించారు.తేలిపోయిన ప్రోటీస్ బ్యాటర్లు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగొచ్చిన క్వింటన్ డికాక్(1) తీవ్ర నిరాశపరిచాడు. అతడితో పాటు స్టార్ బ్యాటర్లు రీజా హెండ్రిక్స్(7), ఫెరీరా(4) విఫలమయ్యారు.సఫారీ బ్యాటర్లలో జే స్మిత్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెర్మన్(23), ఫోర్టిన్(19) పర్వాలేదన్పించారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ మూడు, మాక్స్ హీంగో రెండు, ఎరాస్మస్, షికాంగో, స్మిత్ తలా వికెట్ సాధించారు. నమీబియా ఇటీవలే టీ20 ప్రపంచకప్-2026కు ఆర్హత సాధించింది. కాగా ఓ అసోసియేట్ సభ్య దేశం చేతిలో సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి.చదవండి: నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజా -
మూడో టీ20లో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రపు మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది.అఫ్గాన్ బ్యాటర్లలో దర్విష్ రసూలి(32) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అటల్(28), ముజీబ్(23) పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు. సిరీస్ అంతటా అఫ్గాన్ బ్యాటర్లు తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. తంజిమ్ హసన్ సాకిబ్, నసీం అహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు షోర్ఫుల్ ఇస్లాం, రిషాద్ చెరో వికెట్ పడగొట్టారు.సైఫ్ మెరుపు హాఫ్ సెంచరీ..అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా టైగర్స్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సైఫ్ హసన్(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.అతడితో పాటు తంజీద్ 33 పరుగులతో రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెండు, ఓమర్జాయ్ అబ్దుల్లా తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: Abhishek Sharma: ఆసీస్‌పై అభిషేక్ మళ్లీ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే? -
మిచెల్ మార్ష్ విధ్వసంకర సెంచరీ.. కివీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫర్ట్(48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైఖల్ బ్రెస్‌వెల్(26), నీషమ్(25) రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, బార్ట్లెట్ తలా రెండు వికెట్లు సాధించారు.మార్ష్ విధ్వంసకర సెంచరీ..అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మిగితా బ్యాటర్లు తేలిపోయినప్పటికి మార్ష్ మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.కేవలం 52 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్ష్.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ నాలుగు వికెట్లు సాధించాడు. అతడితో పాటు ఢపీ రెండు, సీర్స్ ఓ వికెట్ పడగొట్టాడు. -
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ (WI vs NEP) క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయీ హోప్‌నకు విశ్రాంతినిచ్చిన విండీస్ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అకీల్ హొసేన్ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.కాగా షార్జా వేదికగా వెస్టిండీస్ జట్టు నేపాల్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుకెప్టెన్ షాయి హోప్ (Shai Hope)తో పాటు పేసర్ అల్జారీ జోసెఫ్, బ్యాటర్ జాన్సన్ చార్లెస్ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్‌లో అకీల్ హొసేన్ సారథ్యంలో జేసన్ హోల్డర్, ఫాబియాన్ అలెన్, కైల్ మేయర్స్ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్ ఆటగాళ్లు నేపాల్‌తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్ అకీమ్ ఆగస్టీ, ఆల్‌రౌండర్ నవీన్ బిడైసీ, స్పిన్నర్ జీషన్ మొతారా, పేసర్ రామోన్ సైమండ్స్, కీపర్ అమీర్ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుఅకీల్ హొసేన్ (కెప్టెన్), ఫాబియాన్ అలెన్, జువెల్ ఆండ్రూ, అకీమ్ ఆగస్టీ, నవీన్ బిడైసీ, జెడియా బ్లేడ్, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్ హోల్డర్, అమీర్ జాంగూ, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, జీషన్ మొతారా, రామోన్ సైమండ్స్, షమార్ స్ప్రింగర్.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్ తమ జట్టు వివరాలను వెల్లడించింది.టీమిండియాతో టెస్టులకు విండీస్ జట్టు వివరాలురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్ చందర్‌పాల్, బ్రెండన్ కింగ్, కెవ్లాన్ అండర్సన్, షై హోప్, జాన్ క్యాంప్‌బెల్, అతనాజ్, ఇమ్లాక్, గ్రీవ్స్, అండర్సన్ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, ఖారీ పైర్, జోమెల్ వారికాన్. చదవండి: ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు! -
ఆసీస్‌తో సిరీస్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్
ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ (NZ vs AUS)కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైట్‌బాల్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) సర్జరీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది.విజయవంతమైన కెప్టెన్.. మరోసారిఆస్ట్రేలియాతో చాపెల్- హెడ్లీ టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా కివీస్ బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది. సాంట్నర్ గైర్హాజరీలో మైకేల్ బ్రాస్‌వెల్ (Michael Bracewell) న్యూజిలాండ్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఈ ఆల్‌రౌండర్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి కాదు.ఆ ఇద్దరి రీ ఎంట్రీఇప్పటి వరకు పది టీ20 మ్యాచ్‌లలో బ్లాక్‌క్యాప్స్‌కు నాయకత్వం వహించిన బ్రాస్‌వెల్ ఆరు విజయాలు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టీ20 సిరీస్ ద్వారా కివీస్ పేసర్లు కైలీ జెమీషన్, బెన్ సియర్స్ జట్టులోకి తిరిగి వచ్చారు. తొలి సంతానానికి స్వాగతం పలికే క్రమంలో జెమీషన్ జింబాబ్వేతో సిరీస్‌కు దూరం కాగా.. సియర్స్ పక్కటెముకల నొప్పితో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.అయితే, తాజాగా వీరిద్దరు ఆసీస్‌తో సిరీస్ నేపథ్యంలో పునరాగమనం చేయనున్నారు. జెమీషన్, సియర్స్ రాకతో పేస్ దళం మరింత పటిష్టంగా మారింది. వీరితో పాటు మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ కూడా పేస్ విభాగంలో సేవలు అందించనున్నారు.తప్పుకొన్న కేన్ విలియమ్సన్ఇదిలా ఉంటే.. కెప్టెన్ సాంట్నర్‌తో పాటు ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విలియమ్ ఒరూర్కీ, గ్లెప్ ఫిలిప్స్ తదితరులు అనారోగ్య కారణాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యారు. మరోవైపు.. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తానే స్వయంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో బ్రాస్‌వెల్ కెప్టెన్‌గా మరోసారి రంగంలోకి దిగనున్నాడు. కాగా కివీస్ సొంతగడ్డపై అక్టోబరు 1- 4 మధ్య ఆసీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టుమైకేల్ బ్రాస్‌వెల్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, కైలీ జెమీషన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టిమ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి.న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్👉అక్టోబరు 1- తొలి టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్👉అక్టోబరు 3- రెండో టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్👉అక్టోబరు 4- మూడో టీ20- బే ఓవల్, మౌంట్ మౌంగనీయ్.చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని భారత్ -
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా నిలిచాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా ఫిల్ సాల్ట్ ఈ ఘనత సాధించాడు. కాగా ఇంగ్లండ్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో ప్రొటిస్ చేతిలో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. శుక్రవారం నాటి రెండో టీ20లో మాత్రం అదరగొట్టింది.ధనాధన్.. ఫటాఫట్.. 60 బంతుల్లోనే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 304 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను 158 పరుగులకే ఆలౌట్ చేసి.. 146 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.ఈ విజయంలో ఫిల్ సాల్ట్ది కీలక పాత్ర. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో పదిహేను ఫోర్లతో పాటు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. కాగా ఇంగ్లండ్ తరఫున టీ20లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాదు సాల్ట్‌కు ఇది అంతర్జాతీయ స్థాయిలో నాలుగో శతకం.ఈ క్రమంలోనే ఫిల్ సాల్ట్.. సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. కేవలం 42 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లోనే నాలుగు శతకాలు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా చరిత్రపుటల్లోకి ఎక్కాడు. అంతకు ముందు సూర్య 57 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు.అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా నాలుగు శతకాలు పూర్తి చేసుకున్న క్రికెటర్లు🏏ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)- 42 ఇన్నింగ్స్‌లో🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 57 ఇన్నింగ్స్‌లో🏏రోహిత్ శర్మ (ఇండియా)- 79 ఇన్నింగ్స్‌లో🏏గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 82 ఇన్నింగ్స్‌లో.ఇక ఈ రికార్డుతో పాటు మరో వరల్డ్ రికార్డును కూడా ఫిల్ సాల్ట్ సమం చేశాడు. సౌతాఫ్రికాపై ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ సాధించిన ఆటగాడిగా జొనాథర్ చార్లెస్‌తో కలిసి ప్రథమ స్థానంలో నిలిచాడు.సౌతాఫ్రికాపై ఫాస్టెస్ట్ టీ20 సెంచరీలు చేసింది వీరే🏏ఫిల్ సాల్ట్- 39 బంతుల్లో🏏జొనాథన్ చార్లెస్- 39 బంతుల్లో🏏తిలక్ వర్మ- 41 బంతుల్లో🏏సంజూ శాంసన్- 47 బంతుల్లో🏏బాబర్ ఆజం- 49 బంతుల్లో.చదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. ఆ కసి అక్కడ చూపించేశాడు! 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో -
సాల్ట్ విధ్వంసకర, భారీ శతకం.. టీమిండియా రికార్డు బ్రేక్ చేసిన ఇంగ్లండ్
సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 146 పరుగుల తేడాతో చిత్తు చేసి.. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్ (ENG vs SA)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు వన్డేలు గెలిచిన సఫారీలు 2-1తో సిరీస్ సొంతం చేసుకున్నారు. ఇక టీ20లలోనూ ప్రొటిస్ జట్టు శుభారంభమే అందుకుంది.కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో డీఎల్ఎస్ పద్ధతిలో 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం రాత్రి రెండో టీ20 జరిగింది. మాంచెస్టర్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది.సాల్ట్ విధ్వంసకర, భారీ శతకంఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రొటిస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ముప్పై తొమ్మిది బంతుల్లోనే శతకమార్కు అందుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 15 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 141 పరుగులతో.. 235కు పైగా స్ట్రైక్‌రేటుతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌ఇక మరో ఓపెననర్ జోస్ బట్లర్ (Jos Buttler) సైతం మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 30 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 8 ఫోర్లు, 7 సిక్స్‌లు బాది.. 276కు పైగా స్ట్రైక్‌రేటుతో 83 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో జేకబ్ బెతెల్ (14 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ ధనాధన్ (21 బంతుల్లో 41 నాటౌట్) దంచికొట్టాడు.ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 304 పరుగులు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో బిజోర్న్ ఫార్చూన్కు రెండు వికెట్లు దక్కాయి.ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించడంలో విఫలమైంది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (20 బంతుల్లో 41), మరో ఓపెర్ రియాన్ రికెల్టన్ (10 బంతుల్లో 20) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు.ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణవన్డౌన్లో వచ్చిన లువాన్ డ్రి ప్రిటోరియస్ (2)తో పాటు.. డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా విఫలం కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (23), డొనోవాన్ ఫెరీరా (23), బిజోర్స్ ఫార్చూన్ (32) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి నిలవలేక స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.ఈ క్రమంలో 16.1 ఓవర్లలో 158 పరుగులు మాత్రమే చేసిన సఫారీ జట్టు.. ఇంగ్లండ్ చేతిలో 146 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు, సామ్ కర్రన్, లియామ్ డాసన్, విల్ జాక్స్ రెండేసి వికెట్లు కూల్చి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ఆదిల్ రషీద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక విధ్వంసకర శతక వీరుడు, ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్కాగా అంతర్జాతీయ టీ20లలో ఫుల్ మెంబర్ జట్టు (ఐసీసీ టెస్టు హోదా కలిగిన జట్టు)పై అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. సౌతాఫ్రికాపై రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులు స్కోరు చేసి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. కాగా 2024లో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 పరుగులు సాధించింది.చదవండి: బుమ్రా బౌలింగ్‌లో మా వాడు 6 సిక్స్‌లు కొడతాడు: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్PHIL SALT - THE FASTEST CENTURION FOR ENGLAND IN T20I HISTORY. 🥶pic.twitter.com/JzhM7RrLme— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2025 -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్
జింబాబ్వే వెటరన్ క్రికెటర్ సీన్ విలియమ్స్ (Sean Williams)సరికొత్త అధ్యాయం లిఖించాడు. అంతర్జాతీయ టీ20లలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. తద్వారా ఇన్నాళ్లు.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.శ్రీలంకతో తాజా టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా సీన్ విలియమ్స్ ఈ ఘనత సాధించాడు. కాగా రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం శ్రీలంకక్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. 2-0తో జింబాబ్వే క్లీన్‌స్వీప్ అయింది.రిటైర్మెంట్ ప్రకటించి..ఈ క్రమంలో బుధవారం టీ20 సిరీస్ మొదలుకాగా.. సీన్ విలియమ్స్ పునరాగమనం చేశాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ జింబాబ్వే టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా 38 ఏళ్ల సీన్ విలియమ్స్.. గతేడాది మే 12న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.అయితే, టీ20 ప్రపంచకప్-2026 ఆఫ్రికన్ క్వాలిఫయర్స్ నేపథ్యంలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విలియమ్స్.. సెప్టెంబరులో జరిగే ఈ మ్యాచ్‌లలో పాల్గొనున్నాడు. అయితే, అంతకంటే ముందు లంకతో సొంతగడ్డపై సిరీస్ సందర్భంగానే రీఎంట్రీ ఇచ్చేశాడు.ప్రపంచ రికార్డుహరారే వేదికగా శ్రీలంకతో తొలి టీ20 సందర్భంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సీన్ విలియమ్స్.. 11 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఆట పరంగా రాణించకపోయినా.. సుదీర్ఘ అంతర్జాతీయ టీ20 క్రికెట్ ప్రయాణంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2006 నుంచి.. కాగా 2006లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా సీన్ విలియమ్స్ జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు తన 82 టీ20లు ఆడి 1705 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 24 టెస్టుల్లో 1946, 164 వన్డేల్లో 5217 రన్స్ రాబట్టాడు.కాగా తాజా రీఎంట్రీతో సీన్ విలియమ్స్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో 18 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రపంచంలో సుదీర్ఘకాలం ఇలా ఇంటర్నేషనల్ టీ20లలో కొనసాగుతున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత బంగ్లా దిగ్గజం షకీబ్ అల్ హసన్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్న క్రికెటర్లు🏏సీన్ విలియమ్స్ (జింబాబ్వే)- 2006- 2025* - 18 ఏళ్ల 279 రోజులు- 129 మ్యాచ్‌లు🏏షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2006- 2024- 17 ఏళ్ల 166 రోజులు- 82 మ్యాచ్‌లు🏏మహ్మదుల్లా (బంగ్లాదేశ్)- 2007- 2024- 17 ఏళ్ల 41 రోజులు- 141 మ్యాచ్‌లు🏏రకీప్ పటేల్ (కెన్యా)- 2008- 2025- 16 ఏళ్ల 357 రోజులు- 88 మ్యాచ్‌లు🏏రిచర్డ్ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్)- 2008- 2005- 16 ఏళ్ల 343 రోజులు- 102 మ్యాచ్‌లు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 2007- 2024- 16 ఏళ్ల 2024- 16 ఏళ్ల 284 రోజులు- 159 మ్యాచ్‌లు.చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు.. -
ఇంగ్లండ్ స్టార్ కీలక నిర్ణయం.. ఇకపై..
లండన్: ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton) సంప్రదాయ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని... అందుకే టెస్టులకు నిరవధిక విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఐదు రోజుల ఆటకు ఇది రిటైర్మెంట్ కాదు. 31 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెటర్ ఇటీవల భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్నాడు. 2–2తో సమమైన ఆ సిరీస్‌లో అతను రెండు టెస్టులు ఆడాడు.నాకిది ఇబ్బందికరం‘కెరీర్ జోరుగా సాగిపోతున్న ఈ దశలో ఏడాదిలో 12 నెలలు అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలంటే కుదరదు. అలా ప్రతీ ఫార్మాట్‌కు న్యాయం చేయలేను. శారీరకంగా, మానసికంగానూ నాకిది ఇబ్బందికరం. అందుకే బాగా ఆలోచించాకే టెస్టులకు విరామం ప్రకటిస్తున్నాను. అప్పుడు నేను పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టొచ్చు. సుదీర్ఘకాలం పాటు వన్డేలు, టీ20లు ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని ఓవర్టన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యంకాగా 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్లోప ప్రయాణం మొదలుపెట్టిన ఓవర్టన్.. ఇప్పటివరకు ఓవర్టన్ కేవలం 6 వన్డేలు, 12 టీ20లే ఆడాడు. ఐపీఎల్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక లండన్‌లో ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు ఆడాడు. ఓవర్టన్ అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర -
పసికూనను చిత్తు చేసి.. టీ20 సిరీస్ కైవసం
నెదర్లాండ్స్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (BAN vs NED T20I) ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో లిటన్ దాస్ బృందం చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.కాగా ఆసియా కప్-2025 (Asia Cup) సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ సొంతగడ్డపై నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా జట్టు.. తాజాగా రెండో టీ20లోనూ సత్తా చాటింది.103 పరుగులకే ఆలౌట్సెల్హైట్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 17.3 ఓవర్లలో కేవలం 103 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లలో మాక్ ఒడౌడ్ (8) విఫలం కాగా.. విక్రమ్‌జిత్ సింగ్ (24) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన తేజ నిడమానూరు డకౌట్ కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ చార్ల్స్ ఎడ్వర్డ్స్ (9), షారిజ్ అహ్మద్ (12), నోవా క్రోస్ (2), సికందర్ జుల్ఫికర్ (2) కూడా చేతులెత్తేశారు.మూడు వికెట్లతో సత్తా చాటిన నసూమ్కైల్ క్లెన్ (4) కూడా విఫలం కాగా.. ఆఖర్లో ఆర్యన్ దత్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి డచ్ జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ నసూమ్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా రెండు వికెట్లు కూల్చారు.తాంజిద్ హసన్ తమీమ్ అర్ధ శతకంమిగిలిన వారిలో మెహదీ హసన్, తాంజిమ్ హసన్ సకీబ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ మరోసారి దుమ్మురేపింది. 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 104 పరుగులు సాధించింది. ఓపెనర్లలో పర్వేజ్ హొసేన్ ఇమాన్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. తాంజిద్ హసన్ తమీమ్ అర్ధ శతకంతో సత్తా చాటాడు.మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న తాంజిద్.. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ లిటన్ దాస్ (18 బంతుల్లో 18 నాటౌట్) నిలవగా.. ఫోర్‌తో తాంజిద్ బంగ్లా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక నెదర్లాండ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన నసూమ్ అహ్మద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- నెదర్లాండ్స్ మధ్య నామమాత్రపు మూడో టీ20కి బుధవారం (సెప్టెంబరు 3) షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs PAK: నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి -
పసికూనపై బంగ్లాదేశ్ ప్రతాపం: పదేళ్ల తర్వాత తొలిసారి ఇలా..
సొంతగడ్డపై నెదర్లాండ్స్ (BAN vs NED)తో టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. సైల్హెట్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20లు ఆడే నిమిత్తం నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య శనివారం నాటి తొలి టీ20లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్.. బంగ్లా బౌలర్ల విజృంభణ నేపథ్యంలో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఫర్వాలేదనిపించిన మాక్స్, తేజఓపెనర్లలో మాక్స్ ఒడౌడ్ (15 బంతుల్లో 23) రాణించగా.. విక్రమ్‌జిత్ సింగ్ (11 బంతుల్లో 4) తేలిపోయాడు. ఈ ఇద్దరి వికెట్లను బంగ్లా పేసర్ టస్కిన్ అహ్మద్ (Taskin Ahmed) దక్కించుకున్నాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన తేజ నిడమానూరు (26 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ఎడ్వర్డ్స్ (12), షారిజ్ అహ్మద్ (15), నోవా క్రోస్ (11), కైలే క్లెన్ (9), టిమ్ ప్రింగ్లే (9) విఫలమయ్యారు. ఆఖర్లో ఆర్యన్ దత్ (8 బంతుల్లో 13) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు.ఇక బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మొత్తంగా నాలుగు వికెట్లతో చెలరేగగా.. సైఫ్ హసన్ రెండు, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్యన్ దత్ బౌలింగ్‌లో పర్వేజ్ హుసేన్ ఇమాన్ (15) అవుట్ కాగా.. టిమ్ ప్రింగ్లే మరో ఓపెనర్ తాంజిద్ హసన్ తమీమ్ (29) వికెట్‌ను దక్కించుకున్నాడు.లిటన్ దాస్ మెరుపు అర్ధ శతకం.. సైఫ్ హసన్ ధనాధన్‌ఈ క్రమంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ లిటన్ దాస్ మెరుపు అర్ధ శతకంతో దుమ్ములేపాడు. 29 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో లిటన్ దాస్ 54 పరుగులతో అజేయంగానిలిచాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్ సైఫ్ హసన్ రాణించాడు. కేవలం 19 బంతుల్లోనే 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. లిటన్ దాస్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇక 13.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. పసికూన నెదర్లాండ్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్‌ను దెబ్బకొట్టిన టస్కిన్ అహ్మద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.పదేళ్ల తర్వాత..కాగా పదేళ్ల తర్వాత సొంతగడ్డపై ఇదే అతిపెద్ద (బాల్స్ పరంగా) విజయం. 2014లో ఢాకా వేదికగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 48 బంతులు మిగిలి ఉండగానే బంగ్లా గెలుపొందింది. తాజాగా 39 బంతులు మిగిలి ఉండగానే విజయఢంకా మోగించింది.చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
కీలక సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్!
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్, టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) జట్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడు న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు.మూడు టీ20లుకాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ (NZ vs AUS)లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్టోబరు 1, 3, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సిరీస్ మొత్తం మౌంట్మౌంగనీయ్లోని బే ఓవల్ మైదానంలోనే జరుగనుంది.ఇదిలా ఉంటే.. కమిన్స్ గత కొంతకాలంగా ఆసీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలో కంగారూ జట్టు కమిన్స్ లేకుండానే బరిలోకి దిగింది. తాజాగా అతడు కివీస్ జట్టుతో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలిసింది.టీమిండియాతో సిరీస్‌కు రెడీవెన్నునొప్పి కారణంగా కమిన్స్ న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని కోడ్ స్పోర్ట్స్ తెలిపింది. అయితే, టీమిండియాతో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్‌కు మాత్రం కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. నిజానికి చాలాకాలంగా కమిన్స్ వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉంటున్నాడు.ఇంగ్లండ్‌తో నవంబరులో మొదలయ్యే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం కమిన్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా కాపాడుకుంటోంది. సారథి ఫిట్‌గా ఉంటేనే.. ఈ కీలక టెస్టు సిరీస్‌లో ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలదు. సొంతగడ్డపై జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తప్పక గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. యాషెస్ సిరీస్ ఆరంభం అపుడేకాగా చివరగా 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆసీస్ 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది నవంబరు 21- జనవరి 8 వరకు యాషెస్ సిరీస్ జరుగనుంది.అంతకంటే ముందు.. న్యూజిలాండ్ పర్యటనను పూర్తి చేసుకుని ఆసీస్ స్వదేశానికి తిరిగి వచ్చి.. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య భారత్‌తో ఆసీస్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
రషీద్ ఖాన్‌ను ఓదార్చిన పాక్ క్రికెటర్లు.. వీడియో
అఫ్గనిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan)ను పాకిస్తాన్ క్రికెటర్లు ఓదార్చారు. ఇరుజట్ల మధ్య టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది రషీద్‌ను ఆలింగనం చేసుకుని అతడి భుజం తట్టాడు. కాగా రషీద్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.నా ప్రగాఢ సానుభూతిఈ స్టార్ స్పిన్నర్ అన్న అబ్దుల్ హలీమ్ శిన్వారి మృతి చెందాడు. ఈ విషయాన్ని అఫ్గన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrabim Zadran) సోమవారం వెల్లడించాడు. ‘‘రషీద్ ఖాన్ పెద్దన్న హాజీ అబ్దుల్ హలీమ్ మరణించారని తెలిసి నా మనసు బాధతో నిండిపోయింది. ట్రై సిరీస్పెద్దన్న కుటుంబం మొత్తానికి తండ్రిలాంటి వాడు. రషీద్ ఖాన్, అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని ఇబ్రహీం జద్రాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా అఫ్గనిస్తాన్- పాకిస్తాన్- యూఏఈ మధ్య ట్రై సిరీస్ శుక్రవారం మొదలైంది. ఈ ముక్కోణపు పోరులో భాగంగా తొలుత పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరిగింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (21), సయీమ్ ఆయుబ్ (14).. ఫఖర్ జమాన్ (20) విఫలం అయ్యారు. అయితే, సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 53)తో అలరించడంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అఫ్గన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్ శుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది.39 పరుగుల తేడాతో విజయంఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (38) ఫర్వాలేదనిపించగా.. ఇబ్రహీం జద్రాన్ (9) నిరాశపరిచాడు. సెదీకుల్లా అటల్ 23, డార్విష్ రసూలీ 21 పరుగులు చేయగా.. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు.అయితే, మిగతావారి నుంచి సహకారం లేకపోవడంతో రషీద్ మెరుపు ఇన్నింగ్స్ వృథాగా పోయింది. 19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి అఫ్గనిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా పాక్ అఫ్గన్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం పాక్ క్రికెటర్లు రషీద్ ఖాన్ అన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. డ్రెసింగ్‌రూమ్ సమీపంలో ప్రార్థన చేసి అతడిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చదవండి: ఆసియా కప్-2025: కీలక అప్డేట్.. ఆ ఒక్కటి మినహా.. ఫైనల్‌తో సహా.. Pakistan team offers condolences and prayers on the death of Rashid Khan's elder brother. #PakistanCricket #RashidKhan pic.twitter.com/gxwvXyYdnG— Ahtasham Riaz (@ahtashamriaz22) August 29, 2025 -
ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సౌతాఫ్రికా తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. టెంబా బవుమా (Temba Bavuma) సారథ్యంలోని వన్డే జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ చోటు దక్కించుకోగా.. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలోని టీ20 టీమ్‌లోకి విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పునరాగమనం చేశాడు.మహరాజ్‌కు పిలుపుమిల్లర్తో పాటు డొనోవాన్ ఫెరీరా.. అదే విధంగా.. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) కూడా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక గాయాల కారణంగా పొట్టి ఫార్మాట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (బొటనవేలి గాయం), లిజాడ్ విలియమ్స్ (మోకాలి గాయం) కూడా తిరిగి జట్టులో స్థానం సంపాదించారు.ఇక కుడికాలి చీలమండ నొప్పి వల్ల ఆస్ట్రేలియా (AUS vs SA)తో వన్డే సిరీస్‌కు దూరమైన కగిసో రబడ.. ఇంగ్లండ్ సిరీస్‌లకు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు. అయితే, అతడికి కవర్ ప్లేయర్‌గా లెఫ్టార్మ్ సీమర్ క్వెనా మఫాకాను వన్డే జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు.వన్డే సిరీస్ కైవసంఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్ చేతిలో 2-1తో ఓడిపోయిన ప్రొటిస్ జట్టు.. వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.ఆసీస్ టూర్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా జట్టు.. తదుపరి సెప్టెంబరు 2- 14 వరకు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కాగా చివరగా 2022లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన ప్రొటిస్ జట్టు.. వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అదే విధంగా టీ20 సిరీస్‌లో 2-1తో గెలుపొందింది.బవుమా అన్ని మ్యాచ్‌లు ఆడడుఇక బవుమా వన్డే జట్టుకు సారథిగా కొనసాగినా.. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా.. అతడి గైర్హాజరీలో మార్క్రమ్ జట్టును ముందుండి నడిపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. కేశవ్ మహరాజ్ గత రెండు సందర్భాల్లోనూ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. జింబాబ్వే, ఆస్ట్రేలియాలతో పొట్టి సిరీస్‌లకు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అయితే, ఆసీస్‌తో తొలి వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టుకు సంచలన విజయం అందించిన కేశవ్ ఇంగ్లండ్ టూర్‌తో టీ20లలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మరోవైపు.. ఫ్రాంఛైజీ క్రికెట్ కారణంగా ది హండ్రెడ్ లీగ్‌లో ఆడే నిమిత్తం ఆసీస్‌తో టీ20లకు దూరమైన మిల్లర్ తిరిగి జట్టులోకి రావడం గమనార్హం.ఇంగ్లండ్‌తో వన్డేలకు సౌతాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగీ ఎంగిడి, లువాన్-డ్రీ ప్రిటోరియస్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్.ఇంగ్లండ్‌తో టీ20లకు సౌతాఫ్రికా జట్టుఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, డొనోవన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, డేవిడ్ మిల్లర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, లువాన్-డ్రి ప్రిటోరియస్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.చదవండి: ‘జట్టు నుంచి తప్పిస్తా’!.. ద్రవిడ్.. అతడిని నా దగ్గరికి రావొద్దని చెప్పు.. సెహ్వాగ్ వార్నింగ్ -
బ్రెవిస్ బీభత్సం
డార్విన్: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ప్రదర్శనతో చెలరేగిపోయాడు. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో టి20లో అతను ఫోర్లు, సిక్సర్లతో సత్తా చాటి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో బ్రెవిస్ దక్షిణాఫ్రికా తరఫున టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 53 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆ్రస్టేలియాపై దక్షిణాఫ్రికాకు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 125 నాటౌట్; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. అనంతరం ఆసీస్ 17.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ డేవిడ్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారంతా విఫలమయ్యారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా, చివరి టి20 శనివారం జరుగుతుంది. బౌండరీలతోనే 96 పరుగులు... ఐదో ఓవర్లో దక్షిణాఫ్రికా స్కోరు 44/2 వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన బ్రెవిస్ చివరి వరకు నిలిచాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతికి తొలి ఫోర్ కొట్టిన అతను అదే జోరు కొనసాగిస్తూ ఒక దశలో 24 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ ఓవర్లో వరుసగా 6, 6, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో అతను 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు లాంగాన్‌లో ఇచ్చిన క్యాచ్‌ను కునెమన్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసున్న బ్రెవిస్‌కు శతకం చేసుకునేందుకు మరో 16 బంతులు మాత్రమే సరిపోయాయి. హాజల్‌వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన తర్వాత డ్వార్షుయిస్ ఓవర్లో కొట్టిన మూడో ఫోర్‌తో 41 బంతుల్లోనే బ్రెవిస్ శతకం పూర్తయింది. ఛేదనలో డేవిడ్‌కు ఇతర ఆసీస్ బ్యాటర్లెవరూ సహకారం అందించలేదు. ఒకదశలో 9.3 ఓవర్లలో 106/3తో ఉన్నా...ఆ తర్వాత జట్టు తడబడింది. 125 టి20ల్లో దక్షిణాఫ్రికా తరఫున బ్రెవిస్ స్కోరు (125) అత్యధికం. డుప్లెసిస్ (119)ను అతను అధిగమించాడు.2 దక్షిణాఫ్రికా తరఫున ఇది రెండో ఫాస్టెస్ట్ (41 బంతుల్లో) సెంచరీ. ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉంది.1 అతి పిన్న వయసులో అంతర్జాతీయ టి20 శతకం బాదిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా (22 ఏళ్ళ 105 రోజులు) నిలిచిన బ్రెవిస్... రిచర్డ్ లెవీ (24 ఏళ్ల 36 రోజులు) రికార్డును సవరించాడు.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
చరిత్ర సృష్టించిన డెవాల్డ్ బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
విధ్వంసకర బ్యాటింగ్‌తో ‘బేబీ ఏబీడీ’గా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా (AUS vs SA T20I)తో రెండో టీ20 సందర్భంగా.. ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో కంగారూ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.పరుగుల విధ్వంసంకాగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది సౌతాఫ్రికా టీమ్. ఇందులో భాగంగా తొలుత పొట్టి సిరీస్ మొదలుకాగా.. మొదటి టీ20లో ఆతిథ్య ఆసీస్ గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి రెండో టీ20లో డెవాల్డ్ బ్రెవిస్ పరుగుల విధ్వంసం సృష్టించాడు.కేవలం 41 బంతుల్లోనే శతకం సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో డెవాల్డ్ బ్రెవిస్ తన పేరిట పలు రికార్డులు లిఖించుకున్నాడు.వాట్సన్ ప్రపంచ రికార్డు బద్దలుఆస్ట్రేలియా గడ్డ మీద అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లు1. డెవాల్డ్ బ్రెవిస్ (సౌతాఫ్రికా)- ఆస్ట్రేలియాపై 2025లో డార్విన్ వేదికగా 125 పరుగులు నాటౌట్2. షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 2016లో సిడ్నీ వేదికగా 124 నాటౌట్3. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- వెస్టిండీస్‌పై 2024లో అడిలైడ్ వేదికగా 120 నాటౌట్.తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డులు🏏సౌతాఫ్రికా తరఫున పురుషుల అంతర్జాతీయ టీ20లలో అత్యంత పిన్న వయసులో శతకం బాదిన క్రికెటర్‌గా డెవాల్డ్ బ్రెవిస్. 22 ఏళ్ల 105 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు రిచర్డ్ లెవి (24 ఏళ్ల 36 రోజులు) పేరిట ఉండేది.🏏ఆస్ట్రేలియాపై టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా డెవాల్డ్ బ్రెవిస్. 2018లో మార్టిన్ గఫ్టిల్ 49 బంతుల్లో సెంచరీ చేయగా.. బ్రెవిస్ 41 బంతుల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు.🏏సౌతాఫ్రికా తరఫున పరుషుల టీ20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బ్రెవిస్ రికార్డు. గతంలో ఫాఫ్ డుప్లెసిస్ (119) వెస్టిండీస్‌పై 2015లో ఈ ఘనత సాధించాడు.🏏మెన్స్ టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియాపై ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన సౌతాఫ్రికా ప్లేయర్‌గా డెవాల్డ్ బ్రెవిస్. 2016లో ఫాఫ్ డుప్లెసిస్, 2023లో డొనావన్ ఫెరీరా ఐదేసి సిక్సర్లు బాదగా.. తాజాగా బ్రెవిస్ 8 సిక్సర్లు బాదడం విశేషం.చదవండి: WC 2011: ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి... వారిద్దరి సలహాల వల్లే..: యువీDewald Brevis - 125(56)* highlights pic.twitter.com/34vSYRNpUc— ` (@WorshipDhoni) August 12, 2025The second-quickest T20I hundred from a South African player!Dewald Brevis, take a bow 👏#AUSvSA pic.twitter.com/JOpk3tptGT— cricket.com.au (@cricketcomau) August 12, 2025 -
AUS vs SA: బేబీ ఏబీడీ విధ్వంసకర శతకం.. తొలి ‘ఫాస్టెస్ట్ సెంచరీ’తో..
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) పరుగుల సునామీ సృష్టించాడు. ఆసీస్‌తో రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.41 బంతుల్లోనే...ఇదే జోరులో మరో పదహారు బంతుల్లోనే శతక మార్కును అందుకున్న డెవాల్డ్ బ్రెవిస్.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ (T20I Fastest Century) నమోదు చేశాడు. అంతకు ముందు డేవిడ్ మిల్లర్ (David Miller) బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో శతక్కొట్టగా.. తాజాగా బ్రెవిస్ ఆసీస్‌పై 41 బంతుల్లో సెంచరీ సాధించాడు.ఆసీస్‌పై ఇదే తొలి ఫాస్టెస్ట్ సెంచరీఇక ఆస్ట్రేలియాపై టీ20లలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం మరో విశేషం. కాగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్ వేదికగా ఆదివారం తొలి టీ20 జరుగగా.. ఆసీస్ 17 పరుగుల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ క్రమంలో ఆసీస్- ప్రొటిస్ జట్ల మధ్య మంగళవారం డార్విన్ వేదికగా రెండో టీ20కి షెడ్యూల్ ఖరారు కాగా.. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం మాత్రం లభించలేదు.టాపార్డర్ విఫలంఆసీస్ స్టార్లు గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్ దెబ్బకు ప్రొటిస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లలో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను మాక్సీ స్వల్ప స్కోరుకు వెనక్కి పంపగా.. రియాన్ రికెల్టన్ (14)ను డ్వార్షుయిస్ పెవిలియన్ బాట పట్టించాడు.ఇక వన్‌డౌన్‌లో వచ్చిన యువ ఆటగాడు లువాన్-డ్రి ప్రిటోరియస్ పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. మాక్సీ బౌలింఘ్లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇలా 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.బేబీ ఏబీడీ సునామీ ఇన్నింగ్స్కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించిన బ్రెవిస్.. ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 31)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు బాదిన 22 ఏళ్ల బ్రెవిస్.. 125 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఆసీస్ బౌలర్లలో గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్ రెండేసి వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్‌వుడ్, ఆడం జంపా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సీన్ అబాట్, అలెక్స్ క్యారీ కగిసో రబాడ (5) రనౌట్‌లో భాగమయ్యారు.చదవండి: WC 2011: ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి... వారిద్దరి సలహాల వల్లే..: యువీThe second-quickest T20I hundred from a South African player!Dewald Brevis, take a bow 👏#AUSvSA pic.twitter.com/JOpk3tptGT— cricket.com.au (@cricketcomau) August 12, 2025 -
మళ్లీ ఓడిన భారత మహిళల ‘ఎ’ జట్టు
మెక్కే: భారత ‘ఎ’ మహిళల జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. ఇదివరకే అనధికారిక టి20 సిరీస్‌ను చేజార్చుకున్న అమ్మాయిల జట్టు ఆఖరి పోరులో గెలుపు తీరానికి చేరువై చివరకు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అనధికారిక టి20 సిరీస్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. స్పిన్ ద్వయం రాధా యాదవ్ (3/31), ప్రేమ రావత్ (3/24)ల మాయాజాలానికి ఆసీస్ ఇన్నింగ్స్ తడబడింది. మేడ్లైన్ (32 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), అలీసా హీలీ (21 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), అనిక (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అయితే వరుస విరామాల్లో రాధ, ప్రేమలిద్దరు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ జోరుకు అడ్డుకట్ట పడింది. తర్వాత ఛేదించదగిన లక్ష్యమే అయినా... టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్ల నిర్లక్ష్యంతో భారత్ ‘ఎ’ అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులే చేశారు. ఓపెనర్ వృంద (4), ఉమా ఛెత్రి (3) నిరాశపరిచారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే బాధ్యతగా ఆడింది. రాఘ్వి బిస్త్ (25 బంతుల్లో 25; 2 ఫోర్లు), మిన్ను మణి (29 బంతుల్లో 30; 4 ఫోర్లు)ల పోరాటంతో గెలుపు దారిలో పడిన భారత్‌ను 19వ ఓవర్ దెబ్బ కొట్టింది. 12 బంతుల్లో 18 పరుగుల సమీకరణం టి20ల్లో ఏమాత్రం కష్టం కాదు. కానీ 19వ ఓవర్ వేసిన సియానా జింజర్ (4/16) తొలి బంతికి సజన (3), ఐదో బంతికి రాధ (9)ను అవుట్ చేయడంతో భారత్ విజయానికి దూరమైంది. ఆఖరి ఓవర్లో ప్రేమ రావత్ (8 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా... ఇంకా 4 పరుగుల దూరంలోనే ఉండిపోయింది. మూడు అనధికారిక వన్డేల సిరీస్ బ్రిస్బేన్‌లో 13న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. -
దక్షిణాఫ్రికా X ఆ్రస్టేలియా
డార్విన్ (ఆ్రస్టేలియా): వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ కోసం ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుండగా... దానికి ముందు సన్నాహకంగా ఈ రెండు జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. 2023 తర్వాత ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరగలేదు. గతేడాది టీమిండియా చాంపియన్‌గా నిలిచిన వరల్డ్‌కప్‌లో ఆ్రస్టేలియా ఆకట్టుకోలేకపోగా... దక్షిణాఫ్రికా ఫైనల్లో ఓడింది. ఇరు జట్ల మధ్య ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగగా... అందులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన సఫారీ జట్టు... ముక్కోణపు టి20 సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్ గడ్డపై 5–0తో టి20 సిరీస్ గెలుచుకుంది. ఆ సిరీస్‌కు అందుబాటులో లేని ట్రావిస్ హెడ్ తిరిగి ఆసీస్ జట్టులో చేరనుండగా... ఎయిడెన్ మార్క్రమ్, కగిసో రబాడ దక్షిణాఫ్రికా జట్టులో పునరాగమనం చేస్తున్నారు. ఆసీస్ ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉండనుండగా... జోష్ హాజల్‌వుడ్ పేస్ భారాన్ని మోయనున్నాడు. 2008 తర్వాత డారి్వన్లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి కాగా... మిచెల్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల విండీస్‌తో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మార్ష్.. హెడ్‌తో కలిసి వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శనివారమే ప్రకటించాడు. ‘హెడ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తా. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టి20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే కొనసాగుతుంది’అని మార్ష్ అన్నాడు. ఇన్‌గ్లిస్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్‌తో ఆసీస్ బలంగా ఉంది. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్పై దక్షిణాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది. మార్క్రమ్, రికెల్టన్, డసెన్, బ్రేవిస్, స్టబ్స్, లిండె, బాష్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. రబాడ, బర్గర్, ఎంగిడి బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. -
టీమిండియా ఘోర ఓటమి.. 73 పరుగులకే ఆలౌట్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ మహిళా జట్టుకు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మెక్కే వేదికగా ఆసీస్-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో సీనియర్ టీమ్ కెప్టెన్ అలీసా హీలీ(44 బంతుల్లో 12 ఫోర్లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విల్సన్(43), అనికా లియార్డ్(35) రాణించారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా..ప్రేమా రావత్ ఒక్క వికెట్ సాధించారు.చెలరేగిన గార్త్..అనంతరం లక్ష్య చేధనలో ఇండియా-ఎ జట్టు ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. పేసర్ కిమ్ గార్త్ నాలుగు వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు, ఎడ్గర్,ఫ్లింటాప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.భారత బ్యాటర్లలో వ్రింధా దినేష్(21), మిన్ను మణి(20) రెండెంక్కల స్కోర్‌ను అందుకోగా.. మిగితా వారిందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ(3) సైతం బ్యాట్ ఝుళిపించకలేకపోయారు.ఈ విజయంతో మూడు టీ20 సిరీస్‌ను ఆసీస్-ఎ జట్టు మరో మ్యాచ్ మిగిలూండగానే సొంతం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 మెక్కే వేదికగా ఆదివారం జరగనుంది.చదవండి: శుబ్‌మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే? -
IND vs AUS: స్టార్ ఓపెనర్ విఫలం.. భారత జట్టుకు తప్పని ఓటమి
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ మహిళా జట్టు (AUS A W vs IND A W)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. మొదటి టీ20 మ్యాచ్‌లో రాధా యాదవ్ (Radha Yadav) సేన ఆసీస్-‘ఎ’ మహిళా జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించలేకపోయింది.కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్‌తో మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు, ఓ అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం టీ20 సిరీస్ ఆరంభమైంది.అనికా హాఫ్ సెంచరీమకాయ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. ఓపెనర్లలో ఆస్ట్రేలియా రెగ్యులర్ జట్టు కెప్టెన్ అలిసా హేలీ (18 బంతుల్లో 27) ఫరవాలేదనిపించగా.. తహీలా విల్సన్ (23 బంతుల్లో 17) మాత్రం విఫలమైంది.ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అనికా లియరాడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించింది. 44 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో కోర్ట్నీ (11), కెప్టెన్ నికోల్ ఫాల్టమ్ (11) మాత్రం డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ విఫలంభారత బౌలర్లలో సైమా ఠాకూర్, సీజవన్ సజన చెరో వికెట్ తీయగా.. ప్రేమా రావత్ మూడు వికెట్లతో సత్తా చాటింది. ఇక 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (3) దారుణంగా విఫలమైంది. వన్‌డౌన్‌లో వచ్చిన ధారా గుజ్జర్ (7), ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన దినేశ్ వ్రింద (5) కూడా నిరాశపరిచారు.రాఘవి బిస్త్ మెరుపులు వృథాఇలాంటి క్లిష్ట దశలో మరో ఓపెనర్ ఉమా ఛెత్రి (31 బంతుల్లో 31) మెరుగ్గా ఆడగా.. రాఘవి బిస్త్ (20 బంతుల్లో 33) ఆఖర్లో మెరుపులు మెరిపించింది. ఈమెకు తోడుగా కెప్టెన్ రాధా యాదవ్ (22 బంతుల్లో 26) రాణించింది. కానీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసిన భారత జట్టు.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 9) రెండో టీ20కి షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs WI: టీమిండియాకు భారీ షాక్! -
WI Vs PAK: అథనాజ్, రూథర్‌ఫర్డ్ మెరుపులు వృథా.. మీరు మారరు!
వెస్టిండీస్‌కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. గత టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతి (WI vs AUS)లో చిత్తుగా ఓడిన విండీస్.. తాజాగా పాకిస్తాన్‌కు కూడా పొట్టి సిరీస్ (WI vs PAK T20Is)ను సమర్పించుకుంది. ఫ్లోరిడా వేదికగా సోమవారం నాటి మూడో టీ20లో ఓడిపోయి.. 1-2తో పరాజయాన్ని చవిచూసింది.రాణించిన ఓపెనర్లుకాగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌తో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. మొదటి మ్యాచ్‌లో పాక్, రెండో మ్యాచ్‌లో విండీస్ గెలిచాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (53 బంతుల్లో 74), సయీమ్ ఆయుబ్ (66) అర్ధ శతకాలతో రాణించి శుభారంభం అందించారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ హసన్ నవాజ్ (15), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారీస్ (2) మాత్రం విఫలమయ్యారు.ఆఖర్లో ఖుష్ దిల్ (6 బంతుల్లో 11) కాస్త వేగంగా ఆడగా.. ఫాహీమ్ అష్రాఫ్ (3 బంతుల్లో 10) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 189 పరుగులు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసెఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.అథనాజ్, రూథర్‌ఫర్డ్ మెరుపులు వృథాఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ జెవెల్ ఆండ్రూ (15 బంతుల్లో 24) రాణించాడు. కానీ వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (7) నిరాశపరచగా.. రోస్టన్ ఛేజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్ అలిక్ అథనాజ్, నాలుగో నంబర్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అథనాజ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు చేయగా.. రూథర్‌ఫర్డ్ 35 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు.అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం లభించలేదు. హోల్డర్ డకౌట్ కాగా.. రొమారియో షెఫర్డ్ (4), గుడకేష్ మోటి (10) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన వెస్టిండీస్.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా పర్యాటక పాకిస్తాన్ టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్, హ్యారీస్ రవూఫ్, సయీమ్ ఆయుబ్, సూఫియాన్ ముకీం ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా గత టీ20 సిరీస్‌లో విండీస్.. ఆసీస్ చేతిలో సొంతగడ్డపై 5-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘మీరు మారరు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా విండీస్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్ గిల్ -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి పాకిస్తాన్ ఓటమి
ఫ్లోరిడా వేదికగా పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ అఘా(38) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జాసెన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు, అకిల్ హోస్సేన్, చేజ్, జోషఫ్ తలా వికెట్ సాధించారు.అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో వెస్టిండీస్ తడబడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అయితే జాసన్ హోల్డర్(16),షెఫర్డ్(15) కాస్త దూకుడుగా ఆడడడంతో విండీస్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో కరేబియన్ జట్టు విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. షాహీన్ అఫ్రిది వేసిన తొలి బంతికి హోల్డర్ సింగిల్ తీయగా.. రెండో బంతికి షెఫర్డ్ ఔటయ్యాడు. తర్వాతి మూడు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి.దీంతో ఆఖరి బంతికి విండీస్ గెలుపునకు 4 పరుగులు అవసరమయ్యాయి. ఆ బంతిని అఫ్రిది వైడ్‌గా సంధించడంతో విండీస్ విజయసమీకరణంగా మూడు పరుగులగా మారింది. ఈ క్రమంలో హోల్డర్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించాడు.దీంతో సంచలన విజయాన్ని హోప్ సేన తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో ఆతిథ్య విండీస్ సమం చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సైమ్ అయూబ్ రెండు వికెట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆగస్టు 4న జరగనుంది.చదవండి: WCL: డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాక్ చిత్తు! టైటిల్ సౌతాఫ్రికాదే -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన కామెరాన్ గ్రీన్.. ‘ఛేజింగ్‌లో కింగ్’!
వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిపూర్ణ విజయంతో ముగించింది. తొలుత మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసిన కంగారూలు.. తాజాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (T20I Series)ను కూడా 5-0తో క్లీన్‌స్వీప్ చేశారు.సెయింట్ కిట్స్ వేదికగా సోమవారం ఉదయం జరిగిన ఐదో టీ20లో విండీస్ (WI vs AUS)ను మూడు వికెట్ల తేడాతో ఓడించి.. సంపూర్ణ విజయం సాధించారు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు సాధించింది.వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన గ్రీన్ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) కూడా ఓ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో ఓ సిరీస్‌లో లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.వెస్టిండీస్‌తో ఐదో టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. నిర్ణీత 19.4 ఓవర్లలో 170 పరుగులు చేసి ఆలౌట్ అయింది. షిమ్రన్ హెట్మెయిర్ మెరుపు అర్ధ శతకం (52)తో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (17 బంతుల్లో 35) ధనాధన్ దంచికొట్టాడు.ఇక ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ మూడు వికెట్లు కూల్చగా.. నాథన్ ఎల్లిస్ రెండు, ఆరోన్ హార్డీ, గ్లెన్ మాక్స్వెల్, ఆడం జంపా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.ధనాధన్ దంచికొట్టిన గ్రీన్, డేవిడ్, ఓవెన్ఓపెనర్లలో గ్లెన్ మాక్స్వెల్ డకౌట్ కాగా.. కెప్టెన్ మిచెల్ మార్ష్ (14)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (10) కూడా విఫలమయ్యాడు. ఇలా టాపార్డర్ కుప్పకూలిన వేళ కామెరాన్ గ్రీన్ (18 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 30) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించారు.వీరికి తోడు మిచెల్ ఓవెన్ (17 బంతుల్లో 37) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఆరోన్ హార్డీ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 17 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆసీస్.. 173 పరుగులు చేసింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో విండీస్‌పై జయభేరి మోగించింది.అత్యధిక పరుగుల వీరుడిగా గ్రీన్డ్వార్షుయిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. ఆద్యంతం ఆకట్టుకున్న కామెరాన్ గ్రీన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. కాగా విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గ్రీన్ మొత్తంగా 205 పరుగులు సాధించాడు. ఇవన్నీ లక్ష్య ఛేదనలో వచ్చిన పరుగులే. తద్వారా ఓ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అతడు నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ మార్క్ చాప్మన్ పేరిట ఉండేది. 2023లో పాకిస్తాన్‌తో సిరీస్ సందర్భంగా అతడు లక్ష్య ఛేదనలో 203 పరుగులు సాధించాడు.అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు🏏కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా)- 2025లో వెస్టిండీస్ మీద 205 రన్స్🏏మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్)- 2023లో పాకిస్తాన్ మీద 203 రన్స్🏏కెవిన్ డిసౌజా (బల్గేరియా)- 2022లో సెర్బియా మీద 197 పరుగులు🏏ఉదయ్ హతింజర్ (కంబోడియా)- 2022లో ఇండోనేషియా మీద 189 రన్స్🏏టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 2025లో పాకిస్తాన్ మీద 186 రన్స్.చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’Clean Sweep in the Caribbean 💥Australia deliver a clinical all-round show to seal a 5-0 win over West Indies 🙌#AUSvWI pic.twitter.com/9awxqNFEl2— FanCode (@FanCode) July 29, 2025 -
మాక్స్వెల్ విధ్వంసం.. వెస్టిండీస్‌పై ఆసీస్ ఘన విజయం
సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో విండీస్‌పై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది.విండీస్ బ్యాటర్లలో షెర్ఫెన్ రూథర్ ఫర్డ్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిమోరియా షెఫర్డ్(28), హోల్డర్(26),రావ్మన్ పావెల్(28) రాణించారు. మూడో టీ20 సెంచరీతో మెరిసిన కెప్టెన్ షాయ్ హోప్(10) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ హార్దే, బెర్ట్‌లెట్, అబాట్ తలా వికెట్ సాధించారు.మాక్స్వెల్ విధ్వంసం..అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), జోష్ ఇంగ్లిష్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. గ్లెన్ మాక్స్వెల్(18 బంతుల్లో 6 సిక్సర్లతో, ఒక ఫోరుతో 47) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.విండీస్ బౌలర్లలో బ్లేడ్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, షెఫర్డ్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్తోంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని కంగారూ జట్టు భావిస్తోంది. ఇరు జట్లు మధ్య ఐదో టీ20 ఇదే వేదికలో జూలై 29న జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే -
టిమ్ డేవిడ్ మెరుపు సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
వెస్టిండీస్ గడ్డపై ఆస్ట్రేలియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. శనివారం సెయింట్స్ కిట్స్ వేదికగా విండీస్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా 5 టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్(102) ఆజేయ శతకంతో కదం తొక్కగా.. బ్రాండెన్ కింగ్(62) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ ఓవెన్, ఎల్లీస్, జంపా తలా వికెట్ సాధించారు.డేవిడ్ విధ్వంసకర శతకం..అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలో చేధించింది. ఈ లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాడు టిమ్ డేవిడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు.ఆస్ట్రేలియా తరపున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా డేవిడ్ రికార్డులకెక్కాడు. డేవిడ్‌తో పాటు మిచెల్ ఓవెన్(36 నాటౌట్), మార్ష్(22), మాక్స్వెల్(20) రాణించారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ ఓ వికెట్ సాధించారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ఇదే వేదికలో జరగనుంది.చదవండి: ప్లేయర్స్‌ను గంభీర్ నమ్మడం లేదు.. ఇలా అయితే చాలా కష్టం: మనోజ్ తివారీ -
ఫేర్వెల్ మ్యాచ్‌లో రసెల్ ధనాధన్.. ఇంగ్లిస్ మొత్తం చెడగొట్టేశాడు!
ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ (WI vs AUS)కు పరాభవమే ఎదురైంది. జమైకా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.సబీనా పార్కు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ హాఫ్ సెంచరీ(36 బంతుల్లో 51)తో రాణించగా.. కెప్టెన్ షాయీ హోప్ (9)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ షిమ్రన్ హెట్మెయిర్ (14) ఫెయిలయ్యాడు.రసెల్ సునామీ ఇన్నింగ్స్రోస్టన్ చేజ్ (16), రోవ్‌మన్ పావెల్ (12)లతో పాటు షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (0) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి దశలో విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) సునామీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కేవలం 15 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 36 పరుగులు సాధించాడు.One Final Show from Dre Russ 🚀A fitting last international innings from the West Indies all-rounder, showcasing the explosive talent that will be dearly missed by cricket fans everywhere 🥹#WIvsAus #AndreRussell pic.twitter.com/net68B3Woc— FanCode (@FanCode) July 23, 2025 మరోవైపు గుడకేశ్ మోటీ (9 బంతుల్లో 18 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, గ్లెన్ మాక్స్వెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. డ్వార్షుయిస్‌కు ఒక వికెట్ దక్కింది.ఆరంభంలోనే షాకులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మాక్సీ (12), అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (21) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్ల వైఫల్యం నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.Rule 1: Don’t drop Josh Inglis 😤Rule 2: Read Rule 1 again.After two lives, he smashed 78* off 33 to bury West Indies. #AUSvWI pic.twitter.com/2tHN7yZiVn— FanCode (@FanCode) July 23, 2025దంచికొట్టిన ఇంగ్లిస్, గ్రీన్ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్‌కు తోడుగా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా అదరగొట్టాడు. 32 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన గ్రీన్.. 56 పరుగులతో ఇంగ్లిస్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మెరుపు అజేయ అర్థ శతకాల కారణంగా ఆస్ట్రేలియా.. 15.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్ల నష్టపోయి 173 పరుగులు చేసింది. తద్వారా విండీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి 2-0తో ఆధిక్యం పెంచుకుంది.ఫేర్వెల్ మ్యాచ్‌లో ఓటమేకాగా విండీస్ విధ్వంసకర వీరుడైన ఆండ్రీ రసెల్‌కు ఇది ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతడు ధనాధన్ దంచికొట్టినా.. ఇంగ్లిస్, గ్రీన్ల కారణంగా ఓటమితో కెరీర్ ముగించాల్సి వచ్చింది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన ఆసీస్.. టీ20 సిరీస్‌లో తొలి రెండు గెలిచి 2-0తో ముందంజలో ఉంది.చదవండి: ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే: అశ్విన్ -
IND vs ENG ODIs: విజయంతో ముగించాలని!
చెస్టర్–లీ–స్ట్రీట్: ఇంగ్లండ్ పర్యటనలో అంచనాలకు మించి రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు విజయంతో ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న భారత్... ఇప్పుడు వన్డే సిరీస్‌లో 1–1తో సమంగా ఉంది. నేడు జరిగే చివరి వన్డేలో నెగ్గితే ఈ సిరీస్ కూడా మన సొంతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపైనే జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3–0తో గెలుచుకొని సత్తా చాటింది. నాటి సిరీస్ ఆడిన హర్మన్, స్మృతి, దీప్తి, హర్లీన్ ఇప్పుడు కూడా బరిలో ఉన్నారు. టూర్ ఆసాంతం ఆకట్టుకున్న హర్మన్ బృందం మరో మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే గెలుపు సొంతమవుతుంది. తొలి వన్డేలో నెగ్గిన అనంతరం వర్షం బారిన పడిన రెండో మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ కాస్త తడబడింది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో బ్యాటర్లు చెత్త షాట్లతో వెనుదిరిగారు. స్మృతి, దీప్తి రాణిస్తుండగా... ప్రతీక, హర్లీన్, జెమీమా కూడా మెరుగైన స్కోర్లు సాధించాల్సి ఉంది. టూర్లో ఆడిన 6 మ్యాచ్‌లలో కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. జట్టు గెలిచినా ఆమె బ్యాటింగ్ పేలవంగా సాగింది. ఈ సారైనా ఒక మంచి ఇన్నింగ్స్‌తో హర్మన్ ముగించాలని టీమ్ కోరుకుంటోంది. మరో వైపు టి20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌నైనా గెలిచి స్వదేశంలో పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో గెలుపు ఆ జట్టులో కాస్త ఉత్సాహాన్ని పెంచింది. సీనియర్లయిన కెప్టెన్ నాట్ సివర్, బీమాంట్, డంక్లీ, ఎకెల్‌స్టోన్ మెరుగ్గా ఆడుతుండటం సానుకూలాంశం. -
అరంగేట్రంలోనే ఆసీస్ బ్యాటర్ విధ్వంసం.. విండీస్ చిత్తు
వెస్టిండీస్‌తో తొలి టీ20 (WI vs AUS)లో ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. జమైకా వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.హోప్, చేజ్ హాఫ్ సెంచరీలుటెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కంగారూలు.. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేశారు. సబీనా పార్కులో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆదిలోనే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (18) వికెట్ కోల్పోయింది.అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ షాయీ హోప్ (39 బంతుల్లో 55), వన్‌డౌన్ బ్యాటర్ రోస్టన్ చేజ్ (60) అర్ధ శతకాలతో రాణించారు. షిమ్రన్ హెట్మెయిర్ (19 బంతుల్లో 38) తనదైన శైలిలో ధనాధన్ దంచికొట్టగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ ఎనిమిది వికట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.5️⃣0️⃣ for Roston in some style!🏏💥#WIvAUS | #fullahenergy pic.twitter.com/J9JygS3XcC— Windies Cricket (@windiescricket) July 21, 2025ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సీన్ అబాట్, కూపర్ కన్నోలి, నాథన్ ఎల్లిస్, అరంగేట్ర ప్లేయర్ మిచెల్ ఓవెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మార్ష్ బృందం 18.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది.గ్రీన్, మిచ్ మెరుపు హాఫ్ సెంచరీలుకెప్టెన్ మిచెల్ మార్ష్ (24) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ (2), వన్‌డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (18) నిరాశపరిచారు. గ్లెన్ మాక్స్వెల్ (11) సైతం విఫలం కాగా.. కామెరాన్ గ్రీన్, మిచెల్ ఓవెన్ మెరుపు అర్ధ శతకాలతో చెలరేగారు. గ్రీన్ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేయగా.. మిచెల్ ఓవెన్ 27 బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 50 పరుగులు సాధించాడు.మిగతా వారిలో కూపర్ కన్నోలి 13 పరుగులు చేయగా.. డ్వార్షుయిస్ (5), సీన్ అబాట్ (5) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. విండీస్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.పంజాబ్ కింగ్స్ప్లేయర్గాకాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మిచెల్ ఓవెన్.. విండీస్‌తో తొలి టీ20 ద్వారా ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం విశేషం. అంతేకాదు.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా మిచ్ నిలిచాడు. చదవండి: నితీశ్ రెడ్డి అవుట్! -
T20I Tri-Series: ఫైనల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా
జింబాబ్వే వేదికగా ముక్కోణపు టీ20 టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. హరారే వేదికగా ఆదివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను ఓడించింది. తద్వారా మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఫైనల్లో అడుగుపెట్టింది.145 పరుగులుటాస్ గెలిచిన సౌతాఫ్రికా జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆతిథ్య జట్టు 144 పరుగులు చేసింది. బెనెట్ (61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)... ర్యాన్ బుర్ల్ (36 నాటౌట్) రాణించారు.ఇక సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు పడగొట్టగా... నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి, పీటర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.డసెన్ కెప్టెన్ ఇన్నింగ్స్‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రూబిన్ హెర్మాన్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రాసీ వాన్ డెర్ డసెన్ (41 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు.కాగా జింబాబ్వేతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ జట్టు కూడా అక్కడ పర్యటిస్తోంది. ఈ క్రమంలో టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన న్యూజిలాండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.మరోవైపు... తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచిన దక్షిణాఫ్రికా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆతిథ్య జింబాబ్వే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలుండగానే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించాయి.తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా మంగళవారం (జూలై 22) తలపడతాయి. అనంతరం గురువారం (జూలై 24) జింబాబ్వే- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. ఇక శనివారం (జూలై 26) న్యూజిలాండ్- దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్‌తో ఈ సిరీస్ ముగుస్తుంది. చదవండి: IND vs ENG: నితీశ్ రెడ్డి అవుట్! -
BAN vs PAK: పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ షాక్
మిర్పూర్: బౌలర్లు విజృంభించడంతో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 (BAN vs PAK)లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 110 పరుగులకే ఆలౌట్‌టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అబ్బాస్ అఫ్రిది (22; 3 సిక్స్‌లు), ఖుష్దిల్ షా (17; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (3)తో పాటు సయీమ్ అయూబ్ (6), హరీస్ (4), హసన్ నవాజ్ (0), మొహమ్మద్ నవాజ్ (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 3, ముస్తఫిజుర్ రహమాన్ 2 వికెట్లు పడగొట్టారు. పర్వేజ్ ఫిఫ్టిముఖ్యంగా ముస్తఫిజుర్ పాక్ బ్యాటర్లను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పర్వేజ్ హుసేన్ (Parvez Hossain Emon) (39 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా... తౌహిద్ హృదయ్ (37 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2 వికెట్లు పడగొట్టాడు. నాలుగో విజయంటీ20 ఫార్మాట్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ నెగ్గిన మ్యాచ్‌లు. ఇప్పటిదాకా పాక్‌తో 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. 2015, 2016లలో మిర్పూర్‌లోనే జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్... 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చివరిసారి టీ20ల్లో పాక్‌ను ఓడించింది. చదవండి: IND vs PAK: పాక్‌తో మ్యాచ్ బహిష్కరణ -
ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. డేంజరస్ ప్లేయర్ అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఆసీస్-వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం(జూలై 20) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆస్ట్రేలియా మెనెజ్‌మెంట్ ప్రకటించింది.ఈ మ్యాచ్‌తో యువ సంచలనం, విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ ఆసీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. తొలి టీ20 కోసం ఎంపిక చేసిన తుది జట్టులో ఓవెన్‌కు చోటు దక్కింది. ఓవెన్ గత కొంత కాలంగా టీ20 క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు.బిగ్‌బాష్ లీగ్ 2024-25 సీజన్లో లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌లో ఓవెన్ విధ్వసకర సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఎంట్రీ ఇచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.కానీ ఇటీవల జరిగిన మేజర్ లీగ్ టీ20 క్రికెట్లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ఓవెన్ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. తొలి టీ20కు మాథ్యూ షార్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు.అతడి స్దానంలో ఫ్రేజర్ మెక్‌గర్క్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 సీజన్లో గాయపడ్డ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ కూడా తిరిగి ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. కాగా ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యారు.విండీస్‌తో తొలి టీ20కు ఆసీస్ తుది జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మిచ్ ఓవెన్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాచదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై -
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న బంగ్లాదేశ్ పురుషుల జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ క్రమంలో పాక్‌తో టీ20 సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు.శ్రీలంకతో తలపడిన జట్టునే ఈ సిరీస్‌కూ బంగ్లా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఎటువంటి మార్పులు చేయలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లగా తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్, లిట్టన్ దాస్ కొనసాగనుండగా.. మహ్మద్ నైమ్ రిజర్వ్ ఓపెనర్‌గా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. అదేవిధంగా మిడిలార్డర్లో తోహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా మెహది హసన్ మిరాజ్, మెహది హసన్ షేక్ ఉన్న సీనియర్లకు చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జూలై 20 నుంచి 24 వరకు జరగనుంది.మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా ఢాకా వేదికగానే జరగనున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లును పీసీబీ దూరం పెట్టింది.పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టులిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, ఎండీ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్బంగ్లాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్. -
బంగ్లా ప్లేయర్ సరికొత్త చరిత్ర.. భజ్జీ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ (Mahedi Hasan) అరుదైన ఘనత సాధించాడు. కొలంబోలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును మెహదీ హసన్ షేక్ బద్దలు కొట్టాడు. శ్రీలంకతో మూడో టీ20 సందర్భంగా ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. ఆతిథ్య లంక 1-0తో గెలిచింది. ఇక వన్డే సిరీస్‌ను కూడా 2-1తో సొంతం చేసుకుంది.శ్రీలంకకు చేదు అనుభవంఅయితే, టీ20 సిరీస్‌లో మాత్రం శ్రీలంకకు చేదు అనుభవం మిగిలింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన చరిత్ అసలంక బృందం.. రెండో టీ20లో ఓడింది. తాజాగా కొలంబో వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లోనూ ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన ఆఖరి పోరులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.ఓపెనర్ నిసాంక (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షనక (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ అసలంక (3), దినేశ్ చండీమల్ (4), కుశాల్ పెరీరా (0), కుశాల్ మెండిస్ (6) విఫలమయ్యారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4 ఒవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసింది.తన్జీద్ హసన్ (47 బంతుల్లో 73 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ లిటన్ దాస్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), తౌహిద్ హృదయ్ (27 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అతడికి సహకరించారు. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ చెరో వికెట్ పడగొట్టారు. మెహదీ హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.మెహదీ హసన్ సరికొత్త చరిత్రకాగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదకొండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చిన స్పిన్ బౌలర్ మెహదీ హసన్.. కొలంబోలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇంత వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ స్టార్ హర్భజన్ సింగ్ పేరిట ఉండేది. 2012 వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భజ్జీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 12 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.కొలంబోలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పర్యాటక జట్టు బౌలర్లు👉మెహదీ హసన్ (బంగ్లాదేశ్)- శ్రీలంక మీద 4-1-11-4, జూలై 2025👉హర్భజన్ సింగ్ (ఇండియా)- ఇంగ్లండ్ మీద 4-2-12-4, సెప్టెంబరు 2012👉జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- శ్రీలంక మీద 4-0-16-4, జూన్ 2022 👉జో డెన్లీ (ఇంగ్లండ్)- శ్రీలంక మీద 4-0-19-4 , అక్టోబరు 2018👉ముస్తాఫిజుర్ రహ్మాన్ (బంగ్లాదేశ్)- శ్రీలంక మీద 3-0-21-4, ఏప్రిల్ 2017👉భువనేశ్వర్ కుమార్ (ఇండియా)- శ్రీలంక మీద 3.3-0-22-4, జూలై 2021👉శార్దూల్ ఠాకూర్(ఇండియా)- శ్రీలంక మీద 4-0-27-4, మార్చి 2018.చదవండి: ‘బుమ్రా ఆడనప్పుడే.. టీమిండియా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది’ -
ఐదో టీ20లో భారత్ ఓటమి.. అయినా సిరీస్ మనదే
ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.41 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసింది. ఆమెతో పాటు రిచా ఘోష్(24) రాణించాడు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(8), ఫస్ట్ డౌన్ బ్యాటర్ రోడ్రిగ్స్(1), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ఎకిలిస్టోన్ రెండు, స్మిత్, ఆర్లాట్ తలా వికెట్ సాధించారు.ఓపెనర్ల విధ్వంసం..అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫియా డంక్లీ(46), డేనియల్ వ్యాట్-హాడ్జ్(56) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరితో పాటు టామీ బ్యూమాంట్(30) రాణించింది.భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. అయితే ఆఖరి టీ20లో భారత్ ఓటమిపాలైనప్పటికి.. తొలుత మూడు మ్యాచ్‌లు గెలవడంతో సిరీస్‌ను 2-3 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 16 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఆఖరి ఓవర్లో గొడవ.. ఇంగ్లండ్ ఓపెనర్‌కు ఇచ్చిపడేసిన గిల్! వీడియో -
శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 17 మందితో సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు చరిత్ అసలంక(Charith Asalanka) సారథ్యం వహించనున్నాడు. కాగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్లు దసున్ షనక(Dasun Shanaka), చమిక కరుణరత్నేలకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.అదేవిధంగా యువ పేసర్ ఎషాన్ మలింగకు తొలిసారి లంక టీ20 జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ లీగ్స్‌లో మలింగ అద్బుతమైన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు టీ20 జట్టులోకి తీసుకున్నారు.మలింగకు డెత్‌లో బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఇక ఈ జట్టులో కెప్టెన్ అసలంకతో కుశాల్ మెండిస్, నిస్సాంక, కమిందు మెండిస్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మతీషా పతిరాన, వానిండు హసరంగా, నువాన్ తుషారా వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు.కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్‌కప్-2026 సన్నాహాల్లో భాగంగా జరగనుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌నకు శ్రీలంక, భారత్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక, బంగ్లా జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే పల్లెకలే వేదికగా మంగళవారం జరుగుతోంది.బంగ్లాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమిక కరుణరత్నే, మతీషా పతిరనా, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, ఎషాన్ మలింగ.చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ -
రోహిత్ శర్మ సరసన మంధాన.. భారత మూడో ప్లేయర్‌గా ఘనత
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరింది.ఇంగ్లండ్ మహిళా జట్టు (England Women vs India Women)తో రెండో టీ20 సందర్భంగా స్మృతి మంధాన ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. మొదటి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.150వ టీ20 మ్యాచ్ఇక బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్‌పై.. భారత్ 24 రన్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజలో నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది అంతర్జాతీయ స్థాయిలో 150వ టీ20.రోహిత్, హర్మన్ సరసనఇప్పటి వరకు భారత్ తరఫున టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (159), మహిళా జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (179) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. తాజాగా స్మృతి మంధాన కూడా ఈ లిస్టులో చేరిపోయింది. కాగా 149 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో కలిపి స్మృతి మంధాన 124కు పైగా స్ట్రైక్‌రేటుతో 3873 పరుగులు సాధించింది.తద్వారా మహిళల టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా స్మృతి కొనసాగుతోంది. అంతేకాదు.. అంతర్జాతీయ టీ20లలో నాలుగు వేల మైలురాయికి కూడా స్మృతి చేరువైంది. పురుషుల క్రికెట్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది. ఇక భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో శతకం బాదిన తొలి మహిళా క్రికెటర్‌గానూ స్మృతి చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.రెండో టీ20లో విఫలంఇదిలా ఉంటే... తన 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో స్మృతి మంధాన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో శతకంతో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తాజాగా రెండో టీ20లో 13 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్రిస్టల్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 157 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 40 బంతుల్లోనే 63 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు.. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్-బ్రంట్ (13) రూపంలో కీలక వికెట్ తీసింది పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అమన్‌జోత్.అగ్ర స్థానానికి చేరువైన స్మృతిభారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సెంచరీతో విజృంభించిన స్మృతి... మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 771 పాయింట్లతో నాలుగు నుంచి మూడో ర్యాంక్‌ను అందుకుంది. మంధాన కెరీర్లో ఇవే అత్యధిక రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గానూ వ్యవహరించిన మంధాన... ఈ ఫార్మాట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తద్వారా మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టి20)లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే బ్యాటింగ్ ర్యాకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న స్మృతి... టీ20ల్లో సైతం ఆ దిశగా ఆడుగులు వేస్తోంది.టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ (794 పాయింట్లు), వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ (12వ ర్యాంక్), షఫాలీ వర్మ (13వ ర్యాంక్), జెమీమా రోడ్రిగ్స్ (15వ ర్యాంక్) టాప్–20లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తి శర్మ (735 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉండగా... రేణుక సింగ్ (721 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
టీ-20 సిరీస్ లో బోణీ కొట్టిన టీమిండియా ఉమెన్స్ జట్టు
-
స్మృతి సెంచరీ ధమాకా.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టాప్ బ్యాటర్ స్మృతి మంధాన టి20ల్లో తొలి శతకంతో చెలరేగడంతో ఈ ఫార్మాట్లో రెండో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా... అనంతరం బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్‌ను కట్టిపడేసి సిరీస్ ఆరంభ పోరులో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి అరంగేట్రం టి20లోనే నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (62 బంతుల్లో 112; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించింది. టి20ల్లో స్మృతికి ఇదే తొలి శతకం కాగా... హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించింది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచి్చన ఓపెనర్ షఫాలీ వర్మ (20) ఫర్వాలేదనిపించగా... రిచా ఘోష్ (12), జెమీమా రోడ్రిగ్స్ (0) విఫలమయ్యారు. తొలి వికెట్‌కు షఫాలీతో కలిసి 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్‌కు హర్లీన్‌తో 94 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్ బెల్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు టి20ల్లో పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. నటాలియా సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 66; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా... టామీ బ్యూమౌంట్ (10), ఎమ్ అర్లాట్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. డానీ వ్యాట్ (0), డాంక్లీ (7), అమీ జోన్స్ (1), కాప్సీ (5), ఎకెల్‌స్టోన్ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణి 4 వికెట్లతో అదరగొట్టింది. ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు ఆడిన శ్రీచరణి... అరంగేట్ర టి20లోనే తన స్పిన్‌తో ప్రత్యరి్థని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం బ్రిస్టల్ వేదికగా రెండో టి20 జరగనుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) ఎకిల్‌స్టోన్ (బి) అర్లాట్ 20; స్మృతి (సి) సీవర్ బ్రంట్ (బి) ఎకెల్‌స్టోన్ 112; హర్లీన్ (సి) అర్లాట్ (బి) బెల్ 43; రిచా (సి) డాంక్లీ (బి) బెల్ 12; జెమీమా (సి) సీవర్ బ్రంట్ (బి) బెల్ 0; అమన్‌జ్యోత్ (నాటౌట్) 3; దీప్తి శర్మ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–77, 2–171, 3–186, 4–190, 5–202. బౌలింగ్: లౌరెన్ బెల్ 4–0–27–3; అర్లాట్ 4–0–38–1; లౌరెన్ ఫిలెర్ 4–0–35–0; లిన్సీ స్మిత్ 3–0–41–0; సోఫీ ఎకెల్‌స్టోన్ 3–0–43–1; కాప్సీ 2–0–21–0. ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: డాంక్లీ (సి) రిచా (బి) అమన్‌జ్యోత్ 7; డానీ వ్యాట్ (సి) హర్లీన్ (బి) దీప్తి 0; నటాలియా సీవర్ బ్రంట్ (సి) రిచా (బి) శ్రీచరణి 66; బ్యూమౌంట్ (బి) దీప్తి 10; అమీ జోన్స్ (స్టంప్డ్) రిచా (బి) రాధ 1; కాప్సీ (సి) అరుంధతి (బి) శ్రీచరణి 5; అర్లాట్ (సి) స్మృతి (బి) రాధ 12; ఎకెల్‌స్టోన్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 1; లౌరెన్ ఫిలెర్ (సి) రిచా (బి) అరుంధతి 2; లిన్సీ స్మిత్ (నాటౌట్) 0; లౌరెన్ బెల్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.5 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–58, 4–62, 5–70, 6–88, 7–102, 8–111, 9–111, 10–113. బౌలింగ్: అమన్‌జ్యోత్ కౌర్ 2–0–22–1; దీప్తి శర్మ 3–0–32–2; శ్రీచరణి 3.5–0–12–4; అరుంధతి రెడ్డి 2–0–18–1; రాధా యాదవ్ 2–0–15–2; స్నేహ్ రాణా 2–0–13–0. 1 టి20ల్లో స్మృతి మంధానకు ఇదే తొలి సెంచరీ కాగా... మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది.2 టి20 ఫార్మాట్లో టీమిండియాకు ఇది (210/5) రెండో అత్యధిక స్కోరు. గతేడాది వెస్టిండీస్‌పై 217/4 స్కోరు సాధించింది. -
ఇంగ్లండ్ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర శతకం
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో భారత మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుత శతకంతో మెరిసింది. ఆది నుంచి నిలకడగా ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ యాభై ఒక్క బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో స్మృతికి ఇదే తొలి శతకం కావడం విశేషం. దీంతో ఆనందంలో మునిగిపోయిన స్మృతి హెల్మెట్ తీసి.. బ్యాట్ చూపిస్తూ నవ్వులు చిందిస్తూ సెలబ్రేట్ చేసుకుంది.ఇంగ్లండ్ పర్యటనలో..కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగనుండగా.. శనివారం నాటి తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (20) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.51 బంతుల్లో సెంచరీఈ క్రమంలో స్మృతి మంధాన 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్లీన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (8) త్వరగానే పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగెస్ డకౌట్ అయింది. ఇక స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి.. సోఫీ ఎక్లిస్టోన్ బౌలింగ్‌లో నాట్ సీవర్- బ్రంట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైంది.ఇంగ్లండ్‌క్ష్యం 211అమన్‌జోత్ కౌర్ 3, దీప్తి శర్మ ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక స్మృతి అద్భుత శతకం ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. ఎమ్ ఆర్లోట్, సోఫీ ఎక్లిస్టోన్ ఒక్కో వికెట్ తీశారు. కాగా టీ20లలో భారత మహిళా జట్టుకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకు ముందు ముంబై వేదికగా వెస్టిండీస్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.ఇంగ్లండ్ వుమెన్ వర్సెస్ ఇండియా వుమెన్ తుదిజట్లుఇండియాస్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగెస్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి.ఇంగ్లండ్సోఫియా డంక్లీ, డానియెల్ వ్యాట్-హాడ్జ్, నాట్ సీవర్-బ్రంట్ (కెప్టెన్), టామీ బౌమౌంట్, ఎమీ జోన్స్ (వికెట్ కీపర్), అలిస్ కాప్సీ, సోఫీ ఎక్లిస్టోన్, ఎమ్ ఆర్లోట్, లారెన్ ఫిలర్, లిన్సీ స్మిత్, లారెన్ బెల్.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
సౌతాఫ్రికా, జింబాబ్వేలతో సిరీస్‌కు కివీస్ జట్టు ప్రకటన
జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ముక్కోణపు టీ20 సిరీస్ (T20 Tri Series)కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పేసర్ ఆడం మిల్నే (Adam Milne) తిరిగి రాగా.. బెవాన్ జేకబ్స్ (Bevon Jacobs) తొలిసారి చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. కొంత మంది సీనియర్లు మాత్రం వివిధ కారణాల వల్ల దూరమయ్యారు.కేన్ మామ ఎందుకు దూరం అయ్యాడంటే?మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు పేసర్లు లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్, కైలీ జెమీషన్.. అదే విధంగా.. బ్యాటర్ డెవాన్ కాన్వే ఈ త్రైపాక్షిక సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. విలియమ్సన్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో మిడిల్సెక్స్ జట్టుకు ఆడుతుండటంతో.. సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.ఇక పక్కటెముకల నొప్పి కారణంగా బెన్ సియర్స్ జట్టుకు దూరం కాగా.. ఫెర్గూసన్‌కు పనిభారం తగ్గించే నిమిత్తం విశ్రాంతినిచ్చారు. మరోవైపు.. జెమీషన్ తమ మొదటి సంతానానికి ఆహ్వానం పలికే క్రమంలో సెలవు తీసుకున్నాడు.వారిద్దరి రీ ఎంట్రీఈ జింబాబ్వే- సౌతాఫ్రికాలతో సిరీస్ సందర్భంగా ఆల్‌రౌండర్లు గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర తిరిగి జట్టులోకి రాగా.. కెప్టెన్ సాంట్నర్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సాంట్నర్ ప్లే ఆఫ్స్ కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ బెవాన్ జేకబ్స్ తొలిసారి జట్టులోకి రాగా.. మిల్నే కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్‌తో న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాలు ఆరంభించనుంది. ఈ విషయాల గురించి కొత్త కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘బెవాన్ దేశీ క్రికెట్లో, ఫ్రాంఛైజీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక మిల్నే నైపుణ్యాలున్న టీ20 బౌలర్.ఫెర్గూసన్, సియర్స్, జెమీషన్ లేరు కాబట్టి మిల్నే రాకతో ప్రయోజనం చేకూరుతుంది. వరల్డ్‌కప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో మాకు సిరీస్ ఎంతో ముఖ్యమైనది. వైవిధ్యంతో కూడిన జట్టును అందుకే ఎంపిక చేశాం’’ అని పేర్కొన్నాడు.జింబాబ్వే- సౌతాఫ్రికాలతో ట్రై సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, బెవాన్ జేకబ్స్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: భారత్-ఇంగ్లండ్ వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు తదితర వివరాలు ఇవే -
టీమిండియాకు శుభవార్త.. అతడు వచ్చేస్తున్నాడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు సర్జరీ విజయవంతంగా పూర్తైంది. చాన్నాళ్లుగా ‘స్పోర్ట్స్ హెర్నియా’ (sports hernia)తో బాధ పడుతున్న ఈ పవర్ హిట్టర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించాడు.కోలుకుంటున్నా‘‘స్పోర్ట్స్హెర్నియాకు సంబంధించి కుడివైపున పొట్ట దిగువ భాగంలో చేసిన సర్జరీ పూర్తైంది. శస్త్ర చికిత్స ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోయినందుకు సంతోషంగా ఉంది. కోలుకునే దశలో ఉన్నాను.బ్యాట్ పట్టి మళ్లీ మైదానంలో దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఆరోగ్యం, పునరాగమనానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అప్డేట్ అందించాడు. ఆస్పత్రి బెడ్‌పై పడుకుని.. థంబ్స్ అప్ సింబల్ చూపిస్తున్న ఫొటో ఇందుకు జతచేశాడు.సరికొత్త రికార్డుకాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ అదరగొట్టాడు. ఈ సీజన్లో మొత్తంగా 717 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన ముంబై ఇండియన్స్ నాన్- ఓపెనర్‌గా ఈ మిడిలార్డర్ బ్యాటర్ నిలిచాడు.అంతేకాదు.. ఆడిన పదహారు మ్యాచ్‌లలో వరుసగా 25 కంటే ఎక్కువ స్కోరు చేసి సూర్య సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ముంబై టీ20 లీగ్‌లో సైతం పాల్గొన్నాడు. అయితే ముంబై లీగ్‌లో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో నొప్పి ఎక్కువవడంతో... ‘స్పోర్ట్స్ హెర్నియా’కు చికిత్స తీసుకోవాలని 33 ఏళ్ల సూర్య భావించాడు.‘సూర్య చాన్నాళ్లుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి సంబంధించిన వైద్యులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకుంటాడు’ అని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు వరకు భారత జట్టుకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు లేవు.బంగ్లాదేశ్ పర్యటనఈ నేపథ్యంలో చికిత్సకు ఇదే సరైన సమయమని భావించిన సూర్య కోలుకునేందుకు తగినంత సమయం ఉండటంతో వైద్యులను సంప్రదించాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో సర్జరీ చేయించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఈ ఏడాది ఆగష్టులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది.ఇందులో భాగంగా ఆతిథ్య జటుట్తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, స్పోర్ట్స్ హెర్నియా కారణంగా సూర్య జట్టుకు దూరమవుతాడని.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడనే వార్తలు వచ్చాయి.సూర్య వచ్చేస్తాడు!అయితే, తాను కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలో అడుగుపెడతానంటూ సూర్య తాజాగా చెప్పడంతో టీమిండియా అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా సూర్య బాధ్యతలు చేపట్టాడు. సూర్య సారథ్యంలో టీమిండియా టీ20 క్రికెట్ అద్భుత విజయాలు సాధించింది. శ్రీలంకలో 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తదితర జట్లపై గెలిచింది.చదవండి: Rohit Sharma On T20 WC: భయంతో వణికిపోయా.. అతడే గేమ్ ఛేంజర్ View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి టీ20లో 21 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్.. విండీస్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 59 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బట్లర్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు. అతడితో పాటు యువ ఓపెనర్ జేమీ స్మిత్(38), జాకబ్ బెతల్(23) రాణించారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, రస్సెల్, ఛేజ్ తలా వికెట్ సాధించారు.తిప్పిసేన డాసన్..అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ స్పిన్నర్ లియాస్ డాసన్ ధాటికి కరేబియన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. డాసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశాడు.అతడితో పాటు జాకబ్ బెతల్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక విండీస్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లూయిస్(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా ఆదివారం జరగనుంది.చదవండి: Bengaluru stampede: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో ఇద్దరి రాజీనామా -
UAE vs BAN: బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన యూఏఈ
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో చిత్తుగా ఓడి టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ (T20 Series) ఆడేందుకు బంగ్లాదేశ్ యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గత శనివారం (మే 17) తొలి టీ20 జరుగగా.. బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో యూఏఈ బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. లిటన్ దాస్ బృందాన్ని రెండు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.తాంజిద్ హసన్ ధనాధన్అనంతరం బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ యూఏఈ జయభేరి మోగించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమాన్ (0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ (18 బంతుల్లో 40) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ లిటన్ దాస్ (14) సహా తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) పూర్తిగా విఫలమయ్యారు. షమీమ్ హొసేన్ (9), రిషాద్ హొసేన్ (0), తాంజిమ్ హసన్ సకీబ్ (6) కూడా చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో హసన్ మహమూద్ (15 బంతుల్లో 26 నాటౌట్), షోరిఫుల్ ఇస్లాం (7 బంతుల్లో 16 నాటౌట్) మాత్రం దంచికొట్టారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లతో చెలరేగగా.. సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వాళ్లలో ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అర్ధ శతకంతో మెరిసిన అలిషాన్ షరాఫూఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే యూఏఈ ఓపెనర్, కెప్టెన్ ముహమద్ వసీం (9) అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ముహమద్ జోహైబ్ (29)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అలిషాన్ షరాఫూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (13) విఫలం కాగా.. ఆసిఫ్ ఖాన్‌తో కలిసి అలిషాన్ యూఏఈని గెలుపు తీరాలకు చేర్చాడు.అలిషాన్ షరాఫూ కేవలం 47 బంతుల్లోనే 68 పరుగులతో, ఆసిఫ్ ఖాన్ 26 బంతుల్లో 41 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు నష్టపోయి యూఏఈ లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా పొట్టి ఫార్మాట్లో యూఏఈకి బంగ్లాదేశ్‌పై ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. ఇక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అలిషాన్ షారిఫూ దక్కించుకోగా.. ముహమద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్ -
బంగ్లాతో సిరీస్.. జట్టును ప్రకటించిన పాక్.. బాబర్, రిజ్వాన్‌లకు షాక్
తమ కీలక బ్యాటర్లు బాబర్ ఆజం (Babar Azam), మహ్మద్ రిజ్వాన్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాకిచ్చింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో వీరిద్దరికి మరోసారి మొండిచేయి చూపింది. సల్మాన్ ఆఘా (Salman Ali Agha)ను కెప్టెన్‌గా కొనసాగించిన సెలక్టర్లు.. షాదాబ్ ఖాన్‌ను అతడికి డిప్యూటీగా నియమించారు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో బాబర్‌తో పాటు రిజ్వాన్ కూడా తేలిపోయాడు. ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో పొటి ఫార్మాట్ సిరీస్‌లలో కూడా పాక్ జట్టు నిరాశపరిచింది.షాహిన్ ఆఫ్రిదికి కూడా షాక్ఇక న్యూజిలాండ్ టూర్‌కు బాబర్, రిజ్వాన్‌లను ఎంపిక చేయని పీసీబీ... సల్మాన్ ఆఘాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, అతడి సారథ్యంలో పాక్ కివీస్ చేతిలో 4-1తో చిత్తుగా ఓడింది. దీంతో సీనియర్లను తిరిగి పిలిపిస్తారని విశ్లేషకులు భావించారు. కానీ సెలక్టర్లు బాబర్ ఆజం, రిజ్వాన్‌ల ఆశలపై నీళ్లు చల్లారు. వీరితో పాటు పేసర్ షాహిన్ ఆఫ్రిదికి కూడా షాకిచ్చారు.బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పీసీబీ తాజాగా జట్టును ప్రకటించింది. పదహారు మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఫఖర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, నసీం షా వంటి వాళ్లకు చోటు దక్కింది. ఇక సిరీస్‌తో మైక్ హెసన్ పాకిస్తాన్ కొత్త కోచ్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.వరల్డ్‌కప్‌లోనూ ఆడించరా? కాగా 2026లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగానే బంగ్లాదేశ్‌తో పాక్ ఈ సిరీస్ ఆడుతోంది. అంటే.. బాబర్ ఆజం, రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిదిలను పక్కనపెట్టడం ద్వారా.. ఈ మెగా టోర్నీకి కూడా వారి పేర్లను పరిగణనలోకి తీసుకోవడం లేదనే సంకేతాలు ఇచ్చింది. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు పాకిస్తాన్ సూపర్ లీగ్ -2025 ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేసినట్లు పీసీబీ చెప్పడం గమనార్హం. కాగా బంగ్లాదేశ్‌తో పాక్ ఆడబోయే మూడు టీ20 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదిక.ఇక వన్డేల్లో మాత్రం మహ్మద్ రిజ్వాన్‌ను పీసీబీ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. అతడి సారథ్యంలో ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. గ్రూప్ దశలో భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గెలుపన్నదే లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఐసీసీ టైటిల్‌ను రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హ్యారీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, ముహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీం షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సయీమ్ ఆయుబ్.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
టి20ల్లో షఫాలీ పునరాగమనం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో 5 టి20లు, 3 వన్డేల్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించారు. టి20ల కోసం 15 మందిని, వన్డేలకు 16 మందిని ఎంపిక చేయగా... రెండు టీమ్‌లకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు ముందు మన జట్టు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్ ఇదే కానుంది. దూకుడైన ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మ భారత జట్టులో పునరాగమనం చేసింది. గత ఏడాది అక్టోబరు తర్వాత ఆమె స్థానం కోల్పోయింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫు 9 మ్యాచ్‌లలో 304 పరుగులు చేసి షఫాలీ సత్తా చాటింది. అయితే షఫాలీని టి20లకు మాత్రమే ఎంపిక చేసిన సెలక్టర్లు వన్డే జట్టులో స్థానం కల్పించలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. గత ఏడాది నవంబరులో మణికట్టు గాయంతో ఆమె ఆటకు దూరమైంది. యస్తికకు వన్డే, టి20 రెండు టీమ్‌లలో చోటు లభించింది. ఇటీవల శ్రీలంకతో ముక్కోణపు టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా కూడా టి20ల్లో మళ్లీ చోటు దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి టి20 టీమ్‌లోకి ఎంపికైంది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి కూడా టి20 జట్టులోకి పునరాగమనం చేసింది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే. భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, తేజల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.భారత్, ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ తొలి టి20: జూన్ 28 నాటింగ్‌హామ్ రెండో టి20: జూలై 1 బ్రిస్టల్ మూడో టి20: జూలై 4 ఓవల్ నాలుగో టి20: జూలై 9 మాంచెస్టర్ ఐదో టి20: జూలై 12 బర్మింగ్‌హామ్ తొలి వన్డే: జూలై 16 సౌతాంప్టన్ రెండో వన్డే: జూలై 19 లార్డ్స్ మూడో వన్డే: జూలై 22 చెస్టర్ లీ స్ట్రీట్ -
Eng Vs WI: కెప్టెన్‌గా హ్యారీకి తొలి సిరీస్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే (ODI Series), టీ20 సిరీస్‌లలో పాల్గొనే ఇంగ్లండ్ జట్లను ప్రకటించారు. హ్యారీ బ్రూక్ Harry Brook) సారథ్యంలో తొలిసారి ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్‌లో పోటీ పడనుంది. తొలి మూడు వన్డేలు వరుసగా మే 29న, జూన్ 1న, జూన్ 3న ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, ఓవల్‌లలో జరుగుతాయి.అనంతరం జూన్ 6న, జూన్ 8న, జూన్ 10న వరుసగా మూడు టీ20ల (Eng vs WI T20s)ను చెస్టర్ లీ స్ట్రీట్, బ్రిస్టల్, సౌతాంప్టన్‌లలో నిర్వహిస్తారు. హాంప్‌షైర్ కౌంటీ జట్టుకు ఆడుతున్న ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ మూడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ టి20 జట్టులోకి వచ్చాడు. నాటింగ్హమ్షైర్ ఎడంచేతి వాటం పేస్ బౌలర్ ల్యూక్ వుడ్ రెండేళ్ల తర్వాత టి20 జట్టులోకి ఎంపికయ్యాడు. స్పిన్నర్ టామ్ హార్ట్లే రెండేళ్ల తర్వాత వన్టే జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న లియామ్ లివింగ్‌స్టోన్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, జో రూట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లే, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, జేమీ స్మిత్. ఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల ప్రకటనమెల్బోర్న్/జొహన్నెస్‌బర్గ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఆస్ట్రేలియా జట్టు... తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించేందుకు దక్షిణాఫ్రికా జట్టు సమాయత్తమవుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జూన్ 11 నుంచి 14 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మెగా పోరులో పాల్గొనే రెండు జట్లను మంగళవారం ప్రకటించారు.ఆస్ట్రేలియా జట్టు:ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, హాజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఇన్‌గ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, కునెమన్, లబుషేన్, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్. బ్రెండన్ డగెట్ (ట్రావెలింగ్ రిజర్వ్). దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), బెడింగ్హమ్, కార్బిన్ బోష్, టోనీ డి జార్జి, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎన్గిడి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరీన్. చదవండి: IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు? -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్?.. భద్రతే ముఖ్యం..
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పాకిస్తాన్ క్రికెట్ (Pakistan Cricket) మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ జట్టు ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. తరచూ కెప్టెన్లు, క్రికెట్ బోర్డు యాజమాన్యాన్ని మారుస్తూ ఒక దశ, దిశ లేకుండా కొట్టుమిట్టాడుతోంది.ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025)లోనూ రిజ్వాన్ బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. గ్రూప్-ఎలో భాగంగా న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడి.. కనీసం సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల అదీ రద్దై పోవడంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌కు అసలు గెలుపన్నదే లేకుండా పోయింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లోనైనా గెలవాలని..ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు భావిస్తోంది. అయితే, ఇప్పట్లో అదీ జరిగేలా లేదు. కాగా.. ఉగ్రదాడుల నేపథ్యంలో సుదీర్ఘకాలం సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లకు పాక్ జట్టు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితులే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.నాడు శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడికాగా 2009లో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అంతర్జాతీయ జట్లు ఆ దేశంలో పర్యటించడాన్ని దాదాపు నిషేధించగా... ఇటీవలే పరిస్థితులు తిరిగి మెరువడంతో కొన్ని జట్లు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్లో క్రికెట్‌కు పూర్వవైభవం రావడం ఖాయమే అనుకుంటున్న దశలో... మరోసారి దీనికి బ్రేక్ పడేలా కనిపిస్తోంది.ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గజగజజమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు బదులుగా పాకిస్తాన్ ప్రతిదాడులు ప్రారంభించగా... భారత సాయుధ బలగాలు వాటిని బలంగా తిప్పికొట్టాయి.5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసంఈ నేపథ్యంలో అతిత్వరలో పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉన్న బంగ్లాదేశ్ జట్టు... ఈ పర్యటనపై పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలించడంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో నిరంతరం చర్చిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి.ఆటగాళ్ల భద్రతే ముఖ్యం‘ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యం. పాకిస్తాన్ బోర్డుతో చర్చిస్తున్నాం. ఏ నిర్ణయమైనా త్వరలోనే వెల్లడిస్తాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 17 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మరోవైపు పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ నిలిచిపోగా... అందులో పాల్గొంటున్న రిషాద్ హుసేన్, నహీద్ రాణా ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డు.. పాక్‌పై చితక్కొట్టి అరుదైన ఘనత
న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్‌తో ఐదో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రపంచ రికార్డు సాధించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక స్ట్రైక్ రేటుతో.. తొంభై పరుగుల మార్కు చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) పేరిట ఉన్న రికార్డును సీఫర్ట్ బద్దలు కొట్టి సీఫర్ట్ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి, రెండు టీ20లలో కివీస్ గెలవగా.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ పైచేయి సాధించిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇరుజట్ల (New Zealand Vs Pakistan) మధ్య బుధవారం నామమాత్రపు ఐదో టీ20 జరిగింది. వెల్లింగ్టన్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (39 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా... షాదాబ్ ఖాన్ (28; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హరీస్ (11), నవాజ్ (0), యూసుఫ్ (7), ఉస్మాన్ ఖాన్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 5 వికెట్లతో విజృంభించగా... జాకబ్ డఫీ 2 వికెట్లు తీశాడు.బాదుడే బాదుడు... స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ నుంచే పాక్ బౌలర్లపై ప్రతాపం చూపింది. తొలి ఓవర్లో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 4, 6, 6 కొడితే... రెండో ఓవర్లో అలెన్ 4, 4, 6 బాదాడు. మూడో ఓవర్లో సీఫర్ట్ 4, 6... నాలుగో ఓవర్లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. జహాందాద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో సీఫెర్ట్ 6, 4, 6, 2, 6, 1 కొట్టడంతో 23 బంతుల్లోనే అతడి హాఫ్‌సెంచరీ పూర్తయింది. పాక్ యువ బౌలర్ ముఖీమ్ రెండు ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ... సీఫెర్ట్ జోరును మాత్రం అడ్డుకోలేకపోయాడు. షాదాబ్ వేసిన పదో ఓవర్లో 6, 6, 6, 6 కొట్టిన సీఫర్ట్ మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా న్యూజిలాండ్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. తొలి బంతి నుంచే సీఫర్ట్ వీరవిహారం చేయగా... ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు ధాటిగా ఆడటం కలిసివచ్చింది. పాక్ బౌలర్లలో ముఖీమ్ 2 వికెట్లు తీశాడు. నీషమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సీఫర్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టిమ్ సీఫర్ట్ ప్రపంచ రికార్డుఇక ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్ మొత్తంగా 38 బంతుల్లో 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 255.26గా నమోదైంది.ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి.. అత్యధిక స్ట్రైక్‌రేటుతో తొంభైకి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా సీఫర్ట్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది. లివింగ్‌స్టోన్ 2021లో పాకిస్తాన్‌పై నాటింగ్‌హామ్ వేదికగా 239.53 స్ట్రైక్‌రేటుతో 103 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో 250కి పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగానూ సీఫర్ట్ చరిత్రపుటల్లో తన పేరును లిఖించుకోవడం మరో విశేషం.చదవండి: ‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు’ -
ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమే: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గత కొంతకాలంగా ఇంటా.. బయటా పరాభవాలే ఎదురవుతున్నాయి. తొలుత న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో సొంతగడ్డపై త్రైపాక్షిక సిరీస్‌లో ఓటమిపాలైన పాక్.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ చేదు అనుభవాలు ఎదుర్కొంది.ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ (NZ vs PAK T20 Series)లో చిత్తుగా ఓడిపోయింది. కివీస్‌తో బుధవారం నాటి ఐదో టీ20లో ఓడి.. 4-1తో సిరీస్‌లో పరాజయం పాలైంది.ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమేఅయితే, ఓటమి అనంతరం పాకిస్తాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇలాంటి సిరీస్‌లలో ఓడిపోయినా ఫర్వాలేదని.. తమ దృష్టి మొత్తం ఆసియా కప్, వరల్డ్‌కప్ టోర్నీల మీదనే ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడింది.సిరీస్ ఆసాంతం వాళ్లు అదరగొట్టారు. అయినా మాకూ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. మూడో టీ20లో హసన్ నవాజ్ అద్భుత శతకం సాధించాడు. ఐదో టీ20లో సూఫియాన్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు.వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాంమేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టి మొత్తం ఆసియా కప్, ప్రపంచకప్లపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్‌లో ఓడినంత మాత్రాన పెద్దగా నిరాశపడాల్సిందేమీ లేదు. ఇక పొట్టి ఫార్మాట్‌కు, వన్డే ఫార్మాట్‌కు ఏమాత్రం పొంతన ఉండదని తెలిసిందే. వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.అపుడు డకెట్ కూడా ఇలాగేఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా కామెంట్లపై సోషల్ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్‌తో పోలుస్తూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ అయింది. అయితే.. ఈ ఘోర ఓటమి తర్వాత బెన్ డకెట్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సిరీస్‌లలో పరాజయాలు పెద్దగా లెక్కలోకి రావు. మేమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దీనిని అందరూ మర్చిపోతారు’’ అని పేర్కొన్నాడు.రెండు జట్లదీ ఒకే పరిస్థితిఅయితే, చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కనీసం ఒక్క విజయం కూడా సాధించలేదు. అఫ్గనిస్తాన్ చేతిలోనూ చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు సల్మాన్ ఆఘా తమ ఫోకస్ ఆసియా కప్, వరల్డ్‌కప్ మాత్రమే అని చెప్పడం గమనార్హం. అన్నట్లు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తొలుత న్యూజిలాండ్.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల.. ఆ మ్యాచ్ రద్దైంది. దీంతో ఇంగ్లండ్ మాదిరే ఒక్క గెలుపు లేకుండానే పాకిస్తాన్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమిపాక్తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ -
NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి
పాకిస్తాన్‌తో ఐదో టీ20లో న్యూజిలాండ్ (New Zealand Vs Pakistan) క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి.. 4-1తో సిరీస్ ముగించింది. ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించి సల్మాన్ ఆఘా బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది.మళ్లీ పాత కథేకాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (Pakistan Tour Of New Zealand)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ మొదలుకాగా.. తొలి రెండు మ్యాచ్‌లలో కివీస్ గెలుపొందింది. అయితే, మూడో టీ20లో పాక్ అనూహ్య సంచలన విజయం సాధించింది.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది.కానీ తర్వాత మళ్లీ పాత కథే. నాలుగో టీ20లో కివీస్ చేతిలో ఏకంగా 115 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదో టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించగా భంగపాటే ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ టాపార్డర్‌లో ఓపెనర్లు మహ్మద్ హారిస్ (11), హసన్ నవాజ్ (0).. వన్‌డౌన్ బ్యాటర్ ఒమర్ యూసఫ్ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఆఘా (Salman Agha) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అయితే, అతడికి మిగతా వారి నుంచి సహకారం అందలేదు.ఆఖర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 28 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు(5/22) కూల్చి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో జేకబ్ డఫీ రెండు, బెన్ సీర్స్, ఇష్ సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.38 బంతుల్లోనే 97 రన్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పది ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 97 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. మార్క్ చాప్మన్(3) మాత్రం నిరాశపరిచాడు. ఏదేమైనా టిమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం అద్బుతంగా ఆడిన జేమ్స్ నీషమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్
పాకిస్తాన్ యువ బ్యాటర్ హసన్ నవాజ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. మూడో టీ20లో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని అన్నాడు. పాక్ గెలుపులో క్రెడిట్ మొత్తం అతడికే ఇవ్వాలని పేర్కొన్నాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. మొదటి రెండు మ్యాచ్‌లలో ఆతిథ్య కివీస్ విజయం సాధించింది. అయితే, శుక్రవారం జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అక్లాండ్ వేదికగా టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేసింది. 204 పరుగులకు ఆలౌట్‌ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మార్క్ చాప్మన్ (44 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కెప్టెన్ బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలా 2 వికెట్లు తీశారు.ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 16 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు నాటౌట్) కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా... కెప్టెన్ సల్మాన్ ఆఘా (31 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొహమ్మద్ హరీస్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ ఒక వికెట్ పడగొట్టాడు.రెండు డకౌట్ల తర్వాత... నవాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్... తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినా మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచి మూడో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వగా... తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు. అతడి దూకుడుతో భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తొలి ఓవర్లో రెండు సిక్సర్లతో హెచ్చరికలు జారీచేసిన హరీస్... రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. మొదట హరీస్‌కు అండగా నిలిచిన నవాజ్... ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం హరీస్ అవుట్ కాగా... పవర్ ప్లే (6 ఓవర్లలో) ముగిసేసరికి పాకిస్తాన్ 75/1తో నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. 2016లో ఇంగ్లండ్‌పై చేసిన 73 పరుగులు రెండో స్థానానికి చేరింది. కెప్టెన్ సల్మాన్ ఆఘా రాకతో పాక్ దూకుడు మరింత పెరిగింది. వీలు చిక్కినప్పుడల్లా నవాజ్ సిక్సర్లతో చెలరేగగా... అతడికి సల్మాన్ అండగా నిలిచాడు. ఈ క్రమంలో నవాజ్ 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఇదే వేగవంతమైన శతకం. 2021లో దక్షిణాఫ్రికాపై బాబర్ ఆజమ్ (49 బంతుల్లో) చేసిన సెంచరీ రెండో స్థానంలో ఉంది. ‘గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యా. ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యా. దీంతో బాగా ఒత్తిడికి గురయ్యా. అయినా మేనేజ్మెంట్ నాకు మరో అవకాశం ఇచ్చింది.తొలి పరుగు చేసినప్పుడు భారం తీరినట్లు అనిపించింది. దీంతో స్వేచ్ఛగా ఆడి జట్టును గెలిపించాలనుకున్నా’ అని నవాజ్ అన్నాడు. ఇక నవాజ్, సల్మాన్ అబేధ్యమైన రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోపు పూర్తి చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఓవరాల్‌గా పాకిస్తాన్‌కు ఇది రెండో పెద్ద ఛేదన. కెప్టెన్ సల్మాన్ కూడా ఈ మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు.అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫలితం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నవాజ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అతడు నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విషయంలో అతడికి తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి.మేము 20 ఓవర్ల పాటు ఆడలేకపోయాం. పొట్టి క్రికెట్లో ఇదొక నేరం లాంటిదే. చాప్మన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ అతడు అవుటైన తర్వాత మేము మరో రెండు ఓవర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 230 పరుగుల మేర సాధించేవాళ్లం. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో కనీసం మరో పదిహేను పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది’’ అని పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ -
Pak vs Ban: పాకిస్తాన్ పర్యటనకు బంగ్లాదేశ్ జట్టు.. ఈసారి..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్ జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడకు వెళ్లింది. తొలి రెండు టీ20లలో ఓటమి పాలైన సల్మాన్ ఆఘా బృందం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. మరోవైపు.. ఈ టూర్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీ కానున్నారు.అనంతరం.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ టూర్ (Bangladesh Tour Of Pakistan) లో భాగంగా పాక్- బంగ్లా జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి. ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 10వ సీజన్ జరగనుండగా... ఇది ముగిసిన అనంతరం బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. లాహోర్ (Lahore), ముల్తాన్ (Multan), ఫైసలాబాద్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ పాకిస్తాన్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడితో చర్చించిన.. అనంతరం ఇరు దేశాల బోర్డులు ఈ సిరీస్‌లకు పచ్చజెండా ఊపాయి. ద్వైపాక్షిక సిరీస్ కోసం చివరిసారిగా గతేడాది పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది.ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. బంగ్లాదేశ్ కూడా ఘోర ఓటములు చవిచూసింది. గ్రూప్-ఎలో టీమిండియా, న్యూజిలాండ్‌తో కలిసి ఉన్న ఈ ఆసియా జట్లు.. ఈ రెండు టీమ్‌ల చేతిలో చిత్తుగా ఓడాయి. అనంతరం పాక్- బంగ్లా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అడ్డుపడటంతో టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో చెరో పాయింట్‌తో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.ఇక గ్రూప్-బి నుంచి చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ తలపడ్డాయి. ఇందులో సౌతాఫ్రికా సెమీస్ చేరి.. అక్కడ కివీస్ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో రోహిత్ సేన జయకేతనం ఎగురువేసింది. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా అవతరించింది. చదవండి: వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్ -
పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్ షాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. క్రమశిక్షణ అంశంలో అతడి ఖాతాలో మూడు డిమెరిట్ పాయింట్లు జత చేసింది.ఇందుకు సంబంధించి ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఖుష్దిల్ షా వ్యవహరించిన తీరుకు ఈ మేర కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.32 పరుగులతో టాప్ స్కోరర్గాఈ క్రమంలో మార్చి 16న కివీస్- పాక్ మధ్య తొలి టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. పాకిస్తాన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీ తాలుకు వైఫల్యాన్ని కొనసాగిస్తూ పాక్ 91 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఖుష్దిల్ షా 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక సల్మాన్ ఆఘా బృందం విధించిన 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఊదేసింది. ఇదిలా ఉంటే.. ఖుష్దిల్ షా తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాస్త అతిగా ప్రవర్తించాడు.అతడిని బలంగా ఢీకొట్టాడుపాక్ ఎనిమిదో ఇన్నింగ్స్‌లో కివీస్ యువ పేసర్ జకారీ ఫౌల్క్స్ బౌలింగ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో ఖుష్దిల్ షా.. ఫౌల్క్స్‌ను బలంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడు నిర్లక్ష్యపూరితంగా, దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించింది.ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలకు పూనుకున్న ఐసీసీ.. ఖుష్దిల్ షాకు గట్టి పనిష్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 సూచిస్తున్న నిబంధనను ఖుష్దిల్ ఉల్లంఘించాడు.అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాళ్లను, సిబ్బంది, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకులు.. ఎవరినైనా సరే అనుచిత రీతిలో వారికి ఇబ్బంది కలిగించేలా తాకితే కఠిన చర్యలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా ఖుష్దిల్పై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. తప్పును అంగీకరించిన ఆల్రౌండర్గత 24 నెలల కాలంలో ఇదే ఖుష్దిల్ మొదటి తప్పు కాబట్టి.. ఇంతటితో సరిపెట్టింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు వేన్ నైట్స్, సామ్ నొగస్కి, థర్డ్ అంపైర్ కిమ్ కాటన్, ఫోర్త్ అంపైర్ క్రిస్ బ్రౌన్ ఫిర్యాదు ఆధారంగా ఈ మేర ఐసీసీ చర్యలు తీసుకుంది. ఖుష్దిల్ సైతం తన తప్పును అంగీకరించాడు. కాగా 30 ఏళ్ల ఖుష్దిల్ షా లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం గల బ్యాటర్. 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు 15 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 328, 376 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు, మూడు వికెట్లు తీశాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? : పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) మండిపడ్డాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ఎప్పుడో చేతులెత్తేసిందని.. కేవలం సొంతవాళ్లకు జీతాలు ఇచ్చుకునేందుకు ఇదొక మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆరోపించాడు.గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికా జట్లతో త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ వైఫల్యం చెందింది.ఈ మెగా వన్డే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది.ఈ క్రమంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజంలపై వేటు వేసిన పీసీబీ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి వారిని పక్కనపెట్టింది. టీ20 కొత్త కెప్టెన్‌గా సల్మాన్ ఆఘాకు బాధ్యతలు అప్పగించింది. 91 పరుగులకే ఆలౌట్ .. ఘోర ఓటమిఅయితే, కివీస్ దేశ పర్యటనలో భాగంగా తొలి టీ20లో పాకిస్తాన్ అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలుత 91 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో కివీస్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది.పాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. ఫలితంగా పాక్ టీ20 చరిత్రలో ఇదో ఘోర ఓటమి(59 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి టార్గెట్ ఛేదించడం)గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పీసీబీ సెలక్షన్ కమిటీ తీరును తూర్పారబట్టాడు.అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? ‘‘అసలు షాదాబ్‌ను ఏ ప్రాతిపదికన జట్టులోకి తీసుకున్నారు. అతడి ప్రదర్శన గత కొంతకాలంగా ఎలా ఉందో మీకు తెలియదా? అతడిని జట్టులోకి తీసుకువచ్చింది ఎవరు? ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఏమవుతుందో చూడండి. షాదాబ్ విషయంలో పీసీబీ ప్రణాళికలే వేరు. అతడిని ఎందుకు ఎంపిక చేశారన్నది కొద్దిరోజుల్లోనే బయటపడుతుంది.అయినా.. కివీస్‌తో తొలి టీ20లో మా బౌలర్లు అసలు ఏం చేశారు? మాట్లాడితే సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు అంటారు. కానీ వాళ్లలో ఒక్కరైనా బాధ్యతగా ఆడారా? అసలు ప్రత్యర్థిని కాస్తైనా భయపెట్టగలిగారా? ఇంతకంటే చెత్త ఓటమి మరొకటి ఉంటుందా?’’ అని షెహజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా కివీస్‌తో తొలి టీ20లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కేవలం 3 పరుగులే చేశాడు. అదే విధంగా.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో పద్దెమినిది పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు?ఇక NCA గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జాతీయ క్రికెట్ అకాడమీ ఆటగాళ్ల నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాలి. ఇక్కడి నుంచే మెరికల్లాంటి ఆటగాళ్లు వచ్చేవారు. నేను.. మహ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, ఉమర్ అమీన్, షాన్ మసూద్ వచ్చాం. మేము ఎన్సీఏలో ఉన్నప్పుడు వివిధ రకాల శిక్షణా శిబిరాలు నిర్వహించేవారు. ముదాస్సర్ నజర్ వంటి కోచ్‌లు ఉండేవారు.కానీ గత నాలుగేళ్లుగా ఎన్సీఏ ఏం చేస్తోంది? ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు? ఆటగాళ్ల అభివృద్ధికి దోహదం చేయాల్సింది పోయి.. సొంతవాళ్లకు జీతాలు ఇచ్చేందుకు మాత్రమే దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఎన్సీఏ చీఫ్ నదీమ్ ఖాన్ ఏం చేస్తున్నారు.ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? జవాబుదారీతనం ఉందా? ప్రతిసారీ ఆటగాళ్లను ఓటములకు బాధ్యులను చేయడం సరికాదు. నదీమ్ ఖాన్‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎన్సీఏ లాంటి కీలకమైన వ్యవస్థను నీరుగారుస్తుంటే ఎవరూ మాట్లాడరే? అసలు ఆయనను ఏ ప్రాతిపదికన అక్కడ నియమించారు? ఇందుకు అతడికి ఉన్న అర్హతలు, నైపుణ్యాలు ఏమిటి? అసలు పీసీబీ ఏం చేస్తోంది?’’ అని అహ్మద్ షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: 18వ సారైనా... బెంగళూరు రాత మారేనా! -
NZ vs PAK: రిజ్వాన్, బాబర్‌లపై వేటు.. పాక్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్
న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) తమ జట్లను ప్రకటించింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan), మాజీ సారథి బాబర్ ఆజం(Babar Azam)లకు ఈ సందర్భంగా షాకిచ్చింది. టీ20 జట్టు నుంచి వీరిద్దరిని తప్పించిన యాజమాన్యం వన్డేల్లో మాత్రం చోటిచ్చింది.పాయింట్ల పట్టికలో అట్టడుగునఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రిజ్వాన్ బృందం.. గ్రూప్ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. అనంతరం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో మరోసారి పరాజయాన్ని చవిచూసింది.అనంతరం ఆఖరిగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించగా.. వర్షం అడ్డుపడింది. రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వరణుడి కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఒక్క విజయం కూడా లేకుండానే పాకిస్తాన్ టోర్నీని ముగించింది. పాయింట్ల పట్టికలోనూ అట్టడుగున నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురైంది.ఈ టోర్నీలో కెప్టెన్ రిజ్వాన్‌తో పాటు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై మాజీ క్రికెటర్లు వసీం అక్రం, షోయబ్ అక్తర్ తదితరులు విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పీసీబీ ప్రక్షాళన చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంద.న్యూజిలాండ్ పర్యటనకుకాగా చాంపియన్స్ ట్రోఫీలో చేదు అనుభవం తర్వాత పాకిస్తాన్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. మార్చి 16- ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్న పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు జట్లను పీసీబీ మంగళవారం ప్రకటించింది. వన్డే సారథిగా రిజ్వాన్‌ను కొనసాగించడంతో పాటు ఆ జట్టులో బాబర్‌కు కూడా సెలక్టర్లు చోటిచ్చారు.అయితే, టీ20లకు మాత్రం పీసీబీ కొత్త కెప్టెన్‌ను తీసుకువచ్చింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సల్మాన్ ఆఘాను పాక్ టీ20 జట్టు సారథిగా నియమించింది. ఈ క్రమంలో రిజ్వాన్, బాబర్‌లపై వేటు వేసింది. ఆకిబ్ కొనసాగింపుఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ ఆకిబ్ జావెద్‌పై కూడా వేటు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా కివీస్ టూర్‌కు మాత్రం పాకిస్తాన్ అతడినే కొనసాగించింది.కొత్తగా మహ్మద్ యూసఫ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించిన పీసీబీ.. నవీద్ అక్రం చీమాను టీమ్ మేనేజర్‌గా.. అజర్ మహమూద్‌ను అసిస్టెంట్ కోచ్‌గా సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ టూర్‌కు గాయాల వల్ల ఓపెనర్లు ఫఖర్ జమాన్, సయీమ్ ఆయుబ్ దూరం కాగా ఆకిఫ్ జావేద్, మహ్మద్ అలీలకు వన్డే జట్టులో స్థానం దక్కింది.కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో ఐదు టీ20లు.. మార్చి 29, ఏప్రిల్ 2, 5 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.న్యూజిలాండ్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆకిఫ్ జావేద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సూఫియాన్ ముఖీమ్, తయ్యాబ్ తాహిర్.న్యూజిలాండ్‌తో టీ20లకు పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, ముహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, ముహమ్మద్ అలీ, ముహమ్మద్ హారీస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, షాహీన్ షా అఫ్రిది, సూఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్.చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు! -
జింబాబ్వేదే టి20 సిరీస్
హరారే: సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి పోరు వర్షం కారణంగా రద్దు కాగా... జింబాబ్వే 1–0తో సిరీస్ చేజిక్కించుకుంది. తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. రెండో టి20లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మంగళవారం అర్ధరాత్రి జరిగిన చివరి టి20లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (27 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), టోనీ (26), తషింగా (26 నాటౌట్) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్, గారెత్ డెలానీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఐర్లాండ్ జట్టు లక్ష్యఛేదనకు దిగకముందే భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ సాధ్యపడలేదు. ఫలితంగా జింబాబ్వేకు సిరీస్ దక్కింది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరగిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ జట్టు విజయం సాధించగా... అనంతరంమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వే 2–1తో గెలుపొందింది. -
WI vs Aus: పదేళ్ల తర్వాత తొలిసారిగా.. షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు విండీస్ వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్(West Indies Vs Australia) మధ్య ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ(Frank Worrell Trophy) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుజట్లు కరేబియన్ గడ్డ మీద ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో పోటీపడనున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే తమ దేశంలో పర్యటించనుందని తెలిపింది.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో తొలి సిరీస్మరోవైపు.. ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి బెన్ ఓలివర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డులకు ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత ఇరుజట్లు టెస్టు సిరీస్ ఆడటం శుభసూచకమని.. ఈ సిరీస్‌ను మూడు మ్యాచ్‌లకు పెంచినట్లు వెల్లడించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025-2027 ఎడిషన్‌లో ఇదే తమకు ఇదే తొలి సిరీస్ అని.. ఈసారీ ఫ్రాంక్ వొరిల్ ట్రోఫీని తామే సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.అదే విధంగా ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఐదు టీ20లు కూడా ఆడనున్నట్లు ఓలివర్ తెలిపారు. ఏడాది తర్వాత జరునున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదే ఆరంభ సన్నాహకం కానుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆసీస్ ప్రస్తుతంశ్రీలంక పర్యటనలో ఉంది. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఇక ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లకు షెడ్యూల్మూడు టెస్టులుతొలి టెస్టు: జూన్ 25- 20- బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్రెండో టెస్టు: జూలై 3-7- సెయింట్ జార్స్, గ్రెనెడామూడో టెస్టు: జూలై 12- 16- కింగ్స్టన్, జమైకాటీ20 సిరీస్‌తొలి టీ20- జూలై 20- కింగ్స్టన్, జమైకారెండో టీ20- జూలై 22- కింగ్స్టన్, జమైకామూడో టీ20- జూలై 25- బసెటెరె, సెయింట్ కిట్స్నాలుగో టీ20- జూలై 26- బసెటెరె, సెయింట్ కిట్స్ఐదో టీ20- జూలై 28- బసెటెరె, సెయింట్ కిట్స్అతడి జ్ఞాపకార్థంవెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో విజేతకు ఫ్రాంక్ వొరిల్ అవార్డు ప్రదానం చేస్తారు. వెస్టిండీస్ జట్టు తొలి నల్లజాతి కెప్టెన్‌గా పేరొందిన వొరిల్ జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని ప్రవేశపెట్టారు. 1960-61లో తొలిసారి ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని ప్రదానం చేశారు.ఇక 1995 నుంచి ఇప్పటి దాకా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయితే, గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆసీస్ ఆధిపత్యాన్ని తగ్గించింది. గబ్బాలో అనూహ్య విజయంతో సిరీస్‌ను 1-1తో డ్రా చేసి.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్‌పై టెస్టు విజయం నమోదు చేసింది.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ పాకిస్తాన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రిజ్వాన్ బృందంతో సొంతగడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. జూలై 31 నుంచి టీ20లు, ఆగష్టు 8 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. -
‘ఇగో’ చూపించాలనుకుంటే జట్టులో చోటుండదు: సంజూకు వార్నింగ్
టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson) ఆట తీరుపై భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్(Krishnamachari Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ ‘ఇగో’ చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఇకముందైనా షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో రెండు టీ20 శతకాలతో చెలరేగిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.స్వదేశంలో బట్లర్ బృందంతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(India vs England)లో సంజూ మొత్తంగా కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. పదే పదే ఒకే రీతిలో అవుటయ్యాడు. షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్లకు సులువైన క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగాడు.‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడు. ఐదోసారి కూడా అదే రీతిలో అవుటయ్యాడు.మరోసారి పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. నాకు తెలిసి.. అతడు తన ‘ఇగో’ను సంతృప్తి పరచుకునేందుకు ఇలా చేశాడని అనుకుంటున్నా. ‘లేదు.. లేదు.. నేను ఈ షాట్ కచ్చితంగా ఆడగలను’ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.అసలు అతడు ఫామ్‌లేమితో సతమతమయ్యాడా? లేదంటే.. ‘ఇగో’ ట్రిప్‌నకు ఏమైనా వెళ్లాడా? నాకైతే అతడి గురించి ఏమీ ఏమీ అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌లో.. నిజంగా తీవ్రంగా నిరాశపరిచాడు.జైస్వాల్ తిరిగి వస్తాడుసంజూను చాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నాం కదా! ఇదిలో ఇలాగే ఆడితే మాత్రం.. సెలక్టర్లు మాత్రం అతడిపై మరోసారి వేటు వేస్తారు. యశస్వి జైస్వాల్ తిరిగి వస్తాడు. తదుపరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను కాదని యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తారు’’ అని చిక్కా సంజూకు హెచ్చరికలు జారీ చేశాడు.గాయం.. ఆరు వారాలు దూరంఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్.. ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. కాగా ఇంగ్లండ్‌తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టి20లో బ్యాటింగ్ చేస్తుండగా సీమర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది.‘స్కానింగ్‌లో స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో శాంసన్ ఆరు వారాలు ఆటకు దూరమవుతాడు. పుణే వేదికగా ఈ నెల 8 నుంచి 12 వరకు జమ్మూ కశ్మీర్‌తో కేరళ ఆడే రంజీ క్వార్టర్ ఫైనల్ పోరులో అతను బరిలోకి దిగడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సామ్సన్ ఐపీఎల్ కల్లా అందుబాటులో ఉంటాడని బోర్డు పేర్కొంది.ఇక ఐపీఎల్లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం గురువారం(ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో జరిగే తొలి వన్డేతో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది. చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్.. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్! వైరల్
ఇంగ్లండ్‌తో ఐదో టీ20(India vs England)లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సృష్టించిన పరుగుల విధ్వంసాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. సహచరులు విఫలమైన చోట.. ‘చేతికే బ్యాట్ మొలిచిందా’ అన్నట్లుగా.. పొట్టి ఫార్మాట్‌కే వన్నె తెచ్చేలా అతడి ఇన్నింగ్స్ సాగింది.మిగిలిన భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. తను మాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను చితక్కొట్టిన విధానం టీ20 ప్రేమికులకు అసలైన మజా అందించింది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నితీశ్ రెడ్డి ఊరమాస్ కామెంట్!ఈ క్రమంలో అభిషేక్ శర్మను ఉద్దేశించి సహచర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్మేట్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కత్తి పట్టుకుని ఉన్న ఫొటోతో పాటు.. బ్యాట్‌తో అభిషేక్ పోజులిస్తున్న ఫొటోను పంచుకున్న నితీశ్.. ‘‘మెంటల్ నా కొడుకు’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు సెల్యూట్ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జతచేశాడు. పూనకం వస్తే అతడిని ఎవరూ ఆపలేరన్న అర్థంలో అభిషేక్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ ఇలా ఊరమాస్ కామెంట్ పెట్టాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం నితీశ్ వాడిన పదాన్ని తప్పుబడుతుండగా.. మరికొందరు అభిషేక్ ఆట తీరును వర్ణించేందుకే ఆ పదం వాడాడని పేర్కొంటున్నారు.150 పరుగుల తేడాతో మట్టికరిపించికాగా ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ సూర్యకుమార్ సేన సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో బట్లర్ బృందాన్ని 150 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకపక్ష విజయం సాధించింది. ప్రఖ్యాత వాంఖడే మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. ఇందుకు ప్రధాన కారణం అభిషేక్ శర్మ.ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ శర్మ.. పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. అదే జోరులో 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, పదమూడు సిక్స్‌లు ఉన్నాయి.అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియాకు ఘన విజయం దక్కింది. దీంతో 4-1తో ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ సేన సొంతం చేసుకుంది.కాగా అంతర్జాతీయ టీ20లలో అభిషేక్ శర్మకు రెండో శతకం. ఇంతకు ముందు జింబాబ్వేపై అతడు సెంచరీ సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అభిషేక్ శర్మ.. గత సీజన్లో పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్‌తో కలిసి విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గాయం వల్ల దూరంఇక విశాఖపట్నం కుర్రాడు, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా సన్‌రైజర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలోనూ ఇద్దరూ కలిసే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌తో స్నేహం దృష్ట్యా ఈ మేర కామెంట్ చేయడం గమనార్హం. కాగా నితీశ్ రెడ్డి కూడా ఇంగ్లండ్‌తో టీ20లకు సెలక్ట్ అయ్యాడు. కోల్‌కతా మ్యాచ్‌లో కూడా భాగమయ్యాడు. అయితే, గాయం కారణంగా అనంతరం జట్టుకు దూరమయ్యాడు. చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో భారీ తేడాతో గెలుపొంది.. ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు హోదా కలిగిన జట్లలో ఇంత వరకు.. ఏ టీమ్కీ సాధ్యం కాని రీతిలో ‘బిగ్గెస్ట్ విక్టరీ(Biggest Victory)’ల విషయంలో అత్యంత అరుదైన ఘనత సాధించింది.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1(India Won Series With 4-1)తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో ఈ సిరీస్ ఆరంభించిన టీమిండియా.. చెన్నైలోనూ గెలిచింది. అయితే, ఆ తర్వాత రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.ఏకపక్ష విజయం అయితే, పడిలేచిన కెరటంలా పుణె వేదికగా మరోసారి సత్తా చాటి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ నాలుగు మ్యాచ్‌లలో టీమిండియాకు ఇంగ్లండ్ గట్టి పోటీనివ్వగా.. నామమాత్రపు ఆఖరి టీ20లో మాత్రం సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.అభిషేక్ పరుగుల సునామీవాంఖడేలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మార్క్‌వుడ్ సంజూ శాంసన్(16)ను త్వరగానే పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌కు శుభారంభం అందించినా.. ఆ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. భారత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడు కనబరిచాడు.ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో పరుగుల సునామీ సృష్టించాడు. ఇతరులలో తిలక్ వర్మ(15 బంతుల్లో 24), శివం దూబే(13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.బౌలర్ల విజృంభణ ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) అర్ధ శతకం సాధించగా.. మిగతా వాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెన్ డకెట్ 0, కెప్టెన్ బట్లర్ 7, హ్యారీ బ్రూక్ 2, లియామ్ లివింగ్‌స్టోన్ 9, జాకొబ్ బెతెల్ 10, బ్రైడన్ కార్సే 3, జేమీ ఓవర్టన్ 1, జోఫ్రా ఆర్చర్ 1*, ఆదిల్ రషీద్ 6, మార్క్ వుడ్ 0 పరుగులు చేశాడు.ప్రపంచంలోనే ఏకైక జట్టుగాఫలితంగా 97 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూనే భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, శివం దూబే, అభిషేక్ శర్మచ వరుణ్ చక్రవర్తి తలా రెండు.. రవి బిష్ణోయి ఒక వికెట్ తీశాడు. దీంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. టీమిండియా చేతిలో 150 పరుగుల భారీ తేడాతో మట్టికరిచింది.కాగా టీమిండియా అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థి జట్టుపై 150 పైచిలుకు పరుగులతో విజయం సాధించడం ఇది రెండోసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. అంతేకాదు.. అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్లపై ఎక్కువసార్లు(4) గెలుపొందిన టీ20 టీమ్‌గానూ తన రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఇక వన్డేల్లోనూ బిగ్గెస్ట్ విక్టరీ సాధించిన జట్టుగా టీమిండియాకు రికార్డు ఉంది. శ్రీలంకపై 2023లో తిరువనంతపురం వేదికగా 317 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్లు(ఫుల్ మెంబర్ సైడ్)👉ఇండియా- న్యూజిలాండ్‌పై 2023లో అహ్మదాబాద్ వేదికగా 168 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఇంగ్లండ్‌పై 2025లో ముంబై వేదికగా 150 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్- వెస్టిండీస్‌పై 2018లో కరాచీ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఐర్లాండ్‌పై 2018లో డబ్లిన్ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇంగ్లండ్- వెస్టిండీస్‌పై 2019లో బెసెటెరె వేదికగా 137 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- సౌతాఫ్రికాపై 2024లో జొహన్నస్‌బర్గ్ వేదికగా 135 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య -
అంతర్జాతీయ టీ20లలో సంజూ శాంసన్ అరుదైన ఘనత
సౌతాఫ్రికా గడ్డపై శతకాలతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్ సంజూ శాంసన్(Sanju Samson).. స్వదేశంలో మాత్రం తేలిపోయాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఐదో టీ20 సందర్భంగా అతడు అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ(Rohit Sharma), యశస్వి జైస్వాల్‌తో కలిసి ఎలైట్ క్లబ్లో చేరాడు.కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సంజూ శాంసన్ రెండు అంతర్జాతీయ టీ20 శతకాలు బాదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై కూడా బ్యాట్ ఝులిపిస్తాడని ఎదురుచూసిన అభిమానులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ నిరాశపరిచాడు.ఆరంభం బాగున్నాకోల్కతాలో 26 పరుగులతో ఫర్వాలేదనిపించిన సంజూ.. ఆ తర్వాత చెన్నైలో ఐదు, రాజ్‌కోట్‌లో మూడు, పుణెలో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో సంజూ శాంసన్ అంచనాలు అందుకోలేకపోయాడు. ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయాడు.తొలి బంతికే సిక్స్ బాదిమొత్తంగా ఏడు బంతుల్లో పదహారు పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో మరో పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ సంజూ విఫలమైనప్పటికీ.. తన ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ఆరంభించడం ద్వారా అరుదైన ఫీట్ నమోదు చేశాడు.టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఓ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ బాదిన మూడో భారత క్రికెటర్‌గా సంజూ చరిత్రకెక్కాడు. అంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించారు. కాగా ఇంగ్లండ్‌తో ఐదో టీ20లొ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డీప్ స్వ్కేర్ లెగ్ మీదుగా ఫ్లాట్ సిక్స్(70 మీటర్లు) బాదాడు. ఇక తొలి ఓవర్లోనే అతడు మరో సిక్స్, ఫోర్ బాదడం విశేషం.సంజూకు భారత మాజీ క్రికెటర్ మద్దతుఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ ఇంగ్లండ్‌తో ఐదు టీ20లలో కలిపి కేవలం 51 పరుగులే చేశాడు. దీంతో అతడి నిలకడలేమి ఆట తీరుపై మరోసారి విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘టీ20 క్రికెట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు.. ముఖ్యంగా బ్యాటింగ్ టాలెంట్ కోసం చూస్తున్నట్లయితే.. వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.మ్యాచ్‌పై వారి ప్రభావం ఎలా ఉంటోంది.. జట్టు కోసం వారు ఏం చేయగలరన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంజూ శాంసన్ విషయానికొస్తే.. కఠినమైన పిచ్‌లపై అతడు అద్బుతమైన శతకాలతో జట్టును గెలిపించాడు.టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిదికాబట్టి అలాంటి వాళ్లు కొన్నిసార్లు విఫలమైనా పెద్దగా పట్టించుకోకూడదు. అయితే, దీర్ఘకాలంలో ఇదే పునరావృతమైనా కాస్త వేచిచూడాలి. టీ20 క్రికెట్ స్వభావమే అలాంటిది. దూకుడుగా ముందుకెళ్లేందుకు రిస్క్ తీసుకుంటే ఇలాంటివి తప్పవు. ఇలాంటి వాళ్లకు ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు’’ అని సంజయ్ మంజ్రేకర్ సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, ఐదో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన క్రికెటర్లురోహిత్ శర్మ- 2021లో ఇంగ్లండ్‌పై- అహ్మదాబాద్ వేదికగా ఆదిల్ రషీద్ బౌలింగ్లోయశస్వి జైస్వాల్- 2024లో జింబాబ్వేపై- హరారే వేదికగా సికందర్ రజా బౌలింగ్లోసంజూ శాంసన్- 2025లో ఇంగ్లండ్‌పై- ముంబై వేదికగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్All those fake narrative PR by Rishabh Pant against Sanju Samson that "can't play extra pace, can't play short ball, can't play Archer". Sanju silenced all those critics by his performance🥵 . 6️⃣, 6️⃣ and 4️⃣ vs Jofra Archer in the FIRST over of the match. pic.twitter.com/YmAxAqoXrw— Rosh🧢 (@ImetSanjuSamson) February 3, 2025 -
వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం(India Beat England)పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు. సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైనందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అందుకు తగ్గ ఫలితాలను మైదానంలో చూస్తున్నామంటూ సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.4-1తో కైవసంఇక ఎక్కువసార్లు తాము రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతామన్న సూర్య.. అంతిమంగా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో సిరీస్‌ను ఆరంభించిన సూర్యసేన.. చెన్నైలోనూ అదే ఫలితం పునరావృతం చేసింది.అనంతరం రాజ్‌కోట్‌లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. పుణెలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20లోనూ అద్భుత ఆట తీరు కనబరిచింది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అభిషేక్ శర్మ ఊచకోతఓపెనర్ సంజూ శాంసన్(16) మరోసారి వైఫల్యాన్ని కొనసాగించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో తిలక వర్మ(24), శివం దూబే(13 బంతుల్లో 30) మాత్రమే రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ బృందానికి టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. బెన్ డకెట్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.97 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) ఒక్కడు కాసేపు పోరాడగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. ఫలితంగా 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే రెండు, స్పిన్నర్లు వరుణ్ చక్రర్తి రెండు, అభిషేక్ శర్మ రెండు, రవి బిష్ణోయి ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.రిస్క్ అని తెలిసినాఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘‘జట్టులోని ఏ సభ్యుడైతే ఈరోజు రాణించగలడని భావిస్తానో.. అతడిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాను. నెట్స్‌లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఎప్పుడైతే వారి అవసరం ఉంటుందో అప్పుడు కచ్చితంగా రాణిస్తున్నారు.మ్యాచ్‌కు ముందు రచించిన ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కోసారి రిస్క్ అని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం.వాళ్లిద్దరు అద్భుతంఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఈరోజు అద్భుతంగా సాగింది. టాపార్డర్‌లో ఓ బ్యాటర్ ఇలా చెలరేగిపోతుంటే చూడటం ముచ్చటగా అనిపించింది. ఈ ఇన్నింగ్స్ చూసి అతడి కుటుంబం కూడా మాలాగే సంతోషంలో మునిగితేలుతూ ఉంటుంది.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అందుకు ఫలితమే ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన. అతడి వల్ల జట్టుకు అదనపు శక్తి లభిస్తోంది. అతడొక అద్భుతం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు తీశాడు.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్An impressive way to wrap up the series 🤩#TeamIndia win the 5th and final T20I by 150 runs and win the series by 4-1 👌Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX— BCCI (@BCCI) February 2, 2025 -
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపించాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం లెక్కచేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 37 బంతల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు తన హాఫ్ సెంచరీని శర్మ కేవలం 17 బంతుల్లోనే అందుకున్నాడు.ఓవరాల్‌గా 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో ఈ పంజాబీ క్రికెటర్ సత్తాచాటాడు. ఇక సెంచరీతో చెలరేగిన శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ పేరిట ఉండేది. గిల్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 126 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన అభిషేక్.. గిల్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.👉టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్దానంలో ఉన్నాడు. 2017లో శ్రీలంకపై హిట్‌మ్యాన్ కేవలం 35 బంతుల్లోనే శతకొట్టాడు.👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. తాజా మ్యాచ్‌లో 13 సిక్స్‌లు కొట్టిన అభిషేక్.. రోహిత్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.బటీ20ల్లో ఇంగ్లండ్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండేది. ఫించ్ ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం బాదిన శర్మ.. ఫించ్ రికార్డును బద్దలు కొట్టాడు.భారత్ విజయ భేరి..ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్ విజయంతో ముగించింది. ఆఖరి టీ20లో 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(135)తో పాటు.. శివమ్ దూబే(30), తిలక్ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. వుడ్ రెండు, అర్చర్,రషీద్, ఓవర్టన్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.చదవండి: తొలి కల నెరవేరింది -
అభిషేక్...అమోఘం
ఇన్నింగ్స్ తొలి బంతికే సామ్సన్ సిక్స్‌తో భారత్ ఆట ఆరంభం. మూడో ఓవర్లో బౌండరీతో అభిషేక్ ధాటి కాస్త ఆలస్యం! అంతే ఇక ఆ ఓవర్లోనే రెండు సిక్స్‌లతో పదునెక్కిన ప్రతాపం. ఆర్చర్, మార్క్ వుడ్, ఓవర్టన్ ఇలా పేసర్లు మారినా... లివింగ్‌స్టోన్, రషీద్‌లు స్పిన్నేసినా... బంతి గమ్యం, అభిషేక్ వీరవిహారం... ఈ రెండూ ఏమాత్రం మారలేదు. 13 సిక్సర్లతో ‘వాంఖెడే’కు అభిషేకం... 37 బంతుల్లోనే శతకం... 18వ ఓవర్ దాకా అతనొక్కడిదే విధ్వంసం!ఆఖరి పోరు గెలిచి ఆతిథ్య దేశం ఆధిక్యానికి గండి కొట్టేద్దామనుకుంటే ఇంగ్లండ్ కనీసం జట్టంతా కలిపి 100 పరుగులైనా కొట్టలేకపోయింది. ప్రత్యర్థి పేస్, స్పిన్ వైవిధ్యం అభిషేక్ శర్మ ధాటిని ఏ ఓవర్లోనూ, ఏ బౌలింగ్‌తోనూ అసలు ప్రభావమే చూపలేకపోయింది. ముంబై: ఏఐ... అదేనండీ అర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైపే ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. కానీ వాంఖెడే స్టేడియంలో మాత్రం మరో ఏఐ... అదే భయ్యా అభిషేక్ ఇంటలిజెంట్ బ్యాటింగ్ వైపే ఓ గంటసేపు కన్నార్పకుండా చూసేలా చేసింది. ఇది కదా ఫన్... ధన్ ధనాధన్! ఇదే కదా ఈ టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మిస్సయ్యింది. అయితేనే ఆఖరి పోరులో ఆవిష్కృతమైంది. అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) ఆమోఘ శతకం, అదేపనిగా విధ్వంసం ముంబై వాసుల్ని మురిపించింది. టీవీ, మొబైల్ యాప్‌లలో యావత్ భారత అభిమానుల్ని కేరింతలతో ముంచెత్తింది. అతని ఆటలో అయ్యో ఈ షాట్‌ను చూడటం మిస్ అయ్యామే అని బహుశా ఏ ఒక్కరికీ అనిపించి ఉండకపోవచ్చు! ఎందుకంటే ప్రతి షాట్ హైలైట్స్‌నే తలదన్నేలా ఉంది. ఆదివారం అసలైన టి20 వినోదాన్ని పంచిన చివరి టి20లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 247 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్న కాసేపు మెరిపించాడు. బ్రైడన్ కార్స్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టమైన లక్ష్యం ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్ 10.3 ఓవర్లలోనే 97 పరుగుల వద్దే ఆలౌటైంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాదిన అర్ధశతకంతో ఆ మాత్రం స్కోరు చేసింది. మిగతావారిలో జాకబ్ బెథెల్ (10; 1 సిక్స్) తప్ప అందరివి సింగిల్ డిజిట్లే! షమీ 3 వికెట్లు పడగొడితే ఒక్క ఓవర్ వేసిన అభిషేక్, దూబే, వరుణ్‌లు తలా 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 11వ ఓవర్ ముగియక ముందే స్పిన్‌తో దున్నేశారు. ఇంగ్లండ్ పాలిట సిక్సర పిడుగల్లే... మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే మ్యాచ్ అంతటిని అభిషేక్ ఒక్కడే షేక్ చేశాడు. ఐదు పదుల బంతులు (54) ఎదుర్కొంటే ఇందులో కేవలం 5 మాత్రమే డాట్ బాల్స్. అంటే పరుగు రాలేదు. కానీ మిగతా 49 బంతుల్లో ‘రన్’రంగమే... ప్రత్యర్థి బౌలర్లేమో లబో... దిబో! ఇది అభిషేక్ సాగించిన విధ్వంసం. 17 బంతుల్లోనే అతను సాధించిన ఫిఫ్టీ భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్ధశతకమైంది. అంతేనా... పవర్ ప్లే (6 ఓవర్లు)లో జట్టు స్కోరు 95/1 ఇది భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లోనే అత్యధిక స్కోరైంది. ఆ తర్వాత 37 బంతుల్లోనే దంచేసిన మెరుపు శతకం శాశ్వత దేశాల మధ్య రెండో వేగవంతమైన సెంచరీగా పుటలకెక్కింది. 2017లో మిల్లర్ (దక్షిణాఫ్రికా) బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో శతక్కొట్టాడు. 3.5 ఓవర్లో 50 పరుగులు దాటిన భారత్ స్కోరు అతనొక్కడి జోరుతో 6.3 ఓవర్లోనే వందకు చేరింది. భారత్ 12వ ఓవర్లో 150, 16వ ఓవర్లో 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. మిగతావారిలో శివమ్ దూబే కాస్త మెరిపించాడు. అయితే దూబే (2–0–11–2) బౌలింగ్ స్పెల్‌తో గత మ్యాచ్ ‘కన్కషన్’ విమర్శలకు తాజా మ్యాచ్‌లో బంతితో సమాధానమిచ్చాడు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 16; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 135; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) కార్స్ 24; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; దూబే (సి) రషీద్ (బి) కార్స్ 30; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 9; రింకూసింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; అక్షర్ రనౌట్ 15; షమీ నాటౌట్ 0; రవి బిష్ణోయ్ (సి) కార్స్ (బి) ఓవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–21, 2–136, 3–145, 4–182, 5–193, 6–202, 7–237, 8–247, 9–247. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–55–1, మార్క్‌వుడ్ 4–0–32–2, ఓవర్టన్ 3–0–48–1, లివింగ్‌స్టోన్ 2–0–29–0, అదిల్ రషీద్ 3–0–41–1, బ్రైడన్ కార్స్ 4–0–38–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సబ్–జురేల్ (బి) దూబే 55; డకెట్ (సి) అభిషేక్ (బి) షమీ 0; బట్లర్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 7; హ్యారీ బ్రూక్ (సి) వరుణ్ (బి) రవి బిష్ణోయ్ 2; లివింగ్‌స్టోన్ (సి) రింకూ (బి) వరుణ్ 9; జాకబ్ (బి) దూబే 10; కార్స్ (సి) వరుణ్ (బి) అభిషేక్ 3; ఓవర్టన్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ 1; ఆర్చర్ నాటౌట్ 1; రషీద్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 6; మార్క్‌వుడ్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (10.3 ఓవర్లలో ఆలౌట్) 97. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–59, 4–68, 5–82, 6–87, 7–90, 8–90, 9–97, 10–97. బౌలింగ్: షమీ 2.3–0–25–3, హార్దిక్ పాండ్యా 2–0–23–0, వరుణ్ 2–0–25–2, రవి బిష్ణోయ్ 1–0–9–1, శివమ్ దూబే 2–0–11–2, అభిషేక్ 1–0–3–2. ఆహా... ఆదివారంభారత క్రీడాభిమానులకు ఆదివారం పండుగలా గడిచింది. మధ్యాహ్నం కౌలాలంపూర్‌లో భారత అమ్మాయిల జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష చిరస్మరణీయ ఆటతీరుతో అదరగొట్టింది. భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలువడంలో కీలకపాత్ర పోషించింది. రాత్రి ఇటు ముంబైలో భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌పై వీరంగం సృష్టించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టి20ల్లో రెండోసారి ‘శత’క్కొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ అందుకున్న అభిషేక్ అమోఘమైన ఆటతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (135) చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్; న్యూజిలాండ్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు. 2 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన సెంచరీ (37 బంతుల్లో) చేసిన రెండో ఆటగాడు అభిషేక్. రోహిత్ శర్మ (35 బంతుల్లో; శ్రీలంకపై) అగ్రస్థానంలో ఉన్నాడు. 13 ఈ మ్యాచ్‌లో అభిషేక్ కొట్టిన సిక్స్‌లు. భారత్ తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. రోహిత్ (10 సిక్స్‌లు; శ్రీలంకపై), సామ్సన్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై), తిలక్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై) రెండో స్థానాల్లో ఉన్నారు. -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి హర్షిత్ రాణా వస్తాడు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ అరంగేట్రంలోనే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy)నూ హర్షిత్ ఆడవచ్చని అంచనా వేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్ రాణా.. గతేడాది ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. నాడు కోల్‌కతా మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్షిత్‌కు జాతీయజట్టులో త్వరగానే అవకాశం వచ్చింది.ఆసీస్‌లో అరంగేట్రంఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పెర్త్ టెస్టులో నాలుగు వికెట్లతో మెరిశాడు. అయితే, అంతకంటే ముందే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు.కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చికానీ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి మూడు వికెట్లు కూల్చాడు. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్(9)తో పాటు జాకొబ్ బెతల్(6) రూపంలో కీలక వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్ జేమీ ఓవర్టన్(19)ను కూడా అవుట్ చేశాడు.‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ వివాదం సంగతి పక్కనపెడితే... కీలక సమయంలో కీలక వికెట్లు తీయడం ద్వారా టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన హర్షిత్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు‘‘హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఒకవేళ బుమ్రా గనుక ఫిట్‌గా లేకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయం. పేస్‌లో వైవిధ్యం చూపడంతో పాటు.. మూడు వికెట్లు తీసిన తీరు ఆకట్టుకుంది’’ అని కమ్రన్ అక్మల్ పేర్కొన్నాడు.అదే విధంగా స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి మాట్లాడుతూ.. ‘‘రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నారు. వీరిద్దరు గనుక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే టీమిండియా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా ఉండేది’’ అని కమ్రన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.మరోవైపు.. పాకిస్తాన్ మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం రవి బిష్ణోయి ప్రదర్శనను ప్రశంసించాడు. వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్న తీరు ఎంతో బాగుందని కొనియాడాడు. గత మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని నాలుగో టీ20లో రాణించాడని పేర్కొన్నాడు.బుమ్రాకు వెన్నునొప్పికాగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌లో అతడికి ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు.అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం బుమ్రాకు ఫిట్నెస్ ఆధారంగా చోటిచ్చారు. ఒకవేళ టోర్నీ నాటికి బుమ్రా పూర్తి ఫిట్‌గా లేకుంటే.. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు చాన్స్ ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, కమ్రన్ అక్మల్ మాత్రం హర్షిత్ రాణా పేరును తెరమీదకు తెచ్చాడు.టీ20 సిరీస్ మనదేఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో మాత్రం విఫలమైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో టీ20లో జయకేతనం ఎగురవేసి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరుగుతుంది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
‘ఐదో టీ20లో తప్పక ఆడిస్తాం.. అతడి రాకతో జట్టులో జోష్’
దాదాపు ఏడాది తర్వాత టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami). ఇంగ్లండ్‌తో మూడో టీ20(India vs England) సందర్భంగా భారత తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, మంగళవారం నాటి(జనవరి 28) ఈ మ్యాచ్‌లో షమీ కొత్త బంతితో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా రాజ్‌కోట్ టీ20లో మూడు ఓవర్లకే పరిమితమైన షమీ.. మొత్తంగా 25 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో అతడికి ఆడే అవకాశం రాలేదు. షమీపై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)ను మళ్లీ వెనక్కి పిలిపించింది.తుది జట్టులోకి వస్తాడా? లేదా? ఈ నేపథ్యంలో షమీ మళ్లీ తుది జట్టులోకి వస్తాడా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో షమీని ఆడిస్తామనే సంకేతాలు ఇచ్చాడు. నాలుగో టీ20 జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షమీ బాగానే ఉన్నాడు.అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. వార్మప్ మ్యాచ్‌లలోనూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం రావచ్చు. అయితే, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.భారత క్రికెట్‌కు కొత్త జోష్ఏదేమైనా.. అతడు తిరిగి టీమిండియాలోకి రావడం బౌలింగ్ విభాగానికి సానుకూలాంశం. ఎంతో అనుభవజ్ఞుడు. తన అనుభవాలను యువ బౌలర్లతో పంచుకుంటున్నాడు. బౌలర్‌గా తన జ్ఞానాన్ని వాళ్లకూ పంచుతున్నాడు. షమీ రాకతో భారత క్రికెట్‌కు కొత్త జోష్ వచ్చింది. షమీ నుంచి గొప్ప ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాం’’ అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చీలమండ గాయానికి సర్జరీకాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ తర్వాత షమీ జాతీయ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండ గాయం వేధిస్తున్నా ఐసీసీ టోర్నీలో మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తర్వాతే సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. కోలుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది.అనంతరం.. బెంగాల్ తరఫున రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న షమీని.. బీసీసీఐ ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసింది. అదే విధంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ చోటిచ్చింది. ఐదో టీ20లో ఆడటం పక్కా!అయితే, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్పిన్నర్లకు పెద్ద పీట వేసిన యాజమాన్యం.. ఒకే ఒక్క స్పెషలిస్టు పేసర్‌తో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌పై నమ్మకం ఉంచిన యాజమాన్యం షమీకి ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో పదిహేను పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. అంతకు ముందు కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్‌సేన.. తాజా విజయంతో 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20 జరుగుతుంది. ఇప్పటికే భారత్ సిరీస్ గెలిచింది కాబట్టి.. అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతినిచ్చి.. షమీని ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)లో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. శివం దూబే(Shivam Dube)కు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా.. హర్షిత్ రాణా(Harshit Rana)ను పంపడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం ద్వారా పుణె మ్యాచ్‌లో భారత జట్టు పన్నెండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్లు అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుణెలో శుక్రవారం నాలుగో టీ20 జరిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ విషయంలో కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ సంజూ శాంసన్(1), వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ(0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0)లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు.దూబే, హార్దిక్ అదరగొట్టారుఈ క్రమంలో అభిషేక్ శర్మ(29) కాసేపు క్రీజులో నిలబడగా.. రింకూ సింగ్(30) ఫర్వాలేదనిపించాడు. అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా రాకతో సీన్ మారింది. దూబే 34 బంతుల్లో 53 పరుగులతో దంచికొట్టగా.. పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులతో దుమ్ములేపాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.హర్షిత్ రాణా రాకతో..అయితే, ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో దూబే హెల్మెట్‌కు బంతి బలంగా తాకగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు. తాను బాగానే ఉన్నానని చెప్పిన దూబే.. బ్యాటింగ్‌ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత అతడు ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన రెండు ఓవర్ల తర్వాత హర్షిత్ రాణాను మేనేజ్మెంట్ మైదానంలోకి పంపింది.ఈ క్రమంలో తన టీ20 అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్(3/33)తో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆల్‌రౌండర్ దూబే స్థానంలో స్పెషలిస్టు ఫాస్ట్బౌలర్ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా పంపడం విమర్శలకు దారితీసింది.నిబంధనలకు విరుద్ధంఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ స్థానంలో బౌలర్.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్(like-for-like replacement) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రావాలి. రూల్ బుక్‌లో ఇది స్పష్టంగా రాసి ఉంది.ఉదాహరణకు.. బెక్ డకెట్ తలకు గాయమైతే.. ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలోమరో బ్యాటర్‌నే పంపాలి. కానీ బౌలర్‌ను పంపకూడదు. ఎందుకంటే.. అతడు బౌలింగ్ చేయలేడు .ఒకవేళ బౌలర్ గాయపడితే అతడి స్థానంలో మరో బౌలర్‌నే పంపాలి. కానీ.. ఇక్కడ శివం దూబేకు 20 ఓవర్లో తలకు గాయమైనప్పుడు.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను రప్పించారు. హర్షిత్‌కు బదులు మహ్మద్ షమీని రప్పించవచ్చు కదా.12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాంఎందుకంటే.. హర్షిత్ రాణా నైపుణ్యాలకు.. శివం దూబే స్కిల్స్‌కు పోలికే లేదు. దూబే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు గంటకు 115- 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేస్తాడు. కానీ.. హర్షిత్ రాణా పూర్తిస్థాయి ఫాస్ట్ బౌలర్. గంటకు 140 -145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఎవరు ఏమన్నా ఇదే వాస్తవం.ఈరోజు శివం దూబే 53 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి.. కీలక వికెట్లు తీశాడు. ఇండియా గెలిచింది. నిజానికి ఈరోజు మనం 12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం. రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందిదూబే బ్యాటింగ్ చేశాడు.. హర్షిత్ బౌలింగ్ చేశాడు’’ అని ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దూబేకు కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రమణ్‌దీప్ సింగ్‌ను పంపాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పదిహేను పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు -
చరిత్ర సృష్టించిన సకీబ్ మహమూద్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
పూణే వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటకి ఆ జట్టు పేసర్ సకీబ్ మహమూద్ మాత్రం నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు.రెండో ఓవర్ వేసిన మహమూద్.. తొలి బంతికే సంజు శాంసన్ (1) వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మను గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సకీబ్ బోల్తా కొట్టించాడు.ఆ ఓవర్‌ను మూడు వికెట్లతో పాటు మెయిడిన్‌గా సకీబ్ ముగించాడు. ఈ క్రమంలో మహమూద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సకీబ్ సాధించిన రికార్డులు ఇవే..👉టీ20ల్లో భారత్‌పై ట్రిపుల్ వికెట్ మెయిడెన్ తొలి బౌలర్‌గా సకీబ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌గా కూడా ఈ ఘనత సాధించలేదు. అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీష్ బౌలర్ కూడా సకీబ్ కావడం గమనార్హం. ఇంతవరకు ఏ ఇంగ్లీష్ బౌలర్ కూడా ఇతర జట్లపై కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేసిన బౌలర్‌గా వెస్టిండీస్ మాజీ పేసర్ జెరోమ్ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. 2007లో గ్కెబెర్హాలో దక్షిణాఫ్రికాపై రెండో ఓవర్లోనే జెరోమ్ టేలర్ ఈ ఫీట్ సాధించాడు.రాణించిన దూబే, హార్దిక్..కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో మహమూద్తో పాటు ఓవర్టన్ రెండు,రషీద్, కార్స్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు సాధించారు.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్ -
వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు: సూర్య
భారత క్రికెట్ జట్టు మరో టీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై 15 పరుగుల తేడాతో టీమిండియా(Teamindia) విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో మెరిసినప్పటకి ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే, హార్దిక్ పాండ్యాలపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. అదేవిధంగా మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు మద్దతు అద్భుతంగా ఉంది. మా విజయాలు వెనక వారి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. 10 వికెట్లకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో మేము వెనకంజ వేయాలని అనుకోలేదు. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలో మా కుర్రాళ్లకు బాగా తెలుసు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడం గట్టి ఎదురు దెబ్బే. నేను అస్సలు ఊహించలేదు. కానీ అక్కడ నుంచి మా బ్యాటర్లు ఆడిన విధానం నిజంగా అద్భుతం. హార్దిక్ పాండ్యా, దూబే ఆసాధరణ బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ తమ అనుభవాన్ని చూపించారు. మేం ఎప్పుడూ మాట్లాడేది ఇదే. నెట్స్‌లో ఎలా ఆడుతారో, మ్యాచ్‌లో ఆలానే స్వేఛ్చగా ఆడాలని మా బాయ్స్‌కు చెబుతాం. మా ఆటగాళ్లు నెట్ సెషన్లలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు నెట్ ప్రాక్టీస్‌లో ఆడినట్లే గేమ్‌లో కూడా ఆడుతున్నారు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము సరైన దిశలోనే పయనిస్తున్నామని నేను భావిస్తున్నాను. పవర్ ప్లే తర్వాత(7 -10 ఓవర్ల మధ్య) పరుగులు సాధించడం అంత ఈజీ కాదు. ఇంగ్లండ్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడినప్పటికి.. తర్వాత మేము కొన్ని వికెట్లు తీసి గేమ్‌ని మా నియంత్రణలోకి తీసుకున్నాము. దురదృష్టవశాత్తు శివమ్ దూబే ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. హర్షిత్ రాణా మూడువ సీమర్‌గా బరిలోకి దిగాడు. అతడు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముంబైలో జరిగే ఆఖరి టీ20లో కూడా మేము దుమ్ములేపుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు.. గేమ్నే మార్చేశాడు! రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
నాలుగో టీ20లో ఇంగ్లండ్ పై భారత్ విజయం
-
పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం
టాప్–ఫోర్ పరుగుల్లో వెనుకబడినా... ఓ దశలో జట్టు స్కోరు(12/3) గుబులు రేపినా... మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల మెరుపులతో భారత్ మ్యాచ్ గెలిచి టి20 సిరీస్ కైవసం చేసుకుంది. వరుణ్ మాయాజాలం మలుపుతిప్పగా... రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాల బౌలింగ్ భారత్ నాలుగో టి20లో గెలిచేలా చేసింది. పుణే: సమం కాదు... సొంతమే! సిరీస్‌ను ఆఖరి సమరం దాకా లాక్కెళ్ల కుండా భారత్ నాలుగో టి20లోనే తేల్చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 15 పరుగులతో ఇంగ్లండ్‌పై గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. ఇంగ్లండ్ బౌలర్ సకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగుల వద్ద ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డకెట్ (19 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపూ దంచేశారు. అయితే గత మ్యాచ్ మాదిరి వరుణ్ చక్రవర్తి (2/28) స్పిన్ మలుపు మరుగున పడకుండా... దూబే స్థానంలో ‘కన్కషన్’గా వచ్చిన హర్షిత్ రాణా (3/33), రవి బిష్ణోయ్ (3/28) పేస్–స్పిన్‌ల వైవిధ్యం ఇంగ్లండ్‌ను లక్ష్యానికి దూరం చేసింది. దూబే, పాండ్యా ఫిఫ్టీ–ఫిఫ్టీ సంజూ సామ్సన్ (1), తిలక్‌వర్మ (0), కెపె్టన్ సూర్యకుమార్ (0)ల వైఫల్యంతో భారత్ 12/3 స్కోరు వద్ద కష్టాల్లోపడింది. అభిõÙక్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్)ల జోరు ఎంతోసేపు సాగలేదు. ఈ దశలో దూబే, పాండ్యా ఆరో వికెట్‌కు వేగంగా 87 పరుగులు జోడించారు.27 బంతుల్లో హార్దిక్, 31 బంతుల్లో దూబే అర్ధసెంచరీలు సాధించారు. దీంతో భారత్ పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగింది. మరోవైపు డకెట్, సాల్ట్ (23; 4 ఫోర్లు)లు ధాటిగా ఛేదన ఆరంభించారు. ఇంగ్లండ్ స్కోరు 62కు చేరగానే డకెట్, కాసేపటికే సాల్ట్, బట్లర్ (2)... వందకు చేరే క్రమంలో లివింగ్‌స్టోన్ (9) అవుటయ్యారు. అయినా 14 ఓవర్లలో 124/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ పటిష్టంగానే కనిపించింది. ఈ దశలో 15వ ఓవర్ వేసిన వరుణ్ క్రీజులో పాతుకుపోయిన బ్రూక్‌తో పాటు బ్రైడన్ కార్స్ (0)లను అవుట్ చేయడంతో 30 బంతుల్లో 49 పరుగుల సమీకరణం విజయానికి ఊపిరిపోసింది. బిష్ణోయ్, రాణాలు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) సకిబ్ 1; అభిషేక్ (సి) జాకబ్ (బి) రషీద్ 29; తిలక్ (సి) ఆర్చర్ (బి) సకిబ్ 0; సూర్యకుమార్ (సి) కార్స్ (బి) సకిబ్ 0; రింకూసింగ్ (సి) రషీద్ (బి) కార్స్ 30; దూబే రనౌట్ 53; పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 53; అక్షర్ (సి) జాకబ్ (బి) ఓవర్టన్ 5; అర్ష్ దీప్ రనౌట్ 0; రవిబిష్ణోయ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–12, 4–57, 5–79, 6–166, 7–180, 8–180, 9–181. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–0, సకిబ్ 4–1–35–3, బ్రైడన్ కార్స్ 4–0–39–1, ఓవర్టన్ 4–0–32–2, అదిల్ రషీద్ 4–0–35–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 23; డకెట్ (సి) సూర్యకుమార్ (బి) బిష్ణోయ్ 39; బట్లర్ (సి) రాణా (బి) బిష్ణోయ్ 2; బ్రూక్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 51; లివింగ్‌స్టోన్ (సి) సామ్సన్ (బి) రాణా 9; జాకబ్ (సి) సూర్యకుమార్ (బి) రాణా 6; కార్స్ (సి) అర్ష్ దీప్ (బి) వరుణ్ 0; ఓవర్టన్ (బి) రాణా 19; ఆర్చర్ (బి) బిష్ణోయ్ 0; రషీద్ నాటౌట్ 10; సకిబ్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–62, 2–65, 3–67, 4–95, 5–129, 6–133, 7–137, 8–146, 9–163, 10–166. బౌలింగ్: అర్ష్ దీప్‌సింగ్ 3.4–0–35–1, హార్దిక్ పాండ్యా 1–0–11–0, వరుణ్ చక్రవర్తి 4–0–28–2, అక్షర్ పటేల్ 3–0–26–1, రవి బిష్ణోయ్ 4–0–28–3, హర్షిత్ రాణా 4–0–33–3. -
గంభీర్ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్ కోచ్
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై వచ్చిన విమర్శలపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే(Ryan Ten Doeschate) స్పందించాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) వ్యూహాలకు అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఇక ముందు కూడా ప్రయోగాలు కొనసాగిస్తామని పేర్కొన్నాడు.కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్(India vs England)తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఇరుజట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి.బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూకోల్కతా, చెన్నైలలో వరుస విజయాలు సాధించిన.. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం పరాజయం పాలైంది. తద్వారా ఇంగ్లండ్‌పై సూర్య సేన ఆధిక్యం 2-1కు తగ్గింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు.స్పెషలిస్టు బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో ఆడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని కాదని.. కేవలం లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్‌లను ముందుగా బ్యాటింగ్‌కు పంపడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో జురెల్ రెండు పరుగులకే పరిమితం కాగా.. వాషింగ్టన్ సుందర్ 6, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు.మిగతా వాళ్లు కూడా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో 145 పరుగుల వద్ద నిలిచి.. 26 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వచ్చాయి. మా వ్యూహాల్లో భాగమే..ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందిస్తూ.. ‘‘ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారని మీరు వాదించవచ్చు. అయితే, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ముఖ్యంగా టీ20 క్రికెట్లో గౌతం గంభీర్ బ్లూప్రింట్ ఎలా ఉందో ఓ సారి గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది.ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండేలా అతడు సెట్ చేస్తాడు. ఇక ధ్రువ్ ఎనిమిదో స్థానంలో వచ్చినపుడు అతడి అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని నేను అనుకోలేదు. ఏదేమైనా అతడిని అలా లోయర్ ఆర్డర్లో పంపించడం మా వ్యూహాల్లో భాగమే.వీలైనన్ని అవకాశాలు ఇస్తాంఫలితం ఎలా ఉన్నా... మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాం. సుదీర్ఘకాలంలో జట్టు ప్రయోజనాల దృష్ట్యా వారికి వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. తప్పక తమను తాము నిరూపించుకుని. తమ విలువేంటో చాటుకుంటారు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాలుగో టీ20 జరుగనుంది. పుణె ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌లను తప్పించి..వారి స్థానంలో శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లను ఆడించాలని సూచించాడు. చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్‌ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్‌రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
Ind vs Eng: టీమిండియాకు శుభవార్త!.. పాపం అతడిపై వేటు!
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India Vs England)కి ముందు టీమిండియాకు శుభవార్త! నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) పూర్తి ఫిట్నెస్ సాధించాడు. పుణె మ్యాచ్‌లో ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ధ్రువీకరించాడు.భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి మూడు పూర్తి చేసుకుంది. కోల్‌కతా, చెన్నై టీ20లలో గెలిచిన టీమిండియా.. రాజ్‌కోట్(Rajkot T20I)లో మాత్రం విఫలమైంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌పై ఆధిక్యం 2-1కు తగ్గింది.వెన్ను నొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు మాత్రం దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడు ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది.జురెల్‌పై వేటు పడే అవకాశంఈ విషయం గురించి కోచ్ డష్కాటే మాట్లాడుతూ.. అతడు బుధవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. ఒకవేళ రింకూ తిరిగి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. అయితే, అతడు వస్తే ధ్రువ్ జురెల్‌పై వేటు పడే అవకాశం ఉంది.మూడో టీ20లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన జురెల్.. ఒత్తిడిలో చిత్తైపోయాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. నిజానికి బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకాస్త ముందు వస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్‌లను ఆరు, ఏడు స్థానాల్లో పంపడంతో జురెల్‌కు దెబ్బ పడింది.రింకూ లేదంటే.. ఆ ఇద్దరిలో ఒకరు?ఇక రింకూకు కోల్‌కతా టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. గతేడాది కూడా అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. పద్దెనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 245 పరుగులే చేశాడు. అయితే, 2023లో మాత్రం 12 మ్యాచ్‌లలోనే 262 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతారా? లేదంటే.. శివం దూబే, రమణ్‌దీప్ సింగ్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా శుక్రవారం పుణె వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉండగా.. 2-2తో సమం చేయాలని బట్లర్ బృందం భావిస్తోంది. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన ఐదో టీ20 జరుగుతుంది.ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టు(అప్డేటెడ్)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివం దూబే, రమణ్‌దీప్ సింగ్.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్‌తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్‌లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్‌ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్‌లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సంజూ- జురెల్‌లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్‌లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్‌తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే!: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా టీ20లో మూడు బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.తీరు మార్చుకోని సూర్యఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ సూర్య నిరాశపరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ ‘మిస్టర్ 360’.. మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ 12 పరుగుల వద్ద పేసర్ బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తాజాగా రాజ్‌కోట్(Rajokot T20I) వేదికగా సాగిన మూడో టీ20లోనూ సూర్య విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందడంతో సూర్య వైఫల్యంపై పెద్దగా చర్చ జరుగలేదు. ఆ రెండు టీ20లలో బౌలర్లతో పాటు.. వరుసగా అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79), తిలక్ వర్మ(55 బంతుల్లో 72*) బ్యాట్‌తో రాణించడంతో భారత్ గెలుపొందింది.అయితే, మూడో టీ20లో బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగాబ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, సూర్య వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే‘‘ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడాలని భావిస్తే.. అందుకు సరైన బంతిని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. అలా కాకుండా ఏ బంతికైనా అగ్రెసివ్‌గానే ఉంటానంటే కుదరదు. ప్రతి బాల్‌ను బౌండరీకి తరలించడం కుదరదు కదా!..టీమిండియా ఈ స్థాయిలో ఉందంటే.. అందుకు వారి అత్యుత్తమ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటమే కారణం. అందుకే వాళ్లు వరల్డ్ చాంపియన్స్ అయ్యారు. కానీ.. పదే పదే ఒకే తరహా తప్పులు చేస్తే ఎలా? సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.. రెండు మంచి షాట్లు ఆడాడు. అంతే.. కన్నుమూసి తెరిచేలోగా మళ్లీ డగౌట్‌కు చేరుకున్నాడు. జట్టు గెలుపునకు అతడు తన వంతు సహకారం అందించనేలేదు’’ అని మైకేల్ వాన్ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా రాజ్‌కోట్‌లో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 48-2 ఉన్న సమయంలో సూర్య క్రీజులోకి వచ్చాడు. రాగానే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు షాట్లు బాదిన సూర్య.. మార్క్ వుడ్ బౌలింగ్‌లోనూ తన ట్రేడ్‌మార్క్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయగా.. బట్లర్ బృందం 171 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో సూర్యసేన 145 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఇంగ్లండ్ చేతిలొ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదుమ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం ప్రస్తుతానికి 2-1కి తగ్గింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి ‘చెత్త రికార్డు’
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.కెరీర్లోనే అత్యుత్తమంగాస్వభావసిద్ధంగా ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.అయితే, రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.కానీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.దురదృష్టం వెంటాడిందిసౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.చెత్త ‘వరల్డ్’ రికార్డుతద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మెరుగ్గా ఆడేందుకుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.బ్యాటర్ల కారణంగానేకాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాజ్‌కోట్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్ -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్‌కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య
ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజయంతో సిరీస్ గెలవాలని భావించిన టీమిండియాకు చుక్కెదురైంది. రాజ్‌కోట్ టీ20లో సూర్యకుమార్ సేన ప్రత్యర్థి చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీనిరంజన్ షా స్టేడియంలో మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఆదిలోనే హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(5) వికెట్ తీసి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ బెన్ డకెట్(Ben Ducket) ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు.మెరుపు అర్ధ శతకం బాది మెరుగైన స్కోరుకు బాటలు వేశాడు. డకెట్.. 28 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ జోస్ బట్లర్(24) కూడా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించగా వరుణ్ చక్రవర్తి అతడిని బోల్తా కొట్టించాడు.లివింగ్‌స్టోన్ ధనాధన్మిగతా వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone- 24 బంతుల్లో 43 రన్స్) దంచికొట్టగా.. ఆదిల్ రషీద్(10), మార్క్ వుడ్(10) డబుల్ డిజిట్ స్కోర్లతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయి, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.టీమిండియా తడ‘బ్యాటు’ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. ఓపెనర్లలో సంజూ శాంసన్(3) మరోసారి నిరాశపరచగా.. అభిషేక్ శర్మ(14 బంతుల్లో 24) కాసేపు మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14) మరోసారి విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్(6), ధ్రువ్ జురెల్(2) చేతులెత్తేశారు.ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40) మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(15)తో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఇక టెయిలెండర్లలో మహ్మద్ షమీ 7 పరుగులు చేయగా.. రవి బిష్ణోయి 4, వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా ఉన్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి ఎదురైందని విచారం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్ సాగేకొద్దీ మంచు ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ మా చేతుల్లో ఉందనుకున్నా.అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్కానీ ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతడిని వరల్డ్‌క్లాస్ బౌలర్ అంటారు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పిన్నర్లు అవసరం ఎంతగా ఉంటుందో మాకు తెలుసు. అందుకే మా జట్టులో వారే ఎక్కువగా ఉన్నారు.ప్రతి టీ20 మ్యాచ్ నుంచి మేము సరికొత్త పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈసారి బ్యాటింగ్ పరంగా మా పొరపాట్లు ఏమిటో గుర్తించగలిగాం. ఇక షమీ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు సాధిస్తున్న ఫలితాలే.. అతడి క్రమశిక్షణ, కఠిన శ్రమకు నిదర్శనం. మైదానం లోపలా.. వెలుపలా ఆట పట్ల అతడి అంకితభావం ఒకేలా ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కీలకమైన ఇన్ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మ(18) వికెట్ తీసి.. టీమిండియా ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో జేమీ ఓవర్టన్ మూడు, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్‌వుడ్ ఒక వికెట్ తీశాడు. ఇక తన అద్భుత ప్రదర్శన(5/24)కు గానూ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా -
మూడో టీ20లో భారత్ పై 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం


