 
													Australia vs India, 2nd T20I Melbourne Updates And Highlights: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఆసీస్ చేధించింది.
ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్( 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) టాప్ స్కోరర్‌గా నిలవగా .. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
బుమ్ బుమ్ బుమ్రా..
ఆస్ట్రేలియా ఆఖరిలో రెండు వికెట్లు కోల్పోయింది. తమ విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో బుమ్రా వరుస బంతుల్లో ఓవెన్, షార్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. 
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
8.4: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (2 బంతుల్లో 1). ఆసీస్ స్కోరు: 90-3(8.4). ఇంగ్లిస్ 5 పరుగులతో ఉన్నాడు. విజయానికి 68 బంతుల్లో 36 పరుగుల దూరంలో ఆసీస్. ఏడు వికెట్ల దూరంలో టీమిండియా.
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్ష్ (26 బంతుల్లో 46) అవుట్. ఆసీస్ స్కోరు: 87-2(8). విజయానికి 72 బంతుల్లో 39 పరుగులు అవసరం. ఇంగ్లిస్ 3 పరుగులతో ఉన్నాడు. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
4.3: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి హెడ్ (15 బంతుల్లో 28) అవుట్. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోగా.. మార్ష్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 51-1(4.3). విజయానికి 93 బంతుల్లో 75 పరుగులు అవసరం.
నాలుగు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 49-0(4)
ట్రావిస్ హెడ్ 27, మార్ష్ 12 పరుగులతో క్రీజులోకి ఉన్నారు.
పదో వికెట్‌గా బుమ్రా
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (37 బంతుల్లో 68) రాణించగా.. పేసర్ హర్షిత్ రాణా (33 బంతుల్లో 35) అతడికి సహకారం అందించాడు. దీంతో భారత జట్టు కాస్త పరువు నిలుపుకోగలిగింది. 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టొయినిస్‌కు ఒక వికెట్ దక్కింది. భారత బ్యాటర్లలో గిల్ (5), సంజూ శాంసన్ (1), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7), శివం దూబే (4), కుల్దీప్ యాదవ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. బుమ్రా రనౌట్ కావడంతో భారత్ పదో వికెట్ కోల్పోయింది.
తొమ్మిదో వికెట్ డౌన్
18.3: హాఫ్ సెంచరీ వీరుడు అభిషేక్ శర్మ (68)రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ LBW అయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 125-9(18.3) 
ఫోర్, సిక్సర్‌తో చెలరేగిన అభిషేక్
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 18వ ఓవర్లో అభిషేక్ ఫోర్, సిక్సర్ బాదాడు. అభిషేక్ 34 బంతుల్లో 68 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఎనిమిదో వికెట్ డౌన్
కుల్దీప్ యాదవ్ (0) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో అబాట్ (సబ్‌స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోరు: 110-8(17). అభిషేక్ శర్మ 53 పరుగులతో ఉండగా.. వరుణ్ చక్రవర్తి క్రీజులోకి వచ్చాడు.
శివం దూబే అవుట్
బార్ట్‌లెట్ బౌలింగ్‌లో శివం దూబే (4)ఇచ్చిన క్యాచ్‌ను జోష్ ఇంగ్లిస్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోరు: 109-7(15.4). కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
15.2:బార్ట్‌లెట్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా హర్షిత్ రాణా వెనుదిరిగాడు. రాణా 33 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు రాబట్టాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు.
15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 105-5
హర్షిత్ రాణా 31 బంతుల్లో 35, అభిషేక్ 27 బంతుల్లో 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ..
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుస క్రమంలో వికెట్లుకోల్పోయినప్పటికి అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
టీమిండియా ఐదో వికెట్ డౌన్..
అక్షర్ పటేల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి హర్షిత్ రాణా వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(37),రాణా(4) ఉన్నారు.
పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 40-4.
అక్షర్ 3, అభిషేక్ శర్మ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్
4.5: తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్లో రెండు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వెనుదిరగగా.. అతడి స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. టీమిండియా స్కోరు: 32-4(4.5). అభిషేక్ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
మూడో వికెట్ డౌన్
4.3: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య వెనుదిరిగాడు. అంతకు ముందే క్యాచ్ డ్రాప్ రూపంలో తనకు వచ్చిన లైఫ్‌ను సూర్య సద్వినియోగం చేసుకోలేక ఒక్క పరుగే చేసి నిష్క్రమించాడు. సూర్య స్థానంలో తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. అభిషేక్ 24 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 32-3(4.4)
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
3.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన సంజూ శాంసన్(2). ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో ఆడించిన సంజూను వన్‌డౌన్‌లో పంపిస్తూ మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. భారత్ స్కోరు: 23-2(3.3). అభిషేక్ 16 పరుగులతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు.
Nathan Ellis got off to a rapid start, dismissing Sanju Samson for just two. #AUSvIND pic.twitter.com/lY4FAlbzDI
— cricket.com.au (@cricketcomau) October 31, 2025
తొలి వికెట్ కోల్పోయిన భారత్
2.4: హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. పది బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. సంజూ శాంసన్ వన్‌డౌన్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 22-1(2.5). అభిషేక్ 15, సంజూ రెండు పరుగులతో ఉన్నారు.
రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0
అభిషేక్ శర్మ నాలుగు బంతుల్లో 14, శుబ్‌మన్ గిల్ 8 బంతుల్లో 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్‌ను హాజిల్‌వుడ్ కట్టుదిట్టంగా వేయడంతో టీమిండియాకు ఒక్క పరుగే వచ్చింది. తొలి బంతికే గిల్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా.. రివ్యూలో అనుకూల ఫలితం వచ్చింది. దీంతో టీమిండియా రివ్యూ నిలుపుకోగలిగింది.
టాస్ గెలిచిన ఆసీస్
టీమిండియాతో రెండో టీ20లో ఆస్ట్రేలియా (IND vs AUS) టాస్ గెలిచింది.  మెల్‌బోర్న్ వేదికగా తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh).. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా మార్ష్  అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టాస్ గెలవడం ఇది పందొమ్మిదోసారి. ప్రతిసారీ అతడు లక్ష్య ఛేదననే ఎంచుకోవడం విశేషం.
ఒక మార్పుతో బరిలోకి
టాస్ సందర్భంగా మార్ష్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయించుకున్నాం. వికెట్ బాగుంది. 40 ఓవర్లపాటు పిచ్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం. మా తుదిజట్టులో ఒక మార్పు చేశాము. జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చాడు’’ అని తెలిపాడు.
అదే జట్టుతో భారత్
ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని చెప్పాడు. తొలి టీ20కి ఎంచుకున్న జట్టుతోనే తాము మెల్‌బోర్న్‌లో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.
కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో 2-1తో ఆసీస్ గెలుపొందగా.. టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భారత్ పట్టుదలగా ఉంది.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం కాన్‌బెర్రాలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అయితే, వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20 తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
