suryakumar yadav
-
మళ్లీ ఫెయిలైన సూర్యకుమార్.. ఇప్పట్లో రీఎంట్రీ కష్టమే!
భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బ్యాటింగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఫార్మాట్ మారినా అతడి ఆట తీరులో మాత్రం మార్పరాలేదు. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో స్వదేశంలో పొట్టి సిరీస్‌లో సారథిగా అదరగొట్టిన ఈ ముంబైకర్.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ సూర్య నిరాశపరిచాడు.ఫోర్‌తో మొదలుపెట్టిహర్యానాతో మ్యాచ్‌లో క్రీజులోకి రాగానే ఫోర్ బాది దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యకుమార్.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం తొమ్మిది పరుగులు చేసి నిష్క్రమించాడు. కాగా సూర్య చివరగా ఈ రంజీ సీజన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్ ఇక టెస్టుల గురించి మర్చిపోవాల్సిందేనంటూ టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కాగా దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ శనివారం ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై- హర్యానా మధ్య క్వార్టర్ ఫైనల్-3 మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హర్యానా పేసర్ల ధాటికి అజింక్య రహానే సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.సుమిత్ దెబ్బకు బౌల్డ్ఓపెనర్ ఆయుశ్ మాత్రే(0)ను అన్షుల్ కాంబోజ్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆకాశ్ ఆనంద్‌ను పది పరుగుల వద్ద సుమిత్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) అన్షుల్ వేసిన బంతికి బౌల్డ్‌కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ సుమిత్ దెబ్బకు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి సిద్ధేశ్ అవుట్ కాగా.. సూర్య క్రీజులోకి వచ్చాడు. అన్షుల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఘనంగా ఆరంభించాడు. ఎనిమిదో ఓవర్లో సుమిత్ బౌలింగ్‌లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన సూర్య.. ఆ మరుసటి రెండో బంతికి పెవిలియన్ చేరాడు. మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో తొమ్మిది పరుగులు చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అవుటయ్యాడు.ఈ క్రమంలో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన ముంబై జట్టును కెప్టెన్ అజింక్య రహానే, ఆల్‌రౌండర్ శివం దూబే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమర్ యాదవ్ తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన విషయం తెలిసిందే.ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమేఆ తర్వాత కూడా వరుస మ్యాచ్‌లలో సూర్య నిరాశపరిచాడు. రెండో టీ20లో 12, మూడో టీ20లో 14 పరుగులు చేసిన అతడు.. నాలుగో టీ20లో మళ్లీ సున్నా చుట్టాడు. ఆఖరిదైన ఐదో టీ20లోనూ రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం ఈ ఐదు టీ20ల సిరీస్‌లో 4-1తో సూర్య ఘన విజయం అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఫామ్‌లేమి కారణంగా వన్డే జట్టులో ఎప్పుడో స్థానం కోల్పోయిన సూర్య.. రంజీల్లో వరుస వైఫల్యాలతో ఇప్పట్లో టెస్టుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నాడు. కాగా 2023లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా నాగ్‌పూర్ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్య.. దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 8 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Ind vs Eng: అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం -
BCCI: రోహిత్ సేనకు ప్రత్యేకమైన వజ్రపు ఉంగరాలు.. వీడియో చూశారా?
టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అరుదైన కానుకలు అందించింది. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు వజ్రపుటుంగరాలు ప్రదానం చేసింది. ఉంగరాల పైభాగంలో అశోక్ చక్ర గుర్తుతో పాటు.. సైడ్‌లో ఆటగాళ్ల జెర్సీ నంబర్ వచ్చేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు.ఈసారి ప్రత్యేకమైన కానుకలుఅంతేకాదు.. ఈ మెగా టోర్నీలో ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జట్టు జైత్రయాత్రకు గుర్తుగా విజయాల సంఖ్యను కూడా ఈ డిజైన్‌లో చేర్చారు. ఇటీవల నమన్ అవార్డుల వేడుక సందర్భంగా రోహిత్ సేన(Rohit Sharma&Co)కు ఈ వజ్రపు ఉంగరాలను బోర్డు ఆటగాళ్లకు అందజేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.‘‘టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లను చాంపియన్స్ రింగ్‌తో సత్కరిస్తున్నాం. వజ్రాలు శాశ్వతమే కావచ్చు. అయితే, కోట్లాది మంది హృదయాల్లో వీరు సంపాదించిన స్థానం మాత్రం ఎన్నటికీ చెక్కుచెదరదు. అలాగే ఈ ఉంగరం కూడా అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని బీసీసీఐ పేర్కొంది.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికలుగా గతేడాది పొట్టి ప్రపంచకప్ టోర్నీ జరిగిన విషయం తెలిసిందే. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన.. సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జయభేరి మోగించింది. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ట్రోఫీని దక్కించుకుంది.ఓవరాల్‌గా ఐదోసారితద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. అదే విధంగా.. ఓవరాల్‌గా ఐదో ట్రోఫీ భారత్ కైవసమైంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో తొట్టతొలి ప్రపంచకప్(వన్డే) గెలిచిన టీమిండియా.. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ధోని నాయకత్వంలోనే 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. ఇక గతేడాది రోహిత్ శర్మ కూడా ఈ ఐసీసీ విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన అనంతరం బీసీసీఐ రోహిత్ సేనకు అత్యంత భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను కానుకగా ఇచ్చింది. నాడు ఇలా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించిన బోర్డు.. తాజాగా వజ్రపు ఉంగరాలతో మరోసారి ఘనంగా సత్కరించింది.టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులోని సభ్యులురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్Presenting #TeamIndia with their CHAMPIONS RING to honour their flawless campaign in the #T20WorldCup 🏆Diamonds may be forever, but this win certainly is immortalised in a billion hearts. These memories will 'Ring' loud and live with us forever ✨#NamanAwards pic.twitter.com/SKK9gkq4JR— BCCI (@BCCI) February 7, 2025 -
ముంబైకు ఎదురుందా!
కోల్‌కతా: ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు హరియాణాతో పోరుకు సిద్ధమైంది. శనివారం ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తరఫున స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్లపై అందరి దృష్టి నిలవనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ హరియాణాలోని లాహ్లీలో నిర్వహించాల్సింది. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీసీసీఐ ఈ మ్యాచ్ వేదికను మార్చింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ చేజిక్కించుకున్న ముంబై జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా... పెద్దగా అనుభవం లేని హరియాణా జట్టు ముంబైకి ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ముంబై 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో 29 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాకౌట్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 456 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. రహానే, సూర్యకుమార్, శివమ్ దూబే, సిద్ధేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీలతో ముంబై బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్ శార్దుల్ జోరు మీదున్నాడు. అతడు గత మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 84 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ విజృంభించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. బౌలింగ్‌లో శార్దుల్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీ, ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘సి’లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 4 ‘డ్రా’ చేసుకున్న హరియాణా 29 పాయింట్లతో క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. ఆ జట్టులో అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోయినా... ప్రతిభకు కొదువలేదు. అంకిత్ కుమార్, నిశాంత్ సింధు, హిమాన్షు రాణా, యువరాజ్ సింగ్, అన్షుల్ కంబోజ్, అనూజ్ ఠక్రాల్, జయంత్ యాదవ్‌లపై ఆ జట్టు అధికంగా ఆధారపడుతోంది. కరుణ్ నాయర్‌పైనే దృష్టి తాజా రంజీ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విదర్భ జట్టు... క్వార్టర్స్‌లో తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచిన మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న విదర్భ 40 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ సెంచరీల మీద సెంచరీలతో జోష్‌లో ఉండగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్, అథర్వ తైడె, హార్ష్ దూబేతో విదర్భ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్, ఆకాశ్, ఆదిత్య కీలకం కానున్నారు. మరోవైపు ఎలైట్ గ్రూప్ ‘డి’లో రెండో స్థానంతో క్వార్టర్స్ చేరిన తమిళనాడు జట్టు... విజయ్ శంకర్, జగదీశన్, బాబా ఇంద్రజీత్ ప్రదర్శనపై ఎక్కువ ఆధారపడుతోంది. పుణేలో జరిగే మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఎలైట్ గ్రూప్ ‘ఎ’ నుంచి 35 పాయింట్లు సాధించిన జమ్మూకశ్మీర్‌తో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచిన కేరళ జట్టు తలపడుతుంది. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్, సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. -
Ranji Trophy QFs: ముంబై- హర్యానా మ్యాచ్ వేదికను మార్చిన బీసీసీఐ
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai), హరియాణా జట్ల మధ్య ఈనెల 8 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్(Ranji Trophy Quarter Finals) వేదిక మారింది. హరియాణాలోని లాహ్లీలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మార్చారు. హరియాణాలో చలితీవ్రత అధికంగా ఉండటంతో పాటు... ఉదయం పూట పొగమంచు కప్పేస్తుండటంతో లాహ్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్‌ను కోల్‌కతాకు మార్చినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందింది’ అని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజింక్య నాయక్ బుధవారం పేర్కొన్నారు.కాగా 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) సారథ్యం వహిస్తున్న ముంబై జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర, గుజరాత్ క్వార్టర్ ఫైనల్... నాగ్‌పూర్ వేదికగా విదర్భ, తమిళనాడు పోరు... పుణేలో జమ్ముకశ్మీర్, కేరళ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరిన్ని క్రీడా వార్తలుభారత బ్యాడ్మింటన్ జట్టులో జ్ఞాన దత్తు, తన్వీ రెడ్డి న్యూఢిల్లీ: డచ్ ఓపెన్, జర్మనీ ఓపెన్ అండర్–17 జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. జాతీయ జూనియర్ చాంపియన్, హైదరాబాద్ కుర్రాడు జ్ఞాన దత్తుతోపాటు హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ తన్వీ రెడ్డి భారత జట్టులోకి ఎంపికయ్యారు. డచ్ ఓపెన్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు... జర్మన్ ఓపెన్ మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.మనుష్–దియా జోడీ ఓటమి న్యూఢిల్లీ: సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా–దియా చిటాలె (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం సింగపూర్‌లో జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మను‹Ù–దియా జోడీ 11–9, 4–11, 8–11, 8–11తో అల్వారో రాబెల్స్–మరియా జియో (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన మనుష్–దియా జోడీకి 2000 డాలర్ల (రూ. 1 లక్ష 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. క్వార్టర్స్‌లో రియా–రష్మిక జోడీముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–రియా భాటియా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రషి్మక–రియా ద్వయం 5–7, 6–2, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మియా హొంటామా–క్యోకా ఒకమురా (జపాన్) జంటను ఓడించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రుతుజా భోస్లే (భారత్)–అలీసియా బార్నెట్ (బ్రిటన్); ప్రార్థన తొంబారే (భారత్)–అరీన్ హర్తానో (నెదర్లాండ్స్) జోడీలు కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)తో రష్మిక; రెబెకా మరీనో (కెనడా)తో అంకిత రైనా; జరీనా దియాస్ (కజకిస్తాన్)తో మాయ రాజేశ్వరి తలపడతారు. -
టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో భారీ తేడాతో గెలుపొంది.. ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు హోదా కలిగిన జట్లలో ఇంత వరకు.. ఏ టీమ్కీ సాధ్యం కాని రీతిలో ‘బిగ్గెస్ట్ విక్టరీ(Biggest Victory)’ల విషయంలో అత్యంత అరుదైన ఘనత సాధించింది.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1(India Won Series With 4-1)తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో ఈ సిరీస్ ఆరంభించిన టీమిండియా.. చెన్నైలోనూ గెలిచింది. అయితే, ఆ తర్వాత రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.ఏకపక్ష విజయం అయితే, పడిలేచిన కెరటంలా పుణె వేదికగా మరోసారి సత్తా చాటి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ నాలుగు మ్యాచ్‌లలో టీమిండియాకు ఇంగ్లండ్ గట్టి పోటీనివ్వగా.. నామమాత్రపు ఆఖరి టీ20లో మాత్రం సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.అభిషేక్ పరుగుల సునామీవాంఖడేలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్(Jos Buttler) టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మార్క్‌వుడ్ సంజూ శాంసన్(16)ను త్వరగానే పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌కు శుభారంభం అందించినా.. ఆ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. భారత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడు కనబరిచాడు.ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో పరుగుల సునామీ సృష్టించాడు. ఇతరులలో తిలక్ వర్మ(15 బంతుల్లో 24), శివం దూబే(13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.బౌలర్ల విజృంభణ ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) అర్ధ శతకం సాధించగా.. మిగతా వాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెన్ డకెట్ 0, కెప్టెన్ బట్లర్ 7, హ్యారీ బ్రూక్ 2, లియామ్ లివింగ్‌స్టోన్ 9, జాకొబ్ బెతెల్ 10, బ్రైడన్ కార్సే 3, జేమీ ఓవర్టన్ 1, జోఫ్రా ఆర్చర్ 1*, ఆదిల్ రషీద్ 6, మార్క్ వుడ్ 0 పరుగులు చేశాడు.ప్రపంచంలోనే ఏకైక జట్టుగాఫలితంగా 97 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. పొదుపుగా బౌలింగ్ చేస్తూనే భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, శివం దూబే, అభిషేక్ శర్మచ వరుణ్ చక్రవర్తి తలా రెండు.. రవి బిష్ణోయి ఒక వికెట్ తీశాడు. దీంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. టీమిండియా చేతిలో 150 పరుగుల భారీ తేడాతో మట్టికరిచింది.కాగా టీమిండియా అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థి జట్టుపై 150 పైచిలుకు పరుగులతో విజయం సాధించడం ఇది రెండోసారి. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. అంతేకాదు.. అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్లపై ఎక్కువసార్లు(4) గెలుపొందిన టీ20 టీమ్‌గానూ తన రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఇక వన్డేల్లోనూ బిగ్గెస్ట్ విక్టరీ సాధించిన జట్టుగా టీమిండియాకు రికార్డు ఉంది. శ్రీలంకపై 2023లో తిరువనంతపురం వేదికగా 317 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్లు(ఫుల్ మెంబర్ సైడ్)👉ఇండియా- న్యూజిలాండ్‌పై 2023లో అహ్మదాబాద్ వేదికగా 168 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఇంగ్లండ్‌పై 2025లో ముంబై వేదికగా 150 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్- వెస్టిండీస్‌పై 2018లో కరాచీ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- ఐర్లాండ్‌పై 2018లో డబ్లిన్ వేదికగా 143 పరుగుల తేడాతో గెలుపు👉ఇంగ్లండ్- వెస్టిండీస్‌పై 2019లో బెసెటెరె వేదికగా 137 పరుగుల తేడాతో గెలుపు👉ఇండియా- సౌతాఫ్రికాపై 2024లో జొహన్నస్‌బర్గ్ వేదికగా 135 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య -
వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం(India Beat England)పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు. సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైనందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అందుకు తగ్గ ఫలితాలను మైదానంలో చూస్తున్నామంటూ సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.4-1తో కైవసంఇక ఎక్కువసార్లు తాము రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతామన్న సూర్య.. అంతిమంగా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో సిరీస్‌ను ఆరంభించిన సూర్యసేన.. చెన్నైలోనూ అదే ఫలితం పునరావృతం చేసింది.అనంతరం రాజ్‌కోట్‌లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. పుణెలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20లోనూ అద్భుత ఆట తీరు కనబరిచింది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అభిషేక్ శర్మ ఊచకోతఓపెనర్ సంజూ శాంసన్(16) మరోసారి వైఫల్యాన్ని కొనసాగించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో తిలక వర్మ(24), శివం దూబే(13 బంతుల్లో 30) మాత్రమే రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ బృందానికి టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. బెన్ డకెట్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.97 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) ఒక్కడు కాసేపు పోరాడగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. ఫలితంగా 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే రెండు, స్పిన్నర్లు వరుణ్ చక్రర్తి రెండు, అభిషేక్ శర్మ రెండు, రవి బిష్ణోయి ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.రిస్క్ అని తెలిసినాఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘‘జట్టులోని ఏ సభ్యుడైతే ఈరోజు రాణించగలడని భావిస్తానో.. అతడిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాను. నెట్స్‌లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఎప్పుడైతే వారి అవసరం ఉంటుందో అప్పుడు కచ్చితంగా రాణిస్తున్నారు.మ్యాచ్‌కు ముందు రచించిన ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కోసారి రిస్క్ అని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం.వాళ్లిద్దరు అద్భుతంఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఈరోజు అద్భుతంగా సాగింది. టాపార్డర్‌లో ఓ బ్యాటర్ ఇలా చెలరేగిపోతుంటే చూడటం ముచ్చటగా అనిపించింది. ఈ ఇన్నింగ్స్ చూసి అతడి కుటుంబం కూడా మాలాగే సంతోషంలో మునిగితేలుతూ ఉంటుంది.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అందుకు ఫలితమే ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన. అతడి వల్ల జట్టుకు అదనపు శక్తి లభిస్తోంది. అతడొక అద్భుతం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు తీశాడు.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్An impressive way to wrap up the series 🤩#TeamIndia win the 5th and final T20I by 150 runs and win the series by 4-1 👌Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX— BCCI (@BCCI) February 2, 2025 -
అభిషేక్ శర్మ విధ్వంసం..భారత్ గెలుపు సిరీస్ కైవసం (ఫొటోలు)
-
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్‌పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్‌ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్‌ను బౌలర్‌గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్‌లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్‌లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్‌లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్‌డౌన్‌లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్‌కోట్‌లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్‌రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌ల బదులు.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు -
కెప్టెన్‌గా సూర్యా ఏంటి?.. నేనైతే షాకయ్యా: టీమిండియా మాజీ కోచ్
ఒకప్పుడు టీమిండియాలో చోటు కోసం పరితపించిపోయిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఇప్పుడు కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. ముప్పై ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన అతడు.. పొట్టి ఫార్మాట్లో తనను తాను నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. టీ20లో ప్రపంచ నంబర్ వన్(ICC World No.1 Batter) బ్యాటర్‌గా సత్తా చాటిన అతడు.. మూడేళ్ల వ్యవధిలోనే అనూహ్యంగా భారత జట్టు(Team India T20 Captain) నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు.కెప్టెన్‌గా వరుస విజయాలుపూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకలో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్న సూర్య... బంగ్లాదేశ్‌పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. యువ జట్టుతో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడా టీ20 సిరీస్‌ను 3-1తో గెలిచి తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూర్య సారథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ గెలవడంలో టీమిండియా బిజీగా ఉంది.ఈ నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar) సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తక్కువ కాలంలోనే అతడు కెప్టెన్ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం దాదాపు ఖరారైపోయిందన్న తరుణంలో సూర్య సారథిగా ఎంపిక కావడం నిజంగా ఓ షాక్ అన్నాడు.హార్దిక్ పాండ్యాకు బదులు సూర్య.. నేనైతే షాకయ్యాఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ ‘షో’లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది హార్దిక్ పాండ్యానే కాబోయే కెప్టెన్ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా సూర్య పేరు బయటకు వచ్చింది. నిజంగా కెప్టెన్‌గా అతడి నియామక ప్రకటన రాగానే.. నేనైతే షాకయ్యా. ఏదేమైనా.. నాయకుడిగా అతడు ఎదిగిన తీరు అద్భుతం.రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్ తర్వాత.. యువకులతో కూడిన జట్టు లభించడం కూడా అతడికి కలిసి వచ్చింది. వాళ్లలో ఒకడిగా ఉంటూనే.. నవతరం నాయకుడిగా సూర్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే వీలు కలిగింది.ఇక బ్యాటర్‌గా అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. బౌలర్ చేతి నుంచి బంతి వెలువడకముందే.. దానిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ షాట్‌తో రెడీ ఉండటం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అందులో సూర్య ఒకడు.అతడో అద్భుత బ్యాటర్ఆసియా కప్ సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు సూర్యను ఎదుర్కొనేందుకు పడ్డ కష్టాలను మేము చూశాం. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక కొత్త షాట్‌తో బంతిని ఎదుర్కోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. 360 డిగ్రీలలో షాట్లు బాదగల క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, అప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా.. తన ప్రణాళికను మార్చుకుని షాట్లు ఆడటంలో దిట్ట. అతడో అద్భుత బ్యాటర్’’ అని సంజయ్ బంగర్ సూర్యను ప్రశంసించాడు.గొప్ప కెప్టెన్ కూడామరోవైపు.. ఇదే షోలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గానూ అతడిలో టెంపర్మెంట్ సూపర్. గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారీ మరింత ప్రశాంతంగా.. నిరాడంబరంగా ఉండటం అతడికే చెల్లింది. అతడి మనసు మంచిది. టెస్టు కెప్టెన్సీకి బుమ్రా సరైనవాడని ఎలా అనుకుంటున్నామో.. టీ20లకు సూర్య అత్యుత్తమ కెప్టెన్ అని ఇప్పటికే రుజువైంది’’ అని సూర్యకుమార్ యాదవ్‌ను కొనియాడాడు. చదవండి: రెండు వరల్డ్‌కప్‌లు ఆడాడు.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే! -
అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే!: మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా టీ20లో మూడు బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి.. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.తీరు మార్చుకోని సూర్యఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ సూర్య నిరాశపరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ ‘మిస్టర్ 360’.. మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ 12 పరుగుల వద్ద పేసర్ బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. తాజాగా రాజ్‌కోట్(Rajokot T20I) వేదికగా సాగిన మూడో టీ20లోనూ సూర్య విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందడంతో సూర్య వైఫల్యంపై పెద్దగా చర్చ జరుగలేదు. ఆ రెండు టీ20లలో బౌలర్లతో పాటు.. వరుసగా అభిషేక్ శర్మ(34 బంతుల్లో 79), తిలక్ వర్మ(55 బంతుల్లో 72*) బ్యాట్‌తో రాణించడంతో భారత్ గెలుపొందింది.అయితే, మూడో టీ20లో బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ముఖ్యంగాబ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, సూర్య వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూర్యకుమార్ యాదవ్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అంత తొందరెందుకు? కళ్లు మూసి తెరిచేలోపే‘‘ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడాలని భావిస్తే.. అందుకు సరైన బంతిని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. అలా కాకుండా ఏ బంతికైనా అగ్రెసివ్‌గానే ఉంటానంటే కుదరదు. ప్రతి బాల్‌ను బౌండరీకి తరలించడం కుదరదు కదా!..టీమిండియా ఈ స్థాయిలో ఉందంటే.. అందుకు వారి అత్యుత్తమ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటమే కారణం. అందుకే వాళ్లు వరల్డ్ చాంపియన్స్ అయ్యారు. కానీ.. పదే పదే ఒకే తరహా తప్పులు చేస్తే ఎలా? సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.. రెండు మంచి షాట్లు ఆడాడు. అంతే.. కన్నుమూసి తెరిచేలోగా మళ్లీ డగౌట్‌కు చేరుకున్నాడు. జట్టు గెలుపునకు అతడు తన వంతు సహకారం అందించనేలేదు’’ అని మైకేల్ వాన్ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా రాజ్‌కోట్‌లో ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 48-2 ఉన్న సమయంలో సూర్య క్రీజులోకి వచ్చాడు. రాగానే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు షాట్లు బాదిన సూర్య.. మార్క్ వుడ్ బౌలింగ్‌లోనూ తన ట్రేడ్‌మార్క్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా.. ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయగా.. బట్లర్ బృందం 171 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో సూర్యసేన 145 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఇంగ్లండ్ చేతిలొ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదుమ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం ప్రస్తుతానికి 2-1కి తగ్గింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి ‘చెత్త రికార్డు’
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.కెరీర్లోనే అత్యుత్తమంగాస్వభావసిద్ధంగా ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.అయితే, రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.కానీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.దురదృష్టం వెంటాడిందిసౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.చెత్త ‘వరల్డ్’ రికార్డుతద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మెరుగ్గా ఆడేందుకుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.బ్యాటర్ల కారణంగానేకాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాజ్‌కోట్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్ -
అద్భుత బ్యాటర్.. లోయర్ ఆర్డర్లో పంపిస్తారా?: కెవిన్ పీటర్సన్
రాజ్‌కోట్ టీ20(Rajkot T20I)లో టీమిండియా ఆట తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఓటమి ఎదురైందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. కోల్‌కతా, చెన్నైలలో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. తద్వారా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేనకు పరాజయం ఎదురైంది.బ్యాటర్ల వైఫల్యం వల్లేఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిని చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమేనని చెప్పవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో టీమిండియా టాపార్డర్ ఒకే విధంగా ఉంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వచ్చారు. ఇక నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేశాడు.హార్దిక్ ఐదో నంబర్లోమూడో టీ20లోనూ ఈ నలుగురి స్థానాలు మారలేదు. కానీ వరుస విరామాల్లో వికెట్లు పడిన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మేనేజ్మెంట్ ప్రమోట్ చేసింది. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. మరోవైపు.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఆ తర్వాతి స్థానాల్లో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(6), అక్షర్ పటేల్(15)లను రంగంలోకి దించారు.ఎనిమిదో స్థానంలో జురెల్అదే విధంగా.. అచ్చమైన బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. ఇక హార్దిక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇరవైకి పైగా బంతులు తీసుకుని.. మొత్తంగా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చే సమయానికి.. టీమిండియా విజయలక్ష్యానికి ఓవర్‌కు పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితి.ఇలాంటి తరుణంలో ఒత్తిడిలో చిత్తైన జురెల్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయిన టీమిండియా 145 పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది.అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. టీమిండియా అనవసరంగా ఆల్రౌండర్లను ముందు పంపిందని అభిప్రాయపడ్డాడు. వారికి బదులు జురెల్‌ను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది సరైంది కానేకాదు. ధ్రువ్ జురెల్ అచ్చమైన, స్వచ్ఛమైన బ్యాటర్. అద్భుత నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని అతడిని లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లు కచ్చితంగా కాస్త టాప్ ఆర్డర్‌లోనే రావాలి’’ అని కెవిన్ పీటర్సన్ హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- మూడో టీ20 స్కోర్లు👉టాస్: ఇండియా.. తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సూర్య👉ఇంగ్లండ్ స్కోరు: 171/9 (20)👉ఇండియా స్కోరు: 145/9 (20)👉ఓవరాల్ టాప్ రన్ స్కోరర్: బెన్ డకెట్(28 బంతుల్లో 51)👉టీమిండియా టాప్ రన్ స్కోరర్: హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో 40)👉ఫలితం: ఇండియాపై 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వరుణ్ చక్రవర్తి(5/24).చదవండి: అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య -
అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య
ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజయంతో సిరీస్ గెలవాలని భావించిన టీమిండియాకు చుక్కెదురైంది. రాజ్‌కోట్ టీ20లో సూర్యకుమార్ సేన ప్రత్యర్థి చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీనిరంజన్ షా స్టేడియంలో మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఆదిలోనే హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(5) వికెట్ తీసి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ బెన్ డకెట్(Ben Ducket) ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు.మెరుపు అర్ధ శతకం బాది మెరుగైన స్కోరుకు బాటలు వేశాడు. డకెట్.. 28 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ జోస్ బట్లర్(24) కూడా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించగా వరుణ్ చక్రవర్తి అతడిని బోల్తా కొట్టించాడు.లివింగ్‌స్టోన్ ధనాధన్మిగతా వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone- 24 బంతుల్లో 43 రన్స్) దంచికొట్టగా.. ఆదిల్ రషీద్(10), మార్క్ వుడ్(10) డబుల్ డిజిట్ స్కోర్లతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయి, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.టీమిండియా తడ‘బ్యాటు’ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. ఓపెనర్లలో సంజూ శాంసన్(3) మరోసారి నిరాశపరచగా.. అభిషేక్ శర్మ(14 బంతుల్లో 24) కాసేపు మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14) మరోసారి విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్(6), ధ్రువ్ జురెల్(2) చేతులెత్తేశారు.ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40) మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(15)తో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఇక టెయిలెండర్లలో మహ్మద్ షమీ 7 పరుగులు చేయగా.. రవి బిష్ణోయి 4, వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా ఉన్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి ఎదురైందని విచారం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్ సాగేకొద్దీ మంచు ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ మా చేతుల్లో ఉందనుకున్నా.అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్కానీ ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతడిని వరల్డ్‌క్లాస్ బౌలర్ అంటారు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పిన్నర్లు అవసరం ఎంతగా ఉంటుందో మాకు తెలుసు. అందుకే మా జట్టులో వారే ఎక్కువగా ఉన్నారు.ప్రతి టీ20 మ్యాచ్ నుంచి మేము సరికొత్త పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈసారి బ్యాటింగ్ పరంగా మా పొరపాట్లు ఏమిటో గుర్తించగలిగాం. ఇక షమీ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు సాధిస్తున్న ఫలితాలే.. అతడి క్రమశిక్షణ, కఠిన శ్రమకు నిదర్శనం. మైదానం లోపలా.. వెలుపలా ఆట పట్ల అతడి అంకితభావం ఒకేలా ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కీలకమైన ఇన్ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మ(18) వికెట్ తీసి.. టీమిండియా ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో జేమీ ఓవర్టన్ మూడు, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్‌వుడ్ ఒక వికెట్ తీశాడు. ఇక తన అద్భుత ప్రదర్శన(5/24)కు గానూ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా -
#INDvsENG : మూడో టి20లో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
Ind vs Eng: బౌలర్లకు కష్టమే.. బ్యాటర్లపైనే భారం! వారు ‘ఫాస్ట్ షో’ మొదలెడితే..
ఇంకా కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) ‘360 డిగ్రీ’ బ్యాటింగ్ బాకీ ఉంది. సంజూ శాంసన్(Sanju Samson) మెరుపు జోరు కనబర్చలేదు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) అసలు ఆట మిగిలే ఉంది. అయినాసరే భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఇప్పుడు సిరీస్‌ను కైవసం చేసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ ముగ్గురు గనక రాణిస్తే మూడో మ్యాచ్‌తోనే భారత్ ఐదు టీ20ల సిరీస్‌ను గెలుచుకునే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ‘హ్యాట్రిక్’ విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు సిరీస్‌పైనే కన్నేసింది. రాజ్‌కోట్‌లో జరిగే మూడో టీ20లో గెలిచి ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తమ వైఫల్యాల్ని అధిగమిస్తే ఇంగ్లండ్‌కు మూడో పరాజయం తప్పదేమో! ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి బట్లర్ బృందాన్ని కుంగదీసింది.ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. అయితే ఇది పొట్టి ఫార్మాట్. ఏ క్షణంలోనైనా, ఏ ఓవరైనా ఉన్నపళంగా మార్చేయగలదు. కాబట్టి ఏ జట్టు తప్పక గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ ఓపెనింగ్ జోడీ సాల్ట్–డకెట్ విఫలమైంది. వారి ఓపెనింగ్‌లో గునక ‘పవర్ ప్లే’ కనబడితే భారత్‌కు సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో గత రెండో టీ20లాగే ఉత్కంఠరేపే సమరం జరిగొచ్చు.టాపార్డర్ రాణిస్తే... ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో మెరిపించాడు. కానీ శాంసన్ నుంచే ఆ మెరుపులు కరువయ్యాయి. కెప్టెన్ సూర్యకుమార్ కూడా టీ20కి కాదుకదా... వన్డేకు సరిపడా ఆటకూడా చూపించలేకపోయాడు. ఈ ముగ్గురు మూకుమ్మడిగా రాణిస్తే మిడిలార్డర్ సంగతి చూసుకునేందుకు తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, ధ్రువ్ జురేల్ ఉన్నారు.బ్యాటింగ్‌కు అచ్చొచ్చే పిచ్‌పై లోయర్ ఆర్డర్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా దంచేసే అవకాశాన్ని పిచ్ కల్పిస్తుంది. గత మ్యాచ్‌ల్ని నిశితంగా గమనిస్తే... బ్యాటింగ్ కన్నా కూడా మన బౌలింగ్ దళం గట్టి ప్రభావమే చూపింది. ఇంగ్లండ్ టాపార్డర్‌ను తేలిగ్గా కూల్చేస్తుంది. అర్ష్‌దీప్, పాండ్యాలకు జతగా మరో సీమర్‌ను తీసుకోవాలనుకుంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని పక్కన బెట్టొచ్చు.భారమంతా బ్యాటర్లపైనే... ఇంగ్లండ్ కూడా గత మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకుంది. హిట్టింగ్ ఓపెనర్లను కూల్చి, మిడిలార్డర్‌ను దెబ్బతీసి మ్యాచ్‌ను గెలిచేస్థితికి వచ్చేసింది. అయితే తిలక్ వర్మ పోరాటమే వారి శ్రమను నీరుగార్చింది. లేదంటే చెన్నైలోనే భారత్‌కు 1–1తో చెక్ పెట్టేది. కార్స్, మార్క్‌వుడ్, ఆర్చర్, రషీద్‌లతో కూడిన బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది.అయితే పరిస్థితి చక్కబెట్టాల్సింది... ఎదురుదాడికి దిగాల్సింది... బ్యాటర్లే! ఫిల్ సాల్ట్, డకెట్‌లు ఆషామాషీ ఓపెనర్లు కాదు. కానీ వారి ఫ్లాప్‌షో ముగిసి ‘ఫాస్ట్ షో’ మొదలైతే మాత్రం పరుగుల తుఫాన్ ఖాయం. బట్లర్, బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదో వరుస బ్యాటింగ్ దాకా పరుగుల బాదే ఆటగాళ్లే జట్టుకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇంగ్లండ్ భారమంతా బ్యాటర్లపైనే ఉంది.పిచ్, వాతావరణం రాజ్‌కోట్ పిచ్ ఎప్పుడైనా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ప్రత్యేకించి టీ20ల్లో పరుగుల వరద, మెరుపుల సరదా ఖాయం. బ్యాటర్ ఫ్రెండ్లీ వికెట్‌పై బౌలర్లకు కష్టాలు తప్పవు. గత రెండు మ్యాచ్‌ల్లో నమోదైన మోస్తరు స్కోరును సులువుగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.తుది జట్లు (అంచనా) భారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్/షమీ, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్రాజ్కోట్ సూర్యకు ప్రత్యేకంరాజ్కోట్లో భారత జట్టు ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో (2013లో ఆస్ట్రేలియాపై; 2019లో బంగ్లాదేశ్‌పై; 2022లో దక్షిణాఫ్రికాపై; 2023లో శ్రీలంకపై) గెలిచిన టీమిండియా ఒక మ్యాచ్‌లో (2017లో న్యూజిలాండ్ చేతిలో) ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారి 2023 జనవరి 7న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం.చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: భారత మాజీ క్రికెటర్ -
Ind vs Eng: టీమిండియాకు ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం!
ఇంగ్లండ్‌తో రెండో టీ20కి టీమిండియా(India Vs England 2nd T20) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. విజయంతో ఆరంభించిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిపత్యమే లక్ష్యంగా చెపాక్ బరిలో దిగనుంది. అయితే, చెన్నై మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా శుక్రవారం సాయంత్రం చిదంబరం స్టేడియంలో నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.చీలమండ నొప్పిఈ సందర్భంగానే అభిషేక్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. అతడి పాదం మెలిక పడగా.. చీలమండ నొప్పి(Ankle Injury)తో విలవిల్లాడాడు. ఈ క్రమంలో వెంటనే ఫిజియోలు వచ్చి అభిషేక్‌ను పరీక్షించారు. అనంతరం అతడు మైదానం వీడాడు. అయితే, మళ్లీ నెట్ సెషన్లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో టీ20కి అభిషేక్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది.సంజూకు జోడీ ఎవరు?ఒకవేళ అభిషేక్ శర్మ గనుక దూరమైతే సంజూ శాంసన్‌తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా వస్తాడా? లేదంటే ప్రయోగాత్మకంగా ఇంకెవరినైనా టాపార్డర్‌కు ప్రమోట్ చేస్తాడా? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.తొలి టీ20లో అభిషేక్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. బట్లర్ బృందాన్ని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ దంచికొట్టాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న 24 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 79 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.షమీ వస్తాడా?కాగా టీమిండియలో పునగామనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతాలో మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన క్రమంలో షమీకి చోటు ఇవ్వలేకపోయినట్లు మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్న యువ పేసర్ అర్ష్‌దీప్ ఒక్కడికే తుదిజట్టులో దక్కగా.. షమీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.అయితే, తొలి టీ20లో ప్రభావం చూపలేకపోయినప్పటికీ రవి బిష్ణోయికి మరో అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో పాటు అతడినీ రెండో టీ20లో కొనసాగించే అవకాశం ఉంది. ఇక అభిషేక్ శర్మ గాయంతో దూరమైతే గనుక షమీని తుదిజట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఆరంభ ఓవర్లలో అర్ష్‌దీప్ త్వరత్వరగా వికెట్లు తీశాడు కాబట్టి సరిపోయింది. అందుకే ఈసారి అర్ష్‌దీప్‌తో పాటు షమీని కొత్త బంతితో బరిలోకి దించాలనే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెన్నైలో చిదంబరం స్టేడియం(చెపాక్)లో శనివారం రాత్రి ఏడు గంటలకు ఇండియా- ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది.చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా ఇంగ్లండ్ బ్యాటర్ల అసమర్థతను బాగానే కప్పి పుచ్చుతున్నావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.దమ్ముంటే రెండో టీ20(India vs England)లో సత్తా చూపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్చర్‌ను ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా చేతిలో ఓటమిపై స్పందిస్తూ.. ఆర్చర్ ఒకింత వింత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..టీమిండియా ఘన విజయంఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ ఆరంభం కాగా.. బుధవారం మొదటి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాగిన ఈ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో బట్లర్ బృందాన్ని చిత్తు చేసింది.ఆకాశమే హద్దుగా అభిషేక్ శర్మఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్ల విజృంభణ కారణంగా ఇంగ్లండ్‌ను 132 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనలోనూ అదరగొట్టింది. మరో 43 బంతులు మిగిలి ఉండగానే 133 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(20 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సుడిగాలి ఇన్నింగ్స్‌తో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న అభిషేక్ శర్మ.. మొత్తంగా 34 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఏకంగా ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ 19, హార్దిక్ పాండ్యా 3 పరుగులతో అజేయంగా నిలిచి లక్ష్యాన్ని పూర్తి చేశారు.జోఫ్రా ఆర్చర్‌కు వికెట్లుఇక టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లలో రెండు జోఫ్రా ఆర్చర్‌కు దక్కాయి. సంజూ శాంసన్‌తో పాటు.. సూర్యకుమార్ యాదవ్‌లను ఈ రైటార్మ్ పేసర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ.. అదృష్టం వల్లే టీమిండియా గెలిచిందన్న అర్థంలో వ్యాఖ్యానించాడు.అదృష్టం వల్లే గెలిచారు‘‘ఈరోజు మ్యాచ్‌లో మిగతా బౌలర్లతో పోలిస్తే పరిస్థితులు నాకు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. మావాళ్లలో అందరూ బాగానే బౌలింగ్ చేశారు. అయితే, టీమిండియా బ్యాటర్ల అదృష్టం వల్ల వారికి భంగపాటు ఎదురైంది.టీమిండియా బ్యాటర్లు ఆడిన చాలా బంతులు గాల్లోకి లేచాయి. కానీ.. మేము సరిగ్గా క్యాచ్‌లు పట్టలేకపోయాం. తదుపరి మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేయబోము. అన్ని క్యాచ్‌లు ఒడిసిపడతాం. అప్పుడు నలభై పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేస్తాం’’ అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.నిజానికి తొలి టీ20లో అభిషేక్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మాత్రమే ఇంగ్లండ్ ఫీల్డర్లు జారవిడిచారు. తిలక్ వర్మ కూడా ఓసారి బంతిని గాల్లోకి లేపినా.. అదేమీ అంత తేలికైన క్యాచ్ కాదు. ఈ రెండు తప్ప టీమిండియా బ్యాటర్లు క్యాచ్‌లకు ఎక్కువగా అవకాశం ఇవ్వనే లేదు.అయినప్పటికీ అదృష్టం వల్లే టీమిండియా బ్యాటర్లు తప్పించుకున్నారంటూ ఆర్చర్ వ్యాఖ్యానించడం.. అభిమానుల ఆగ్రహానికి ప్రధాన కారణం. మరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామంటూ.. భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వడం గమనార్హం.చదవండి: Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి విఫలమై! -
Ind vs Eng: షమీని తప్పించడానికి కారణం అతడే?
ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్‌లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో శుభారంభం చేసింది. అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో రంగంలోకి దిగింది.షమీ ఎందుకు ఆడలేదు? కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్‌లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది. మరి ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.ఫిట్‌గా లేడేమో?కాగా షమీ చివరిసారి 2023 నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది. అర్ష్‌దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్‌లైన్ పేసర్‌ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.పరిస్థితులకు అనుగుణంగానేఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.గంభీర్ నిర్ణయమేనా?ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. -
అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
టీమిండియాతో తొలి టీ20లో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) స్పందించాడు. పరుగులు రాబట్టేందుకు వీలుగా ఉన్న పిచ్ మీద సత్తా చాటలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యామన్న బట్లర్.. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపిందని తెలిపాడు. ఏదేమైనా భారత బౌలర్లు అద్భుతంగా ఆడారని.. తదుపరి మ్యాచ్‌లో తాము తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నాడు.అర్ష్‌దీప్ అదరగొడితే..కాగా ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో జరిగిన పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(0)ను డకౌట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. అనంతరం బెన్ డకెట్(4)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడుఅర్ష్దీప్తో పాటు మిస్టరీ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. వరుస బంతుల్లో లివింగ్‌స్టోన్(0)తో పాటు హ్యారీ బ్రూక్(17)ను అవుట్ చేశాడు. అదే విధంగా.. కొరకాని కొయ్యగా మారిన కెప్టెన్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచే దూకుడు కనబరిచింది. అభిషేక్ శర్మ ధనాధన్సంజూ శాంసన్ (20 బంతుల్లో 26) వేగంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. అభిషేక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 79 పరుగులు చేశాడు.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) విఫలం కాగా.. తిలక్ వర్మ(19), హార్దిక్ పాండ్యా(3) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అభిషేక్ ధాటికి 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులు చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఒత్తిడి పెంచలేకపోయాం.. ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘టీమిండియాపై ఒత్తిడి పెంచలేకపోయాం. నిజంగా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక మా జట్టులోని కొంత మంది.. కొందరు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి.. వికెట్ బాగానే ఉంది. ఫాస్ట్ స్కోరింగ్ గ్రౌండ్ ఇది.కానీ మేము ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. టీ20 క్రికెట్లో మేము మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాం. అయితే, అల్ట్రా- అగ్రెసివ్ జట్టుతో పోటీలో ఈరోజు వెనుకబడిపోయాం. ఏదేమైనా టీమిండియాతో పోరు రసవత్తరంగా ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లలో కచ్చితంగా రాణిస్తాం. ప్రతీ వేదికపై విభిన్న పిచ్ పరిస్థితులు ఉంటాయి.జోఫ్రా ఆర్చర్ సూపర్స్టార్మా జట్టులో జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అతడొక సూపర్‌స్టార్. ప్రత్యర్థిని కచ్చితంగా భయపెట్టగలడు. ముందుగా చెప్పినట్లు మేము తిరిగి పుంజుకుంటాం’’ అని పేర్కొన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైనట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు.కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ సంజూ, సూర్య రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ వికెట్‌ను ఆదిల్ రషీద్ దక్కించుకున్నాడు. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య చెన్నై వేదికగా శనివారం రెండో టీ20 జరుగనుంది.చదవండి: NADA: డోపింగ్ పరీక్షలు.. బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP— BCCI (@BCCI) January 22, 2025 -
NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో కొత్తగా 14 మంది క్రికెటర్ల పేర్లు చేరాయి. ‘నాడా’ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసే రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)– 2025 జాబితాలో భారత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్(Shubman Gill), రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, తిలక్ వర్మ(Tilak Varma) పేర్లు కూడా జత చేరాయి.ఇక ముగ్గురు మహిళా క్రికెటర్లు షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుకా సింగ్ పేర్లను కూడా ‘ఆర్టీపీ’లో చేర్చారు. ‘నాడా’ నిబంధనల ప్రకారం ఈ ఏడాదిలో ఏ సమయంలోనైనా వీరి శాంపిల్స్‌ను అధికారులు సేకరిస్తారు. డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతేతాము ‘ఎప్పుడు, ఎక్కడ’ ఉంటామో చెబుతూ అధికారుల కోసం ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. తమ చిరునామా, ప్రాక్టీస్, ప్రయాణాలు, మ్యాచ్‌ల షెడ్యూల్వంటి వివరాలు కూడా వారు అందజేయాల్సి ఉంటుంది.కాగా డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతే దానికి సదరు ఆటగాడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో ఏదైనా కారణంతో మూడుసార్లు ఇలాగే జరిగితే డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కింద ‘నాడా’ చర్యలు తీసుకుంటుంది. 2019 నుంచే ‘నాడా’ పరిధిలోకి క్రికెటర్లు రాగా... ఓవరాల్‌గా అన్ని క్రీడాంశాల్లో కలిపి ప్రస్తుతం 227 మంది భారత ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.మరిన్నిక్రీడా వార్తలుఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు చైనాలో జరగనున్న ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది షట్లర్లు పాల్గొంటారు. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన స్టార్ పీవీ సింధుతోపాటు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో ఆడతారు. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది.ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక బరిలోకి దిగుతారు’ అని వెల్లడించారు. పురుషుల జట్టు: లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, సతీశ్ కుమార్. మహిళల జట్టు: సింధు, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. సహజ శుభారంభంబెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–3, 3–6, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ యురికో మియజకి (జపాన్)పై సంచలన విజయం సాధించింది.2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రషి్మక 0–6, 0–6తో ప్రపంచ 155వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో 45 నిమిషాల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 7–6 (7/2), 7–6 (7/4)తో దరియా కుదషోవా (రష్యా)పై గెలిచింది. -
చెలరేగిన అభిషేక్ శర్మ..తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం: సూర్య
సౌతాఫ్రికా గడ్డపై విజయం తర్వాత సూర్యకుమార్ సేన స్వదేశంలో మరో పొట్టి ఫార్మాట్ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్(India Vs England)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం తొలి టీ20 ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద పారించేందుకు సై అంటున్నాయి.ఇక టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో సెమీస్‌లో తలపడ్డ ఇండియా- ఇంగ్లండ్ ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తైన ఇంగ్లిష్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్‌ను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా ప్రకటించింది. సారథిగా సూపర్ హిట్ఈ క్రమంలో గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్య.. 3-0తో క్లీన్స్వీన్ విజయంతో ప్రస్థానం ఆరంభించాడు. అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై కూడా సూర్య ఇదే ఫలితం పునరావృతం చేయగలిగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 3-1తో టీమిండియాను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల నేపథ్యంలో కొత్త వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాతో సూర్య అనుబంధం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో భాగంగా ఈ ప్రస్తావన రాగా సూర్య హుందాగా స్పందించాడు.మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్ మాత్రం‘‘హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా నాయకత్వ బృందంలో అతడు ఎల్లప్పుడూ కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. మైదానంలో అవసరమైనపుడు సూచనలు, సలహాలు ఇస్తారు.ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్‌తో కూడా నేను గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్ గురించి ఆలోచన లేదు.ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్లుటీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూనే.. తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా వివరించాడు.నేను బాగా ఆడలేదు కాబట్టేఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్య ఈ సందర్భంగా స్పందించాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన బాగా లేనందువల్లే ఎంపిక కాలేదని నిజాయితీగా ఒప్పుకొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపాడు.చదవండి: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్! నితీశ్‌కు చోటు? -
Ind vs Eng 1st T20: భారత తుదిజట్టులో వీరే!
ఇంగ్లండ్‌తో టీ20 సమరానికి(India vs England T20 Series) టీమిండియా సన్నద్ధమైంది. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(జనవరి 22) బట్లర్ బృందంతో తొలి టీ20లో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 3-1తో ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది.ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని.. ఇంగ్లండ్‌తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు జరిగే ఈ పరిమిత సిరీస్‌లలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.ఓపెనింగ్ జోడీ అదేకాగా ఇంగ్లండ్‌తో తొలుత ఐదు టీ20లు, అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నిజానికి సంజూ ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన తర్వాతే నిలకడగా రాణిస్తున్నాడు.ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 366 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 198.91 కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20లలో సంజూ ఇప్పటికే మూడు సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు.మరోవైపు.. అభిషేక్ శర్మ మాత్రం ఐపీఎల్ మాదిరి టీమిండియా తరఫున బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ తర్వాత అతడి సగటు కేవలం 18.85 కావడం గమనార్హం. అయితే, దేశీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ఫామ్ కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్.. 255 పరుగులు చేశాడు.వరుసగా మూడు శతకాలుఇక మూడో స్థానంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ దిగడం ఖాయమే. సౌతాఫ్రికాతో టీ20లలో వరుస శతకాలు బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీతో చెలరేగాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఈసారి కూడా టీమిండియా ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై శతకం(టెస్టు) బాదిన నితీశ్ రెడ్డి.. తనకు గుర్తింపు తెచ్చిన టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! వీరితో పాటు ఫినిషర్ రింకూ జట్టులో ఉండనే ఉంటాడు.షమీ రాక.. రాణాకు నో ఛాన్స్ఇక బౌలర్ల విషయంలో.. ముఖ్యంగా పేసర్ల విషయంలో కాస్త సందిగ్దం నెలకొనే అవకాశం ఉంది. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. కాబట్టి అతడు పూర్తి ఫిట్‌గా ఉంటే యాక్షన్‌లోకి దిగడం లాంఛనమే. అయితే, అతడితో పాటు పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడికే ఛాన్స్ దక్కనుంది.చాంపియన్స్ ట్రోఫీకి ముందు అర్ష్ కూడా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతాడు. దీంతో హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్‌గా సంజూ అందుబాటులో ఉంటాడు కాబట్టి ధ్రువ్ జురెల్ కూడా బెంచ్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
సూర్యకుమార్ యాదవ్‌లా సూపర్ షాట్ ఆడిన లబూషేన్.. వైరల్ వీడియో
ఆస్ట్రేలియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25లో భాగంగా హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ స్కై ట్రేడ్‌మార్క్ 360 డిగ్రీస్ స్కూప్ షాట్ ఆడాడు. లబూషేన్ ఈ షాట్‌ను అచ్చుగుద్దినట్లు సూర్యకుమార్ యాదవ్‌లా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.😱 MARNUS 😱That's some shot at The Gabba! #BBL14 pic.twitter.com/VTTdEULcEy— KFC Big Bash League (@BBL) January 16, 2025ఎప్పుడూ క్లాసీ షాట్లు ఆడే లబూషేన్ విన్నూత్నమైన షాట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లబూషేన్ 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో లబూషేన్‌కు ఇదే అత్యధిక స్కోర్.లబూషేన్ సూపర్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), మ్యాట్ రెన్షా (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అల్సోప్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. నాథన్ మెక్‌స్వీని (1), మ్యాక్స్ బ్రయాంట్ (4) విఫలమయ్యారు.లబూషేన్ ధాటికి హరికేన్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా రిలే మెరిడిత్‌కు లబూషేన్ చుక్కలు చూపించాడు. లబూషేన్ స్కై తరహా సూపర్ సిక్సర్‌ను మెరిడిత్ బౌలింగ్‌లోనే బాదాడు. మెరిడిత్ తన కోటా నాలుగు ఓవర్లలో వికెట్లు ఏమీ తీసుకోకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు. హరికేన్స్ కెప్టెన్ నాథన్ ఇల్లిస్ మూడు వికెట్లు తీసుకున్నప్పటికీ.. 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. మార్కస్ బీన్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ పడగొట్టారు.202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ ధాటికి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆ జట్టు 8.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. ఓవెన్ 20 బంతుల్లో బౌండరీ, అర డజను సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కాలెబ్ జువెల్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. కాలెబ్ 24 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. చార్లీ వకీం డకౌట్ కాగా.. కాలెబ్‌కు జతగా నిఖిల్ చౌదరీ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ నెగ్గాలంటే 70 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. -
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో పదిహేను మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎట్టకేలకు షమీ పునరాగమనంఇక ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ బెంగాల్ బౌలర్.. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలో దిగిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున బరిలోకి దిగి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఓవర్ల కోటా పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఫిట్నెస్ నిరూపించుకున్న షమీకి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు, మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విశ్రాంతి పేరిట జట్టుకు దూరమయ్యారు.వైస్ కెప్టెన్‌గా అతడేఈ క్రమంలో షమీ సారథ్యంలోని పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ల కోటాలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్షోయి స్థానం సంపాదించగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(Axar Patel), వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. ఇక ఈ సిరీస్ ద్వారా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.సూపర్‌స్టార్‌పై వేటు!మరోవైపు.. సూపర్‌స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కారణంగా బిజీగా గడిపిన పంత్‌కు విశ్రాంతినిచ్చారా? లేదంటే అతడిపై వేటు వేశారా అన్నది మాత్రం తెలియరాలేదు.ఇక సౌతాఫ్రికాలో మాదిరి ఈసారి కూడా అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. లెఫ్టాండర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా ఈ జట్టులో ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో అదరగొట్టిన టీమిండియాకాగా సూర్య సేన చివరగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ ఆడింది. ఆ టూర్లో సంజూ శాంసన్, తిలక్ వర్మ రెండేసి శతకాలతో దుమ్ములేపారు. వీళ్లిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లుకోల్‌కతా వేదికగా జనవరి 22న మొదటి టీ20 జరుగనుండగా.. జనవరి 25న చెన్నై రెండో టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం.. జనవరి 28న రాజ్‌కోట్‌లో మూడో టీ20.. జనవరి 31న పుణె వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలో ఐదో టీ20 జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు మాత్రం బీసీసీఐ జట్టును ప్రకటించలేదు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్). చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్!