Australia vs India, 4th T20I Updates And Highlights: టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడుతున్నాయి.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
16.4: జితేశ్ శర్మను జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో జితేశ్ (4 బంతుల్లో 3) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. వాషీ ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 136-6(16.5).
ఐదో వికెట్ డౌన్
16.1: ఆడం జంపా బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చిన తిలక్ వర్మ (6 బంతుల్లో 5) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రావడంతోనే ఫోర్ బాదగా.. జితేశ్ 3 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 135-5(16.2)
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
15.1: బార్ట్‌లెట్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన సూర్య (10 బంతుల్లో 20). స్కోరు: 125-4(15.1). జితేశ్ శర్మ క్రీజులోకి రాగా.. తిలక్ రెండు పరుగులతో ఉన్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
14.1: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ గిల్(39 బంతుల్లో 46) బౌల్డ్. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 121-3(14.1). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. సూర్య 7 బంతులు ఎదుర్కొని 18 పరుగులతో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
11.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన శివం దూబే. 18 బంతులు ఎదుర్కొన దూబే ఓ ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి ఎల్లిస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 88-2(11.3). గిల్ 34 పరుగులతో ఉన్నాడు.
పది ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 75-1.
శివం దూబే 11, గిల్ 33 పరుగులతో ఆడుతున్నారు.
భారత్ తొలి వికెట్ డౌన్..
6.4: 56 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.
దూకుడుగా ఆడుతున్న గిల్..
4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(18), అభిషేక్ శర్మ(12) దూకుడుగా ఆడుతున్నారు.
టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడుతున్నాయి. కరారా ఓవల్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక నాలుగో టీ20లో ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులు చేసింది.
ఆడం జంపా, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్‌లను తుదిజట్టుకు ఎంపిక చేసింది. ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమన్‌లను పక్కనపెట్టింది. మరోవైపు.. టీమిండియా మూడో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది. దీంతో సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి తప్పలేదు.
1-1తో సమంగా
కాగా భారత్- ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సూర్యసేన సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక నాలుగో టీ20లో గెలిచి ఆధిక్యం సంపాదించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.
తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.


