భారతీయ సంప్రదాయ చీరకట్టు అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రముఖ సినీనటి సమంత అన్నారు. జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ శారీస్ షోరూంను సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరలు భారతీయ యువతులకు అత్యంత ప్రియమైన నేస్తాలుగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తన అభిమానులకు ఆమె చిరునవ్వుతో అభివాదం చేశారు.


