breaking news
Samantha
-
శోభిత, సమంతతో నాగచైతన్య.. ఫోటో వైరల్
అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట ఇటీవలే మొదటి పెళ్లిరోజును సింపుల్‌గా జరుపుకున్నారు. ఫస్ట్ యానివర్సరీ రోజు తమ పెళ్లిరోజు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసున్న ఫోటోలను తరచూ కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈసారి చై-శోభితతో పాటు సమంత కూడా కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఫ్యామిలీ ఫోటోఅవును, చై, శోభిత, సమంత.. ముగ్గురూ కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. కాకపోతే ఇక్కడ సమంత అంటే హీరోయిన్ సామ్ కాదులెండి. శోభిత సోదరి! ఆమె పేరు కూడా సమంతనే కావడంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. చై మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.చై వైవాహిక జీవితంహీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. ఏ మాయ చేసావే మూవీలో తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. క్యూట్ కపుల్‌గా కనిపించే ఈ జంట మధ్య తర్వాత తెలియని అగాధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ 2021లో విడాకులు తీసుకున్నారు.రెండో పెళ్లితర్వాత చై.. హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2024 డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. అటు సమంత కూడా కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. 2025 డిసెంబర్ 1న ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో సామ్-రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. #NagaChaitanya seen with his wife #Sobhita and her sister #Samantha pic.twitter.com/FxOsh9ldFS— Milagro Movies (@MilagroMovies) December 21, 2025 -
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
-
నటి సమంతకు చేదు అనుభవం..
హైదరాబాద్‌లో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. కొద్దిరోజుల్లోనే సమంత ఒక కార్యక్రమం కోసం వస్తున్నడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో భద్రతా సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ వెర్రి అభిమానంపై నెట్టింట తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న యువతనే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం కోసం పట్టుచీరలో ఎంతో హుందాగా వెళ్లిన సమంత.. ఆ కార్యక్రమం ముగించుకుని కారు వైపు వెళ్తుండగా చాలామంది ఆమెను చుట్టుముట్టారు. దీంతో భద్రతా సిబ్బంది అతికష్టంతో ఆమెను సురక్షితంగా కారు వరకు చేర్చారు. అక్కడికి వచ్చిన వారిని అదుపు చేయడం కూడా వారికి కష్టంగా మారింది. వారి మధ్యలో సమంత నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లులూ మాల్లో నిధి అగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ ఈవెంట్ నుంచి ఆమె తిరిగి వెళ్తుండగా తనకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తనపై చేతులు కూడా వేయడంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిధి కూడా ఇదే ఘటనపై ఈవెంట్ నిర్వాహుకులను తప్పుబట్టింది. వరుసుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ కూడా ఉండదా..? అంటూ భగ్గుమంటున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని విమర్శలు వస్తున్నాయి. Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg— Cineholic (@Cineholic_india) December 21, 2025 -
సమంతలో కొత్త పెళ్లికూతురి కళ.. కల్యాణి గ్లామర్!
సమంత ఫేస్‌లో కొత్త పెళ్లికూతురి కళగ్రీన్ డ్రస్‌లో మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్డ్యాన్స్ చేస్తూ మాయ చేస్తున్న 'ఫౌజీ' ఇమాన్వీ'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ వీకెండ్ ట్రిప్జిగేలుమనేలా దడపుట్టించేస్తున్న సంయుక్తబ్యాంకాక్ ట్రిప్‌లో సీరియల్ బ్యూటీ నవ్వస్వామి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
తొలిసారి అలా కనిపించిన సామ్ దంపతులు.. వీడియో వైరల్
అందరూ ఊహించినట్లుగానే సమంత రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సామ్ పెళ్లాడింది. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఈ పెళ్లి తర్వాత వీరిద్దరు మొదటిసారి జంటగా బయట కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఈ నూతన వధువరులు కెమెరాలకు చిక్కారు. ఈ జంటను చూసిన కొందరు కంగ్రాట్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత మొదట టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా ఈ ఏడాది సామ్ రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. #Samantha was seen at the airport with husband #RajNidimoru for the first time after their wedding. 😍#FilmfareLens pic.twitter.com/ohc48wCUgj— Filmfare (@filmfare) December 13, 2025 -
సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్ పిన్ని
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్ శోభారాజు. శోభారాజు రియాక్షన్2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే..వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందిఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్సైజ్లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. బహుమతులు ఏమిచ్చారంటే?ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్‌కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్ వాడని పర్ఫ్యూమ్స్ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్‌బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా? -
సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్
హీరోయిన్ సమంత.. నాలుగు రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా వివాహం తర్వాత సెలబ్రిటీలు చాలామంది హనీమూన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ సామ్ మాత్రం పనిలో పడిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో సమంత కనిపించింది. తర్వాత తానే నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీ తీసింది. ఈ ఏడాది మే నెలలో చిత్రం రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. తానే నిర్మాత, హీరోయిన్గా సమంత.. 'మా ఇంటి బంగారం' అనే చిత్రం చేస్తోంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.(ఇదీ చదవండి: సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?)మధ్యలో సమంత పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని సమంత బయటపెట్టింది. సెట్స్‌లో దర్శకురాలు నందినీ రెడ్డితో ఉన్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలా పెళ్లయిన నాలుగు రోజులకే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా పనిలో పడిపోయిందనమాట.'మా ఇంటి బంగారం' సినిమా విషయానికొస్తే.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. కొన్నాళ్ల ముందే నందినీ రెడ్డి దర్శకత్వంలో మొదలైంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తున్నప్పటికీ.. రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)
-
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్‌ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్‌గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి. -
సమంత, రాజ్ పెళ్లి .. బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురుచూడొద్దు: శ్యామాలి
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం తర్వాత నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్ మాజీ భార్య శ్యామాలి (Shhyamali) పట్ల చాలామంది సానుభూతి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో తాజాగా ఆమె ఒక పోస్ట్ చేశారు. తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చాలామంది తన ఇంటర్వ్యూల కోసం అడుతున్నారని చెప్పారు. అయితే, తాను ఈ అవకాశం ఎవరికీ ఇవ్వనని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిలో తన నుంచి బ్రేకింగ్ న్యూస్‌లతో పాటు ఇంటర్వ్యూలు ఎవరూ ఆశించవద్దని కోరారు. సమంత - రాజ్ నిడిమోరు వివాహ గురించి తాను పట్టించుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.సమంత- రాజ్‌ల వివాహం తర్వాత తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని శ్యామాలి ఇప్పటికే ఒక పోస్ట్ చేశారు. చాలా మంది నాపై అభిమానం చూపారు. వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఎవరి గురించి మాట్లాడే పరిస్థితిలో లేను. మా గురువు గారు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. నా సోషల్‌మీడియా ఖాతాను కూడా నేనే మెయిన్‌టెన్ చేస్తాను. అందుకోసం నేను పీఆర్‌ను పెట్టుకోలేదు. మా గురువు గారి ఆరోగ్యం పట్ల ఇప్పటికే చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా అలసిపోయాను. కాబట్టి ఎవరూ కూడా నా నుంచి బ్రేకింగ్‌లు ఆశించకండి. ఆపై ఇంటర్వ్యూల కోసం ఎదురుచూడకండి.' అని శ్యామాలి కోరారు. -
సమంత రెండో పెళ్లి.. కొత్త ఫోటోలు వైరల్ (ఫొటోలు)
-
సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?
హీరోయిన్ సమంత రీసెంట్‌గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?దర్శకుడు రాజ్‌తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్‌ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్‌గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్‌కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత, నాగ చైతన్య, శోభిత కలిసి నటించారా..! ఆ సినిమా ఏదంటే..?
-
అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ సమంత- దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం (డిసెంబర్ 1న) రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమం వేదికగా నిలిచింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయం గురించి ఎన్నడూ పెదవి విప్పి మాట్లాడలేదు. ఇప్పుడేకంగా పెళ్లి చేసుకుని అభిమానులను సర్ప్రైజ్ చేశారు.ఆనంద భాష్పాలుఈ క్రమంలో సమంత.. తన భర్త కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోను రాజ్ సోదరి శీతల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. ప్రదోషకాలంలో శివుడిని పూజిస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలు. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత-రాజ్ కలిసికట్టుగా ముందుకు సాగడం చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. మా ఆశీర్వాదం..మా కుటుంబం అన్నివేళలా వారికి అండగా, తోడుగా నిలబడుతుంది. మా అందరి ఆశీర్వాదాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కొన్ని బంధాలు మన జీవితాల్లోకి ఎంతో ప్రశాంతతను తీసుకొస్తాయి. ఇది కూడా అలాంటిదే! ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వచ్ఛమైన, శాంతియుత ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు సమంత (Samantha Ruth Prabhu) స్పందిస్తూ లవ్ యూ అని కామెంట్ చేసింది. View this post on Instagram A post shared by Sheetal Nidimoru (@sheetalnidimoru) చదవండి: నాతో పనిచేసినోళ్లంతా పెద్ద హీరోలయ్యారు.. నేనే సక్సెస్ లేక.. -
సమంత రెండో పెళ్లి.. ఆమె ఆస్తుల విలువ అన్ని కోట్లా?
ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్ గ్రౌండ్ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్‌గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.సమంత ఆస్తులే ఎక్కువ.. ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్ అంచనా వేస్తున్నారు.కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టింది. -
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్
డేటింగ్ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్-రాజ్ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అటు సామ్(Samantha)కి, ఇటు రాజ్‌కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. (చదవండి: సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!)ఇదిలా ఉంటే.. సామ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. గతంలో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్‌గా మాట్లాడారు.‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్‌గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను. వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్‌గా అయిపోయి.. గాసిప్లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్‌ని ఒక ఎంటర్టైన్మెంట్లా మార్చేశారు. నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు. The moment he's speaking with a well-disciplined expression I'm came here from a broken family, Naaku thelusu aa pain ento.Hatts off to your Maturity levels 📈 #NagaChaitanya ❤️🩹🛐 pic.twitter.com/8aYYqCU9HX— Amoxicillin (@__Amoxicillin_) December 1, 2025 -
పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?
టాలీవుడ్లో అప్పట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన పూనమ్ కౌర్.. ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌పై గతంలో పలుమార్లు సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతానికి యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ట్వీట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ మహిళ గురించి పరోక్షంగా ప్రస్తవించింది.(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)'మన ఇల్లు బాగుండాలని పక్క ఇల్లు కూల్చేయడం సరికాదు. అది కూడా ఓ శక్తిమంతమైన బాగా చదువుకున్న ఎక్కువ ప్రాధాన్యం గల మనిషి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. సరిగ్గా ఈమె ట్వీట్ చేసినప్పుడే సమంత మరో పెళ్లి చేసుకుంది. దీంతో పూనమ్.. సమంతని ఉద్దేశిస్తూనే ఈ ట్వీట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.సమంతకు ఇది రెండో పెళ్లి. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుల్లో ఒకడైన రాజ్ నిడిమోరునే వివాహం చేసుకుంది. రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలి అనే మహిళతో ఇతడికి పెళ్లి జరిగింది. ఆమెకు మూడేళ్ల క్రితమే విడాకులు ఇచ్చేశాడని అంటున్నారు గానీ దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు సామ్-రాజ్.. ఈశా ఫౌండేషన్‌లోని ఓ ఆశ్రమంలో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే బయటపెట్టింది. కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?) -
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఈ శుభకార్యం జరిగింది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. ఈ పెళ్లి గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు అందరికీ తెలుసు. అయితే సమంతకు చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా? ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా? అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది.రాజ్‌తో సమంత స్నేహం ఇప్పటిది కాదు. 'ద ఫ్యామిలీ మ్యాన్' షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే 2020 నుంచే వీళ్లకు పరిచయముంది. కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల మధ్య బాండింగ్ పెరిగినట్లుంది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం సామ్-రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు. దీంతో వీళ్ల డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)పెళ్లి తర్వాత ఫొటోలని సమంత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఒకదానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. అయితే ఈ రింగ్ గతంలో సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అది కూడా ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందు రోజు. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అనే సందేహం వస్తోంది. అప్పుడే చేతికి రింగ్‌తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.సమంత.. గతంలో తెలుగు హీరో నాగచైతన్యని 2017లో పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా శ్యామోలి అనే మహిళని 2015లో పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీళ్లు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా సామ్, రాజ్.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.(ఇదీ చదవండి:'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నిజాయతీతో పనిచేయాలి.. నాగచైతన్య ట్వీట్
సినీ నటుడు నాగచైతన్య సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తను నటించిన తొలి వెబ్‌సిరీస్ 'దూత' రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీగా ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తే ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారని దూత నిరూపించిందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. నటుడిగా సృజనాత్మకమైన కథను ఎంపిక చేసుకుని అందుకు తగ్గట్టుగా నిజాయతీతో పని చేసి ఆపై మంచి ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు. ‘దూత’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు.దూత వెబ్‌సిరీస్ చాలా బాగా నచ్చిందంటూ అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సీజన్-2 ఎప్పుడు తీసుకోస్తారంటూ వారు కోరుతున్నారు. దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్ 2023 డిసెంబరు 1న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. ఇందులో జర్నలిస్టు సాగర్ వర్మ పాత్రలో నాగచైతన్య మెప్పించారు. నాగచైతన్య దూత వెబ్ సిరీస్ గురించి ట్వీట్ చేయడంతో సమంత పెళ్లి గురించి కూడా కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
రాజ్‌తో సమంత రెండో పెళ్లి.. ఇంత ఏజ్ గ్యాప్ ఏంటి సామీ..!
గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌కు నేటితో చెక్ పడింది. సామ్-రాజ్ ఎక్కడా కనిపించినా డేటింగ్ రూమర్స్ వైరలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరు మరింత సన్నిహితంగా మెలగడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం దాదాపు ఫిక్సయిపోయారు. అందరూ అంచనాలను నిజం చేస్తూ రెండో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఊహించిందే అయినప్పటికీ.. సామ్ స్టార్ హీరోయిన్ కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.ఇక పెళ్లి విషయం పక్కనపెడితే అందరి నోటా ఒకటే చర్చ నడుస్తోంది. రెండో పెళ్లి ఓకే.. కానీ వీరిద్దరు వయస్సు మధ్య తేడా ఎంత అనేది ప్రశ్న. ప్రేమ, పెళ్లికి వయసుతో పనేంటని అందరూ అంటూనే ఉంటారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సామ్- రాజ్ ఏజ్ గ్యాప్ ఎంతనేది కూడా నెట్టింట చర్చ మొదలైంది. పెళ్లి చేసుకునే జంటకు పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని అందరూ అనడ మనం వింటుంటాం. మరి వీరి మధ్య ఏంత తేడా ఉంది? అసలు సమంత- రాజ్ మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుందాం.సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఈ లెక్కన సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. అయితే రాజ్‌కు సంబంధించిన అఫీషియల్ పుట్టినరోజు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజ్ 1975 ఆగస్టు 4వ తేదీన తిరుపతలో జన్మించారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. ఈ లెక్కన సామ్- రాజ్‌కు మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 12 సంవత్సరాలు. వయస్సుల పరంగా చూస్తే ఇద్దరి మధ్య ఇంత అంతరం ఉండడం చర్చకు దారితీసింది. దీంతో సమంత నిర్ణయంపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రేమకు వయస్సుతో పనిలేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి మధ్య పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. సమంత రూత్ ప్రభు 2017లో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021లో వివాహాబంధానికి గుడ్ బై చెప్పేసింది. తాజాగా మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. రాజ్ నిడిమోరును పెళ్లాడింది. రాజ్ సైతం గతంలో శ్యామలి దేను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సామ్- రాజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ల్లో కలిసి పనిచేశారు. -
'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?
సమంత మరో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' అనే సంప్రదాయం ప్రకారం సమంత.. ఈ వివాహం చేసుకుంది. ఇంతకీ ఏంటిది? దీనికి అర్థం ఏంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం సమంత పెళ్లిని నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఇది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు.. పంచభూతాలు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ఈ 'భూత శుద్ధి వివాహం'.ఈశా యోగ కేంద్రలో ప్రాణ ప్రతిష్ట చేసిన లింగ భైరవి దేవి.. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్ట ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం. భక్తుల మనశ్శరీరాలకు, శక్తులని స్థిరపరుస్తూ, పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతిదశలోనూ వారికి అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఈశా ఓ ప్రకటన రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సమంత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత .. రాజ్ పెళ్లిపై మొదటి భార్య షాకింగ్ పోస్ట్.!
-
సమంత రెండో పెళ్లి ఫోటోలు వైరల్..
-
సమంత- రాజ్ రెండో పెళ్లి ఫోటోలు చూశారా..
-
Coimbatore: 30 మంది అతిథుల సమక్షంలో.. సమంత రెండో పెళ్లి!!
-
రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
హీరోయిన్ సమంత.. దర్శకుడు రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి తెగ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సమంత అధికారికంగా ప్రకటించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లోని ఓ ఆశ్రమంలో ఈ శుభకార్యం జరిగింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇంతకీ రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? ఇతడు తెలుగోడే అని మీలో ఎంతమందికి తెలుసు?రాజ్ పూర్తి పేరు రాజ్ నిడిమోరు. పుట్టి పెరిగింది అంతా తిరుపతిలోనే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన వెంటనే ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే ఇతడికి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న డీకేతో (కృష్ణ దాసరి) పరిచయం ఏర్పడింది. అలా వీళ్లిద్దరూ స్నేహితులు అయ్యారు. కలిసి మొదటగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. అది సక్సెస్ కావడంతో 'ఫ్లేవర్స్' అనే ఇంగ్లీష్ మూవీ తీశారు. తర్వాత స్వదేశానికి తిరిగొచ్చేశారు.మొదటగా హిందీలో '99' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తర్వాత తెలుగులో 'ఇంకోసారి' అనే చిత్రానికి రైటర్స్‌గా పనిచేశారు. మళ్లీ హిందీలో 'షోర్ ఇన్ ద సిటీ', గో గోవా డాన్ అనే మూవీస్ తెరకెక్కించారు. అనంతరం తెలుగులో 'డీ ఫర్ దోపిడీ' అనే సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో నవీన్ పొలిశెట్టి ఓ హీరోగా నటించాడు. తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైపోయారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే రాజ్-డీకేకి 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. రెండో సీజన్ కోసం విలన్ పాత్ర కోసం సమంతని ఎంపిక చేశారు. అలా సమంత-రాజ్ మధ్య తొలి పరిచయం ఏర్పడింది. వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న టైంలో వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది.కొన్నాళ్ల తర్వాత రాజ్-డీకే తీసిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో సమంత లీడ్ రోల్ చేసింది. అప్పటినుంచి పలు సందర్భాల్లో రాజ్‌తో ఉన్న ఫొటోలని సమంత పోస్ట్ చేస్తుండేది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకున్నారు. గత కొన్ని నెలల్లో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. దీంతో త్వరలో గుడ్ న్యూస్ చెబుతారేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు సడన్‌గా సమంతతో రాజ్ పెళ్లి అయిపోయింది. ఈ మేరకు సమంత ప్రకటన చేసింది.సమంతకి ఇది రెండో పెళ్లి. అలానే రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలిని పెళ్లి చేసుకున్న రాజ్.. 2022లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. రాజ్ ఆస్తుల విషయానికొస్తే.. దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.90 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. మిత్రుడు డీకేతో కలిసి డీ2ఆర్(D2R) అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇందులో ఇప్పటికే పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు నిర్మించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ట్రెండింగ్‌లో సమంత (ఫొటోలు)
-
మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత
-
మరో పెళ్లి చేసుకున్న సమంత
హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి ఈమె.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే చాలాసార్లు వీళ్లు జంటగా కనిపించారు. ఇప్పుడు ఆ వార్తలని నిజం చేస్తూ సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈరోజు (డిసెంబరు 01) ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో కేవలం 20 మంది అతిథుల సమక్షంలోనే సామ్-రాజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ మేరకు మొదట వార్తలు బయటకొచ్చాయి. కాసేపటికే సమంత.. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)'ఏ మాయ చేశావె' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో పనిచేసింది. నాగచైతన్యతోనూ పలు చిత్రాల్లో కలిసి పనిచేసింది. అలా చేస్తున్న టైంలోనే సామ్-చైతూ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.విడాకుల తర్వాత హీరోయిన్ శోభితతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ చేస్తున్న టైంలో సమంత-రాజ్ మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహంతో ఒక్కటయ్యారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్‌లో ఆరుగురు) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
డిజిటల్ హింసపై యునైట్ ఫైట్
‘బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు’ సరదాగా పాడుకున్న పాట. బుల్లిపెట్టెలో ఆ బూచాడు లేకపోవచ్చు. కాని ఇప్పటి బుల్లిపెట్టెలలో (స్మార్మ్ఫోన్స్, ల్యాప్‌టాప్, ట్యాప్)లలో ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. మహిళలను లక్ష్యంగా చేసుకొని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ రాక్షడుసుడి పేరు... ‘డిజిటల్ హింసాసురుడు’‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ అగేనెస్ట్ ఉమెన్’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి డిజిటల్ హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాలలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది భాగస్వాములు అవుతున్నారు... కాలంతో పాటు మహిళలపై జరిగే హింసా రూపాలు మారుతున్నాయి.‘డిజిటల్ వయోలెన్స్’ అనేది ఇప్పుడు సరికొత్త సాంకేతిక హింస.వైరల్ అయినా ప్రమాదమేనా?!కేవలం రెండు సెకన్ల వీడియోతో ఇటీవల ఇంటర్నెట్ అబ్సెషన్‌గా మారింది ప్రియంగన. తక్కువ టైమ్‌లోనే ఈ వీడియో క్లిప్ 50 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు... ఆమె ఏఐ వీడియోలు ఆల్‌లైన్‌లో వెల్లువెత్తాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆమె ఏఐ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. పరిస్థితి ప్రమాదం వైపు వెళుతుందని గ్రహించిన ప్రియంగన మెల్లగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను తొలిగించడం మొదలుపెట్టింది. తన వీడియో క్లిప్ వైరల్ కావడం వల్ల ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టిన ప్రియంగన తన ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఇమేజ్‌ల వల్ల తాను, తన కుటుంబం ఇబ్బందులు పడినట్టు తెలియజేసింది. ఇది మచ్చుకు చిన్న ఉదాహరణ మాత్రమే!అవమానాలు...ఆత్మహత్యలుడిజిటల్ హింస భరించలేక మానసిక సమస్యల బారిన పడుతున్నవారూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. టెక్నాలజీ–ఫెసిలేటెడ్ జెండర్–బేస్డ్ వయోలెన్స్(టీఎఫ్జీబివి) వల్ల మన దేశంలోని ఆన్లైన్ స్పేస్‌లు మహిళల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయని ఒక నివేదిక హెచ్చరించింది. బహిరంగంగా అవమానించడం, అవహేళన చేయడం, బెదిరింపులు... మొదలైన రూపాల్లో మహిళలపై డిజిటల్ హింస జరుగుతోంది. ఫొటోల డిజిటల్ మాన్యుపులేషన్, ఫేక్ ఎకౌంట్స్, సైబర్ బుల్లీయింగ్, కోఆర్డినేటెడ్ ఎటాక్స్.. మొదలైనవి డిజిటల్ హింస తాలూకు వివిధ రూపాలు. అశ్లీల సైట్లు, చాట్ ప్లాట్‌ఫామ్‌లలో తాము టార్గెట్ చేసిన మహిళల చిత్రాలను పోస్ట్ చేసి అసభ్య రాతలు రాస్తుంటారు. ‘ఇది నా ఫోన్ నంబర్ కాల్ చేయండి’ అని ఫోన్ నెంబర్ పెడుతుంటారు.ఫిర్యాదు చేయాలా, వద్దా?డిజిటల్ వేదికలలో కొందరు నేరస్థులు మంచి మాటలతో అమ్మాయిలను పరిచయం చేసుకొని, స్నేహం చేస్తారు. ఆ తరువాత రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంత జరుగుతున్నా చాలామంది బాధితులు పోలిస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.‘ఫిర్యాదు చేయడం అనేది మరొకరకమైన హింస. నా దురదృష్టం అని బాధపడి ఊరుకున్నాను’ అంటుంది దిల్లీకి చెందిన ఒక బాధిత మహిళ. పదిమందికి తెలిస్తే పరువు పోతుంది అనుకోవడం, కుటుంబ ఒత్తిళ్లు, న్యాయం జరగదు అనే అపోహల వల్ల చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి దూరంగా ఉంటున్నారు. కొందరు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినా, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఎంతో కాలం పట్టడం లేదు. భద్రతతో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి కారణం అవుతున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడు కొన్ని కేసులకు సంబంధించి ఎలా స్పందించాలో పోలీసులకు తెలియడం లేదు.చట్టం ఉన్నా సరే...మన దేశంలో సైబర్ నేరాలను నిరోధించే ప్రధాన చట్టం సమాచార సాంకేతిక చట్టం–2000 (ఐటీ చట్టం) అయితే ఇది ప్రధానంగా ఆస్తి, డేటాకు సంబంధించిన నేరాలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.‘మహిళలపై జరిగే డిజిటల్ హింసకు సంబంధించి ఈ చట్టం సమర్ధంగా ఉపయోగపడడం లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు.‘ఫిర్యాదు అందిన వెంటనే హానికరమైన కంటెంట్‌ను తక్షణమే తొలగించాలి. ఈ విషయంలో కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగళూరుకు చెందిన ఒక బాధితురాలు.‘డిజిటల్ స్పేస్‌లను సురక్షితంగా మార్చడానికి తగిన న్యాయ, విధాన సంస్కరణలు, బలమైన చట్టాలు అవసరం. వేగంగా న్యాయం జరగాలి. టెక్ కంపెనీలు తమ వేదికలపై జరిగే హానికి బాధ్యత తీసుకోవాలి’ అంటుంది విద్యావేత్త, రచయిత్రి అమంద. ‘ఆన్లైన్ కేసుల నుంచి తప్పించుకోవడానికి చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారు. అలాంటివి జరగకుండా చూడాలి’ అంటోంది ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న జీవని.డిజిటల్ హింసపై వార్జెండర్–ఆధారిత హింసకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ విమెన్ ఇండియా పదహారు రోజుల ప్రచారకార్యక్రమం నిర్వహిస్తోంది. నవంబర్ 25న మొదలైన ఈ ప్రచార కార్యక్రమాలు డిసెంబర్ 10 వరకు కొనసాగుతాయి. ఈ జెండర్బేస్డ్ వయోలెన్స్ వ్యతిరేక క్యాంపెయిన్‌లో యునెటైడ్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేస్తోంది సినీ నటి, నిర్మాత సమంత.‘మహిళలు, పిల్లలపై జరిగే హింసను అంతం చేయడాకి ఐక్యం అవ్వండి’ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. పెరుగుతున్న ఆన్లైన్ వేధింపుల గురించి సమంత అవగాహన పరుస్తుంది. అప్రమత్తం చేస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న స్టాకింగ్, డాక్సింగ్. డీప్‌ఫేక్స్, ఇమేజ్ మాన్యుపులైజేషన్పై గట్టిగా గొంతు విప్పుతోంది. ‘హింస అనేది ఇప్పుడు శారీరక హింస మాత్రమే కాదు. అది స్క్రీన్ రూపంలో కూడా వెంటాడుతుంది. మన గొంతులను నొక్కి మౌనంగా చేస్తుంది. మహిళలే లక్ష్యంగా చేసుకునే జరిగే డిజిటల్ హింస వారి భద్రత, గుర్తింపు,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది’ అంటుంది సమంత. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్న సమంత డిజిటల్ హింసకు సంబంధించి తన వ్యక్తిగత చేదు అనుభవాలను పంచుకుంటుంది. క్యాంపెయిన్‌లో భాగంగా ‘వీడియో మెసేజ్’ను విడుదల చేసింది ‘యూఎన్ విమెన్ ఇండియాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు జవాబుదారీతనం పెరగాలి. రక్షణ చట్టాలను బలోపేతం చేయాలి’ అంటుంది సమంత.ఐశ్వర్య... హైకోర్టు వరకుతన వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించింది బాలీవుడ్ సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్. దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజñన్స్(ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి తన చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్నారని, అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారని తన పిటిషన్లో తెలియజేసింది ఐశ్వర్య. తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ‘ఐశ్వర్య ఫొటోలు దురిన్వియోగం చేయడం అనేది ఆమె గౌరవ, ప్రతిష్ఠలను దెబ్బతియడమే’ అని పేరొన్న న్యాయస్థానం పిటిషన్లో ఐశ్వర్య పేర్కొన్న యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని గూగుల్‌తో సహా రకరకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించిది. -
ఆన్లైన్ హింసను అరికట్టాలి
‘‘మనం హింస గురించి ఆలోచించినప్పుడు వీధుల్లో, ఇంట్లో, పని ప్రదేశాల్లో జరుగుతుందనుకుంటాం. కానీ, ప్రస్తుతం ఆన్లైన్లో కూడా జరుగుతోంది. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ హింసని ఎదుర్కొంటోంది’’ అని పేర్కొన్నారు సమంత. మహిళలపై పెరుగుతోన్న ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేయనున్నారామె. మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అంటూ యూఎన్ విమెన్ ఇండియా నిర్వహిస్తున్న ‘నో ఎక్స్క్యూజ్’ కార్యక్రమానికి సమంత మద్దతుగా నిలిచారు. నవంబరు 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 10 వరకు జరగనుంది. ‘‘సోషల్ మీడియాలో కామెంట్స్, ఆన్లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫొటోలు వంటివన్నీ జరుగుతున్నాయి. ఇవి మహిళలు నలుగురిలో తమ గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తున్నాయి... అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయి. నేను ఎన్నోసార్లు ఈ పరిస్థితిని అనుభవించాను. వేధింపుల వల్ల చాలామంది మహిళల జీవితాలు, కెరీర్ ఆగిపోయాయి. ఆన్లైన్లో అబ్యూజ్ చేయడాన్ని జోక్‌గా ట్రీట్ చేయడం ఆపేస్తే మనం ఇంటర్నెట్‌ని బెటర్‌గా మార్చొచ్చు. ఆన్లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు రావాలి. ఇది మహిళలకు భద్రతగా మారుతుంది. ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన పెరగాలి’’ అని సమంత పేర్కొన్నారు. -
'అలా నాకు సాధ్యం కాదని అనుకునేదాన్ని'.. సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో బిజీగా ఉంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఈ చిత్రానికి సామ్ నిర్మాత కాగా.. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొద్దికాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడికెళ్లినా రాజ్, సామ్ జంటగా కనిపించడంతో పాటు అత్యంత సన్నిహితంగా మెలగడంతో దాదాపు కన్ఫామ్ అయినట్లేనని ఆడియన్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా సుదీర్ఘమైన నోట్ కూడా రాసుకొచ్చింది. ఫుల్ యాక్షన్ మోడ్.. బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం నా బ్యాక్ బలంగా లేదని వదిలేశా.. ఎందుకంటే నా జీన్స్‌లో అలా లేదని అనుకునేదాన్ని అని తెలిపింది. ఎవరినైనా అలాంటి వారిని చూసినప్పుడు.. నాకు అలా సాధ్యం కాదని అనుకుంటానని సామ్ పోస్ట్ చేసింది.కానీ అదంతా తప్పని ఇప్పుడు తెలిసింది. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా.. దాన్ని ఇప్పుడు చూపించబోతున్నా.. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించానని సామ్ తెలిపింది. బాడీలో కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం.. మీరు ఎలా కనిపిస్తారనే దాని కోసం మాత్రమే కాదు.. మీరు ఎలా జీవిస్తారు.. ఎలా కదులుతారు.. మీ వయస్సు ఎలా పెరుగుతుందనే దాని కోసమని తెలిపింది.అలాగే మీ వయసు పెరిగే కొద్ది.. బలమైన శిక్షణే మీ బెస్ట్ ఫ్రెండ్‌గా మారాలని సూచించింది. ఈ బలమైన శిక్షణే నాకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసింది.. క్రమశిక్షణ, సహనం నేర్పింది.. ఇదంతా జన్యువుల వల్ల వచ్చింది కాదని అర్థమైంది. అదంతా మనం చెప్పే ఒక సాకు మాత్రమేనని తనకు తెలిసొచ్చిందని సమంత పోస్ట్ చేసింది. నువ్వు ఏదైనా వదులుకునే దశలో ఉంటే.. ఇప్పుడు అస్సలు వదులుకోవద్దు.. నువ్వు అలానే ముందుకు సాగితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందని సామ్ అంటోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మాస్ కాంబినేషన్ సెట్..!
-
రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!
ఫలితంతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే టాలీవుడ్ హీరో రవితేజ.. కొన్నిరోజుల క్రితమే 'మాస్ జాతర'తో వచ్చాడు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండేసరికి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రీసెంట్‌గానే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.ఇప్పుడు రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా సమంతని తీసుకోబోతున్నారనే రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్లో ఇది ఫ్రెష్ కాంబో అవుతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)శివ నిర్వాణ సినిమాలు అనగానే దాదాపు ఫ్యామిలీ సబ్జెక్టులే గుర్తొస్తాయి. చివరగా తీసిన 'ఖుషి' లవ్ స్టోరీనే. అందులో హీరోయిన్ సమంతనే. అయితే శివ ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడని.. దీనికి రవితేజ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు సమంత హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఈ నెలలోనే లాంచ్ ఉండొచ్చని టాక్.ఈ మధ్యే సమంత.. 'మా ఇంటి బంగారం' అనే సినిమా మొదలుపెట్టింది. హీరోయిన్ కమ్ నిర్మాత ఈమెనే. నందినీ రెడ్డి దర్శకురాలు. ఇప్పుడు రవితేజతోనూ మూవీ చేయనుందని టాక్ వచ్చిందంటే.. హీరోయిన్గా చేసేందుకు ఆసక్తి చూపిస్తుందనమాట. మరి వస్తున్న పుకార్లలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
కొత్త చాప్టర్ మొదలైంది..: సమంత
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఫోకస్ అంతా సినిమాల కన్నా బిజినెస్ వైపే ఎక్కువగా ఉంది. మొన్నటికి మొన్న కొత్త పర్ఫ్యూమ్ లాంచ్ చేసిన సామ్ ఇప్పుడు మరో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ 'ట్రూలీ స్మా' అనే క్లాతింగ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ బ్రాండ్‌కు సామ్ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు హీరోయిన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.బిజినెస్ ఉమెన్సమంత యాక్టింగ్‌కే కాదు, లుక్స్‌కు కూడా చాలా మంది ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ కొత్త డిజైనరీ డ్రెసెస్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పటికే సామ్.. 'సాకీ' పేరుతో బట్టల బిజినెస్ చేస్తోంది. 2020లో ఈ వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ట్రూలీ స్మా అనే క్లాతింగ్ బ్రాండ్‌లో భాగమైంది. ఇవే కాకుండా తను 'ట్రలాలా' అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్లో 'శుభం' అనే సినిమాతో మంచి బోణీ కొట్టింది. ఇదే బ్యానర్లో తను హీరోయిన్గా మా ఇంటి బంగారం మూవీ చేస్తోంది. ఈ మధ్యే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: 'శివ' చైల్డ్ ఆర్టిస్ట్‌కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ -
నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ
సినీ నటుడు నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సోషల్‌మీడియా ద్వారా మరోసారి స్పందించారు. 'నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు తన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని స్పష్టంగా తెలుపుతున్నాను. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా పరువు తీయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన ప్రకటనలలో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే దానికి చింతిస్తున్నాను. ఆపై ఆ వాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను.' అని మంత్రి కొండా సురేఖ ఒక పోస్ట్ చేశారు.కొద్దిరోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ గౌరవాన్ని కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టిన నాగార్జున సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression…— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025 -
రాజ్‌తో సమంత డేటింగ్.. ఈ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందిగా!
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత (samantha) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఏ ఈవెంట్కెళ్లినా అతను కూడా వాలిపోతున్నాడు. గత కొన్ని నెలలుగా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటిపై ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల సమంత కొత్త సినిమా ప్రారంభోత్సంలోనూ అతను కనిపించాడు.తాజాగా మరోసారి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. అయితే ఎప్పటిలాగా కంటే ఈ సారి మరింత సన్నిహితంగా మెలిగారు. ఈ ఫోటోల్లో రాజ్ నిడిమోరును హగ్ చేసుకోవడం పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో అందరూ ఊహించినట్లుగానే రాజ్‌తో సామ్ డేటింగ్ చేస్తోందని కన్ఫామ్ చేసిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రాజ్ నిడిమోరు, సామ్ ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత సామ్, రాజ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఈ ఏడాది సమంత నిర్మించిన శుభం మూవీకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ప్రస్తుతం సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీకి కూడా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
జ్యూవెల్లరీ ఎగ్జిబిషన్ కోసం సమంత గ్లామరస్ లుక్ (ఫొటోలు)
-
సమంత 'బంగారం'లో కాంతార విలన్
కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం ఓటీటీలోకి కూడా రానుంది. అయితే ఈ మూవీలో విలన్‌గా చేసిన గుల్షన్ దేవయ్య తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. గతంలో హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీసులు చేసిన ఇతడు.. ఇప్పుడు తెలుగులో నటించేందుకు రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్‌లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)మయాసైటిస్ కారణంగా చాన్నాళ్లుగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన సమంత.. ఈ ఏడాది నిర్మాతగా 'శుభం' అనే మూవీని రిలీజ్ చేసింది. ఇప్పుడు తనే నిర్మాత కమ్ హీరోయిన్గా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. దసరాకు పూజతో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ఇప్పుడు షురా అయిపోయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత.. గృహిణిగా ఉంటూనే గన్ పట్టి యాక్షన్ కూడా చేయబోతుంది. ఇదే మూవీలో 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా బయటపెట్టాడు. సమంత పోస్ట్‌ని తన ఇన్ స్టా స్టోరీలో రీ పోస్ట్ చేసిన ఇతడు.. 'నేను కూడా ఇందులో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇదే ఇతడికి తెలుగులో మొదటి సినిమా. మరి సమంత పక్కన నటిస్తాడా లేదంటే విలన్‌గా చేయబోతున్నాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: కొందరు నటులు అసలు సెట్‌కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్) -
బంగారం ఆన్ సెట్
‘‘సన్నిహితులు, స్నేహితుల ప్రేమ, ఆశీర్వాదాల నడుమ ‘మా ఇంటి బంగారం’ ముహూర్తంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ స్పెషల్ మూవీ ఆరంభించిన సందర్భంగా అందరి ప్రేమ, సహకారం మాకు కావాలి’’ అని సమంత పేర్కొన్నారు. ఆమె లీడ్ రోల్లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించి కొన్ని నెలలైంది. ఫైనల్‌గా సోమవారం ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘శుభం’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సమంత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధానపాత్రల్లో, గౌతమి, మంజుషా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ యాక్షన్ మూవీకి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాశ్. -
ఫైనల్లీ సమంత హీరోయిన్గా కొత్త సినిమా (ఫొటోలు)
-
సమంత కొత్త సినిమా.. పూజ కార్యక్రమంలో రాజ్ నిడిమోరు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) ఇటీవల దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసింది. అఫీషియల్‌గా బయటికి చెప్పకపోయినా వీరిద్దరి రిలేషన్‌పై గత కొన్ని నెలలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా వీరిద్దరు నోరు విప్పలేదు. ఇదంతా పక్కనపెడితే సామ్ తెలుగులో మరో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె మరోసారి జతకట్టింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ముహుర్తం షాట్‌తో ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. ఓ బేబీ మూవీ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సామ్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించిన సామ్.. శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025 -
సమంత 'మా ఇంటి బంగారం' షురూ!
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram Movie). ఇందులో సామ్ గృహిణిగా యాక్ట్ చేస్తోంది. సమంత బర్త్‌డే సందర్భంగా 2024లోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. కానీ, షూటింగ్ ప్రారంభించలేదు. అయితే ఈ వారంలోనే సినిమా చిత్రీకరణ షురూ అయిందని ఫిలిం నగర్ సమాచారం. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో సమంత పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో నటించడంతో పాటు సమంత తన నిర్మాణ సంస్థ ట్రలాలా పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు.సినిమాసమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించింది. ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత హీరోయిన్గా మరే సినిమా చేయలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించి శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.చదవండి: కమల్-రజనీ మూవీ.. శృతి హాసన్, సౌందర్య ఏమన్నారంటే? -
రాజ్‌తో సమంత.. వైరలవుతోన్న దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
డేటింగ్ వార్తల వేళ.. రాజ్ కుటంబంతో సమంత దీపావళి సెలబ్రేషన్స్
సౌత్ ఇండియా నటి సమంతతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డేటింగ్లో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ క్లారిటీ ఇవ్వకపోడం తరుచుగా కలిసి కెమెరా కంటపడుతున్నడంతో నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా రాజ్ కుటుంబంతో పాటుగా సమంత(Samantha) దీపావళి సెలబ్రేట్ చేసకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో వైరల్ అవుతున్నాయి. ఈ డేటింగ్ రూమర్స్ విషయంలో ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా సమంత పోస్ట్ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 నుంచి రాజ్ నిడిమోరుతో సమంతకు పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.ఈ దీపావళి సందర్బంగా పలు ఫోటోలతో పాటు నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిందని సమంత ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఆపై ఆమె షేర్ చేసిన ఫోటోలలో రాజ్ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ, అతని సతీమణి శ్యామాలి లేదు. దీంతో ఈ రూమర్స్‌కు మరింత బలాన్ని ఇచ్చేసినట్లు అయింది. శ్యామాలి కూడా రాజ్‌తో దూరంగా ఉన్నారని సమాచారం. అయితే, సమంత- రాజ్ రిలేషన్ గురించి ఆమె అప్పుడప్పుడు పరోక్షంగా పోస్టులు చేసేవారు. శ్యామాలి చివరిసారి 2023లో రాజ్‌తో దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. ఆ సమయం తర్వాత వారిద్దరు కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు. రాజ్‌తో ఆమె విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆపై సమంత- రాజ్‌లు కూడా డేటింగ్ అంశంపై స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
పిల్లలతో కలిసి సమంత దీపావళి సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
బన్నీ, అట్లీ మూవీలో సమంత.. మళ్ళీ ఊ అంటావా అననుందా..?
-
గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఈ మధ్యే కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఆల్రెడీ సినిమాలు చేస్తోంది, నిర్మిస్తోంది. ఓ పక్క ఆరోగ్యం గురించి అవేర్నెస్ కల్పిస్తోంది, మరోవైపు ఫ్యాషన్, పర్ఫ్యూమ్ బిజినెస్ చేస్తోంది. అలాగే ఏకం అనే లెర్నింగ్ సెంటర్‌ని నడిపిస్తోంది. ఆ మధ్య పికిల్‌బాల్ టీమ్ కూడా కొనుగోలు చేసి వార్తల్లోకెక్కింది. ఇంకా కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు.. తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఈమధ్యే గృహప్రవేశంఅందులోనే తన ప్రయాణం ఉండబోతుందని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇటీవలే గృహప్రవేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో సమంత ఎరుపు రంగు డ్రెస్ సాంప్రదాయంగా ముస్తాబైంది. ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో పాల్గొంది. పూజగది ఫోటోను షేర్ చేసింది. అలాగే తన జిమ్ వర్కవుట్స్ వీడియోను కూడా జత చేసింది.సినిమాటాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన సమంత.. ‘ట్రలాలా’ బేనర్‌తో నిర్మాతగా మారింది. తన సొంత బ్యానర్‌పై తొలిసారి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించింది. ఇదే బేనర్లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తోంది. అలాగే రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే హిందీ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్ -
సమంత బ్లాక్ బస్టర్ కంబ్యాక్
-
హీరోయిన్ సమంత బ్యూటీఫుల్ లుక్స్.. (ఫొటోలు)
-
కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత
దసరా పండగ సందర్భంగా తన జీవితంలోని ఓ స్పెషల్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త ప్రయాణం అంటూ తన ఇంటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే పూజగది ఫోటోను కూడా షేర్ చేసింది. ఇంటి బయట గోడపై తన నిక్‌నేమ్ SAM అనే లోగో అందంగా అమర్చి ఉంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్‌లో ఉందా? ముంబైలోనిదా? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా కొత్తిల్లు కొన్న సామ్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసమంత సినిమాల విషయానికి వస్తే.. ఏమాయ చేసావె మూవీతో తెలుగులో తన జర్నీ మొదలుపెట్టింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మజిలి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల్లుడు శీను, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 1లో ఉ అంటావా మావా.. అనే ఐటం సాంగ్‌లో తళుక్కుమని మెరిసింది. ఇటీవల శుభం సినిమాలో అతిథి పాత్రలో నటించడంతో పాటు ఈ మూవీని తనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.చదవండి: ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్‌తోనే! -
భాగ్యశ్రీ గ్లామర్.. 'మిరాయ్' బ్యూటీ చీరలో
గ్లామర్ ఒలకబోస్తున్న ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీఅందచందాలతో మాయ చేస్తున్న సమంతచీరలో మెరిసిపోతున్న 'మిరాయ్' రితికా నాయక్బీచ్ ఒడ్డున చిన్న పిల్లలా సంయుక్త ఎంజాయ్ఫ్రెండ్ సీమంతంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ఎర్ర చీరలో అందగత్తెలా నటి సోనియా సింగ్ View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) -
జాన్వీ సొగసులు.. సమంత వెరైటీ లుక్
జాన్వీ కపూర్ సొగసు చూడతరమాపాత కాలం ఇంగ్లీష్ హీరోయిన్లా సమంతచెల్లితో బీచ్ ట్రిప్.. వీడియోతో సాయిపల్లవిబ్లాక్ మోడ్రన్ డ్రస్సులో రష్మిక ఇలాఅమెరికాలో అనన్య బతుకమ్మ సెలబ్రేషన్స్ఎర్ర చీరలో మెరిసిపోతున్న శ్రద్ధా కపూర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది!
‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్...’ (మురళీ శర్మ), ‘ఇవ్వలా... వచ్చింది...’ (అల్లు అర్జున్) అనే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో బాగా పాపులర్ అయ్యాయి. కొందరు కథానాయికల కెరీర్ విషయంలో ఈ డైలాగులు కరెక్టుగా సరి పోయాయనిపిస్తోంది. తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు, ఫుల్ క్రేజ్‌తో బిజీ బిజీగా దూసుకెళ్లిన పలువురు హీరోయిన్లకు ప్రస్తుతం టాలీవుడ్లో గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ కావాలని ఇచ్చింది కాదు... ఇతర భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ఇక్కడ సరైన కథ, పాత్ర కుదరక పోవడం కూడా ఈ గ్యాప్‌కి కారణం అని చె పొ్పచ్చు. తమ అభిమాన హీరోయిన్ల సినిమా ఎప్పుడొస్తుందా అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తెలుగులో గ్యాప్ వచ్చిన కథానాయికలెవరో ఓ లుక్కేద్దాం.పచ్చజెండా ఊపుతారా? తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం కాజల్ అగర్వాల్‌ది. తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమయ్యారామె. 2007 ఫిబ్రవరి 15న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ చిత్రంలో నటించారు కాజల్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కాజల్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. ‘ఆర్య 2, మగధీర, గోవిందుడు అందరివాడేలే, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం, బృందావనం, టెంపర్, బాద్ షా, వీర, నేనే రాజు నేనే మంత్రి, సీత, ఖైదీ నంబర్ 150, భగవంత్ కేసరి’... ఇలా తెలుగులో వరుసగా సినిమాలు చేశారు కాజల్. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి తెలుగులో గ్యాప్ వస్తోంది. ‘భగవంత్ కేసరి’ సినిమా తర్వాత ఆమె లీడ్ రోల్లో నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘సత్యభామ’ 2024 జూన్ 7న విడుదలైంది.ఆ చిత్రం తర్వాత తెలుగులో అటు హీరోయిన్గా కానీ ఇటు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కానీ చేయలేదు కాజల్. అయితే మంచు విష్ణు హీరోగా రూ పొందిన ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీ దేవి పాత్రలో కనిపించారామె. జూన్ 27న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమె చేతిలో ఏ సినిమా లేనప్పటికీ తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి... టాలీవుడ్‌కి ఆమె పచ్చజెండా ఊపుతారా? వేచి చూడాలి. కొత్త కబురు ఎప్పుడు? ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు తమన్నా. అంతేకాదు... ప్రత్యేక పాటల్లోనూ సందడి చేసి, అభిమానులను అలరిస్తుంటారామె. తెలుగులో ఆమె లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ సినిమా విడుదలై దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్లిన ఈ బ్యూటీకి ప్రస్తుతం మాత్రం గ్యాప్ వస్తోంది.ఆ మాటకొస్తే చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ (2023) చిత్రం తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘ఓదెల 2’. అంటే... ఈ రెండేళ్లలో ఆమె కేవలం రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. ఈ మిల్కీ బ్యూటీకి టాలీవుడ్లో గ్యాప్ వస్తున్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘రోమియో, రేంజర్, వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమాలతో పాటు రోహిత్ శెట్టి చిత్రంలో నటిస్తున్నారు.ఈ నాలుగు సినిమాల్లో ‘వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారామె. అరుణభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది. మరి... తమన్నా తెలుగుకి సంబంధించి కొత్త కబురు ఎప్పుడు వినిపిస్తారు? అన్నది వేచి చూడాలి.రెండేళ్లు దాటినా... తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు సమంత. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించారామె. అంతేకాదు.. తెలుగులో ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించిన ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత సమంత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించి, సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’.ఈ ఏడాది మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించి, నిర్మాతగా సమంతకు మంచి పేరు, లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కనిపించారు. ఇక ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజై రెండేళ్లు దాటి పోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత.అయితే తన సొంత ్ర పొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియంటెండ్ మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. అంతేకాదు... తన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ని కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే... సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. నో అప్డేట్ టాలీవుడ్లో శ్రుతీహాసన్‌ది దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు కె. ప్రకాశ్ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఒక ధీరుడు’ ద్వారా తెలుగుకి పరిచయం అయ్యారు శ్రుతీహాసన్. 2011 జనవరి 14న విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో నటించారు శ్రుతి. అయితే ఈ రెండు సినిమాలు పరాజయం కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించడంతో ఐరన్ లెగ్ అన్నవాళ్లే గోల్డెన్ లెగ్ అన్నారు. ‘బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, ప్రేమమ్, కాటమరాయుడు, క్రాక్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు శ్రుతీహాసన్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ చిత్రం 2023 డిసెంబరు 22న విడుదలైంది.ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత శ్రుతీహాసన్ నటించనున్న మరో తెలుగు చిత్రంపై ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు. ‘సలార్’ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆమె నుంచి మరో తెలుగు సినిమా అనౌన్స్మెంట్ లేదు. అయితే ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’కి సీక్వెల్‌గా రూ పొందనున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’లో ఆమె పాత్ర ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులో సినిమాలేవీ లేకున్నప్పటికీ తమిళ చిత్రాలు చేస్తున్నారు శ్రుతి. మరి... ఆమె నుంచి టాలీవుడ్లో కొత్త చిత్రం అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.మూడేళ్లు అయినప్పటికీ... తెలుగు చిత్ర పరిశ్రమలో ‘అలా మొదలైంది’ చిత్రంతో ఆరంభమైంది మలయాళ కుట్టి నిత్యామీనన్ కెరీర్. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అలా మొదలైంది’ చిత్రం 2011 జనవరి 21న విడుదలై, ఘన విజయం సాధించింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నిత్య. ఆ తర్వాత తెలుగు–తమిళ ద్విభాషా చిత్రం ‘180’లో నటించారామె. అనంతరం పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో నితిన్ హీరోగా నటించిన ‘ఇష్క్’ మూవీలో నటించి, మరో హిట్ అందుకున్నారు.ఆ తర్వాత ‘ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్’ వంటి తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. అయితే ‘భీమ్లా నాయక్’ చిత్రం రిలీజై మూడేళ్లు దాటి పోయినప్పటికీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు నిత్య. ఆ సినిమా తర్వాత వరుసగా మలయాళ, తమిళ చిత్రాలకే పరిమితం అయ్యారామె. విజయ్ సేతుపతి–నిత్యామీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’. ఈ చిత్రం తెలుగులో ‘సార్.. మేడమ్’ పేరుతో విడుదలైంది.ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన నిత్య తెలుగులో గ్యాప్ రావడంపై స్పందిస్తూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ, అభిమానం మరచి పోలేను. తెలుగులో నేను కావాలని గ్యాప్ ఇవ్వలేదు... వచ్చిందంతే. సరైన కథ, పాత్ర కుదిరితే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే’’ అన్నారు. మరి రచయితలు, దర్శకులు ఆమెను దృష్టిలో పెట్టుకుని సరైన పాత్రలు రాస్తారేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ నిత్యామీనన్ తెలుగులో నటించే కొత్త సినిమా ప్రకటన కోసం వేచి చూడక తప్పదు.రెండేళ్లయినా.... టాలీవుడ్‌కి కెరటంలా దూసుకొచ్చారు రకుల్ ప్రీత్‌సింగ్. 2011 ఆగస్టు 26న విడుదలైన ‘కెరటం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు రకుల్. ఆ చిత్రం తర్వాత తెలుగులో రెండేళ్లు గ్యాప్ వచ్చింది ఆమెకి. ఈ గ్యాప్‌లో తమిళంలో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో తిరిగి టాలీవుడ్‌కి వచ్చారు. సందీప్ కిషన్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013 నవంబరు 29న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారీ బ్యూటీ.‘లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకి, స్పైడర్, మన్మథుడు 2, చెక్, కొండ పొలం, బూ’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు రకుల్. ‘బూ’ చిత్రం 2023 మే 27న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు దాటి పోయినప్పటికీ ఆమె నటించనున్న మరో తెలుగు సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన లేదు. తెలుగులో రకుల్‌కి గ్యాప్ వచ్చినప్పటికీ తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి... రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు? అంటే కాలమే సమాధానం చె΄్పాలి.గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ‘అమ్మాయిలు కాదు... అమ్మాయి... భానుమతి... ఒక్కటే పీస్... రెండు కులాలు... రెండు మతాలు... హైబ్రీడ్ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశారు సాయిపల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగుకి హీరోయిన్గా పరిచయం అయ్యారామె. తొలి చిత్రంతోనే తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, తండేల్’ వంటి సినిమాల్లో నటించి, ఆడియన్స్‌ని అలరించారు.నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి సాయిపల్లవి, నాగచైతన్య నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణంగా ఓ సినిమా హిట్ అయిందంటే హీరో, హీరోయిన్లకు, డైరెక్టర్స్‌కి వరుస అవకాశాలు వస్తుంటాయి. ‘తండేల్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెలుగులో మరో కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు సాయిపల్లవి.అయితే తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఆమె ‘మేరే రాహో’ అనే చిత్రం ద్వారా తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్ రాముడిగా రూ పొందుతోన్న ‘రామాయణ : పార్ట్ 1, పార్ట్ 2’ సినిమాల్లో సీతగా నటిస్తున్నారు. ఈ సినిమాలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం అయ్యారామె. మరి... సాయిపల్లవి తెలుగులో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. ఏడాది దాటి పోయినా... తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, కస్టడీ, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చె΄్పాలి, మనమే’ వంటి చిత్రాల్లో యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా 2024 జూన్ 7న రిలీజైంది.ఆ సినిమా విడుదలై ఏడాది దాటి పోయినా టాలీవుడ్లో ఇప్పటికీ మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు కృతి. అయితే తెలుగులో ఒక్క సినిమా చేతిలో లేక పోయినా తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం బిజీ బిజీగా ఉన్నారు ఈ బేబమ్మ. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వా వాతియార్, జెనీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారీ బ్యూటీ. మరి... కృతీ శెట్టి తెలుగులో కొత్త సినిమాకి ఎప్పుడు పచ్చజెండా ఊపుతారు? అన్నది వేచి చూడాలి. పైన పేర్కొన్న కథానాయికలే కాదు... అంజలి, డింపుల్ హయతి, శ్రద్ధా శ్రీనాథ్, రీతూ వర్మ వంటి మరికొందరు హీరోయిన్లకు కూడా తెలుగులో గ్యాప్ వచ్చింది. వారు నటించనున్న తర్వాతి తెలుగు సినిమాలపై ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ లేదు. మరి... వీరి నుంచి కొత్త కబురు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి. – డేరంగుల జగన్ మోహన్ -
జిమ్‌లో సమంత- రాజ్ నిడిమోరు.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత(samantha ruth Prabhu) ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. శుభం మూవీ నిర్మించిన సామ్.. ఆ తర్వాత కొత్త మూవీస్ ప్రకటించలేదు. అయితే కెరీర్ పరంగా కాస్తా వెనకపడినా సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.అయితే సినిమాల కంటే ఎక్కువగా.. రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దుబాయ్‌లో జంటగా కనిపించిన వీరిద్దరు.. మరోసారి కెమెరాలకు చిక్కారు. ముంబయి బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సామ్, రాజ్ బయటికి వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గతంలో వీరిద్దరు హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌ల్లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత చాలాసార్లు వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు. దీంతో ఈ సామ్, రాజ్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తమపై వస్తున్న రూమర్స్‌పై సమంత, రాజ్ స్పందించలేదు. కాగా.. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సామ్.. 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/PlDCMUqD4Q— Samcults (@Samcults) September 23, 2025 -
ఈ హీరోయిన్ల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?
ఓ వైపు కళారంగంలో తళుక్కుమంటూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు నేటి సినీ తారలు. నటనలో అవకాశాలను సద్వినియోగం చేయడంలోనే కాదు తమలో ఉన్న సాధికారిత శక్తిని కూడా నిరూపిస్తున్నారు. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మికా మందన్నా నుంచి నయనతార, సమంత, తమన్నా... ఇలా ప్రతీ నటీమణి తమ జీవితాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. సినిమా స్టార్స్‌గా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ఈ తారలు ఆ డబ్బుని రెట్టింపు చేసే పని మీద ఉన్నారు. వ్యా పారంలోనూ కోట్లు సం పాదించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ‘షో (సినిమా) బిజినెస్’లో రాణిస్తూ వేరే ఏయే ‘బిజినెస్’లోకి ఈ స్టార్స్ ఎంటరయ్యారో తెలుసుకుందాం.తండ్రి బాటలో...మిల్కీ బ్యూటీగా నార్త్, సౌత్‌లో బోలెడంత క్రేజ్ సం పాదించుకున్నారు తమన్నా. హీరోయిన్ అయి, దాదాపు 20 ఏళ్లు కావొస్తున్నా అదే స్పీడుతో దూసుకెళుతున్నారు. ఇక ఇటీవల ఐటెమ్ సాంగ్స్‌తోనూ అలరిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ నగల వ్యా పారాన్ని ఆరంభించారు. ఈ ఆభరణాలను తనే డిజైన్ చేస్తున్నారు కూడా. ఇంతకీ తమన్నాకి జ్యుయెలరీ బిజినెస్ ఎందుకు చేయాలనిపించిదంటే... ఆమె తండ్రి వల్లే. తమన్నా తండ్రికి నగల వ్యా పారం ఉంది. దాంతో కుమార్తెకి కూడా ఆ వ్యా పారంపై ఆసక్తి కలిగింది. ఒకవైపు నటన... మరోవైపు జ్యుయెలరీ బిజినెస్‌తో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీ. మ్యూజిక్‌పై మమకారంతో..బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్ తనయగా శ్రుతీహాసన్ కూడా మల్టీ టాలెంటెడ్. తనలో మంచి నటి, గాయని, సంగీతదర్శకురాలు... ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. అయితే హీరోయిన్గా బిజీగా ఉంటున్న శ్రుతీహాసన్ తనకెంతో నచ్చిన మ్యూజిక్‌పై కూడా దృష్టి సారించాలనుకున్నారు. అందుకే ‘ఇసిడ్రో’ అనే నిర్మాణ సంస్థను ఆరంభించారామె. ఈ సంస్థ లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలు, వీడియో రికార్డింగ్‌లను ఈ రూపొందిస్తుంటుంది. క్లాతింగ్ బ్రాండ్... ప్రోడక్షన్నటనలో భేష్ అనిపించుకున్న సమంత తన స్టైలిష్ లుక్స్‌కు కూడా చాలా పాపులర్. సినిమాల్లోనే కాదు... విడిగా కూడా సమంత రకరకాల డ్రెస్ డిజైన్స్ ట్రై చేస్తుంటారు. ఇప్పటికే ‘సాకీ’ పేరుతో సమంతకు క్లాతింగ్ బ్రాండ్ ఉంది. 2020లో ఈ బ్రాండ్‌ని ఆరంభించారామె. అలాగే ఏ సినిమా ఫీల్డ్ అయితే తనకు నటిగా మంచి జీవితాన్ని ఇచ్చిందో అదే సినిమా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుని, ‘ట్రా లా లా’ బేనర్‌ని ఆరంభించారు. ఈ బేనర్లో తొలి ప్రయత్నంగా ‘శుభం’ చిత్రాన్ని నిర్మించారు సమంత. అలాగే ఇదే బేనర్లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ప్రకటించారు. నయన... నాలుగైదు వ్యా పారాలు నటనలో లేడీ సూపర్‌స్టార్ అని పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ‘ది లిప్ బామ్ కంపెనీ’ని స్థాపించారు. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ‘రౌడీ పిక్చర్స్‘ అనే నిర్మాణ సంస్థలో పాలు పంచుకున్నారు. చెన్నైలో ‘ఛాయ్వాలే’ అనే స్థానిక పానీయాల బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టి, రెస్టారెంట్ వ్యా పారంలో కూడా రాణిస్తున్నారు. ఇటీవల ‘9 స్కిన్’ అనే చర్మ సంరక్షణ బ్రాండ్‌నూ ప్రారంభించారామె. మొత్తానికి ఈ లేడీ సూపర్ స్టార్ ఒక్క వ్యా పారంలో కాదు... నాలుగైదు వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, దూసుకెళుతున్నారు. ఫ్యాషన్ రంగలోకి నేషనల్ క్రష్ ‘నేషనల్ క్రష్’గా పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న రష్మికా మందన్నా తన కొత్త వ్యా పారాన్ని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన తల్లితో జరిపిన సంభాషణ వీడియోను పంచుకున్నారామె. తన తల్లితో మాట్లాడుతూ– ‘అమ్మా... ఈ రోజు చాలా చాలా ముఖ్యమైన షూటింగ్ చేయబోతున్నాను. మీరు చెప్పినట్టుగా ఈ వ్యా పారాన్ని ప్రారంభించబోతున్నాను’ అని ఆమె తన తల్లితో పేర్కొన్నారు. రష్మిక తల్లి ‘దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అని కుమార్తెను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఇంతకీ రష్మిక ఏ బిజినెస్ చేయనున్నారంటే.... తన సొంత బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు.శ్రద్ధగా వ్యా పారంలోకి... కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ బిజీని ఎంజాయ్ చేసి, కాస్త అవకాశాలు తగ్గగానే డీలా పడి పోతుంటారు కొందరు తారలు. కానీ శ్రద్ధా దాస్ అలా కాదు. ఒకప్పుడు మంచి కెరీర్‌ని చూసిన ఈ బ్యూటీ... ఇప్పుడు నటిగా అంత బిజీగా లేక పోయినా నగల వ్యా పారంతో జోష్‌గా ఉన్నారు. ‘పల్మోనాస్’ అనే డెమీ ఫైన్ జ్యుయెలరీ బ్రాండ్‌ని ఆరంభించారు. పల్మోనాస్కి ఆమె ఒక ఫౌండర్. ఈ నగల వ్యా పారాన్ని కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు శ్రద్ధా దాస్. ఇలా మరికొందరు తారలు ఇతర వ్యా పారాల్లో పెట్టుబడి పెట్టి, ‘బిజినెస్ ఉమన్’గానూ రాణిస్తున్నారు. ప్రతిభ, వ్యా పార చతురతతో అటు కెరీర్ ఇటు వ్యా పార రంగంలోనూ విజయవంతంగా విస్తరిస్తున్నారు ఈ కథానాయికలు. ఈ స్టార్స్ నవతరానికి సవాల్‌తో కూడిన ఆలోచననూ అందిస్తున్నారు. -
ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.. అర్థమైతే మంచింది: సమంత
సామాజిక మాధ్యమాలను బాగా వాడుకునే నటీమణుల్లో సమంత ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా ఏలిన ఈ అమ్మడు ఆ మధ్య మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో అది కెరీర్‌కు బాగా ఎఫెక్ట్ అయ్యింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నా, కథానాయకిగా మాత్రం బిజీ కాలేకపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయినా తర్వాత చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ఈమె మళ్లీ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సమంత మాత్రం ఏదో ఒక వార్తతో నిత్యం ప్రైమ్ టైమ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా సమస్యల కారణంగా తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడ కథానాయకి కెరీర్‌గానీ, గ్లామర్, అభిమానులు, పాపులారిటీ ఏదీ శాశ్వతం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా కొంత కాలమేనని అన్నారు. ఒక నటిగా ఎదగడానికి చాలా అదృష్టానికి మించి చాలా కావాలన్నారు. తాను తన జీవితంలో నటిగా కంటే పెద్ద ప్రభావాన్ని చూపాలని కోరుకున్నానన్నారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిసిందన్నారు. ఇలా వేదాంతం పలుకుతున్న సమంత గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సమంతకు ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఏదేమైనా సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని ఆమె అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు. -
అనసూయ సోలో ట్రిప్.. సమంత మేకప్ లేకుండా!
సోలోగా ట్రిప్ వేసిన యాంకర్ అనసూయక్యూట్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన నివేతా థామస్జిమ్లో కష్టపడుతూ అలా.. మరోవైపు సమంత ఇలాచీరలో వయ్యారాలు పోతున్న అనుపమ పరమేశ్వరన్పొద్దుతిరుగుడు పువ్వుతో గ్లామర్ చూపిస్తున్న రకుల్అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనన్య నాగళ్ల View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
ఇకపై అలాంటి సినిమాలే చేస్తానంటున్న సామ్..!
-
సమంత దుబాయ్ వీడియో.. రాజ్ నిడిమోరు భార్య పోస్ట్ వైరల్!
కొద్ది నెలలగా సమంత సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. శుభం మూవీ తర్వాత ఆమెపై ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సామ్ సైతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతోనే ఎక్కువగా కనిపిస్తోంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. గతంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీరిద్దరిపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం సమంత ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లింది. ఆ తర్వాత తన సోషల్ మీడియాలోఓ వ్యక్తి చేతిని పట్టుకున్న వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలోనే రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టులు వైరలవుతున్నాయి. 'తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి' అంటూ కొటేషన్ షేర్ చేసింది. అంతేకాకుండా 'నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు.. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత, రాజ్ దుబాయ్ వీడియో రిలీజ్ తర్వాతే ఆమె ఈ పోస్టులు పెట్టింది.కాగా.. రాజ్ నిడిమోరు.. శ్యామలిని 2015లో వివాహమాడారు. కొద్ది నెలలుగా సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. అయినప్పటికీ వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్‌పై అధికారికంగా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే వస్తే రాజ్ డైరెక్షన్లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2,స సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ల్లో సమంత నటించింది. ప్రస్తుతం వీరిద్దరు రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సామ్.. 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను గతేడాది పెళ్లాడారు. -
ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్
సమంత ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్ని నెలల క్రితం 'శుభం' అనే చిన్న చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ హిట్ కాలేదు గానీ పెట్టిన డబ్బులు వచ్చేశాయి. మరోవైపు సమంత రిలేషన్ గురించి గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఫొటోనో వీడియోనో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సామ్.. దుబాయి వెళ్లినట్లు అనిపిస్తుంది.గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉంటుంది. అయితే సామ్ తనతో 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్' సిరీస్‌లు తీసిన రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని పుకార్లు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు వీళ్లిద్దరూ అడపాదడపా కలిసి కనిపిస్తుండటం వీటికి ఊతమిస్తోంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్‌గా మొదలుపెట్టేశారు)తాజాగా ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లిన సమంత.. ఆ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులోనే ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కనిపించింది. అయితే ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో దిగువన వరుణ్ ధావన్, దిశా పటానీ, రుహానీ శర్మ తదితరులు కామెంట్ కూడా చేశారు.మరోవైపు రాజ్ నిడిమోరుకు ఇదివరకే పెళ్లయింది. శ్యామలిని 2015లో వివాహమాడారు. రీసెంట్ టైంలో సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. మరి సమంత.. ఈ బంధాన్ని ఏమైనా అధికారికంగా ప్రకటిస్తుందా లేదా ఇలానే రహస్యంగా ఉంచుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్లు అంటే చిన్నచూపు.. హీరోలకు ఆ మాట చెప్పలేరు: కృతి సనన్) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
నాలో మార్పు వచ్చింది..ఇకపై అలా చేయను : సమంత
ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన సమంత..ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డ సామ్.. దాన్ని నుంచి పూర్తి కోలుకొని మళ్లీ మునుపటి అందంతో కనిపిస్తూ, కెమెరా ముందుకు వచ్చింది. అయితే గతంలో మాదిరి ఒకేసారి ఐదారు చిత్రాలు మాత్రం చేయనని చెబుతోంది ఈ బ్యూటీ. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ (Grazia India) లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై మెరిసిన సామ్.. ఆ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తిక విషయాలను పంచుకుంది.‘ఇకపై సినిమాలతో పాటు అరోగ్యంపై కూడా దృష్టిపెడతాను. గతంలో పోలిస్తే నాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇకపై సినిమాలతో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టిపెడతాను. మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. గతంలో మాదిరి ఒకేసారి ఐదారు సినిమాలు చేయను. తక్కువ సినిమాలు చేసినా..ప్రేక్షకులకు మనసుకు నచ్చే నచ్చే వాటితోనే పలకరిస్తాను. ప్రాజెక్ట్‌ల సంఖ్య తగ్గింది.. కానీ, వాటి నాణ్యత కచ్చితంగా పెరుగుతుంది’ అతని సమంత చెప్పుకొచ్చింది.సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఇటీవల ప్రేక్షకుల ముందుక వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తూంది. రాజ్-డీజే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ఆదిత్యారాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
LCU లోకి సమంత అడుగు పెట్టనుందా..?
-
ఊ అంటారా?
బ్లాక్‌బస్టర్ సినిమా ‘రంగస్థలం’ తర్వాత హీరో రామ్‌చరణ్, హీరోయిన్ సమంత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ... వీరిద్దరూ ఈసారి హీరో, హీరోయిన్లుగా నటించడంలేదట. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ పలువురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీలీల వంటి హీరోయిన్ల పేర్లు వినిపించగా, తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ (2021) సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావ...’ స్పెషల్ సాంగ్ బాగాపాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఈపాట తర్వాత సమంత మరో స్పెషల్ సాంగ్ చేయలేదు. మరి... రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేకపాటకు సమంత ‘ఊ’ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్ -
సమంత-చైతూ పెళ్లి పీటలెక్కిన సినిమా.. థియేటర్లలో రిలీజ్
అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన చిత్రం మనం. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.తాజాగా అభిమానులకు సామ్-నాగ్ జంటను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని జపాన్‌లో విడుదల చేయనున్నట్లు నాగచైతన్య ట్వీట్ చేశారు. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రం మనం.. ఈ సినిమా జపాన్ ప్రజలకు చేరువవుతుండటం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. మనం ఆగస్టు 8న థియేటర్లలో విడుదల కానుందని చైతూ వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్‌కు మరోసారి సామ్- చైతన్యను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం దక్కనుంది.అక్కినేని ఫ్యామిలీ నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మార్మోగిపోతూనే ఉంటాయి.అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సమంత- నాగ చైతన్య రియల్ లైఫ్‌లోనూ పెళ్లి పీటలెక్కారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గతేడాది డిసెంబర్లో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. ప్రస్తుతం సమంత ఇప్పటి వరకు సింగిల్‌గానే ఉంటోంది. అయితే బాలీవుడ్ డైరెక్టర్‌తో రిలేషన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.Thrilled that #Manam a film very close to my heart is making its way to the people of Japan . The film will be releasing on the 8th August in theaters . #Anrliveson #50YearsOfAnnapurnastudios pic.twitter.com/3x6u3XlRVV— chaitanya akkineni (@chay_akkineni) August 3, 2025 -
సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?
-
సమంత చేతికి స్పెషల్ రింగ్.. గుడ్ న్యూస్ చెప్పనుందా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల ఎక్కువగా మార్మోగిపోతోంది. ఎక్కడికెళ్లినా ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది. ఇద్దరు కలిసి డిన్నర్ తర్వాత ఓకే కారులో వెళ్లడంతో ఈ జంట డేటింగ్‌పై మరోసారి మొదలైంది. కొద్ది రోజుల క్రితమే లండన్ వీధుల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రెస్టారెంట్లో చిల్ అవుతూ కనిపించింది. ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం మరో చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు కనిపించని ప్రత్యేకమైన రింగ్ సామ్ చేతికి ఉండడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ఎపిసోడ్ టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుందా అనే చర్చ మొదలైంది. కాగా.. సమంత.. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో నటించారు. రాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్- 2, సిటాడెల్: హనీ బన్నీలోసామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్‌ల సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్‌పై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. జాన్వీ క్లాసికల్ డ్యాన్స్
'డెకాయిట్' సెట్లో మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్లైఫ్ మూమెంట్స్ షేర్ చేసిన హీరోయిన్ సమంతజూలై జ్ఞాపకాలని పంచుకున్న ప్రియాంక మోహన్క్లాసికల్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్లంగా ఓణీలో మల్లెపూలతో శ్రీముఖి సింగారంమేకప్ లేకుండా కాయదు లోహర్ సెల్ఫీలుకృతి సనన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో చెల్లి నూపుర్ View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Nuupur Sannon (@nupursanon) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంత (ఫొటోలు)
-
మరోసారి రాజ్ నిడిమోరుతో సామ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్‌గానే ఉంటోన్న సామ్.. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా మెలగడమే. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన వీరిద్దరు మరోసారి కెమెరాలకు చిక్కారు.సామ్- రాజ్ నిడిమోరు ఓకే కారులో వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో మరోసారి ఈ జంట గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ తమపై వస్తున్న వార్తలపై ఎవ్వరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఏదో ఒక సందర్భంలో వీరిద్దరు ఓకే వేదికపై తరచుగా కనిపిస్తూనే ఉన్నారు.ఈ వీడియో చూస్తుంటే ఇద్దరు కలిసి ఓ రెస్టారంట్‌కు డిన్నర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత క్యాజువల్ వైట్ డ్రెస్‌లో నవ్వుతూ కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్‌ల సమయంలోనే రాజ్‌తో పరిచయం ఏర్పడింది. View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
జాన్వీ కపూర్ వారెవ్వా.. మృణాల్ డోలు ప్రాక్టీస్
డోలు వాయించడం నేర్చుకుంటున్న మృణాల్అతిలోక సుందరిలా మెరిసిపోతున్న జాన్వీఫిట్నెస్ ఛాలెంజ్‌లో సమంత సూపర్ హిట్తాజ్ మహల్‌ని సందర్శించిన ప్రియమణి, అనన్యపట్టుచీరలో బుట్టబొమ్మలా ఐశ్వర్యా రాజేశ్మత్స్య కన్యలా మాయ చేస్తున్న ఫరియా అబ్దుల్లాఫ్రూట్స్లా డ్రస్సింగ్ చేసుకున్న రెజీనా కసాండ్రా View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Take 20 (@take20health) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
సమంత క్రేజీ ఛాలెంజ్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్లలో చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారు. అంటే షూటింగ్స్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే ప్రతిరోజూ జిమ్‌కి వెళ్తుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు. గతంలో చాలాసార్లు జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. 100 కిలోలకు పైనే బరువులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌లో పాల్గొంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.'టేక్ 20 హెల్త్' పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్ చేస్తున్న సమంత.. ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా 'డెడ్ హ్యాంగ్' ఛాలెంజ్ పూర్తి చేసింది. అంటే 90 సెకన్ల పాటు ఓ రాడ్‌కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీళ్లంతా దాన్ని పూర్తి చేశారు కూడా.(ఇదీ చదవండి: 'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!)'మీరు ఎలా కనిపిస్తున్నారనేది ముఖ్యం కాదు. మీ వారసత్వం ఏంటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేదే ముఖ్యం' అని సామ్ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ వీడియో సమంత లుక్ చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత బక్కగా అయిపోయిందేంటి అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ పరంగా సమంత చేతిలో కొత్త సినిమాలేం చేయట్లేదు. 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లైన్లో ఉంది గానీ ఇది ఆగిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్గా నిర్మాతగా చేసిన తొలి మూవీ 'శుభం' రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. త్వరలో నిర్మాత కమ్ హీరోయిన్ గా ఓ మూవీ మొదలుపెట్టనుందని, నందిని రెడ్డి దర్శకురాలు అని టాక్ నడుస్తోంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. అలానే దర్శకుడు రాజ్‌తో సమంత డేటింగ్లో ఉందనే పుకార్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by Take 20 (@take20health) -
బుల్లితెరపై తొలిసారి రంగస్థలం మూవీ.. దాదాపు ఏడేళ్ల తర్వాత!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం రంగస్థలం. ఈ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు.అయితే రంగస్థలం విడుదలై ఇప్పటికే ఏడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులో బుల్లితెరపై అలరించిన ఈ సినిమా.. ఇప్పటివరకు హిందీ మాత్రం రాలేదు. తాజాగా రంగస్థలం సినిమాను ఏడేళ్ల తర్వాత హిందీలో బుల్లితెరపై సందడి చేయనుంది. ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు గోల్ట్ మైన్స్ ఛానెల్లో రంగస్థలం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ట్విటర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో బాలీవుడ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #Rangasthalam (Hindi) | 24th August Sunday 8:00 PM | Tv Par Pehli Baar | Primere Only On #Goldmines TV Channel#RangasthalamHindi #rangasthalammovie @AlwaysRamCharan @Samanthaprabhu2 #JagapathiBabu #AnasuyaBharadwaj @prakashraaj #RamCharan #samantharuthprabhu pic.twitter.com/4OebzT3gJs— Goldmines Telefilms (@GTelefilms) July 28, 2025 -
Samantha: పచ్చబొట్టు చెరిగిపోలేదులే..
హీరోయిన్గా సమంత (Samantha Ruth Prabhu) వెండితెరకు పరిచయమైన చిత్రం ఏమాయ చేసావె (Ye Maaya Chesave Movie). నాగచైతన్య హీరోగా నటించాడు. 2010లో వచ్చిన ఈ ప్రేమకథాచిత్రంతోనే వీరి లవ్‌కు పునాది పడింది. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్ కావడంతో సామ్‌కు బోలెడంత గుర్తింపు వచ్చింది. అందుకే ఈ స్పెషల్ చిత్రానికి గుర్తుగా సామ్.. YMC (ఏ మాయ చేసావే) టాటూను మెడపై వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తనకెంతో స్పెషల్ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.పచ్చబొట్టు మాయం?ఇదే కాదు. చై ప్రేమకు గుర్తుగా కూడా ఓ పచ్చబొట్టు వేయించుకుంది. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఆ టూటూ తొలగించుకుంది. ఇటీవల ఓ వీడియో YMC పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఆ గుర్తును కూడా పూర్తిగా చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆ పేరు అలాగే చెక్కుచెదరకుండా ఉంది.విడాకులునాగచైతన్య-సమంత 2017లో పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా ఉండే ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. చై.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్ కూడా.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే.. సమంత చివరగా శుభం చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతోనే తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ వెబ్‌సిరీస్‌తో పాటు మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: నా భార్య కండీషన్.. ఇప్పటికీ అదే పాటిస్తున్నా: మురళీ మోహన్ -
ముచ్చటగా మూడోసారి.. నందినిరెడ్డితో, సామ్ కొత్త మూవీ..!
-
ఫైర్ @ 45 : ఫిట్నెస్ ఫ్రీక్ వైబ్రెంట్ లుక్ (ఫొటోలు)
-
భావోద్వేగ భరితం... నా ప్రయాణం: సమంత
గత కొన్నేళ్లలో తీసుకుంటే సినిమాలు చాలావరకు తగ్గించేసిన సమంత.. ఓటీటీలపై పూర్తిగా దృష్టి పెట్టింది. పలు వెబ్ సిరీసుల్లో నటించింది. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ ప్రైమ్ బ్రాండ్ క్యాంపెన్లో పాల్గొంది. తన ప్రయాణం అంతా రకరకాల భావోద్వేగాలతో నిండిందని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి:కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన రష్మిక)సమంత మాట్లాడుతూ.. ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ హనీ బన్నీ తదితర సిరీసుల్లో తను పోషించిన పాత్రలని గుర్తు చేసుకుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులు అనుభూతి చెందేలా, ఆ పాత్ర తాలూకు భావొద్వేగాలతో మమేకమయ్యేలా ఉంటాయని అందుకే అవి అంతగా వారికి చేరువ అయ్యాయని చెప్పింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సామ్ సహనటుడు మనోజ్ బాజ్ పాయ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలుచేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌లో తను పోషించిన పాత్రలోని భిన్న కోణాలు తనపై ఎంత ప్రభావం చూపించాయో మనోజ్ బాజ్ పాయ్ గుర్తుచేసుకున్నాడు.(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్) -
బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీ రివీల్.. కమెడియన్‌తో సమంత
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ ఫేమ్ సోనియానదివే పాటని వెన్నెల కిశోర్‌తో రీల్ చేసిన సమంతబీచ్ వెకేషన్లో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్నడుము ఒంపుసొంపులు చూపించేస్తున్న ఇనయాపెర్ఫెక్ట్ షేప్ కనిపించేలా మౌనీ రాయ్ గ్లామర్పిల్లాడితో కనిమా రీల్ చేసిన రీతూ చౌదరిమత్తెక్కించేలా మారిపోయిన రుక్సార్ థిల్లాన్ View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సమంత- రాజ్ డేటింగ్ వార్తలు.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తనపై వచ్చిన రూమర్స్‌పై ఇప్పటికీ వరకు స్పందించని సామ్.. తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సన్నిహితంగా ఉంటూ కనిపించింది. గతంలోనే విమానంలో తన భుజంపై వాలిపోయి మరి ఫోటోలకు పోజులిచ్చిన సమంత.. ఇప్పుడు ఏకంగా అతనే సమంత భుజంపై చేయి వేసుకుని అమెరికాలోని డెట్రాయిట్ వీధుల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ నెట్టింట వైరలవుతోంది. ఇక అఫీషియల్ ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పోస్టులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో వీరిద్దరి డేటింగ్ వార్తలొస్తున్న వేళ.. రాజ్ నిడిమోరు భార్య మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసింది. సామ్- రాజ్ ఫొటోలు వైరల్‌గా మారిన తర్వాత ఆయన భార్య శ్యామాలి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ మేసేజ్ రాసుకొచ్చింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని రాసుకొచ్చింది. అందులో వివిధ మతాల అర్థాలను వివరిస్తూ "లైఫ్స్ గ్రేట్ గోల్డెన్ రూల్" అనే శీర్షికతో పోస్ట్ చేసింది. ఆ తర్వాత అర్జునుడు, కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించింది. అర్జునుడు.. విజయం, ఓటమి కాకుండా మరొకటి ఏంటి? అంటే.. శ్రీకృష్ణుడు ధర్మం మాత్రమే ముఖ్యమని చెప్పాడని అనే అర్థం వచ్చేలా స్టోరీస్‌లో రాసింది. అంటే తనకు ధర్మమే అండగా నిలుస్తుందని అందులోని సారాంశం. సమంత- రాజ్ డేటింగ్ వార్తల వేళ శ్యామలి చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సామ్ - రాజ్ ఫొటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని.. అందుకే ఆమె ఈవిధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని కొందరు భావిస్తున్నారు.అయితే రాజ్ నిడిమోరుకు భార్య శ్యామలితో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. -
అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్?!.. అతడితోనే విందు, విహారం..
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఇటీవల తానా వేడుకల కోసం అమెరికా వెళ్లింది. మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తూనే ఉన్నారంటూ భావోద్వేగానికి లోనైంది. తెలుగువారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంది. ఈ వేడుకల అనంతరం సామ్ అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.రాజ్‌తో అమెరికాలో చెట్టాపట్టాల్అమెరికాలోని డెట్రాయిట్లో తనకు నచ్చిన ఫుడ్ తింటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో రెండు ఫోటోల్లో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండటం విశేషం! ఓ ఫోటో అయితే.. వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రాజ్.. ఆప్యాయంగా సామ్ భుజంపై చేయి వేశాడు. అతడి సాన్నిహిత్యంలో ఉన్న సామ్ నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మరో ఫోటోలో రాజ్‌తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్‌తో లంచ్‌కు వెళ్లింది. ఇది చూసిన అభిమానులు.. సామ్.. రాజ్‌తో రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.ఎలా మొదలైంది?రాజ్ నిడిమోరు (Raj Nidimoru), తన స్నేహితుడు కృష్ణతో కలిసి ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్గా నటించింది. అప్పుడే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిద్దరూ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ చేశారు. సమంత చేతిలో ఉన్న రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుకు సైతం రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.పర్సనల్ లైఫ్అయితే రాజ్‌కు ఇదివరకే పెళ్లయింది. అతడికి భార్యతో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. -
బీచ్‌లో యాంకర్ శ్రీముఖి పోజులు.. మిచిగాన్ వీధుల్లో సమంత చిల్!
గ్రీన్ డ్రెస్‌లో సింగర్ కెన్నీషా హోయలు..లండన్‌లో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..బీచ్‌లో యాంకర్ శ్రీముఖి పోజులు...మిచిగాన్ వీధుల్లో హీరోయిన్ సమంత..వెకేషన్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ చిల్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by KENEESHAA (@keneeshaa1) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ సమంత భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను జీవితంలో మరవలేనని, తన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. తప్పు చేసినా.. వారు మాత్రం ఎప్పుడూ తనవెంటే ఉన్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా ఆమె అమెరికాలో జరిగిన తానా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత స్టేజ్‌పై స్పీచ్ ఇస్తూ మధ్యలో ఎమోషనల్ అయ్యారు. ‘ఈ వేదికపైకి వచ్చి మాట్లాడడానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ప్రతి ఏడాది ఇక్కడి తెలుగు వారి గురించి వింటూనే ఉంటాను. నా మొదటి చిత్రం ఏ మాయ చేసావె’ నుంచి నన్ను మీరు ఆదరిస్తున్నారు. ఇన్నాళ్లకు మీకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం వచ్చింది. మొదటి నుంచి మీరు నాకు ప్రేమను మాత్రమే ఇస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..మీరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నా కెరీర్ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా శుభం సినిమా తీస్తే.. నార్త్ అమెరికాకు చెందిన తెలుగు వాళ్లు ఎంతో ఆదరించారు. నేను ఎక్కడికి వెళ్లినా.. ఏ పరిశ్రమలో పని చేసినా.. తెలుగు ప్రేక్షకులు నన్ను గర్వపడతారా లేదా? అనేదే ఆలోచిస్తాను. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకొక ఐడెంటీటీ, కుటుంబాన్ని ఇచ్చారు. నా ఓబేబీ సినిమా ఇక్కడ ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిదని చెబితే నమ్మలేకపోయాను. ఇదంతా మీవల్లే సాధ్యమైంది. మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలో మాత్రం మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది’ అంటూ సమంత భావోద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.Actress #Samantha got emotional during her speech at TANA Conference 2025. pic.twitter.com/LV6SBVZZ5g— Whynot Cinemas (@whynotcinemass_) July 6, 2025 -
శేఖర్ కమ్ములతో సినిమా..వపర్‌ఫుల్ పాత్రలో సమంత!
‘‘శేఖర్ కమ్ముల(Sekhar Kammula)తో సినిమా చేయాలని ఉంది. హీరోయిన్లకు ఆయన మంచి పాత్రలు రాస్తారు’’ అన్నట్లుగా ఓ సందర్భంలో సమంత(Samantha) పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇటీవల నాగార్జున–ధనుష్‌లతో ‘కుబేర’ వంటి హిట్ మూవీ ఇచ్చిన శేఖర్ కమ్ముల తదుపరి ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒక బలమైన అంశం చుట్టూ తిరిగే ఈ చిత్రంలో కథానాయిక పాత్ర చాలా వపర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇదిలా ఉంటే నాని హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయనున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ‘‘ఈ సినిమాకి సంబంధించిన చర్చ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఈ సినిమా గురించిన వివరాలను షేర్ చేస్తాను’’ అని ఆ మధ్య శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు. ఈలోపు సమంతతో ఆయన సినిమా చేయనున్నారనే వార్త తెరపైకి వచ్చింది. మరి... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నెక్ట్స్ రానున్న సినిమా ఏంటి? అది హీరో ఓరియంటెడ్ మూవీనా? లేక హీరోయిన్ ఓరియంటెడా? ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు. -
జీవితంలో ఏం సాధించానో ఇప్పుడే తెలిసొచ్చింది: సమంత
నటి సమంత రూటే వేరు. తనకు నచ్చినట్లు ప్రవర్తించే నటీమణుల్లో ఈమె ముందుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ సోషల్‌మీడియాతో తన అభిమానులకు ఆమె టచ్‌లో ఉంటారు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని ఆమె పంచుకుంటారు. విడాకులు, మయోసైటిస్ ఇలా తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి కూడా అందులో వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా తాను ఎవరూ..? ఎంత పెద్ద సెలబ్రిటీ..? జీవితంలో ఏం సాధించానో తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు.విడాకులు పొందిన సమంత ఆ తరువాత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై దాని నుంచి బయట పడటానికి పెద్ద పోరాటమే చేశారు. అలా చాలా కాలం నటనకు దూరం అయిన ఈమె మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. అలా వెబ్ సిరీస్‌లో నటించిన సమంత ఇటీవల నిర్మాతగానూ అవతారమెత్తి శుభం అనే చిత్రాన్ని నిర్మించారు కూడా. ఇలా నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటున్న సమంత తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో టీట్ చేశారు. అందులో తన చేతిలో ఎప్పుడూ సెల్‌ఫోన్ ఉంటుందన్నారు. దీంతో సడన్‌గా తనకొక ఆలోచన వచ్చిందనీ, దీంతో వెంటనే తన సెల్‌ఫోన్‌ను మూడు రోజుల పాటు స్విచ్చ్ ఆఫ్ చేసినట్లు చెప్పారు. ఆ మూడు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదనీ, ఎవరినీ చూడలేదనీ, పుస్తకాలు చదవడం, రాయడం వంటివేవీ చేయలేదన్నారు. ఇంకా చెప్పాలంటే ఏ పని చేయలేదన్నారు. అలా మూడు రోజులు మెదడుకు పూర్తిగా విశ్రాంతినిచ్చినట్లు చెప్పారు. ఆ అనుభవం చాలా కొత్తగా ఉందన్నారు. తన ఈగోలో చాలా భాగం తన సెల్‌ఫోన్‌తోనే అన్నది అప్పడు అర్థం అయ్యిందన్నారు. తాను ఎవరూ? ఎంత సెలబ్రిటీనీ? ఏం సాధించాను? అన్న విషయాలు తన సెల్‌ఫోన్‌నే చెబుతుందన్నారు. అది లేని రోజున తాను ఒక సాధారణ జీవినని అనే భావన కలిగిందన్నారు. పుట్టుకకు గిట్టుటకు మధ్య కాలంలో సెల్‌ఫోన్ మనకు ప్రకృతికి చెందిన విషయాలను కనుమరుగు చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన పెద్దలకు, ఆరోగ్యానికి సెల్‌ఫోన్ ఎంత ఆటంకంగా మారిందన్నది అవగతం చేసుకున్నానని నటి సమంత అన్నారు. ఈమె చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
'ఏ మాయ చేశావే నాగచైతన్యతో కాదు.. ఆ స్టార్ హీరోతో చేయాలని': డైరెక్టర్
ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచింది. నాగచైతన్య, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. అయితే మొదటి ఏ మాయ చేశావే చిత్రానికి హీరోగా నాగచైతన్యను అనుకోలేదని తెలిపారు. స్టార్ హీరో మహేశ్ బాబుతోనే తీద్దామని ఈ కథను రాసుకున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో చిరంజీవి గెస్ట్ రోల్‌గా పెట్టాలని అనుకున్నట్లు గౌతమ్ వాసుదేవ్ తెలిపారు. క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్‌తో ప్లాన్ చేశానని పేర్కొన్నారు.కాగా.. జూలై 18న 'ఏమాయ చేసావె' రీ రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. Gautam Vasudev Menon explaining how the #YMC story developed keeping Mahesh babu @urstrulyMahesh in mind , and initial climax he planned was different planning to cast Chiranjeevi as guest role pic.twitter.com/iC2gXj3uhu— #Coolie varaaru 🌟 (@yourstrulyvinay) July 1, 2025 -
సమంతపై ట్రోలింగ్.. ఆ వీడియోతో ఇచ్చిపడేసిన సామ్!
శుభం మూవీ తర్వాత సమంత సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. సోషల్ మీడియాలో ఇటీవల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ తెగ బిజీ అయిపోయింది. ముంబయిలో జిమ్ వెలుపల ఆమె కనిపించడంతో కొందరు ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత కాస్తా అసహనానికి గురైంది.ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. అందులో వీడియోతో పాటు ఓ కోటేషన్ కూడా రాసుకొచ్చింది. తన బాడీ గురించి కామెంట్స్ వారిని ఉద్దేశించి అందులో ప్రస్తావించింది. వీటిలో మొదటి మూడు చేయగలిగితే తప్ప నన్ను సన్నగా, అనారోగ్యంగా ఉన్నారని అలా చెత్తగా మీరు పిలవలేరు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఇది తన బాడీని షేమింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను కూడా పంచుకుంది. సమంత తన వర్కౌట్ వీడియోతో ట్రోలర్స్‌కు సవాలు విసురుతోంది.కాగా.. సమంత చివరిసారిగా శుభం సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించింది. అంతకుముందు వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం 'రఖ్త్ బ్రహ్మండ్'తో పాటు 'బంగారం' అనే తెలుగు చిత్రంలో కనిపించనుంది. -
హీరోయిన్ సమంతకు కష్టకాలం!
హీరోయిన్గా సమంత స్టార్ హోదా చూసింది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో పెద్గగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కొన్నిరోజుల క్రితం 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ ఓకే అనిపించుకుంది కానీ పెట్టిన డబ్బులు అయితే వచ్చేశాయి. అలా నిర్మాతగా తొలి అడుగు పర్లేదనిపించుకుంది. కానీ నటిగానే ఈమెకు కష్టకాలం నడుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!నాగచైతన్యకు 2021లో విడాకులు ఇచ్చిన సామ్.. తర్వాత కొన్నాళ్లకు తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమా చేసింది. ఇది పర్లేదనిపించుకోగా.. తర్వాత 'సిటాడెల్' ఇండియన్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది కూడా సమంతకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ప్రస్తుతానికైతే 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పుడు ఇది కూడా మొత్తానికే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.(ఇదీ చదవండి: మరో హీరోయిన్‌తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పనిచేస్తున్న ఓ వ్యక్తి.. బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్ చేశాడని, 25 రోజులే షూటింగ్ జరిగినప్పటికీ.. సగానికి బడ్జెట్ ఖర్చయిపోయిందని టాక్ వచ్చింది. ఇదంతా కూడా ఓ ఆడిట్ ద్వారా బయటపడింది. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్‌ను ఆపేశారని టాక్ నడిచింది. ఇప్పుడు మిగిలిన బడ్జెట్ పెట్టి సిరీస్ పూర్తి చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. దీంతో సిరీస్ మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది.అయితే చిత్ర నిర్మాతలైన రాజ్-డీకే మాత్రం అలాంటిదేం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారు. ఒకవేళ గనుక ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మాత్రం సమంతకు కష్టకాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అలా అని ప్రస్తుత దర్శకులు ఈమెకు హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు) -
మళ్ళీ మజిలీ లాంటి మూవీతో రాబోతున్న చైతూ..!
-
ఫిట్ అండ్ హెల్దీ : ‘యోగా సే హోగా’ అంటున్న సెలబ్రిటీలు (ఫొటోలు)
-
ఏ మాయ చేశావే రీ రిలీజ్.. రూమర్స్‌పై స్పందించిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుగు వెండితెరకు పరిచయమై ఇప్పటికే దాదాపు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. టాలీవుడ్లో ఏ మాయ చేశావే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఈ మూవీలో అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ ఎంటర్టైనర్ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. ఈ మూవీ రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కోసం ఏ మాయ చేశావే చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వచ్చేనెల 18న రీ రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మరోసారి చైతూ, సమంత ఓకే వేదికపై కనిపిస్తారంటూ వార్తలొస్తున్నాయి. విడాకుల తర్వాత వీరిద్దరిని జంటగా ఎక్కడా చూడలేదు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం వీరిద్దరు కలిస్తే ఫ్యాన్స్ చూడాలని కోరుకుంటున్నారు. దీంతో సామ్- చైతూ ఏ మాయ చేశావే ప్రమోషన్లలో కలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా వీటిపై హీరోయిన్ సమంత స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూసేయండి.తాజాగా సమంత ఈ వార్తలను కొట్టిపారేసింది. నేను ఏ మాయ చేసావే సినిమాను ప్రమోట్ చేయడం లేదని చెప్పింది. ఈ సినిమాను నేను అస్సలు ప్రమోట్ చేయడం లేదు.. అయితే ఈ టాక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఈ సినిమాలోని జంటను కలిసి చూడాలని అభిమానులు ఇష్టపడొచ్చని.. కానీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేము జీవించలేము కదా అంటూ సామ్ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరిని కలిసి చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.తాను నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే కాదని.. రాహుల్ రవీంద్రన్ నటించిన తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరీ అని సమంత వెల్లడించింది. అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలో చాలా గ్యాప్ రావడంతో ఎవరికీ ఆ సినిమా గుర్తులేదని చెప్పుకొచ్చింది. నేను నటించిన రెండో చిత్రం ఏ మాయ చేశావే.. ఈ సినిమాలోని ప్రతి షాట్ తనకు గుర్తుందని తెలిపింది. దీంతో సమంత, నాగ చైతన్య ఏ మాయ చేసావే ప్రమోషన్ల కోసం కలవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. -
సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తారా?
సమంత(Samantha), నాగ చైనత్య కెరీర్లో మరిచిపోలేని చిత్రం ‘ఏ మాయ చేసావే’. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సమంత నటిగా ఎంట్రి ఇచ్చింది కూడా ఈ చిత్రంతోనే. అంతేకాదు నాగచైతన్యతో ప్రేమలో పడడానికి కారణం కూడా ఈ మూవీనే .అందుకే అటు నాగ చైతన్య(Naga Chaitanya)కు గాని, ఇటు సమంతకు గాని ‘ఏ మాయా చేసావే’ చిత్రం చాలా స్పెషల్. సమంత అయితే ఏకంగా ఈ చిత్రం పేరు (వైసీఎం)తో టాటూనే వేయించుకుంది. చైతన్యతో విడిపోయినా.. ఇప్పటికీ తన ఫేవరేట్ చిత్రం ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. నాగ చైతన్య కూడా తన ఫేవరేట్ చిత్రాల్లో వైఎంసీ ఒకటి అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇలా ఇద్దరికీ చాలా ఇష్టమైన చిత్రం మళ్లీ థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. జులై 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. అటు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సమంత అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీరిలీజ్ చేయాలని సగటు సినీ ప్రియులు కూడా కోరుకున్నారు. ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత మళ్లీ జెస్సీ(సమంత), కార్తీక్ (నాగ చైతన్య)ల లవ్‌స్టోరీ మళ్లీ వెండితెరపై చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఈ సినిమా కంటే ఎక్కువగా మరో విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రీరిలీజ్ ప్రమోషన్స్ లో సమంత, నాగ చైతన్య కలిసి పాల్గొంటారా? అని ఇరువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుంటున్నారు. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ఇది అసాధ్యమనే చెప్పాలి. చైతూ గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మాజీ భర్తని కలిసేందుకు ఇష్టపడుతుందా అంటే .. కష్టమనే చెప్పాలి. అటు నాగ చైతన్య కూడా శోభితతో పెళ్లి తర్వాత అన్ని మర్చిపోయి హాయిగా కొత్త జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన కూడా సామ్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమే. అభిమానుల కోరుకున్నట్లుగా వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పట్లో అసాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సమంతకు చేదు అనుభవం.. జిమ్ నుంచి బయటకు రాగానే!
టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రస్తుతం ముంబయిలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తెరకెక్కించనున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది.అయితే తాజాగా ముంబయిలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది. బాంద్రాలో జిమ్ చేసి బయటికి వస్తుండగా ఆమెను ఒక్కసారిగా ఫోటోలు తీసుకునేందుకు చుట్టుముట్టారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన సామ్.. అరే రూకోజి ప్లీజ్ అంటూ హిందీలో మాట్లాడుతూ అసహనంగా కనిపించింది. ఆమె కారు ఇంకా రాకపోవడంతోనే బయట నిలబడాల్సి రావడంతో ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత అసహన వ్యక్తం చేసింది.కాగా.. గతేడాది సిటాడెల్: హనీ బన్నీలో వరుణ్ ధావన్‌తో కలిసి చివరిసారిగా కనిపించింది. అయితే ఆ తర్వాత సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.Rarely see her get irritated or angry even when disturbed she usually remains cool n composed. That's a quality we need to inculcate taking from her✨@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/9SMBRoYzxy— AkaSam (@SammuVerse) June 17, 2025 -
సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే
సమంత పేరు చెప్పగానే చాలామందికి సినిమాలతో ఆమె వైవాహిక జీవితం కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో నాగచైతన్యని కొన్నాళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకపోతే ఇద్దరూ సరిపడక నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంది. చైతూ మాత్రం హీరోయిన్ శోభితని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు.సరే ఈ విషయాల్ని కాసేపు పక్కనబెడితే చైతూతో ప్రేమ,పెళ్లి బంధంలోకి వెళ్లిన తర్వాత సమంత ఓ మూడు టాటూలు వేయించుకుంది. వాటిలో పక్కటెముకల మీద చైతూ అనే పేరు, అలానే చేతిపై మోర్స్ కోడ్‌లో చైతూ పేరు రాయించుకుంది. ప్రస్తుతానికైతే ఈ రెండు గుర్తుల్ని చెరిపేసుకుంది. అయితే మెడ వెనక భాగంలో సామ్.. 'వైఎంసీ' (ఏ మాయ చేశావె) టాటూ కూడా వేయించుకుంది. కొన్నిరోజుల క్రితం దీన్ని తీయించేసుకుందనే వార్తలు వచ్చాయి.(ఇదీ చదవండి: 'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ)అయితే అప్పట్లో ఓ మ్యాగజైన్ కోసం తీయించుకున్న ఫొటోల్లో మేకప్‌తో సామ్.. తన టాటూని కవర్ చేసుకుంది. ఆ విషయం ఇప్పడు క్లారిటీ వచ్చింది. తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ జిమ్ నుంచి సమంత బయటకొస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో మెడ వెనక భాగంలో 'వైఎంసీ' టాటూ కనిపించింది. ఇకపోతే 'ఏ మాయ చేశావె' సినిమా రీ రిలీజ్ కానుంది. జూలై 18న మరోసారి థియేటర్లలోకి రానుంది.ఓవైపు చైతూ.. శోభితని పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు సమంత కూడా 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వీళ్లు కలిసి కనిపించడంతో నెటిజన్లు ఇలా మాట్లాడుకున్నారు. ఇదివరకే రాజ్‌కి పెళ్లయింది. ఈ డేటింగ్ రూమర్స్ చూసి రాజ్ భార్య, భర్తని ఉద్దేశిస్తూ పరోక్షంగా కొన్ని పోస్టులు కూడా పెట్టింది. సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: సేతుపతి కోసం హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్)‘Stop it guys!’Samantha Ruth Prabhu walks out post-workout, clearly not in the mood for pap games today 💪📸🚫#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/EXElTyTYmu— Cinewoods (@Cinewoodsoffl) June 17, 2025 -
వెండితెరపై మరోసారి జెస్సీ, కార్తీక్‌ల లవ్‌స్టోరీ
అక్కినేని నాగచైతన్యతో పాటు సమంతకు చాలా ప్రత్యేకమైన చిత్రం 'ఏమాయ చేసావె'(Ye Maaya Chesave). 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం 15 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కానుంది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సామ్ నటిగా తెరంగ్రేటం చేశారు. ఫిలింఫేర్ అవార్డ్‌తో పాటు స్పెషల్ జ్యూరీ విభాగంలో ఆమె నంది అవార్డ్ అందుకుంది. 'ఏమాయ చేసావె'తో నాగచైతన్య(Naga Chaitanya), సమంతలకు (Samantha) ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాతోనే వారు మొదటిసారి కలిసి పనిచేశారు. తర్వాత పెళ్లి వంటి తదితర అంశాల సంగతి తెలిసిందే. వారిద్దరి జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రం ఇప్పుడు రీరిలీజ్ కానున్నడంతో ఫ్యాన్స్‌లో జోష్ మొదలైంది.జూలై 18న 'ఏమాయ చేసావె' రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జెస్సీ పాత్రలో కనిపించిన సమంత.. మొదటి చిత్రంతోనే భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం నేటికీ విశేషంగా ఆదరించబడుతోంది. కార్తీక్ (నాగచైతన్య) అనే యువ అసిస్టెంట్ డైరెక్టర్‌కి, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మలయాళ క్రిష్టియన్ అమ్మాయి మధ్య నడిచిన ప్రేమాయణం ఇందులో చక్కగా దర్శకుడు చూపించారు. ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది. -
ఏ అలా, ఏ తుఫానూ ఎంతో కాలం ఉండవు, దారి మనమే వెతుక్కోవాలి: సమంతా పోస్ట్ (ఫోటోలు)
-
దుబాయ్ ట్రిప్‌లో సమంత.. ఆమెతో పాటే అతను కూడా!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన నెటిజన్స్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఫోటోల్లో మరో వ్యక్తి కనిపించడంతో మరోసారి చర్చకు దారితీసింది. షూటింగ్ చేస్తూ సమంత కనిపించగా.. అందులో ఉన్నది కచ్చితంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు అని కామెంట్స్ పెడుతున్నారు. సామ్ ఫోటోలను కూడా అతనే తీశాడని రాసుకొస్తున్నారు.ఈ ఫోటోలు వైరల్ కావడంతో అబుదాబి సెలవులకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సమంత చిల్ అవుతున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత కొన్ని నెలలుగా సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్‌పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో ఆ వార్తలు తెగ వైరలయ్యాయి. ఇటీవల రాజ్ భార్య భార్య శ్యామలి దే సైతం సమంతతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని ఉద్దేశించి పోస్ట్ రాశారు. అయితే తమ రిలేషన్‌పై ఇప్పటి వరకు సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు.ఇటీవల విడుదలైన సమంత నిర్మించిన శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. అంతకుముందు సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2','సిటాడెల్: హనీ బన్నీ'వెబ్ సిరీస్‌ల్లో రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు నెట్‌ఫ్లిక్స్ రానున్నా 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్' కోసం జతకట్టారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఓటీటీలో 'సమంత' సినిమా.. ట్రైలర్ విడుదల
టాలీవుడ్ నటి సమంత నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా 'శుభం' ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణంలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. తన తొలి ప్రయత్నంలోనే కొత్తతరం నటులతో తెరకెక్కించడమే కాకుండా ఆమె ఇందులో మాయ అనే అతిథి పాత్రలోనూ మెప్పించారు. మే 9న విడుదలైన శుభం మూవీని ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్‌రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, వంశీధర్ గౌడ్, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి తదితరులు నటించారు. జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 13 నుంచి శుభం చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. -
మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. సినిమాలు ఉన్నా లేకున్నా..ఆమె మాత్రం నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలు, ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూనే ఉంటారు. అలాగే తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంస్థలను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఓ సంస్ధకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ స్పెషల్ వీడియోలో సమంత ‘నథింగ్ టు హైడ్’ అని రాస్తూ.. నవ్వుతూ తిరిగి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా..పలువురు నెటిజన్స్ సమంత టాటూపై కామెంట్ చేస్తున్నారు. ఆమె మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటు ఆ వీడియోలు కనిపించడం లేదు. దీంతో ‘వైఎంసీ టాటూని తొలగించావా సమంత?’ అని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మేకప్‌తో అది కవర్ చేసినట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.వైఎంసీ టాటూ స్పెషల్ ఏంటి?సమంత హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించారు. 2010లో విడుదలైన ఈ ప్రేమ కథాచిత్రం .. ఆ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత ‘వైఎంసీ’(ఏం మాయ చేసావే) అనే టాటుని వేయించుంది. ఈ టాటు తనకు చాలా స్పెషల్ అని సమంత పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ సామ్ మాత్రం ఈ టాటుని తొలగించలేదు. తాజాగా ఈ టాటూ కనిపించకపోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగా, నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడే సామ్ ఈ టాటూలు వేయించుకుంది. విడాకుల తర్వాత ఒక్కో టాటూని తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ‘చై’ అనే టాటూని తొలగించింది. వెబ్ సిరీస్.. సినిమాలతో బిజీ బిజీఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్నారు. అక్కడ హ్యాపీగా... జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు సమంత. (చదవండి: అక్కినేని అఖిల్ పెళ్లి.. బరాత్‌లో జోరుమీదున్న నాగచైతన్య)‘‘ఇక్కడ ఏమీ లేదు... సౌండ్ లేదు... హడావిడి లేదు... చక్కని స్పేస్ ఉంది’’ అంటూ వెకేషన్లో భాగంగా అబు దాబీలో సంతోషంగా ఉన్న అక్కడి ఫొటోలను ఆమె షేర్ చేయగా, వైరల్‌గా మారాయి. దుబాయ్‌లో జరిగిన ఓ జ్యువెలరీ బ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత అనంతరం అక్కడి అందాలను చూస్తూ సందడి చేస్తున్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
దుబాయ్‌లో సమంత టూర్.. వైరల్ ఫోటోలకు లక్షల్లో లైకులు
-
ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్
ఏదైనా ప్రమోషన్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). ఏవైనా ఉత్పత్తులు మంచివి కావనిపిస్తే సదరు యాడ్స్ చేయడం లేదని చెప్పింది. అలా గతేడాది 15 వాణిజ్య ప్రకటలను రిజెక్ట్ చేసినట్లు ఇటీవలే వెల్లడించింది. ఏదైనా యాడ్ చేయడానికి ముందు ఆ ప్రోడక్ట్‌ను తన దగ్గరున్న ముగ్గురు డాక్టర్లు పరిశీలిస్తారని.. వారి నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.పూర్తిగా నమ్ముతున్నా..అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమంత కొన్ని రోజులుగా ఎన్‌ఎమ్‌ఎన్ (నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్) అనే సప్లిమెంట్‌ను ప్రమోట్ చేసింది. ఇది డీఎన్ఏను రిపేర్ చేసి మన వయసు పెరగనీయకుండా చేస్తుందని చెప్తోంది. అంతేకాదు ఈ ఎన్‌ఎమ్‌ఎన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్న గటాకా సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. ఈ ట్యాబ్లెట్స్ గురించి వాటి ఫలితాలే చెప్తున్నాయి. నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్‌కట్స్ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం అని రాసుకొచ్చింది.ఫ్రాడ్.. నమ్మొద్దు: డాక్టర్ఇది చూసిన ద లివర్ డాక్టర్.. సామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్సు తెలియని నటి అని తిట్టిపోశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ సప్లిమెంట్లను ప్రమోట్ చేస్తోందని ఆరోపించాడు. పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది.. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదన్నాడు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదని విమర్శించాడు.నిజమైన వైద్యుల్ని నమ్మండిమీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యంగ్‌గా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్ పెట్టమని సూచించాడు. సిగరెట్, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దని.. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే విశ్వసించమని కోరాడు. అసలైన వైద్యులు చెప్పేదే వినండంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా గతంలోనూ సమంత పెట్టిన పలు పోస్టులపై లివర్ డాక్టర్ విమర్శలు గుప్పించాడు. View this post on Instagram A post shared by The Liver Doc (Cyriac Abby Philips) (@theliverdr) చదవండి: టాలీవుడ్ నటి ఇంట చోరీ.. అందరూ ఇంట్లో ఉన్నప్పుడే! -
బ్లాక్ శారీలో సుప్రీత.. లుక్ మార్చేసిన ఈషా
దుబాయిలో అవార్డ్ ఫంక్షన్లో సమంత హల్చల్నల్లని చీరలో రచ్చ లేపుతున్న సుప్రీతస్విమ్ సూట్లో టెంపరేచర్ పెంచేలా ప్రగ్యా జైస్వాల్సరికొత్త లుక్‌తో కనిపించిన తెలుగమ్మాయి ఈషారెబ్బాజిమ్లో సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్న అనన్య పాండేనిక్కర్లో నడుచుకుంటూ వచ్చేస్తున్న దివి View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) -
దుబాయ్‌లో హీరోయిన్ సమంత సందడి.. (ఫోటోలు)
-
సమంత- రాజ్ డేటింగ్ రూమర్స్.. డైెరెక్టర్ భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది. జిమ్‌లో వర్కవుట్స్‌తో పాటు పికిల్ బాల్ ఆడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. అలా మరోసారి ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఇటీవల శుభం మూవీ రిలీజ్ తర్వాత విమానంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను సామ్ షేర్ చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.తాజాగా ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది' అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఆమె వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలపై పరోక్షంగా స్పందించారు.కాగా.. శుభం మూవీ సక్సెస్ తర్వాత విమానంలో సమంత షేర్ చేసిన ఫోటో చూశాకే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు కనిపించారు. అంతకుముందు ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పటివరకు తమపై వస్తున్న వార్తలపై సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు. మరోవైపు సమంత, రాజ్ ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం శుభం(Subham). ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటించారు. మే 09న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో మెరిసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్‌ను షేర్ చేసింది. శుభం కథేంటంటే..వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది.ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. This June 13th, katha aarambham on JioHotstar 💫 Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025 -
డైరెక్టర్‌తో సమంత డేటింగ్.. మరోసారి అతనితో కలిసి!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్లో శుభం అనే మూవీని నిర్మించింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో సమంత సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది.అయితే గత కొద్దికాలంగా హీరోయిన్ సమంతపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పలుసార్లు జంటగా కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల విమానంలో రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న ఫోటో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఇవీ చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనా? అనే డైలామాలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు.తాజాగా సమంత డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను దీనికి కారణం. హ్యాపీ వీకెండ్ అంటూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా పంచుకుంది. వీటిలో రాజ్ నిడిమోరుతో కలిసి సామ్ పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. కోర్టులో ఇద్దరు పికిల్ బాల్ ఆడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిపై నెట్టింట మరోసారి చర్చ మొదలైంది. శుభం మూవీ విడుదలకు ముందు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.కాగా.. సమంత, రాజ్ నిడిమోరు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు 'రక్త బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. శుభం మూవీతో ఓ చిన్న పాత్రలో కనిపించిన సామ్.. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలోనే సమంత టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంది. ఈ ఈవెంట్లో సమంత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జర్నీని తలచుకుంటూ ఎమోషనలైంది సామ్.తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన సినిమా అవార్డ్ ఈవెంట్లో మెరిసింది సమంత. ఈ ఈవెంట్లో 15 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న సమంతను ప్రత్యేకమైన అవార్డ్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా సమంత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తెలుగు సినిమా పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది.. ఇదే నా కర్మ భూమి అంటూ భావోద్వేగ ప్రకటన చేసింది. ఇదే ఈవెంట్‌కు హాజరైన అక్కినేని అమల.. సమంతను కొనియాడుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇది చూసిన అభిమానులు అక్కినేని అమల తన మాజీ కోడలికి అభినందనలు తెలిపారంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'యే మాయ చేసావే' చిత్రంతో సమంత రూత్ టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, కత్తి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2018లో అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సమంత ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకుంది. గతేడాది నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. -
రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!
-
మృణాల్ చాలా పద్ధతిగా.. మీనాక్షి నెవ్వర్ బిఫోర్ లుక్
పద్ధతిగా క్యూట్ లుక్స్ లో మృణాల్ ఠాకుర్నాభి అందాలతో షాకిచ్చిన మీనాక్షి చౌదరిఫ్రెండ్స్ తో ట్రిప్ లో కల్యాణి ప్రియదర్శన్చీరలో మరింత అందంగా సమంతజీన్స్ లో మెరిసిపోతున్న యాంకర్ అనసూయజిమ్.. ఫుడ్ క్రేవింగ్స్ వీడియోతో తృప్తి దిమ్రి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Face Magazine (@facemag.in) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
‘శుభం’ మూవీ సక్సెస్ మీట్ లో సమంత సందడి (ఫొటోలు)
-
అదే మా ‘ట్రాలాలా’ లక్ష్యం: సమంత
‘‘శుభం’ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరిలో నవ్వులు, సంతోషం కనిపిస్తున్నాయి. ఇదే అసలైన విజయం. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు’’ అని హీరోయిన్, నిర్మాత సమంత చె΄్పారు. హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియా కొంతం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సమంత మాట్లాడుతూ– ‘‘శుభం’ చూస్తే నా వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. మమ్మల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ మళ్లీ గుర్తుకొచ్చాయి. ‘శుభం’తో అందర్నీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. ఇలాంటి మంచి చిత్రాలను తీసి కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ గుర్తు చేస్తూనే ఉంటాం... అదే మా ట్రాలాలా లక్ష్యం. సినిమా రిలీజ్‌కు ముందు మూడు రోజులు మా టీమ్‌లోని ఏ ఒక్కరూ నిద్ర΄ోలేదు. ఇప్పుడు వస్తున్న ప్రేమ, అభిమానం, ప్రశంసలన్నింటికీ వాళ్లే కారణం. నాకు సపోర్ట్‌గా నిలిచిన మైత్రి శశి, సురేష్బాబుగార్లకు థ్యాంక్స్. అభిమానులే నా ప్రపంచం. ‘శుభం’ని ముందుకు తీసుకెళ్తున్న ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ– ‘‘సమంతగారు లేక΄ోతే ‘శుభం’ని ఎవరు చూస్తారు? ఆమె వల్లే ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి’’ అన్నారు. నటీనటులు శ్రియా కొంతం, శ్రావణి, షాలినీ, వంశీధర్, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్, రచయిత వసంత్, సహ నిర్మాత హిమాంక్, ‘మైత్రీ’ మూవీస్ శశి, ్ర΄÷డక్షన్ డిజైనర్ రామ్, క్యాస్ట్యూమ్ డిజైనర్ పూజిత, రాగ్ మయూర్ మాట్లాడారు. -
నేను కూడా సెల్ఫిష్.. రివ్యూల విషయంలోనూ అంతే: సమంత
హీరోయిన్ సమంత ప్రస్తుతం శుభం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టిన సామ్.. కొద్ది రోజులుగా ఫుల్ బిజీ అయిపోయింది. సామ్ తన సొంత బ్యానర్లో నిర్మించిన శుభం మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత సైతం అతిథి పాత్రలో మెరిసింది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టీమ్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన శుభం సక్సెస్ మీట్లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా సినిమా రివ్యూల గురించి ప్రస్తావించింది.(ఇది చదవండి: Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ)తాను కూడా సినిమా రివ్యూలను చదువుతానని సామ్ తెలిపింది. అయితే కేవలం తన పాత్రకు సంబంధించినంత వరకే పరిమితమవుతానని వెల్లడించింది. నా గురించి చదివాకే.. మిగిలిన వారి గురించి చూస్తానని సమంత పేర్కొంది. ఈ విషయంలో నేను కూడా చాలా సెల్ఫిష్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ . కానీ, నిర్మాతగా మారాక అభిప్రాయం మార్చుకున్నట్లు తెలిపింది సమంత. -
మీరిద్దరు శుభంతో జర్నీ మొదలెట్టారు.. ఎప్పటికీ అలాగే ఉండాలి: సమంతపై టాలీవుడ్ నటి కామెంట్స్
ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తాను నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్లో తెరకెక్కించిన శుభం మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో సామ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తన టీమ్‌తో కలిసి సక్సెస్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నటి మధుమణి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.మధుమణి మాట్లాడుతూ..'నా 39 ఏళ్ల ప్రయాణంలో చాలా అవార్డులు గెలుచుకున్నా. ఎంతో హీరోలతో పాటు హీరోయిన్లకు తల్లిగా నటించా. కానీ సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేదు. తనకు రంగస్థలంలో అమ్మగా నటించే అవకాశం చేజారిపోయింది. ఆ బాధ ఇప్పటికీ ఉంది. శుభం కోసం నన్ను సంప్రదించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నా అదృష్టం కలిసొచ్చి శుభం మూవీలో నటించా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్‌కు శుభం. రాజ్ మీరు కలిసి శుభంతో ప్రయాణం మొదలెట్టారు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. శతమానం భవతి అంటూ' అని ఇద్దరినీ దీవించింది.అయితే ఇది విన్న సమంత ఫ్యాన్స్ కాస్తా షాకింగ్‌కు గురవుతున్నారు. రాజ్ నిడిమోరు- సామ్ డేటింగ్‌పై చర్చ జరుగుతున్న వేళ మధుమణి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా..ఇటీవల మరోసారి సమంత-రాజ్ నిడిమోరు గురించి మరోసారి చర్చ మొదలైన సంగతి తెలిసిందే. రాజ్ నిడిమోరు తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. -
శుభం సక్సెస్ మీట్.. అసిస్టెంట్‌ను ఓదార్చిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. కొత్తవారితో తాను నిర్మించిన శుభం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది సామ్. తన సినిమాకు హిట్ టాక్ రావడంతో సెలబ్రేషన్స్ చేసుకుంది. శుభం మూవీ టీమ్‌తో కలిసి సక్సెస్ వేడుకలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే ఈవెంట్లో పాల్గొన్న సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆర్యన్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన సమంత వెంటనే అతన్ని ఓదార్చింది. హృదయానికి హత్తుకుని మరి అసిస్టెంట్‌ను సముదాయించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది చూసిన పలువురు నెటిజన్స్ సమంత గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఈ మూవీ తర్వాత సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె ఫోటోలు షేర్ చేయడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఈ విషయంపై రాజ్ నిడిమోరు భార్య కూడా స్పందించింది. Entha love unte ❤️ oka team member ki edupu ostadi 🙌 @Samanthaprabhu2 HEARTFUL MOMENT WITH HER TEAM 🥹❤️🔥👏#shubham #SamanthaRuthPrabhu#Samantha pic.twitter.com/UE58hUBJ4c— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) May 16, 2025 -
సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?
-
డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్
సౌత్ ఇండియా పాపులర్ నటి సమంత డేటింగ్లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై తన మేనేజర్ స్పందించారు. తాజాగా తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో నటించారు. మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రాజ్- సమంత ఇటీవల తరచూ ఒకే చోట కనిపించడంతో కొద్దిరోజులుగా రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. వారు డేటింగ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్‌పై సమంత మేనేజర్ స్పందించారు.డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మేనేజర్ అన్నారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనంటూ తెలిపారు. సమంత నిర్మించిన శుభం సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన ఫోటోలను ఇలా తప్పుడు వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్ తన కూతురితో పాటు సమంతతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడని వచ్చిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అసలు ఆయనకు కూతురే లేదన్నారు. తనతో పాటు ఉన్న అమ్మాయి కోడైరెక్టర్ కృష్ణ డీకే కూతురని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని సమంత మేనేజర్ కోరారు. -
రాజ్ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru), హీరోయిన్ సమంత(samantha) ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా చిత్రబృందం రాజ్ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి. రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని, ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్ చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేశారు. వారిద్దరు డేటింగ్లో ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి శ్యామాలి(Shhyamali De) తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను’అని అమె ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్యామాలి సమంత ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్యామాలి ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టారనేది తెలియదు కాని..నెటిజన్స్ మాత్రం సమంత,రాజ్‌ల గురించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు. కాగా, రాజ్, శ్యామాలిల వివాహం 2015లో జరిగింది. వీరిద్దరి ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్‌లో సాయం చేస్తుండేవారు. అయితే గతకొంత కాలంగా రాజ్, శ్యామాలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. -
అతనితో రిలేషన్లో సమంత.. ఆ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందా?
సమంత ఇటీవల నిర్మాతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన సొంత బ్యానర్లో నిర్మించిన శుభం మూవీతో నిర్మాతగా మారిపోయింది. మే 9న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా తనకు ఎదురలేదని చెబుతోంది సమంత. అయితే తాజాగా శుభం సినిమా వీక్షించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా సామ్‌తో పాటే ఉన్నారు. శుభం వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే గత కొద్దికాలంగా సమంతపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీనికి కారణం సిటాడెల్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు. అతనితో ఇప్పటికే సమంత చాలాసార్లు పలు వేదికలపై జంటగా కనిపించింది. పికిల్ బాల్ లీగ్‌లో వీరిద్దరూ ఒక్కసారిగా వేదికపై మెరిశారు. అప్పుడు కూడా రాజ్‌తో సామ్ డేటింగ్లో ఉందని వార్తలొచ్చాయి.తాజాగా మరోసారి శుభం మూవీని సమంత, రాజ్ కలిసి వీక్షించిన ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ ఫోటోల్లో విమానంలో రాజ్ భుజాలపై సన్నిహితంగా కనిపిస్తూ పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోతో రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారంటూ పోస్టులు పెడుతున్నారు. మరో నెటిజన్స్ ఈ జంటకు సామ్రాజ్ అనే కొత్త పేరు బాగుంటుందని కామెంట్ చేశాడు. ఏదేమైనా వీరిద్దరు కలిస్తే డేటింగ్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఫుల్స్టాప్ పడేలా కనిపించడం లేదు. కాగా. గతంలో తిరుమలకు వెళ్లిన సమయంలోనూ సమంత, రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత కొత్త జర్నీ.. సక్సెస్ అయినట్లేనా?
స్టార్ హీరోయిన్ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. రిలీజ్‌కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్ ప్రాఫిట్‌ని పొందినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్‌కి ముందే ‘జీ’ సంస్థతో డీల్ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్‌గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్ ముందే బిజినెస్ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రిలీజ్‌కి ముందే సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ తర్వాత మంచి టాక్ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. -
నాన్న మరణించిన రోజు.. నవ్వుతూ ఫోటోలు దిగా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా. శుభం మూవీతో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నిర్మించిన శుభం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన సామ్.. ఇటీవల పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ నేపథ్యంలో ఓ బాధాకర సంఘటనను వెల్లడించింది. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తంటే కొంతమంది సెల్ఫీలు అడిగారని గుర్తు చేసుకుంది.సమంతా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అభిమానులు తన దగ్గరికి ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు తాను ఎప్పుడూ నో చెప్పలేదు. చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనే కొంతమంది అభిమానులు ఫోటో తీయడానికి తన దగ్గరికి వచ్చారు. అయినా నేను వారికి నో చెప్పలేదు. ఎందుకంటే తన విజయానికి కారణం తన అభిమానులే. మనం సెలబ్రిటీలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో వారికి తెలియకపోవచ్చు. అందుకే నేనెప్పుడూ అభిమానుల ఫోటోలకు నో చెప్పను' అని ఆ సంఘటనను గుర్తు చేసుకుందిఆ రోజును గుర్తుచేసుకుంటూ.. 'డిసెంబర్లో నాన్న మరణించారని నా తల్లి నుంచి ఉదయం నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ముంబయి నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. కొంతకాలంగా నాన్నతో మాట్లాడకపోవడంతో నేను షాక్‌కు గురయ్యాను. నాలో ఎలాంటి స్పందన లేకుండా విమానంలో కూర్చుండిపోయా. ఆ సమయంలో కొందరు నా ఫోటో కోసం అడిగిన విషయం నాకు గుర్తుంది. నేను నిలబడి వారితో ఫోటోలకు నవ్వుతూ ఉన్నా" అని తెలిపింది. మనం ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు.. తెలియనివారితో ఫోటో అడగడానికి చాలా ధైర్యం అవసరం.. అందుకే నో చెప్పి వారిని బాధపెట్టాలని అనుకోలేదని సమంత వెల్లడించింది.ఆ సంఘటన తనను ఒక సెలబ్రిటీగా ఉండటంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించేలా చేసిందని సమంత పేర్కొంది. వారితో సెల్ఫీల కోసం నేను నవ్వుతున్నప్పుడు అది నా మనసును తాకిందని.. ఎందుకంటే తండ్రి మరణించిన రోజున ఏ వ్యక్తి నవ్వాలని అనుకోడని వివరించింది. ఇది పూర్తిగా వేరే ప్రపంచమని సమంత తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత 'బంగారం' అనే మూవీలో కనిపించనుంది. -
సమంత 'శుభం' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
చాన్నాళ్ల తర్వాత సమంత ఓ తెలుగు సినిమా చేసింది. అదే 'శుభం'. దీనికి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ చిన్న పాత్రలో కూడా నటించింది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి.శుభం సినిమాకు తొలిరోజు రూ.1.5 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చాయని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఈ మూవీ ప్రచారంలో పాల్గొన్న సామ్.. చాలా కష్టపడింది. కానీ ఈమె ప్రభావం బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం పనిచేయలేదా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)ఎందుకంటే 'శుభం'తో పాటు శ్రీ విష్ణు '#సింగిల్' (రూ.4.15 కోట్లు), చిరంజీవి క్లాసిక్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' (రూ.1.75 కోట్లు) థియేటర్లలోకి వచ్చాయి. కానీ సమంత సినిమాకు మిగతా వాటి వల్ల కాస్త మైనస్ అయింది. వసూళ్లలో దెబ్బ పడ్డట్లు అనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి సమంత మూవీ లాభాల్లోకి వెళ్తుందా లేదా అనేది చూడాలి?శుభం విషయానికొస్తే.. కేబుల్ ఆపరేటర్ శ్రీను (హర్షిత్).. శ్రీవల్లి (శ్రియ)ని పెళ్లిచేసుకుంటాడు. అయితే శ్రీవల్లి ఫస్ట్ నైట్ ని కూడా పక్కనబెట్టి ఓ సీరియల్ కి అతుక్కుపోతుంది. అడ్డొచ్చిన భర్తకు వార్నింగ్ ఇస్తుంది. తన స్నేహితులిద్దరిదీ ఇదే బాధ. వీళ్లకే కాదు ఆ ఊరిలో అందరూ రాత్రి 9 అయితే వింతగా ప్రవర్తిస్తుంటారు? దీనికి కారణమేంటి? ఈ మొత్తం ఎపిసోడ్ లో సమంత పాత్ర ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?) -
సమంత పెళ్లి మళ్లీ జరుగుతుందా?
-
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో సమంత పాల్గొనడం..వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో ‘శుభం’పై బజ్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(మే 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్‌గానే చెప్పాలా? లేదంటే ఇదిగో మేం ఈ మంచి మేసేజ్ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా? అలా చేయకుండా, నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది ‘శుభం’ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్‌ని తీసుకొని.. అందులోనే పురుషాధిక్యత ఎత్తిచూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి, కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్-కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం ‘శుభ’ పరిణామం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే కామెడీ-హారర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్ కానీ, కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఇంతకు మంచి కామెడీ-హారర్ కథలను మనం చూశాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైన ఉందంటే.. సీరియల్‌కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్ యాంగిల్లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్‌నైట్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ ఇచ్చే ట్విస్ట్‌తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీనుబృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్ గురించి ప్రస్తావించకపోవడమే మంచింది. దర్శఖుడు తన ‘సినిమా బండి ’టీమ్‌ని ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్‌గా సా..గడంతో కథ అక్కడడక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్ ఆపరేటర్‌గా హర్షిత్ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లీగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది..సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది. సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయని చెప్పలేం కానీ.. సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘సింగిల్’కాల్లో అతనికి ‘శుభం’ చెప్పేశా: సమంత పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీస్ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్‌కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది. తాజా వెన్నెల కిశోర్‌తో కలిసి ఓ ఫన్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్‌కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్ ఏమో తన నటించిన ‘సింగిల్’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు. కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్లో వెన్నెల కిశోర్‌కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత
గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొన్నిరోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడదే దర్శకుడితో మళ్లీ కనిపించడం, ఆ ఫొటోలని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విడాకుల తర్వాత సమంత.. తాను మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాననే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీసులో నటించిందంతే.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) సరే అసలు విషయానికొస్తే.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రెండో సీజన్ లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. సామ్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్ గానే మిగిలిపోయింది.తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ పెట్టింది. ఇందులో తన త్రలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభం మూవీ గురించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫొటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ ని ఏమైనా నిజం చేస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్.. హాలీవుడ్ స్టైల్లో మీనాక్షి
హీరోయిన్ త్రిష పుట్టినరోజు సెలబ్రేషన్స్వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో మీనాక్షి చౌదరిశుభం మూవీతో బిజీ.. సామ్ క్యూట్ పోస్ట్డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రద్ధా కపూర్అందాల అపరంజి బొమ్మలా ఐశ్వర్య లక్ష్మీబ్యాక్ పోజులతో కిక్కిస్తున్న కావ్య థాపర్చీరలో హెబ్బా పటేల్ స్వీట్ పోజులు View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) -
ఏ మాయ చేసావె రోజులు గుర్తొచ్చాయి!: సమంత
‘‘ఈ మధ్య ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అయితే స్టార్ హీరో చేసిన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు ఎలాగైతే వస్తున్నారో... అలా ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాను చూసేందుకూ వస్తారని నమ్ముతాను. ‘శుభం’ సినిమా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తుందని ఈ సినిమా నిర్మాతగా నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ సమంత అన్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, వంశీధర్ గౌడ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన ఈ తొలి చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సమంత చెప్పిన విశేషాలు...⇒ నేను హీరోయిన్‌గానే కొనసాగాలని సినిమాలు చేసుకుంటూ వస్తున్న సమయంలో హఠాత్తుగా నాకు నటనలో లాంగ్ బ్రేక్ వచ్చింది. అనారోగ్యాన్ని అధిగమించడానికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నటించలేకపోతున్నాను....ప్రోడక్షన్ చేద్దామని అనుకున్నాను. అలా ‘శుభం’ సినిమాను మొదలుపెట్టాం. ఎనిమిది నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. దాదాపు వంది మంది ‘శుభం’ సినిమా చూసి,పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా విజయంపై నమ్మకం ఉంది. ⇒ ‘శుభం’ సినిమా ఓ టీవీ సీరియల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సీరియల్ ‘శుభం’ కార్డు కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. న్యూ ఏజ్ హారర్ కామెడీ ఫిల్మ్ ఇది. సోషల్ సెటైర్లా ఉంటుంది. ఈ సినిమాకు కాస్త బడ్జెట్ ఎక్కువైంది.ప్రోడ్యూసర్‌గా నాకు భవిష్యత్ ఉందా? లేదా అనేది ‘శుభం’ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. నేను తెలివైన నిర్మాతను కాకపోవచ్చు, తెలివైన బిజినెస్ ఉమెన్‌ని కాకపోవచ్చు. అయితే నా మనసు ఏం చెబుతుందో ఆ నిర్ణయాలనే తీసుకుంటా. ఫైనాన్షియల్ వ్యవహారాలను మా బిజినెస్పార్ట్నర్ హిమాంక్ చూసుకుంటుంటారు. ‘శుభం’ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాం అనేది తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి నా దగ్గర కొంచెం డబ్బులైతే ఉన్నాయి (నవ్వుతూ..)⇒ 2010లో దర్శకులు గౌతమ్ మీనన్‌గారు పిలిస్తే ఏ హీరోయిన్ అయినా ఆయన సినిమాకి ఓకే చెప్పేవారు. కానీ ఆయన రిస్క్ తీసుకుని, నాకు నటిగా తొలి (ఏ మాయ చేసావె) చాన్స్ ఇచ్చారు. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు నిర్మాతగా కొత్త కథలు చె΄్పాల్సిన బాధ్యత నా మీద ఉందనిపించింది. కొత్తవారితో పని చేయాలి. అందుకే నిర్మాతగా నా తొలి సినిమాలో నేను మెయిన్ లీడ్ రోల్ చేయలేదు. ఈ సినిమాలో అతిథిపాత్ర ఉంది. నాకు ఫేవర్స్ అడగటం ఇష్టం లేదు. అందుకే ఈ రోల్‌ను నేనే చేశాను.⇒ ‘శుభం’లో నూతన నటీనటులు నటించారు. కెరీర్ కోసం వాళ్లు చాలా త్యాగాలు చేశారు. వాళ్ల స్టోరీస్ వింటుంటే నిర్మాతగా గర్వంగా అనిపించింది. అలాగే నా తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’ రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటివరకు నేనుప్రోడ్యూసర్స్ యాక్ట్రస్ అనుకున్నాను. కానీ... నేను ఇంకాప్రోడ్యూసర్స్ ఫ్రెండ్లీ యాక్ట్రస్‌గా ఉండాలని నాకనిపించింది.⇒ ఈక్వల్ స్కిల్... ఈక్వల్ ఎక్స్పీరియన్స్... ఈక్వల్ పే ఉండాలని నా డ్రీమ్. మా ప్రోడక్షన్ హౌస్‌లో సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. కథలు వినేటప్పుడే ఇందులో ఈక్వెల్ పే సాధ్యమౌతుందా? అని ఆలోచించి నిర్ణయించుకుంటాను. నా ప్రోడక్షన్లో నెక్ట్స్ మూవీ ‘మా ఇంటి బంగారం’. జూన్‌లో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నా నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఆ విషయాలు త్వరలో చెబుతాను. ∙అమెరికాలో విదేశీ సినిమాలపై వందశాతం సుంకం విధించారనేది ఇంకా అమలులోకి రాలేదని అనుకుంటున్నాను. అయినా ప్రతివారం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి కదా. ⇒ నా ఫ్యాన్ ఒకరు నా కోసం గుడి కట్టారని విన్నాను. ఆ అభిమాని ప్రేమను అర్థం చేసుకోగలను. ఆ ప్రేమను అగౌరవపరచలేను. కానీ ఈ విధానాన్ని (గుడి కట్టడం, పూజలు చేయడం వంటివి) ప్రోత్సహించను. ∙జీవితం పట్ల మీ దృష్టికోణం చాలా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. వృత్తి, వ్యక్తిగత జీవితాల విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్న ప్రశ్నకు... ‘‘మళ్లీ నా వ్యక్తిగత జీవితం గురించి నా లైఫ్‌లో బహిరంగంగా మాట్లాడను (నవ్వుతూ). ఆ ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది’’ అన్నారు సమంత. -
'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)
-
గుడి కట్టిన అభిమాని.. సమంత ఏమన్నారంటే..
స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో 2023లో ఓ చిన్నపాటి విగ్రహంతో ఈ గుడిని నిర్మించారు. ఇటీవల ఆ గుడిలో గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టి.. సమంత బర్త్‌డే(ఏప్రిల్ 28) నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా గుడి విషయంపై సమంత స్పందించారు. గుడి కట్టిన విషయం తెలియగానే హ్యాపీగా ఫీలయ్యా కానీ..ఇలాంటి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. అభిమాని గుడి కట్టిన విషయంపై స్పందించారు. అభిమాని నా పట్ల ఇంత ప్రేమ చూపించడం తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అయితే, నేను ఇలాంటి చర్యలను ప్రోత్సహించను. అభిమానులు తమ ప్రేమను సానుకూల మార్గాల్లో, సమాజానికి మేలు చేసే విధంగా చూపించాలని కోరుకుంటాను," అని అన్నారు. సమంత ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక శుభం విషయానికొస్తే.. సమంత నిర్మించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత
సమంత పేరు చెప్పగానే చాలామందికి ఆమె విడాకుల అంశమే గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో చైతూ కంటే సామ్ పై ఎక్కువ విమర్శలు వచ్చాయి. కాలక్రమేణా ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారు.తర్వాత కాలంలో అప్పుడప్పుడు సామ్.. బయట మాట్లాడినప్పుడు కావొచ్చు, ఇన్ స్టాలో పోస్ట్ చేసే స్టోరీల వల్ల కావొచ్చు చిన్నపాటి ట్రోలింగ్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇదంతా సమంతకు తెలియంది ఏమి కాదు. ఇక విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి గురించి బయటపెట్టడం, దాని చికిత్స కారణంగా చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడు 'శుభం' చిత్రాన్ని సిద్ధం చేసింది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)సమంత నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమా ఇది. మే 09న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రీసెంట్ గానే వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇప్పుడు మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో సినిమా విశేషాలు మాట్లాడింది. అలానే తన వ్యక్తిగత జీవితం గురించి ఇకపై మాట్లాడనని, ఈ మేరకు తాను డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది.ఎందుకంటే సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య.. హీరోయిన్ శోభితని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సామ్ కూడా 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రిలేషన్ లో ఉందనే కామెంట్స్ వినిపించాయి. పెళ్లి రూమర్స్ కూడా వస్తున్నాయి గానీ ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!) -
'ఇక్కడికి వస్తే బ్లాక్ బస్టరే'.. తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత!
సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు... నిర్మాత కూడా. తాను స్వయంగా నిర్మించిన తాజా చిత్రం శుభం. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిర్మాతగా సమంత కూడా హాజరయ్యారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్లో సామ్ సందడి చేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైజాగ్ వస్తే ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందేనని సామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాల్లాగే నాకు మళ్లీ బ్లాక్ బస్టర్ ఇస్తారని అనుకుంటున్నా అని మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనేదే నా లక్ష్యమని సమంత తెలిపారు. భవిష్యత్తులో అందరినీ ఆకట్టుకునే కథలను మీ ముందుకు తీసుకు రావాలని ఆశిస్తున్నానని సామ్ వెల్లడించారు. మీ ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని.. మీరు లేకపోతే నేను నథింగ్ అంటోంది టాలీవుడ్ బ్యూటీ.అయితే ఈ ఈవెంట్లో సమంత ఫుల్ ఎమోషనల్ అయింది. ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈవెంట్లో జరుగుతున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన సినీ కెరీర్‌ను తలచుకుని సామ్ ఎమోషనల్ కావడంతో ఫ్యాన్స్ సైతం భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. நான் உன் அழகினிலே தெய்வம் உணருகிறேன்🎶Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#Subham #SubhamPreReleaseEvent #SubhamOnMay9 pic.twitter.com/QKUPjzwRy4— Samcults (@Samcults) May 5, 2025 -
విశాఖ బీచ్ లో సమంత ‘శుభం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
జన్మ జన్మల బంధం
హీరోయిన్గా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు సమంత. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య తారలుగా నటించారు. ఈ చిత్రంలో సమంత కూడా నటించారు. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత నిర్మించిన ‘శుభం’ ఈ నెల 9న రిలీజ్ కానుంది.ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సింగిల్ ‘జన్మ జన్మల బంధం...’ అనే పాటని శనివారం విడుదల చేశారు. ‘‘ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించిన ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ పాట. ఈ సాంగ్‌లో సమంతతో పాటు ప్రధాన తారాగణం కనిపిస్తారు. ఈ ప్రమోషనల్ సాంగ్ బీట్ చాలా హుషారుగా ఉంటుంది. నవ్వు, భయం.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో ‘శుభం’ రూపొందింది. ఈ వేసవికి ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం అవుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: వివేక్ సాగర్, సంగీతం: క్లింటన్ సెరెజో. -
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
శుభం మూవీలో మాతాజీగా సమంత.. ఫన్నీ లుక్ప్రియుడితో ట్రిప్ వేసిన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిబార్ లో పార్టీ చేసుకుంటున్న హాట్ బ్యూటీ సుప్రీతకల్కి బ్యూటీ అన్నా బెన్ క్యూట్ నెస్ చూడతరమాఇటలీలో తెగ తిరిగేస్తున్న లైగర్ పాప అనన్య పాండేట్రెండింగ్ కనిమా పాటకు మంచు లక్ష్మీ స్టెప్పులుమేకప్ లేని లుక్ లో హీరోయిన్ సంయుక్త View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం
దక్షిణాది ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు అభిమానం ఎక్కువ. ఎంతలా అంటే పక్కనోళ్ల కంటే సినిమా వాళ్లని దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. కొందరైతే అంతకు మించి అనేలా ప్రవర్తిస్తారు. దీనికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లో సమంత కోసం అభిమాని కట్టిన గుడి.తమిళనాడులో ఖుష్బూ, జయలలిత, హన్సిక లాంటి హీరోయిన్లకు అభిమానులు దేవాలయాలు కట్టారు. అదే తరహాలో ఆంధ్రలోని బాపట్లలో ఓ వీరాభిమాని.. సమంత కోసం 2023లో గుడి కట్టాడు. అప్పట్లో ఓ విగ్రహం ఏర్పాటు చేయగా.. ఇప్పుడు గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టాడు.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజాలు చేసి కేక్ కట్ చేశాడు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చే ఆమెకు ఈ గుడి కట్టానని సదరు అభిమాని చెప్పడం విశేషం.కొన్నాళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసిన సమంత.. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన దగ్గర నుంచి పూర్తిగా మూవీస్ చేయడం మానేసింది. గతేడాది 'సిటాడెల్' చేసింది గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నిర్మాతగా 'శుభం' అనే సినిమాని విడుదలకు రెడీ చేసింది.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) -
ఊరంతా తెలిసిన సీక్రెట్...
హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం ఇది. అలాగే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలోనూ నటించారు సమంత. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘ఆ సీరియల్ టీవీలో వస్తున్నంత సేపు నా పెళ్ళాం చాలా తేడాగా ప్రవర్తించింది రా.., ఇంత జరుగుతుంటే ఊళ్లో ఒక్కడన్నా బయటకు వచ్చి చెప్పాడ్రా... అసలు ఒరేయ్... ఊరంతా తెలిసిన సీక్రెట్ రా ఇది... మొత్తం మగవాళ్ళ పరువంతా డేంజర్లో పడింది’ అనే సంభాషణలు ‘శుభం’ ట్రైలర్లో ఉన్నాయి. ఓ ఊర్లో మహిళలందరూ టీవీలో ఓ సీరియల్ చూసి, వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అప్పుడు ఓ మాతాజీలా సమంత వస్తారు. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అనే కథాంశంతో ‘శుభం’ సినిమా రూపొందిందని విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. -
సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్
నాగచైతన్య-సమంత బంధం ముగిసిన అధ్యయం. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. ఇది జరిగి చాన్నాళ్లు గడిచినా అప్పుడప్పుడు వీళ్ల గురించి మాట్లాడుకునే సందర్భం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చైతూ పెట్టిన ఓ పోస్ట్ మరోసారి చర్చకు కారణమైందని చెప్పొచ్చు.సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య.. గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్ గా ఉండే చైతూ చాన్నాళ్ల తర్వాత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) సమంతతో కలిసున్న టైంలో హాష్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్ ని పెంచుకున్నారు. ఇప్పుడది చైతూ దగ్గరే ఉంది. తాజాగా చైతన్య.. ఆదివారం ఇలా గడిచింది అని ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో తన కారుని రిపేర్ చేసుకోవడంతో పాటు శోభిత- పెట్ డాగ్ హాష్ కలిసున్న ఫొటోని కూడా షేర్ చేశాడు.అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సమంత ఫ్యాన్స్.. చిత్రవిచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. సామ్ పెంచుకున్న కుక్క.. శోభితతో ఏం చేస్తోందని ఒకరంటే.. 'శుభం' ట్రైలర్ రిలీజైందని, రేపు సమంత పుట్టినరోజు కావడంతో కావాలనే చైతూ ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరు అంటున్నారు. సమంత లానే హాష్ కూడా ఒంటరిది అయిపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
శుభం సినిమా ట్రైలర్ రిలీజ్.. అతిథి పాత్రలో సమంత
-
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్‌గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించింది. ఈ బ్యానర్లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.సీరియల్స్ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యంఆదివారం (ఏప్రిల్ 27) నాడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్‌కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.మే 9న రిలీజ్మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న సామ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి -
డైమండ్ నగలు, రాయల్ బ్లూ కలర్ డ్రెస్‌లో రాయల్‌గా సమంత లుక్ (ఫొటోలు)
-
ఆ అనుబంధానికి పేరు పెట్టలేను!:సమంత
‘‘జీవితంలో మనం తీసుకునే ఒక నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా నిర్ణయిస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసీ తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్‌పై ప్రభావం చూపుతాయి’’ అని సమంత అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల నిర్వహించిన ‘గోల్డెన్ క్వీన్’ పురస్కారాల్లో’ గోల్డెన్ క్వీన్ అవార్డు అందుకున్నారు సమంత.అనంతరం ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంతోపాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానం సంపాదించుకోవడానికి కారణం అయింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను’’ అని చె΄్పారు సమంత. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్ రవీంద్రన్ (నటుడు, దర్శకుడు) ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు.మా అనుబంధానికి పేరు పెట్టలేను. ఫ్రెండా? సోదరుడా? కుటుంబ సభ్యుడా? రక్త సంబంధీకుడా? అనేది చెప్పలేను’’ అన్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న రిలీజ్ కానుంది. -
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
దేశవ్యాప్తంగా తన అందం, నృత్యాల ద్వారా పేరు తెచ్చుకున్న ఊర్వశి రౌతాలా తన పేరును జనం మర్చిపోకుండా చేయడాన్ని కూడా తన దినచర్యలో భాగం చేసుకుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీలోని విద్యార్థులు తన ఫోటోలపై దండలు వేసి ‘‘దమ్దమమై’’ అని పిలుస్తారని ఆమె చెప్పింది. అంతేనా...నా పేరు మీద ఒక ఆలయం ఉంది భక్తులు నా ఆలయంలో పూజలు చేస్తున్నారు’’అంటూ ప్రకటించడంతో ఆమె తనను తాను వార్తల్లో వ్యక్తిగా మరోసారి దిగ్విజయంగా నిలబెట్టుకున్నారు. భక్తులు నిజంగా ఆమె ఆశీర్వాదాలు కోరుకుంటున్నారా? అని అడిగినప్పుడు, ఊర్వశి, ‘అబ్ మందిర్ హై తో వో హాయ్ తో కరేంగే (ఇది దేవాలయం, వారు మాత్రమే చేస్తారు)‘ అని చెప్పింది. అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని ప్రస్తావించిన ఊర్వశి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని, బద్రీనాథ్‌ని సందర్శిస్తే, దాని పక్కనే ’ఊర్వశి ఆలయం’ ఉంది అని చెప్పడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో అక్కడి ఆలయ అర్చకులు ఆమెపై మండిపడుతున్నారు. ఆమెపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఈ నేపధ్యంలోనే మరోసారి దేశవ్యాప్తంగా తారల ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. హిందూ మతంలో అసంఖ్యాకమైన దేవతలను పూజిస్తారు. అలాగే తమకు నచ్చిన మనిషిని కూడా దేవుడు/దేవతగా పూజిస్తారు. అంతేకాదు తమ ప్రేమ అభిమానాన్ని చూపించడానికి వారికి గుడులు కూడా నిర్మిస్తారు. ఆ క్రమంలో దేశం నలుమూలల ఆలయాలున్న వేలకొద్దీ దేవతలే కాకుండా, సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు మొదలైన ప్రముఖుల కోసం కూడా ఆలయాలను వారి అభిమానులు నిర్మించి నిర్వహిస్తున్నారు. అలాంటి ఆలయాలలో కొన్నింటి గురించి...అమితాబ్ ఆలయం– ‘షాహెన్షా ఆఫ్ బాలీవుడ్‘ అని పిలుచుకునే అమితాబ్‌కు, కోల్‌కతాలో ఒక ఆలయం నిర్మించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన ప్రభావవంతమైన సేవలను కీర్తిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.–తమిళ లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తమిళనాడులోనే కాకుండా భారతదేశం అంతటా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కర్నాటకలోని కోలార్ లో రజనీకాంత్ ఆలయం ఉంది.–ఖుష్బూ సుందర్ తమిళనాడులో అభిమానులు తన పేరు మీద దేవాలయాన్ని నిర్మించిన మొదటి భారతీయ నటిగా గుర్తింపు పొందింది, అయితే. వివాహానికి ముందు సాన్నిహిత్యంపై ఆమె వివాదాస్పద ప్రకటన తర్వాత ఈ ఆలయం తొలగించారు.–దివంగత నటి శ్రీదేవి, తరచుగా భారతీయ సినిమా మొదటి మహిళా సూపర్‌స్టార్, ఆమె జ్ఞాపకార్థం ముంబైలో ఒక ఆలయం ఉంది.–ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఒక దేవాలయం ఉంది.–భారతదేశం వెలుపల, ప్రత్యేకించి సోవియట్ యూనియన్ ఇతర తూర్పు యూరోపియన్ రాష్ట్రాల్లో భారతీయ సినిమాని తీసుకెళ్లిన దివంగత నటశిఖరం రాజ్ కపూర్‌కి జైపూర్‌లో దేవాలయం ఉంది.–అందం, తెలివితేటలతో పాటు నటనా ప్రతిభకు ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య రాయ్ కు కూడా ఆలయం ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో దీనిని నిర్మించారు.–‘కింగ్ ఖాన్‘ లేదా ‘ది లాస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా‘ అని పేర్కొనే ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్‘ షారుఖ్ ఖాన్ కు కోల్‌కతాలో ఆలయం ఉంది.–కోవిడ్ సమయంలో అత్యంత ఉదారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు నటుడు సోనూసూద్. దాంతో ఆయన పేరిట తెలంగాణలోని సిద్ధిపేటలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ప్రదర్శించిన నటనకు కాకుండా చూపించిన మంచితనానికి బదులుగా ఆలయం కట్టించుకున్న ఏకైక నటుడు సోనూసూద్ మాత్రమే. అలాగే సినిమాల్లో ప్రతినాయక పాత్రధారుల్లో కూడా మరెవరికీ ఆ ఘనత దక్కలేదు.–తాజా అందాల బ్యూటీ నిధి అగర్వాల్ రెండేళ్ల క్రితమే తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే స్వల్పకాలంలోనే అపారమైన క్రేజ్ అందుకుంది. చెన్నైలోని ఆమె అభిమానులు ఆమెకు ఆలయాన్ని నిర్మించి, ఫిబ్రవరి 14న, ప్రత్యేక పూజలు చేశారు.– ఆమె 36వ పుట్టినరోజున, నటి సమంతా రుత్ ప్రభు కు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం నిర్మించారు. సందీప్ అనే ఆమె అభిమాని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలోని తన ఇంట్లోనే ఆమెకు గుడి కట్టించాడు.– ఒకప్పటి అగ్రనటి నమిత పాపులారిటీ ఎంతలా ఉండేదంటే...ఆమె అభిమానులు తమిళనాడు అంతటా ఆమె గౌరవార్థం ఒకటి కాదు ఏకంగా మూడు ఆలయాలను నిర్మించారు.– ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మించారని ఇటీవల ఊర్వశి రౌతాలా వెల్లడించింది.అంతేకాదు దక్షిణాదిలో కూడా నా పేరిట ఓ ఆలయం రావాలి, చిరంజీవితో, బాలకృష్ణతో కూడా పనిచేశా.విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారితో కలిసి పనిచేశాను కాబట్టి దక్షిణాదిలో కూడా, నా ఆలయం త్వరలో వస్తుంది, అంటూ ఊహాలోకాల్లో తేలిపోయింది.వద్దన్నవారూ ఉన్నారు...గత పదేళ్లుగా, హన్సిక మోత్వానికి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. పడికథవన్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత హన్సికను నటి ఖుష్బు సుందర్‌తో పోల్చడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆమె మద్దతుదారులు మదురైలో ఆలయాన్ని నిర్మించాలని భావించారు. ఖుష్భూ, నమిత తర్వాత గుడిలో దేవతగా మారే అవకాశం ఈ ఆలోచనను హన్సిక తిరస్కరించినందున కోల్పోయింది. అలాగే లేడీ సూపర్‌స్టార్ నయనతార గౌరవార్థం ఆమెకు గుడి కట్టడానికి అనుమతి కోసం నటిని అభిమానులు సంప్రదించినప్పుడు. ఆమె ఆఫర్‌ను ఉదారంగా తిరస్కరించింది. ఆమె గత సంవత్సరం తమిళ చిత్రం మూకుతి అమ్మన్లో దేవతగా నటించడం విశేషం.సచిన్ టెండూల్కర్ టెంపుల్, పూణేభారతదేశంలో క్రికెట్ ఒక మతం, మరియు సచిన్ టెండూల్కర్ దాని అత్యంత గౌరవనీయమైన దేవుళ్ళలో ఒకరు. ఇది భారతదేశంలోని భావోద్వేగ క్రికెట్ అభిమానులచే మరొక నినాదంగా కొట్టివేయబడి ఉండవచ్చు, అయితే పూణేలోని ఒక దేవాలయం ఈ క్రికెట్ లెజెండ్‌కు అంకితం చేయబడింది, ఇక్కడ అభిమానులు ‘మాస్టర్ బ్లాస్టర్‘కి నివాళులర్పించడానికి గుమిగూడారు, భారత క్రికెట్ అభిమానులు తమ క్రికెట్ విగ్రహాన్ని తమ దష్టిలో ఎంత ఉన్నతంగా ఉంచుకుంటారో చెప్పడానికి ఇది నిదర్శనం.ఎం.ఎస్. ధోని టెంపుల్, రాంచీభారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన మరియు ఆకర్షణీయమైన క్రికెటర్లలో ఒకడు మాత్రమే కాదు, ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దేశం యొక్క చక్కని కెప్టెన్ కూడా. అందువల్ల, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. అతను జార్ఖండ్ నుండి మొదటి మరియు అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడు, మరియు అతని అభిమానులు M. . అతని స్వస్థలమైన రాంచీలో ధోనీ ఆలయం. అతని నాయకత్వం మరియు క్రికెట్ విజయాల పట్ల అతని అభిమానులు కలిగి ఉన్న ఆరాధనకు ఈ ఆలయం ఒక అభివ్యక్తి. -
అనారోగ్యంతో ఉన్న భార్యను పురుషులు వదిలేస్తారు.. లైక్ కొట్టిన 'సమంత'
టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని తెలిసిందే. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత సమాచారన్ని కూడా అభిమానులతో ఆమె పంచుకుంటారు. 2022లో మయోసిటిస్ వల్ల సమంత ఆరోగ్యం దెబ్బతింది. ఆ సమయం నుంచి ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్‌లను షేర్ చేయడంతో పాటు లైక్ కొట్టడం చేస్తూ ఉన్నారు. అయితే, ఇన్‌స్టాలో వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై తెలుపుతూ వచ్చిన ఒక పోస్ట్‌ను ఆమె లైక్ చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భార్యను వదిలించుకునేందుకే భర్త మొగ్గు చూపుతున్నారనే ఒక సర్వే గురించి ఆ పోస్ట్‌లో ఉంది. దానిని సమంత లైక్ చేయడంతో వైరల్ అవుతుంది.అలాంటి భర్తలే ఎక్కువగా ఉన్నారుఇన్స్టాగ్రామ్లో సక్సెస్ వెర్స్ పేరుతో ఉన్న ఒక ఖాతాలో ఆ పోస్ట్ షేర్ చేశారు. అందులో ఎక్కువకగా హెల్త్‌తో పాటు కుటుంబ బంధాల గురించే కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వారు ఒక సర్వే గురించి ఇలా పంచుకున్నారు. 'ఒక కుటుంబంలో భార్య తీవ్ర అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే ఇష్టపడుతున్నాడు. ఒకవేల భర్త అనారోగ్యానికి గురైతే భార్య మాత్రం అతడిని విడిచిపెట్టడం లేదు. ఒక సర్వేలో ఇది నిర్ధారించబడింది. పురుషులు తమ భాగస్వామికి ప్రాణాంతక అనారోగ్యం వస్తే ఆమెను వదిలించుకునేందుకు ప్రతి వెయ్యి మందిలో 624 మంది ఉన్నారని గణాంకాలతో సహా ఆ సర్వేలో చెప్పబడింది. భార్య ఆనారోగ్యం వల్ల చాలామంది పురుషులు భావోద్వేగ, శారీరక సాన్నిహిత్యం కోల్పోవడం వల్లే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనారోగ్యం సమయంలో భార్యను వదిలివేయడం వెనుక దాగి ఉన్న పూర్తి విషయాలు ఇంకా ఏమున్నాయో నేటి ప్రపంచానికి తెలుపుదాం.' అని సమంత లైక్ చేసిన పోస్ట్‌లో ఉంది. సుమారు 60 వేలకు పైగానే ఆ పోస్ట్‌ను లైక్ చేశారు. భర్తతో విడిపోయిన సమంత ఇలాంటి పోస్ట్‌ను లైక్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.2021లోనే తన భర్తతో విడిపోతున్నట్లు సమంత ప్రకటించారు. అయితే, 2022లో తను మయోసిటిస్ వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు. దానికి చికిత్స పొందుతూనే ఖుషి, శాకుంతలం సినిమాలు చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో బిజీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Success | Millionaire | Mindset (@successverse_) -
ఆ డైరెక్టర్‌తో తిరుమలకు సమంత.. వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం నిర్మాతగా అభిమానుల ముందుకు రానుంది. ఆమె నిర్మించిన తాజా చిత్రం శుభం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే గత కొద్ది కాలంగా వ్యక్తిగత విషయాలతొనే వార్తల్లో నిలుస్తోంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తర్వాత.. సమంతపై పెద్దఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సామ్ డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. ఇటీవల పికిల్ బాల్ లీగ్‌లోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో బీహైండ్వుడ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో రాజ్ నిడిమోరు, సమంత సందడి చేశారు. కొంతకాలంగా ఈవెంట్స్‌లో కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.ఈ వార్తల నేపథ్యంలో సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్షిప్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సమంత, రాజ్ నిడిమోరు సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్‌పై చర్చ మొదలైంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటి వరకు సమంత, రాజ్ ఒక్కసారి కూడా స్పందించలేదు. వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఇప్పట్లో రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.కాగా.. రాజ్ డైరెక్షన్లో సామ్ 'సిటాడెల్: హనీ బన్నీ, 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' (2021) అనే రెండు ప్రాజెక్ట్‌ల్లో నటించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' లోనూ సమంత నటిస్తోంది. సమంత చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత
సమంత(Samantha) ఈ పేరు చెప్పగానే ఏ మాయ చేశావె తో పాటు చాలా సినిమాలు గుర్తొస్తాయి. తెలుగులో స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పలు కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంది. నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీని విడుదలకు సిద్ధం చేసింది.మే 9న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. నెల్లూరులోని ఓ కాలేజీలో తాజాగా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో మాట్లాడిన సమంత.. తన తొలి చిత్రాల్లో చాలా ఘోరంగా యాక్టింగ్ చేశానని, అవి చూస్తున్నప్పుడల్లా సిగ్గేస్తుందని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో చేరిన రష్మీ గౌతమ్..)సమంత నటించిన తొలి చిత్రం 'ఏ మాయ చేశావె'(Ye Maaya Chesave). అయితే ఈ మూవీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇందులో తన యాక్టింగ్ తనకే నచ్చలేదని సమంత చెప్పడం మాత్రం ఆశ్చర్యకలిగించింది. ఇకపోతే సామ్ ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలున్నాయి.ఏ మాయ చేశావె.. సమంత కెరీర్ లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తనకు తొలి సినిమా. కలిసి నటించిన నాగచైతన్యని(Naga Chaitanya) కొన్నాళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. అయితేనేం చాలామందికి ఇప్పటికీ 'ఏ మాయ చేశావె' ఫేవరెట్ సినిమానే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్) -
తిరుమలలో సమంత సహా పలువురు సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
‘‘మహిళలు ఎంతో సాధిస్తున్నారు. కానీ పీరియడ్స్ గురించి మాట్లాడటానికి ఇప్పటికీ ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. ఈ విషయం గురించి మాట్లాడాలంటే మౌనం... బిడియం... గుసగుసలు... ఇలాంటి పరిస్థితే ఉంది’’ అని పేర్కొన్నారు సమంత. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారామె. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు.ఇందులో భాగంగా తాజాగా తన పాడ్ కాస్ట్లో ఆరోగ్య నిపుణురాలు రాశీ చౌదరితో రుతుక్రమ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు సమంత. అలాగే ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం లోపలి పొర) వంటి దీర్ఘకాలిక రుతుక్రమ రుగ్మతలపై తన అబీప్రాయాలను పంచుకున్నారామె. ‘‘ఎండోమెట్రియోసిస్‌తో ఒక సెలబ్రిటీగా నేను ఇబ్బందులు పడ్డాను. షూటింగ్, పని తాలూకు ఒత్తిడి... ఇలాంటి వాటితో చాలా బాధపడ్డాను. రుతుక్రమ సమస్యల గురించి అమ్మాయిలు మాట్లాడాలి... అవగాహన పెంచుకోవాలి. పురుషులు కూడా తెలుసుకోవాలి’’ అని తెలిపారు సమంత. ఇక సినిమాల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. అయితే గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారామె. అలాగే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. -
సమంత 'సిటాడెల్ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్
ఏ మాయ చేశావె సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది సమంత (Samantha Ruth Prabhu). తొలి చిత్రంలో అమాయకంగా కనిపించిన సామ్ తర్వాత యాక్షన్, ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. 25 ఏళ్ల కెరీర్లో ఆమె ఎక్కువ కష్టపడ్డది సిటాడెల్ కోసమే! ఓపక్క మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడే సిటాడెల్లో యాక్షన్ సిరీస్ పూర్తి చేసింది.ఇండియన్ సిటాడెల్ :హనీ బన్నీలో వరుణ్ ధావన్- సమంతహాలీవుడ్ సిరీస్‌కు ఇండియన్ వర్షన్నిజానికి ఇది ఒరిజినల్ కాదు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel)కు ఇది ఇండియన్ వర్షన్‌గా రూపొందింది. ఒరిజినల్ వర్షన్లో హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. న్యూటన్ థామస్- జెస్సికా ద్వయం రూపొందించారు. దీని ఇండియన్ వర్షన్ సిటాడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)లో వరుణ్ ధావన్, సమంత లీడ్స్ రోల్లో నటించగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇది గతేడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.హాలీవుడ్ సిటాడెల్లో రిచర్డ్ మాడెన్- ప్రియాంక చోప్రాఇకపై లేనట్లేతాజాగా దీనికి సీక్వెల్ నిలిపివేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్‌తో పాటు ఇటాలియన్ వర్షన్ (సిటాడెల్: డయానా) సీక్వెల్స్ ఆపేసి, బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. దీని గురించి అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సిటాడెల్: హనీ బన్నీ, సిటాడెల్: డయానా సిరీస్‌లను కొనసాగించడం లేదు. దానికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేసి సిటాడెల్ సెకండ్ సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం. 2026లో రెండో సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.చదవండి: ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటో చూశారా? -
అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. చివరగా 'ఖుషి' చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో రక్త్ బ్రహ్మాండ్ అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. ఇవి కాకుండా శుభం అనే సినిమా నిర్మిస్తోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె నటీనటుల మధ్య పారితోషికం వ్యత్యాసంపై పెదవి విప్పింది.రెమ్యునరేషన్ వ్యత్యాసాలుసమంత మాట్లాడుతూ.. నేను చాలా సినిమాల్లో హీరోతో పాటు సమాన పనిదినాల్లో వర్క్ చేశాను. కానీ మాకిచ్చే రెమ్యునరేషన్ మాత్రం ఒకేలా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్‌కు రప్పించగలడు... అలాంటివాటిని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను.సమానత్వం కనిపించదుకానీ కొన్ని చిత్రాల్లో హీరోహీరోయిన్‌కు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. పారితోషికం దగ్గర మాత్రం ఆ సమానత్వం కనిపించదు. అదెందుకో ఇప్పటికీ అర్థం కాదు. నా విషయానికి వస్తే.. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో నేను చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు సడన్‌గా అన్నీ మార్చలేనేమో కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. అయినా నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎక్కడైతే నిందలు, బాధలు పడ్డామో అక్కడే పరిష్కారం వెతుక్కోవాలి. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను అని సమంత చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: కారులో బాంబు పెట్టి లేపేస్తాం.. సల్మాన్‌కు వార్నింగ్ -
స్మైలీ జాన్వీ కపూర్.. బంజారా స్టైల్లో అనసూయ!
స్వీట్ లుక్ లో సమంత.. లేటెస్ట్ పిక్స్ చూశారా?పెట్ డాగ్ తో హాట్ పోజులిచ్చిన జాన్వీ కపూర్బంజారా స్టైల్ లుక్ లో యాంకర్ అనసూయచీరలో అందానికే అసూయ పుట్టించేస్తున్న ఈషా రెబ్బాక్యూటీ పై పోజులతో యంగ్ బ్యూటీ శ్రీలీలజాట్ మూవీ షూటింగ్ జ్ఞాపకాలతో బిగ్ బాస్ దివిఅమెరికాలో ట్రిప్ మెమొరీస్ షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani)


