హీరోయిన్ సమంతకు కష్టకాలం! | Samantha Ruth Prabhu Web Series Rakt Brahmand Called Off Due To Financial Issues, Rumours Went Viral | Sakshi
Sakshi News home page

Samantha: సినిమాల్లేవు.. ఇప్పుడు అది కూడా ఆగిపోయే!

Jun 24 2025 9:17 AM | Updated on Jun 24 2025 10:51 AM

Samantha Web Series Rakt Brahmand Shelved

హీరోయిన్‌గా సమంత స్టార్ హోదా చూసింది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు చేతిలో పెద్గగా చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. కొన్నిరోజుల క్రితం 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ ఓకే అనిపించుకుంది కానీ పెట్టిన డబ్బులు అయితే వచ్చేశాయి. అలా నిర్మాతగా తొలి అడుగు పర్లేదనిపించుకుంది. కానీ నటిగానే ఈమెకు కష్టకాలం నడుస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!

నాగచైతన్యకు 2021లో విడాకులు ఇచ్చిన సామ్.. తర్వాత కొన్నాళ్లకు తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమా చేసింది. ఇది పర్లేదనిపించుకోగా..  తర్వాత 'సిటాడెల్' ఇండియన్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది కూడా సమంతకు పెద్దగా ప్లస్ కాలేకపోయింది. ప్రస్తుతానికైతే 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పుడు ఇది కూడా మొత్తానికే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.

(ఇదీ చదవండి: మరో హీరోయిన్‌తో తమన్నా మాజీ ప్రియుడు డేటింగ్?)

కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ పనిచేస్తున్న ఓ వ్యక్తి.. బడ్జెట్‌ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్‌ చేశాడని, 25 రోజులే షూటింగ్ జరిగినప్పటికీ.. సగానికి బడ్జెట్ ఖర్చయిపోయిందని టాక్ వచ్చింది. ఇదంతా కూడా ఓ ఆడిట్ ద్వారా బయటపడింది. అకౌంటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్‌ను ఆపేశారని టాక్‌ నడిచింది. ఇ‍ప్పుడు మిగిలిన బడ్జెట్ పెట్టి సిరీస్ పూర్తి చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. దీంతో సిరీస్ మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది.

అయితే చిత్ర నిర్మాతలైన రాజ్-డీకే మాత్రం అలాంటిదేం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారు. ఒకవేళ గనుక ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మాత్రం సమంతకు కష్టకాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అలా అని ప్రస్తుత దర్శకులు ఈమెకు హీరోయిన్ అవకాశాలు ఇస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)

Advertisement
 
Advertisement
Advertisement