లిఫ్ట్, ప్రెస్టో వంటి కంపెనీల భాతర సంతతి సహవ్యవస్థాపకుడు రజత్ సూరి తరగతి గది వర్సెస్ ఏఐపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ యుగంలో కాలేజీ విద్య నిరుపయోగంగా మారుతోందంటూ చర్చను రేకెత్తించారు. పైగా ఆయన తన పిల్లలు కాలేజ్‌కి వెళ్లి చదవకపోవడమే మేలు అని సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
యువతకు అవసరమైన నైపుణ్యాలు, అనుభవాన్ని సంపాదించడానికి సాంప్రదాయ కాజేల్ చదువులు సరిపోకపోవచ్చని వాదించారు. ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావిస్తూ..తాను యూనివర్సిటీ ఆఫ్ వాటర్‌లూలో ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ డిగ్రీలు చేశాక, ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(ఎంఐటీ)లో పీహెచ్‌డీ/ఎంబీఏ ప్రోగ్రామ్ చేయడం కోసం చేరినట్లు తెలిపారు.
అయితే తగరతి గదిలో నేర్చుక్నుదానికంటే వాస్తవ ప్రంపంచంలోనే అసలైన పనిని నేర్చుకున్నానని అంటున్నారు. ఆ కారణంగానే తాను వ్యవస్థాపకతపై దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతోనే ఎంఐటీని మధ్యలోనే వదిలేశానని చెప్పారు. ఈ రోజు తన పిల్లలు గురించి ఆలోచిస్తుంటే వాళ్లు అసలు కాలేజ్ దరిదాపుల్లోకి వెళ్లకూడదని కోరుకుంటున్నానని అన్నారు.
అలాగే వాటర్‌లూలో తనకు ఆరు వేర్వేరు వర్క్‌ప్లేస్‌మెంట్లు లభించాయని అన్నారు. అవి తనను వివిధ కంపెనీలు, సంస్కృతులు, మేనేజర్లు, వ్యాపార నమునాలకు పరిచయం చేశాయని అన్నారు. నిజానికి తన కోర్సు వర్క్‌లోని చాలా భాగం కంటే ఆ అనుభవాలే ఎంతో విలువైనవని అన్నారు. తాను స్కూల్లో నేర్చుకున్న చాలా విషయాలు వాటర్‌లూలోని వర్క్ టర్మ్స్‌లోనే నేర్చుకున్నానని చెప్పారు.
అక్కడ నుంచి ఆరు వేర్వేరు కంపెనీలలో పనిచేశానని చెప్పారు. ఎంతో భిన్నమైన సంస్కృతులు, భిన్న యాజమాన్య శైలుల, టీమ్ డైనమిక్స్, వ్యాపార నమునాలు గురించి నేర్చుకున్నానని చెప్పారు. అందువల్ల ఈ రోజుల్లో తరగతి గదుల కంటే ఏఐ.. విద్యా నైపుణ్యాలను మరింత సమర్ధవంతంగా నేర్పించగలదని అన్నారు.
కాబట్టి నాలుగేళ్లపాటు తరగతులకు హాజరయ్యే బదులు, యువత నేరుగా వివిధ సంస్థలలో పని అనుభవం ద్వారా నేర్చుకోవడమే మంచిదని ఆయన వాదించారు. అంతేగాదు రజత సూరి తన వర్క్‌లైఫ్ ద్వారానే చాలా నేర్చుకున్నాని, అదే తనను ప్రెస్టో, లిఫ్ట్ వంటి కంపెనీలను స్థాపించి వ్యవస్థాపకుడిగా మార్చిందన్నారు. ప్రస్తుతం ఆయన లీమా, ట్రైబ్ చాట్‌లకు సహా వ్యవస్థాపుకుడిగా ఉన్నారు.
I went to MIT for a PhD / MBA after graduating with 2 degrees at Waterloo, and yet I'm thinking that my kids probably shouldn't go to college
Most of what I learned at school was at my work terms at Waterloo. I worked at 6 different companies there, experienced vastly different…— Rajat Suri (@rajatsuri) August 18, 2026
(చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!)


