15 మందితో.. పెళ్లైన 15 రోజులకే, మూడో భర్తపై ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు | 15 days into marriage NRI woman accuses 3rd husband of cheating assault | Sakshi
Sakshi News home page

15 మందితో.. పెళ్లైన 15 రోజులకే, మూడో భర్తపై ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు

Oct 5 2026 6:25 PM | Updated on Oct 5 2026 6:36 PM

15 days into marriage NRI woman accuses 3rd husband of cheating assault

వివాహం జరిగిన కేవలం 15 రోజులకే  అహ్మదాబాద్‌కు చెందిన 46 ఏళ్ల ఎన్నారై (NRI) మహిళ తన భర్తపై పోలీసులు ఫిర్యాదు చేసిన  ఘటన దిగ్భ్రాంతి రేపింది.  న భర్త ఫోన్‌లో సుమారు 15 మంది మహిళలతో ఉన్న శృంగారభరితమైన చాట్‌లను చూసి షాకైంది. దీంతో  తనను మోసం చేశాడని, దాడి, కట్నం కోసం వేధించాడంటూ పోలీసులను ఆశ్రయించింది.

ఆమె ఫిర్యాదు  ప్రకారం అమెరికా పౌరురాలైన  బాధిత మహిళ, గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్న తర్వాత ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే తన భర్త నిరంతరం మొబైల్ ఫోన్‌లో బిజీగా ఉండటంతో అనుమానం వచ్చింది. దీంతో  ఒకరోజు ఫోన్ చెక్ చేయగా గోవా, అమెరికా, అహ్మదాబాద్‌లకు చెందిన దాదాపు 15 మంది మహిళలతో ఆయన శృంగార చాట్లు, నంబర్లు బయటపడ్డాయి. ఈ విషయంపై భర్తను నిలదీయగా, అతను ఆమెను దూషించి, భౌతిక దాడికి పాల్పడ్డాడు. గోవా ట్రిప్ సమయంలో అతని ప్రియురాళ్లలో ఒకరు తనే భార్యనని  చెప్పడంతోపాటు, ప్రశ్నించిన  తనను చేయి విరిగేలా కొట్టాడని  ఆమె తన  పిర్యాదులో ఆరోపించింది.

ఇదీ చదవండి: ఫ్లాట్‌ఫాం టికెట్, రూ. 500 ఫైన్‌‌ : ఈ విషయం తెలుసా మీకు?

 Number of Californians with mental health distress sharply increased from  2014 to 2018 | UCLA

అంతేకాదు అతనికి మద్యం, జూదంలాంటి చెడు అలవాట్లు ఉన్నాయని, గోవాలోనిహోటల్‌లో జూదంలో భారీగా డబ్బు పోగొట్టు కున్నాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా, ఆమె తండ్రి దుకాణం విక్రయించి ఇచ్చిన డబ్బును కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, ఆమె బంగారు, వెండి ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో పెడతానని తీసుకుని తిరిగి ఇవ్వలేదని కూడా ఆమె  ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: ఏసీపీ వివేక్‌ భగవత్‌పై ఆరోపణలు, తీవ్రంగా మండిపడిన మహువా

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడికి ఇదివరకే పెళ్లైందని, మొదటి భార్య ద్వారా ఒక  కొడుకు, కూతురు ఉన్నారని తేలింది. నిందితుడు తన పిల్లలతో కలిసి ఆ మహిళను ఆర్థికంగా దోచుకుంటూ, శారీరక, మానసిక హింసకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement