సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డ్యూక్ బైక్ చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. కోరుకొండ మండలం నరసాపురం శివారులో వేగంగా వెళ్తున్న డ్యూక్ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతడిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: యువతి మృతదేహం కలకలం


