రాప్తాడు ఘటన: హైకోర్టు కీలక ఆదేశాలు | High Court expresses concern over student safety following Raptadu incident | Sakshi
Sakshi News home page

రాప్తాడు ఘటన: హైకోర్టు కీలక ఆదేశాలు

Nov 19 2026 9:24 PM | Updated on Nov 19 2026 9:24 PM

High Court expresses concern over student safety following Raptadu incident

విజయవాడ: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనతో విద్యార్థుల భద్రతపై ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. మరో ఘటన జరిగే వరకు వేచి చూడొద్దని హైకోర్టు సూచించింది. విద్యార్థుల భద్రతకు మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పింది. పాఠశాలల్లో భద్రతపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

కాగా, రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. హేమంత్ (21) అనే యువకుడు తరగతి గదిలోకి ప్రవేశించి విద్యార్థినిపై ఈ దాడికి పాల్పడ్డాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి.

దాడి తర్వాత పరారైన హేమంత్‌ను ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. పట్టుకునే ప్రయత్నంలో తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడి కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు శస్త్రచికిత్స చేసి అతడి కుడి కాలును తొలగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement