‘ఇంతటి వరస్ట్‌ పోలీసింగ్‌ ఎప్పుడూ చూడలేదు’ | YSRCP MP Avinash Reddy Slams TDP Leader BTech Ravi, Accuses TDP Of Diversion Politics And Misusing Power In Kadapa | Sakshi
Sakshi News home page

‘ఇంతటి వరస్ట్‌ పోలీసింగ్‌ ఎప్పుడూ చూడలేదు’

Nov 19 2026 5:55 PM | Updated on Nov 19 2026 6:06 PM

YSRCP MP Avinash Reddy Slams Btech Ravi

కడప:  టీడీపీ నేత బీటెక్‌ రవి ధర్నా చూస్తుంటే నవ్వుకోవాలో, అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి. వాళ్లే అరాచకాలు, అక్రమాలు చేసి మళ్లీ ధర్నాలు చేస్తున్న తీరు డైవర్షన్‌ పాలిటిక్స్‌ కాక మరేమిటని ప్రశ్నించారు. ఇలాంటి నీచ రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు ఎంపీ అవినాష్‌. 

‘మున్సిపల్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎన్నికల్లో ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు, ఓటర్లు అడ్డుకోవడం చూశాం. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి డైవర్ట్ చేశామని అనుకుంటున్నారు. వీళ్ళ నిరసన చూసి ప్రజలు అసమహ్యించుకుంటున్నారు. సామాన్య ప్రజలు అందరు గమనిస్తున్నారు. ప్లీనరీ సమయంలో వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ తోరణాలు తొలిగించినందుకు మాపై హత్యాయత్నం కేసు పెట్టారు. వేల్పులు రాము మీద దాడి చేసి తిరిగి మాపైనే కేసు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్బంగా మాపై దాడి మాపైనే కేసు. నిన్న చక్రాయపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నామినేషన్ వేసినందుకు నాన్ బెయిల్‌బుల్‌ కేసులు పెట్టారు. ఇంతటీ వరస్ట్ పోలీసింగ్ ఎప్పుడు చూడలేదు. 

అగుగూడులో టిడిపి వాళ్ళే పెట్రోల్ బాఃబులు వేసి దాడి చేశారు. వాస్తవాలు వక్రీకరించడానికి పోలీస్ స్టేషన్ ముందు డ్రామా చేశారు. డిఐజి, కలెక్టర్, పోలీసులు మీ వైపు ఉన్నా కూడా మావాళ్ళను అరెస్ట్ చేయమని కోరుతున్నారు. మా కార్యకర్తలు బయట ఉంటే తట్టుకోలేమని భయపడుతున్నారు. మా వాళ్ళ ముందు నిలబడే దమ్ము లేదు. 

ఈ ప్రాంతంలో ఒక దుర్మార్గుడు, ఇంచార్జ్‌.. మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారు. 2021 స్దానిక ఎన్నికల్లో నామినేషన్లు చించినట్లు దాడి చేసినట్లు దమ్ముంటె ఒకటి చూపించండి. నాడు మీకు నిలబడె దమ్ము  లేక పారిపోయారు. నేడు ప్రాణాలు పణంగా పెట్ఠి నామినేషన్ వేసే పరిస్థితి. దీనికి కారణం మీరు కాదా?,  మీ రాజకీయాలు ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యం అడ్డుకున్నది, దాడి చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. మిమ్మల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. 

ఇదీ చదవండి: కష్టపడి రిగ్గింగ్‌ చేసినా విలువ లేకుండా పోయింది..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement