కష్టపడి రిర్గింగ్‌ చేసినా విలువ లేకుండా పోయింది..! | Singanamala MPP Post Row: Protests Escalate Outside TDP MLA Bandaru Sravani Home | Sakshi
Sakshi News home page

కష్టపడి రిర్గింగ్‌ చేసినా విలువ లేకుండా పోయింది..!

Nov 19 2026 3:41 PM | Updated on Nov 19 2026 4:25 PM

Singanamala MPP Post Row: Protests Escalate Outside TDP MLA Bandaru Sravani Home

సాక్షి,అనంతపురం : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలు, అరాచకం ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలుగు తమ్ముళ్ల సాక్షిగా బయటపడింది. తాము ఎంతో కష్టపడి రిగ్గింగ్‌ చేశామనేది పేపర్లకు టీవీలకు వచ్చిందనే విషయాన్ని వారే ఒప్పేసుకుంటున్నారు.  అయితే వారు రిగ్గింగ్‌ చేశామని ఒప్పుకోవడానికి కారణం లేకపోలేదు. 

తాము అంత కష్టపడి రిగ్గింగ్‌ చేసినా శింగనమల ఎంపీపీ సీటులో పోరు ఉత్కంఠగా మారడమే.  అనంతపురం జిల్లా శింగనమల మండలంలో టీడీపీ,  వైఎస్సార్‌సీపీలకు సమానంగా ఎంపీటీసీ స్థానాలు దక్కడంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల నిజ స్వరూపం బయటకొచ్చింది. 

తాము ఇంత కష్టపడి రిగ్గింగ్‌ చేస్తే.. వైఎస్సార్‌సీపీ ఇక్కడ వరకూ రావడం ఏమిటనేది వారి బాధ. దాంతో టీడీపీ శ్రేణులే ఆక్రోశం ఆపుకోలేక రిగ్గింగ్‌ చేసిన  విషయాన్ని బయటపెట్టేశాయి. 

శింగనమల నియోజకవర్గంలో ఎంపీపీ పదవి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారడమే కాదు.. తెలుగు తమ్ముళ్లు మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలు కూడా వైరల్‌ అవుతున్నాయి. కష్టపడి రిగ్గింగ్‌ చేస్తే శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తన అనుకూల వ్యక్తికి ఎంపీపీ సీటును అమ్ముకున్నారంటూ టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తమ నేత ఈశ్వర్‌రెడ్డికి ఎంపీపీ వస్తుందనుకుంటే.. దానిని తమ ఎమ్మెల్యే బండారు శ్రావణి తమకు కాకుండా చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

 

 

ఇదీ చదవండి: వివాదాస్పద అధికారికి మళ్లీ ఎన్నికల బాధ్యతలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement