రామోజీ రాష్ట్ర పండుగ అంటే.. అంతకంటే దుర్దినం లేదు! | Bhumana Karunakar Reddy Comments On Ramoji Rao And Chandrababu | Sakshi
Sakshi News home page

రామోజీ రాష్ట్ర పండుగ అంటే.. అంతకంటే దుర్దినం లేదు!

Nov 19 2026 12:23 PM | Updated on Nov 19 2026 12:28 PM

Bhumana Karunakar Reddy Comments On Ramoji Rao And Chandrababu

సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు చేసిన సేవకు పరిహారంగా ఈనాడు రామోజీరావు పుట్టినరోజును రాష్ట్ర పండుగ ప్రకటించడం దారుణం అని వైఎస్సార్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు 50 ఏళ్లుగా  తన పత్రికను తన స్వార్థానికి వాడుకుని.. తనకు నచ్చనివారిపై విషం చిమ్మిన వ్యక్తి’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి పుట్టిన రోజు రాష్ట్ర పండుగ నిర్వహించాలని చెప్పడం అత్యంత హేయమైన చర్య. రామోజీ ఫిల్మ్ సిటీ వేల ఎకరాల్లో ఆక్రమించిన వ్యక్తి. అహంకార పూరిత చర్యలకు ఎందరో జర్నలిస్టులు వ్యతిరేకించారు, రౌడీలను తీసుకువచ్చి జర్నలిస్టులపై దాడి చేయించిన వ్యక్తి రామోజీరావు. తెలుగు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి రామోజీరావు.

..1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే.. రామోజీరావు పెన్నుపోటు పొడిచారు. పత్రికను అడ్డుపెట్టుకుని లక్షలకోట్లు ఆస్తులు ఆర్జించారు. రామోజీ రాష్ట్ర పండుగ అంటే అంతకంటే దుర్దినం మరొకటి లేదు. నార్ల వెంకటేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, ఏబీకే వెంకటేశ్వరరావు పత్రిక విలువల్ని కాపాడారు. తెలుగు ప్రజల్ని, తెలుగు జర్నలిజాన్ని అసహ్యించుకునే స్థాయికి దిగజార్చుకునేలా చేసిన వ్యక్తి రామోజీరావు’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: జనసేన: రూ.ఏడు కోట్ల స్కాం.. మరో బిగ్‌ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement