కోమటిరెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. రేవంత్‌కు రాజాసింగ్‌ సవాల్‌ | MLA Raja Singh Political Challenge To Revanth Reddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. రేవంత్‌కు రాజాసింగ్‌ సవాల్‌

Nov 19 2026 11:15 AM | Updated on Nov 19 2026 12:10 PM

MLA Raja Singh Political Challenge To Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం, ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై రాజాసింగ్‌ స్పందించారు. ‘బంగారు తెలంగాణ’ సాధించాలంటే ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రస్తుతం నిధుల కోసం మున్సిపల్‌ కమిషనర్‌, వాటర్‌ వర్క్స్‌ ఎండీ వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు నిధుల సమస్య, అధికారులతో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉండేవి కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆరోపించారు.

హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో గోషామహల్‌ నుంచే పన్నులు, విద్యుత్‌, నీటి బిల్లుల రూపంలో ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తోందని, కానీ నియోజకవర్గానికి నిధులు మాత్రం సున్నా అని విమర్శించారు. ఏ నియోజకవర్గం నుంచి ఎంత ఆదాయం వస్తోంది.. ఎంత నిధులు కేటాయిస్తున్నారో సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే సర్వే చేయించాలని సవాల్‌ విసిరారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, డ్రైనేజీ సమస్యలపై పలుమార్లు చెప్పినా అధికారులు స్పందించడం లేదన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ తన ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకు కూడా స్పందించడం లేదని తెలిపారు. టౌన్‌ ప్లానింగ్‌లో అవినీతి వ్యవస్థ కొనసాగుతోందని ఆరోపించారు. నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణి సరికాదని, ఇలాంటి వ్యవహారాలతో సీఎంకు, కాంగ్రెస్‌ పార్టీకే చెడ్డపేరు వస్తుందని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: జల దోపిడీకి రేవంత్‌ సహకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement