పార్టీలోకి చేరిన వారితో బీఎస్ మక్బూల్, తదితరులు
శ్రీసత్యసాయి జిల్లా: తలుపుల మండలంలోని ఉడుములకుర్తి పంచాయతీలో టీడీపీకి షాక్ తగిలింది. బుధవారం సోమలవాండ్లపల్లిలో 150 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ డీకే బాబు (కృష్ణారెడ్డి) అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్.మక్బూల్ వారందరికీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, డీలర్ గంగాధర్, ఉడుములకుర్తికి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ సాయినాథ్, రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఎద్దుల కిష్టయ్య, రామాంజనేయులు, రామమోహన్, జగన్, సుబ్బరాయుడు, గణపతి, బాలచందర్, సుకన్య, సరోజమ్మ, కల్పన తదితరులు పారీ్టలో చేరారు. దీంతో టీడీపీకి కంచుకోటగా మారిన సోమలవాండ్లపల్లి వైఎస్సార్‌సీపీ కంచుకోటగా మారింది. బీఎస్ మక్బూల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు.


