ఎంపీపీ ఎన్నికలు.. బైరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు | MPP Election And AP Politics Today Updates | Sakshi
Sakshi News home page

ఎంపీపీ ఎన్నికలు.. బైరెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

Nov 19 2026 7:45 AM | Updated on Nov 19 2026 8:02 AM

MPP Election And AP Politics Today Updates

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల అప్‌డేట్స్‌..

ఏపీలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీని ఎన్నికల నేపథ్యంలో కూటమి సర్కార్‌ కుట్రలు మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఎన్నికల సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

నంద్యాల..

  • ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కూటమి నేతల కుట్రలు.

  • బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని నందికొట్కూరు నియోజకవర్గానికి వెళ్లనివ్వకుండా తన ఇంటి వద్దే అడ్డుకున్న పోలీసులు.

  • కర్నూలులో బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

  • పాములపాడు ఎంపీపీకి వైఎస్సార్‌సీపీకి మెజార్టీ ఉన్నా కుట్రలకు తెరలేపిన టీడీపీ నేతలు.

  • సిద్దార్థ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్న పోలీసులు.


👉ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన 659 మండలాల పరిధిలో నేడు మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతోపాటు కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. గురువారం మండల పరిషత్‌ కార్యాలయాల్లో జరిగే సమావేశాల్లో తొలుత ఎంపీటీసీలు  ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత చేతులెత్తే విధానంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీని ఎన్నుకుంటారు.

ఉదయం 10 కల్లా నామినేషన్లు పూర్తి 
👉మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్ని­కకు సంబంధించి మండలాల్లో గురువా­రం ఉదయం 10 గంటల కల్లా నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగియనుంది. 10 నుంచి 12 గంటల మధ్య రెండు గంటల పాటు నామినేషన్ల పరిశీలన కార్య­క్రమం కొనసాగుతుంది. 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరా­­లను ప్రకటిస్తారు. ఒంటి గంట లోపు ఉపసంహరణకు వీలు కల్పిస్తా­రు. అన్ని మండలాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారు.

👉అనంతరం కో-ఆప్టెడ్‌ సభ్యుని ఎన్నికను నిర్వహించి సమావేశం వాయిదా వేస్తా­రు. తిరిగి మధ్యా­హ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశాలు కొనసాగించి మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేదా ఇతర కారణాలతో ఎక్కడైనా కో-ఆప్టెడ్‌ సభ్యు­ని ఎన్నిక వాయిదా పడిన పక్షంలో 20న ఆయా ఎన్నిక చేపడతారు. జిల్లా పరిషత్‌లో శుక్రవారం(20వ తేదీ) జరిగే  జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్, కో-ఆప్టెడ్‌ సభ్యుని ఎన్నికల్లోనూ ఇదే టైం షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.

ఇదీ చదవండి: కూటమి సర్కార్‌ విధ్వంసంపై ఎన్‌జీటీ సీరియస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement