అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా | Travels Bus Overturns Near Raptadu Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా

Nov 19 2026 7:40 AM | Updated on Nov 19 2026 7:43 AM

Travels Bus Overturns Near Raptadu Anantapur District

సాక్షి, అనంతపురం జిల్లా: వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాప్తాడు మండలం రామినేపల్లి దగ్గరు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

కాగా, ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి జాతీయ రహదారి భారత్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో ప్రమాదవశాత్తు ప్రైవేటు బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణికులు గాయపడిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా ఒడిశాకు ఓ ప్రైవేటు బస్సు పయనమైంది. చంద్రగిరి జాతీయ రహదారి భారత్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో వస్తున్న క్రమంలో డ్రైవరు నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డుపక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: దిశ మార్చుకున్న అక్వాన్‌..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement