దిశ మార్చుకున్న అక్వాన్‌.. | Cyclone Akvan: Andhra Pradesh November 19 2026 Updates | Sakshi
Sakshi News home page

దిశ మార్చుకున్న అక్వాన్‌..

Nov 19 2026 7:13 AM | Updated on Nov 19 2026 7:17 AM

Cyclone Akvan: Andhra Pradesh November 19 2026 Updates

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను.. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 470 కి.మీ, కళింగపట్నంకి 490 కిమీ, చెన్నైకి 570 కి.మీ, గోపాల్‌పూర్‌కి 580 కి.మీ, పూరీకి 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రేపు(శుక్రవారం) మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని  ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది.

👉తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. దీని ప్రభావంతో నేడు, రేపు(గురు,శుక్ర) ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశముందని.. ఇవాళ(గురువారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు  వర్షాలు పడే అవకాశముందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ, గరిష్ఠంగా 80 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

👉ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోను భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే శుక్రవారం ఉత్తరాంధ్రలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి. అల్లూరి, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీవర్షాలు పడతాయి.

👉గురు, శుక్రవారాల్లో కోస్తా అంతటా గంటకు 90–100 కిలోమీటర్లు, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. శనివారం కూడా ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కొనసాగుతాయి. రాయలసీమపై తుపాను ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది.

👉బుధవారం అర్ధరాత్రి నుంచి తుపాను ప్రభావం కనిపించనుంది. భారీ వర్షాలతోపాటు గంటకు 100–110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను బలహీనపడినా వర్షాల తీవ్రత ఉండనుంది. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు తీరానికి ఎదురుగా సముద్రంలో తుపాను వర్ష కేంద్రం కేంద్రీకతమై ఉంది. తీరప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

👉గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు, యానాంలో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయి. పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయి.

ఇదీ  చదవండి: దిశ మార్చుకుంటూ.. దడపుట్టిస్తున్న ఆక్వాన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement