బిడ్డ చనిపోతే.. బాధ్యత మాది కాదంటారా? | Tribal Students Incident In Parvathipuram Manyam | Sakshi
Sakshi News home page

బిడ్డ చనిపోతే.. బాధ్యత మాది కాదంటారా?

Nov 19 2026 8:39 AM | Updated on Nov 19 2026 8:39 AM

Tribal Students Incident In Parvathipuram Manyam

సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన విద్యార్థుల సంక్షేమం, భద్రతకు పెద్దపీ ట వేయాల్సిన పార్వతీపురం ఐటీడీఏ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో వరుసగా చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాల నేపథ్యంలో బాధ్యతలను సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి.. ‘విద్యార్థుల మరణాలకు పాఠశాల యాజమాన్యానికి, సిబ్బందికి సంబంధం లేదంటూ’ తెల్లకాగితాలపై రాయించి సంతకాలు తీసుకుంటున్నారన్న వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల ప్రాణాల కంటే తమపై ఎలాంటి బాధ్యత పడకుండా చూసుకోవడానికే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

ఏం చేస్తున్నారు.. ఏం బోధిస్తున్నారు? 
కొండకోనల్లోని తమ కుటుంబాలను, ఆత్మీయులను వదిలి గిరిజన విద్యార్థులు ఎన్నో ఆశలతో ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్నారు. చిన్న వయసులోనే కుటుంబానికి దూరంగా ఉండటం, కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం,చదువులో ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు.. ఇలా ఎన్నో అంశాలు వారి మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు విద్యాబోధన చేయడంతోపా టు వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, సమ స్యలను గుర్తించడం, ఆత్మవిశ్వాసం నింపడం కూ డా ఉపాధ్యాయులు, వార్డెన్లు, సంక్షేమ అధికారుల బాధ్యత. 

కొన్ని పాఠశాలల్లో ఈ బాధ్యతలు ఎంతవరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యార్థులు ఏం చేస్తున్నారు? వారి ఆలోచ నా విధానం ఎలా ఉంది? చదువుపై ఆసక్తి చూపు తున్నారా? తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉంటున్నారా? ఏవైనా వ్యక్తిగత, కుటుంబ లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నారా? అనే అంశాలను ఎప్పటికప్పుడు గమనించాల్సిన సిబ్బంది ఆ దిశగా శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యం, భోజనం, వసతి, చదువు, భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన చోట నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ముందే గుర్తిస్తే.. ఓ ప్రాణం నిలిచేది కాదా? 
మక్కువ మండలం అనసభద్ర పాఠశాలలో కొద్ది రోజుల క్రితం ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చనిపోతే దైవం వద్దకు వెళ్లిపోతానంటూ అతను గతంలో మాట్లాడినట్లు తోటి విద్యార్థులు చెప్పినట్లు సమాచారం. అంటే అతని ప్రవర్తనలో వచ్చిన మార్పులను ముందుగానే గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ, సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మానసిక స్థితిని గమనించి, ఉపాధ్యాయులు స్పందించి, అవసరమైన కౌన్సెలింగ్‌ అందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనన్న ఆవేదన బాధిత కుటుంబంలో నెలకొంది. 

తాజాగా పి.ఆమిటి పాఠశాలలోనూ ఏడో తరగ తి చదువుతున్న విద్యార్థిని మరణించడం మరోసా రి కలచి వేస్తోంది. చదువుపై ఆసక్తి లేకపోవడమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నట్లు చెబుతున్న లేఖలో పేర్కొనడం గమనార్హం. ఆ స్థాయికి విద్యారి్థని ఎందుకు వెళ్లింది? ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగానే గుర్తించే ప్రయత్నం జరిగిందా? ఉపాధ్యాయులు, వార్డెన్లు ఆమెతో మాట్లాడారా? అవసరమైన మానసిక సహాయం అందించారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఒక విద్యార్థి మరణాన్ని కేవలం చదువుపై ఆసక్తి లేకపోవడానికి ముడిపెట్టి చూడటం కంటే, దానికి దారితీసిన పరిస్థితులపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. 

పర్యవేక్షణేదీ.. బాధ్యత ఎవరిది? 
ఆశ్రమ పాఠశాలల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల స్థితిగతులను పరిశీలించాల్సిన అధికారులు ఆ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాఠశాలల్లో సిబ్బంది పనితీరు, విద్యార్థుల హాజరు, ఆరోగ్య పరిస్థితులు, భద్రత, మానసిక సమస్యల గుర్తింపు వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అవసరమైన చోట నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. ఇవేవీ సమర్థంగా అమలుకాకపోవడం వల్లే ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల మరణాలపై నిష్పక్షపాత విచారణ జరిపి, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో గుర్తించడం అధికారుల ప్రాథమి క బాధ్యత. 

అంతేకానీ బాధిత కుటుంబాల నుంచి ముందుగానే పాఠశాల సిబ్బందికి సంబంధం లేద నే రీతిలో లేఖలు తీసుకోవడం ద్వారా అసలు ప్రశ్న లకు సమాధానం లభించదు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన ఐటీడీఏ యంత్రాంగం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరో కుటుంబానికి పుత్రశోకం మిగలకుండా ఆశ్ర మ పాఠశాలల్లో భద్రత, ఆరోగ్య సంరక్షణ, మానసి క ఆరోగ్య పర్యవేక్షణను పటిష్ఠం చేయాలి. విద్యార్థు ల మరణాల తర్వాత సంతకాలు సేకరించడం కా దు.. వారు బతికున్నప్పుడే వారి బాధలను గుర్తించి అండగా నిలవడమే అధికారుల అసలైన బాధ్యత అని గిరిజన, ప్రజా సంఘాలు అంటున్నాయి.

మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులపైనే ఒత్తిడా? 
గుమ్మలక్ష్మీపురం మండలంలో గతంలో ఓ విద్యార్థి మృతి చెందిన సందర్భంలోనూ అతని తల్లిదండ్రుల నుంచి పూచీకత్తు పత్రం రాయించుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమైనప్పటికీ అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదన్న విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇదే మండలంలోని పి.ఆమిటి గిరిజన సంక్షేమ పాఠశాలలో తాజాగా విద్యార్థిని మృతి చెందిన ఘటనలోనూ ఆమె తండ్రి నుంచి సంతకం తీసుకున్నారు  పాఠశాల యాజమాన్యం, వార్డెన్, ఇతర సిబ్బంది తప్పేమీ లేదని.. విద్యార్థిని ఎవరి అనుమతీ లేకుండా పాఠశాల నుంచి వెళ్లి పోయిందని, చదువుపై ఆసక్తి లేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆ లేఖలో రాయించారు. ఈ పరిణామాలపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులెవరో తేల్చాల్సిన సమయంలో, ముందుగానే పాఠశాల సిబ్బందికి క్లీన్‌చిట్‌ ఇచ్చేలా కుటుంబ సభ్యుల నుంచి రాతపూర్వక ప్రకటనలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.   

ఇదీ చదవండి: తమిళనాట పొలిటికల్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌కు కొత్త దోస్తీ!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement