మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు అక్షితలు వేస్తున్న సీఐ బి.వెంకట్రావు, స్టేషన్ సిబ్బంది
పార్వతీపురం రూరల్: నిత్యం శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించే పోలీసుల మనసులో ఆత్మీయ కోణం ఆవిష్కృతమైంది. ప్రసూతి సెలవుపై (మెటర్నిటీ లీవ్) వెళ్తున్న ఓ మహిళా కానిస్టే బుల్‌ను తోటి సిబ్బంది తమ ఆడబిడ్డలా సీమంతం నిర్వహించి ఆప్యాయతను చాటుకున్నారు.
పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఈ వేడుకకు వేదికైంది. పట్టణ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ మంగమ్మకు ఇటీవల ఎస్పీ ప్రసూతి సెలవు మంజూరు చేశారు. సెలవుపై వెళ్తు న్న ఆమెకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకాల ని సిబ్బంది నిర్ణయించారు. ఈ మేరకు పట్టణ సీఐ బి.వెంకట్రావు ఆధ్వర్యంలో స్టేషన్ ఆవరణలోనే సీమంతం వేడుకను నిర్వహించారు.
మహిళా కానిస్టేబుల్‌కు పసుపు, కుంకుమ, గాజులు, నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బి. వెంకట్రావు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో మహిళా సిబ్బందిని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. తోటి సిబ్బంది చూపిన ఆదరణ పట్ల సదరు మహిళా కానిస్టేబుల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుక తన ఉద్యో గ జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.


