breaking news
Police Station
-
తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
అనంతపురం: తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడంతో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. తాడిపత్రి ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐపీఎస్ అధికారి అయిన ఏఎస్పీ రోహిత్ బదిలీ తర్వాత మరొక ఐపీఎస్ అధికారిని కూటమి ప్రభుత్వం ఇంకా నియమించలేదు. దీంతో ప్రస్తుతానికి తాడిపత్రి బాధ్యతలను గుంతకల్లు డీఎస్పీ చూసుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గం రౌడీ మూకలు పెట్రేగిపోతున్నా, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా తాడిపత్రి లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు చెలరేగిపోయారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద వాహనం ధ్వంసం చేశారు. బోలేరో వాహనంలో వచ్చి, పెద్దారెడ్డి కాన్వాయ్కి చెందిన ఓ వాహనం అద్దాలను జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బహిరంగంగా ఇరువర్గాల దాడులుమరోవైపు బహిరంగంగా ఇరువర్గాల మధ్య దాడుల చోటుచేసుకున్నాయి. అప్పు విషయంలో నౌషద్ - సయ్యద్ వర్గాల దాడులు జరిగాయి. కర్రలతో విచక్షణా రహితంగా దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఫోజు కొడితే తాట తీస్తా..
బెంగళూరు: భూ వివాదానికి సంబంధించి జరిగిన గొడవలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులతో దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా మీడియా ముందు ఫోజు కొడితే తాట తీస్తా.. ఈడియట్స్ అంటూ చిందులు తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. దొడ్డ తాలూకా గజ్జగదహళ్లిలో భూ వివాదం నేపథ్యంలో గొడవ జరిగింది. బాధితులు న్యాయం కోసం దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో సీఐ నవీన్ కుమార్ బెదిరించడం వివాదాస్పందగా మారింది. -
Viral Video: పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు.. తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించారు. పోలీసులకు ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు వార్నింగ్ ఇస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ నెల 20న తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరగ్గా.. పోలీసులకు టీడీపీ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.టీడీపీ నేత చిట్టి రాయల్ అనుచరుడు గిరి, చిట్టి రాయల్ తల్లి హేమలత వీరంగం సృష్టించారు. తమవాళ్లను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. తాను ఎమ్మెల్యే పులివర్తి అనుచరుడునంటూ వీరంగం సృష్టించిన గిరి.. లోకేష్‌తో చెప్పి అందరినీ సస్పెండ్ చేయిస్తానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. వీడియో తీస్తున్న ఓ పోలీసును కొట్టడానికి టీడీపీ కార్యకర్త గిరి దూసుకెళ్లాడు. చంద్రబాబుకు చెప్పిన భయపడేది లేదంటూ గిరి రెచ్చిపోయారు.ఇదీ చదవండి: కడుపు మండి.. జనసేన నేతపై గన్‌తో దాడి -
లోకేశ్‌తో చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా
సాక్షి, తిరుపతి: పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు హల్చల్ చేసిన ఘటన తిరుపతి రూరల్‌లో కలకలం రేపింది. వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన గొడవలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. వారిని విడిపించేందుకు వచ్చిన స్థానిక టీడీపీ నేతలు ఆదివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేసిన వీడియో మంగళవారం వెలుగులోకివచ్చింది. తిరుపతి రూరల్ మండలం, లింగేశ్వరనగర్ పంచాయతీ, టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అనుచరులైన చిట్టి రాయల్, అతని తల్లి హేమలత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా యువకుల మధ్య గొడవ జరగడంతో పరస్పరం బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారన్న ఫిర్యాదులపై పోలీసులు ఒక వర్గం నుంచి ఇద్దరు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ విషయం తెలుసుకున్న చిట్టి రాయల్ తన తల్లి టీడీపీ మహిళా నాయకురాలు హేమలతతో కలసి ఆదివారం అర్ధరాత్రి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై చిందులేశారు. గట్టిగట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారు. పోలీసులు తీసుకువచ్చిన యువకులను బలవంతంగా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు తీసుకువచ్చిన యువకులను బలవంతంగా బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న చిట్టిరాయల్ పోలీసుల విధుల్లో జోక్యంపై చర్చ ఒక కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న టీడీపీ నాయకులు.. సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, హెచ్చరికలు చేయడం వంటి పరిణామాలు పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీశాయి. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లోకేష్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా పోలీసులతో వాగ్వాదం సందర్భంగా చిట్టి రాయల్ మాట్లాడుతూ ‘ఖాకీ యూనిఫాం లేకుంటే ఇక్కడే సినిమా చూపించుండే వాడిని.. మా వాళ్లను ఎలా తీసుకొస్తారు ? విజయవాడకు వెళ్లి మంత్రి నారా లోకేష్‌కు చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా. మీకు ఎంత ధైర్యం ఉంటే మా వాళ్లను తీసుకొస్తారు.. మీ సంగతి తేలుస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలను ఓ పోలీసు కానిస్టేబుల్ వీడియో రికార్డు చేస్తుండగా.. అతనిపైకి చిట్టి రాయల్ దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: సాయికృష్ణ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం -
మహిళ చెప్పింది అర్థం కాక మనిషిని తీసుకురమ్మన్నాం
గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి పబ్లిసిటీ స్టంట్‌కు తెరదీశారు. నగరంపాలెంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఓ బాధితురాలి పక్షాన తానే అన్ని అయి నిలబడుతున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. ఒక మహిళ ఎంతో కష్టాల్లో వస్తే అసలు పోలీసులు పట్టించుకోవటం లేదంటూ మీడియా ఎదుట ఆరోపించారు. అయితే కేవలం గంటల వ్యవధిలోనే.. పోలీసులు అసలు బాధితురాలి ఫిర్యాదుపై నిర్లక్ష్యం చేయలేదంటూ నేరుగా ప్రకటన విడుదల చేయడం విశేషం.వివాదం ఏమంటే.. గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడుకు చెందిన షేక్ రిజ్వానాకు ఎనిమిది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సైదులతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త సైదులు మద్యం తాగి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, తనపై అనుమానంతో ఇబ్బందులు గురి చేస్తున్నాడని బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఫిర్యాదు చేసే క్రమంలో బాధితురాలు రిజ్వానా చెప్పిన మాటలు అర్థం కాని రిసెప్షన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ తనకు తెలిసిన వారిని ఎవరినైనా సమస్యను వివరించేందుకు తీసుకురావాలని సూచించింది. అయితే సదరు మహిళ పోలీసులు చెప్పిన వైనాన్ని.. అర్థం చేసుకోలేక టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి వద్దకు వెళ్లింది. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే మాధవి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో హడావుడి... ఎమ్మెల్యే గళ్లా మాధవి వద్దకు వెళ్లిన రిజ్వానను తీసుకుని తన కారులో స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ.. యాక్షన్ చేశారు. తనకు సంబంధించిన వాళ్లను ఎవరైనా తీసుకురావాలని చెప్పారని.. నియోజవర్గ ప్రజలంతా తన వారేనని.. ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదంటూ పోలీసుల దగ్గరకు వెళ్లి మీడియా ఎదుట చెప్పారు. రిజ్వాన పక్షాన తాను ఉన్నానని ఇప్పుడు ఫిర్యాదు తీసుకుంటారా అంటూ... నిలదీశారు. ఈ క్రమంలో పచ్చ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఎమ్మెల్యే ఏదో చేసేసినట్లు పూర్తిస్థాయిలో పబ్లిసిటీ ఇచ్చారు. అయితే గంటల వ్యవధిలోనే మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. మహిళ చెప్పింది అర్థం కాక మనిషిని తీసుకురమ్మన్నాం రిజ్వానా తన భర్త వేధింపులకు గురి చేస్తున్న అంశంపై ఆమె చెప్పిన విధానం అర్థం కాక వేరే మనిషిని తీసుకురావాలని పోలీసులు సూచించినట్లు ప్రకటన విడుదల చేశారు. బాధితురాలు సమస్యను స్పష్టంగా వివరించలేని పక్షంలో, ఆమె తడపడంతో తెలిసిన వ్యక్తిని తీసుకురావాలని సూచించినట్లు పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాధవి వచ్చిన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు స్వీకరించలేదని, కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు అవాస్తవమని తేల్చారు. ఇదీ చదవండి: బాబు కరువు.. ఊర్లకు ఊర్లు ఖాళీ -
విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ వద్ద కలకలం
విజయవాడ పటమట పోలీసు స్టేషన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పురుగుల మందు తాగి వాసు, గీత దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వల్లే ఆత్మహత్యాయత్నం చేశామని దంపతులు పేర్కొనడం సంచలనం కలిగించింది. ఆర్పీ ఠాకూర్‌తో పాటు పృథ్వీరాజు అనే వ్యక్తి కూడా తమను వేధింపులకు గురి చేశారని వాసు దంపతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ ఎదుట వాసు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కొని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 2025లో బంగారు ఆభరణాల మోసం కేసులో పోలీసులు వాసు ,గీత దంపతులపై కేసు నమోదు చేశారు.మాపై అక్రమ కేసులు: సురేంద్రగీత తండ్రి సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వల్లే నా కూతురు, అల్లుడు చావుబతుకుల మధ్య ఉన్నారు. అక్రమ కేసులు పెట్టీ ఇద్దరిని వేధిస్తున్నారు. 42 రోజులు జైల్లో పెట్టీ నా కూతురు అల్లుడును వేధించారు. రెండెకరాల పొలం రాయించుకొని బెదిరిస్తున్నారు. ఇప్పుడు బంగారం ఇవ్వాలని ఏసీపీ దామోదర్ బెదిరించాడు. మేము బతకడం కంటే చావడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా దగ్గర ఏమి లేవు ఉన్నవి మొత్తం లాక్కున్నారు ఫ్లాట్ కూడా బలవంతంగా రాయించుకున్నారు. వ్యాపారం కోసం డబ్బులు తీసుకుంటే అధిక వడ్డీలు వసూలు చేశారు. ఈ అంశంతో సంబంధం లేకపోయినా గుంటూరులో కేసు పెట్టించి అరెస్టు చేశారు. ఆస్తుల కోసమే మమ్మల్ని టార్గెట్ చేశారు.’’అని వాపోయాడు.ఇదీ చదవండి: తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదు: ఈడీ -
పోలీస్ స్టేషన్లో దాడి యత్నంపై సమగ్ర దర్యాప్తు చేయాలి..
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై కొందరు ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించినట్లు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.పండగ రోజున సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో దాదాపు 15 మంది ముసుగులు ధరించి ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే, అక్కడున్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.దీంతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్‌లోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర విషయమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే, ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లోకి ఎలా వచ్చారు? వారెవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.ఘటనకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. అలాగే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పూర్తి ఫుటేజ్‌ను ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి అసలు ఏం జరిగిందో తేల్చాలని అన్నారు.హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ జరిపి, దాడికి యత్నించిన వ్యక్తులను గుర్తించాలని అన్నారు. ఘటన వెనుక ఉన్న వారిని కూడా గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు -
ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హనీ ట్రాప్ చేసిన లావణ్య!
వరంగల్ క్రైం : ‘వై 99’ యాప్‌లో మహిళగా పరిచయం చేసుకుని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హనీ ట్రాప్ చేసి రూ.14.75 లక్షలు మోసం చేసిన నిందితుడిని వరంగల్ సైబర్ క్రైం పోలీసులు తమిళనాడులోని సేలం జిల్లాలో అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైన సీఆర్ నెం.21/2026 కేసులో వరంగల్‌కు చెందిన తుమ్మ ఉదయ్ కిరణ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు ‘వై 99’ వెబ్సైట్లో ‘లావణ్య’ పేరుతో మహిళగా నటిస్తూ బాధితుడితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సన్నిహితంగా మెలుగుతూ నమ్మకం పొందిన నిందితుడు అత్యవసర అవసరాల నిమిత్తం పలుమార్లు డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు వెల్లడైంది. వివిధ బ్యాంకు ఖాతాలు,యూపీఐ లావాదేవీల ద్వారా బాధితుడి నుంచి మొత్తం రూ.14,75,100 మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో సాంకేతిక, ఆర్థిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన ప్రత్యేక బృందం సేలం జిల్లాలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆదేశాల మేరకు, వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగింది. సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బి. శివకృష్ణ, దినేశ్, భరత్, జహూర్ మొహమ్మద్.. నిందితుడి అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించారు.ఆన్లైన్ పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలిఆన్లైన్లో పరిచయమైన వారు డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. చదవండి: మినిమం చార్జీ రూ.30 -
ఇల్లు శుభ్రంగా లేదని మహిళ ఆత్మహత్య!
హైదరాబాద్: బెంగళూరు నుంచి వచ్చేసరికి ఇల్లంతా అపరిశుభ్రంగా ఉందన్న మనస్థాపంతో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన దాట్ల చంద్రావతి (38) తన భర్త, పిల్లలతో కలిసి షేక్‌పేట సమీపంలోని సక్కుబాయి నగర్లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన చంద్రావతి సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి రాగానే ఎక్కడ చెత్త అక్కడే ఉండడం, ఇల్లంతా అపరిశుభ్ర వాతావరణంలో దుర్వాసనలు వస్తుండటాన్ని చూసి ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. భర్త, పిల్లలు ఇంట్లోనే ఉండగానే తన గదిలోకి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. చదవండి: ఆడ మనిషికి హౌస్ కీపింగ్ పనులు ఎందుకు! -
బిహార్ ప్రభుత్వ గర్వం అణుస్తా
బిహార్ చిచ్చరపిడుగు ఆదిత్యకుమార్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షార్థుల ఆందోళనలో భాగమై నెట్లో వైరల్ అయిన ఈ ఆరేళ్ల కుర్రాడు తల్లిదండ్రులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్టేషన్ ముందు ధర్నా కొనసాగిస్తున్నాడు. బైఠాయింపు మొదలైంది ఆదివారమైనప్పటికీ సోమవారం ఆదిత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ‘పిట్ట కొంచెం.. కూతఘనం’’అన్న సామెతను గుర్తు చేశాయి. ‘‘కొండను తవ్వి రహదారిని నిర్మించిన దశరథ్‌రామ్ మాంఝీ మాదిరిగా ఈ ప్రభుత్వపు గర్వం అణచివేస్తా’’అని ఆదిత్యకుమార్ ప్రకటించాడు. ఆగస్టు 25న బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షార్థులు తమ ఆందోళనలో భాగంగా ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని ఇంటివద్దే ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో ఆదిత్యకుమార్ కూడా పాల్గొన్నాడు. ఇతడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించి ‘‘వీడితో జాగ్రత్త’’అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తనను కస్టడీలోకి తీసుకున్న సమయంలో పోలీసులు తల్లిదండ్రులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కొట్టారని ఆదిత్యకుమార్ ఆరోపిస్తున్నాడు. పోలీసులు మాత్రం కుర్రాడిని తల్లికి అప్పగించామని, అతడి భద్రతను దృష్టిలో ఉంచుకునే పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టామని చెబుతున్నారు. కానీ పోలీసుల వ్యాఖ్యలను ఆదిత్య అస్సలు నమ్మడం లేదు.. ‘‘తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. ఈ డిమాండ్ తీరే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదు’’అని భీషి్మంచుకున్నాడు. ‘‘నా మాదిరే పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న తల్లిదండ్రులకూ భరోసా ఇస్తున్నా. దశరథ్‌రామ్ మాంఝీ ఎలాగైతే కొండను తవ్వి రోడ్డు నిర్మించాడో నేను కూడా ఈ ప్రభుత్వపు గర్వాన్ని అణచివేస్తా’’అని మీడియా ప్రతినిధుల ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఒక చేతిలో రాజ్యాంగ ప్రతితో ఆదిత్య మాట్లాడుతూ... ‘‘విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్నారన్న కారణంగా ఎవరి తల్లిదండ్రులనైనా కొట్టవచ్చునని ఇందులో ఎక్కడ రాసుందో ఎవరైనా చూపించగలరా?’’అని ప్రశ్నించాడు. ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవాలని, లేదంటే బీద పిల్లాడిని కలవడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో పోస్టు అయినా చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఈ బుడతడు. ప్రధాని నరేంద్ర మోదీ ఓట్ల కోసం రోడ్ షోలూ చేస్తారు. అలాంటప్పుడు ఒక పిల్లాడిని ఎందుకు కలవకూడదు? అని నిలదీశాడు. తన తల్లిదండ్రులను కొట్టిన విషయంలో జోక్యం చేసుకోవాలని ఆదిత్యకుమార్ ఆదివారం కూడా ప్రధాని నరేంద్రమోదీని అభ్యరి్థంచాడు. దీనికి ఒక రోజు ముందే పోలీసుల దౌర్జన్యంపై న్యాయవిచారణ కోరుతూ బీహార్ డీజీపీకి వినతి పత్రం సమరి్పంచానని ఆదిత్య చెప్పడం కొసమెరుపు! –పట్నా -
పేదవాడే.. కానీ నిజాయితీలో కోటీశ్వరుడు!
పోలీస్ స్టేషన్ ముందో టేక్సీ ఆగింది. ఆ సమయంలో ఓ ఫిర్యాదుదారుడు ఎస్.ఐ. బల్లమీది ఐ.పి.సి. కోడ్ పుస్తకంలో ఓ కవర్ని ఉంచి కోరాడు.‘‘సర్. ఎలాగైనా మీరు నాకు న్యాయం చెయ్యాలి సర్.’’‘‘తప్పకుండా. ఫికర్ పడకు.’’ ఎస్.ఐ. చెప్పాడు.ఆ ఎస్.ఐ.కి ఉద్యోగంలో చేరాక వచ్చిన మొదటి కవర్ కాదు అది. అప్పటికే ఆ పుస్తకంలో అలాంటి వందల కవర్లు ఉంచబడ్డాయి. అవి ఉంచబడ్డప్పుడల్లా కొన్ని సందర్భాల్లో న్యాయాన్ని గెలిపించాడు. చాలా సందర్భాల్లో అన్యాయాన్ని గెలిపించాడు.ఏ.సి.బి. భయంతో ఎస్.ఐ. డబ్బుని తన చేత్తో ముట్టడు. దాని మీద వారు రాసే రహస్య ఇంక్ తన చేతికి అంటుకోవడం తను లంచం తీసుకున్న సాక్ష్యం అవుతుందని అతనికి తెలుసు. ఇంటికి ఆ పుస్తకంతో వెళ్ళాక తన ఆరేళ్ళ కొడుకు చేత దాంట్లోని డబ్బు బయటకి తీయిస్తాడు. అలా ఆ రోజు ఆ పుస్తకంలో రెండు కవర్లు చేరాయి.అతని పక్కనే బల్లలముందు కూర్చున్న మరో ఇద్దరు ఎస్.ఐ.లు కూడా జరిగేది చూసారు. కాని జోక్యం చేసుకోరు. వారికీ కవర్లు అందుతూంటాయి. సగటున వారి నెల సంపాదన వారి జీతానికి చాలా రెట్లు ఉంటుంది. కేస్ తీవ్రతని బట్టి ఒకోసారి వందరెట్లు కూడా ఉంటుంది. ఆ టేక్సీ డ్రైవర్ ఏర్బేగ్తో స్టేషన్లోకి నడిచాడు. ఆ గదిలోకి చేతిలో ఏర్బేగ్తో బిత్తరచూపులు చూస్తూ వచ్చిన ఏభై పైబడ్డ డ్రైవర్ ఆ గదిలోని అందరి వంకా చూశాడు. కవర్ ఇచ్చిన అతను తన పక్క నించి వెళ్ళాక ఆ ఎస్.ఐ. బల్ల దగ్గరికి నడిచాడు. తెల్ల జుట్టు. సన్నగా లోతుకు పోయిన బుగ్గలతో ఉన్న అతను ఆట్టే చదువుకున్నవాడిలా కనిపించడం లేదు. ఎస్.ఐ. అతన్ని కూర్చోమని చెప్పలేదు. అసలు అతని వంకే చూడలేదు. కొద్దిసేపు తన మొబైల్‌ని చూసుకున్నాక తలెత్తి అతన్ని, అతని చేతిలోని ఏర్బేగ్ని చూసి అడిగాడు.‘‘ఏమిటి?’’ అతని స్వరంలో అలవాటైన గద్దింపు ఉంది.డ్రైవర్ మౌనంగా ఆ ఏర్బేగ్ని బల్ల మీద ఉంచి, దాని జిప్ తెరిచి అందులోని నోట్లకట్టలు, ఓ నగల పెట్టె బల్ల మీద కుమ్మరించాడు.‘‘ఏమిటిది?’’ ఎస్.ఐ. ఆశ్చర్యంగా అడిగాడు.‘‘నేను ఊబర్ టేక్సీ డ్రైవర్ని సర్. ఇందాకే ఓ పేసెంజర్ని ఏర్పోర్ట్లో దింపాను. అతను వెళ్ళాక తుడుద్దామని చూస్తే వెనక సీట్లో ఇది కనిపించింది. వెంటనే పార్క్ చేసి అతనికి ఇవ్వడానికి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు నన్ను లోపలకి వెళ్ళనివ్వలేదు. ఏం చేయాలో తెలీక మీ దగ్గరకి వచ్చాను.’’ అతనిలోని నిజాయితీకి ఎస్.ఐ. కొద్దిసేపు అవాక్కయ్యాడు. అతని హిందీని బట్టి బీహారీ అని ఎస్.ఐ.కి అనిపించింది.తర్వాత నోట్లని లెక్క కట్టి ఓ కాగితం మీద రాశాడు. నగదు, బంగారం విలువ కలిసి ఎనిమిది లక్షలు దాకా ఉండచ్చని అంచనా వేశాడు. అందులోని శుభలేఖలని చూసి పెళ్ళికి వెళ్తున్నాడని ఎస్.ఐ. ఊహించాడు. దాన్ని స్వంతం చేసుకోవాలనే ఆలోచన తక్షణం కలిగింది.‘‘నువ్వు ఎందుకు తెచ్చిస్తున్నావు? మొత్తం ఇదేనా? లేక కొంత కాజేశావా?’’ గద్దించాడు.‘‘నేను బీదవాడినే. కాని నిజాయితీపరుడ్ని సర్. కాజేసే బుద్ధే ఉంటే అసలు దీంతో ఇక్కడికి రాకపోదును కదా సర్? మాది బీహార్‌లోని పహార్గంజ్. మూడేళ్ళ క్రితం బేంక్‌లో ఎనిమిది లక్షలు అప్పు చేసి టేక్సీని కొన్నాను. నాకు ముగ్గురు అమ్మాయిలు. సిటీలో కాపురం ఖర్చుతో కూడింది కాబట్టి అప్పు తీరాక వాళ్ళని తీసుకురావాలని అనుకున్నాను. నిజం చెప్పాలంటే, దీన్ని స్వంతం చేసుకుని బేంక్ అప్పు తీరిస్తే, కాపురం పెట్టచ్చనే ఆలోచన మొదట్లో వచ్చింది సార్. అరగంట మీమాంసలో పడ్డాను. కాని నాలోని రావణాసురుడ్ని రాముడు చంపేశాడు సార్. దాంతో తెచ్చి మీకు ఇస్తున్నాను.’’ఎస్.ఐ.తో పాటు మిగిలిన సిబ్బంది కూడా అతని మాటలని వింటూ ఆసక్తిగా చూశారు. అతని పేరు, టేక్సీ నంబర్, డ్రైవింగ్ లైసె¯Œ ్స వివరాలు, అడ్రస్ రాసుకున్నాక ఆ వ్యక్తి ఎస్.ఐ.ని అడిగాడు.‘‘ఇంక నేను వెళ్ళచ్చా సార్?’’ఎస్.ఐ. సరే అన్నట్లుగా తల ఊపాడు. వెళ్ళబోయే ముందు అతను చెప్పాడు.‘‘నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది సార్. నెత్తి మీంచి వంద కిలోల బండ దింపినట్లుగా ఉంది.’’∙∙ ఆ సంఘటన నాలుగు పరిణామాలకి దారి తీసింది. మొదటిది, ఎస్.ఐ. ఆ బండని మోయదలచుకోలేదు. వెంటనే ఏర్పోర్ట్లోని పోలీసులకి తనకి టేక్సీ డ్రైవర్ తెచ్చిచ్చిన ఓ ప్రయాణికుడి ఏర్ బేగ్ వర్ణనని, అందులో ఉన్న వాటి వివరాలని అందచేశాడు.రెండోది ఆ రెండు కవర్లు ఇచ్చిన వారికి ఎస్.ఐ. ఫోన్ చేసి పిలిపించి, వాటిని వెనక్కి ఇచ్చేసి తన అశక్తతని తెలియచేశాడు.మూడోది ఇంకాస్త పెద్దది. ఎస్.ఐ. ఓ పోలీస్ రిపోర్టర్‌కి ఫోన్ చేసి ఆ డ్రైవర్ మంచితనం గురించి తెలియచేశాడు. అతన్ని ఆ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసి ఆ సొమ్ముతో సహా అతని ఫొటో తీసుకున్నాడు. అది పేపర్లలోకి ఎక్కాక దాన్ని చదివిన ఓ ఎఫ్.ఎం. రేడియో జాకీ ఆ డ్రైవర్ని ఇంటర్వ్యూ చేసి, అతని బేంక్ ఎకౌంట్ వివరాలు శ్రోతలకి తెలియజేశాడు. నాలుగోది, ఆ సంఘటన జరిగిన ముప్ఫై ఆరు గంటల్లో ఆ డ్రైవర్ బేంక్ ఎకౌంట్లో పబ్లిక్ నుంచి 1,92,173 రూపాయలు జమయ్యాయి.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు రాహుల్ గాంధీ
-
మోసాలు.. అనుమానాస్పద మరణాలు.. రాజకీయ వివాదాలు..! సత్యనారాయణపురం PSపై ఆరోపణలెన్నో
-
ఠాణాలో హల్చల్: టాయిలెట్ క్లీనర్ తాగిన నిందితుడు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నౌబస్తా పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కలకలం చెలరేగింది. మహిళను వేధించిన ఆరోపణలపై విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించిన ఆశీశ్ ద్వివేది అనే యువకుడు అక్కడి బాత్రూమ్లోకి వెళ్లి, టాయిలెట్ క్లీనర్ తాగాడు. నౌబస్తా ప్రాంతానికి చెందిన ఓ మహిళ మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశీశ్ ద్వివేదిని విచారిస్తున్నారు. సర్సౌల్ పరిధిలోని మహోలీ గ్రామానికి చెందిన ఆశీశ్ వేర్వేరు నంబర్ల నుంచి సదరు మహిళకు ఫోన్ చేసి వేధిస్తున్నాడని, నిలదీస్తే చంపేస్తామని బెదిరించాడని ఫిర్యాదులో ఆమె మామ పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కోసం ఆశీశ్ను పోలీసులు స్టేషన్‌కు రావాలని ఆదేశించారు.మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆశీశ్ తన స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడికి రాగానే పోలీసులతో వాగ్వాదానికి దిగి, దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం గోడకు తల బాదుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మూత్రవిసర్జనకని చెప్పి బాత్రూమ్కు వెళ్లాడు.అక్కడ ఉన్న టాయిలెట్ క్లీనర్ వెంటనే తాగేశాడు. అయితే అతడు తాగకముందే అడ్డుకుని లాక్కున్నామని పోలీసులు అంటున్నారు. అస్వస్థతకు గురైన అతడిని తొలుత కాన్షీరామ్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హాలెట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నైట్ ఆఫీసర్ (ఎస్ఐ) వికాస్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ అరవింద్‌లను డీసీపీ (సౌత్) దీపేంద్ర నాథ్ చౌదరి సస్పెండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం తెచ్చిన విద్యా సంక్షోభం -
పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం
బంటుమిల్లి: కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం కనకరాజు అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తన బొలెరో వాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం యువకుడిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 16న బంటుమిల్లి ఎస్ఐ ఎం.నాగరాజు వాహనాల తనిఖీ చేస్తున్నారు. కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయతీ శివారు దోమలగొంది గ్రామానికి చెందిన తిరుమలశెట్టి కనకరాజు బొలెరో వాహనంలో వస్తుండగా పోలీసులు ఆపారు. కనకరాజు డ్రస్సు కోడ్ పాటించలేదంటూ ఎస్ఐ కేసు రాశారు. దీనిపై వాదనకు దిగగా, యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష అనంతరం కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మరుసటి రోజు ఎవరినైనా జామీను తెచ్చుకుని వాహనం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టేషన్‌కు వచ్చిన కనకరాజు తన వాహనాన్ని విడుదల చేయాలని కోరాడు. పోలీసులు కుదరదని చెప్పడంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలతో కనకరాజు స్టేషన్లోకి పరిగెత్తాడు. ఎస్ఐ బాధితుడి చొక్కా లాగేసి, మంటలు ఆర్పేశారు. 108 వాహనంలో చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
మదనపల్లె టౌన్ : తాము ఇద్దరము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. దగ్గరి బంధువులు అయినప్పటికీ, తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నాం. తాము పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేక ఆరు నెలల కూడా తిరగకనే హత మారుస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నట్లు ఓ ప్రేమ జంట బుధవారం మదనపల్లె జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీని రక్షణ కొరింది. వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పీటీఎం మండలం, కాట్నగల్లు కు చెందిన వెంకటరమణ కుమార్తె పి ఐశ్వర్య (19) అదే ఊరికి చెందిన మురళిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని తమ తల్లిదండ్రులు వెంకటరమణ, విజయమ్మ, సంధ్యలు తాము ఎక్కడికి వెళ్లి వస్తున్నా వెంటాడుతూ చంపడానికి ప్రయత్నిస్తున్నారు కన్నీటిపర్వంతమయ్యారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించి న్యాయం కోసం అభ్యర్థించారు. జిల్లా ఎస్పీ స్పందించి పేటీఎం పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అప్పటికే పీటీఎంలో పంచాయతీలు కూడా జరిగాయని, పోలీసుల ను కూడా తమ పెద్దలు ఎదురిస్తున్నారని, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. -
పెళ్లైన 24 గంటల్లోనే భార్యను బేరం పెట్టిన భర్త..!
ఏలూరు జిల్లా: ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లిన యువకుడిపై యువతి తల్లిదండ్రులు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొల్లపల్లికి చెందిన యువతి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని తన మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ, మూడు రోజుల క్రితం వివాహం చేసుకుని బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, యువతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, తమ అమ్మాయిని తమ దగ్గరకు పంపించాలంటే ఆమె భర్త రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నాడంటూ సోమవారం నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానీ యువకుడిని పెళ్లి చేసుకున్న యువతినుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో.. యువతి తల్లిదండ్రులు పెట్టిన ఆరోపణలు ఎంత వరకు నిజం ఉందేనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కంటిరెప్పే కాటేసింది!
సనత్‌నగర్ (హైదరాబాద్): సొంత కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రిపై సనత్‌నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న భార్యాభర్తలకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి (45) హౌస్ కీపింగ్ పనులు చేస్తుండేవాడు. మద్యం తాగే అలవాటున్న తండ్రి రోజూ ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో ఘర్షణ పడుతుండేవాడు.ఈ క్రమంలో తన రెండో కుమార్తెపై కన్నేసిన నిందితుడు.. భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు పరువు పోతుందనే భయంతో నోరు విప్పలేదు. ఇటీవల రోజూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య, పిల్లలపై దాడి చేయడం, దుర్భాషలాడుతుండడాన్ని భరించలేని రెండో కుమార్తె (16) గురువారం సాయంత్రం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి తనపై చేసిన అకృత్యాలను బయటపెట్టింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. -
దళితులపై దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. దళితులపై దాడులుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పీఎస్ ఎదుట భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ నేతలు బైఠాయించారు. అవిలాల మాజీ సర్పంచ్‌పై దాడి చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీకి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి.తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూములను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేందుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణతో పాటు దళితవాడ వాసులు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు.అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్ ఫొటోతో కూడిన బ్యానర్‌ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరుకుని దళితులపై రెచ్చిపోయారు. బూతు పంచాంగం లంకించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణ భయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు.టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ, కౌసల్య, విజయ నిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. -
ఆగ్రహంతో పోలీసుస్టేషన్‌పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం
సంగారెడ్డి, సాక్షి: సంగారెడ్డి వట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ రోజు (శనివారం) తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు రాకుండానే మృతదేహాన్ని తరలించారనే కోపంతో మృతుడు బంధువులు ఏకంగా పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేశారు. స్టేషన్‌లోని ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వివరాల్లోకి వెళితే.. నిన్న శుక్రవారం బీరప్ప అనే యువకుడు ఇతరాత్రా కారణాలతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబసభ్యులకు రాకముందే అతని మృతదేహాన్ని కిందకి దించి ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆగ్రహం చెందిన బంధువులు పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేశారు. -
పెళ్లి చేసుకుంటానని ప్రేమించి మోసం
కడప అర్బన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు ప్రేమించాడు.. ఇప్పుడు నిరాకరించడంతో యువతి అతని ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ ఘటన కడప నగరంలోని రామకృష్ణ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత యువతి అనూష కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదేళ్లుగా తాను, విజయ్ పరస్పరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగాడని ఆమె తెలిపింది. ఇప్పుడు పెళ్లి విషయాన్ని ప్రస్తావించగానే విజయ్ ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని ఆరోపించింది. అతనికి వారి తల్లిదండ్రులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినప్పటికీ తనను ప్రేమించిన యువకుడు విజయ్ వైఖరిలో మార్పు రాలేదని వాపోయింది. దీంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేరుగా ప్రియుడి ఇంటి ముందు కూర్చొని నిరసన చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్స్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతితో మాట్లాడారు. సమస్యపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ ఘటనపై రిమ్స్ పోలీస్ స్టేషన్ సీఐ రాజగోపాల్‌ను వివరణ కోరగా.. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బాధిత యువతి పోలీస్‌స్టేషన్‌కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
హిట్లర్ జన్మస్థలం.. ఇక నాజీ అడ్డా కాదు!
ఆస్ట్రియాలోని ఓ భవనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాజీ నియంతగా పేరున్న అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన చోటు అది. అయితే ఇప్పుడది సరికొత్త రూపాన్ని సంతరించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిట్లర్ పేరిట ఆ భవనం మళ్లీ తీవ్రవాదులకు ఆకర్షణగా మారకుండా.. ఆస్ట్రియా ప్రభుత్వం వేసిన ప్లాన్ చర్చనీయాంశంగా మారింది. ఆ విషయంలోకి వెళ్తే..ఆస్ట్రియాలోని బ్రౌనౌ ఆమ్ ఇన్ పట్టణంలోని 15 సాల్జ్బర్గర్ ఫోర్స్టాడ్ట్ ప్రాంతంలో ఉన్న ఈ భవనం 17వ శతాబ్దంలో నిర్మించిన ఓ హోటల్. 1889 ఏప్రిల్‌లో అడాల్ఫ్ హిట్లర్ ఇక్కడే జన్మించాడు. అయితే అక్కడ ఎక్కువ కాలం నివసించలేదు. పుట్టిన కొన్ని వారాలకే అతడి కుటుంబం ఆ ఇంటిని విడిచిపెట్టింది. మూడేళ్ల వయసులోనే హిట్లర్ కుటుంబం ఆ పట్టణాన్ని పూర్తిగా వదిలి వెళ్లిపోయింది. 1938లో ఆస్ట్రియాను నాజీ జర్మనీలో విలీనం చేసే సమయంలో మాత్రమే హిట్లర్ ఈ ప్రాంతానికి తిరిగి వచ్చాడు.అతివాదులకు ‘తీర్థస్థలం’ కాకుండా..హిట్లర్ జన్మించిన ప్రదేశం కావడంతో.. ఈ భవనం భవిష్యత్తులో నాజీ అనుకూల వర్గాలకు(అతివాదులకు) ఆకర్షణ కేంద్రంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం దశాబ్దాల పాటు ఆ భవనాన్ని అద్దెకు తీసుకుంది. 2011 వరకు ఈ భవనంలో వికలాంగుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఉండేది. అయితే యజమాని మరమ్మతులకు అనుమతించకపోవడం, భవనాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు నిరాకరించడంతో అది కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయింది.ప్రభుత్వం స్వాధీనం.. కోర్టు పోరాటం2016లో ఆస్ట్రియా పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం ఆ భవనాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా యజమానికి 8.12 లక్షల యూరోలు (సుమారు 9.5 లక్షల డాలర్లు) పరిహారంగా చెల్లించారు. అయితే పరిహారం తక్కువగా ఉందంటూ యజమాని కోర్టును ఆశ్రయించినా.. ఆ ప్రయత్నం ఫలించలేదు.కూల్చివేత ఆలోచనకు బ్రేక్..మొదట ఈ భవనాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించారు. అయితే చరిత్ర నిపుణులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాజీ గతాన్ని చెరిపివేయడం కంటే.. దాన్ని గుర్తుంచుకుని సరైన సందేశం ఇవ్వడం ముఖ్యమని సూచించారు. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2019లో ఈ భవనాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చాలని ప్రకటించింది.మారిపోయిన రూపం.. కొత్త సందేశంయూరప్ స్థాయి ఆర్కిటెక్చర్ పోటీ నిర్వహించి భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. పాత రూపం కనిపించకుండా ముఖభాగాన్ని కూడా మార్చేశారు. ఆధునిక కార్యాలయంలా కనిపించేలా తీర్చిదిద్దారు. ఈ మార్పు కోసం కోట్ల యూరోలు ఖర్చు చేశారు. ప్రస్తుతం పోలీసు సిబ్బంది అక్కడ విధులు ప్రారంభించారు.తీవ్రవాదానికి అడ్డుకట్టగా..హిట్లర్ పుట్టిన ప్రదేశం ఇకపై నాజీ అభిమానులకు స్ఫూర్తి కేంద్రంగా కాకుండా.. చట్టాన్ని కాపాడే పోలీస్ స్టేషన్‌గా ఉండాలన్నది ఆస్ట్రియా ప్రభుత్వ ఉద్దేశం. చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని దాచిపెట్టకుండా.. దానికి భిన్నమైన అర్థాన్ని ఇవ్వాలన్న ప్రయత్నంగా ఈ మార్పును పలువురు చూస్తున్నారు. హిట్లర్ జన్మించిన ఇల్లు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాపలా కాస్తుండటం చరిత్రలో ఓ ఆసక్తికర పరిణామంగా మారింది. -
నాలుగు రోజులకోసారి దావత్ ఇవ్వాల్సిందే..!
వరంగల్ క్రైం: హనుమకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ పెత్తనం హద్దులు దాటిపోయింది. బీటెక్, ఎంబీఏలు చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువ సిబ్బందిని నిత్యం మాటలతో నరకం చూపిస్తున్న ఆ ఏఎస్ఐ హంగామాను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన సదరు అధికారి తాను చెప్పిందే వేదం, లేదంటే డ్యూటీలు మారుస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సిబ్బందిని ఏంట్రా.. ఏందే అని పిలుస్తారని చెబుతున్నారు. మహిళా సిబ్బంది ‘ఇదేంటి సార్.. ఇలా మాట్లాడుతారు’ అని ప్రశ్నిస్తే.. ‘ఎంటి బిడ్డ.. నీ తండ్రిలాంటి వాడిని’ అని వెంటనే మాట మారుస్తారని అంటున్నారు. అధికారులకు కాసులు.. సిబ్బందికి చీవాట్లుఈ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఎంక్వయిరీ ఈయనకే రాస్తారు. ఫిర్యాదుదారులను నయానో భయానో బెదిరించి పెద్ద మొత్తంలో వసూలు చేసి అధికారులకు కాసులు కురిపిస్తాడని, అందుకే ఇతర అధికారులు ఎంత మంది ఉన్నా ఈయనకే పిటిషన్లు అప్పజెప్పుతారన్న ఆరోపణలున్నాయి. కొందరు కానిస్టేబుళ్లు ఆయనకు నాలుగు ఐదు రోజులకోసారి దావత్ ఇవ్వాలి.. లేదంటే మాటలయుద్ధం మొదలు పెడతాడని తెలుస్తోంది. ఇక.. స్టేషన్‌కు వచ్చే పిటిషన్లపై ఆరా తీస్తూ తనకు సంబంధం లేకున్నా అందరికి ఫోన్లు చేసి కలవాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదుదారులపై తన నోటి ప్రతాపం చూపిస్తాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో సమయంలో ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే ఫిర్యాదుదారులు రావటానికి జంకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవైపు స్టేషన్, మరోవైపు తన పై అధికారుల పనులు చక్కబెట్టడంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు తయారైంది. స్టేషన్ అధికారుల పేరు చెప్పి కేసులను తనకు అనుకూలంగా సెటిల్ చేయడంలో సిద్ధహస్తుడనే పేరుంది. నిత్యం తన నోటి దురుసుతో వ్యవహరిస్తున్న ఆ అధికారి పెత్తనానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు, సిబ్బంది కోరుతున్నారు. -
కవాడిగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం
హైదరాబాద్: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇన్స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన మేరకు.. చత్తీస్ఘడ్క చెందిన టోటారాం కుటుంబం ఫరీద్ బస్తీలో నివాసముంటోంది. వీరికి ఇద్దరు కూతుళ్లు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14). ఇద్దరూ ఇంటివద్దే ఉంటున్నారు.ఇంటిపక్కనే ఉన్న బంధువు రోహిణి కూతురు లత (14)తో కలిసి ముగ్గురూ శనివారం హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కొ వెళ్లి పోయారు. తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. రైలులో వెళ్లారా.. లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు, స్థానికులు, సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.గోల్కొండ జోన్ అడిషనల్ కమిషనర్ కృష్ణ గౌడ్, కుల్సుంపురా ఏసీపీ తిరుపతి వివరాల ప్రకారం.. జియాగూడ డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్న అబ్బుల్ అజీజ్ (55) రెడ్‌హిల్స్‌లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద చాయ్ అమ్ముతుంటాడు. భార్య, పిల్లలు వదిలేయడంతో తల్లి గౌసియా బీ వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు.గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ అంతస్తులో మైనర్ (9) ఒక్కతే ఉన్నది గమనించి అసభ్యంగా ప్రవర్తించాడు. అదే అంతస్తులోకి వచ్చిన మరో వ్యక్తి అజీజ్‌ను చూసి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.సీసీ కెమెరాల్లో పరిశీలించి బయటకు వెళ్లిన అబ్బుల్ అజీజ్ సాయంత్రం 6 గంటలకు తిరిగి రావడంతో అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: ఫిర్యాదు చేస్తే ఫీజు.. బెయిల్ కావాలంటే బేరం?
సాక్షి, హైదరాబాద్: ‘శాంతిభద్రతల పరిరక్షణ.. ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ’ ఇదీ పోలీసు శాఖ నినాదం. కానీ.. ఇటీవల గ్రేటర్‌లోని కొన్ని పోలీసు స్టేషన్లలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ నినాదం కాస్త ‘డబ్బులు ఇస్తేనే రక్షణ.. లేకుండా వేధింపుల శిక్షణ’ అన్నట్లుగా మారుతోంది. ఇటీవల షాబాద్ జరిగిన తంతు ప్రస్తుతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని పలు స్టేషన్లలో బాధితుల నుంచే పోలీసులు లంచాలు డిమాండ్ చేయడం, ఏకంగా ఠాణా ఆవరణలోనే చేతులు మారడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. చేయి తడిపితేనే.. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి వేగవంతమైన దర్యాప్తు, చార్జ్‌షిట్ దాఖలు, స్టేషన్ బెయిల్ వరకూ ప్రతి దానికీ వసూళ్లే. భూ వివాదాలు, భార్యభార్తల గొడవలు, అద్దె ఇళ్ల వివాదాలను కొందరు పోలీసులు తమకు కాసుల కురిపించే కామధేనువులుగా మార్చుకుంటున్నారు. బాధితుడు ఇచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలన్నా వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నా లేదా కేసు తీవ్రతను తగ్గించాలన్నా రూ.లక్షల్లో డీల్ మాట్లాడుకుంటున్నారు. నేరుగా అధికారులు దొరికిపోకుండా ఉండేందుకు స్టేషన్‌లోని రైటర్లు, కానిస్టేబుళ్లను లేదా బయటి వ్యక్తులను మధ్యవర్తులుగా వాడుకుంటున్న ఉదంతాలెన్నో బయటపడుతున్నాయి. రాజకీయ అండదండలతో.. షాబాద్ ఠాణాలో ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ నుంచి లంచం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇచి్చన నేపథ్యంలో ఎస్ఐ, సీఐలను కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్లో ఈ తరహా స్టేషన్లు అనేకం. ఠాణా ఆవరణలోనే బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారులు చాలా మందే ఉన్నారు. హద్దు మీరుతున్న ఈ ఖాకీల వెనక ‘ఖద్దరు’ అండదండలు దండిగా ఉంటున్నాయి. ఎల్బీనగర్ జోన్‌లోని ఓ డివిజన్ అధికారికి నిజామాబాద్ మాజీ ఎంపీ అండదండలు దండిగా ఉండటంతో అతను ఆడిందే ఆటగా మారింది. పలు కేసులలో ‘హద్దు’ మీరి ప్రవర్తించారనే ఆరోపణలతో ఎస్బీ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని గుర్తించి రాష్ట్ర పోలీసు బాస్కే రెండుసార్లు నివేదికలు అందజేసినా.. చర్యలు తీసుకోలేదంటే అతని రాజకీయ పలుకుబడిని అర్థం చేసుకోవచ్చు. కొరవడిన నిఘా.. పోలీసు శాఖలోనే ఉండే ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలు అవినీతి అధికారుల కదలికలపై నిఘా పెట్టడంలో విఫలమవుతున్నాయి. ఏసీబీ దాడుల చేసే వరకూ సొంత శాఖకు సమాచారం లేకపోవడమే దీనికి నిదర్శనం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ ఠాణాలో ఆడియోతో కూడిన సీసీటీవీ కెమెరాలు ఉండాలి. కానీ, గ్రేటర్లో పలు పీఎస్‌లలో రైటర్ గదులు, ఎస్ఐ గదుల్లోని కెమెరాలు తరచూ సాంకేతిక లోపాల సాకుతో పనిచేయకుండా పోతున్నాయి. లంచాల బేరాలు సాగేది ఇక్కడే.ఉమెన్ పీఎస్‌లలో ‘హనీట్రాప్’మహిళా పోలీసు స్టేషన్లలో 498ఎ కేసు అంటే కాసుల పండగే. భార్యభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలను ఆసరాగా చేసుకొని ఉమెన్ పీఎస్‌లో కొందరు సిబ్బంది హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. కౌన్సెలింగ్ పేరుతో స్టేషన్‌కు వచ్చే భర్తలను కొందరు మహిళా కానిస్టేబుళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని, మాయమాటలతో బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతూ రూ.లక్షల్లో నగదు, ఖరీదైన బహుమతులను లాగేస్తున్నారని మల్కాజిగిరి ఎస్బీ అధికారి ఒకరు తెలిపారు. ఇక, సైబర్ క్రైమ్ స్టేషన్లలో ఆన్లైన్ మోసాలకు గురైన బాధితుల అకౌంట్లను ఫ్రీజ్ చేయడం, మళ్లీ వాటిని అన్‌ఫ్రీజ్ చేయడానికి కొందరు అధికారులు నిందితులతో చేతులు కలుపుతున్నారు. క్రిప్టో కరెన్సీ, సైబర్ మోసాల కేసుల్లో నిందితుల నుంచి రూ.లక్షలను క్రిప్టో రూపంలోనే లంచంగా తీసుకుంటున్న ఉదంతాలు అనేకం. -
ప్లీజ్ కాపాడండి.. స్టేషన్ ఎదుటే 40 నిమిషాల పాటు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్(22) సుమారు 40 నిమిషాల పాటు ప్రాణాల కోసం సహాయం కోరినా, సకాలంలో వైద్య సహాయం అందక మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. జూలై 12న ఆటో చార్జీ విషయంలో డ్రైవర్‌తో రాజ్‌కుమార్‌కు వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమీపంలోని పోలీసుల పింక్ బూత్ వద్దకు వెళ్లి సహాయం కోరాడు. అయితే బూత్ మూసి ఉండటంతో లోపల ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళ్లేందుకు గాజు తలుపును బలంగా కొట్టాడు. దీంతో గాజు పగిలి అతని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న రాజ్‌కుమార్ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే పడి సహాయం కోసం వేడుకున్నా ఎవరూ వెంటనే ఆస్పత్రికి తరలించలేదని తెలిపారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. गाजियाबाद पुलिस पर सवाल!मदद मांगने पहुंचे व्यक्ति को कथित तौर पर पिंक बूथ का दरवाजा नहीं खोला गया, शीशा तोड़ने पर हाथ की नसें कट गईं, देर तक सड़क पर तड़पता रहा।— जनता की सुरक्षा के लिए बने बूथ आखिर किस काम के?#Ghaziabad #UPPolice #ViralVideo pic.twitter.com/UvZT9C1l84— Payall Singhh (@PayallSingh13) July 14, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘాజియాబాద్ పోలీసులు మాత్రం రాజ్‌కుమార్, ఆటో డ్రైవర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని, గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని చెబుతున్నారు. దీంతో, ఈ ఘటనపై ఘాజియాబాద్ డీసీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల స్పందన, వైద్య సహాయం అందించడంలో జరిగిన ఆలస్యం, వైరల్ వీడియోలతో పాటు ఘటన మొత్తం మీద సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
నెల్లూరు SP సీరియస్ యాక్షన్.. CI SI సహా స్టేషన్ మొత్తం ట్రాన్స్ఫర్
-
హైదరాబాద్: పోలీస్ స్టేషన్లో నాగుపాము పిల్లలు
హైదరాబాద్: మధురానగర్ పోలీస్ స్టేషన్లో నాగుపాము పిల్లలు కలకలం సృష్టించాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి అకస్మాత్తుగా మూడు నాగుపాము పిల్లలు రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పాములను చూసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.వెంటనే ’ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సొసైటీ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని, ఎంతో జాగ్రత్తగా మూడు నాగుపాము పిల్లలను సురక్షితంగా పట్టుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పాములు కనిపించడంతో సిబ్బందిలో కొంతసేపు భయాందోళన నెలకొంది. అయితే పాము పిల్లలను ఎలాంటి హాని లేకుండా పట్టుకోవడంతో పోలీసులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.పట్టుకున్న నాగుపాము పిల్లలను సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వర్షాకాలం, పరిసరాల్లోని పొదలు, ఖాళీ ప్రదేశాల కారణంగా పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ రెస్క్యూ సభ్యులు సూచించారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో నాగుపాము పిల్లలు!HYD: మధురానగర్ పోలీస్ స్టేషన్లో నాగుపాము పిల్లలు కలకలం సృష్టించాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోకి అకస్మాత్తుగా పాము పిల్లలు రావడంతో అక్కడున్న సిబ్బంది, ఆందోళనతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ'… pic.twitter.com/e5muQ1Uge4— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2026 -
దొంగను పట్టుకున్నాం సార్! అయితే స్టేషన్లో దింపేసి వెళ్లండి
నెల్లూరు జిల్లా: ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టి అరెస్ట్ చేసేందుకు ఒంటి కాలిపై పరుగులెత్తే పోలీసులు శాంతిభద్రలను కాపాడడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రజల ఆస్తులను దొంగిలించేందుకు వచ్చిన దొంగను పట్టుకుని పోలీసులకు ఫోన్ చేసి ‘దొంగను పట్టుకున్నాం.. తీసుకెళ్లండి’ అంటే.. సారీ.. మా స్టేషన్లో సిబ్బంది లేరు స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండి అంటూ తాపీగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటన గూడూరు పట్టణంలో బుధవారం వేకువ జామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ నడి»ొడ్డులోని చర్చి కాంపౌండ్‌లో ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా యజమానికి మెలుకువ వచ్చి అతన్ని పట్టుకుని నిలదీస్తే అతను గంజాయి మత్తులో ఉన్నాడు. దీంతో చుట్టు పక్కల నివాసాల్లోని వారు చేరుకుని అతని నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హిందీలో మాట్లాడుతూ హల్చల్ చేయడంతో స్థానికులు 100కు డయల్ చేశారు.కంట్రోల్ రూమ్ నుంచి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో వారు అరగంట తరువాత ఫోన్ చేసి ఏమి జరిగిందనే విషయం అడిగి తెలుసుకున్నారు. అపరిచిత వ్యక్తిని పట్టుకున్నాం, మీరు వచ్చి తీసుకుని వెళ్లండని పోలీసులకు తెలియజేస్తే స్టేషన్లో సిబ్బంది లేరు, అందరూ బందోబస్తుకు వెళ్లి ఉన్నారు. కాబట్టి మీరే అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండని చెప్పారు. దీంతో అపరిచిత వ్యక్తిని చర్చి కాంపౌండ్ వాసులు బజారులో వదలి వేశారు. ఇలా అపరిచితులు ఇష్టానుసారంగా పట్టణంలో సంచరిస్తుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కొత్త జంటపై పోలీస్ స్టేషన్లోనే దాడి
బెంగుళూరు: ప్రేమించి వివాహం చేసుకున్న జంటపై పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే హత్యాయత్నం చేసిన సంఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా బసవాపట్టణంలో జరిగింది. కుంచుగారనహళ్లికి చెందిన సిద్ధేశ్ (22)ని యువతి కుటుంబభ్యులు కత్తితో పొడిచారు. వివరాలు.. దాగినకట్టె గ్రామానికి చెందిన లీలావతి (18), సిద్ధేశ్ ప్రేమించుకున్నారు. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఇటీవలే వివాహం చేసుకున్నారు. లీలావతి కుటుంబం నుంచి బెదిరింపులు వస్తుండడంతో ఇద్దరూ జిల్లా ఎస్పీని కలిసి భద్రత కల్పించాలని కోరారు. ఎస్పీ సూచనల మేరకు ఇద్దరూ బసవాపట్టణ పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేయాలనుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉండగానే యువతి కుటుంబీకులు సిద్ధేశ్‌ను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు. యువతిని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు సిద్ధేశ్‌ను దావణగెరెలోని ఎస్ఎస్ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. పోలీసు స్టేషన్లోనే హత్యాయత్నం జరగడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
చేతులెత్తేసిన పోలీసులు.. స్టేషన్లోకి దూసకెళ్లిన జనసేన కార్యకర్తలు
సాక్షి,కృష్ణా: మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి రావణ్‌పై దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్టేషన్ పైకే దూసుకొచ్చిన జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.సాధారణంగా పోలీస్ స్టేషన్ పై దాడి జరిగితే ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ఖాకీలు, ఇక్కడ మాత్రం పూర్తిగా 'లైట్' తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్లోకి దూసుకెళ్లిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.లాఠీఛార్జ్ చేయకుండా, కేవలం రోప్‌లతో సర్దిచెప్పే ప్రయత్నం చేయడం పోలీసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది.సొంత పార్టీ నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నారనే ధీమాతోనే కార్యకర్తలు ఇంతలా రెచ్చిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా స్టేషన్ వైపు దూసుకొచ్చినా ఖాకీలు మౌనప్రేక్షకులుగా ఉండిపోవడం శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. అధికార పక్షానికి చెందిన వారైతే చట్టం చుట్టంగా మారిపోతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రాంతమంతా రణరంగంగా మారడానికి పోలీసుల అలసత్వమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భోజన విరామం వరకు కోర్టులోనే నిలబడండి
సాక్షి, హైదరాబాద్: పోలీస్ అధికారి అయినంత మాత్రాన అనుకున్నది చేస్తారా.. చట్టం చేతుల్లో ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తారా అని మధురానగర్ ఎస్ఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు కోర్టు గదిలోనే నిలబడాలని ఎస్ఐని ఆదేశించింది. పోలీస్ కమిషనర్ నుంచి నివేదిక తెప్పించుకొని అందజేయాలని ప్రభుత్వ న్యాయవాది ఆదేశిస్తూ.. విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. మే 18న యూసఫ్‌గూడ ఇంటిలో ఉండగా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, వారిపై చర్యలతోపాటు పరిహారం ఇప్పించాలని కోరుతూ మాజీ ఎస్ఐ మహ్మద్ ఉస్మాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్ఐ కోర్టుకు హాజరయ్యారు. ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి.. పిటిషనర్ కేవలం లోదుస్తులు (లుంగీ, బనియన్) ధరించి ఉన్న స్థితిలోనే ఆయన్ని బయటకు లాగడం, నిస్సహాయ స్థితిలో రోడ్డుపై వదిలేయడానికి కారణాలను వివరించాలని ఎస్ఐను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు అందిందని హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే తెలిపారు.2023లో పోలీసులపై దాడి చేసిన క్రిమినల్ కేసులో పిటిషనర్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడని, పిటిషనర్ అతన్ని కాపాడుతున్నారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారో మీరు పిటిషనర్‌కు చెప్పారా? ఆయన కుమారుడి ప్రమేయం ఏదైనా, రిటైర్డ్ అధికారి అయిన ఆయన్ని అలా బలవంతంగా లాగకూడదు కదా. అరెస్టుకు కారణాలను తెలియజేయడం మీ బాధ్యత. ఇప్పటివరకు మీరు (కుమారుడి) కేసు గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు’అని పేర్కొన్నారు. జీపీ అభ్యర్థన మేరకు, పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమరి్పంచాలని సీపీ ఆదేశించారు. -
సీటు ఇచ్చేదే లే.. బస్సు నేరుగా పోలీస్ స్టేషన్‌కు!
సాక్షి, మెదక్: బస్సులో సీటు విషయంలో చోటుచేసుకున్న చిన్న వివాదం కాస్తా పెద్ద రచ్చగా మారింది. మెదక్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నర్సాపూర్ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ప్రయాణం మధ్యలోనే ఉద్రిక్తత నెలకొంది.నర్సాపూర్ వద్ద ఒక మహిళతో కలిసి బస్సులో ఎక్కిన ఓ దివ్యాంగుడు సీటు కోసం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దివ్యాంగుడికి సీటు ఇవ్వాలని అదే బస్సులో ఉన్న మరో మహిళ కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. “సీటు ఇవ్వడం సాధ్యం కాదు” అన్న మాటతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.చిన్నగా ప్రారంభమైన మాటల తూటాలు క్షణాల్లోనే గొడవగా మారి తోపులాట వరకు వెళ్లినట్లు ప్రయాణికులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును నేరుగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.పోలీసులు బస్సులోని ప్రయాణికులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివాదంలో ఉన్న మహిళా ప్రయాణికులకు పోలీసులు నచ్చజెప్పి, ఎలాంటి పెద్ద సమస్య లేకుండా అక్కడి నుంచే పంపించారు. అనంతరం బస్సు తిరిగి తన గమ్యస్థానానికి బయలుదేరినట్లు సమాచారం. చిన్న సీటు వివాదం కారణంగా బస్సు కొద్దిసేపు ఆగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఆత్మహత్య
వికారాబాద్: ఆర్థిక ఇబ్బందులతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జన్వాడకి చెందిన బాలసాయి (32), సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామానికి చెందిన పద్మ (25) ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలసాయి నగరంలోని పటేల్‌గూడలో ఓ గదిని అద్దెకి తీసుకుని ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ తమ బాబుని తీసుకొని మూడు రోజుల క్రితం జన్వాడకి వచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో దంపతులు ఇంట్లో తలుపులు వేసుకొని, ఫ్యాన్‌కి ఉరివేసుకున్నారు. బాలుడి ఏడుపు విన్న కుటుంబసభ్యులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా దంపతులు విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
పోలీసు బాస్‌లకు తెలిసే సీసీ టీవీ ఫుటేజీ మాయం
సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం, కనుమరుగు వ్యవహారంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ మాయం కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు పెద్దల సహాయ, సహకారాలు లేకుండా సీసీ టీవీ ఫుటేజీ మాయం అయ్యే అవకాశమే లేదు. చట్ట నిబంధనల ప్రకారం సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేయాలంటే జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్లలో కమిషనర్ అనుమతి తప్పనిసరి. వీరి అనుమతి లేకుండా పోలీస్స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాని పని. ఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)కు కూడా సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేసేందుకు అనుమతి ఉండదు. డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్), నెట్వర్క్ వీడియో రికార్డర్ (ఎన్వీఆర్)లలో నిక్షిప్తమయ్యే సీసీ టీవీ ఫుటేజీని తొలగించాలంటే ఎస్పీ లేదా కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. వారు నేరుగా పోలీసులకు అనుమతి ఇవ్వరు. సదరు సీసీ టీవీ ఫుటేజీని తెరిచేందుకు ఓ అధీకృత వ్యక్తిని నియమిస్తారు. ఆ వ్యక్తికి మాత్రమే దానిని పరిశీలించే, డిలీట్ చేసే అధికారం ఉంటుంది. అనుమతులు లేకుండా పోలీసులు నేరుగా సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేయడం చట్టరీత్యా తీవ్ర నేరం. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లేదా ఐపీసీ సెక్షన్ల ప్రకారం, కేసు దర్యాప్తుకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా తొలగించడం అనేది నాన్ బెయిలబుల్ నేరం. ఫుటేజ్ డిలీట్ చేసినట్లు రుజువైతే సదరు పోలీసు అధికారులను సర్వీస్ నుండి సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడంతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.ఆ ఫుటేజీని తిరిగి పొందడం సాధ్యమే వాస్తవానికి పోలీస్స్టేషన్లలోని సీసీ టీవీ ఫుటేజీ కేవలం ఆ స్టేషన్‌లోని డీవీఆర్‌లో మాత్రమే కాక, మరో రెండు చోట్ల భౌతికంగా రికార్డ్ చేయడం తప్పనిసరి. ఓ చోట ఫుటేజీ పోయినా మరో చోట నుంచి ఫుటేజీని తీసుకునేందుకే ఇలాంటి ఏర్పాటు చేశారు. సాయికృష్ణ కేసులో మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల సీసీ టీవీ ఫుటేజీ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించారు. అసలు వాస్తవాలు వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశంతోనే సీసీ టీవీ ఫుటేజీని పోలీసు పెద్దల ఆదేశాల మేరకు తొలగించినట్లు పోలీసు అధికారులే చెబుతున్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా నెల రోజుల సీసీ టీవీ ఫుటేజీ డిలీట్ అయ్యిందంటే కమిషనర్‌కు తెలియకుండా ఉండే అవకాశం లేదన్నది రిటైర్డ్ పోలీసు అధికారుల మాట. ఇటీవల ఓ కోర్టు ధిక్కార కేసు, ఓ అక్రమ నిర్భంధం కేసులో సీసీ టీవీ ఫుటేజీ డిలీట్ వ్యవహారం హైకోర్టు ముందు చర్చకు వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేయాలంటే పోలీసులు నేరుగా చేయలేరని, జిల్లా ఎస్పీ లేదా కమిషనర్ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వమే స్వయంగా హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపితే అసలు సీసీ టీవీ ఫుటేజీని ఎవరు డిలీట్ చేశారు.. ఎప్పుడు చేశారు.. ఎంత మేర డిలీట్ చేశారనే వివరాలను సులువుగానే తెలుసుకోవచ్చు. డిలీట్ చేసిన ఫుటేజీని తిరిగి పొందడం కూడా సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు.లాకప్‌డెత్‌ల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ⇒ దేశంలో పోలీసులు పౌరుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుండటం, అక్రమంగా నిర్బంధించడం, లాకప్‌డెత్‌లు ఎక్కువైపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పరంవీర్ సింగ్ సైనీ వర్సెస్ బల్జీత్ సింగ్’ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీల నిర్వహణపై అత్యంత కఠినమైన ఆదేశాలిచ్చింది.⇒ నిందితులను, అనుమానితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వారి పట్ల దారుణంగా, క్రూరంగా ప్రవర్తించినప్పుడు పోలీసులు ‘అక్కడ సీసీ టీవీ పనిచేయడం లేదు‘ లేదా ‘ఆ సమయానికి పవర్ కట్ అయింది‘ అని సాకులు చెబుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో పోలీసులకు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయ్యే ఆడియో, వీడియో డేటాను కనీసం 12 నుండి 18 నెలల పాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. ⇒ కేవలం వీడియో మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్లలో జరిగే ప్రతి సంభాషణ రికార్డ్ అయ్యేలా ఆడియో సిస్టమ్, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా నైట్ విజన్ కెమెరాలు ఉండాలి. సీసీటీవీల పర్యవేక్షణ కేవలం ఆయా పోలీస్ స్టేషన్ల చేతుల్లోనే ఉండదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన ’స్వతంత్ర కమిటీలు’ ఈ కెమెరాల పని తీరును, ఫుటేజ్‌లను నిరంతరం ఆడిట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ఫుటేజ్ డిలీట్ చేసినా, నేటి ఆధునిక సాంకేతికత ముందు వారు దొరికిపోవడం ఖాయం. ⇒ ఎందుకంటే ఆధునిక సిస్టమ్స్‌లో ఆటోమేటిక్ ‘ఆడిట్ లాగ్’ రికార్డ్ అవుతుంది. అంటే, ఏ యూజర్ ఐడీ ద్వారా, ఏ తేదీన, ఏ సమయంలో లాగిన్ అయ్యారు? ఏ ఫైల్‌ను డిలీట్ చేశారు? అనే సమాచారం సిస్టమ్ లోపల నమోదవుతుంది. దీనిని పోలీసులు కూడా మార్చలేరు. హార్డ్ డిస్క్ నుండి డిలీట్ చేసిన లేదా ఫార్మాట్ చేసిన డేటాను పూర్తిగా తుడిచి పెట్టడం అంత సులువు కాదు. ⇒ కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సదరు డివైజ్‌లను సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపితే, నిపుణులు డిలీట్ చేసిన ఫుటేజ్‌ను మళ్లీ విజయవంతంగా రికవరీ చేయగలరు. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్‌ను నేరుగా డిలీట్ చేసే భౌతిక అవకాశం పోలీసులకు కొంత మేర ఉన్నప్పటికీ.. చట్టపరమైన నిబంధనలు, డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నాలజీ, కోర్టుల నిరంతర పర్యవేక్షణ కారణంగా అలా చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.సీసీటీవీ కెమెరా పనిచేయకపోతే కమిటీకి చెప్పాల్సిందే ⇒ ఒకవేళ పోలీస్ స్టేషన్లో కెమెరా పని చేయకపోతే, ఆ విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంటనే జిల్లా స్థాయి కమిటీకి లిఖిత పూర్వకంగా నివేదించాల్సి ఉంటుంది. లాకప్‌లో అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పౌరుల హక్కులకు రక్షణ కల్పిస్తున్నాయి. సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ‘ఫైల్ కార్వింగ్‘ అనే పద్ధతి ద్వారా తొలగించిన ఫుటేజీని యథావిధిగా బయటకు తీస్తారు. ⇒ ప్రతి ఆధునిక సీసీటీవీ సాఫ్ట్వేర్ వెనుక ఒక రహస్య డైరీ లాంటిది రన్ అవుతుంది. దీన్నే ’ఆడిట్ లాగ్’ అంటారు. ఒక అధికారి ఫుటేజ్ డిలీట్ చేస్తే, అది లాగ్ ఫైల్లో రికార్డ్ అయిపోతుంది. దీనిని సాధారణ యూజర్లు మార్చలేరు. దర్యాప్తు అధికారులు ఈ లాగ్‌ను పరిశీలించి, ‘ఫలానా సమయంలో, ఫలానా ఐడీతో ఫుటేజ్ డిలీట్ చేశారు‘ అని తేలుస్తారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్ సీసీ టీవీలను కేవలం ఆ స్టేషన్‌కే పరిమితం చేయడం లేదు. ⇒ స్టేషన్‌లోని కెమెరాల లైవ్ ఫీడ్ నేరుగా జిల్లా ఎస్పీ ఆఫీస్‌కు లేదా స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ లోకల్ స్టేషన్లో పోలీసులు డీవీఆర్‌ను పగలగొట్టినా లేక సీసీ టీవీ ఫుటేజీని డిలీట్ చేసినా, మెయిన్ హెడ్‌క్వార్టర్స్ సర్వర్‌లో ఆ డేటా సురక్షితంగా బ్యాకప్ అయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కెమెరా వైర్లు పీకేయాలని చూసినా, లేదా కెమెరా ముందు ఏదైనా అడ్డం పెట్టాలని ప్రయత్నించినా, సిస్టమ్ వెంటనే మెయిన్ కమాండ్ సెంటర్‌కు అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. దీనివల్ల ‘కెమెరా ఆటోమేటిక్‌గా పాడైపోయింది‘ అని పోలీసులు అబద్దాలు చెప్పేందుకు ఆస్కారం ఉండదు. -
దేవభక్తుని చక్రవర్తి విడుదల
-
అర్ధరాత్రి పోలీసుల రహస్య పూజలు..స్టేషన్లో మేక బలి!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరు సమీపంలో ఉన్న తీవట్టిపట్టి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఒక వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను తగ్గించడం కోసమంటూ.. పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత రహస్యంగా మేకను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం వెలుగులోకి వచ్చింది. తివట్టిపట్టి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో, సబ్–ఇన్స్పెక్టర్లు , కొందరు సిబ్బంది కలిసి ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు పోలీసు స్టేషన్లో రహస్యంగా పూజలు నిర్వహించారు. ఒక మేకను బలి ఇచ్చి, దాని రక్తాన్ని పోలీస్ స్టేషన్ ముఖద్వారం వద్ద చల్లారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఇలా జంతు బలి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో, ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల కాలంగా పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరుగుతుండటం, తమకు విశ్రాంతి, సెలవులు కూడా లేకుండా ఉక్కిరి బిక్కిరి అయ్యేపరిస్థితి ఉండటంతోనే ఈ పూజలలో లీనమైనట్టుగా అక్కడి సిబ్బంది వాపోవడం గమనార్హం. -
భార్య గొంతు కోసి చంపేశాడు
హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌కు చెందిన సులేమాన్ బిన్, నిషాత్ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్ బాగ్‌లోని ఇంటికి కత్తితో వచి్చన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్‌పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్‌నుమా ఏసీపీ జావెద్ పరిశీలించారు. నిషాత్ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా కోడిని చంపినోళ్లను వదలొద్దు
నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది. -
మైనర్ బాలుడిపై పోలీస్ అధికారి లైంగిక దాడి..!
సాక్షి, చెన్నై : సమాజానికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ దారుణానికి ఒడిగట్టాడు. సెలవుల కోసం బంధువుల ఇంటికి వచ్చిన ఒక మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, నోటిలో బలవంతంగా మద్యం పోసి చిత్రహింసలు పెట్టిన ఘటన చెన్నై నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడైన పోలీస్‌పై అశోక్ నగర్ పోలీసులు శరవేగంగా స్పందించి పోక్సో చట్టంలో కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. వివరాలు..కన్యాకుమారి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ప్లస్–1 చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి చెన్నై కోడంబాక్కం ప్రాంతంలోని తన మామ ఇంటికి వచ్చాడు. కుటుంబంతో కలిసి పెరియపాలయం, సిరువాపురి ఆలయాలను సందర్శించిన అనంతరం తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగి వెళ్లగా, ఆ బాలుడు మాత్రం మామ ఇంట్లోనే ఉండిపోయాడు. ఈనేపథ్యంలో వడపళని పోలీస్ స్టేషన్ రైటర్ పనిచేస్తున్న వేలప్పన్ తన మామకు స్నేహితుడు కావడంతో బుధవారం రాత్రి వారి ఇంటికి ఆ బాలుడు వెళ్లాడు. అక్కడ ఆ రైటర్, బాలుడి మామ కలిసి మద్యం సేవించారు. కొంత సమయం తర్వాత బాలుడి మామ మద్యం మత్తులో నిద్రపోయాడు. బెడ్ రూమ్‌లోకి చొరబడి దారుణం అర్ధరాత్రి సమయంలో నిందితుడు వేలప్పన్, బాలుడు టీవీ చూస్తూ పడుకున్న పడకగదిలోకి అకస్మాత్తుగా చొరబడ్డాడు. బాలుడిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, గట్టిగా అరవకుండా ఉండేందుకు నోట్లో మద్యం పోసి క్రూరంగా ప్రవర్తించాడు. నిందితుడి క్రూరత్వం నుండి ఎలాగైనా బయటపడాలని భావించిన ఆ బాలుడు ధైర్యం చేసి, పక్కనే ఉన్న టీవీ రిమోట్‌తో వేలప్పన్ను బలంగా కొట్టి కిందకు తోసేశాడు. అనంతరం గదిలోంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. మత్తులో కామాంధుడిగా మారిన ఆ నిందితుడు లోపల ఉంచి ఇంటికి తాళం వేశాడు. అర్ధరాత్రి వేళ భయంతో కేకలు వేస్తూ కాలినడకన సమీపంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆశ్రయం పొందాడు. పోలీస్ స్టేషన్లో బాలుడు ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఇంట్లోనే బందీగా ఉన్న వేలప్పన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిరా>్ధరణ కావడంతో, నిందితుడు వేలప్పన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
టీడీపీ నేత పొట్టలో మేక ‘మే..మే’ అని అరిచింది..!
‘అధికారంలోకి వచ్చాక ఎక్కువగా తిని పొట్ట ముందుకు వచ్చింది.. ఉక్కకు తట్టుకోలేకపోతున్నాం.. కాసింతైనా వాన పడింటే బాగుండు’ అనుకుంటున్న టీడీపీ నేతలను చల్లబరుస్తూ మేఘం వర్షించింది. అంతా బాగానే ఉన్నా వానలో ఒక ముక్క అయినా నమిలితే బాగుంటుందని కొందరు టీడీపీ నాయకులు మేకను కొట్టేశారు. ఎవరికీ తెలియకుండా దాన్ని కైమా చేసి ఆరగించారు. మేక ఊరుకుంటుందా? వారి పొట్టలోకి వెళ్లినా ‘మే..మే..’ అని అరిచింది.. విషయం అందరికీ తెలిసింది. పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు వరకు వెళ్లింది. ఇసుక, నల్లమట్టి, ఎర్రమట్టిని దోచుకుంటున్న టీడీపీ నేతలు తామేం గొప్పవారు కాదని, మేకను తిన్నవారే సంపద సృష్టించే అసలైన పార్టీ నాయకులని కీర్తిస్తూ గీతాలు పాడుతున్నారు. ఇది కథ కాదు.. గోనెగండ్లలో జరిగిన వాస్తవం. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే.. గోనెగండ్లలో ఒక మేక పొలం నుంచి దారితప్పి దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి చేరింది. దీన్ని గమనించి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు డైరెక్టర్, టీడీపీ నాయకుడు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు, మరో ముగ్గురు కలిసి మేక తీసుకెళ్లారు. కోసుకొని కుప్పలుగా వేసి, పంపకాలు చేసుకుని, ఎవరికీ తెలియకుండా ఆరగించారు. ఈ విషయం మేక యాజమానికి తెలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచారణ చేసి మేక మాంసాన్ని ఆరగించిన టీడీపీ నాయకులను విచారణకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీపీఐకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ‘మీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు రచ్చకెక్కితే బాగోదు’ అంటూ సర్దిచెప్పారు. మేకను ఖరీదు చేసి పరిహారాన్ని బాధితుడికి ఇప్పించే విధంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ విషయం తెలిసి గోనెగండ్ల మండల ప్రజలు టీడీపీ నాయకులు ఇలాగా కూడా ఉంటారా అని నవ్వుకున్నారు. కర్నూలు -
లాయర్ కి ఇంత కోపమా! కానిస్టేబుల్‌పై దాడి
-
ప్రభుత్వ ఉద్యోగిని హనీట్రాప్ చేసిన మహిళ
హైదరాబాద్: ఓ ప్రభుత్వ ఉద్యోగిని హనీట్రాప్ చేసిన మహిళ బ్లాక్మెయిల్ చేసి రూ.5.5 లక్షలు వసూలు చేసింది. దీంతో ఆమెను పంజగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలానగర్ గాం«దీనగర్‌కు చెందిన సాయికిరణ్ (29) ఖైరతాబాద్‌లో పౌరసరఫరాల ఏఎస్ఓ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. 2022 జూన్‌లో సైదాబాద్‌కు చెందిన లక్ష్మి (40) అనే మహిళ సాయి కిరణ్ వద్దకు వచ్చి రేషన్‌కార్డులో కుమారుడి పేరును చేర్చాలని వచ్చింది. ఆ తరువాత సాయి కిరణ్‌తో మాటలు కలిపి ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడంతోపాటు పార్క్‌లు, రెస్టారెంట్లకు వెళ్లారు. ఓయో హోటళ్లకు తీసుకువెళ్లి ఏకాతంగా ఉన్నప్పుడు అతని ఫోటోలు తీసుకుంది. అంతేకాక ఓయో హోటల్ రసీదులు తనవద్దే ఉంచుకుంది. అనంతరం ఫోటోలు, హోటల్ రసీదులు చూపించి.. బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు పలుమార్లు డబ్బులు ఫోన్‌పేలో బదిలీచేశాడు. ఆ తరువాత కూడా వేధింపులు ఆపకపోవడంతో 2023లో ఆత్మహత్యకు యత్నంచాడు. తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పాడు. అయితే.. సాయి తల్లికి ఫోన్ చేసిన నిందితురాలు రూ.50 వేలు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో అదే రోజు 50వేలు ఆన్లైన్ ద్వారా పంపించారు.సైదాబాద్‌లోని లక్ష్మి ఇంటికి వెళ్లి ప్రశ్నించగా దుర్భాషలాడింది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ బయటే రూ. 2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భయంతో ఆమొత్తం కూడా ఇచ్చారు. తిరిగి ఈ నెల 13న పంజగుట్ట సర్కిల్ వద్ద మరోమారు డబ్బు డిమాండ్ చేసింది. తీవ్ర మనస్థాపానికి గురైన సాయి కిరణ్ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం లక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా బాధితుడు మహిళకు ఎప్పుడెప్పుడు డబ్బు బదిలీ చేశాడు? ఎక్కడెక్కడ వీరు తిరిగారు అనే విషయాలపై విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించనున్నారు. -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
డీఎస్పీని భిక్షమడిగారని స్టేషన్‌కు తరలించారు!
లేపాక్షి: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేసి జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచడం చర్చనీయాంశమైంది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్‌కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ రాగా, ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు. ఆయనకు అసౌకర్యం కలిగించారనే కారణంతో వారిని స్థానిక పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నామని, తమను ఇలా స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ఎస్ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి ఎవరూ దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులుంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
రైతును లాకప్‌లో పెట్టి కొడతారా?
పొదలకూరు : ‘అమాయక రైతులను కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు ? వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకుల మాటలు వింటూ పోలీసులు చేయిచేసుకుంటున్నారు. వారందరిని న్యాయస్థానంలో దోషులుగా నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ నాయకులు చెప్పారని మండలంలోని నావూరుపల్లికి చెందిన మాజీ సర్పంచ్ వెంగయ్య కుమారుడు గాలం హరికృష్ణను ఎస్ఐ హనీఫ్ స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టడాన్ని గర్హిస్తూ.. శనివారం మండుటెండలో కాకాణి ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.పలు గ్రామాల నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. హరికృష్ణను ఏ కేసులో స్టేషన్‌కు తీసుకువచ్చి కొట్టారో చెప్పాలని సీఐ వెంకట్రావును కాకాణి ప్రశ్నిం చారు. ఫిర్యాదు లేదు.. కేసు నమోదు లేదు.. హరికృష్ణను ఎందుకు కొట్టారని నిలదీశారు. పౌరుడిని కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నిం చారు. ఎస్ఐ హనీఫ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరిస్తూ దుర్మార్గంగా కొడుతున్నట్టు కాకాణి పేర్కొన్నారు. తమ కార్యకర్తలను కొట్టే దృశ్యాలను వీడియో కాల్ చేసి టీడీపీ నాయకులకు చూపుతున్నట్లు ధ్వజమెత్తారు. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న రైతు హరికృష్ణ నిమ్మ తోటలకు వ్యవసాయ విద్యుత్ సర్విస్ కోసం విద్యుత్ ఏఈని ప్రశి్నస్తే ఎస్ఐ పిలిపించి కొట్టడం ఏమిటని నిలదీశారు. హరికృష్ణ వద్ద రూ.40 వేలు లంచం తీసుకుని కూడా ఏఈ పనిచేయకపోవడం వల్లే ప్రశ్నిం చాడని వెల్లడించారు. ఎస్ఐ హనీఫ్పై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయని ధర్నా చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతానని తమ కార్యకర్తలను బెదిరించారని తెలిపారు. ధర్నా చేశామని దమ్ముంటే కేసులు పెట్టాల్సిందిగా కాకాణి సవాల్ విసిరారు. తప్పు చేసిన పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు. -
సర్.. నా భార్య మనీషా కనిపించడం లేదు!
హైదరాబాద్: వివాహిత అదృశ్యమైన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కి చెందిన కైలాష్ కుమార్ భార్యతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వచ్చాడు. ఇక్కడే ఉంటూ కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మనీషా కనిపించలేదు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 15 ఏళ్ల బాలుడు.. 26 ఏళ్ల యువతితో ప్రేమ..! -
ఎస్ఐ కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు!
నల్గొండ జిల్లా: ప్రహరీ నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదంలో తన భర్త గిరగాని సురేశ్‌ను శాలిగౌరారం పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన గిరగాని జ్యోతి బుధవారం విలేకరులకు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తమ సమీప బంధువైన గిరగాని వీరమ్మకు చెందిన ఇంటి స్థలంలో యనమల్ల శంకర్ అనే వ్యక్తి ప్రహరీ నిర్మిస్తుండగా.. ఈ నెల 1న తన భర్త గిరగాని సురేశ్, యనమల్ల శంకర్ మధ్య గొడవ జరిగిందని ఆమె పేర్కొంది.దీంతో శంకర్ అదేరోజు రాత్రి డయల్ 100కు ఫోన్ చేయడంతో ఇద్దరు పోలీసులు గ్రామానికి వచ్చారని.. వారికి, తన భర్త మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. దీంతో మరుసటిరోజు తన భర్తను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. సురేశ్‌ను కొట్టలేదు..ఈ నెల 1న యనమల్ల శంకర్, గిరగాని సురేశ్‌లు గొడవపడి కొట్టుకున్నారని, డయల్ 100కు ఫోన్ రావడంతో తమ కానిస్టేబుళ్లు శ్రీను, విక్రమ్ చిత్తలూరు గ్రామానికి వెళ్లి ఘర్షణపై విచారణ జరిపినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. ఈ క్రమంలో గిరగాని సురేశ్, అతడి తండ్రి గిరగాని వెంకన్న, దేశగాని విఠల్ తమ కానిస్టేబుళ్లతో గొడవపడి రాళ్లతో దాడి చేశారని ఎస్ఐ వివరించారు.ఇద్దరు కానిస్టేబుళ్లు కాగా.. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఈ నెల 2న అరెస్ట్ చేసి నకిరేకల్ కోర్టులో హాజరుపర్చామన్నారు. సురేశ్‌పై కేసు నమోదు కావడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వెంటనే కోర్టులో హాజరుపర్చామన్నారు. ఇరువర్గాల ఘర్షణలో సురేశ్‌కు దెబ్బలు తగిలి ఉంటాయే తప్ప పోలీస్ స్టేషన్లో ఎవరూ కొట్టలేదని, కావాలనే పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎస్ఐ తెలిపారు. -
అంబటిపై మరో కేసు.. పోలీస్ స్టేషన్ లో విచారణ
-
పోలీసుస్టేషన్‌కు వచ్చిన నాగుపాము
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో నాగుపాము హల్చల్ చేసింది. ఎస్సై నరేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎస్సై సోమవారం పోలీసుస్టేషన్‌లోని తన గదిలో ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్నాడు. ఎస్సై సీటు వెనుక ఉన్న కిటకిలోంచి గదిలోకి నాగుపాము ప్రవేశిస్తున్న క్రమంలో ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి పాము అని గట్టిగా అరిచాడు. ఎస్సై వెంటనే తన సీటు ముందున్న టేబుల్ పైనుంచి దూకడంతో ప్రమాదం తప్పింది. స్నేక్ క్యాచర్ పోచయ్యను పిలిపించి, పామును పట్టుకున్నారు. మూడు రోజులుగా పోలీస్‌స్టేషన్ అవరణలో పాము తిరుగుతున్నట్లు తెలిపారు. -
వీళ్లు మాకొద్దు!
తిమ్మాపూర్: దంపతుల మధ్య విభేదాలు పిల్లలను వదిలించుకునే పరిస్థితికి వచ్చాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలోని తమిళకాలనీకి చెందిన రవికుమార్‌కు, నిజామాబాద్‌కు చెందిన లలితతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు సంతానం. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. లలిత పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా సయోధ్య కుదరలేదు. రవికుమార్ ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు లలితను పిలిపించడంతో సోమవారం పిల్లలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఎస్సై అన్వర్ దంపతులకు కౌన్సెలింగ్ చేశారు. లలిత తనకు భర్త, పిల్లలు అవసరం లేదు అంటూ తాళి, మెట్టెలు తీసి టేబుల్‌పై పెట్టి పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. మొండిగా వ్యవహరించింది. రవికుమార్ కూడా తనకు భార్య, పిల్లలు అవసరం లేదని వదిలేసి వెళ్లాడు. ఠాణాలోనే ఇద్దరు గొడవ పడటం చూసి పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఠాణాకు వచ్చినవాళ్లు చిన్నారులను చూసి ఆందోళన చెందారు. ఎస్సై అన్వర్ చిన్నారుల నానమ్మ వివరాలు తెలుసుకొని ఆమెకు అప్పగించారు. -
ఇంట్లోకెళ్ళి బలవంతంగా మహిళపై ఎస్సై లైంగికదాడి..!
చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ సొంతశాఖ ఉద్యోగులకు అందాల్సిన జీతాలను కాజేశాడు. ఈ ప్రక్రియకు కరీంనగర్ కమిషనరేట్ ఏవోస్థాయి అధికారి సహకరించడంతో రూ.కోట్లలో దండుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జైలుకు పంపారు.జమ్మికుంట పోలీసుస్టేషన్ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న కదిరె శ్రీకాంత్ ఓ మహిళను వేధించిన కేసులో చిక్కుకున్నాడు. శ్రీకాంత్‌కు ఫేస్బుక్లో పరిచయమైన ఓ వివాహిత ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డట్టు ఆరోపణలొచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 15న వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్లో శ్రీకాంత్‌పై కేసు నమోదైంది.వీణవంక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారినుంచి మామూళ్లు వసూలు చేయడంతో పాటు సివిల్ వివాదాల్లో తలదూర్చిన ఆరోపణలతో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.కరీంనగర్ క్రైం: చట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీసులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులకు అక్కడి సిబ్బంది చేయి తడపనిదే పని జరగక పోగా.. ఇదేంది సారూ అని అడిగితే జులుం ప్రదర్శించడం పలువురు సిబ్బంది వంతవుతోంది. ఇటీవల కాలంలో కరీంనగర్ పోలీసు కమిషనరేట్ వరుస వివాదాలకు నెలవుగా మారుతుండగా, ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు కొందరు చిక్కుల్లో పడుతున్నారు. ఈ ఒక్క నెలలో మూడు ఘటనలు జరగడం కలంకంగా మారాయి.రాజకీయ పలుకుబడితో..పలువురు సిబ్బంది రాజకీయ పలుకుబడితో వారికి నచ్చిన పోలీసు స్టేషన్లో పోస్టింగ్‌లు తెచ్చుకొని, ఉన్నతాధికారులు అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా.. పోలీసుశాఖలో అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందా? లేక క్రమశిక్షణ లోపించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలువురు సిబ్బంది సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ, ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కేసుల్లో స్టేషన్ బెయిల్ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇసుక వనరులు ఉన్నచోట్ల వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారని చెబుకుంటున్నారు. పోలీసుశాఖలో ఎక్కడ ఏంజరిగినా క్షణాల్లో తెలుసుకునే ఎస్బీ విభాగం ఏంపనిచేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు రక్షణగా నిలవాలి్సనవారు అడ్డదారిలో వెళ్తే, అలాంటివారిపై వ్యవస్థలో పారదర్శకతను పెంచేలా చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటనలు పోలీసుశాఖలో పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
దమ్ముంటే చెయ్యి వెయ్యి.. జక్కంపూడి ఉగ్రరూపం
-
ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు
-
పోలీస్ స్టేషన్లో వ్యక్తి!
సాక్షి టాస్క్ ఫోర్స్: చోరీ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారు జామున నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో జరిగింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, లాకప్ డెత్ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకట సుబ్బయ్య(38) ఈనెల 16న తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా పడగటూరు గ్రామానికి చెందిన తేజ, నరేష్ తో కలిసి బెలుం గ్రామంలో రెక్కీ నిర్వహించి కొత్త ట్రాక్టర్‌ను అపహరించుకుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కర్నూలు సమీపంలో ట్రాక్టర్ ఉండటంతో రికవరీ చేశారు. ఈ కేసులో వెంకటసుబ్బయ్య, తేజను అదుపులోకి తీసుకోగా నరేష్ పరారీలో ఉన్నాడు. మృతుడు వెంకటసుబ్బయ్యపై పోలీస్ స్టేషన్లో దొంగతనం, రెండు కొట్లాట కేసులు ఉన్నాయి. బాత్రూంలో మృతి ట్రాక్టర్ దొంగతనం కేసులో వెంకటసుబ్బయ్యను పోలీసులు శనివారం ఉదయమే కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఆదివారం కోర్టులో హాజరు పర్చాలని భావించారు. తెల్లవారు జామున స్టేషన్‌లోని బాత్రూం వెళ్లి కట్టుకున్న లుంగీతో వెంకటసుబ్బయ్య ఉరివేసుకున్నాడు. బాత్రూంకు అని చెప్పి వెళ్లి ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి దొంగ తేజ రాత్రి విధుల్లో ఉన్న పోలీసులకు చెప్పాడు. వారు వెళ్లి చూడగా సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. శ్వాస ఇంకా ఉందనే అనుమానంతో సిబ్బంది అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బయ్యపై మూడు కేసులు ఉండటంతో పాటు తాజాగా ట్రాక్టర్ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో చేతులు కలపడంతో రిమాండ్‌కు వెళ్లాల్సి వస్తుందనే కారణంతోనే భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నంద్యాల ఏఎస్పీ మంద జావళి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. మృతిపై అనుమానాలెన్నో! వెంకటసుబ్బయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దెబ్బలు తాళలేకనే మృతిచెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాత్రూంలో ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. సెటిల్మెంట్ చేశారా? వెంకటసుబ్బయ్య అధికార పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా సెటిల్మెంట్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు ఎందుకు బేరమాడారనేది చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే వెంకటసుబ్బయ్య కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకోలేదని లాకప్ డెత్ జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది. -
పెళ్లి పేరిట సహచర కానిస్టేబుల్ మోసం
బంజారాహిల్స్: సహచర కానిస్టేబుల్ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లోనే సహచర కానిస్టేబుల్ కప్షా స్వప్నిల్(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్‌లోని తన గదిలో స్వప్నిల్‌తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి నగ్నంగా అపార్ట్మెంట్లో హల్చల్
హైదరాబాద్: అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నగ్నంగా అపార్ట్మెంట్లో చొరబడి హల్చల్ చేసిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి(45) ఒంటిపై దుస్తులు లేకుండా మూసారంబాగ్ వెస్ట్ ప్రశాంత్‌నగర్ గంగాధర అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఫ్లాట్ తలుపు సందుల్లో నుంచి తొంగి చూస్తూ అపార్ట్మెంట్ అంతా తిరుగుతూ పరుగులు పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు బయటికి వచ్చి చూసేసరికి అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం సీసీ కెమెరాలు పరిశీలించిన వారు సదరు వ్యక్తి కారులో వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆపార్ట్మెంట్ వాసి రోహన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన కీలక ఆధారాలు దొరికాయని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
Hyderabad: ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి యత్నం..!
హైదరాబాద్: ఇంట్లోకి చొరబడిన భార్యభర్తలు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతే కాకుండా సదరు వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు .. గంగపుత్ర కాలనీకి చెందిన ఓ మహిళ(29) భర్తతో కలిసి నివాసముంటోంది. భర్త రాంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తితో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. ఇటీవల బాధిత మహిళ తల్లి రాజుకు ఫోన్ చేసి మందలించింది. దీంతో రాజు, అతని భార్య సింధు కలిసి గురువారం మధ్యాహ్నం బాధితురాలి ఇంటికి వెళ్లి దాడిచేశారు. అంతేకాక రాజు లైంగికదాడికి యత్నించాడు. ఇందుకు అతని భార్య కూడా ప్రోత్సహించింది. దీంతో బాధితురాలు బయటకు పరుగులు తీయడంతో దంపతులిద్దరూ పరారయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి బాధితురాలు వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా భార్యాభర్తలిద్దరూ బాధితురాలిపై కూడా ఫిర్యాదు చేశారని, కులం పేరుతో దూషించిందని అట్రాసిటీ కేసు పెట్టారని ఎస్ఐ రామచంద్రారెడ్డి తెలిపారు. -
చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ విస్ఫోటనం
సమయం: ఉదయం 10.05 గంటలు, రోజు: మంగళవారంకృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్టేషన్ సిబ్బంది విధుల్లో భాగంగా మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. స్టేషన్ రిసెప్షన్లో సిబ్బంది వారి పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే విస్ఫోటనం సంభవించింది. ఏం జరిగిందని తేరుకొనేలోపే బాంబుల మోత మోగింది. ఈ ప్రమాదంలో ఎస్ఐతో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ పేలుడు శబ్దంతోపాటు దట్టంగా కమ్మేసిన పొగ ఐదు కిలోమీటర్ల మేర వ్యాపించింది.దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.చల్లపల్లి: దీపావళి సందర్భంగా 2025 అక్టోబర్‌లో అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారుల నుంచి చల్లపల్లి పోలీసులు టపాసులు స్వా«దీనం చేసుకున్నారు. ఆ కేసు ఇటీవల కొట్టివేయడంతో కోర్టు ఆదేశాల ప్రకారం మందుగుండు సామగ్రిని నిరీ్వర్యం చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10.05 గంటల సమయంలో ఎస్ఐ డి.దుర్గాంజనేయులు పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, ఎస్ఐ వాహనం డ్రైవర్ డి.నాగరాజు మందుగుండును వాహనంలోకి ఎక్కించే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఉలిక్కిపడ్డ వారు ఏమి జరిగిందో తెలుసుకునేలోపే ఎస్ఐ దుర్గాంజనేయులు, కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. రిసెప్షన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కె.శివపార్వతికి, హెడ్ కానిస్టేబుల్ కేటీడీవీ ప్రసాద్(తేజ)కు కూడా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్ కిటికీలు, దర్వాజాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. పోలీస్‌జీపు దెబ్బతింది.చొచ్చుకుపోయిన రాళ్ల పిక్కలు.. ధ్వంసమైన స్టేషన్ ముందుగుండు సామగ్రిలో ఉపయోగించిన చిన్న రాళ్లపిక్కలు శరీరం లోపలికి చొచ్చుకుపోవడంతో కానిస్టేబుళ్లు షేక్ అబ్దుల్లా, నాగరాజుల శరీరాలు రక్తపు ముద్దలా మారిపోయాయి. ఎస్ఐ దుర్గాంజనేయులుకు వెనుక భాగం, జుట్టు బాగా కాలిపోయాయి. తొలుత ఎస్ఐతోపాటు మిగిలిన వారిని చికిత్స నిమిత్తం చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అబ్దుల్లా, నాగరాజు, ఎస్ఐ దుర్గాంజనేయులు, కేటీడీవీ ప్రసాద్ వినికిడి శక్తి, కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. శభాష్ శివపార్వతి తనకు గాయాలైనా రక్తమోడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సహోద్యోగిని ఆస్పత్రికి తరలించేందుకు ఆమె చేయి అందించింది. స్టేషన్లో సంభవించిన బాణసంచా ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ కె.శివపార్వతి గాయాలయ్యాయి. అయినా పట్టించుకోకుండా తీవ్రగాయాలతో నేలకొరుగుతున్న అబ్దుల్లాను వాహనం ఎక్కించింది. తర్వాత ఆమె కూడా చల్లపల్లి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీంతో శివపార్వతికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అట్టపెట్టెలో నుంచి జారి పడడంతో పేలుడు మందుగుండు సామగ్రి వాహనంలోకి ఎక్కించే సమయంలో అట్టపెట్టె అడుగు భాగం నుంచి మందుగుండు జారి కింద పడడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సీసీఫుటేజీలో ఈ విషయం వెల్లడైందన్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి ఎస్ఐ డి. దుర్గ ఆంజనేయులుతోపాటు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజును మంత్రులు వాసంశెట్టి సుభా‹Ù, కొల్లు రవీంద్ర, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రులు తెలిపారు. కోర్టుకానిస్టేబుల్ అబ్దుల్లా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. -
పోలీస్ స్టేషన్లో పేలుడు
-
చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు
సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. మందుగుండు సామాగ్రి పేలడంతో ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సీజ్ చేసిన టపాసులు కోర్టుకు తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు జీపు స్వల్పంగా ధ్వంసమైంది. గాయపడిన పోలీసులను చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మటన్ ఉడకలేదు..
తాడిపత్రి టౌన్(అనంతపురం): మటన్ ఉడకలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన షోడాల హాజీ ఆదివారం పట్టణంలోని ఓ దుకాణంలో మటన్ తీసుకు న్నాడు. అయితే అది ఎంతసేపటికీ ఉడకలేదు. మటన్ వండిన పాత్రతో సహా ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. మటన్ వ్యాపారిపై ఫిర్యాదు చేశాడు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నాసిరకం మంసాన్ని అంటగట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు తలలు పట్టుకున్నారు. చేసేది లేక సీఐ ఆరోహణరావు మటన్ డబ్బులు తానే ఇస్తానులే అంటూ షోడాల హాజీకి నచ్చజెప్పడంతో అతను వెనుదిరిగాడు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్‌గా మారింది. -
‘దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’
పామర్రు: తన తండ్రిని పోలీసులు ఎందుకు స్టేషన్‌కు పిలిపించారో తెలుసుకుందామని వెళ్లిన ఓ దళిత యువతి పట్ల అకారణంగా దుర్భాషలాడటమే కాక.. బూటుకాళ్లతో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణాజిల్లా పామర్రు మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జుఝవరపు చిన్ని అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు తేజ, కుమార్తె సుప్రియ ఉన్నారు. తేజ తండ్రితో పాటు పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చెట్లు నరికే పనులకు వెళ్తుంటాడు.కుమార్తె సుప్రియ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. మూణ్ణెళ్ల క్రితం గ్రామంలో ఓ చోట చెట్ల పొదల్లో కలి్టవేటర్ ఎంతోకాలంగా ఉందని గమనించిన తేజ, దాన్ని ఓ పాత ఇనుప సామాన్ల వ్యాపారికి రూ.3 వేలకు విక్రయించాడు. కొద్దిరోజుల తర్వాత ఓ వ్యక్తి వచ్చి కలి్టవేటర్ తనదని చెప్పడంతో తేజను తండ్రి మందలించి ఆ వ్యాపారికి రూ.3 వేలు చెల్లించి దానిని సంబంధిత వ్యక్తికి అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఉదయం పామర్రు పోలీస్‌స్టేషన్ నుంచి జుఝవరపు చిన్నికి పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని చెప్పారు. పనులు ముగించుకుని చిన్ని సాయంత్రం స్టేషన్లో సీఐ సుభాకర్ వద్దకు వెళ్లాడు. సీఐ దుర్భాషలాడుతూ.. పసుమర్రులో ఓ రైతు గడ్డర్ పోయిందని.. దానిని తీశారా అంటూ ప్రశి్నంచారు. తమకు తెలీదని చిన్ని బదులిచ్చాడు. ఎవర్రా ఇది.. ఎక్కువ మాట్లాడుతోంది.. అదే సమయంలో విజయవాడ నుంచి వచ్చిన సుప్రియ.. తన తండ్రిని పోలీసులు పిలిపించారని తెలుసుకుని భయంతో సీఐ వద్దకు వెళ్లింది. పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న తేజను ‘ఏరా నువ్వు దొంగతనాలేనా.. మానభంగాలు కూడా చేస్తున్నావా?’ అంటూ పామర్రు ఎస్ఐ ప్రశి్నంచారు. ‘సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి. మేం చదువుకున్నాం.మాకూ రూల్స్ తెలుసు’ అని సుప్రియ అనడంతో ఎస్ఐ కోపంతో.. ‘ఎవ్వర్రా ఇది? ఎక్కువగా మాట్లాడుతోంది. దీన్ని తన్ని స్టేషన్లో వేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా హోంగార్డు సుప్రియను డాబాపై నుంచి బూటుకాళ్లతో తన్నుకుంటూ, జుట్టు పట్టుకుని లాక్కుంటూ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇది చూసి బాలిక తండ్రి చిన్ని 108కు ఫోన్‌చేయగా వారు వచ్చి రక్తపు గాయాలు లేనందున తాము ఆస్పత్రికి తీసుకెళ్లబోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక చేసేదిలేక చిన్ని తన కుమార్తెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. దీనిపై సీఐ సుభాకర్‌ను వివరణ కోరగా.. పోలీస్‌స్టేషన్‌లోని హోంగార్డునే ఆ యువతి కొట్టి గాయపర్చిందని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని బదులిచ్చారు. ఆమెపైన కేసు నమోదు చేశామన్నారు. -
సార్... మా కూతురు ఎక్కడ?
విజయనగరం జిల్లా: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఏమైందో తెలియదు.. ఎక్కడకు వెళ్లిందో అర్థంకావడం లేదు.. ఏ పరిస్థితుల్లో ఉందో ఆందోళనగా ఉంది.. అమ్మేశారేమోనని అనుమానంగా ఉంది.. మా కూతురును వెతికిపెట్టండి సారూ.. అంటూ 22 రోజులుగా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ చుట్టు తిరుతున్నా పట్టించుకునే పాపాన పోవడం లేదు. మా కూతురు కనిపించడం లేదని పుట్టెడు దుఃఖంలోఉంటే సీఐ, ఎస్ఐలు నిర్లక్ష్యంగా.. చులకనగా తమతో మాట్లాడుతున్నారంటూ అమాయకులైన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గొల్లలములగాం గ్రామానికి చెందిన పిసిని బాలాజీ తన భార్యతో కలిసి బుధవారం సాయంత్రం మీడియా ముందు తమ గోడు వినిపిస్తూ కన్నీరుపెట్టారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలిక ఫిబ్రవరి 19న ఇంటి నుంచి వెళ్లి తిరిగి చేరుకోలేదన్నారు. అదే రోజు చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశామని చెప్పారు. తమ గ్రామానికి చెందిన మైలపల్లి అమ్మాజీ తమ బిడ్డను ఏదో చేసి ఉంటాడని పోలీసులకు చెప్పినప్పటికీ ఆ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి ఎందుకు విచారించడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక... తల్లిదండ్రులకు ఓ లేఖ రాసి విడిచి వెళ్లింది. అందులో ‘సారీ నాన్న’ అంటూ రాసి ఉన్న లేఖ కలకలం సృష్టిస్తోంది. -
Telangana: ఎస్సై కావలెను..!
మంచిర్యాల జిల్లా: పోలీసు సబ్ డివిజన్ కేంద్రం బెల్లంపల్లి తర్వాత తాండూర్ పోలీసుస్టేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లా సరిహద్దులో ఉన్న స్టేషన్లో గత రెండు నెలలుగా ఎస్సై పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడి ఎస్సై కిరణ్‌కుమార్ గత డిసెంబర్ 30న హాజీపూర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యారు. మాదారం ఎస్సై ఇన్చార్జిగా కొనసాగుతూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్–చంద్రాపూర్ జాతీయ రహదారి ఈ స్టేషన్ మీదుగానే సాగుతుంది. రెగ్యులర్ ఎస్సై లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో డిమాండ్ ఉన్న ఠాణా కావడంతో సబ్ డివిజన్ డివిజన్లోని ఓ గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్ ఎస్సై తాండూర్‌కు బదిలీ కోసం ఓ ప్రజాప్రతినిధి అనుయాయుల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సానుకూలత వ్యక్తమైనా మరో ఠాణాకు ఆయనకు సంబంధించిన ఎస్సైని బదిలీ చేయించే విషయంలో పేచీ పడినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే బదిలీ ప్రక్రియ నిలిచినట్లు తెలుస్తోంది. ఆ ఎస్సైతోపాటు మరో ఇద్దరు ఎస్సైలు కూడా ప్రయత్నాలు చేసి అర్థంతరంగా మానుకున్నట్లు తెలుస్తోంది. బదిలీపై రావడానికి ముగ్గురు ఎస్సైలు సిద్ధంగా ఉన్నా ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశమైంది. తాండూర్ ప్రాంతంలో జాతీయ రహదారిపై పలు చోట్ల బ్లాక్స్పాట్లు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, పలువురి మృతి, గాయపడిన సంఘటనలు, మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటుంటాయి.గంజాయి రవాణా మార్గంరాష్ట్రంలోకి మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవా ణా జరుగుతోంది. తాండూర్, బెల్లంపల్లి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సై పోస్టును భర్తీ చేస్తే శాంతిభద్రతలు పరిరక్షించే అవకాశం ఉంటుందని మండల వాసులు కోరుతున్నారు.నకిలీ పత్తి విత్తనాలకు అడ్డా...!పత్తి విత్తనాలు ఈ ప్రాంతానికి చేరుకోవడం, గుట్టుగా విక్రయించడం కొంతకాలంగా సాగుతోంది. నాలుగేళ్ల క్రితం రూ.కోటికి విలువైన పత్తి విత్తనాలను పట్టుకుని పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. గత ఏడాది తాండూర్‌లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. తాండూర్ కేంద్రంగా భీమిని, కన్నెపల్లి మండలాలకు సరఫరా అవుతాయనే ఆరోపణలున్నాయి. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఫరిధిలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. షిరిడి హిల్స్‌లో ఉండే దివ్యా రెడ్డి (33) కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. కాగా అదేప్రాంతానికి చెందిన నర్సింహా అనేవ్యక్తి గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవలే వీరి మధ్య గొడవలు సాగుతున్నాయి. శుక్రవారం కూడా గొడవ ఎక్కువ అవ్వడంతో దివ్యా రెడ్డి ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆపస్మారక స్థితికి చేరుకుంది.. గమనించిన స్థానికులు ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా ఛాన్స్ పేరిట యువతితో అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ యువతిని తన కార్యాలయానికి పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సినీ నటిని కావాలని ఆశతో ఓ యువతి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి తన స్నేహితురాలి వద్ద ఉంటోంది. ఈ నెల 18న సినిమాల్లో ఛాన్స్ ఉందని, హీరోయిన్ను చేస్తానంటూ జీఎం రవి అనే యువకుడు ఆమెను మాదాపూర్‌కు పిలిపించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెను పలు విధాలుగా పరీక్షించి ఫిలింనగర్‌లోని దుర్గాభవానీనగర్ వద్ద ఉన్న గ్రీన్మార్ట్ ఆఫీసుకు సాయంత్రం రమ్మన్నాడు. దీంతో ఆమె తన స్నేహితురాలిని తీసుకుని గ్రీన్మార్ట్ ఆఫీసుకు వెళ్లి రవిని కలిసింది. ఆయన తన గదిలోకి పిలిపించి టెస్ట్ పేరిట అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనతో పాటు తన స్నేహితురాలితో కూడా అనుచితంగా వ్యవహరించాడని, సినిమాల్లో వేషం పేరుతో, తనను పరీక్షల పేరుతో ఇష్టానుసారంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శిశువు మృతిపై పెల్లుబికిన ఆగ్రహం..
సాక్షి, నాగర్‌కర్నూల్: రెండు రోజుల క్రితం ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులపై నిర్వాహకులు దాడి చేయగా తోపులాటలో రెండు నెలల శిశువు కిందపడగా, ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులతోపాటు ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతోపాటు బీసీ, ఎస్సీ, కులసంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈనెల 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ‘కుమ్మెర ఆలయంలో దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి బంధువులు కావడంతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. బాధితులు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. వారిని కాపాడేందుకు బాధితులపైనే వేధింపులకు పాల్పడ్డారు’ అని మర్రి ఆరోపించారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్.. నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు తరలింపు
-
Hyderabad: కార్పొరేటర్ దేదీప్యరావుపై కేసు నమోదు
హైదరాబాద్: వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యరావుపై మధురానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 6న కృష్ణాకాంత్పార్కు సమీపంలోని సాయిబాబా దేవాలయం వద్ద కొందరు వ్యక్తులు గొడవపడటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ఒక గ్రూపులో బి.రూప, సత్యం యాదవ్, నర్సింగ్ యాదవ్, నాగ యాదవ్, మరికొందరు ఉన్నారు. మరో గ్రూపులో వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యరావు, సత్యనారాయణ, ఇమ్రాన్, బబ్లూ తదితరులు ఉన్నట్టుగా గుర్తించారు. సీసీ ఫుటేజీలు, ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు సుమోటాగా స్వీకరించి ఇరువర్గాల వారిపై కేసును నమోదు చేశారు. -
Tirupati : అంబటి రాంబాబుపై కేసు నమోదు
-
బెడ్రూమ్ నుంచి సరాసరి పీఎస్‌కు..
ఓరీ నా కొడకో.. నీకు ఎంత కష్టం వచ్చిందిరో అంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు బెడ్రూమ్ వైపు గబగబా పరుగులు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యంతో ఆమె, గ్రామస్తులు షాక్ తిన్నారు. అతన్ని ఓ మంచానికి కట్టేసింది అతని భార్య. ముదనష్టపుది అంటూ కోడలి గురించి గొణుక్కుంటూనే ఆ అత్త పెద్దమనుషుల సాయంతో కొడుకు చేతులకు కట్టిన తాడుల్ని విడిపించింది. ఇక్కడి నుంచి అసలు హైడ్రామా నడిచింది.. ఉత్తర ప్రదేశ్ అలీగఢ్‌లో నేరుగా బెడ్రూమ్ నుంచి టప్పల్ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కోడలు హింసిస్తోందని.. తాజాగా మంచానికి కట్టేసిందని.. గట్టిగా మందలిస్తే తనకు తుపాకీ చూపించిందంటూ ఓ ఫొటోను పోలీసులకు అందించిందా అత్త. అందులో కోడలు యిస్టైల్గా పిస్టల్‌తో ఫోజు ఇచ్చింది. దీంతో.. కోడలిని పీఎస్‌కు పిలిపించుకున్న పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే తాను అలా చేయడానికి బలమైన కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తన భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడని.. ఇరుగుపొరుగువాళ్లనూ బండ బూతులు తిడుతున్నారని సోనీ వాపోయింది. నాలుగేళ్ల కిందట తమ వివాహం అయ్యందని.. గత రెండేళ్లుగా కట్నం కోసం వేధిస్తూ వస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలోనే తాగుబోతు భర్త తీరుతో విసిగిపోయి అలా మంచానికి కట్టేశానని చెప్పిందామె. అదే సమయంలో ఆ తుపాకీ నకిలీదని తేలింది. దీంతో ఆ అత్త షాక్ తింది. దీంతో.. ఆ అత్తాకోడళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే.. నెట్టింట ప్రదీప్‌ను మంచానికి కట్టి అత్తతో సోని గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK— NDTV (@ndtv) January 23, 2026 -
బీఆర్ఎస్ VS పోలీస్ .. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద హైటెన్షన్
-
మహిళా పోలీసుల టాయిలెట్లో రహస్య వీడియోలు
చెన్నై: రామనాథపురం జిల్లా పరమకుడిలో శనివారం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అమరవీరుడు ఇమాన్యుయేల్ శేఖరన్ మణి మండపాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ఆయన భద్రతా విధుల కోసం రామనాథపురం, శివగంగై, విరుదునగర్, నెల్లై, తూత్తుకుడి, తంజావూరు వంటి వివిధ జిల్లాల నుంచి పురుష, మహిళా పోలీసు అధికారులు అక్కడికి వచ్చారు.ఈ స్థితిలో, తంజావూరు నుంచి మహిళా పోలీసు అధికారులను పరమకుడిలోని మణినగర్ ప్రాంతంలోని అవుట్‌పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద మోహరించారు. పరమకుడి నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండిని కూడా భద్రతా పనుల కోసం నియమించారు. ఈ అవుట్‌పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఓ టాయిలెట్ ఉంది. భద్రతా విధుల్లో ఉన్న తంజావూరుకు చెందిన మహిళా పోలీసులకు ఈ టాయిలెట్‌ను కేటాయించారు. అందులోకి వెళ్లిన సమయంలో కొంతమంది మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లో దాచిన సెల్ఫో¯న్ను చూసి అనుమానం వ్యక్తం చేశారు. తరువాత, వారు దానిని బయటకు తీసినప్పుడు, అది వీడియో రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లోకి ప్రవేశించే దృశ్యాలు అందులో ఉండడం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే వారు సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకుని పరమకుడి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. అది స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండి సెల్ ఫోన్ అని తేలింది. దర్యాప్తులో, స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండి ఎవరూ లేని సమయంలో టాయిలెట్లోకి వెళ్లాడని, ఆపై తన సెల్ ఫో¯న్లో వీడియోను ఆన్ చేసి ఎవరికీ తెలియకుండా ఒక ప్రదేశంలో దాచాడని తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండిని ఆదివారం అరెస్టు చేసి రామనాథపురం జైలుకు తరలించారు. -
పోలీస్ స్టేషన్లోనే భార్యను కాల్చి చంపాడు
హర్దోయి: భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి..పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆమెను తుపాకీ కాల్చి చంపాడు. ఈ ఘటన యూపీలోని హర్దోయిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పూర్ అతారియా వాసి అనూప్. ఇతడి భార్య సోనీ(35) వారం క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. నగలతోపాటు రూ.35 వేల నగదును ఆమె పట్టుకెళ్లిందంటూ అనూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు సోనీని ఆదివారం పట్టుకొచ్చి, స్టేషన్లో ఉంచారు. సోమవారం అనూప్‌ను పిలిపించారు. సోనీని కోర్టులో హాజరు పర్చే రాత పనులు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉన్న క్యాంటిన్‌లోకి సోనీని ఓ మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్తుండగా, అనూప్ అడ్డుకున్నాడు. వెంటతెచ్చుకున్న తుపాకీతో సోనీపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనీ అక్కడికక్కడే చనిపోయింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన అనూప్‌ను పోలీసులు పట్టుకుని, తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. -
పబ్‌లలో వల.. యువతులకు ఎర
హైదరాబాద్: పబ్‌లకు వచ్చే ఒంటరి యువతులను వలలో వేసుకుని మోసగిస్తున్న నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని సదమ్ మెగా టౌన్షిప్లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభంబెట్టు రాణాప్రతాప్‌రెడ్డి.. పబ్‌లకు అలవాటుపడి డబ్బుల కోసం యువతులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఓ యువతి తాను సంపాదించుకున్న డబ్బులతో హైదరాబాద్‌లో వ్యాపారం పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో రాణాప్రతాప్‌రెడ్డి పరిచయమయ్యాడు. మాయ మాటలతో ఆమెను నమ్మించాడు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు ఇప్పిస్తానని రూ.75 లక్షలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నట్టు నటించాడు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఏడాది పాటు ఆమెతో కలిసి తిరిగాడు. ఈ నేపథ్యంలో రాణాప్రతాప్ అసలు స్వరూపం బాధిత యువతికి తెలియడంతో అతడిని నిలదీసింది. దీంతో నిందితుడు రాణాప్రతాప్ తన అసలు స్వరూపం చూపించాడు. పెళ్లికి నిరాకరించాడు. తీసుకున్న డబ్బులు ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పాడు. దీంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే నిందితుడు చాలామంది యువతులకు వల వేసి ప్రేమ పేరుతో లోబర్చుకుని పబ్‌ల్లో, క్లబ్‌ల్లో తన కోరికలు తీర్చుకుంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు దండుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌రెడ్డికి రిమాండ్
అంబర్‌పేట (హైదరాబాద్): రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా తాకట్టు పెట్టిన ఎస్ఐ భానుప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట పోలీసు స్టేషన్లో భానుప్రకాశ్‌రెడ్డి డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది ఓ చోరీ కేసులో దొంగల నుంచి నాలుగున్నర తులాల బంగారాన్ని రికవరీ చేశాడు. అయితే దానిని బాధితులకు అప్పగించకుండా సొంత అవసరాలకోసం తాకట్టు పెట్టాడు. బాధితులు బంగారం కోసం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో భానుప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. విచారణ తర్వాత అరెస్టు చేసి శనివారం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. జాడ తెలియని సరీ్వస్ రివాల్వర్భానుప్రకాశ్ ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి జీవితాన్ని దుర్భరంగా చేసుకున్నాడు. ఏకకంగా సరీ్వస్ రివాల్వర్‌ను పొగొట్టుకున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు ఎంత విచారించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. చివరికి రైలులో ప్రయాణిస్తుండగా పోయినట్లు అతను తెలపడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని తెలిసింది. -
వైఎస్ జగన్‌పై అదే పనిగా వ్యక్తిత్వ హననం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపె రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..:ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు: కొమ్మూరి కనకారావుఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం జగన్‌గారు మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్ చేశాయి.జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో డిబేట్లు పెట్టి అదేపనిగా అక్కసు వెళ్లగక్కడం, నిందించడం, బురద చల్లడం, దుయ్యబట్టడం జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే కాకుండా, అది ప్రజాస్వామ్య విరుద్ధం. చంద్రబాబుపై అంత ప్రేమ ఉంటే, పేపర్, ఛానల్‌కు ఆయన పేరు, ఫోటో పెట్టుకోవాలి. అంతతప్ప, న్యూట్రల్ జర్నలిజమ్ పేరుతో అంత దిగజారి వ్యవహరించొద్దు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.వాస్తవాలు ప్రస్తావిస్తే.. దుయ్యబడతారా?: అంకంరెడ్డి నారాయణమూర్తిరాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికీ వారికి స్పష్టత ఇవ్వలేకపోతోంది. తమకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో రైతు రామారావు గుండెపోటుతో మరణించాడు. ఈ వాస్తవాలను జగన్‌గారు ప్రశ్నిస్తే.. ఆయన అనని మాటలు అన్నట్లు, పూర్తిగా వక్రీకరిస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషం చిమ్మాయి. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిని నిందించాయి. జగన్ విశేష ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చి, విషం చిమ్ముతూ గతి తప్పి విపరీతంగా వ్యాఖ్యలు చేశాయి.రాజధాని ప్రాంతంలో తగిన నిర్మాణాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోయినా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పా? ఆ ప్రాంత రైతుల సమస్యలు ప్రస్తావించడం నేరమా?. వాటికి ప్రభుత్వం తరపున ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వకాల్తా పుచ్చుకుని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిపై విరుచుకు పడడం, పాతాళానికి దిగజారిన వారి జర్నలిజం విలువలను చూపుతోంది. అందుకే మీడియా ముసుగులో వారు చేస్తున్న అనైతిక పనులపై తగిన చర్య తీసుకోవాలని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఇంకా ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని నారాయణమూర్తి స్పష్టం చేశారు. -
బంజారాహిల్స్‌లో మరో చరిత్ర..!
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి(16), అబ్బాయి(16) ఇద్దరూ పదో తరగతి వరకు ఒక్కటే పాఠశాలలో చదువుకుంటుండగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాది క్రితం వరకూ ఇద్దరూ ప్రేమ పక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో అమ్మాయి, అబ్బాయి కుటుంబీకులకు తెలిసి మందలించి ఒకనొకరు కలుసుకోకుండా షరతులు విధించారు. సినీ ఫక్కీలో గత మరో చరిత్ర సినిమాను తలపించేలా అమ్మాయిని, అబ్బాయిని విడదీసి మేజర్లు అయ్యేవరకు కలుసుకోవద్దని చెప్పారు. దీంతో సదరు అబ్బాయి పాల్వంచలోనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, అమ్మాయి హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ బస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే కుట్టు శిక్షణ తీసుకుంటున్నది. ఈ నెల 31వ తేదీన సదరు అబ్బాయి హైదరాబాద్‌కు వచ్చి ఎన్బీటీనగర్లోని అమ్మాయి ఇంటికి వెళ్లి అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. ఈ విషయం గత నెల 31న రాత్రి 8 గంటల ప్రాంతంలో అబ్బాయి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌కు పరుగులు తీశారు. ఎన్బీటీనగర్లోని అమ్మాయి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఒకే గదిలో కనిపించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు బాలుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు. అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 16 ఏళ్ల వయస్సులో ఈ ఇద్దరు మైనర్లు మరో చరిత్ర సినిమాను తలపించేలా ప్రేమించుకోవడం, తల్లిదండ్రులు విడగొట్టడం, మళ్లీ కలుసుకోవడం, వ్యవహారం పోలీసుల దాకా రావడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ పేలుడు
సోలన్ జిల్లా: హిమాచల్ ప్రదేశ్‌లో పేలుడు సంభవించింది. సోలన్ జిల్లాలోని నాలాగఢ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భవనాలు దెబ్బతిన్నాయి. పీఎస్‌లో ఇన్వెస్టిగేషన్ రూమ్ కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. 40 నుండి 50 మీటర్ల వరకు ఈ పేలుడు ప్రభావం చూపించింది. పేలుడు తీవ్రతకు రంధ్రం ఏర్పడింది. సమీపంలోని కొన్ని చెట్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.బద్ది ఎస్పీ వినోద్ దీమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పేలుడు పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో జరిగిందని.. అది పోలీస్ శాఖకు చెందిన స్థలం కాదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరు గాయలేదని ఎస్పీ తెలిపారు. -
10 నిమిషాల్లో 200 మంది పోలీసులను దించుతా..!
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ముందు గంటపాటు హైడ్రామా నడిచింది. తన కొడుకుతోపాటు మరో ముగ్గురిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారని శనివారం రాత్రి ఓ మహిళ రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం తాడేపల్లి ఎస్ఐ సాయి తమ ఇంటికి వచ్చి తన కుమారుడిని గంజాయి విక్రయిన్నాడనే ఆరోపణలతో స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. ఆధార్ కార్డు, ఇతర ప్రూఫ్‌లు ఇస్తే పంపించేస్తామని నమ్మబలికారని తెలిపారు. అవన్నీ తీసుకున్నాక స్టేషన్లో కాకుండా పక్కన వేరే గదిలో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. తమ కుమారుడు తేజ ముంతతోపాటు గాందీనగర్‌లో నివసించే దినేష్ ప్రేమ్‌చంద్, యర్రబాలెంలో నివాసం ఉండే పవన్‌లను కూడా ఇదే తరమాలో తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై నిలదీస్తే అసభ్య పదజాలంతో తనను దూషించారని వాపోయారు. ఇంతలో ఒక నాయకుడు అటుగా రావడంతో సీఐ అరాచకాలను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కాళ్లు పట్టుకుని ఆమె బతిమిలాడారు. ఓ నాయకుడు ఆ మహిళను సీఐ వద్దకు తీసుకెళ్లగా అందరి సమక్షంలోనే ‘‘200 మంది పోలీసులను 10 నిమిషాల్లో దించుతాను. మర్యాదగా చెప్పింది చెయ్యి. కపట్రాల తిప్పలో నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను’’ అంటూ పెద్దపెద్దగా మాట్లాడారు. విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమెపై కేసు పెట్టండని సిబ్బందిని ఆదేశించారు. మరో మహిళ కూడా సీఐ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా చూసి ఎస్ఐలు అవాక్కయ్యారు. సోమవారం అదుపులోకి తీసుకున్న వారిపై శనివారం ప్రకాషః్ నగర్ శ్మశానవాటిక వద్ద పట్టుకున్నట్లు కేసు నమోదు చేయడం ఏంటని, ఇది తమ తలకు చుట్టుకునేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సక్రమంగా ఉన్నతాధికారులు విచారణ చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. -
అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డిపై మనుబోలు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కాకాణి.. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే కేసులు కడతారా? అంటూ మండిపడ్డారు.కావాలనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు. మా పార్టీ నాయకులు ఫిర్యాదులు ఇస్తే పట్టించుకోవడం లేదు. కూటమినేతలు తప్పుడు ఫిర్యాదులు ఇస్తే వెంటనే అక్రమ కేసులు కడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నేను బతికున్నంత కాలం అండగా నిలబడతా’’ అని కాకాణి పేర్కొన్నారు. -
ఇదోరకం ప్రేమ!
అది అక్టోబర్ 30, 2024. బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో 45 ఏళ్ల ఇన్స్పెక్టర్, తన దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. హఠాత్తుగా.. ఆయన అధికారిక ఫోన్‌కి ఒక అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత.. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు వెల్లువెత్తాయి. అవతలి నుంచి మాట్లాడుతున్న మహిళ మాటలు అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నాయి. మొదట్లో ఇన్స్పెక్టర్ దాన్ని ఏదో సాధారణ ఫిర్యాదు అనుకున్నారు. కానీ, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది!ప్రేమించకపోతే ఉద్యోగం తీయిస్తా.. ఆ మహిళ పదేపదే ఫోన్ చేసింది. తనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి వంటి అత్యున్నత రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడం మొదలుపెట్టింది. వాట్సాప్‌లో ఆ ప్రముఖులతో తాను ఉన్న ఫొటోలను పంపింది. ఆమెది ఫిర్యాదు కాదని, ప్రేమ ప్రతిపాదన అని ఇన్స్పెక్టర్కు అర్థమైంది. ‘నా ప్రేమను అంగీకరించండి. లేదంటే, నా పలుకుబడిని ఉపయోగించి మీ ఉద్యోగాన్ని, కెరీర్‌ను నాశనం చేస్తాను’.. అంటూ బెదిరింపులకు దిగింది. నిందితురాలి అధికారం, పలుకుబడి ఇన్స్పెక్టర్ను మానసిక ఆందోళనకు గురిచేసింది.రక్తంతో లేఖ అధికారిక విధులకు ఆటంకం కలుగుతుండడంతో, ఇన్స్పెక్టర్ ఆమెను పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని పదేపదే సూచించారు. కానీ, ఆమె స్టేషన్‌కు రాలేదు.. వేధింపులు కూడా ఆపలేదు. నవంబర్ 7వ తేదీన ఆమె వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఆ మహిళ ఏకంగా ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అతనికి ఒక కవరును అందజేసింది. ఆ కవరులో కొన్ని మాత్రలు, చేతితో రాసిన లేఖలు ఉన్నాయి. అత్యంత భావోద్వేగపూరితంగా ఉన్న ఆ లేఖలు తన రక్తంతో రాసినవని ఆమె స్పష్టం చేసింది. ఇది ఆమె తీవ్రమైన మానసిక సమస్యకు నిదర్శనం. ఇన్స్పెక్టర్ అధికారిక డ్యూటీ నంబర్‌కు అనవసర కాల్స్, మెసేజ్‌లు పంపిస్తూ.. ఆయన రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తూనే ఉంది. పోలీసుల విచారణలో, ఈ మహిళ గతంలో కూడా ఇతర పోలీసులు, ప్రభుత్వ అధికారుల్ని ఇలాగే వేధించినట్లు వెల్లడైంది.ఆత్మహత్య చేసుకుంటా.. డిసెంబర్ 12న, ఇన్స్పెక్టర్పై వేధింపుల పర్వం తారస్థాయికి చేరింది. ఆ మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, అందరూ చూస్తుండగానే అరిచింది. ‘నా ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. నీ ఉద్యోగాన్ని, కెరీర్‌ను నాశనం చేస్తాను’.. అని బెదిరించింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో, రామమూర్తి నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, ఆ మహిళపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధులకు ఆటంకం కలిగించడం), 351(2) (క్రిమినల్ బెదిరింపు), 221 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విచిత్ర కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒక పోలీసు అధికారికి తన విధి నిర్వహణలో ఎదురైన ఈ ‘ప్రేమ ఉచ్చు’రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..
కృష్ణా జిల్లా: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి.. కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది. -
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా మెరిసిన శామీర్‌పేట పీఎస్
దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను ఎమ్హెచ్ఏ పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్ఎస్ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించడం విశేషం.ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్‌పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు. -
ఆ.. ఇప్పుడు గుర్తొచ్చింది!
సాక్షి,హైదరాబాద్: అంబర్‌పేట పోలీసుస్టేషన్లో క్రైం సబ్–ఇన్స్పెక్టర్గా పని చేసిన భాను ప్రకాష్ రెడ్డి నోరు విప్పాడు. తన సరీ్వస్ తుపాకీని విజయవాడ తీసుకువెళ్లానని, అక్కడి ఓ లాడ్జిలో మర్చిపోయానని వెల్లడించాడు. దీంతో ఆ పిస్టల్‌ను వెతుకుతూ నగరం నుంచి రెండు ప్రత్యేక బృందాలు గురువారం అక్కడకు వెళ్లాయి. మరోపక్క ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిన భాను ప్రకాష్ రెడ్డి గడిచిన మూడేళ్లల్లో ఏకంగా రూ.1.23 కోట్లు నష్టపోయినట్లు వెలుగులోకి వచ్చింది. పుస్తకాల బ్యాగ్‌లో పిస్టల్ ఉంచి.. అంబర్‌పేట ఠాణాలో పని చేస్తూ భాను ప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీ పరీక్షలు రాశాడు. వాటికి సిద్ధం కావడానికే ఈ ఏడాది మే నుంచి రెండు నెలల పాటు సెలవులో ఉన్నాడు. నిత్యం తన టేబుల్ అరలో ఉండే తుపాకీని సెలవులో వెళ్తున్న సమయంలో తనతో పాటే తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాలు పోలీసుస్టేషన్ సీసీ కెమెరాల్లో అస్పష్టంగా రికార్డు అయ్యాయి. పోటీ పరీక్షలు రాయడానికి విజయవాడ వెళ్లిన భాను ప్రకాష్‌రెడ్డి అక్కడి ఓ లాడ్జిలో దాదాపు వారం రోజులు బస చేశాడు. పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడల్లా ఆ పిస్టల్‌ను పుస్తకాల కోసం కేటాయించిన బ్యాగ్‌లో ఉంచాడు. లాడ్జి ఖాళీ చేసి తిరిగి ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో తుపాకీ ఉంచిన బ్యాగ్‌ను తనతో తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఏమీ ఎరగనట్లు.. నగరానికి చేరుకుని, డ్యూటీలో చేరిన నాలుగైదు రోజుల తర్వాత భాను ప్రకాష్‌కు తన పిస్టల్ పోయిన విషయం తెలిసింది. ఆలోచించిన అతగాడు పుస్తకాలతో పాటు తుపాకీ ఉన్న బ్యాగ్‌ను విజయవాడ లాడ్జిలో మర్చిపోయిన విషయం గుర్తించాడు. వెంటనే ఆ లాడ్జికి వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో దాని ఆచూకీ లభించలేదు. దీనిపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇక్కడ అధికారులకు చెప్పినా తన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని, భవిష్యత్తులో మరో ఉన్నత ఉద్యోగంలో చేరడానికి అడ్డు వస్తుందని భావించాడు. దీంతో ఏమీ ఎరగనట్లు మిన్నకుండిపోయాడు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో.. ఈ నెల 12న ఆయుధాల ఆడిటింగ్ జరగడంతో ఇతడి పిస్టల్ మిస్సైన విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి రకరకాలుగా చెబుతూ ఉన్నతాధికారులతో పాటు సహోద్యోగులను ఇతగాడు ముప్పతిప్పలు పెట్టాడు. ఆ తుపాకీని తాను పోలీసుస్టేషన్లోనే ఉంచానని, ఎవరో ఎత్తుకుపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఇతగాడికి రికవరీ చేసిన బంగారం కుదువపెట్టిన చరిత్ర ఉండటంతో ఈ తుపాకీ కూడా తాకట్టు పెట్టి ఉంటాడని అధికారులు అనుమానించారు. అతగాడిని బుధవారం రాత్రి సికింద్రాబాద్‌లోని టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి తరలించి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం మొత్తం అతగాడు బయటపెట్టాడు. ఇప్పుడు గుర్తుకు వచి్చందని.. ఆ తుపాకీని విజయవాడలో మర్చిపోయానని వెల్లడించాడు. టేబుల్ సొరుగులో తూటాలు నగరం దాటి బయటకు వెళ్లేప్పుడు తన వెంట తుపాకీ తీసుకువెళ్లడం భాను ప్రకాష్‌కు అలవాటు. అలాంటి సందర్భాల్లో అందులో మ్యాగ్జైన్ ఉన్నప్పటికీ... తూటాలు మాత్రం తీసుకువెళ్లడు. ఈసారి తూటాలు అతడి టేబుల్ సొరుగులో ఉన్నతాధికారులకు లభించాయి. దీంతో కొంత వరకు ఊపిరి పీల్చుకున్న అధికారులు తుపాకీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్‌కు అలవాటుపడిన భాను ప్రకాష్ తన జీతంతో పాటు కట్నకానుకలూ ఖర్చు చేసేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో అతడి తల్లి పొలం అమ్మి రూ.50 లక్షలు ఇచి్చనట్లు సమాచారం. -
ప్రేమించిన యువతి మోసం.. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్ జిల్లా: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 26 ఏళ్ల పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని సంస్కృతి టౌన్షిప్లో స్నేహితులతో కలిసి నివసిస్తూ గత నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒక యువతిని ప్రేమించేవాడు. ఇద్దరూ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో శారీరకంగా దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆమె ఫోన్లో మరో వ్యక్తితో తీసుకున్న ఫొటోలు కనిపించడంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా అనుమానపడ్డాడు. సదరు ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేసింది.ఆ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా ఆమెకు కాల్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఈ విషయం అతని తండ్రికి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరానికి చేరుకున్నారు.ప్రేమించిన యువతి మోసగించిందన్న బాధతోనే నా కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు అంటూ మృతుడి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్ -
డెంటల్ డాక్టర్.. నాకు మెంటల్ ఎక్కిస్తున్నాడు..!
నిజామాబాద్: జిల్లాలో ఇటీవల ఓ డెంటల్ డాక్టర్‌పై మహిళ ఫిర్యాదు చేయడం పెనుదుమారం రేపింది. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, వాట్సాప్‌లో వీడియో, ఆడియో కాల్స్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సదరు కేసులో నిందితుల వేధింపులకు సంబంధించిన సాక్ష్యాలను సైతం చూపించగా, పోలీసులు నిర్భయ కింద కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. అయితే, పలుకుబడి ఉన్న ఓ సంఘం నేత మధ్యవర్తిత్వంతో రూ. లక్షలు చేతులు మారడంతో నామమాత్రపు కేసులతో మమ అనిపించారనే చర్చ జరుగుతోంది. బాధితురాలు నేరుగా నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను డెంటల్ డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్ అనే వ్యక్తులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే నాన్‌బెయిల్‌బుల్ కేసు పెడతామని చెప్పినట్లు తెలిసింది. అయితే అటు తర్వాత సదరు డెంటల్ వైద్యుడు అమర్ అందుబాటులో లేడని ఇంటికి నోటీసు ఇచ్చి వచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.విచారణ పేరుతో సాగదీతడెంటల్ డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌పై మహిళ ఫిర్యాదు తర్వాత నెలకొన్న పరిస్థితులు తారుమారు అయ్యాయి. మొదట్లో సీరియస్‌గా స్పందించిన పోలీసులు అటు తర్వాతా నోటీసు, నామామత్రపు కేసు పేరిట సాగదీసేలా వ్యవహారిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఓ సంఘం నేత సదరు వైద్యుడిపై నాన్‌బెయిలబుల్ కేసు కాకుండా చిన్నపాటి కేసు నమోదు చేయించేలా చక్రం తిప్పాడని చర్చ జరుగుతోంది. సుమారు రూ. 30 లక్షలకు డీల్ కుదిరిందని, అందుకే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.కేసు నమోదైంది..మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్లో డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌లపై కేసు నమోదైంది. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. నోటీసులు కూడా ఇచ్చారు. గతంలో ఉన్న సీఐ వద్ద పూర్తి సమాచారం ఉంది. – సతీశ్, సీఐ, నాలుగో టౌన్విచారణ జరుగుతోంది..డాక్టర్ అమర్, అయిల్ గంగాధర్‌లపై నమోదైన కేసు విచారణ జరుగుతోంది. నాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. స్థానిక ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్ విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయి. – శ్రీనివాస్ రాజ్, సీఐ -
అర్ధరాత్రి భారీ పేలుడు.. 30 మంది..!
-
జమ్మూ కాశ్మీర్ బ్లాస్ట్.. పేలుడు ధాటికి 300 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ బాడీలు
-
బాబోయ్.. ఇలాంటి పెళ్లాం పగోడికి కూడా వద్దు!
వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లిసంబంధం. యువ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా, భర్త ఆఫీస్ పోయేటప్పుడు భార్య ఆ రోజు వరకు ఉన్న ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ కాలింగ్ ఎంత ఉందో నోట్ చేసుకోవడంతో పాటు, కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఆఫీసుకు సెలవు పెట్టి బయటకు వెళ్లినా అనుమానించడం సాధారణమైంది. తనతో పెళ్లి ఇష్టం లేకే ఇలా చేస్తోందని భర్త భావించాడు. అసలు విషయమేమిటో బోధపడక ముందు వీరి పంచాయితీ పెద్దల వరకు, అట్నుంచి మహిళ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.ఇద్దరు ఉన్నత చదువులు పూర్తి చేశారు. మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సోషల్‌మీడియాలో ఏర్పడిన స్నేహం పెళ్లివరకు వచ్చింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన ఇద్దరి మధ్య నెలకొన్న అనుమానాలతో ఆరు నెలలకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఠాణాకు చేరారు. ఇలా పెరిగిన సోషల్‌మీడియా వినియోగం, మైక్రో కుటుంబాలతో సర్ది చెప్పేవారు లేక కుటుంబాలు కూలుతున్నాయి.సాక్షి పెద్దపల్లి: నూరేళ్లు సాఫీగా సాగాల్సిన భార్యాభర్తల జీవితం పట్టుమని నెలలు కూడా ఉండట్లేదు. అనుమానం, వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం, చిన్నపాటి తగాదాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కారణాలు ఏవైనా.. కారకు లు ఎవరైనా.. అన్నింటా ఆమే సమిదగా మారు తోంది. వేధింపులు, చిత్రహింసలు, భరించలేని స్థాయికి చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోజుకు పదుల సంఖ్యలో జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. మద్యానికి బానిసవడం, అదనపు కట్నం, ఆస్తి కోసం ఇలా కారణమేదైనా మహిళకు వేధింపులు తప్పడం లేదు. మరికొన్ని కేసుల్లో ఆలుమగల మధ్య తలెత్తిన గొడవలను సరిదిద్దాల్సిన పెద్దలు రెచ్చగొడుతున్నారు. తమవారిదే పైచేయి కావాలనే పట్టుదలతో దంపతుల మధ్య ఎడబాటు పెంచుతున్నారు. మూడో వ్యక్తి జోక్యంతోనే సంసారాన్ని చేతులారా చేసుకుంటున్నారని సైకాలజిస్టులు నాశనం చెబుతున్నారు.నాలుగు నెలల్లో..జిల్లాలోని మహిళా సంబంధిత కేసుల సత్వర పరిష్కారం కోసం జిల్లాకేంద్రంలో మహిళ పోలీస్ స్టేషన్‌కు జూన్‌లో ప్రారంభించారు. 144 రోజుల్లో 475 కేసులు నమోదు కాగా, అందులో 395 కేసులను పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్క రించారు. 45 మందిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయ గా, 90మంది కేసులను విత్ర్డా చేసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ను రోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆశ్రయిస్తున్నారంటే సమస్య ఏస్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆధిపత్య ధోరణి, పెద్దల జోక్యం, అనుమానాలతో రాణా మెట్లు ఎక్కుతున్నారు.పోలీసులు ఏం చెబుతున్నారంటే?కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులు కనిపించవు. కానీ, ఒకరికొకరు బద్ద శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో పది, ఇరవై ఏళ్లుగా సంసారం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అధికశాతం పెళ్లయిన ఏడాది నుంచి మూడేళ్ల లోపువారే ఎక్కువ గా స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పంథాలకు పోతున్నారు. ఎక్కువగా మొబైల్ వినియోగం పెరగడం, భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవలను భూతద్దంలో చూడడం తో అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతు న్నారు. వారికి దశల వారీగా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ సాధ్యమైనంత వరకు ఇద్దరినీ కలిపేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.కౌన్సెలింగ్ ఇస్తున్నాంప్రధానంగా మద్యం కారణంగా గొడవలు, వరకట్న వేధింపులు, అనుమానాలతో గొడవ లు పడుతున్న కేసులు ఎక్కువగా వస్తు న్నాయి. సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే దంపతులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. ఆలుమ గల బంధం ఎంతో పవిత్రమైంది. ఏమైనాసమస్యలుంటే పరిష్కరించుకోవాలి. - కె.పురుషోత్తం, సీఐ, మహిళా పోలీస్ స్టేషన్ -
లింగాల పీఎస్ ముందు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: లింగాల పోలీస్ స్టేషన్ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు. వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయి. గత రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి ఆందోళన చేపట్టారు.రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే నిందితులను పట్టుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ అవినాష్‌రెడ్డి ధర్నాకు దిగారు. -
శ్రీవారి కల్యాణకట్టలో ఆకతాయికి దేహశుద్ధి
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం కల్యాణకట్ట (కేశఖండన శాల)లోని స్నానపు గదుల్లో మహిళలు స్నానం చేస్తుండగా చూస్తున్న ఓ ఆకతాయిని కల్యాణకట్ట, సెక్యూరిటీ సిబ్బంది శుక్రవారం పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. స్వామివారి కల్యాణకట్టలో మొక్కుబడులు తీర్చుకున్న తరువాత మహిళలు ప్రత్యేకంగా ఉన్న గదుల్లో స్నానాలు చేసి, వ్రస్తాలు మార్చుకుంటారు. గతనెల 25న ఓ భక్తురాలు స్నానం చేస్తుండగా బాత్రూం వెంటిలేటర్ (ఎగ్జాస్ట్) ఫ్యాన్ రంధ్రాల్లోంచి ఎవరో చూస్తున్నారని అక్కడి సిబ్బందికి చెప్పారు. పరిశీలించిన సిబ్బందికి ఎవరూ కనిపించలేదు. అలాగే గతనెల 27న మరో భక్తురాలు ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ యువకుడు కల్యాణకట్ట వెనుక భాగంలో తచ్చాడుతూ కనిపించాడు. వెంటనే దేవస్థానం, సెక్యూరిటీ సిబ్బంది ఆకతాయిని పట్టుకుని, దేహశుద్ధి చేశారు. ఫొటోలు, వీడియోలు తీశాడేమోనన్న అనుమానంతో అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అందులో ఏమీ లేవు. రెండు చోరీ కేసుల్లో నిందితుడు.. ఆకతాయి విజయనగరం జిల్లా తెర్ల మండలంలోని పెరుమాళ్ల గ్రామానికి చెందిన మైలపల్లి పైడిరాజుగా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే రెండు చోరీ కేసులు ఉన్నట్టు నిర్ధారించారు. కల్యాణకట్ట వద్ద జరిగిన ఘటనపై దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జీవీఎస్ పైడేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు బాత్రూమ్లలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించి, వాటి రంధ్రాలు, దుస్తులు మార్చుకునే గదుల్లో కిటికీలను సైతం మూసివేశారు. కల్యాణకట్ట వెనుక నుంచి ఎవరూ లోపలికి వచ్చేందుకు వీలు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. -
‘చిరంజీవి’ కేసులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి కొణిదెల చిరంజీవి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో నమోదైన రెండు కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు డీప్‌ఫేక్‌పై శనివారం, అభ్యంతరకర వ్యాఖ్యపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోని నిందితులను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. -
నమ్మించి మోసం చేశాడు.. ఎస్ఐ సస్పెండ్
బెంగళూరు: మహిళపై అత్యాచారం ఆరోపణలతో డీజే.హళ్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సునీల్‌ను సోమవారం నగర పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ సస్పెండ్ చేశారు. ఎస్ఐ, ఏఎస్ఐ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామని సింగ్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్ఐ సునీల్ పై కొన్నిరోజుల క్రితం మైనారిటీ వర్గానికి చెందిన మహిళ అదే ఠాణాలో ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాను బ్యూటిషియన్‌గా పనిచేస్తానని, పని మీద ఓ సారి ఠాణాకు వెళ్లగా ఎస్ఐ సునీల్ ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టాడని ఆమె ఆరోపిస్తోంది. డీజీపీ సలీంకు కూడా ఫిర్యాదు పంపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్ఐని, ఆయనకు కొమ్ముకాసిన ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. Rape Allegations Against Inspector Sunil | ಮದುವೆ ಆಗೋದಾಗಿ ನಂಬಿಸಿ ಯುವತಿ ಮೇಲೆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಸುನಿಲ್ ಅತ್ಯಾಚಾರ......#DJHalliInspectorRapeCase #InspectorSunil #PrivateVideo #DJHalli pic.twitter.com/GTunaGBw8b— Sanjevani News (@sanjevaniNews) October 22, 2025 -
సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ బాలికపై లైంగికదాడి
కొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్ఫోన్లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు. ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించి..
కొరాపుట్(ఒడిషా): భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రించాడో ప్రబుద్ధుడు. ఆయన పోలీసు కావడం విశేషం. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఎంపీ కాలనీలో ఐఆర్బీ జవాన్ శివ శంకర్ పాత్రో నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి అతని భార్య ప్రియాంక పండా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. అందరూ ఇది ప్రమాదమే అని అనుకున్నారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కొరాపుట్‌లో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కేసు మలుపు తిరిగింది. వారు తమ కుమార్తె మృతదేహం చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధికి చెందిన తరణి పండా తన కుమార్తె ప్రియాంకని నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాంకి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ శివ శంకర్ పాత్రోకి ఇచ్చి గత ఏడాది జులై 11న టెక్కలిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చారు. నూతన దంపతులు కొరాపుట్ ఓఎంపీ కాలనీ నివాసం ఉండడంతో వారికి అవసరమైన సారె కింద ఇంటి సామగ్రి ఇచ్చారు. కానీ పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం ప్రియాంకపై భర్త భౌతిక దాడులు చేసేవాడు. ఇది తెలిసి కన్నవారు తమ శక్తి మేరకు అదనపు కట్నం పంపుతుండేవారు. భర్త వేధింపులతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి సెప్టెంబర్ 4న తిరిగి కొరాపుట్ వచ్చింది. కానీ వేధింపులు ఆగలేదు. పుట్టింట తండ్రి ఆరోగ్య రీత్యా గత కొద్ది రోజులుగా వేధింపులు కన్నవారికి చెప్పలేదు. బుధవారం రాత్రి 8 గంటలకు వీడియో కాల్ ద్వారా ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడింది. 9 గంటలకు శివ శంకర్ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే రమ్మని టెక్కలికి ఫోన్ చేశాడు. వెంటనే వీరందరూ కొరాపుట్ చేరుకొని అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతురాలి తలపై ఇనుప రాడ్డుతో మోది చంపినట్లు తెలిసింది. దీంతో వెంటనే శివ శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక చనిపోయాక శివశంకర్ తన తల్లిని, ఏడు నెలల కుమార్తెను ఇంటి బయట కూర్చోబెట్టాడు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి ఇంటికి నిప్పంటించాడు. మొదటి అంతా ఇది అగ్ని ప్రమాదమే అనుకున్నారు. కానీ మృతురాలి తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో శివ శంకర్ తన నేరం అంగీకరించారు. -
CI అయినా సరే.. అవమానిస్తే తిరగబడతా..
-
కిడ్నాప్ చేసి...తుపాకీతో బెదిరించి..
వెంగళరావునగర్: రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని ఆఫీసుకు తీసుకెళ్లి, అనంతరం కిడ్నాప్ చేసి తుపాకులతో బెదిరించి నగదు డిమాండ్ చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్ బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 6న తన స్నేహితుడితో కలిసి ఎల్లారెడ్డిగూడలో నడిచి వెళుతుండగా వెంకట్స్వరూప్ అనే వ్యక్తి అమీర్‌పేటలోని తన ప్లాట్‌కు రమ్మని మనోజ్‌కుమార్‌ను కారులో తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మనోజ్కుమార్పై దాడిచేసి తుపాకులతో బెదిరించి ఎల్లారెడ్డిగూడలోని శివసాయి అపార్ట్‌మెంట్స్‌కు తీసుకెళ్ళారు. అక్కడ అతడిని బంధించి తమకు రూ.10 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతడి భార్య, కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించాడు. బాధితుడు తన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టగా వెంకటస్వరూప్ మరోసారి మనోజ్‌కుమార్ భార్యకు ఫోన్ చేసి మైత్రీవనం 1039 పిల్లర్ వద్దకు నగదు, తీసుకురావాలని చెప్పాడు. ఆమె పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళగా ముగ్గురు నిందితులు బైక్‌పై పారిపోగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు. -
గొంతు కోసుకొని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తకు వైద్యం చేయించేందుకు వచ్చి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం, లఖింపూర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ అపూర్వ జ్యోతి శర్మ ఆరు నెలలుగా కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతున్నాడు. భార్య ప్రణిత శర్మ(45), ఆమె సోదరి భర్తతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పిటల్లో ఈ నెల 20న చేర్పించారు. ఏఐజీలో చికిత్స తీసుకుంటూ గచ్చిబౌలిలోని బాబుఖాన్ లేన్‌లోని ఆకాశ్ హోటల్ రూమ్ నెంబర్ 303లో ఉంటున్నారు. ఈ నెల 25న సోదరి భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అపూర్వ జ్యోతి శర్మకు ట్రీట్మెంట్ పూర్తి కావడంతో మంగళవారం తిరిగి వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి హోటల్లో నిద్రకు ఉపక్రమించిన భర్త 11.30 గంటల సమయంలో లేచి చూడగా భార్య కనిపించలేదు. బాత్రూమ్ డోర్ వెనక గడియ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా పలక లేదు. తలుపు తెరిచేందుకు ప్రయత్నింగా వీలు కాలేదు. పక్క గదిలో ఉన్న వారి సహాయంతో డోర్ పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. లివర్ వ్యాధితో భర్తకు ప్రాణ భయం ఉంటుందేమోనని ఆలోచిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని, సోమవారం రాత్రి దేవున్ని ప్రారి్ధంచిందని, అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె తరపు బంధువులు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృత దేహన్ని ఏఐజీ ఆప్పత్రి మార్చురీలో భద్రపరిచారు. -
‘గెస్ట్’ పోలీస్ స్టేషన్!
వరంగల్ జిల్లా: గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు ‘గెస్ట్’ పోలీస్ స్టేషన్ అనే పేరుంది (నిక్‌నేమ్). పోలీసు అధికారులు ఈ స్టేషన్‌కు అలా గెస్ట్‌లా వచ్చి కొన్ని రోజులు పని చేసి బదిలీపై వెళ్లిపోతుంటారు. సీఐలు అయితే మహా అంటే ఏడాది లోపు.. ఎస్సైల విషయం చెప్పాల్సిన పనే లేదు. బదిలీపై వచ్చిన ఎస్సైలు ఇక్కడ ఎన్ని నెలలు ఉంటారో లేదో తెలియదు. కొందరైతే పోస్టింగ్‌పై వచ్చి రెండు, మూడు నెలల లోపే బదిలీ అవుతున్నారు. గతంలో అయితే బదిలీపై వచ్చిన పోలీసు అధికారులు కనీసం ఏడాది, రెండేళ్ల వరకు విధులు నిర్వర్తించేవారు. దీంతో వారికి స్థానిక పరిస్థితులపై, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అవగాహన కోసం అవసరమైన సమయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వచ్చిన అధికారికి మండలంలోని గ్రామాల పేర్లు, రూట్లు, స్థానిక స్థితిగతులు తెలుసుకునే లోపే బదిలీ అవుతుండడం విశేషం. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకత ఉంది. ఈ పోలీస్ సేషన్ పరిధిలోని గీసుకొండ రూరల్ మండలంలోని గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ నగరంలోని 15,16,17 డివిజన్లు ఉన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉండే మండలంలో ప్రశాంతంగా ఉన్నట్లే కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయని ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన పలువురు పోలీసు అధికారులే చెబుతున్నారు.అలాంటి పరిస్థితిలో డ్యూటీలో చేరిన నెలలోపే బదిలీ చేస్తుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గీసుకొండ సీఐ మహేందర్‌ను ఇక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ఇక్కడికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన స్థానంలో పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వర్‌ను గీసుకొండకు బదిలీ చేశారు. విశ్వేశ్వర్ ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్సైగా 2012 జూలై నుంచి 2013 ఆగస్టు వరకు పని చేశారు. అప్పట్లో ఆయన పనితీరును చూసి మండల వాసులు గబ్బర్‌సింగ్ అని పిలిచేవారు. -
ఛాతీలో కత్తితో పోలీస్ స్టేషన్‌కు బాలుడు
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల ఓ బాలుడిపై కొందరు కత్తితో దాడి చేశారు. ఛాతీలో దిగబడిన కత్తితో రక్తమోడుతూనే అతడు పోలీస్ ఠాణాకు చేరుకున్నాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి, ఛాతీలో దిగి ఉన్న కత్తిని విజయవంతంగా తొలగించి, బాలుడి ప్రాణాలు కాపాడారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులైన ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని పహార్గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 15 రోజుల క్రితం నిందితుల్లో ఒకరిని కొందరు బాలురు కొట్టారు. దీని వెనుక ఉన్నది బాధిత బాలుడేనని నిందితుల అనుమానం. ఇదే కారణంతో ఆ బాలుడిని స్కూలు వద్ద ముగ్గురూ అడ్డుకున్నారు. పగిలిన బీర్ బాటిల్‌తో పొడుస్తానంటూ ఒకడు బెదిరించగా, అదే సమయంలో మరొకడు కత్తితో ఛాతీపై పొడిచాడు. ఆ వెంటనే బాలుడు పహార్గంజ్ పోలీస్ స్టేషన్‌కు రాగా, పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొన్ని గంటల్లో ఆరాంబాగ్ ప్రాంతంలో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు వాడిని కత్తిని, పగిలిన బాటిల్‌ను స్వా«దీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు పనిచేయడం లేదా?
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని పోలీస్ స్టేషన్లలో కెమెరాలు పనిచేయడం లేదని, కస్టడీ మరణాల కేసుల్లో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఇవ్వడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా స్వీకరించింది. పిల్ వేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఆదేశించింది. గత 8 నెలల్లో పోలీసు కస్టడీలో 11 మరణాలు సంభవించాయని హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ వార్తను ధర్మాసనం ప్రస్తావించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డింగ్‌ను కనీసం ఏడాదిపాటు ఉంచాలని 2020లో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. పోలీస్ స్టేషన్ల తరహాలోనే ఇంటెలిజెన్స్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, విచారణలు నిర్వహించే, అరెస్టు చేసే అధికారం ఉన్న ఇతర ఏజెన్సీ కార్యాలయాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్టేషన్‌లోని ఏ విభాగాన్ని కూడా బయట నిర్వహించరాదని, అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద కెమెరాలు తప్పనిసరని తెలిపింది. రాత్రి పూట దృశ్యాలను సైతం వీక్షించగలిగేలా అమర్చాలని, వీడియో, ఆడియో రెండింటినీ రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. పరమ్‌వీర్ సింగ్ సైని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువరించింది. అంతకుముందు, 2015లో డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులోనూ మానవ హక్కుల ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నివేదిక కోరగా.. కేవలం 14 మాత్రమే స్పందించాయి. వాటిలోనూ పోలీస్ స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, పనితీరు గురించిన సరైన వివరాలు లేకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సీసీ కెమెరాల్లేవ్
సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీస్స్టేషన్లలో సరిపడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని అడ్వకేట్ కమిషనర్ ఎమ్మార్కే చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు. ఉన్న కెమెరాలూ స్టేషన్ మొత్తాన్ని కవర్ చేయడం లేదని వివరించారు. రాష్ట్రంలోని అన్నీ పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసులో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పణకు ధర్మాసనం అడ్వొకేట్ కమిషనర్ చక్రవర్తిని నియమించింది. మంగళవారం తాజా విచారణ సందర్భంగా అడ్వొకేట్ కమిషనర్ చక్రవర్తి తన నివేదికను కోర్టుకు సమర్పించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుంటూరు జిల్లాలోని అమరావతి, తుళ్లూరు, అరండల్‌పేట, నల్లపాడు పోలీస్స్టేషన్లలో సగటున 10 సీసీ కెమెరాలు ఉన్నాయని, మంగళగిరిలో మాత్రం 11 ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇవి ఎంత మాత్రం సరిపోవని వివరించారు. రెండు ఫ్లోర్లు ఉన్న పోలీస్స్టేషన్లలో కింది ఫ్లోర్లో మాత్రమే సీసీ టీవీలు ఏర్పాటు చేశారని, మరో ఫ్లోర్లో వాటిని అమర్చలేదని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీసీ టీవీల లభ్యత విషయంలో ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లకు అధికారాలు లేవని, డిజిటల్ వీడియో రికార్డర్ నుంచి ఫుటేజీ పొందేందుకు ఆయా స్టేషన్ల అధికారులకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఏదైనా కేసు దర్యాప్తు, విచారణ విషయంలో సీసీటీవీ ఫుటేజీ కావాలంటే ఎస్పీ కార్యాలయం నుంచి తెప్పించుకోవాల్సి వస్తోందన్నారు. అత్యవసరమైతే పాస్వర్డ్ ఇస్తారని, ఫుటేజీ తీసుకున్న తరువాత ఆ పాస్‌వర్డ్‌ను మార్చేస్తారని పెనమలూరు ఎస్‌హెచ్‌వో తనకు చెప్పారని అడ్వొకేట్ కమిషనర్ హైకోర్టుకు నివేదించారు. మిగిలిన స్టేషన్లకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ లేరని, దీంతో వీడియో రికారి్డంగ్, దాని లభ్యత, డీవీఆర్‌ల నుంచి ఫుటేజీ సేకరణ వంటి వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోయానని చక్రవర్తి తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తిరుమాను విష్ణుతేజ స్పందిస్తూ, డీవీఆర్‌లలో రికార్డ్ అయిన ఫుటేజీ ఎక్కడ స్టోర్ చేస్తున్నారో తెలుసుకుని చెబుతానన్నారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరిస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. -
పేర్ని నానిపై అక్రమ కేసు
-
కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త
తాడేపల్లి రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు కూడా తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు. అంజలి తాడేపల్లి సలాం సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్‌రోడ్‌లో ఉన్న ఓ హోటల్లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నైట్ డ్యూటీకి భర్త.. ప్రియుడితో భార్య..
కర్ణాటక: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నమ్మకం, విశ్వాసం అనే వారధిపై జీవితాంతం సుఖంగా సాగాల్సిన దాంపత్య ప్రయాణానికి మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. అగ్నిగుండం సాక్షిగా కలిసి ఏడడుగులు నడిచినప్పుడు చేసుకున్న బాసలు చెదిరిపోతున్నాయి. భవిష్యత్ కోసం కన్న కలలు చెదిరిపోతున్నాయి. కుటుంబ కలహాలు, అనైతిక సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆ కుటుంబంలోని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలుకాలో గడిచిన ఐదు నెలల కాలంలో చిన్నచిన్న విషయాలు, అనైతిక సంబంధాల అనుమానాలతో ఏడుగురు మహిళలు తమ భర్తల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తల్లులు హత్యకు గురవ్వడం, తండ్రులు జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆనేకల్ తాలూకా సూర్యాసిటీ, ఆనేకల్, ఎల్రక్టానిక్‌సిటీ, హెబ్బగోడిల పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో హత్య చోటు చేసుకోగా ఆత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుంచి ఉపాధి కోసం ఆనేకల్ తాలూకాకు వలస వచ్చి ఉంటున్న కుటుంబాల్లో ఈ దారుణాలు జరిగాయి. అక్రమ సంబంధాలు, భార్యలపై అనుమానాలు, మద్యం సేవనం తదితర కారణాలతో ఈ హత్యోదంతాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. భార్య తల నరికి స్టేషన్‌కు వెళ్లిన భర్త ఆనేకల్ తాలూకా చందాపుర సమీపంలోని హిలలీగ గ్రామంలో జూన్ 8న ఓ వ్యక్తి తన భార్య తలను నరికి దానిని కవరులో పెట్టుకోని సూర్యా సిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్య మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కడతేర్చినట్లు అంగీకరించాడు. నిందితుడు హెబ్బగోడిలోని పారిశ్రామిక వాడలోని ప్రైవేటు కంపెనిలో పని చేస్తూ ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. తాను రాత్రి విధులకు వెళ్లిన సమయంలో భార్య మరొకరితో గడిపేదని, ఈ ఘటనను జీర్ణించుకోలేక భార్యను కడతేర్చినట్లు భర్త పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఏప్రిల్ 5న ఎల్రక్టానిక్‌సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో బాగేపల్లికి చెందిన మహిళను భర్త అనుమానంతో హత్య చేశాడు. మార్చి 28వ తేదిన ఆనేకల్ తాలుకా జిగణి పోలీసు స్టేషన్‌పరిధిలో మహిళ హత్యకు గురైంది. జనతా కాలనీకి చెందిన మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో ఆమె పుట్టినింటికి చేరింది. భర్త వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చాకు తీసుకొని భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. మార్చి 18వ తేన అత్తిబెలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాచమానహళ్లిలో భార్య శీలంపై అనుమానంతొ భర్త బార్యను హత్య చేశాడు. మార్చి 4న ఆనేకల్ పోఈసు స్టేషన్ పరిధిలోని గుడ్నళ్లిలో మహిళ హత్యకు గురైంది. దంపతులు మద్యం మత్తులో వాదులాడుకున్నారు. ఓ దశలో భర్త భార్యను హత్య చేశాడు.పిబ్రవరి 16న సర్జాపుర సమీపంలో తిగళ చౌడదేనహళ్లి గ్రామంలో మానసిక దివ్యాంగురాలు హత్యకు గురైంది. భర్త తన భార్యను నిర్మాన దశలోఉన్న భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేశాడు.ఫిబ్రవరి 6న హెబ్బగోడి పోలీసు స్టేషన్ పరిధిలో బిడ్డ కళ్ల ముందు ఓ వ్యక్తి తన భార్యను చాకుతో పొడిచి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి సంతానం అనాథగా మారింది. కౌన్సిలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్లు అవసరం ఆనేకల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు ఉపాధి కోసం ఇక్కడకు వలస వస్తుంటారు. ఇటీవల దంపతుల మధ్య గోడవలు, అక్రమ సంబంధాలతో హత్యలు రుగతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మా అక్క ఐపీఎస్ తెలుసా?
కర్నాటక: మద్యం మత్తులో ఐపీఎస్ అధికారి తమ్ముడు పోలీస్‌స్టేషన్‌లో హల్చల్ చేసిన సంఘటన గదగ్ జిల్లా బెటగేరి వద్ద జరిగింది. ఐపీఎస్ అధికారిణి అనితా హద్దణ్ణవర్ తమ్ముడు అక్షత్ హద్దణ్ణవర్ మద్యం మత్తులో అర్ధరాత్రి బెటగేరి ఠాణాకు కారులో వచ్చారు. తాను లాయర్నని, తన అక్క ఐపీఎస్ అని, తనని ఎవరూ ఏమీ చేయలేరని కేకలు వేయసాగాడు, అడ్డుకోబోయిన స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడాడు. చివరకు పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పంపించారు. అతని కారు మీద నో పార్కింగ్ చలానా రాశారని గొడవ చేసినట్టు సమాచారం. -
ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని న్యాయవాదితో కలిసి పీఎస్‌కు వచ్చిన వినుత
-
బూతులు తిట్టి..స్టేషన్లో కూర్చోబెట్టి!
బ్రహ్మసముద్రం: న్యాయం చేయమని వచ్చిన తమను ఎస్ఐ నానా బూతులు తిట్టడమే కాకుండా పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం బొబ్బర్లపల్లికి చెందిన మారెన్న కుమార్తె పొలంలోని వేరుశనగ పంటను ఆదివారం కొందరు గొర్రెలతో మేపారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు బ్రహ్మ సముద్రం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. ఎస్ఐ నరేంద్రకుమార్ న్యాయం చేస్తామని చెప్పి ఆమెను వెనక్కి పంపారు. సోమవారం ఆమె మళ్లీ తన భర్తతో పాటు తండ్రి మారెన్నతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే వారిపై ఎస్ఐ నరేంద్ర కుమార్ రెచ్చిపోయారు. తప్పుడు కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా బూతులు తిట్టారు. న్యాయం చేయాలని కోరితే ఇలా మాట్లాడడం తగదని మారెన్న అనగా.. ఎస్ఐ మరింత రెచ్చిపోయారు. నువ్వెవరు తప్పుడు నా కొ.. అంటూ దాష్టీకం ప్రదర్శించారు. మారెన్నతో పాటు ఆయన కుమార్తె, ఆమె భర్తను స్టేషన్లో కూర్చోబెట్టారు. పెద్ద మనిషిగా వచ్చిన తనను ఎందుకు కూర్చోమంటున్నారని మారెన్న అంటే.. అన్నీ నీకు చెప్పాలా అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రమైనా ఎస్ఐ తిరిగి రాకపోవడంతో బాధిత దళిత కుటుంబం పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపింది. దళితులమైన తమ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మారెన్న కోరుతున్నారు. -
ఎంపీపీ శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్
-
వెళ్తే.. అభ్యంతరం చెప్పొద్దు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ముప్పై, నలభై ఏళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాట బాట పట్టిన మావోయిస్టులు ప్రస్తుత సమాజ తీరు తెన్నులు తెలుసుకునేందుకు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారా? అన్న ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. ఓవైపు పెరిగిన నిర్బంధానికి తోడు మరో వైపు వరుస ఎన్కౌంటర్లతో వనాలను వీడి జనాల్లోకి వచ్చేందుకు మావోయిస్టులు మొగ్గు చూపుతున్నట్లు తాజా పరిణామాల ఆధారంగా తెలుస్తోంది. తీవ్ర నిర్బంధం.. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక సగటున పదిహేను రోజులకు ఒక ఎన్కౌంటర్ వంతున జరుగుతున్నాయి. ప్రతీ ఎన్కౌంటర్లో 10–15 మంది మావోయిస్టులు చనిపోతున్నారు. ఇలా పెరిగిన నిర్బంధం.. ఇంకో పక్క రిక్రూట్మెంట్లు తగ్గడమే కాక మావోయిస్టుల సప్లై చెయిన్ కూడా కుదుపులకు లోనైంది. దీంతో అడుగు వెనక్కి తగ్గిన మావోయిస్టులు మార్చి 28న శాంతి చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు మావోయిస్టుల కంచుకోటలుగా పేరున్న దండకారణ్యం, కర్రెగుట్టలు, ఏఓబీ, గడ్చిరోలి జిల్లాల్లో సాయుధ దళాల సంచారం కష్టంగా మారింది. ఇదే సమయంలో సరికొత్త సరెండర్ పాలసీని ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి దళ సభ్యులు, ఏరియా కమాండర్లు, జన మిలీíÙయా, పీఎల్జీఏ తదితర మావోయిస్టు పారీ్టకి చెందిన వారు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. ఈనెల 24న ఛత్తీస్‌గఢ్‌లో ఐదు జిల్లాల పరిధిలో ఏకంగా 64 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఈ కోవలోకి వస్తుంది. నంబాల మృతి తర్వాత.. శాంతిచర్చల కోసం చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోగా, మే 21న జరిగిన గుండెకోట్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు మరణం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. పైగా నంబాల కేశవరావు టీమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులు ఎన్‌కౌంటర్‌కు రెండ్రోజుల ముందు అజ్ఞాత దళాలను విడిచి వెళ్లడం పారీ్టపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. తీవ్ర నిర్బంధం నేపథ్యంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి పార్టీలో సభ్యులకు ఎదురైనట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నాయకులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ తరఫున దిశానిర్దేశం చేయడం అగ్రనాయకత్వానికి కష్టంగా మారగా.. కిందిస్థాయి నేతలకు అగ్రనాయకులతో కాంటాక్ట్ దొరకడం దుర్లభమనే పరిస్థితులు నెలకొన్నాయి. గెరిల్లాగా ఉండలేని పక్షంలో.. ఇటీవల జోరుగా కురుస్తున్న వానలతో అడవులు పచ్చబడ్డాయి. అయినా అడవులు మావోయిస్టులకు సేఫ్ జోన్‌గా ఉండలేకపోతున్నాయి. రోజురోజుకు పెరిగిన నిర్బంధం కారణంగా ఒకేచోట తలదాచుకోవడం, క్యాంప్‌లను మార్చడం క్లిష్టమైన వ్యవహారంగా మారింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఇక్కట్లు తప్పవనే భావనకు వచి్చనట్లు తెలిసింది. ఈ సమయంలో సాయుధ విప్లవ పోరాటమే మిన్న అనుకున్న వారు చావోరేవో అడవుల్లోనే అన్న నిర్ణయానికి రాగా.. అనారోగ్యం, ఇతర ఇబ్బందులు ఉన్నవారు లొంగిపోతే అభ్యంతరం చెప్పొద్దనే అభిప్రాయానికి పార్టీ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. దీంతో గడిచిన రెండు వారాలుగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు లీడర్ల లొంగుబాట్లు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. మార్పుల మదింపు నంబాల కేశవరావు వంటి నాయకుడు ఎన్కౌంటర్లో చనిపోతే, ఆయన మృతదేహానికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రభుత్వం చూపిన వైఖరిపై పౌరసమాజం నుంచి వచి్చన స్పందనను కూడా పార్టీ మదింపు చేసే ఆలోచనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ముప్పై నలభై ఏళ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మధ్య వచి్చన మార్పును అంచనా వేయడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే లొంగుబాట పట్టిన కేడర్‌ను వారించే ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పెళ్లి చేసుకోను పో.. ఎక్కువ మాట్లాడితే చంపేస్తా
-
తిరువూరు పీఎస్ లో ఎమ్మెల్యే కొలికపూడి హల్ చల్
-
Gannavaram Police Station: వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్
-
భర్త వేధింపులు తాళలేక..
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్‌లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం. గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి
తమిళనాడు: చెంగల్పట్టు సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఓ 10వ తరగతి బాలుడు రోజూ సాయంత్రం వేళల్లో ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఈనేపథ్యంలో చెంగల్పట్టులో మెకానిక్‌గా పనిచేస్తున్న పాండిచ్చేరి వాసి అమితు అబ్దుల్ ఖాదర్ 13.04.2024న ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలుడిని తన ద్విచక్ర వాహనం ఎక్కమని అడిగాడు. అతను ఎక్కనని చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, అబ్దుల్ ఖాదర్ ఆ బాలుడిని కత్తితో బెదిరించి తన బైకుపై తీసుకెళ్లి తిరుమణి రైల్వే గేట్ సమీపంలోని ఒక పొదలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.నేను పిలిచినప్పుడల్లా రాకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరించాడు. భయంతో ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈ సందర్భంలో, గత 03.05.2024న, ట్యూషన్ పూర్తి చేసుకుని, రాత్రి 8.30 గంటలకు కాంచీపురం హై రోడ్‌కు తిరిగి వస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్ల పొదలో బంధించి కత్తితో బెదిరించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధను భరించలేక, ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో షాక్ కు గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు చెంగల్పట్టు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అమీద్ అబ్దుల్ ఖాదర్‌పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా, చెంగల్పట్టు పోక్సో కోర్టు ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. బుధవారం ఈ కేసును విచారించిన ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి అమీద్ అబ్దుల్ ఖాదర్‌కి యావజ్జీవ శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మీరు చెబుతున్నదానికి.. పరిస్థితులకు పొంతన లేదు కదా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో లోపల, బయట అన్నీ కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ధ్రువీకరిస్తూ దాఖలు చేసిన నివేదికలపై హైకోర్టు సందేహాలు లేవనెత్తింది. పోలీసులు చెబుతున్నదానికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులకీ పొంతన కనిపించడం లేదని తెలిపింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. ఈ ఠాణాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ధ్రువీకరించారని, ఇదే స్టేషన్‌కు సంబంధించి మరో కేసులో సంబంధిత మేజిస్ట్రేట్ ఒక్క సీసీ కెమెరా మాత్రమే ఉందని తమకు నివేదిక ఇచ్చారని తెలిపింది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై వాస్తవాలను తేల్చేందుకు న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? స్టేషన్ లోపల, బయట కనిపించేలా వాటిని ఏర్పాటు చేశారా? సక్రమంగా పనిచేస్తున్నాయా? తదితర వివరాలను న్యాయవాదుల కమిటీ ద్వారా తెప్పించుకుంటామని తెలిపింది. ఇప్పటికీ చాలా స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ఎందుకనేది వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ జగడం సుమతిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.» సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ యోగేష్ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1,001 చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు పెట్టారన్నారు. మిగిలిన స్టేషన్లలో కూడా ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.అక్కడ తప్ప అన్నీ స్టేషన్లలో ఏర్పాటు చేశాంప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, లాకప్‌లు ఉన్న అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, లాకప్‌లు లేనిచోట పెట్టలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. చాలా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి లాకప్‌లు లేని కార్యాలయాలు, పోలీసు ట్రైనింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి హింసించిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనివి స్టేషన్ల నిర్వచనం పరిధిలోకి వస్తాయో రావో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పోలీసుల దర్యాప్తు తీరుపై సందేహం కలుగుతోందిఆటో డ్రైవర్ కస్టోడియల్ టార్చర్‌పై స్పందించిన హైకోర్టుసాక్షి, అమరావతి: టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇవ్వగానే ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని తీవ్రంగా హింసించిన ఘటనపై హైకోర్టు స్పందించింది. పల్నాడు జిల్లా, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్, ఎస్ఐ సౌందర్య రాజు చిత్రహింసలకు గురిచేశారని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. అరెస్ట్ సహా జరిగినదంతా గమనిస్తే పోలీసుల దర్యాప్తు తీరుపై ప్రాథమికంగా సందేహం కలుగుతోందని తెలిపింది. అరెస్ట్‌కు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలంది. గత నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు దాచేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తంగేడు గ్రామం చెన్నయపాళెం క్రాస్‌రోడ్డు వరకు సీసీ కెమెరాల ఫుటేజీని సమర్పించాలని దాచేపల్లి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఉత్తర్వులిచ్చారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.దాచేపల్లి మండలం తంగెడకి చెందిన హరికృష్ణ ఎన్నికల సమయంలో తమపై బాంబులు వేశారని, తాజాగా హత్యాయత్నం చేశారంటూ టీడీపీ కార్యకర్త షేక్ హుస్సేన్ ఈ ఏడాది మే 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే తన కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారని హరికృష్ణ తండ్రి ఎల్లయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమారుడి అరెస్ట్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. దీనిపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సూరపురెడ్డి గౌతమి వాదించారు. -
కూకట్‌పల్లిలో రౌడీషీటర్ సయ్యద్ షాహిద్ దారుణ హత్య
హైదరాబాద్: స్నేహితుల చేతిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం రాత్రి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్, పండిట్ నెహ్రూ నగర్లో రౌడీషీటర్ సయ్యద్ సాహెద్ (24) నివాసం ఉంటున్నాడు. గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను ఇటీవలే బయటికి వచ్చాడు. ఆదివారం రాత్రి కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా పాపారాయుడు నగర్‌లోని ఖాళీ స్థలంలోని ఇచి్చన విందుకు సయ్యద్ సాహెద్, సాజిద్, సమీర్, మున్నా, పవన్ హాజరయ్యారు. అయితే గతంలో సాహెద్, సాజిద్‌ను డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అందరూ కలిసి మద్యం తాగిన అనంతరం డబ్బుల విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన సాజిద్ బీరు బాటిల్ పగలగొట్టి సాహెద్ గొంతులో పొడిచాడు. మరో రెండు బీరు బాటిళ్లు తలపై పగులగొట్టడమేగాక బండరాయితో తలపై మోదటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సాహెద్పై అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉందని, అల్లాపూర్, సనత్‌నగర్, బోరబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. యూ ట్యూబర్‌గా పని చేస్తున్న నిందితుడు సాజిద్‌పై కూడా రౌడీ షీట్ ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
మా కొడుకు జాడ చెప్పండి
భూపాలపల్లి: ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మా కొడుకు కనిపించడం లేదు. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా కుమారుడి జాడ చూపించండి’అంటూ వృద్ధ దంపతులు సోమవా రం గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌ను వేడుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన మందల చిన్న సమ్మిరెడ్డి కుమారుడు రాజు 2013, జూన్ 20వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. అప్పటినుంచి అతడు ఇంటికి రాలేదు. దీంతో తండ్రి చిన్న సమ్మిరెడ్డి 2017, జూన్ 20న భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కుమారుడి గురించి ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు బదిలీ చేయగా, విచారణ జరిపిన పోలీసులు 2021లో రాజు ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు. కొడుకు ఆచూకీ కోసం తాము వెతికామని, కానీ ఇప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదని రాజు తండ్రి .. కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట వాపోయారు. గత ప్రభు త్వం తమ కుమారుడిని తెలంగాణ అమరవీరుడిగా గుర్తించిందని, అయినా ఎటువంటి న్యాయం జరగలేదని తెలిపారు. ఉండటానికి ఇల్లు, తమ కూతురికి ఉద్యోగ అవకాశం కలి్పంచాలని సమ్మిరెడ్డి కోరారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమీర్‌పేట లాడ్జ్‌కి తీసుకెళ్లి..
హైదరాబాద్: యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్ పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి షాద్‌నగర్ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో సీనియర్ ద్వారా అయిన భరత్‌రెడ్డి పరిచయమయ్యాడు. గత ఏడాది యువతిని అమీర్‌పేట ఓయో రూంలో బలవంతంగా కలిశాడు.గర్భవతినని ఆమె భరత్‌రెడ్డికి చెప్పగా పెళ్ళి చేసుకుందామని చెప్పాడు.ఆ తరువాత ఆమెకు బాబు పుట్టాడు. దీంతో బాధితురాలుషాద్నగర్లోని భరత్‌రెడ్డి ఇంటికి వెళ్ళగా దుర్బాషలాడి పంపారు. తనను మోసం చేసిన భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు. -
ప్రేమ జంట నిర్వాకం.. పొట్టు పొట్టు తన్నుకున్న బంధువులు..
అన్నానగర్: కృష్ణగిరిలోని పోచంపల్లి సమీపంలో అదృశ్యమైన కళాశాల విద్యార్థిని, ఆమె ప్రేమికుడు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ప్రేమికుడిని అడ్డగించి దాడి చేశారు. ప్రతిగా, ప్రత్యర్థి వర్గం కూడా దాడి చేయడంతో కలకలం రేగింది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా లోని పోచంపల్లి సమీపంలోని పులియాండపట్టి గ్రామానికి చెందిన సదాశివం కుమారుడు వేలు(23). ఇతను పోచంపల్లి సిబ్ కాట్ లోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ధర్మపురి జిల్లా అడియమాన్ కొట్టాయి కెట్టుపట్టి గ్రామానికి చెందిన తిరుపతి కుమార్తె జ్యోతిలక్ష్మి(20) ధర్మపురి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ ఇంగ్లిష్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. జ్యోతిలక్ష్మి ఆలయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పులియండపట్టిలోని బంధువుల ఇంటికి వచ్చినప్పుడు వేలుతో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. జ్యోతిలక్ష్మి తల్లిదండ్రులు వారి ప్రేమను వ్యతిరేకించారు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేసేందుకు యతి్నంచారు. జ్యోతిలక్ష్మి దానిని వ్యతిరేకించింది. దీంతో ఆమెను ఇంట్లో ప్రత్యేక గదిలో బంధించినట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో వేసవి సెలవులు ముగిసి 16న కళాశాల తెరిచిన తర్వాత కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన జ్యోతిలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదు. ఇది తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా చోట్ల వెతికినా కూతురు కనిపించకపోవడంతో, వారు అదియామన్కోట్టై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో, కనిపించకుండా పోయిన జ్యోతిలక్ష్మి సేలం వెళ్లి అక్కడి ఒక ఆలయంలో వేలును వివాహం చేసుకున్నారని, వారిద్దరూ వేలు స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇంతలో, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి, జ్యోతిలక్ష్మి ఆదివారం తన భర్తతో కలిసి మాథుర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. అకస్మాత్తుగా వారు ఆ జంట ప్రయాణిస్తున్న దారిని అడ్డుకున్నారు. వేలు, అతని బంధువులను చుట్టుముట్టి వారి పై దాడి చేశారు. వారు కూడా ఎదురుదాడికి దిగారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సమాధాన పరిచి కేసు విచారణ చేస్తున్నారు. -
ప్రభుత్వం మాదే.. మాపైనే కేసులా!
రామసముద్రం: ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మా పార్టీ ప్రభుత్వమే. అలాంటిది మాపైనే కేసులు పెడతారా! మీకెంత ధైర్యం? ఆ ఎస్ఐని మాకు అప్పజెప్పండి. ఆయన సంగతి తేలుస్తాం’ అంటూ అన్నమయ్య జిల్లా ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పోలీస్ స్టేషన్‌పై దండెత్తారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రబోయినపల్లి, శ్రీరాములవారిపల్లి గ్రామాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండువర్గాలపై రామసముద్రం పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరాములవారిపల్లెకు చెందిన మంజునాథ్ ఫిర్యాదు మేరకు ఎర్రబోయినపల్లెకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన ఎర్రబోయినపల్లి టీడీపీ శ్రేణులు స్టేషన్‌పైకి దూసుకొచ్చాయి. ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించి స్టేషన్ గేటును మూసివేశారు. ఎవరినీ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసి మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ అక్కడకు చేరుకోగా.. ఆయన సమక్షంలోనే టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తర్వాత అక్కడే ఆందోళన నిర్వహించారు. టీడీపీకి చెందిన తమపైనే కేసు నమోదు చేసేంత ధైర్యం మీకెవరు ఇచ్చారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో రామసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణుల దాడి యత్నంతో ఆందోళనకు గురైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు. టీడీపీ నాయకుడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో మంజునాథ్ వర్గానికి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రవికుమార్ ప్రకటించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది నిందితులు ఉన్నారని వారిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాష పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐ, ఎస్సైలతో సమావేశమయ్యారు. -
BIG QUESTION: అది పోలీస్ స్టేషనా..టీడీపీ ఆఫీసా ?
-
కటకటాల్లో కమ్మటి విందు!
సోహ్రా (మేఘాలయ): మూడో నంబర్ లాకప్‌లో పిలుస్తున్నారు వెళ్లు... ఏడో నంబర్ సెల్లో వాళ్లకు ఏం కావాలో చూడు...యజమాని పురమాయింపులు. ఆ మేరకు కస్టమర్లకు కోరిన వంటకాలను క్షణాల మీద అందించే స్టివార్డ్లు. లాకప్పులేమిటి, వాటిలో కస్టమర్లు, స్టివార్డులు ఏమిటని ఆశ్చర్యపోకండి. ఇదంతా కఫేగా రూపాంతరం చెందిన ఓ పురా తన పోలీస్‌స్టేషన్ తాలూకు వర్ణన! మేఘాలయ లో ఈస్ట్ ఖాసీ హిల్స్‌లోని సోహ్రా పట్టణంలో 1885 నాటి భవనంలో ఏర్పాటైన ఈ వినూత్న కఫే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. ఇప్పు డు రాష్ట్రమంతటా ఎవరి నోట విన్నా దీన్ని గురించిన ముచ్చట్లే! ఈ భవనం బ్రిటిష్ హయాంలో నిర్బంధ కేంద్రంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం పోలీస్‌స్టేషన్‌గా మారింది. రాష్ట్రంలోకెల్లా అతి పురాతన భవనం ఇదే. ఈ హెరిటేజ్ బిల్డింగ్‌ను చక్కని హోటల్‌గా మారిస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన నాటి డీఎస్పీ వివేక్‌కు వచ్చింది. పురాతన కట్టడం, అందులోనూ పోలీస్ స్టేషన్ కావడంతో ఆ వినూత్న వాతావరణాన్ని ఆస్వా దించేందుకు జనం విరగబడతారన్న ఆయన భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానితో ఏకీభవించింది.వెంటనే పోలీస్‌స్టేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన కొత్త భవనంలోకి మార్చేశారు. పాత భవనంలో కఫే నిర్మాణానికి, నిర్వహణకు రెండేళ్ల కింద బిడ్లు పిలిస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. భవన నిర్మాణాన్ని, పురాతన లుక్‌ను ఎక్కడా మార్చకుండా కేవలం చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశారు. గోడలు, పురాతన ఫ్లోరింగ్, కటకటాలతో పాటు అన్నింటినీ వీలైనంత వరకూ యథాతథంగా ఉంచేయడం విశేషం. పోలీస్‌స్టేషన్‌గా ఉండగా వాడిన బ్రిటిష్ కాలం నాటి వస్తువులన్నింటినీ చక్కని అలంకరణ సామగ్రిగా మార్చేశారు. లాకప్‌లను అందమైన డైనింగ్ ఏరియాలుగా తీర్చిదిద్దారు. ఆ కాలం నాటి ఫైర్‌ప్లేస్‌ను కూడా అందమైన మరమ్మతులతో ఆకర్షణీయంగా తయారు చేశారు. అలా చూస్తుండగానే పూర్తిగా భిన్నమైన లుక్కుతో, 100 మంది సీటింగ్ సామర్థ్యంతో కూడిన కఫే సిద్ధమైపోయింది. దీనికి కావాల్సిన డిజైన్‌ను ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిన ఓ యువ పారిశ్రామికవేత్తే స్వయంగా అందజేశారు! పట్టణం పేరు, కట్టడం తాలూకు పురాతనత్వం రెండూ ప్రతిఫలించేలా దీనికి ‘సోహ్రా 1885’ అని వినూత్నంగా పేరు పెట్టి మే 22న ఘనంగా ప్రారంభించారు. కటక టాల్లో కోరిన రుచులు ఆస్వాదించడమనే ఆలో చన ఆహారప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఊహించినట్టుగానే ఈ కఫేకు తొలి రోజు నుంచే విపరీతంగా పోటెత్తుతున్నారు. చూస్తుండగానే ఇది పెద్ద పర్యాటక ఆకర్షణగా కూడా మారుతోంది. అన్నట్టూ, దీనిపై వచ్చే లాభాలను పూర్తిగా పోలీసుల సంక్షేమానికే వెచ్చించనుండటం విశేషం! -
కలలో కూడా చూడని ఇల్లు..! చూశాక మాత్రం..
ధనవంతుడైన ఒక దొంగకు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక ఇంటిని చూపిస్తూ ఇలా అంటున్నాడు.. ‘‘ఇంటి ముందు ‘మా జైలుకు స్వాగతం’ అనే బోర్డు పెట్టుకుంటే భలే ఉంటుంది సార్. అలాగే, కాలింగ్ బెల్లుకు బదులు ఇక్కడ ఒక జైల్ అలారం పెట్టించుకుంటే ఇంకా సూపర్. అలాగే మీకోసం ఒక పెద్ద సెల్లో మాస్టర్ బెడ్రూమ్ను డిజైన్ చేసుకోవచ్చు. అతిథులు వస్తే, వాళ్లకోసం నెంబర్ వైజ్డ్ రిమాండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అతిథులతో మీకు ఇబ్బంది రాకుండా, వారిని వెంటనే ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగేలా రూమ్స్‌లో అద్భుతమైన చెక్క మంచాలు ఉన్నాయి. వాటిని మీకు స్పెషల్ డిస్కౌంట్ కింద ఫ్రీగా ఇస్తాం. ఎప్పుడైనా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, క్రమశిక్షణలో పెట్టడానికే పక్కనే సిద్ధంగా ఒక లాకప్ రూమ్ కూడా ఉంది’’ అని వివరిస్తున్నాడు. ఇదంతా ఆ రిచ్ చోర్, తనను మెప్పించడానికే ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాడు. కాని, అతను వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాగే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఆ ఇల్లు నిజంగానే ఒక జైలు కాబట్టి. ఈ అద్భుతమైన జైలును సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే, ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌కు వెళ్లాలి. 1899లో నిర్మించిన స్వానేజ్ పోలీస్ స్టేషన్ ప్లస్ జైలును, అక్కడి ప్రభుత్వం 1.2 మిలియన్ పౌండ్స్ (అంటే రూ. 13 కోట్లు )కు వేలానికి పెట్టింది. లైఫ్‌లాంగ్ లాకప్‌కు సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండి! (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..) -
దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. -
ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన ‘పోలీసు మార్కు’ విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్‌లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం. ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులను కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు. ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారు. దెబ్బలు తట్టుకోలేకే.. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీసు శాఖకు చెందిన శిక్షణ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆ అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ అనుమానితుడు మృతి చెందాడు. దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు.మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. వారికి కొంత మొత్తం ముట్టచెప్పి గుట్టు చప్పుడు కాకుండా మృతునికి అంత్యక్రియలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా జరిపించేసినట్లు సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారే బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవర్ని కలుస్తున్నారు, వారి ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారి నివాసం వద్ద పోలీసు నిఘా కూడా పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ముఖ్య నేత మద్దతుతోనే ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అంతగా చెలరేగిపోతున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పోలీసుస్టేషన్ కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దురుద్దేశాలతో కూడిన, తప్పుడు ఫిర్యాదులకు చెక్ చెప్పడానికి ప్రాథమిక విచారణ (పీఈ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఈ విచారణ పూర్తి చేసి, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాతే హైడ్రా ఠాణాలో కేసు నమోదవుతుంది. ప్రతి ఫిర్యాదును కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి, సిఫార్సు చేసిన తర్వాతే పోలీసుస్టేషన్‌కు చేరుతుంది. హైడ్రా పోలీసుస్టేషన్ డిజిగ్నేటెడ్ కోర్టుకు సంబంధించి న్యాయశాఖ ఉత్తర్వులు జారీ తర్వాత అధికారికంగా పని చేయడం ప్రారంభించనుంది. కొన్ని ఫిర్యాదుల వెనుక అనేక ఉద్దేశాలు..ప్రభుత్వ భూములు, లే అవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పార్కులు, చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలకు సంబంధించిన కేసుల్ని హైడ్రా ఠాణా నమోదు చేయనుంది. వీటితో పాటు నిర్మాణాల కోసం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వంటి వాటిని ధ్వంసం చేసినా పరిగణనలోకి తీసుకుంటోంది. ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ముందుకు వెళ్తున్న హైడ్రా (Hydraa) అధికారులు తీవ్రమైన అంశాలు, నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వంటివి గుర్తిస్తున్నారు. ఆయా ఆక్రమణల్ని తొలగించడంతో పాటు బాధ్యులపై స్థానిక ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా.. హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని వ్యక్తిగత విభేదాలు, కక్షసాధింపు చర్యలు, బెదిరింపుల దందాలతో ముడిపడి ఉంటున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ రంగనాథ్ హైడ్రా ఠాణాలో కేసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సుమోటో కేసులు.. కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ఫిర్యాదు చేయాలని భావించిన వారు నేరుగా హైడ్రా ఠాణాకు వెళ్లినా వెంటనే కేసు నమోదు కాదు. ఆ ఫిర్యాదును జనరల్ డైరీలో (జీడీ) ఎంట్రీ చేసే సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కమిషనర్ సిఫార్సు మేరకు సిబ్బంది విచారణ చేపడతారు. ఫిర్యాదుతో జత చేసిన పత్రాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులతో పాటు ఆయా శాఖలు, విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తారు. ఈ వివరాలతో పీఈ పూర్తి చేసి.. నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు జోడించి కమిషనర్‌కు నివేదిక ఇస్తారు. ఆపై ఆయన ఆమోదంతో కేసు నమోదవుతుంది. నేరం ఏ సంవత్సరంలో జరిగిందో పరిగణనలోకి తీసుకునే ఎస్హెచ్ఓ ఆరోపణలు జోడిస్తారు. ఇప్పటికే వేర్వేరు ఠాణాల్లో నమోదైన కేసుల్ని విడతల వారీగా హైడ్రా స్టేషన్‌కు బదిలీ చేయనున్నారు.చదవండి: పాకిస్థాన్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?
సాక్షి, హైదరాబాద్: గుజరాత్లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదుల పునరుద్ధరణ కొందరికి గొప్పగా వినిపిస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మనం గొప్పగా బతకవద్దా? అని నిలదీశారు. ప్రధాని మోదీ చేస్తే గొప్ప ఎలా అవుతుందో.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పు ఎలా అవుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు.హైదరాబాద్‌లోని బుద్ధభవన్ వద్ద ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పోలీసుస్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల వల్ల తలెత్తుతున్న వరదలు, హైడ్రా ఆవశ్యకత సహా వివిధ అంశాలపై స్పందించారు. హైడ్రా కూల్చడానికే కాదు... రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది కేవలం కూల్చడానికి మాత్రమే కాదని.. నిర్మాణాలు చేపట్టేందుకు కూడానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆక్రమణలకు పాల్ప డే వాళ్లు ఎంత గొప్ప వాళ్లయినా చట్టం ముందు సమానులే నని నిరూపించడానికే హైడ్రా తీసుకుకొచ్చినట్లు స్పష్టం చేశా రు. హైదరాబాద్‌లో 940 చెరువులకుగాను 491 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. పెద్దపెద్ద నాలాలు మూసుకుపోయాయి. చిన్న వర్షానికే కాలనీలు మునిగిపోతున్నాయని.. రోడ్లపై వరదనీటితో గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడుతున్నాయన్నారు. వాటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా అంటారేంటి? చెరువులను కాపాడినా, నాలాల ఆక్రమణలు తొలగించినా, అక్రమ నిర్మాణాలను పడగొట్టినా, మూసీని పునరుద్ధరించాలని చూసినా రియల్ ఎస్టేట్ పడిపోతోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘రియల్ ఎస్టేట్ పెంచుదామని ఐఎంజీ భారత్ అనే ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిన 400 ఎకరాలను 20 ఏళ్ల తర్వాత వెనక్కు తెచ్చాం. రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు వచ్చేలా అభివృద్ధి చేయాలనుకున్నాం. కానీ అక్కడ చెట్టు ఉంది, పుట్ట ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది... అవి ఎలా బతుకుతాయి అంటూ ఆ 400 ఎకరాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అసలు మీ బాధ ఏంటి? చెరువులను కాపాడి, మూసీని ప్రక్షాళించి నాలాలు, రోడ్లపై ఆక్రమణల్ని తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్లు కాదా? ఆక్రమణలను తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటున్నారు. మరోవైపు రూ. వేల కోట్ల పెట్టుబడులతో ఐటీ, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్‌ను తయారు చేద్దామంటే ప్రకృతి నాశనం అయిపోతోందంటున్నారు. అలాంటి వాళ్ల ఆలోచనల్లో ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనీయద్దు, ప్రజలకు మేలు జరగనీయద్దనేది స్పష్టంగా కనిపిస్తోంది. కబ్జాల్లో ఉన్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? అనేది ప్రజలే ఆలోచించాలి’అని సీఎం రేవంత్ సూచించారు. మూసీని పునరుద్ధరించి తీరుతాం... ప్రతిపక్ష నేతలు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ జన్వాడ, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లలో విశాలమైన భవంతుల్లో బతుకుతున్నారని.. పేదలు మాత్రం మూసీలోనే, మురికిలోనే చావాలా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మూసీని పునరుద్ధరించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తారని వివరించారు. నిర్వాసితులకు వేరే ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామని.. అవసరమైతే ప్రతి 5 కి.మీ. ప్రాంతాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకొని అపార్ట్మెంట్లు కట్టిస్తామన్నారు. మానవీయ కోణంలో వ్యవహరించాలి.. హైడ్రా మానవీయ కోణంలో వ్యవహరించాలని సీఎం రేవంత్ సూచించారు. పేదలపట్ల సానుభూతితో, పెద్దలపట్ల కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను ఆదేశించారు. -
వారికే హైడ్రా అంటే భయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పేదోళ్ల ఇళ్ల కూల్చడానికి హైడ్రా తెచ్చామని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభత్సోవ సభలో మాట్లాడుతూ.. చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదలం అని స్పష్టం చేశారు. పేదలు తమ కాలనీల వైపు రాకుండా కొందరు బలవంతులు అడ్డుగా గోడలు కడుతున్నారు. ఆక్రమణదారులను అడ్డుకోవడానికే హైడ్రా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.‘‘960 చెరువులు ఉండాల్సి ఉండగా, 461 చెరువులు కబ్జాలో ఉన్నాయి. నాలాల ఆక్రమణవల్లే రోడ్లపై నీరు నిలిచిపోతోంది. లేక్‌వ్యూల పేరుతో చెరువుల్లోనే విల్లాలు కడుతున్నారు. ఎవరూ అడగకుండా ఉంటే భవిష్యత్తులో ఏమవుతుందో అర్థం చేసుకోండి. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం. ఈ నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యానికి బలిచేద్దామా?. చిన్న వర్షానికే ఉస్మానియా ఆసుపత్రి మునిగిపోయింది. మమ్మల్ని వ్యతిరేకించినా, దూషించినా నేను పట్టించుకోను’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.‘‘కడుపు నిండా విషం నింపుకుని వ్యవహరిస్తున్నారు. ప్రకృతిని కాపాడుకుందామంటే వీళ్లకు ఇబ్బంది వస్తోంది. రోడ్లపై ఉన్న నిర్మాణాలు కూలిస్తే నగరానికి మంచిది కాదా?. చెరువులను కాపాడి, మూసీని ప్రక్షాళన చేస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు. -
పవన్ కల్యాణ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా: ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసు స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశా రు. మంగళవారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో ఎస్.ఐ కాశీనాథ్‌కు వారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కల్యాణ్ ద్వేషపూరిత ప్రకటన చేశారని ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇస్లాం శాంతి, ప్రేమకు సంబంధించిన మతమన్నారు. ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ప్‌లను పవన్ కల్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. -
నాకు నువ్వు వద్దు!
నగరానికి చెందిన ఓ యువజంటకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగాల్సిన వీరి కాపురంలో పెళ్లయిన నెలరోజులకే చిచ్చు మొదలైంది. ఇంట్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలు వీరి గొడవకు ప్రధాన కారణంగా మారాయి. గొడవ పెద్దదై ఈ యువజంట పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొద్దిరోజులుగా పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.నగరానికి చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన యువతితో గతేడాది వివాహం జరిగింది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో కొన్నాళ్లకు ఆధిపత్య పోరు మొదలైంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు జీవిస్తూ.. విడాకుల కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకని ఆరా తీసిన పోలీసులు, న్యాయవాదులు ఆ జంట చెప్పిన కారణంతో అవాక్కయ్యారు. దీనికి పూర్తి కారణం ఇరువురి తల్లిదండ్రుల అతిజోక్యమేనని కౌన్సెలింగ్‌లో పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరావిు..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన కొందరు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది. – కరీంనగర్క్రైంచిన్న చిన్న కారణాలతో..⇒నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి. ⇒బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు.⇒ ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి. ⇒నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి.⇒ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి.⇒పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.అవగాహన అవసరం⇒కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి.⇒అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.⇒అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు.⇒ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ⇒విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్‌కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్ కౌన్సిలర్ పేర్కొన్నారు.ఆధిపత్య ధోరణి వద్దు దాంపత్య జీవితానికి విలువ తెలియక చాలా మంది విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహం అనంతరం ఎలా వ్యవహరించాలి..? ఎలా ఉండాలనే విషయాలపై పెద్దలు అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే దాంపత్య జీవితంలో ఎలా ఉండాలనే విషయాలు తెలిపే ప్రి మారిటల్ కౌన్సెలింగ్ తప్పనిసరి అని నా భావన.– అట్ల శ్రీనివాస్‌రెడ్డి, సైకాలజిస్ట్తొందరపాటుతోనే..దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ తరం పిల్లలకు దాంపత్య బంధం విలువ సరిగా తెలియడం లేదు. పెళ్లయ్యాక ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటు పడి ఒకరి మాట ఒకరు వినడం లేదు. చిన్న గొడవకే ఠాణాకు వస్తున్నారు. అనుమానం, తల్లిదండ్రుల మితివీురిన జోక్యం, దురలవాట్లు, గృహహింస, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం మా వద్దకు వచ్చే దంపతుల మధ్య గొడవకు ప్రధాన కారణాలు. – శ్రీలత, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ, కరీంనగర్ -
బెట్టింగ్ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీరియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్‌కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్‌లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్‌ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్‌లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్‌గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్‌థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్‌థెమ్ పని చేస్తుంది. రోజుకు విత్‌డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్‌లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్‌కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్‌లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్‌లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్‌ను ఇన్‌స్టల్ చేసుకుంటున్నారు. -
గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్
-
ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..
హైదరాబాద్: ప్రేమించిన యువకుడు మరో యువతిని వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మిర్యాలగూడ, బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ మధురపురి కాలనీలోని హాస్టల్లో ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డిని ప్రేమిస్తోంది. అయితే మల్లీశ్వరి కులం వేనే కావటంతో జానా రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. ఇటీవల జానారెడ్డికి మరో యువతితో వివాహం జరిగింది. ఈ విషయం తెలియడంతో మల్లీశ్వరి ఆదివారం రాత్రి హాస్టల్లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడు జానారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
సార్ నాకు పెళ్లి చూపులు .. మా అన్నను వదిలేయండి..!
సేలం : తంజావూరులో అరెస్టు చేసిన అన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు చెల్లెల్లలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర చికిత్స పొందుతున్నారు. కాగా ఈ వ్యవహారంగా నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను అధికారులు వెయిటింగ్ లిస్ట్‌కు బదిలీ చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా నడుక్కవేరిలోని అరసమర వీధికి చెందిన వ్యక్తి దినేష్ (32). అతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇదిలా ఉండగా దినేష్ బంధువు ఏప్రిల్ 8వ తేదీన మరణించాడు. దినేష్ తన బంధువులతో కలిసి నడుక్కావేరి బస్‌స్టాప్ వద్ద సంతాప కార్యక్రమానికి హాజరు కావడానికి నిలబడి ఉండగా, నడుక్కవేరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సబ్–ఇన్స్పెక్టర్ సంఘటనా అక్కడికి చేరుకుని, దినేష్‌పై కేసు నమోదు చేసినట్లు, విచారణకు రావాలని చెప్పి, దినేష్‌ను మోటార్ సైకిల్ పై నడుక్కావేరి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దినేష్ చెల్లెల్లు కూడా వారిని అనుసరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ తమ సోదరుడిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దినేష్ సోదరీమణులలో ఒకరికి పెళ్లి చూపులకు వరుడి తరపు వారు వస్తున్నారని తెలిపినప్పటికీ స్టేషన్లో ఉన్న పోలీసులు వినిపించుకోకుండా బహిరంగ ప్రదేశంలో కత్తితో బెదిరించాడంటూ దినేష్‌పై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిసింది. అదే విధంగా అక్కడ ఉన్న పోలీసులు దినేష్ సోదరీమణులను ఏకవచనంతో మాట్లాడి దూషించి బయటకు పంపించారని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు ఇంటికి వెళ్లి పురుగుమందు తెచ్చి నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ముందు ఉంచి, తాగి ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు వారిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో బుధవారం ఓ చెల్లెలు మరణించింది. మరో చెల్లెలికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.బంధువుల ఆందోళనఈ విషయం తెలుసుకున్న దినేష్ బంధువులు తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు గుమిగూడి నిరసన తెలిపారు. అప్పుడు దినేష్ సోదరి మరణానికి న్యాయం జరగాలని, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, పుదుక్కోట జైలు నుంచి దినేష్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈతంజావూరు నగర డీఎస్పీ సోమసుందరం, ఇన్స్పెక్టర్లు చంద్ర, జగతీశ్వరన్ ఆసుపత్రి ముందు నిరసనకారులతో చర్చించారు. ఈ స్థితిలో నడుక్కావేరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షర్మిలను వీఆర్‌కు బదిలీ చేస్తూ తంజావూరు జిల్లా సూపరింటెండెంట్ రాజారాం గురువారం ఆదేశాలు జారీ చేశారు. -
గోరంట్ల మాధవ్ ఎక్కడ?.. పోలీసులు చెప్పడం లేదు: అంబటి
సాక్షి, గుంటూరు: గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పడం లేదని.. ఒక వేళ అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాత్రి.. గోరంట్ల మాధవ్‌తో మాట్లాడేందుకు నగరపాలెం పీఎస్‌కు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వెళ్లారు. కానీ గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పకపోవడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చేబ్రోలు కిరణ్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోందని.. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కిరణ్‌ను అరెస్ట్ చేయించి.. చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి మండిపడ్డారు. -
Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..!
ఫిలింనగర్: ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ వివాహితను పరిచయం చేసుకున్న స్పా యజమాని ప్రేమ పేరుతో వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మల్కాజగిరిలోని హనీ స్పా యజమాని విక్కీ విక్రమ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్ బస్తీకి చెందిన వివాహిత (35) మాదాపూర్‌లోని ఓ స్పాలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది. ఇటీవల మరింత మెరుగైన ఉద్యోగం కోసం మల్కాజిగిరిలోని హనీ స్పాలో ఇంటర్వ్యూకు వెళ్లగా స్పా యజమాని విక్కీ విక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణ జరుగుతుంది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్తకు ఈ విషయం తెలియదని ఆమె చెప్పగా అదంతా తాను చూసుకుంటానని, నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మబలికాడు. దీంతో ఆమె విక్కీ విక్రమ్‌తో మరింత సన్నిహితంగా మెలిగింది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆమె దూరంగా ఉండసాగింది. ఇది భరించలేని విక్రమ్ గురువారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చి బయట నుంచి డోర్ లాక్ చేశాడు. దీంతో ఆమె భయంతో అరవడంతో చుట్టుపక్కల వారు గమనించారు. దీంతో విక్రమ్ అక్కడి నుంచి ఉడాయించాడు. తనను శారీరికంగా, మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 75, 78 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ డబ్బాలతో దడ!
సాక్షి, హైదరాబాద్: పేలుడు...అది చిన్నదైనా, పెద్దదైనా పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఇటీవల కాలంలో రాజధానిలో తరచుగా చిన్నస్థాయి పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక ఉదంతాల్లో క్షతగాత్రులే ఉంటుండగా కొన్ని సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ బ్లాస్ట్‌లకు ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే ఆర్గానిక్ సాల్వెంట్స్ కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమ్మిళిత పదార్ధాలు కలిగి ఉన్న పెయింట్స్‌ను కొన్ని స్థితుల్లో ఇళ్లల్లో పెట్టుకోవడం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. శనివారం కుషాయిగూడ పారిశ్రామికవాడలో పెయింట్ డబ్బా పేలి కూలీ నాగరాజు మృతిచెందిన విషయం విదితమే. పెయింట్ డబ్బాలతోనే సమస్య... నగరంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి చిన్న స్థాయి పేలుళ్లకు పెయింట్ డబ్బాలే ఎక్కువగా కారణంగా మారుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రంగులు వాటిలో వాడే థిన్నర్లలో వలటైల్ ఆర్గానిక్ సాల్వెంట్స్‌గా పిలిచే ఎసిటోన్, ఈ రసాయనం కలిపిన ట్వాలిన్ , ఈథర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఓ పెయింట్ డబ్బా సీల్ తెరిచిన తర్వాత సగం వినియోగించి మిగిలిన సగాన్ని అలానే ఉంచి మూత పెట్టడం పరిపాటి. మరోసారి వినియోగించడానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో దాచి పెడుతుంటారు. ఫలితంగా ఆ డబ్బాల్లో ఉండే రంగుల్లోని ఆవిరి స్వభావం కలిగిన రసాయనాలు అందులో ఉన్న గాలిలోని ఆక్సిజన్‌తో కలుస్తూ వ్యాకోచించడానికి ప్రయతి్నస్తాయి. గట్టిగా మూత పెట్టి ఉండటంతో అది సాధ్యం కాక డబ్బా లోపలి భాగంలో వాక్యూమ్ ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఉన్న డబ్బా మూతలు సైతం బిగుసుకుపోతాయి. అలాంటి వాటిని తెరవడానికి రాపిడి కలిగించినా, గట్టిగా కొట్టినా చిన్నస్థాయి పేలుడు చోటు చేసుకుంటుంది. ఎక్కువగా బలవుతున్నది వారే... ఇలాంటి డబ్బాల పేలుడు వల్ల క్షతగాత్రులుగా, మృతులుగా మారుతున్న వారిలో ఎక్కువగా చెత్త ఏరుకునే వాళ్లే ఉంటున్నారు. సగం వాడిన పెయింట్ డబ్బాలను సాధారణంగా ఆ వినియోగదారులు కొన్ని రోజుల పాటే భద్రపరుస్తుంటారు. డబ్బా తుప్పు పడుతున్నప్పుడో, కదిలి్చనప్పుడు పెయింట్ శబ్ధం రాకుంటే పూర్తిగా గడ్డ కట్టేసిందనే భావనతోనో, మూత తీయడం సాధ్యం కానప్పుడో వాటిని బయటపారేస్తుంటారు. సాధారనంగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారేటప్పుడు, దుకాణాలకు మెరుగులు దిద్దే సమయాల్లోనూ ఇలా చేస్తుంటారు. ఆఖరుకు ఈ డబ్బాలు చెత్తకుప్పల్లోకి వచ్చి చేరతాయి. వీటిని కాగితాలతో పాటు ఏరుకునే చెత్త ఏరుకునేవాళ్లు తీసుకుని వాటిని తెరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కలిగే రాపిడి ఫలితంగా పేలుడు జరిగి కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా ప్రమాదం... గతంలో పెయింట్స్‌ను ఇనుప డబ్బాల్లో విక్రయించే వారు. అయితే ఇటీవల కాలంలో దాదాపు అన్ని రకాలైన రంగుల్ని ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఉంచి విక్రయిస్తున్నారు. ఇనుప వాటి కంటే ఇవి అత్యంత ప్రమాదకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సగం ఖాళీ అయిన ఇనుప డబ్బాలో ఉన్న రంగుకు ఆక్సిజన్ అందుబాటులోకి రాక రసాయనక్రియ జరగదు. కేవలం గడ్డ కట్టడం మాత్రమే జరుగుతుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే ఉన్న చిన్నపాటి సందుల నుంచి ఆక్సిజన్ వెళ్తుంది. దీంతో పాటు ఆర్గానిక్ సాల్వెంట్స్ కొన్ని రోజులకు ప్లాస్టిక్‌తో కలిసి పాలిమరైజేషన్ జరుగుతుంది. ఈ కారణంగా ఏర్పడే వేఫరైజర్ల కారణంగానూ దాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు పేలుడు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి డబ్బాలు ఇంట్లో ఉన్నప్పటికీ పేలుడు ప్రమాదాలు తప్పవని నిపుణులు వివరిస్తున్నారు. ఈ తరహా పేలుళ్లకు ఉదాహరణలు ⇒ మీర్ పేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ పోష్ కాలనీలో చెత్త ఏరుకునే నిర్మల ప్లాస్టిక్ డబ్బాను తెరిచే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డారు. ⇒ నాచారంలో రసాయనంతో కూడిన డబ్బా చేతిలో పేలడంతో ఓ చిన్నారికి గాయాలు అయ్యాయి. ⇒ హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో టిన్ పేలి అలీ అనే వ్యక్తి మరణించాడు. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెం.279 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ⇒ బాలానగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్లో నీలమ్మ (45) అనే పారిశుద్ధ్య కారి్మకురాలు రసాయనాల డబ్బాలతో కూడి వ్యర్థాల సంచిని శుభ్రం చేసే ప్రయత్నం చేసింది. ఆ సంచిలోని డబ్బా పేలడంతో ఆమె ఎడమ కాలి బొటనవేలు ఛిద్రమైంది. సీల్ తీస్తే వాడేయాలి ఆర్గానిక్ సాల్వెంట్స్ కలిగి ఉండే పెయింట్స్‌ను డబ్బా సీల్ తీసిన తర్వాత పూర్తిగా వాడేయడం ఉత్తమం. అలా కాకుండా కొంత మిగిలితే బయట పారబోయాలి. తర్వాత వినియోగిద్దామనే ఉద్దేశంతో దాచి పెట్టినా, కొన్నాళ్ళకు పారేసినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి డబ్బాలు తెరవడానికి ప్రయతి్నంచిన ప్రతిసారీ పేలిపోవాలని లేదు. పేలుడుకు చోటు చేసుకోవడానికి అవసరమైన స్థాయిలో సాల్వెంట్స్ రేష్యో తయారైతేనే అలా జరుగుతుంది. ఇలా సగం ఖాళీ అయిన డబ్బాలు ఇంట్లో ఉండి, వాటిని తెరవాల్సిన అవసరం వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిని వెంటనే తెరవకుండా కనీసం గంట సేపు చల్లని నీటిలో ఉంచాలి. ఫ్రిజ్ వాటర్‌ను బక్కెట్లో పోసి అందులో ఈ డబ్బాలను వేయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న ఆవిరి చల్లబడి మళ్లీ పెయింట్‌గా మారుతుంది. అప్పుడు రాపిడి కలిగిస్తూ తెరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదు. – ఫోరెన్సిక్ నిపుణులు -
అమ్మో పోలీస్.. ఇదేం పని బాస్!
చిత్తూరు అర్బన్: దొంగ నుంచి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించకుండా వాటాలు వేసేసుకున్నారు. పంచుకున్న వాటాల డబ్బుల్లో ఏకంగా సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేశారా..? స్టేషన్‌కు రంగులు వేయించారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో ఓ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.12.50 కొట్టేయడం, ఈ విషయాన్ని రాయచోటి పోలీసులకు పట్టుబడ్డ దొంగ బహిర్గతం చేయడం తెలిసిందే. అక్కడి నుంచి సమాచారం చిత్తూరు పోలీసుశాఖకు చేరడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పోలీసు దొంగలు..?’ శీర్షికన కథనం ప్రచురితం అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ మణికంఠ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి జిల్లా పోలీసుశాఖలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దొంగ నుంచి లంచంగా తీసుకున్న రూ.12.50 లక్షల్లో.. ఓ పోలీసు రూ.3.50 లక్షలు, మరో పోలీసు రూ.9 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే దొంగను పట్టుకోవడంలోని బృందంలో ఉన్న కానిస్టేబుల్ పెద్ద మొత్తంలో నగదును తన సమీప బంధువుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి, ఆపై దీన్ని తన అధికారికి ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో దొంగ సొమ్ముతో స్టేషన్లో పనిచేసే పోలీసులకు ఖాకీ యూనిఫామ్ పంపిణీ చేయడంతో పాటు స్టేషన్‌కు రంగులు వేయించారనే ఆరోపణ విచారణలో బయటపడినట్లు సమాచారం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, లంచంగా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాలను వాడుకోవడంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలోని సిబ్బందికి యూనిఫామ్‌ను కొనుగోలు చేసి ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసు నమోదుపై చర్చ విచారణ అధికారులు పూర్తి చేసిన ప్రాథమిక నివేదికపై ఓ పోలీసు ఉన్నతాధికారి, జిల్లా అధికారితో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దొంగ ఇచ్చిన రూ.12.50 లక్షలు ఎన్ని కేసుల్లో చోరీ చేశాడో, అన్ని కేసుల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను నిందితులుగా ఎందుకు చేర్చకూడదు..? అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నమ్మక ద్రోహం చేసి, పోలీసుశాఖ పరువు తీసిన వీళ్లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 316(5) కింద కేసు నమోదు చేయొచ్చా..?’ అని సుదీర్ఘంగా చర్చించారనే సమాచారం గుప్పుమంటోంది. ఇక రూ.3.50 లక్షలు స్వయంగా తీసుకున్న పోలీసును సస్పెండ్ చేయడంతో పాటు, మరో పోలీసును సస్పెండ్ చేయడం లేదా వీఆర్‌కు పంపాలని.. ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పనితీరు నచ్చి, తాను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన.. తప్పు చేసిన వాళ్లను కాపాడే ప్రసక్తేలేదని, ఈ ఘటనపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం తప్ప మరో ఆలోచనలేదని పోలీసు ‘బాస్’ సైతం ఒకరిద్దరితో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిస్తే అవార్డులు, రివార్డులు పంపిణీ చేసే అధికారులు.. తప్పు చేసినపుడు చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యులకు పోలీసుశాఖపై నమ్మకం ఉండదనేది బహిరంగ వాదన. ఈ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
రెడ్‌బుక్ తంత్రం.. సిట్ కుతంత్రం!
సాక్షి, అమరావతి : పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఉండవు.. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు.. కానీ అది పోలీస్ స్టేషనే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరో చెప్పరు కానీ అది పోలీస్ స్టేషనే. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇది రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రాజ్యాంగేతర శక్తి. దీనిపేరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకోసమే ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అరాచకాలకు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది. చట్ట విరుద్ధంగా సిట్ ఏర్పాటు సిట్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్‌ను ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ఏదైనా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసే సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా పరిగణించాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. కానీ అసలు పోలీస్ స్టేషన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేయడం గమనార్హం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా పోస్టుగానీ, ప్రదేశంగానీ పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తారు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ‘స్థానిక ప్రాంతం’ కూడా అయ్యుండాలని చట్టం స్పష్టం చేసింది. అంటే పోలీస్ స్టేషన్‌కు స్థానిక ప్రాంతం ఏదన్నది స్పష్టం చేయాలి. కానీ మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానిక ప్రాంతం’ ఏదన్నది పేర్కొన లేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టునుగానీ, ప్రదేశాన్నిగానీ పోలీస్ స్టేషన్‌గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు కచి్చతంగా స్టేషన్ హౌస్ అధికారిగానీ లేదా ఆఫీసర్ ఇన్చార్జ్ ఆ పోలీస్ స్టేషన్‌కు బాధ్యుడిగా ఉండాలి. మరి సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్చార్జ్ ఎవరన్నది పేర్కొన లేదు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్‌ను ఏర్పాటు చేసినట్టేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించ లేదు. ఫలితంగా బాధితులెవరైనా సిట్‌పై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఏవీ సిట్‌కు లేవని తేల్చి చెబుతున్నారు. అబద్ధపు వాంగ్మూలాలుసిట్ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతరులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయిస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2(క్యూ) ‘చేయకూడని పని ఏదైనా చేసినా, చేయాల్సిన పని చేయకుండా ఉన్నా అది నేరం’ అని నిర్వచించింది. అటువంటి నేరం చట్ట ప్రకారం శిక్షార్హం అని కూడా పేర్కొంది. మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో పలువురు అధికారులు, ఇతరులను దర్యాప్తు పేరిట వేధిస్తున్న సిట్.. అసలు నేరం ఏమిటన్నది చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే చేయకూడని పని చేసినా, చేయాల్సిన పని చేయకపోయినా ఆ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులు అవుతారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రభుత్వ అధికారి సంబంధిత బాధ్యులకు తెలియజేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏ పౌరుడైనా సరే తనకు ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకుగానీ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకుగానీ తెలియజేయాలని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 33 పేర్కొంటోంది. మరి ప్రభుత్వ అధికారులకు మరింత బాధ్యత ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కక్ష సాధింపు కోసమే బరితెగింపు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ పోలీస్ స్టేషన్‌కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే.. సిట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎక్కడ అదుపులోకి తీసుకున్నా సరే ఆ పోలీస్‌స్టేషన్‌గా గుర్తించిన ఆ ప్రదేశానికి తీసుకెళ్లి విచారించాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు. అక్రమంగా నిర్బంధిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా గుర్తించింది. తద్వారా సిట్‌ను ఓ అరాచక శక్తుల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీసు దాదాగిరీ డెన్‌గా తీర్చిదిద్దింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు దాంతో విచ్చలవిడిగా చెలరేగి పోతున్నారు. దర్యాప్తు పేరిట ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఇతరులను దర్యాప్తు పేరిట తీవ్రంగా వేధించారు. వారిని గుర్తు తెలియని ప్రదేశాల్లో అక్రమంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేకపోతే వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తామని బెంబేలెత్తించారు. -
నటి విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసుల నోటీసులు
-
బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..
ఏలూరు (టూటౌన్): తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడంతో పాటు తనను నగ్నంగా వీడియోలు తీసిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వివాహిత కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసింది. పోలీసులను ఆశ్రయించినా కనీసం పట్టించుకోవడం లేదని, పైగా రాజీకి రావాలని, లేదంటే కౌంటర్ కేసు పెడతామని పోలీసులే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలంటూ ఐజీని కలిసినట్టు చెప్పింది. బాధితురాలు, ఆమె బంధువులు స్థానిక ఏటిగట్టు వద్ద ఉన్న జిల్లా రజక సంఘం కార్యాలయంలో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి రవి, అతని స్నేహితుడు గుబ్బల సోమేశ్వరరావు అలియాస్ సోము అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా లోబర్చుకోవాలని ప్రయత్నించారు. మాట వినకపోతే ఆమె భర్తను, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో వివాహితను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో బీచ్‌కు, భీమవరంలోని స్నేహితుల గదికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డారు. అలాగే ఆమెను బెదిరించి పలు దఫాలుగా ఆమె నుంచి రూ.2.50 లక్షలు తీసుకుని మళ్లీ డబ్బులు కావాలంటూ వేధిస్తున్నారు.రాజీ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడితనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఉండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోగా నిందితుల పక్షాన కొమ్ము కాశారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కేసును వెనక్కి తీసుకోకపోతే తన భర్తపై, భర్త సోదరునిపై కౌంటర్ రేప్ కేసు పెడతామని, రాజీ చేసుకోవాలని పోలీసులే బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. ఈ విషయంపై పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ క్రమంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్యతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై ఐజీ అశోక్‌కుమార్ స్పందించారని, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని విచారణ అధికారిగా నియమించారని, తగిన న్యా యం చేస్తామని హామీ ఇచ్చారని కట్లయ్య తెలి పారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మురళీకృష్ణ, యలమంచిలి శేషు, బుద్దవరపు గోపి, యండమూరి వీర్రాజు పాల్గొన్నారు. -
మానవత్వం మంటగలిసేలా భార్యపై దాడి
మైసూరు: భార్య పోలీసు స్టేషన్లో కేసు పెట్టిందనే కోపంతో భర్త, అతని బంధువులు కలిసి వివాహితను రోడ్డుపై అర్ధనగ్నంగా చేసి దాడికి పాల్పడ్డారు. మైసూరు నగరంలోని విజయనగర పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. వివరాలు.. మహేష్‌కు బాధిత యువతి (24)తో పెళ్లయింది. మరింత కట్నం తేవాలని తరచూ వేధించడంతో ఆమె భర్త, మామ మల్లయ్య, బావ శివు పైన కేసు వేసింది. ఇది ఫ్యామిలీ కోర్టులో సాగుతోంది. ఆమె పుట్టింట్లో ఉంటోంది. కొన్ని రోజుల క్రితం భార్యను కలిసిన మహేష్ .. కలిసి ఉందామని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. రెండు రోజులకే మళ్లీ సతాయించడం మొదలుపెట్టాడు. తమపై పోలీసు స్టేషన్లో, కోర్టులో పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని భర్త, మామ తదితరులు ఆమెతో గొడవకు దిగారు. ఆమె ఒప్పుకోకపోవడంతో కొట్టుకుంటూ బయటకు తీసుకువచ్చారు. చీరను లాగేసి దాడి చేశారు. ఇరుగుపొరుగు అడ్డుకోబోతే వారిని బెదిరించారు. బాధితురాలు విజయనగర ఠాణాలో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.


