
కొత్తపల్లి (కరీంనగర్): బాలికపై అత్యాచారం చేస్తూ.. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఆపై వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఇద్దరు యువకులు ప్రేమపేరుతో నమ్మించారు.
ఓ రోజు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తేరుకున్న బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ యువకులు విశ్వతేజ (19), సన్నీ (21)లను అరెస్టు చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.