నేను బతికే ఉన్నా మహాప్రభో | sadarem certificate incident | Sakshi
Sakshi News home page

నేను బతికే ఉన్నా మహాప్రభో

Nov 30 2025 11:12 AM | Updated on Nov 30 2025 11:12 AM

sadarem certificate incident

సదరమ్‌ స్టేటస్‌లో ‘డెత్‌’అని రావడంతో ఆందోళన  

ఖమ్మం జిల్లా: ఓ దివ్యాంగుడు జీవించే ఉన్నా సదరమ్‌ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌ స్టేటస్‌లో మాత్రం ‘డెత్‌.. ద పర్సన్‌ ఈజ్‌ నాట్‌ అలైవ్‌’అని చూపిస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాకు చెందిన ఉపాధ్యాయుడు, దివ్యాంగుడైన జర్పుల వీరన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు ప్రాథమికోన్నత పాఠశాల లో ఎస్‌జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2022లో దివ్యాంగుల కోటాలో ఉద్యో గం పొందగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు యూడీఐడీ కార్డు జారీకి చర్యలు చేపట్టింది. ఈమేరకు ఆయన ఆన్‌లైన్‌ సెంటర్‌కు వెళ్లిపాత సద రమ్‌ సరి్టఫికెట్‌ నంబర్‌ నమోదు చేస్తే చనిపోయినట్లుగా ఉండడంతో అవాక్కయ్యాడు. దివ్యాంగుల కోటాలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందిన తన వివరాలు తప్పుగా నమోదు కావడంతో పరిస్థితి ఏమిటని వాపోతూ ఈ నెల 17న కలెక్టరేట్‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఇకనైనా అధికారులు స్పందించి వివరాలు సరిచేయించాలని వీరన్న కోరుతున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement