బేక‌ర్స్ ఫ‌న్‌లో సంద‌డిగా కేక్ మిక్సింగ్‌ | Busily mixing cakes at Baker's Fun | Sakshi
Sakshi News home page

బేక‌ర్స్ ఫ‌న్‌లో సంద‌డిగా కేక్ మిక్సింగ్‌

Nov 30 2025 12:50 PM | Updated on Nov 30 2025 12:59 PM

Busily mixing cakes at Baker's Fun
  • ఉత్సాహంగా పాల్గొన్న పిల్ల‌లు, పెద్ద‌లు
  • డ్రైఫ్రూట్స్‌ను ప్ర‌త్యేక సిర‌ప్‌తో క‌లిపిన పిల్ల‌లు
  • ప్రీక్రిస్మ‌స్, క్రిస్మ‌స్, కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు సిద్ధం

హైద‌రాబాద్: త్వ‌ర‌లో రాబోతున్న ప్రీ క్రిస్మ‌స్, క్రిస్మ‌స్, కొత్త సంవ‌త్స‌రాల‌కు ఇప్ప‌టినుంచే రంగం సిద్ధ‌మ‌వుతోంది. న‌గ‌రంలోని తెల్లాపూర్‌లో గ‌ల బేక‌ర్స్ ఫ‌న్‌లో కేక్ మిక్సింగ్ సంద‌డి మొద‌లైంది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి దాదాపు 30 మంది వ‌ర‌కు పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి ఎంతో ఉత్సాహంగా కేక్ మిక్సింగ్‌లో పాల్గొన్నారు. ఒక‌ప్పుడు పాశ్చాత్య దేశాల‌కే ప‌రిమిత‌మైన ఈ కేక్ మిక్సింగ్ ఈవెంట్.. ఇటీవ‌లి కాలంలో మ‌న న‌గ‌రంలోనూ పెద్ద‌పెద్ద హోట‌ళ్ల‌లో నిర్వ‌హిస్తున్నారు. తెల్లాపూర్‌లోని బేక‌ర్స్ ఫ‌న్ యాజ‌మాన్యం ఈసారి వినూత్నంగా క‌స్ట‌మ‌ర్ల‌తోనే ఈ కేక్ మిక్సింగ్ చేయించారు. జీడిప‌ప్పులు, బాదం ప‌ప్పులు, కిస్మిస్‌లు, డ్రైడ్ కివీ.. ఇంకా అనేక ర‌కాల డ్రైఫ్రూట్స్ అన్నింటినీ తీసుకుని, వాటిని బేక‌ర్స్ ఫ‌న్ వారి ప్ర‌త్యేక‌మైన సిర‌ప్‌తో బాగా క‌లిపారు. దానికితోడు ప‌లు ర‌కాల రంగుల‌తో ఉండే చెర్రీస్ తీసుకుని.. వాటితో బేక‌ర్స్ ఫ‌న్ లోగోను కూడా రూపొందించారు. ఈ సిర‌ప్‌లో వీట‌న్నింటినీ దాదాపు నెల రోజుల పాటు నాన‌బెడ‌తారు. త‌ర్వాత త‌యారుచేసే రిచ్ ప్ల‌మ్ కేక్‌లో వీటిని క‌లిపి బేక్ చేస్తారు. అస‌లు తాము ఈ కొత్త సంవ‌త్స‌ర‌, క్రిస్మ‌స్ కేకులు ఎలా త‌యారుచేస్తామ‌న్న విధానాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా తెలియ‌జేయ‌డం, వారిని కూడా ఈ యాక్టివిటీలో భాగ‌స్వాముల‌ను చేయ‌డం కోస‌మే కేక్ మిక్సింగ్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటుచేసిన‌ట్లు కంపెనీ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి హారిక తెలిపారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్లంద‌రితో కొన్ని స‌ర‌దా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, అంద‌రికీ బ‌హుమ‌తులు కూడా పంచారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement