సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కుమారుడు సాంబశివరావు మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
దోసకాయలపల్లిలో దారుణం..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ (30)ను కత్తితో నరికి హత్య చేశారు. వరుసకు బావమరిది అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.



