‘బెల్టు షాపులు మూసేయండి’ | AP MRPS President Dasari Suvarna Raju Demands Close The Liquor Belt Shops | Sakshi
Sakshi News home page

‘బెల్టు షాపులు మూసేయండి’

Nov 30 2025 12:29 PM | Updated on Nov 30 2025 12:47 PM

AP MRPS President Dasari Suvarna Raju Demands Close The Liquor Belt Shops

తాడేపల్లి :  బెల్టు షాఫులతో క్రై రేటు పెరిగిపోతుందని, వాటిని తక్షణమే మూసివేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు డిమాండ్‌ చేశారు.  ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని, బెల్టు షాపులతో ప్రమాదాలు జరిగి కుటుంబాలు చితికిపోతున్నాయన్నారు. ఈరోజు( ఆదివారం, నవంబర్‌ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి దాసరి సువర్ణరాజు మాట్లాడుతూ.. ‘ అధికార పార్టీ నేతలు ఆర్థిక లబ్ధి కోసమే బెల్లు షాపులు నిర్వహిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో బడుగు బలహీన వర్గాలను మద్యానికి దూరం చేశారు.

‘ రాష్ట్రంలో  విచ్చలవిడిగా బెల్టు షాపులు పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నారు. స్కూల్స్, ఆలయాల పక్కన కూడా బెల్టు షాపులు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రతి నెలా కనీసం 20% ఆదాయాన్ని మద్యానికే ఖర్చు చేస్తున్నారు. ఇళ్ల మధ్యలోనే బెల్టు షాపులను ఏర్పాటు చేశారు. వీటి వలన లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. 24 గంటలూ మద్యం విక్రయాలు జరుగుతున్నా‌ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పవన్ కళ్యాణ్ దీనిపై‌ స్పందించాలి

బడుగు, బలహీన వర్గాలను నాశనం చేస్తున్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదాయానికి కూడా బెల్టు షాపులు గండి కొడుతున్నాయి. ఈ షాపులను అరికట్టకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తాం. అధికారుల సపోర్ట్ తోనే బెల్టు షాపులు పెరుగుతున్నాయి. ఈ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న అనుమానం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలతో జనం ప్రాణాలు పోయాయి’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement