AP: ‘మా సీట్లో నువ్వు కూర్చుంటావా’..? | Few Women Passengers Behave With Rude In Kakinada RTC Bus | Sakshi
Sakshi News home page

AP: ‘మా సీట్లో నువ్వు కూర్చుంటావా’..?

Nov 30 2025 1:02 PM | Updated on Nov 30 2025 3:13 PM

Few Women Passengers Behave With Rude In Kakinada RTC Bus

కాకినాడ:  ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ చోటు చేసుకున్న ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ప్రయాణికుడ్ని జట్టుపట్టుకుని చితకబాదారు మహిళా ప్రయాణికులు. తాము కర్చీఫ్‌ వేసుకున్న సీట్లో పురుష ప్రయాణికుడు కూర్చోవడంతో గొడవ ఆరంభమైంది. 

మాటామాటా పెరగడంతో ఆ పురుష ప్రయాణికుడ్ని జట్టు పట్టుకుని చితకబాదారు. ఆ దాడితో బస్సులోని మిగతా ప్రయాణికులు నివ్వెరపోయారు. ఏం చేయాలో తెలియక, ఈ గొడవ ఎటు తిరిగి ఎటు పోతుందోననే భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఇది తుని-నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసి బస్సులో జరిగింది. 

ఇదిలా ఉంచితే, ఇటీవల విజయవాడ మార్గంలో మహిళల మధ్య సీటు కోసం వాగ్వాదం చోటు చేసుకుని శారీరకంగా దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో పెనుగంచిప్రోలు నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం వాగ్వాదం ప్రారంభించారు అది ఆ తర్వాత సోడా బాటిల్‌తో దాడి చేయడం వరకు వెళ్లింది.  

మహిళల మధ్య తీవ్ర తగాదా
మరో సంఘటనలో మహిళలు ఒకరినొకరు జుట్టు లాగడం, చెంపదెబ్బలు కొట్టుకోవడం వంటి హింసాత్మక చర్యలకు దిగారు. ప్రయాణికులు వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన కూడా పెద్ద చర్చకు దారితీసింది..*

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement