పవన్‌ కల్యాణ్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు | Police Case On Pawan At Zaheerabad Police Station | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

May 7 2025 12:04 PM | Updated on May 7 2025 12:21 PM

Police Case On Pawan At Zaheerabad Police Station

సంగారెడ్డి జిల్లా: ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశా రు. మంగళవారం మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఖాజా ఆధ్వర్యంలో ఎస్‌.ఐ కాశీనాథ్‌కు వారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్‌ కల్యాణ్‌ ద్వేషపూరిత ప్రకటన చేశారని ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇస్లాం శాంతి, ప్రేమకు సంబంధించిన మతమన్నారు. ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ప్‌లను పవన్‌ కల్యాణ్‌ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement