గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు | Supreme Court Key Orders To Gitam University Over Telangana HC Electricity Dues Ruling | Sakshi
Sakshi News home page

గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Feb 16 2026 2:00 PM | Updated on Feb 16 2026 2:57 PM

Supreme Court Key Orders to GITAM University

ఢిల్లీ: గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. విద్యుత్‌ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీబీసీ,గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. 

వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్  బకాయిలకు తమకు సంబంధం లేదనిన గీతం యూనివర్శిటీ  సుప్రీంలో వాదించింది.  అయితే వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని  సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 

వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని  హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని  ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement