ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా మెరిసిన శామీర్‌పేట పీఎస్‌ | Shamirpet PS Placed 7th In MHA List Amongst Country | Sakshi
Sakshi News home page

ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా మెరిసిన శామీర్‌పేట పీఎస్‌

Dec 1 2025 4:40 PM | Updated on Dec 1 2025 4:51 PM

Shamirpet PS Placed 7th In MHA List Amongst Country

దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను ఎమ్‌హెచ్‌ఏ పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్‌ఎస్‌ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.

ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించడం విశేషం.

ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement