పొరుగింటి అమ్మాయితో కలిసి వెళ్లిన అక్కాచెల్లెలు
హైదరాబాద్: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన మేరకు.. చత్తీస్‌ఘడ్‌క చెందిన టోటారాం కుటుంబం ఫరీద్ బస్తీలో నివాసముంటోంది. వీరికి ఇద్దరు కూతుళ్లు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14). ఇద్దరూ ఇంటివద్దే ఉంటున్నారు.ఇంటిపక్కనే ఉన్న బంధువు రోహిణి కూతురు లత (14)తో కలిసి ముగ్గురూ శనివారం హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కొ వెళ్లి పోయారు. తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు నిర్ధారించారు. రైలులో వెళ్లారా.. లేదా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


