వైద్యం వికటించి మహిళ మృతి | Woman Dies Medical Treatment Goes Wrong In Hayathnagar Hyderabad | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి మహిళ మృతి

Jul 20 2026 12:19 PM | Updated on Jul 20 2026 12:19 PM

Woman Dies Medical Treatment Goes Wrong In Hayathnagar Hyderabad

హైదరాబాద్‌, హయత్‌నగర్‌: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనె తండా గ్రామానికి చెందిన మంజుల(25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం శుక్రవారం రాత్రి హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత శనివారం వార్డుకు షిఫ్ట్‌ చేశారు.

సాయంత్రం కడుపునొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్‌ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మంజుల మృతికి నీలాద్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి కొర్రా లక్ష్మీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement