బంజారాహిల్స్: ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో భద్రపరిచిన కిలో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఈడెన్ గార్డెన్‌లో ఉన్న గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో డైమండ్ ఫిక్సింగ్ కోసం సంస్థ లాకర్‌లో భద్రపరిచిన 1028.59 గ్రాముల బరువు ఉన్న 14 బంగారు ఆభరణాలు (7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులు) కనిపించలేదు.
కార్యాలయంలో వాష్‌రూమ్ కిటికీ ధ్వంసమైనట్లు గుర్తించడంతో దుండగులు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గుజరాత్ సూరత్‌కు చెందిన వ్యాపారి ప్రీతేష్‌రమణి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


