సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని దాండేలి (Dandeli) రిసార్ట్‌లో జరిగిన ఒక జిప్‌లైన్ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అడ్వెంచర్ రైడ్ కోసం వెళ్లిన ఒక పర్యాటకుడు, భద్రతా లోపాల కారణంగా దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అడ్వెంచర్ టూరిజం కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన వ్యక్తిని కర్ణాటకలోని విజయపురకు చెందిన కుబేర్ సుర్పుర్ గా గుర్తించారు. కుబేర్ గాల్లో జిప్‌లైన్‌పై వెళ్తుండగా, దానికి సంబంధించిన సేఫ్టీ లాక్ (Safety Lock) ఊడిపోవడంతో ఆయన నేరుగా కిందపడిపోయారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి పడటంతో కుబేర్ చేతులు, కాళ్లు విరిగిపోయాయి. అలాగే నరాలు కూడా దెబ్బతిన్నాయి.
రిసార్ట్ యాజమాన్యంపై ఆరోపణలు
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర ఆందోళన చెలరేగింది. రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైడ్‌కు ఉపయోగించిన పరికరాలు తుప్పు పట్టి పోయాయని, వాటిని సరిగ్గా నిర్వహించలేదని వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్‌డే ప్రత్యేక పూజలు చేసిన నటి
Why you always need to be cautious when it comes to this stuff.
Poor guy, if he had just moved forward by a few feet he would have ended up on the grass which would have been better.
Incident occurred at Starling River Resort, Dandeli.#accident #karnataka #adventuresports pic.twitter.com/uzNHR6BUH9— Sidharth Shukla (@sidhshuk) July 19, 2026
మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడు కుబేర్‌ను మొదట దాండేలి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయపుర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన, నిపుణులైన వైద్యం కోసం ఆయనను మిరాజ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అడ్వెంచర్ స్పోర్ట్స్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!
నెటిజన్ల కామెంట్స్
ఇది చాలా ఘోరమైన జిప్‌లైన్ డిజైన్. చేతులు వదిలేసినా కింద పడకుండా బెల్ట్స్ శరీరానికి గట్టిగా అమర్చాలి కదా. ఇలాంటి వాటికి అసలు అనుమతులు ఎలా ఇస్తారు?! అని ఒకరు తీవ్రంగా మండిపడ్డారు. యాజమాన్యానికి ఏదో కొద్దిపాటి జరిమానా విధిస్తారు, కొన్ని రోజులు రిసార్ట్ మూసివేసి మళ్లీ తెరుస్తారు. బాధితులకేమీన్యాయం జరగదు అంతా యథావిధిగా జరిగిపోతుంది అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు.


